SBI Life Smart Shield Telugu – “అతి తక్కువ ప్రీమియంతో కుటుంబానికి సంరక్షణ ” Review ,Details & Benefits

SBI Life Smart Shield Plan Details in  Telugu

 

SBI Life Smart Shield Telugu

ఎస్. బి. ఐ సామాన్యులకు అతి తక్కువ ప్రీమియం తో ఆర్థిక ఇబ్బంది నుండి బయటపడటానికి మరియు  మన ఫ్యామిలీని ఆర్థికంగా సంరక్షించడానికి ఎస్. బి. ఐ ఈ లైఫ్ స్మార్ట్ షీల్డ్ టర్మ్ ప్లాన్ (SBI life Smart Shield )ను తీసుకువచ్చింది.ఇది ఒక నాన్ లింక్డ్ , నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ ( Non Linked non Participated ). అంటే ఒక కుటుంబ ఆర్థిక భారాన్ని మోస్తూ వున్నటువంటి వ్యక్తి ఈ ప్లాన్ ను తీసుకోవడం ద్వారా కుటుంబానికి ఆర్థిక భరోసాను అందించవచ్చు.ఇతర ఎండోమెంట్ పాలసీలవలే అధిక ప్రీమియం ఏమాత్రం చెల్లించనక్కర్లేదు , ఇది ఒక స్వత్చామైన టర్మ్ ఇన్సూరెన్స్ .

 

 

SBI Life Smart Shield Telugu - "అతి తక్కువ ప్రీమియంతో కుటుంబానికి సంరక్షణ " Review ,Details & Benefits

 

స్కీం యొక్క ముఖ్య ప్రయోజనాలు – Features

1) స్టాక్  మార్కెట్ తో సంబంధం లేని కారణం చేత స్కీం యొక్క బెనిఫిట్స్ యదావిధిగా పాలసీదారునికి లభిస్తాయి.

2) లెవెల్ సమ్ అసురెడ్ ( Level sum assured),  ఇంక్రీస్ లెవెల్ సమ్ అసురెడ్ ( Increase  Level sum assured)   అనే రెండు ఆప్షన్స్ ప్లాన్ లో అందుబాటులో ఉంటాయి, వ్యక్తి అవసరానికి అనుగుణంగా నిర్ణయించుకోవచ్చు.

3) లో ప్రీమియం టూ నాన్ స్మోకర్ ( Low Premium to Non Smokers ) మద్యపానం ,దూమపానం అలవాటు లేని వారికి మరియు మహిళలకు ప్రీమియం తగ్గించడం జరుగుతుంది .

4)టాక్స్ ,గ్రేస్ పీరియడ్ ,పాలిసీ రివైవల్ తోపాటుగా రైడర్ బెనిఫిట్స్ కూడా వున్నాయి.

 

పాలసీ ఎంపికలు –  SBI Life Smart Shield Plan Options

A.  లెవెల్ సమ్ అస్సుర్డ్ – Level Sum Assured

పాలసీదారుడు ప్రారంభంలో ఎంతైతే భీమా తీసుకోవడం జరిగిందో అంతే భీమా,ప్లాన్ మధ్యలో వ్యక్తి కి రిస్క్ జరిగితే నామినీకి అందివ్వడం జరుగుతుంది.

ఉదాహరణ కి Mr. రాజు 50 లక్షల భీమాకి, లెవెల్ సమ్ అస్సుర్డ్ ఆప్షన్ ను నిర్ణయం చేస్తే మొత్తం పాలసీ సమయంలో ఎప్పుడు రిస్క్ జరిగినా Rs 50 లక్షలు ఇమ్మీడియేట్ గా నామినికి లభిస్తాయి.

