NPS Scheme Details In Telugu Pdf – “సామాన్యులను కోటీశ్వరులు చేసే గవర్నమెంట్ స్కీం ”  పూర్తి వివరాలు!

                           NPS Scheme Details In Telugu

NPS Scheme Details in Telugu

•నేషనల్ పెన్షన్ స్కీం  అంటే ఏమిటి ? ( What is NPS Scheme ?)

NPS Scheme  అనేది కేంద్ర ప్రభుత్వం చేత స్పాన్సర్ చేయబడిన  పథకం. ఇది మొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం జనవరి 2004 లో ప్రారంభించబడింది. అయితే, 2009 లో ఇది అన్ని వర్గాల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సామాన్య వ్యక్తి ప్రతి నెలా చేసే అతితక్కువ పొదుపుకి ఈ స్కీంలో ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. డిపాజిట్ అమౌంట్ లో కొంత శాతం అధిక రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ రూపంలో  మరికొంత భాగం లైఫ్ టైమ్ పెన్షన్ రూపంలో అందివ్వడం జరుగుతుంది.

 

• NPS ముఖ్య ఉద్దేశ్యం ఏమిటీ? ( NPS Details  in Telugu )

“ఒకే ఇన్వెస్ట్మెంట్ ద్వారా అధిక రాబడి అందించే పొదుపు + వృద్ధాప్యంలో ఎవరిపైన ఆధారపడి జీవించేందుకు జీవితాంత కచ్చితమైన పెన్షన్ అందివ్వడం “

కస్టమర్లు ఈ  పెన్షన్ అకౌంట్ లోకి  క్రమం తప్పకుండా కాంట్రిబ్యూషన్ రూపంలో ప్రతి నెల పెట్టుబడి పెట్టవచ్చు.  పదవీ విరమణ చేసిన తర్వాత, కస్టమర్లు  కార్పస్‌లో కొంత భాగాన్ని ఒకేసారి విత్డ్రా చేసుకోవచ్చు.  మిగిలిన కార్పస్‌ని రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఆదాయాన్ని పొందేందుకు యాన్యుటీని  కొనుగోలు చేయవచ్చు. Nps  ఒక బెస్ట్ టాక్స్ సేవింగ్ స్కీం కూడా.

 

• NPS అకౌంట్ పర్యవేక్షణ ఏ సంస్థ నిర్వహిస్తుంది?( NPS Contribution )

ఇండియాలో బ్యాంకులను ఆర్.బి. ఐ ( RBI ) – రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ( Reserve Bank Of India ) ఇన్సూరెన్స్ ను ఐ. ఆర్. డి. ఐ. ఏ( IRDAI ) – ఇన్సూరెన్స్ రెగ్యులటరీ అండ్ డెవోలోప్మాంట్ అథారిటీ అఫ్ ఇండియా (Insurance Regulatory and development Authority of India ) సంస్థలు పర్యవేక్షణ చేస్తున్నాయి.

అదేవిధంగా ఎన్. పి. ఎస్ ను పి. ఫ్. ర్. డి. ఏ ( PFRDA ) – పెన్షన్ ఫండ్ రెగ్యులటరీ అండ్ డెవోలోప్మెంట్ అథారిటీ అఫ్ ఇండియా ( Pension Fund Regulatory and development authority of India )నిర్వహిస్తుంది.

 

1. NPS స్కీం లో డిపాజిట్ చెయ్యడానికి అర్హులు ఎవరు?
2. NPS స్కీం ద్వారా ప్రయోజనాలు మరియు లాభాలు ఏ విధంగా వర్తిస్తాయి?
3. NPS అకౌంట్ ని ఎలా ఓపెన్ చెయ్యాలి?
4. ఈ స్కీం లో ఉండే అకౌంట్ ఆప్షన్స్ ఏమిటి ఎలా పనిచేస్తాయి?

 

NPS స్కీం కి సంబందించిన పూర్తి వివరాలను ఉదాహరణ ద్వారా ఇప్పుడు చూద్దాం!

 

• NPS స్కీంలో డిపాజిట్ చెయ్యడానికి అర్హులు ఎవరు? ( NPS Eligibility )

ఈ స్కీం తీసుకొనే వ్యక్తి యొక్క కనీస వయస్సు  ( Minimum Age ) = 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
అత్యధిక వయస్సు  (maximum Age ) = 65 సంవత్సరాలు.
కనుక 18 నుంచి 65 సంవత్సరాల వయసు మధ్యకలిగిన వారు ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు.

NPS అకౌంట్ చేసినపుడు 12 అంకెలతో కూడిన ఒక కార్డు మీకు లభిస్తుంది, దీన్నే ప్రాన్ నెంబర్ ( PRAN ) అంటారు. అంటే పెర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ ( Permanent Retirement Account Number ).
ఒక వ్యక్తి కి ఒక NPS అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసే సదుపాయం కల్పించబడింది.

