Lic Jeevan Labh 736 in Telugu
Lic Jeevan Labh 736
యల్ ఐ సి స్కీములు లో ఒకటి ఐన బెస్ట్ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. యల్ ఐ సి పాత ప్లాన్లను క్లోజ్ చేసి వాటి స్థానంలో అక్టోబర్ 1 నుండి కొత్త ప్లాన్లను ప్రారంభించింది. ఇధి 3 వ ప్లాన్. ఈ ప్లాన్ పేరు యల్ ఐ సి కొత్త జీవన్ లాబ్ టేబుల్ నంబర్ 736. యల్ ఐ సి అధిక బోనస్ లు అందించే ప్లాన్స్ లో ఇధి కుడా ఒకటీ.
ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా అంటే కొంత కాలానికి మాత్రమే ప్లాన్ లో ప్రీమియం చెల్లించేలా అలాగే మొత్తం పథకం సమయం బోనస్ మరియూ ఇన్సూరెన్స్ కవరేజ్ కొరకు యెదురుచూస్తున్నారో వారికి ఇది ఒక బెస్ట్ ప్లాన్.
అదేవిధంగా పెద్దలతో పాటు పిల్లలకు కూడా వర్తిసుంది.
యల్ ఐ సి న్యూ జీవన్ లాబ్ ఏ విధంగా పని చేస్తుందంటే ఈ ప్లాన్ లో మీరు కొంత బీమా ను కొంత కాలానికి తీసుకుంటారు. అయితే పాలసీ సమయం మొత్తం మీరు ప్లాన్ లో ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయినప్పటికీ కూడా ప్లాన్ చివరి వరకు ప్రతి సంవత్సరం రెగ్యులర్ బోనస్ అలాగే ఎంటైర్ పాలసీ టర్మ్ రిస్క్ కవరేజ్ వర్తిస్తుంది. ఇక ప్లాన్ యొక్క మెచూరిటీ సమయం లో నిర్ణయించుకున్న ప్రాధమిక బీమా, వెస్టెడ్ సింపుల్ రివైషనరీ బోనస్ మరియు ఫైనల్ అడిషన్ రూపం లో మెచూరిటీ ని యల్ ఐ సి అందిస్తుంది.
ఇక ఈ స్కీం యొక్క ముఖ్య ప్రయోజనాలు
1) ఇది ఒక లిమిటడ్ ప్రీమియం ప్లాన్ అంటే ఇతర పధకాల లో మీరు పాలసీ ని ఎంత ఎక్కువ కాలానికి తీసుకుంటే అంత కాలం ప్రీమియం చెల్లించాలి కానీ ఈ ప్లాన్ లో చివరి 9 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు.
2) కనీస ప్రవేశ వయసు = 8 సంవత్సరాలు
అధిక ప్రెవేశ వయసు = 59 సంవత్సరాలు
3) లో ప్రీమియం పేమెంట్ అంటే ప్లాన్ లో మీరు నిర్ణయించుకునే పాలసీ టర్మ్ ఆధారంగా ప్రీమియం రేట్ తగ్గుతుంది. దాని గురించి క్రింద తెలుసుకుందాము.
4) ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే ఒకసారి మీరు ప్రీమియం చెల్లించడం మానేసిన తర్వాత కూడా ప్రీమియం చెల్లించ కుండా 9 సంవత్సరాల వరకు ఇన్సూరెన్సు కవరేజ్ మరియు బోనస్ యధావిధిగా వర్తిస్తుంది.
అలాగే బోనస్ విషయానికి వస్తే యల్ ఐ సి ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. దానికి అనుగుణంగానే మెచూరిటీ లభిస్తుంది. దీనితో పాటు అడిషనల్ బెనిఫిట్స్ కొరకు 5 రైడర్స్ ను ఈ స్కీం ప్రొవైడ్ చేస్తుంది.
పాలసీ టర్మ్:
ఈ ప్లాన్ లో 3 రకాల పాలసీ సమాయాలు అందుబాటులో వున్నాయి. అవి 16 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. మీకు అనుగుణంగా పాలసీ టర్మ్ ను నిర్ణించుకోవచ్చును.
ప్రీమియం పేయింగ్ టర్మ్:
అంటే ప్లాన్ లో ప్రీమియం ఎంత కాలం చెల్లించాలి అంటే యల్ ఐ సి జీవన్ లాబ్ లిమిటడ్ ప్రీమియం ప్లాన్ కావడం చేత మీరు 16 సంవత్సరాలకు ఈ ప్లాన్ తీసుకుంటే 10 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి. మిగిలిన 6 సంవత్సరాలు ప్రీమియం కట్టనవసరం లేదు కానీ బెనిఫిట్స్ అన్ని కొనసాగుతాయి.
అలాగే 21 సంవత్సరాల కు ఈ ప్లాన్ తీసుకుంటే 15 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తారు మరియు 25 సంవత్సరాలకు ఈ ప్లాన్ తీసుకుంటే 16 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 9 సంవత్సరాలు అమౌంట్ కట్టనవసరం లేదు.
అలాగే ప్లాన్ లో ప్రీమియం ను సంవత్సరానికి , 6 నెలలకి, 3 నెలలకి మరియు ప్రతి నెల ఏదో ఒక పద్ధతి లో మీరు ప్రీమియం చెల్లించవచ్చు.
బీమా పరిమితులు:
కనీస బీమా – 2 లక్షలు రూపాయలు
అధిక బీమా – పరిమితి లేదు.
కానీ ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఈ ప్రయోజనాలను మీరు పొందవచ్చు.
ఈ యల్ ఐ సి న్యూ జీవన్ లాబ్ స్కీం ఉదాహరణ
రాము వయసు 30 సంవత్సరాలు, 5 లక్షల రూపాయల బీమా ను ఈ ప్లాన్ లో 25 సంవత్సరాల పాలసీ టర్మ్ కు తీసుకున్నాడు అనుకుందాము.
అయితే ముందు చెప్పిన ప్రీమియం పయింగ్ టర్మ్ ను 25 సంవత్సరాల పాలసీ టర్మ్ లో కేవలం అతను 16 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాడు. చివరి 9 సంవత్సరాలు ప్రీమియం చెల్లించే అవసరం లేదు కానీ బోనస్ + కవరేజ్ వ్యక్తీకి లభిస్తాయి.
తర్వాత ఈ ప్లాన్ లో ప్రీమియం చెల్లించడానికి నెల వారి పద్ధతిని నిర్ణయించుకున్నాడు. అందువల్ల 5 లక్షల రూపాయల బీమా కు ప్రతి నెల ప్రీమియం 2149 రూపాయలు చెల్లించాలి. ఇందులో 2102 రూపాయలు బీమా యొక్క ప్రీమియం కాగా మిగతా 42 రూపాయలు GST. ఈ విధంగా రాము 16 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తాడు. అలాగే చెల్లించిన ప్రీమియం పై ప్రతి సంవత్సరం 80c రూపం లో 7747 రూపాయలు టాక్స్ డిడిక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మొత్తం ఈ ప్లాన్ లో చెల్లించే ప్రీమియం మొత్తం 404876 రూపాయలు అవుతుంది.
ఇక ఎప్పుడైతే పాలసీ మెచూర్ అవుతుందో అంటే ప్లాన్ యొక్క 25 వ సంవత్సరం సుం అస్స్యూరెడ్ గా 5 లక్షల రూపాయలు + వెస్టెడ్ సింపుల్ రివైజనరీ బోనస్, ప్లాన్ లో ప్రతి సంవత్సరం లభించే బోనస్ వచ్చి 5,87,500 రూపాయలు మరియు ఫైనల్ అడిషనల్ బోనస్ రూపం లో 2,25,000 మొత్తం కలిపి 13,12,500 రూపాయలు మెచూరిటీ గా యల్ ఐ సి రాము కి అందిస్తుంది. అంటే మొత్తం గా 5 లక్షల రూపాయల బీమా ను 25 సంవత్సరాల పాలసీ టర్మ్ కి తీసుకుంటే 16 సంవత్సరాలు అమౌంట్ చెల్లించాలి. ఈప్లాన్ లో చెల్లించిన అమౌంట్ వచ్చి సుమారు 4 లక్షల రూపాయలు కాగా 13 లక్షల రూపాయలు మెచూరిటీ తోపాటు 25 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ప్లాన్ లో వర్తిస్తుంది. ఈ విధంగా యల్ ఐ సి లాబ్ జీవన్ ప్లాన్ లో మెచూరిటీ లభిస్తుంది.
ALSO READ
LIC Single Premium Endowment plan 717- ఒక్కసారి కడితే చాలు 22 లక్షల రూపాయలు వస్తాయి
LIC YUVA TERM PLAN-875 in Telugu-యువత కోసం ప్రత్యేకంగా.. పూర్తి వివరాలు ఇవే
LIC New Jeevan Utsav 871 Telugu – “కొత్త పాలసీ – బ్రతికున్నంత కాలం Rs 50000 ” Lic New Policy 871
డెత్ బెనిఫిట్:
25 సంవత్సరాల పాలసీ సమయంలో వ్యక్తికీ ఎప్పుడు ప్రమాదం జరిగిన ప్రాధమికంగా తీసుకున్న బీమా 5 లక్షలు మరియు అప్పటి వరకు అతనికి లభించిన బోనస్ ఈ రెండింటిని కలిపి వ్యక్తి కుటుంబానికి ఆర్ధిక భరోసా గా యల్ ఐ సి జీవన్ లాబ్ అందిస్తుంది. ఎలా అంటే ఉదాహరణకి రాము ప్లాన్ తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత ప్రమాదానికి గురయ్యాడు అనుకుందాము. అప్పటి వరకు కట్టిన ప్రీమియం వచ్చి 50000 రూపాయలు అవుతుంది. కానీ 5 లక్షల రూపాయలు కు పైగా డెత్ బెనిఫిట్ ను యల్ ఐ సి వ్యక్తి కుటుంబానికి అందిస్తుంది. ఇక డెత్ బెనిఫిట్ విషయంలో ఫామిలీ కి ఎక్కువ ప్రయోజనం పొందడం కొరకు
1) యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్
2) క్రిటికల్ ఇళ్లనెస్ రైడర్
3)టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్
4) ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ మరియు
5) డిసబిలిటీ రైడర్ మరియు 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ ప్లాన్ ను తీసుకుంటే ప్రీమియం వేవర్ బెనిఫిట్ రూపం లో 5 రైడర్స్ ను ఈ ప్లాన్ లో పొందవచ్చు.
మీకు అనుగుణంగా ఏదో ఒక రైడర్ ను నిర్ణయించుకోవచ్చు.
గ్రేస్ పీరియడ్:
తీసుకున్న పాలసీ ని ముగించడానికి కనీసం 15 రోజులు, అలాగే ప్రీమియం చెల్లించడానికి మరొక 30 రోజులు అదనంగా గ్రేస్ పీరియడ్ లభిస్తుంది.
https://licindia.in
https://www.policybazaar.com/
టాక్స్ బెనిఫిట్:
ఈ ప్లాన్ లో లభించే మెచూరిటీ మరియు డెత్ బెనిఫిట్ అవి ఎంతైనా 100 శాతం టాక్స్ ఫ్రీ రూపంలో సంస్థ మీకు అందిస్తుంది.