 

2. ఇంక్రీస్ లెవెల్ సమ్ అస్సుర్డ్ – Increased Level Sum Assured

వ్యక్తి కి మొదటి 5 సంవత్సరాలు ప్రారంభ భీమా వర్తిస్తుంది, 6 వ సంవత్సరం నుంచి ప్రాథమిక భీమా కి 10% చొప్పున ప్రతీ సంవత్సరం పెరుగుతూ పాలసీ యొక్క 16 వ సంవత్సరం వరకూ లభించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రాథమిక భీమా కి రెట్టింపు అన్నమాట,ఆ తర్వాత నుంచి స్థిరంగా అదే భీమా పాలసీ చివరి వరకూ వర్తిస్తుంది. సమయానసరంగా రిస్క్ ప్రయోజనం వర్తిస్తుంది.

ఉదాహరణ కి Mr. శ్యామ్ 50 లక్షల భీమాకి,  ఇంక్రీజ్ లెవెల్ సమ్ అస్సుర్డ్ ఆప్షన్ ను నిర్ణయం చేస్తే మొత్తం వేరు వేరు దశల్లో డెత్ బెనిఫిట్ వేరువేరు గా ఉంటుంది.

దీన్ని మరింత సంక్షిప్తంగా ఉదాహరణ లో చూద్దాం!

 

స్మార్ట్ షీల్డ్   అర్హతలు – Eligibility Conditions

 

http://

   Eligibility 

          Minimum 

       Maximum

Entry Age 

18 Years 

60 Years 

Plan Options 

Level Sum Assured 

Increasing Sum Assured

Policy Term 

5 Years 

80 Years 

Sum Assured 

 Rs 25,00,000

No Limit 

Maturity Age 

           - 

80 Years 

 

వయసు పరిమితులు – Age

పాలసీ తీసుకోవడానికి కనీస వయసు : 18 సంవత్సరాలు.
గరిష్ట వయస్ : 60 సంవత్సరాలు.
(18 సంవత్సరాలు దాటిన వారు & 60 సంవత్సరాలు లోపు వారు)

 

పాలసీ కాల పరిమితులు – Policy Term

కనీస పాలసీ టర్మ్: 5 సంవత్సరాలు.
గరిష్ట పాలసీ టర్మ్: 30 సంవత్సరాలు.
గరిష్ట మెచ్యూరిటీ వయసు: 80 సంవత్సరాలు

 

భీమా పరిమితులు – Sum Assured

కనీస పాలసీ : Rs 2500000
గరిష్ట పాలసీ : అవధి లేదు

 

ప్రీమియం చెల్లింపులు – Premium Paying

సంవత్సరానికి   -3000 రూపాయలు,
అర్ధ సంవత్సరానికి -1500 రూపాయలు,
క్వార్టర్లీ – 750 రూపాయలు,
మంత్లీ – 300 రూపాయలు.

 

ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకొందాం!

 

ఉదాహరణ ;- Smart Shield Example

 

A.  లెవెల్ సమ్ అస్సుర్డ్ – Level Sum Assured

రాజేష్ వయసు ( Age )      – 30 సంవత్సరాలు
భీమా  ( Bhima )                   – 25 లక్షలు
ప్లాన్ పీరియడ్ ( Period )     – 30 సంవత్సరాలు.

ఆప్షన్ -1 అయినటువంటి లెవెల్ సమ్ అసురిడ్ ను ఎంచుకుంటే  25 లక్షల భీమా కొరకు మంత్లీ ప్రీమియం – Rs 363 రూపాయలు చెల్లించాల్సివుంటుంది.

 

డెత్ బెనిఫిట్ – Death Benefit

Mr. రాజేష్ కి  వచ్చే 30 సంవత్సరాల వరకూ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లభించడం జరుగుతుంది, ఈ సమయంలో వ్యక్తి సహజంగా లేక ఆక్సిడెంట్ కారణం చేత మరణిస్తే 25 లక్షలు నామినికి వెంటనే SBI Life అందిస్తుంది అక్కడితో ఈ ప్లాన్ టెర్మినాట్ చేయబడుతుంది.