 

• NPS స్కీం యొక్క ప్రయోజనాలు ( NPS Features & Benefits )

1. డిపాజిట్ అమౌంట్ కి చక్రవడ్డి లభిస్తుంది అలాగే కొద్దిగ అమౌంట్ మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో లంప్సమ్ అమౌంట్ లభిస్తుంది.
2.  100% గవర్నమెంట్ సెక్యూరిటీ అందివ్వడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో అమౌంట్ తో పాటుగా జీవితాంతం రెగ్యులర్ పెన్షన్ గవర్నమెంట్ అందిస్తుంది.
3.  సామాన్యులకి, ఉద్యోగులకి కలిపి 3 రకాల టాక్స్ బెనిఫిట్స్ వర్తిస్తాయి.
4. అత్యవసర సమయంలో ఎగ్జిట్ అయ్యేవిధంగా ప్రీ మాట్యూర్ విత్ డ్రాల్ ఫెసిలిటీ ఉంటుంది.
5.  మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ పై మీకు పూర్తి హక్కులు లభిస్తాయి.కావాలనుకొంటే స్వయంగా మేనేజ్ చేసుకోవచ్చు.
6.  నామినీ, డెత్ బెనిఫిట్ మరియు స్కీం ఎక్స్టెంషన్ ప్రయోజనాలు వర్తిస్తాయి.
7.  దేశంలో సామాన్య వ్యక్తులతోపాటు ఎన్. ఆర్. ఐ ల ( NRI )కి కూడా ఈ స్కీం వర్తిస్తుంది.

 

ఈ స్కీం ముఖ్యంగా రెండు అకౌంట్స్ ని కలిగి ఉంటుంది.

1. టైర్ వన్ – Tier 1

డిపాజిట్ చేసే అమౌంట్ లో కొంతభాగం టైర్ వన్ అకౌంట్ లో జమాచెయ్యడం జరుగుతుంది. దీన్నే పెన్షన్ ఫండ్ మానేజ్మెంట్ అకౌంట్ అనికూడా అంటారు. ఈ అకౌంట్ లో జామచ్చెయ్యబడ్డ అమౌంట్ మీ యొక్క రిటైర్మెంట్ సమయంలో లభిస్తుంది.

సంవత్సర కనీస డిపాజిట్ = Rs 6,000/- అంటే నెలకి Rs 500/- రూపాయలు కనీసం జమాచేయాల్సివుంటుంది. అత్యధికముగా ఎటువంటి పరిధి లేదు.

 

టైర్ వన్ అకౌంట్ కి సంబందించిన ముఖ్య గమనిక :-

1.  అత్యవసర సమయంలో మాత్రమే ( పిల్లల యొక్క విద్యా, వివాహం, మొదటి సారిగా సొంత గృహ నిర్మాణం…)ఈ అకౌంట్ ని క్లోజ్ చెయ్యడం లేదా మెట్యూరిటీ సమయానికి ముందు ప్రీ మాట్యూర్ చెయ్యడం వీలువుతుంది.

2. డిపాజిట్ అమౌంట్ లో 25% మాత్రమే లభిస్తుంది.

3. మొత్తం స్కీం సమయంలో అత్యధికముగా 3 సార్లు మాత్రమే పార్సియల్ విత్ డ్రాల్ సదుపాయం ఉంటుంది, ప్రతి విత్ డ్రాల్ కి మధ్య 5 సంవత్సరాల కనీస గ్యాప్ ఉండాలి.

4.టైర్ వన్ అకౌంట్ లో  టాక్స్ ప్రయోజనాలు ఖచ్చితంగా పొందవచ్చు.

 

2. టైర్ టు అకౌంట్ – Tier 2

టైర్ 2 మంచి ఇన్వెస్ట్మెంట్ గా పనిచేస్తుంది. దీన్ని డైరెక్ట్ ముట్యుయల్ ఫండ్ గా గుర్తించవచ్చు. విత్ డ్రా మరియు డిపాజిట్ పై ఎటువంటి నియంత్రణ నియమాలు వుండవు. అంటే ఈ రోజు అమౌంట్ డిపాజిట్ చేసి రేపే విత్ డ్రాల్ చెయ్యవచ్చు.

టైర్ 2 అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి టైర్ 1 అకౌంట్ ఖచ్చితంగా ఓపెన్ చెయ్యాలి.
సంవత్సర కనీస డిపాజిట్ = Rs 2,000/- అత్యధికముగా ఎటువంటి పరిధి లేదు. టైర్ 2 లో టాక్స్ ప్రయోజనం లభించకపోవచ్చు.

 

• NPS స్కీం లో డిపాజిట్ అమౌంట్ ని గవర్నమెంట్ ఎక్కువ ఎలా ఇన్స్వెస్ట్ చేస్తుంది? ( NPS  scheme Contribution Telugu )

 

1. ఈక్వటీ – Equity

అంటే ముట్యుయల్ ఫండ్స్ లో కొంతభాగం ఇన్వెస్ట్మెంట్ చెస్తుంది. రిస్క్ శాతం ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ ఎక్కువ రిటర్న్స్ కూడా లభిస్తాయి.

2.  కార్పొరేట్ బాండ్స్ – Corporate Bonds

అంటే దేశంలో అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో బాండ్స్ రూపంలో కొంత భాగం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. బాండ్స్ ఖచ్చితమైన రిటర్న్స్ లభిస్తాయి, రిస్క్ శాతం కూడా మద్యమంగా ఉంటుంది.

3. గవర్నమెంట్ సెక్టర్లు – Government Sectors

వీటిలో రిస్క్ 100% ఉండదు. రిటర్న్స్ కూడా గవర్నమెంట్ రూల్స్ కి అనుగుణంగా ఖచ్చితంగా లభిస్తాయి. ఈ విధంగా 3 రంగాలలో NPS అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయబడుతుంది.

 

PPF Scheme in Telugu – పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్అ ర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!

SBI life Smart future Choices In Telugu &అవసరం వచ్చినప్పుడల్లా అడిగి తీసుకోండి

• NPS  ఫండ్ మానేజ్మెంట్  (NPS Fund Management )

 

ఈ స్కీం లో రెండు ఆప్షన్స్ ఉంటాయి.

1. యాక్టీవ్ ఛాయస్ – Active Choice

మీకు షేర్ మార్కెట్లో కొద్దిగ అనుభవం ఉండి అలాగే మీ ఇన్వెస్ట్మెంట్ ని మార్కెట్ కి అనుగుణంగా స్వయంగా అభివృద్ధి చేసుకోవాలానుకొంటే యాక్టీవ్ ఛాయస్ ఆప్షన్ ని నిర్ణయం చేసుకోవచ్చు.

2. ఆటో ఛాయస్ -Auto Choice

ఫండ్ ని మానేజ్మెంట్ చెయ్యడానికి ఫండ్ మేనేజర్స్ ఉంటారు, గవర్నమెంట్ నియమాలకి అనుగుణంగా స్వయంగా వారే నిర్వహించడం జరుగుతుంది. మీ కన్వీనెంట్ కి తగినట్లుగా నిర్ణయం తీసుకోవచ్చు.

 

 

• NPS స్కీం పనిచేసే విధానం, లభించే బెనిఫిట్స్ మరియు పెన్షన్ గురించి ఇప్పుడు చూద్దాం! ( NPS Scheme  Benefits in Telugu )

 

• ఉదాహరణ (Example ) – 1

పేరు ( Name )                                    – Mr. సతీష్
వయసు ( Age )                                  – 25 సంవత్సరాలు
నెలకి డిపాజిట్ ( Deposit )              – Rs 2,000/-
స్కీం సమయం ( Period )                – 35 సంవత్సరాలు

మొత్తం డిపాజిట్ అమౌంట్ ( Total Deposit )= Rs 8,40,000/-

NPS స్కీం లో ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పై సుమారు 10% వరకూ వడ్డీ రేట్ లభిస్తుంది.అదేవిధంగా ఈ మొత్తం అమౌంట్ లో 60% ఇమ్మీడియేట్ గా లభిస్తుంది, మిగిలిన 40% పెన్షన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయబడుతుంది.

60 వ సంవత్సరం వరకూ స్కీం లో జెనరేట్ అయ్యే మొత్తం కార్పస్ వచ్చి = Rs 76,56,554/-  రూపాయలు.

స్కీం యొక్క 60 సంవత్సరం Mr. సతీష్ కి ఒక్కసారే = Rs 45,17,367/- అందివ్వడం జరుగుతుంది.

మిగిలిన  Rs 31,39,187/- పెన్షన్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ జరుపబడుతుంది. ప్రస్తుతం ఈ స్కీం లో 7% లభిస్తుంది. కాబట్టి Mr . సతీష్ కి ప్రతీ నెలా = Rs 18,312/- రూపాయలు జీవితాంతం అందివ్వడం జరుగుతుంది.

 

పెన్షన్ డిపాజిట్ వివరాలు ముందు తెలుకొందాం.

 

• ఉదాహరణ (Example ) – 2

పేరు ( Name )                         – Mr. రాజు
వయసు ( Age )                       – 25 సంవత్సరాలు
నెలకి డిపాజిట్ ( Deposit )   – Rs 500/-
స్కీం సమయం ( Period )     – 35 సంవత్సరాలు

మొత్తం డిపాజిట్ అమౌంట్ ( Total Deposit )= Rs 2,10,000/-

60 వ సంవత్సరం వరకూ స్కీం లో జెనరేట్ అయ్యే మొత్తం కార్పస్ వచ్చి = Rs 19,14,139/-  రూపాయలు.

ఈ మొత్తం అమౌంట్ లో 60% ఇమ్మీడియేట్ గా లభిస్తుంది, మిగిలిన 40% పెన్షన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయబడుతుంది.

స్కీం యొక్క 60 సంవత్సరం Mr. సతీష్ కి ఒక్కసారే = Rs 11,48,483/- అందివ్వడం జరుగుతుంది.

మిగిలిన  Rs 7,65,656/- పెన్షన్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ జరుపబడుతుంది. ప్రస్తుతం ఈ స్కీం లో 7% లభిస్తుంది. కాబట్టి Mr . సతీష్ కి ప్రతీ నెలా = Rs 4,460/– రూపాయలు జీవితాంతం అందివ్వడం జరుగుతుంది.

అందువల్ల సామాన్య వ్యక్తి ఈ స్కీం లో పొదుపు చేస్తే మంచి రిటర్న్స్ తోపాటు రెగ్యులర్ పెన్షన్ జీవితాంతం లభిస్తుంది.

 

NPS పెన్షన్ ఇన్వెస్ట్మెంట్   (NPS scheme  Annuity  Options Telugu )

 

40% అమౌంట్ ని పెన్షన్ రూపంలో అందివ్వడానికి పి. ఫ్. ర్. డి. ఏ ( PFRDA ) 5 రకాల పెన్షన్ ఆప్షన్ని అందిస్తుంది, వీటిలో ఒకదాన్ని వ్యక్తి స్వయంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

 

1. యాన్యూటీ ఫర్ లైఫ్ – ( Annuity For Life )

పెన్షన్ ఖరీదు చేసిన వ్యక్తి ఎంతకాలం జీవించి ఉంటాడో అంతకాలం పెన్షన్ లభిస్తుంది.

 

2. యాన్యూటీ ఫర్ లైఫ్ విత్ రిటర్న్ అఫ్ పర్చాజ్ ప్రైస్ –  ( Annuity For life with Return of Purchase Price )

పెన్షన్ ఖరీదు చేసిన వ్యక్తి ఎంతకాలం జీవించి ఉంటాడో అంతకాలం పెన్షన్ లభిస్తుంది మరియు అతను మరణానంతరం ఒక ఖచ్చితమైన అమౌంట్ నామినీ కి అందివ్వడం జరుగుతుంది.

3. యాన్యూటీ ఫర్ లైఫ్ విత్ ది ప్రొవిసన్ ఫర్ 100% అఫ్ ది యాన్యూటీ టూ ది స్పోస్ అఫ్ ది ఎన్యు్టెంట్ ఫర్ లైఫ్ ఆన్ డెత్ అఫ్ ది ఎన్యు్టెంట్ – ( Annuity for life with the provision for 100% of the annuity to the spouse of the annuitant for life on death of the Annuitant )

పెన్షన్ ఖరీదు చేసిన వ్యక్తి ఎంతకాలం జీవించి ఉంటాడో అంతకాలం పెన్షన్ లభిస్తుంది మరియు అతను మరణానంతరం నామినీకి కూడా అంతే పెన్షన్ లైఫ్ టైమ్ లభిస్తుంది.

 

4. యాన్యూటీ ఫర్ లైఫ్ విత్ ది ప్రొవిసన్ ఫర్ 100% అఫ్ ది యాన్యూటీ టూ ది స్పోస్ & పేరెంట్స్ అఫ్ ది ఎన్యు్టెంట్ ఫర్ లైఫ్ ఆన్ డెత్ అఫ్ ది ఎన్యు్టెంట్ – (  Annuity for life with the provision for 100% of the annuity to the  Spouse & Parents of the annuitant for life on death of the Annuitant )

అంటే ఈ ఆప్షన్ లో అమౌంట్ డిపాజిట్ చేసే వ్యక్తికి నిర్ణయించుకొన్న పెన్షన్ మోడ్ ఆధారంగా రెగ్యులర్ పెన్షన్ జీవితాంతం లభిస్తుంది. స్కీం లో అమౌంట్ డిపాజిట్ చేసిన వ్యక్తి ఏ కారణంగా మరణించినా, అతనికి ఎంత ఐతే ప్రతినెలా పెన్షన్ లభిస్తుందో 100% అతని భార్య కి కూడా జీవితాంతం లభిస్తుంది. ఆమె అనంతరం స్కీం హోల్డర్ తల్లితండ్రులకి ఈ పెన్షన్ అందివ్వడం జరుగుతుంది.

అదేవిధంగా

5. యాన్యూటీ ఫర్ లైఫ్ విత్ ది ప్రొవిసన్ ఫర్ 100% అఫ్ ది యాన్యూటీ టూ ది స్పోస్ అఫ్ ది ఎన్యు్టెంట్ ఫర్ లైఫ్ ఆన్ డెత్ అఫ్ ది ఎన్యు్టెంట్ విత్ రిటర్న్ అఫ్ పర్చాజ్ ప్రైస్ ఆన్ డెత్ అఫ్ ది లాస్ట్ సర్వీవోర్ – (  Annuity for life with the provision for 100% of the annuity to the  Spouse of the annuitant for life on death of the Annuitant with return of Purchase price on death of the last Survivor )

ఈ ఆప్షన్ లో అమౌంట్ డిపాజిట్ చేసే వ్యక్తికి నిర్ణయించుకొన్న పెన్షన్ మోడ్ ఆధారంగా రెగ్యులర్ పెన్షన్ జీవితాంతం లభిస్తుంది. స్కీం లో అమౌంట్ డిపాజిట్ చేసిన వ్యక్తి ఏ కారణంగా మరణించినా, అతనికి ఎంత ఐతే ప్రతినెలా పెన్షన్ లభిస్తుందో 100% అతని భార్య కి కూడా జీవితాంతం లభిస్తుంది. ఆమె అనంతరం స్కీం హోల్డర్ తల్లితండ్రులకి ఈ పెన్షన్ అందివ్వడం జరుగుతుంది.

వారియొక్క అనంతరం , స్కీం ప్రారంభంలో డిపాజిట్ చేసిన అమౌంట్ ని వారి పిల్లలకు లేదా నామినీ కి అందివ్వడం జరుగుతుంది.

 

NPS Important Details :-

 

PFRDA పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ చేసే రంగాలు

1.  పోస్ట్ ఆఫీస్               – Post Office
2. ఎల్. ఐ. సి                – Life insurance Corporation Of India
3.హె ఛ్.డి. ఫ్. సి         -HDFC Life
4. ఐ. సి. ఐ. సి. ఐ        – ICICI Prudential
5. SBI life…. మొదలైనవి.

 

LIC Arogya Rakshak Plan In Telugu -” కుటుంబం మొత్తానికి ఒక్కటే ఆరోగ్య పాలసీ ” పూర్తి వివరాలు ఉదాహరణ ద్వారా !

.NPS Tax Benefits ( టాక్స్ ప్రయోజనాలు )

NPS ఒక బెస్ట్ టాక్స్ సేవింగ్ స్కీం. స్కీం లో ప్రతి నెలా డిపాజిట్ చేసే అమౌంట్ పై గాని, ప్రతి సంవత్సరం లభించే మరియు కాంపౌండ్ అయ్యే వడ్డీ పై గాని టాక్స్ వర్తించదు. అదేవిధంగా 60 వ సంవత్సరం లభించే 60 % అమౌంట్ లో 40% అమౌంట్ టాక్స్ రహితంగానే పొందుతారు.

మిగిలిన 20% + ప్రతీ నెలా లభించే రెగ్యులర్ పెన్షన్ పై మాత్రమే గవర్నమెంట్ రూల్స్ కి అనుగుణంగా టాక్స్ విధించడం జరుగుతుంది.

1. అండర్ సెక్షన్ – 80CCDI

ఈ సెక్షన్ ద్వారా సంవత్సరానికి ఒకసారి RS 1,50,000/- వరకూ మీరు ITR ఫైల్ చెయ్యవచ్చు.

2. అండర్ సెక్షన్ – 80CCD(IB)

మరొక Rs 50,000/- టాక్స్ డెడక్షన్ 80CC(1B) ద్వారా మీరు పొందవచ్చు.
పై రెండు బెనిఫిట్స్ సామాన్య వ్యక్తులకు వర్తిస్తాయి.

3.అండర్ సెక్షన్ – 80CCD2

కేవలం గవర్నమెంట్ ఉద్యోగులకి మాత్రమే ఈ సెక్షన్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఉద్యోగి బేసిక్ సాలరీలో అదనంగా 10% NPS స్కీం లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మరొక 10% టాక్స్ డెడక్షన్ అతను క్లెయిమ్ చేసుకోవచ్చు.

 

• NPS ప్రీమాట్యూర్ విత్ డ్రాల్ ( NPS Pre- Mature Withdrawal )

60 సంవత్సరాలలోపు NPS అకౌంట్ ని క్లోజ్ చేసి అమౌంట్ పొందాలనుకొంటే డిపాజిట్ అమౌంట్ లో కేవలం 20% మాత్రమే ప్రీ మాట్యూర్ రూపంలో మీకు అందివ్వడం జరుగుతుంది. మిగిలిన 80% అమౌంట్ పెన్షన్ రూపంలో మార్పు చెందుతుంది.

 

• నామినీ ఫెసిలిటీ ( NPS Nominee Facility )

అత్యధికముగా 3 రు వ్యక్తులును NPS స్కీం లో మీరు నామినీ గా జతచేయవచ్చు.

 

• NPS ఎక్స్టెంషన్ ( NPS Extension Rule )

కావాలనుకొంటే NPS స్కీం సమయాన్ని మరొక 10 సంవత్సరాలకి పొడిగించుకోవచ్చు.అంటే 60 – 70.

 

• ఈ స్కీం లో జాయిన్ అవ్వడానికి ఏ డాకుమెంట్స్ జమాచెయ్యాలి? ( NPS Documents Required )

1.అప్లికేషన్ ఫారం  ( Account Opening Form )
2.రెండు పాసుపోర్టు ఫొటోలు  ( 2 Photos )
3. ఆధార్ కార్డు                           ( Adar Card )
4. పాన్ కార్డు                                ( PAN  Card )

•   పర్మినెంట్ అడ్రెస్స్ వివరాలకై   ( Address Proof )

1. కరెంటు బిల్           ( Electricity Bill )
2. టెలిఫోన్ బిల్         ( Telephone Bill )
3. బ్యాంక్ స్టేట్మెంట్   ( Bank Statement )
4. పాస్ పోర్ట్                  ( Passport )
5. NRI వ్యక్తి ప్రత్యేక డాకుమెంట్స్ అందివ్వాలిసివుంటుంది.

 

NPS స్కీం కి సంబందించిన ముఖ్యమైన ప్రశ్నలు వాటికి జవాబులు చూద్దాం!( NPS Scheme Telugu )

 

1.  NPS స్కీం లో చేరడానికి ఎవరు అర్హులు? ( NPS Eligibility ?)

18 నుంచి 65  సంవత్సరాల మధ్య ఉన్న ఏ భారతీయ పౌరుడైనా NPS లో చేరవచ్చు. ఒక షరతు ఏమిటంటే, మీరు కస్టమర్ (KYC) నిబంధనలను తెలుసుకోవలసి ఉంటుంది.

 

2. నేను ఒక NRI అయితే NPS స్కీం లో చేరవచ్చా? ( NRI Eligibility )

అవును, మీరు NPS లో చేరవచ్చు. అయితే, NRI గా మీ సిటిజన్ షిప్ స్టేటస్ లో మార్పు ఉంటే అకౌంట్ మూసివేయబడుతుంది.

 

3. NPS  స్కీం లో ఎలా చేరాలి? (  How to join NPS ?)

మీరు పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (POP) అని పిలవబడే MTT తో NPS ఖాతాను తెరవాలి. చాలా ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులు,  అందుబాటులో ఉన్నాయి. అనేక ఆర్థిక సంస్థలు కూడా POP లుగా పనిచేస్తాయి. POP యొక్క అధీకృత శాఖలు, పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ సర్వీస్ ప్రొవైడర్లు (POP-SP లు) అని పిలవబడేవి, కలెక్షన్ సెంటర్లుగా పనిచేస్తాయి.

 

4. నాకు సమీపంలో ఉన్న POP లను నేను ఎలా కనుగొనాలి? ( How to find Nearest  POP Center ?)

మీరు వీటిని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) వెబ్‌సైట్ ద్వారా సులభంగా కనుగొనవచ్చు. https://www.npscra.nsdl.co.in/pop-sp.php

 

5. NPS ఖాతా తెరవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏవి? ( NPS Documents Required )

మీరు NPS లో చందాదారుని గా చేరడానికి ఒక  రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూరించాలి ,గుర్తింపు, చిరునామా మరియు పుట్టిన తేదీ వంటి పత్రాలు POP కి అందజేయాలి.

 

6. శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య (PRAN) అంటే ఏమిటి? ( PRAN Full Form ?)

ప్రతి NPS చందాదారుడికి శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య లేదా PRAN అని పిలువబడే 12 అంకెల ప్రత్యేక సంఖ్యతో ఒక  కార్డ్ అందజేయబడుతుంది.

 

7. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ NPS ఖాతాలను కలిగి ఉండవచ్చా?( One Person can have 2  NPS Accounts ?)

లేదు, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ NPS ఖాతాలను తెరవలేరు. ఎందుకంటే, NPS కోసం రెండవ ఖాతాను తెరవాల్సిన అవసరం లేదు.

 

8.NPS  స్కీం లో మినిమం కాంట్రిబ్యూషన్ ఎంత?( NPS Minimum Contribution ?)

ఒక ఆర్థిక సంవత్సరంలో మీ టైర్ -1 ఖాతాలో మీరు కనీసం రూ. 6,000 జమ చేయాల్సి ఉంటుంది.టైర్ – 2 అకౌంట్ లో కనీసం రూ.500 జమా చేయాల్సి ఉంటుంది.

 

9. ఒకవేళ స్కీం యొక్క మినిమం కాంట్రిబ్యూషన్  చేయకపోతే ఏమి జరుగుతుంది?

మీరు కనీస మొత్తాన్ని అందించకపోతే, మీ ఖాతా స్తంభింపజేయబడుతుంది. మీరు POP ని సందర్శించి, ఆగిపోయిన అకౌంట్ను వంద రూపాయల జరిమానా చెల్లించి కొనసాగించవచ్చు.

 

10. కేంద్ర ప్రభుత్వం కూడా NPS ఖాతాకు సహకరిస్తుందా?( NPS Security )

కేంద్ర ప్రభుత్వం మీ NPS ఖాతాకు 100% గ్యారంటీ అందిస్తుంది.

 

వీటిని కూడా తెలుసుకోండి !   Also Read

 

11. పెన్షన్ లో పెట్టుబడి పెట్టే డబ్బును ఎవరు నిర్వహిస్తారు?( NPS Pension Percentage )

NPS లో పెట్టుబడి పెట్టబడిన డబ్బు PFRDA- యొక్క  రిజిస్టర్డ్ పెన్షన్ ఫండ్ మేనేజర్లచే నిర్వహించబడుతుంది. ప్రస్తుతానికి, ఎనిమిది పెన్షన్ ఫండ్ నిర్వాహకులు ఉన్నారు: ICICI ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్, LIC పెన్షన్ ఫండ్, కోటక్ మహీంద్రా పెన్షన్ ఫండ్, రిలయన్స్ క్యాపిటల్ పెన్షన్ ఫండ్, SBIపెన్షన్ ఫండ్, UTI రిటైర్మెంట్ సొల్యూషన్స్ పెన్షన్ ఫండ్, HDFC పెన్షన్ మేనేజ్‌మెంట్ కంపెనీ మరియు DSP బ్లాక్‌రాక్ పెన్షన్ ఫండ్ మేనేజర్‌లు.

 

12. NPS లో అందుబాటులో ఉన్నపెట్టుబడి ఆప్షన్స్ ఏవి? ( NPS Fund Managers )

నేషనల్ పెన్షన్ సిస్టమ్ లేదా NPS  రెండు ఆప్షన్స్ ను అందిస్తుంది.

A) యాక్టివ్ ఛాయిస్(Active Choice ): ఇది పెట్టుబడిదారుని డబ్బును వివిధ ఆస్తులలో ఎలా పెట్టుబడి పెట్టాలో నిర్ణయించడానికి అనుమతిస్తుంది.

B ) ఆటో ఛాయిస్ లేదా లైఫ్‌సైకిల్ ఫండ్ ( Auto Choice ): ఇది చందాదారుడి వయస్సుకి అనుగుణంగా ఆటోమేటిక్‌గా డబ్బును ఇన్వెస్ట్ చేసే డిఫాల్ట్ ఆప్షన్ గా ఉంటుంది.

 

13. యాక్టివ్ ఛాయిస్ కింద అందుబాటులో ఉన్న పెట్టుబడి ఎంపికలు ఏమిటి? ( NPS Active choice fund options )

యాక్టివ్ ఛాయిస్ మూడు ఫండ్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లను అందిస్తుంది.

A.  అసెట్ క్లాస్ E (స్టాక్స్‌లో 50 శాతం ఇన్వెస్ట్ చేస్తుంది)

B. అసెట్ క్లాస్ C (ప్రభుత్వ సెక్యూరిటీలు కాకుండా స్థిర ఆదాయాలలో పెట్టుబడి పెడుతుంది).

C. అసెట్ క్లాస్ G (ప్రభుత్వ సెక్యూరిటీలలో మాత్రమే పెట్టుబడి పెడుతుంది). పెట్టుబడిదారుడు ఈ నిధులలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు లేదా వాటి కలయికను ఎంచుకోవచ్చు.

 

14. నేను నా పెట్టుబడి ఎంపికలను మార్చవచ్చా?( NPS Investment options )

అవును, మీరు టైర్ -1 మరియు టైర్ -2 ఖాతాల కోసం ఆర్థిక సంవత్సరంలో ఒకసారి మీ పెట్టుబడి ఎంపికలను మార్చుకోవచ్చు.

 

15. నేను నా స్కీమ్ మరియు పెన్షన్ ఫండ్ మేనేజర్‌లను మార్చవచ్చా?( NPS Fund Manager change )

అవును, మీరు మీ స్కీమ్ ప్రాధాన్యత మరియు పెన్షన్ ఫండ్ మేనేజర్‌ని మార్చుకోవచ్చు.  మీరు మీ పెట్టుబడి ఎంపికను(యాక్టివ్ మరియు ఆటో ఎంపికలు) కూడా మార్చవచ్చు.

 

NPS Most Asking  QUESTIONS :

 

16. 60 సంవత్సరాలప్పుడు ఒకేసారి అమౌంట్ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడాన్ని  వాయిదా వేయవచ్చా?( NPS Withdrawal rules 2021 )

అవును, మీరు 70 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు NPS లో అమౌంట్ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడం  వాయిదా వేయవచ్చు.

 

17. నాకు 60 ఏళ్లు రాకముందే నేను డబ్బు తీసుకోవచ్చా? (   NPS  Withdrawal  Before 60 Years  is Possible  )

మీకు 60 ఏళ్లు నిండకముందే అకౌంట్ ని మూసివేయ్యాలనుకొంటే , మీరు NPS లో సేకరించిన కార్పస్‌లో 20 శాతం మాత్రమే తీసుకోవచ్చు. యాన్యుటీని కొనుగోలు చేయడానికి మీరు తప్పనిసరిగా కార్పస్‌లో 80 శాతం ఉపయోగించాలి.

 

18. నేను పథకాన్ని నిలిపివేస్తే డబ్బు ఏమవుతుంది?( If NPS Discontinued? )

మీరు మీ పెట్టుబడిని నిలిపివేస్తే, మీ ఖాతా స్తంభింపజేయబడుతుంది. మీరు పెనాల్టీతో పాటు అవసరమైన మినిమం కాంట్రిబ్యూషన్ చెల్లించి నప్పుడు  మాత్రమే మీరు ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయవచ్చు.

 

19. చందాదారుడు 60 సంవత్సరాల కంటే ముందు మరణిస్తే ఏమి జరుగుతుంది? (  If NPS Subscriber death before 60 Years  )

చందాదారుడు 60 ఏళ్ళకు ముందు మరణిస్తే, మొత్తం డిపాజిట్  చందాదారుడి నామినీ లేదా చట్టపరమైన వారసుడికి చెల్లించబడుతుంది.

 

20. విత్ డ్రా  పత్రాలతో పాటు సమర్పించాల్సిన పత్రాలు ఏమిటి? ( NPS  Scheme Documents Telugu  )

మీరు ఈ క్రింది పత్రాలను విత్ డ్రా  ఫారమ్‌లతో పాటు సమర్పించాలి:
1. PRAN కార్డ్ (ఒరిజినల్)
2.  గుర్తింపు రుజువు సర్టిఫైడ్ కాపీ
3. చిరునామా రుజువు యొక్క సర్టిఫైడ్  కాపీ
4. రద్దు చేయబడిన చెక్.

21. యాన్యుటీ అంటే ఏమిటి? ( What is Annuity )

యాన్యూటీ అంటే పెన్షన్ అని అర్ధం.NPS స్కీం లో చందాదారుడు యాన్యుటీని కొనుగోలు చేయడానికి కనీసం 40 శాతం కార్పస్‌ని ఉపయోగించాలి. దీని అర్థం ఆ వ్యక్తి యాన్యుటీ సర్వీస్ ప్రొవైడర్ (ASP) కు డబ్బు చెల్లించవచ్చు మరియు రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఆదాయాన్ని నిర్ధారించడానికి యాన్యుటీ ఎంపికను ఎంచుకోవచ్చు.

 

22. జాతీయ పెన్షన్ పథకం (NPS) యొక్క పన్ను ప్రయోజనాలు ఏమిటి? ( NPS Tax Benefits )

జాతీయ పెన్షన్ పథకం లో వివిధ పన్ను ప్రయోజనాలు ఉన్నాయి.

సామాన్యులకి అత్యధికముగా 2 లక్షల రూపాయలు వరకు టాక్స్ మినహాయింపు ఉంటుంది.
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80CCD (1), 80CCD (2), 80CCD (1B) కింద కూడా పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయవచ్చు.

జీతం తీసుకునే ఉద్యోగులు తమ జీతంలో గరిష్టంగా 10%  వరకు మినహాయింపు పొందవచ్చు. (స్వయం ఉపాధి) సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఉద్యోగులు  తమ స్థూల ఆదాయంలో 20% వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.

మీరు అంప్స్ స్కీం పన్ను ప్రయోజనంగా సెక్షన్ 80CCD (1B) కింద అదనపు సహకారం కింద  (రూ. 50,000 వరకు) క్లెయిమ్ చేయవచ్చు.

 

22. ఈ స్కీం ద్వారా ముట్యుయల్ ఫండ్ లో అత్యధికముగా ఎంత వాటాను ఉపయోగించవచ్చు?( NPS Mutual fund )

మొత్తం డిపాజిట్ లో 75% వరకూ మాత్రమే.

23. NPS పూర్తి పేరు ఏమిటీ ?( NPS Full Form )

నేషనల్ పెన్షన్ సిస్టమ్- National Pension System

 

• ముగింపు  ( Conclusion )

NPS స్కీం యొక్క  సంబందించిన పూర్తి సమాచారాన్ని మీకు అందించానని భావిస్తున్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ మరచినట్లైతే  మన్నించి క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.

 

 

4 thoughts on “NPS Scheme Details In Telugu Pdf – “సామాన్యులను కోటీశ్వరులు చేసే గవర్నమెంట్ స్కీం ”  పూర్తి వివరాలు!

  1. T.Ramanaiah PRAN 500040273142 LM Kandriga Vamalapet mandal Chittoor district Andhra Pradesh 517551 date of birth 09-03-1957.Joined NPS activation date 25-03-2011 . I want to withdraw the amount, because of Superannuation.Please give me cumulative amount and details to get refund etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *