LIC Single Premium Endowment plan
LIC Single Premium Endowment plan 717
ఎల్ ఐ సి విడుదల చేసిన 2 వ బెస్ట్ ప్లాన్. ఈ ప్లాన్ లో మీ పిల్లలకు మీరు వారి యొక్క ఆర్ధిక భద్రతను బహుమతి గా అందించవచ్చు. ఈ ప్లాన్ లో ఒక్కసారే అమౌంట్ ను చెల్లిస్తే డిపోసిట్ అమౌంట్ కు సుమారు 7 రెట్లు అమౌంట్ లభించడం తో పాటు, ఆ కుటుంబానికి ప్లాన్ సమయం మొత్తము, అధిక మొత్తం లో భీమా కవరేజ్ లభిస్తుంది. ప్రత్యేకంగా లాంగ్ టర్మ్ లో మీ పిల్లలకు ఒక ఎక్కువ సంపదను ఈ స్కీం పునరుద్ధరిస్తుంది. మీరు మీ పిల్లల పేరు మీద 3 లక్ష రూపాయలు చెల్లిస్తే 22 లక్షల రూపాయలను మీ పిల్లలకు అందించవచ్చు.
పూర్తి వివరాలు :
ఈ ప్లాన్ లో కొంత భీమా ను కొంత కాలానికి తీసుకుని అంటే పాలసీ తీసుకునే సమయంలోనే ఒక్కసారే ప్రీమియం చెల్లిస్తారు. అప్పటినుండి పాలసీ సమయం మొత్తం, మీరు ఎంత కాలానికి తీసుకుంటే అంత కాలం ప్రతి సంవత్సరం ఎల్ ఐ సి బోనస్ ను ప్రకటిస్తుంది. అలాగే మొత్తం స్కీం సమయం వ్యక్తికి భీమా కవరేజ్ వర్థిస్తుంది.
ఈ ప్లాన్ లో రిస్క్ కవరేజ్ అనేది మీరు చెల్లించే ప్రీమియంకి సుమారు 2 రెట్లుగా వుంటూ బోనస్ కూడా కలుస్తుంది. అందువల్ల మెచూరిటీ సమయం లో ప్రాధమిక భీమా మరియు మొత్తం బోనస్ కలిపి వ్యక్తికి మెచూరిటీ గా ఎల్ ఐ సి సంస్థ అందిస్తుంది.
ముఖ్యమైన సమాచారం :
ఎల్ ఐ సి న్యూ సింగల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ 717
ఈ ప్లాన్ కు స్టాక్ మార్కెట్ తో ఎటువంటి సంబంధం లేదు. ఇతర ప్లాన్స్ తో పోలిస్తే ఈ ప్లాన్ లో బోనస్ రేటు ఎక్కువగా ఉంటుంది.
కనీస ప్రవేశ వయసు : 90 రోజులు
అధిక ప్రవేశ వయసు : 65 సంవత్సరాలు
కనీస పాలసీ సమయం : 10 సంవత్సరాలు
అధిక పాలసీ సమయం : 25 సంవత్సరాలు
కనీస భీమా : 50,000 రూపాయలు
అధిక భీమా : పరిమితి లేదు.
ఇది ఒక సింగల్ ప్రీమియం ప్లాన్ కాబట్టి ప్లాన్ లో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. దీనితో పాటుగా చెల్లించిన ప్రీమియం 10 శాతం 80c రూపం లో టాక్స్ డిడిక్షన్ మరియు మెచూరిటీ అమౌంట్ ఎటువంటి టాక్స్ చెల్లించకుండా పొందవచ్చు.
ఇది వన్ టైం డిపాజిట్ స్కీం అందువల్ల సమ్ అస్స్యూరెడ్ పై, అంటే మీరు తీసుకునే బీమా పై డిస్కౌంట్ లభిస్తుంది.
50,000 రూపాయల నుండి 95,000 రూపాయల లోపు బీమా పై డిస్కౌంట్ లేదు.
లక్ష రూపాయల నుండి 1,95,000 రూపాయల లోపు బీమా పై 18 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది.
2 లక్ష రూపాయల నుండి 2,95,000 రూపాయల లోపు బీమా పై 25 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది.
3 లక్ష రూపాయల పైన బీమా తీసుకుంటే 30 శాతం డిస్కౌంట్ ను ఎల్ ఐ సి సంస్థ అందిస్తుంది.
ప్లాన్ తీసుకున్న ఒక సంవత్సరం తర్వాత అత్యవసరం అయితే ఈ ప్లాన్ లో లోన్ కూడా తీసుకోవచ్చు.
ఎల్ ఐ సి న్యూ సింగల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం !
- రాజు వయసు = 30 సంవత్సరాలు అతనికి రవి అనే 5 సంవత్సరాల వయసు గల కుమారుడు వున్నాడు. వన్ టైం డీపోసిట్ స్కీం గా ఎల్ ఐ సి న్యూ సింగల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ ను తీసుకుని 8 లక్షల బీమా ను 25 సంవత్సరాల పాలసీ టర్మ్ తో తీసుకున్నాడు.
రాజు కావాలనుకుంటే ఈ ప్లాన్ ను 10 సంవత్సరాలకి కూడా తీసుకోవచ్చు. కానీ ఇన్సూరెన్స్ ని ఎంత కాలం తీసుకుంటే బోనస్ కూడా అంతే ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి మీకు అనుగుణంగా పాలసీ టర్మ్ ను తీసుకోవచ్చు.
రాజు కి 8 లక్షల బీమాకు గాను ఒక్కసారే 3,62,688 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది సింగల్ ప్రీమియం ప్లాన్ కాబట్టి.
అదే రెగ్యులర్ ఎండోమెంట్ ప్లాన్ లో 8 లక్షల బీమా కు లాంగ్ టర్మ్ లో మీరు 8 లక్షల ప్రీమియం కచ్చితంగా చెల్లించాలి.
అందువల్ల అప్పటి నుండి రవి కి 30 సంవత్సరాలు వచ్చేవరకు రిస్క్ కవరేజ్ వర్తిస్తుంది. ప్రతి సంవత్సరం ఎల్ ఐ సి కూడా బోనస్ ను కలుపుతూ వస్తుంది. చివరి సంవత్సరం అంటే మెచూరిటీ సమయం లో ప్రాధమిక బీమా =8 లక్ష రూపాయలు , వెస్టెడ్ సింపుల్ రివిషనరీ రూపంలో = 12,00,000 లక్ష రూపాయలు మరియు ఫైనల్ ఆడిషన్ బోనస్ సుమారు 1,80,000 రూపాయలు మొత్తం 22,00,000 రూపాయలు ఎల్ ఐ సి మెచూరిటీ గా రవి కి అందిస్తుంది.
అంటే అతను చెల్లించిన ప్రీమియం కు సుమారు 7 రెట్లు అన్నమాట.
ALSO READ
LIC New Jeevan Utsav 871 Telugu – “కొత్త పాలసీ – బ్రతికున్నంత కాలం Rs 50000 ” Lic New Policy 871
LIC Jeevan Umang Policy Telugu – సం||రానికి Rs 40,000/- జీవితాంతం మరియు మెట్యూరిటీ కూడా, పూర్తి వివరాలు ఇవే!
New Rules For SSYC & PPF from October 1-2024 In Telugu
డెత్ బెనిఫిట్ (Death Benefit):
ఈ ప్లాన్ లో డెత్ బెనిఫిట్ చిల్డ్రన్ మరియు పెద్దలకు వేర్వేరుగా ఉంటుంది. 18 సంవత్సరాలు లోపు పిల్లలకు ఈ ప్లాన్ తీసుకున్నప్పుడు రిస్క్ జరిగితే అది కూడా ప్లాన్ తీసుకున్న 2 సంవత్సరాల లోపు , కట్టిన ప్రీమియం మొత్తం తల్లిదండ్రులకు అందిస్తారు. ప్లాన్ తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత రిస్క్ జరిగితే బోనస్ కూడా అదనంగా చెల్లిస్తారు.
ఒకవేళ రాజు ఈ ప్లాన్ తీసుకున్నప్పుడు రిస్క్ జరిగితే ప్రాధమిక బీమా 8 లక్షల రూపాయలు }
+ అప్పటివరకు అతనికి లభించిన బోనస్ ఈ రెండింటిని కలిపి వ్యక్తి కుటుంబానికి డెత్ బెనిఫిట్ గా ఎల్ ఐ సి అందిస్తుంది.
అందువల్ల బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ + ఇన్సూరెన్స్ కవరేజ్ ఈ రెండు బెనిఫిట్స్ ను ఎల్ ఐ సి సింగల్ ప్రీమియం స్కీం లో మనం గమనించవచ్చు.
సలహా (Suggestion):
18 సంవత్సరాల లోపు పిల్లలకు ప్లాన్ తీసుకునే తల్లిదండ్రులు ప్రీమియం వేవర్ బెనిఫిట్ తప్పకుండ తీసుకోవాలి. ఎందుకంటె తల్లిదండ్రులు కి ఏమైనా రిస్క్ జరిగితే ఈ రైడర్ ను తీసుకోవడం ధ్వారా మొత్తం ప్రీమియం ఎల్ ఐ సి చెల్లిస్తుంది. చివరిలో పిల్లల కి కూడా మెచూరిటీ పూర్తిగా లభిస్తుంది.