 

2. ఇంక్రీస్ లెవెల్ సమ్ అస్సుర్డ్ – Increased Level Sum Assured

రమణ వయసు ( Age )            – 30 సంవత్సరాలు
భీమా   ( Bhima )                          – 25 లక్షలు
పాలసీ సమయం ( Period )       – 30 సంవత్సరాలు

ఈ ఆప్షన్ ల్లో డెత్ బెనిఫిట్ దశల వారీగా లభిస్తుంది, ఇంక్రీస్   లెవెల్ సమ్ అసురిడ్ ను ఎంచుకుంటే  25 లక్షల భీమా కొరకు మంత్లీ ప్రీమియం – Rs 794 రూపాయలు చెల్లించాల్సివుంటుంది.

 

Mr. రమణ కి పాలసీ సమయం మధ్యలో ఎప్పుడు రిస్క్ జరిగినా( సహజ లేక ఆక్సిడెంట్ ) నామినీకి కింది విధంగా డెత్ బెనిఫిట్ వస్తుంది.

 

http://

     Policy Year 

       Death Benefit 

     6th Year 

     Rs 20,75,000

     7th Year 

     Rs 30,00,000

    8th Year 

     Rs 30,25,000

   9th Year 

    Rs 30,50,000

   10th Year 

    Rs 30,75,000

   11th Year 

    Rs 40,00,000

   12th Year 

    Rs 40,25,000

   13th Year 

    Rs 40,50,000

   14th Year 

    Rs 40,75,000

   15th Year 

    Rs 50,00,000

ఉదాహరణ కు ప్లాన్ యొక్క 15 వ సంవత్సరం Mr. రామణ కి రిస్క్ జరిగితే Rs 50,00,000/- మరియు 12 వ సంవత్సరం రిస్క్ జరిగితే Rs 45,00,000/- చొప్పున అందివ్వడం జరుగుతుంది.

 

దీనితో పాటు 3 రకాల రైడర్స్ –  Rider Benefits 

A) ఒక వేళ   వ్యక్తి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ ( Accidental Death Benefit Rider  ) :-  నీ తీసుకున్నట్లయితే  ఈ సందర్భం లో అతను మరణిస్తే,

ప్రాధమిక భీమా      -Rs 25,00,000
ADB Rider             -Rs 10,00,000
Total ( మొత్తం )  = Rs 35,00,000 రూపాయలు నామినీ కి లభిస్తాయి.

ఈ రైడర్ కొరకు ప్రీమియం తో పాటు అదనంగాప్రతి నెలా Rs 44/-  రూపాయలు చెల్లించాల్సి వుంటుంది.

 

B)  యాక్సిడెంటల్  టోటల్ పేర్మినెంట్   డిజాబిలిటీ  రైడర్  ( Accidental total Permanent  Disable Rider )  :-  ఈ సందర్భం లో వ్యక్తి కి యాక్సిడెంట్ జరిగి మరణించకుండా శరీరం లో ఏదైనా పార్ట్ పనిచేయకుండా జీవితాంతం పని చేయలేను స్థితిలో వుంటే ఈ సందర్భం లో…

ప్రాధమిక భీమా    -Rs 25,00,000
AD&DB Rider     -Rs 10,00,000
Total ( మొత్తం )= Rs 35,00,000 రూపాయలు నామినీ కి లభిస్తాయి.

ఈ రైడర్ నీ తీసుకోవడానికి మంత్లీ ప్లాన్ ప్రీమియం తో అదనంగా Rs 36/–  రూపాయలు చెల్లించాల్సి వుంటుంది.

 

C)  క్రిటికల్ ఇల్లన్స్ బెనిఫిట్ రైడర్ ( Critical Illness Benefit Rider )  ఈ రైడర్ ప్లాన్ మధ్యలో మీరు ఏదైనా పెద్ద అనారోగ్యానికి గురైతే 10 లక్షలు రూపాయలు ట్రీట్మెంట్ నిమిత్తం లభిస్తాయి. ఈ రైడర్ ద్వారా 13 ముఖ్యమైన వ్యాధులకు చికిత్స నిర్వహించబడుతుంది.

ఈ రైడర్ నీ తీసుకోవడానికి మంత్లీ ప్రీమియం తో పాటుగా అదనంగా Rs 108/- రూపాయలు చెల్లించాల్సి వుంటుంది.

 

ఇతర ముఖ్య ప్రయోజనాలు – Other Important Benefits 

 

ఫ్రీ లుక్ పీరియడ్  (look period): – ఈ ప్లాన్ తీసుకున్న తరువాత మీకు అసంతృప్తి గా వున్నట్లయితే 15 రోజుల లోపు ప్లాన్ క్లోజ్ చేసుకోవచ్చు ఎటువంటి పెనాల్టీ వుండదు,  అదేవిధంగా టర్మ్ ప్లాన్ లో ప్రీమియం చాలా తక్కువ వుంటుంది ఎక్కువ అమౌంట్ ప్రొటెక్షన్ గా లభిస్తుంది.

 

టాక్స్ ప్రయోజనం – (Tax Benefits ):- SBI LIFE Smart Shield   ప్లాన్ లో  చెల్లించే ప్రీమియం పై 80c రూపంలో టాక్స్ డెడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అలాగే డెత్ క్లెయిమ్ అమౌంట్   ( Death Claim ) టాక్స్ రహితంగా టాక్స్ ఫ్రీ రూపంలో అమౌంట్ లభించడం జరుగుతుంది.

 

సరెండర్ ఫెసిలిటీ  (Surrender Facility) :- ఇది ఒక   పరిపూర్ణమైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి  పాలసీ కనీసం రెండు సంవత్సరాలు కొనసాగిన తర్వాత ప్లాన్ ను సరెండర్ చేయవచ్చు , అయితే  పాలసీ మధ్యలో ఎటువంటి లోన్ సదుపాయం లభించదు.

 

రివైవల్ సదుపాయం ( Policy Revival) :-   ఏదైనా కారణంగా ఎక్కువ కాలం ప్రీమియo చెల్లించకపొతే SBI LIFE Smart Shield   పాలసి ముగిసిపోతుంది ,అటువంటి సమయంలో మొత్తం ప్రీమియంని  5 సంవత్సరాల లోపు చెల్లించి తిరిగి ప్లాన్ లో కొనసాగవచ్చు .

 

https://www.sbilife.co.in/

 

• కావాల్సిన డాకుమెంట్స్  (  Term Insurance Required Documents?)

 

1.పాలసీ తీసుకొనే వ్యక్తి  ముందుగా పోరపోసల్ ఫారం నింపాలి.

2. Identity Proof – ఆధార్ కార్డు

3. వయసు మరియు  అడ్రస్ ప్రూఫ్

A. Date of Birth Certificate
B. Current Bill
C. Telephone Bill

4. ఈ మధ్యనే తీసుకొన్న రెండు పాసుపోర్టు ఫోటోలు.

6. Medical Certificate : ఆరోగ్య సర్టిఫికెట్

టర్మ్ ఇన్సూరెన్స్  తీసుకోవడానికి సాధారణ ఆరోగ్య కండిషన్ సర్టిఫికెట్ సరిపోతుంది.

కానీ మెడికల్ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే పాలసీలో ప్రీమియం నిర్ణంచడం జరుగుతుంది, దీని కొరకు  యూరిన్ టెస్ట్ ( Urinary Test )తప్పనిసరిగా నిర్వహిస్తారు. పాలసీదారుడు కి సిగరెట్, మందు వ్యాసనాలు ఉన్నట్లయితే పాలసీలో చెల్లించవలసిన ప్రీమియం కొద్దిగా ఎక్కువ ఉంటుంది లేకపోతే సాధారణ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

7. Income Proof ( ఆదాయం రసీదు):-   ఇది కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొనే వారికి మాత్రమే. అయితే కొన్ని పాలసీల్లో తీసుకొనే భీమా ఆధారంగా ఆదాయం చూపించవలసి ఉండవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *