LIC Arogya Rakshak Plan Details In Telugu
LIC Arogya Rakshak Plan
ఎల్. ఐ.సి ఆరోగ్య రక్షక్ ప్లాన్ ఒక నాన్ లింక్డ్, రెగ్యులర్ ప్రీమియం అండ్ ఇండివిడ్యుఅల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ( Non Linked, Regular Premium and Individual Health Insurance Plan ). అంటే ఈ ప్లాన్ ఎటువంటి షేర్ మార్కెట్ తో సంబంధం కలిగి ఉండదు.
ఈ ప్లాన్ ద్వారా మీరు, మీయొక్క తల్లిదండ్రులు మరియు పిల్లలకి కూడా ఆరోగ్య భీమా కల్పించవచ్చు. ఈ పాలసీని వ్యక్తిగతంగా మరియు కుటుంబం పరంగా తీసుకోవచ్చు.ఈ కొత్త హెల్త్ పాలసీ ద్వారా వివిధ రకాల అనారోగ్యలకి ఖచ్చితమైనప్రయోజనం పొందవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త సదుపాయాలతో LIC సంస్థ ఈ పాలసీని అద్భుతంగా జులై 19 న ప్రారంభం చేసింది. LIC ఆరోగ్య రక్షక్ మేడిక్లెయిమ్ పాలసీ కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కాబట్టి హాస్పిటల్ ఖర్చులు అన్నీ కంపెనీ స్వయంగా నిర్వహిస్తుంది.
LIC Arogya Rakshak Plan కి సంబందించిన పూర్తి వివరాలు మరియు ప్రీమియం రేట్లును ఉదాహరణ ద్వారా తెలుసుకొందాం!
పాలసీదారుని పేరు ( Name ) = Mr. హరిప్రసాద్
పాలసీదారుని వయసు ( Age ) = 30 సం ||లు
భీమా ( Sum Assured ) = 4 లక్షలు
ఇనిసియల్ డైలీ బెనిఫిట్ ( IDB ) = Rs 4,000/-
ప్రీమియం చెల్లించే విధానం ( PPM ) = 6 నెలలకి ఒకసారి.
ప్రీమియం ( Premium Paying ) = Rs 4,723/-
ఇప్పుడు ఒక్కో బెనిఫిట్ లో లభించే ప్రయోజనం గురించి తెలుసుకొందాం!
పాలసీలో ప్రీమియం చెల్లించే వ్యక్తిని , (భార్య లేదా భర్త) ని ప్రిన్సిపాల్ ఇన్సూరెడ్ ( Principal Insured ) అంటారు. కుటుంబంలో భార్య, భర్త, తల్లితండ్రులు మరియు పిల్లలకు ఈ ఆరోగ్య రక్షక్ పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ని అందిస్తుంది.
• ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు ఎవరు? ( Eligibility )
కనీస వయసు :- Minimum Age At Entry
పాలసీ దారుడు, అతని భార్య మరియు తల్లితండ్రులు యొక్క కనీస వయసు = 18 సంవత్సరాలు
పిల్లల కనీస వయసు = 91 రోజులు.
అత్యధిక వయసు :- Maximum Age At Entry
పాలసీ దారుడు, అతని భార్య మరియు తల్లితండ్రులు యొక్క అత్యధిక వయసు = 65 సంవత్సరాలు
పిల్లల అత్యధిక వయసు వచ్చి = 20 రోజులు.
కాబట్టి 20 సంవత్సరాలు పైబడిన పిల్లలకి ఈ పాలసీలో ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తించదు.
• ఈ పాలసీలో ఎప్పటివరకు కవరేజ్ లభిస్తుంది? ( Policy Coverage )
పాలసీ దారుడు, అతని భార్య మరియు తల్లితండ్రుల కు = 80 సంవత్సరాల వరకు, మరియు పిల్లలు కి = 25 సంవత్సరాలు వచ్చే వరకూ కవరేజ్ లభిస్తుంది.
LIC Arogya Rakshak Plan లో లభించే మొత్తం బెనిఫిట్స్ ను ఒక్కొక్కటిగా ఉదాహరణ ద్వారా తెలుసుకొందాం!
1. ఆటో కవర్ ఫెసిలిటీ – ( Auto Cover Facility )
LIC ఆరోగ్య రక్షక్ పాలసీ లో అతిముఖ్యం అయిన ప్రయోజనం ఆటోకవర్ సదుపాయం. పాలసీదారుడు ఏదైనా కారణంగా మధ్యలో మరణించినట్లయితే మొత్తం కుటుంబ సభ్యులకు వచ్చే 15 సంవత్సరాల వరకూ ఉచిత ఆరోగ్య భీమా లభిస్తుంది.
ఈ సమయంలో ఎటువంటి ప్రీమియం కుటుంబ సభ్యులు చెల్లించవలసిన అవసరం ఉండదు.అయినప్పటికీ పాలసీలో లభించే అన్ని ప్రయోజనాలు యాదవిధిగా లాభస్తాయి.
ముఖ్య గమనిక :-
కుటుంబ సభ్యులలో భార్య లేదా భర్త మరియు తల్లిదండ్రులకి 15 సంవత్సరాల వరకూ లేదా అత్యధికముగా 70 సంవత్సరాలు వచ్చే వరకూ రెండింటిలో ఏది ముందు అయితే దానికి ఈ ప్రయోజనాన్ని అందిస్తారు.
అదేవిధంగా పిల్లలకు 25 సంవత్సరాల వరకూ ఈ బెనిఫిట్ ని LIC అందిస్తుంది.
2. ఇనిసియల్ డైలీ బెనిఫిట్ -IDCB (Initial Daily Cash Benefit )
పాలసీదారుడు లేదా కుటుంబ సభ్యులలో ఎవరైనా అనారోగ్య కారణం లేక ప్రమాదం కారణంగా, హాస్పిటల్ లో అడ్మిట్ అయితే ట్రీట్మెంట్ తో ఎటువంటి సంబంధం లేకుండా ప్రతీ రోజు ఒక ఖచ్చితమైన అమౌంట్ ని పేషెంట్ కి అందివ్వడం జరుగుతుంది. దీనినే ఇనిసియల్ డైలీ బెనిఫిట్ అంటారు.
కనీస ఇనిసియల్ డైలీ బెనిఫిట్ ( Minimum ID CB )= Rs 2,500/-
అత్యధిక ఇనిసియల్ డైలీ బెనిఫిట్ ( maximum ID CB ) = Rs 10,000/-
పాలసీ తీసుకొనే సమయంలోనే ఈ ఇనిసియల్ డైలీ బెనిఫిట్ ని పాలసీదారుడు నిర్ణయం చేసుకోవాల్సిఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క అవసరానికి అనుగుణంగా వేరు వేరు గా ఈ హాస్పిటల్ ఇనిసియల్ డైలీ బెనిఫిట్ ని నిర్ణయించుకోవచ్చు అంటే తల్లితండ్రులు కు ఒకలా, పిల్లలు కు ఒకలా అన్నమాట.
ఇక్కడ 2,500/- నుంచి 10 వేల మధ్య IDCB ని 500 లను కలుపుతూ తీసుకోవచ్చు.
• హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ – HCB ( Hospital Cash Benefit )
పాలసీదారుడు లేదా కుటుంబ సభ్యులలో ఎవరైనా అనారోగ్య కారణంగా లేక ప్రమాదం కారణంగా, హాస్పిటల్ లో అడ్మిట్ అయితే ట్రీట్మెంట్ ప్రతీ రోజు ఒక ఖచ్చితమైన అమౌంట్ ని పేషెంట్ కి అందివ్వడం జరుగుతుంది. దీనినే హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అంటారు. జనరల్ వార్డ్ మరియు ఇంటెన్షవ్ కేర్ యూనిట్ కి వేరువేరు ఈ బెనిఫిట్ లభిస్తుంది.
హరిప్రసాద్ 5 రోజులు నార్మల్ వార్డ్ లో ట్రీట్మెంట్ తీసుకొంటే ( General Ward ) = Rs 5 × 4,000 = Rs 20,000/- లభిస్తాయి.
ఒకవేళ ఇంటెన్షవ్ కేర్ యూనిట్ లో ట్రీట్మెంట్ తీసుకొంటే ( I C U )= Rs 5 × 8,000 = Rs 40,000/- లభిస్తాయి.
అంటే హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఐసీయూకి డబల్ అందివ్వడం జరుగుతుంది.
ముఖ్య గమనిక :-
1. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ పొందడానికి పెషేంట్ కనీసం 24 గంటలు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి ఉండాలి.
2. మొదటి పాలసీ సమయంలో 30 రోజులకి ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ లభిస్తుంది.
3. రెండవ పాలసీ సమయంలో 90 రోజులకి మరియు మొత్తం పాలసీ సమయంలో అత్యధికముగా 900 రోజుల వరకూ ఈ ప్రయోజనాన్ని మీరు పొందవచ్చు.
3. మేజర్ సర్జికల్ బెనిఫిట్ – MSB ( Major Surgical Benefit )
LIC ఆరోగ్య రక్షక్ భీమాలో అత్యధికముగా 263 సర్జిరీలకు ట్రీట్మెంట్ అందిస్తుంది.అదికూడా అత్యధికముగా హాస్పిటల్ క్యాష్ బోనస్ కి 100 రేట్లుగా అందిస్తుంది.
“MSB = 100 Times Of Hospital Cash Benefit”
కనుక HCB రోజుకి 4000 కాబట్టి Rs 4,00,000/- రూపాయలు సర్జరీ నిమిత్తం అందివ్వడం జరుగుతుంది.
ఈ సర్జరీలను 4 గ్రూపులు విభజించి ప్రయోజనం అందిస్తుంది.
1.Category – 31 సర్జరీలు – HCB కి 100 రేట్లు
2. Category – 59 సర్జరీలు – HCB కి 60 రేట్లు
3. Category – 112 సర్జరీలు – HCB కి 40 రేట్లు
4. Category – 62 సర్జరీలు – HCB కి 20 రేట్లుగా
అమౌంట్ అందివ్వడం జరుగుతుంది.
ముఖ్య గమనిక :-
• కుటుంబంలో ఒక వ్యక్తి కి సంవత్సరంలో ఒక సర్జరీకి ఒక్కసారే ఈ బెనిఫిట్ లభిస్తుంది.
• అలాగే సర్జరీ జరిగిన తర్వాత ఒక సంవత్సరం పాలసీ ప్రీమియం మాఫీ చెయ్యడం జరుగుతుంది.
4. LIC Arogya Rakshak Plan క్విక్ క్యాష్ బెనిఫిట్ ( Quick Cash Benefits )
కేటగిరీ 1 మరియు కేటగిరి 2 లిస్ట్ కి సంబందించిన సర్జరీకి పాలసీదారుడు గురిఅయ్యినట్లయితే క్విక్ క్యాష్ బెనిఫిట్ ద్వారా, వెంటనే 50% భీమా ను హాస్పిటల్ ట్రీట్మెంట్ కై పాలసీదారుని అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యడం జరుగుతుంది.
Mr. హరిప్రసాద్ 1 మరియు 2 కేటగిరీల్లో ఏదైనా ఆపరేషన్ చేయించుకొంటే Rs 2,00,000/- రూపాయలు క్విక్ క్యాష్ బెనిఫిట్ గా లభిస్తాయి.
ముఖ్య గమనిక :-
• ఈ ప్రయోజనాన్ని పొందడానికి మీరు సర్జరిని LIC యొక్క నెట్వర్క్ హాస్పిటల్స్ లో మాత్రమే చేయించుకోవాల్సి ఉంటుంది, ఇతర హాస్పటల్స్ లో సర్జరీ చేయించుకొంటే ఈ బెనిఫిట్ వర్తించదు.
• అదేవిధంగా మీ యొక్క మెడికల్ డాకుమెంట్స్ ని డాక్టర్ ద్వారా జమాచేయవలసి ఉంటుంది.
5. అంబులెన్సు ట్రావెల్ బెనిఫిట్ – ATB ( Ambulance Benefit )
కేటగిరీ 1 మరియు కేటగిరి 2 లిస్ట్ కి సంబందించిన సర్జరీకి పాలసీదారుడు గురిఅయ్యినట్లయితే, అలాగే హాస్పిటల్ కి వెళ్ళడానికి అంబులెన్సు ను బుక్ చేసుకొంటే సంవత్సరానికి ఒకసారి Rs 1,000/- రూపాయలను అంబులెన్సు ట్రాన్స్పోర్ట్ గా క్లెయిమ్ చేసుకోవచ్చు.
అదికూడా కుటుంబంలో ఒక్కొక్కరికి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే!
6. డే కేర్ ప్రాసెసర్ ట్రీట్మెంట్ బెనిఫిట్ – DCPB ( Day care Processor Benefit )
అంటే కొన్ని అనారోగ్యలు లేదా వ్యాధులకు ( డయాలసిస్, కంటి సమస్యలు, పంటి సమస్యలు, మరియు చిన్న చిన్న సర్జరీలు..) హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. 24 గంటల లోపే వీటికి సంబందించిన ట్రీట్మెంట్ పూర్తివుతుంది, వీటిని డే కేర్ ప్రొసీసర్ ట్రీట్మెంట్స్ అంటారు. LIC ఆరోగ్య రక్షక్ పాలసీలో ఈ బెనిఫిట్ కూడా మీకు లభిస్తుంది.
ఈ ట్రీట్మెంట్ నిమిత్తం LIC సంస్థ 244 చిన్నసైజ్ సర్జరీలకు లిస్ట్ ను అందించింది. అదేవిధంగా HCB కి 5 రేట్లుగా ( DCPB = 5 Times of HCB )
ఈ డే కేర్ ప్రాసెసార్ అమౌంట్ మీకు లభిస్తుంది.
అంటే హరిప్రసాద్ డైలీ క్యాష్ బెనిఫిట్ Rs 4000/- కాబట్టి 4000 × 5 = Rs 20,000/- అందివ్వడం జరుగుతుంది.
ముఖ్య గమనిక :-
1. ఈ ప్రయోజనం పొందడానికి పాలసీదారుడు 24 గంటలలోపు హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందిఉండాలి.
2. ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో అత్యధికముగా 3 సార్లు లేదా మొత్తం పాలసీ సమయంలో 30 సార్లు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
3. డే కేర్ ట్రీట్మెంట్ సందర్భంలో మీకు డైలీ లభించే హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ( HCB ) వర్తించదు, ఎందుకంటే హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు కనుక.
LIC New Endowment Plan in Telugu – రోజుకి 53/- రూపాయలతో 12 లక్షలు పొందండి, పూర్తి వివరాలు.
7. ఇతర సర్జకల్ బెనిఫిట్ – OSB ( Other Surgical Benefit )
ఏదైతే సర్జరీ మేజర్ సర్జీకల్ బెనిఫిట్ ( MSB ) లో మరియు డే కేర్ ప్రాసెసర్ ( DCPB ) లిస్ట్ లో లేదో దానిని ఇతర సర్జికల్ బెనిఫిట్ ( OSB ) గా పరిగణిస్తారు.ఈ సర్జరీ నిమిత్తం HCB కి 2.5 రేట్లుగా అమౌంట్ లభిస్తుంది.
OSB = 2.5 Times Of HCB
అందువల్ల 4000 × 2.5 = Rs 10,000/-
ముఖ్య గమనిక :-
• ఈ ప్రయోజనాన్ని పాలసీదారుడు మొదటి పాలసీ సంవత్సరంలో 15 సార్లు, రెండవ పాలసీ సమయంలో 45 సార్లు అదేవిధంగా మొత్తం పాలసీ సమయంలో అత్యధికముగా 450 సార్లు పొందవచ్చు.
• ట్రీట్మెంట్ నిమిత్తం కనీసం 24 గంటలు హాస్పిటల్ల్లో అడ్మిట్ అవ్వాల్సిఉంటుంది.
8. మెడికల్ మానేజ్మెంట్ బెనిఫిట్ – MMB ( Medical Management Benefit )
ఇది ఒక గుడ్ బెనిఫిట్!
అందరికి సామాన్యంగా వచ్చే వ్యాధులు లేదా అనారోగ్యలు ( డెంగ్యూ, మలేరియా, నిమొనియా, పచ్చ కామెర్లు, విషజ్వరాలు..) మొదలైన వాటికి కూడా LIC Arogya Rakshak Plan లో ట్రీట్మెంట్ లభిస్తుంది.
ఎలా అంటే – ” అప్లికేబుల్ డైలీ బెనిఫిట్ కి 2.5 రేట్లు + హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ “
MMB = 2.5 Times Of ADB + Daily HCB
ముఖ్య గమనిక :-
• పాలసీదారునికి ఒక సంవత్సరంలో కనీసం 2 సార్లు మరియు మొత్తం జీవిత కాలంలో అత్యధికముగా 20 సార్లు వరకు ఈ ప్రయోజనం పొందవచ్చు.
9. ఎక్స్టెండెడ్ హాస్పిటలిసిడ్ బెనిఫిట్ – ( Extended Hospitalized Benefit )
ఏదైనా అనారోగ్య కారణంగా 30 రోజులకంటే ఎక్కువ రోజులు హాస్పిటల్ లో మీరు అడ్మిట్ అయినట్లయితే హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ( HCB ), మేజర్ సర్జీకల్ బెనిఫిట్ ( MSB ) తోపాటు ఇనిసియల్ డైలీ బెనిఫిట్ ( IDB ) 10 రేట్లు గా అందివ్వడం జరుగుతుంది.
“EHB : HCB + MSB + 10 Times Of IDB “
ముఖ్య గమనిక :-
• ఈ ప్రయోజనం సంవత్సరంలో ఒకసారి లేదా మొత్తం పాలసీలో అత్యధికముగా 10 సార్లు మీరు పొందవచ్చు.
10. హెల్త్ చెక్ అప్ బెనిఫిట్ 🙁 Health Check Up Benefit)
ఈ ఆప్షన్ ప్రకారం LIC Arogya Rakshak Plan లో ప్రతీ 3 సంవత్సరాలకి ఒకసారి శారీరక హెల్త్ చెక్ అప్ నిమిత్తం అప్లికేబుల్ డైలీ బెనిఫిట్ లో సగం అమౌంట్ మీరు పొందవచ్చు.
Health Check Up = 1/2 of ADB
11. జనరల్ వెయిటింగ్ పీరియడ్ – GWP ( General Waiting Period )
అన్ని హెల్త్ పాలసీలు మాదిరిగానే LIC Arogya Rakshak Plan లో కూడా 90 రోజులు సాధారణ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే పాలసీ తీసుకొన్న 90 రోజులు లోపు మీకు క్లెయిమ్ లభించదు, 90 రోజుల తర్వాత నుంచి క్లెయిమ్ లభిస్తుంది.
ముఖ్య గమనిక :-
• ఆక్సిడెంట్ సందర్భంలో ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ నియమం వర్తించదు. పాలసీ తీసుకొన్న 2 వ రోజుల ఆక్సిడెంట్ జరిగినా ఇమ్మీడియేట్ గా క్లెయిమ్ లభిస్తుంది.
12. ఆటో సెట్ అప్ బెనిఫిట్ – ASTB ( Auto Set Up Benefit )
ఈ బెనిఫిట్ ద్వారా ప్రతీ 3 సంవత్సరాలకి ఒకసారి 15% చొప్పున ఇనిసియల్ డైలీ బెనిఫిట్ పెరుగుతూ వస్తుంది.ఇలా పెరుగుతూ అత్యధికముగా ఇనిసియల్ డైలీ బెనిఫిట్ కి 1.5 రేట్లు వరకూ అవుతుంది.
ఈ ప్రయోజనం నిమిత్తం ఎటువంటి అదనపు ప్రీమియం ని మీరు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
Auto Set Up = IDB + increasing 15% of Every 3 Years Once.
13. నో క్లెయిమ్ బోనస్ – NCB ( No Claim Bonus )
అదృష్టవశాత్తు పాలసీదారుడు కంటిన్యూగా 3 సంవత్సరాలు పాలసి లో ఎటువంటి క్లెయిమ్ నిర్వహించనట్లయితే ఇనిసియల్ డైలీ బెనిఫిట్ లో కనీసం 5% ను పెంచడం జరుగుతుంది.
ప్రతీ 3 సంవత్సరాలకి డేట్ అఫ్ కామెన్సెమెంట్ ( DCB) సమయంలో దీనిని ఎక్స్టెండెడ్ చేస్తారు, అత్యధికముగా దీనికోసం ఎటువంటి అవది ఉండదు.
• LIC Arogya Rakshak Plan లో ప్రీమియంని ఏ విధంగా చెల్లించాలి? ( Premium Paying ?)
ఈ పాలసీలో 2 రకాలుగా ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది.
1. సంవత్సరానికి ఒకసారి – Yearly
2. 6 నెలలకు ఒకసారి – Half Yearly
ఈ విధంగా పాలసీదారుడు ఏదో ఒక పద్దతిలో నిర్ణయించుకొన్న మోడ్ ఆధారంగా ప్రీమియం చెల్లించవచ్చు.
ముఖ్య గమనిక :
ఈ ప్రీమియంని చెల్లించడానికి పాలసీదారుడు ప్రతినెలా సంస్థకు వెళ్లి చెల్లించవచ్చు.
లేదా ఆన్ లైన్లో గూగుల్ పే ( Google Pay ) ఫోన్ పే ( Phone Pay ) మరియు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ( Internet Banking ) తదితర రూపాల్లో సులువుగా చెల్లించే సదుపాయం LIC సంస్థ కల్పించింది.
. ఆక్సిడెంట్ డెత్ మరియు డిజాబిలిటీ బెనిఫిట్ రైడర్ ( Accidental Death And Disability Benefit Rider – UIN 512B209V02)
ఈ రైడర్ ను పాలసీదారుడు పాలసీసమయంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. చివరి 5 సంవత్సరాలు ఇంకా పాలసీసమయం మిగిలిఉన్నా అప్పుడు కూడా తీసుకొనే సదుపాయం ఉంటుంది.
పాలసీదారునికి 70 సంవత్సరాల వయసు వచ్చే వరకూ ఈ రైడర్ తన ప్రయోజనాన్ని అందిస్తుంది.
ఈ రైడర్ తీసుకొన్న పాలసీదారుడు ఆక్సిడెంట్ కారణంగా మరణిస్తే ప్రాథమిక భీమాకి లభించే మరణ ప్రయోజనం తోపాటు అందనంగా , మరికొంత అత్యధిక ప్రయోజనం నామినికి లభించడం జరుగుతుంది.ఇది మొదటి ప్రయోజనం.
. టర్మ్ రైడర్ ( Term Rider – UIN 512B210V01)
ఈ రైడర్ పాలసీ తీసుకొనే సమయంలో మాత్రమే తీసుకొనే సదుపాయం ఉంటుంది, మధ్యలో లభించదు.
టర్మ్ రైడర్ ముఖ్య ప్రయోజనం ఏమిటి ?
పాలసీదారుడు పాలసీ సమయంలో ఏ కారణంగా మరణించినా అంటే సాధారణంగా గాని లేదా ఆక్సిడెంట్ కారణంగా కానీ మరణిస్తే తీసుకొన్న భీమాకి సమానమైన అమౌంట్ నామినీకి అదనంగా లభిస్తుంది.
• గ్రేస్ పీరియడ్ ఉంటుందా ? ( Grace Period )
గ్రేస్ పీరియడ్ అంటే పాలసీలో ప్రీమియంని చెల్లించవలసిన తేదీలోపు చెల్లించలేనప్పటికీ అధనంగా కొద్దిగా సమయం ఉంటుంది.
ఎవరైతే ఈ పాలసీలో సంవత్సరానికి ఒకసారి, ప్రీమియం చెల్లిస్తారో వారికీ అధనంగా 30 రోజులు సమయం ఉంటుంది.
6 నెలలుకి ఒకసారి ప్రీమియం చెల్లించేవారికి 15 రోజులు ఈ గ్రేస్ పీరియడ్ ఉంటుంది.
ముఖ్య గమనిక :
ఈ సమయంలో మీరు అదనపు పెనాల్టీని సంస్థకి చెల్లించవలసిన అవసరం ఉండదు.
ఈ గ్రేస్ పీరియడ్ సమయంలో కూడా మీకు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది.
. రివైవల్ ఫెసిలిటీ – Revival Facility
ఏదైనా కారణం చేత ప్రీమియం చెల్లించకపోతే తర్వాత పాలసీని కొనసాగించడం…
• ప్రీమియం చెల్లించవలసిన సమయానికి 90 రోజులలోపు ప్లాన్ లో ప్రీమియం చెల్లిస్తే 45 రోజులు మాత్రమే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.
• ఒకవేళ ప్రీమియం చెల్లించవలసిన సమయానికి 90 రోజుల తర్వాత ప్లాన్ లో ప్రీమియం చెల్లించినట్లయితే 90 రోజులు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.
. స్పెషల్ వెయిటింగ్ పీరియడ్ – SWP ( Special Waiting Period )
LIC Arogya Rakshak Plan లో 24 రకాల వ్యాధుల ట్రీట్మెంట్ నిమిత్తం 2 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.
.మేట్యూరిటీ బెనిఫిట్ -( Maturity Benefit)
ఇది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. కాబట్టి ఇతర ప్లాన్స్ లో వలె పాలసీ సమయం ముగిసిన తర్వాత ఎటువంటి మేట్యూరిటీ అమౌంట్ లభించదు.
• పాలసీ మధ్యలో లోన్ లభిస్తుందా? లేదా? ( Loan Facility )
లభించదు.
• సరెండర్ ఫెసిలిటీ – ( Surrender Facility )
పాలసీని మధ్యలో సరెండర్ చేసే సదుపాయం ఉండదు.
• LIC Arogya Rakshak Plan లో లభించే టాక్స్ ప్రయోజనాలు ఏమిటి? ( Tax Benefits ?)
ఈ ప్రయోజనం కింద, బీమాచేసిన వ్యక్తి కి రూ. 1,50,000 వరకు ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80 (సి) ప్రకారం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి మినహాయింపు పొందటానికి అర్హులు.
• LIC Arogya Rakshak Plan ని ఎలా తీసుకోవాలి? (Apply and Documents )
ఈ పాలసీని మీరు LIC ఆఫీసియల్ వెబ్సైటు ద్వారా ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదా ఆఫ్ లైన్ ఏజెంట్ మాధ్యమంగా తీసుకొనే సదుపాయం ఉంటుంది.
• కావలసిన డాకుమెంట్స్
1. మీయొక్క పూర్తి వివరాలు నింపిన ప్రపోసల్ ఫారం.
ఈ ఫారం నెంబర్ – 300 & 340.
2. ఆధార్ కార్డు – ( Age Proof )
3. ఓటుగుర్తింపు కార్డు – ( Address Proof )
4. పాన్ కార్డు – ( KYC – Verification )
5. మెడికల్ రిపోర్ట్ – ( Health Condition )
• ముగింపు ( Conclusion )
LIC ఆరోగ్య రక్షక్ ప్లాన్ కి సంబందించిన పూర్తి సమాచారాన్ని మీకు అందించానని భావిస్తున్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ మరచినట్లైతే మన్నించి క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఈ వెబ్సైటు ద్వారా అన్ని ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు మరియు చిన్న తరహా వ్యాపారాల యొక్క వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.
This policy is covered for new diseases or existing diseases
is there any mandatory period like 2 years, 3 years or 5 years to take this policy
first of thanks to visit our blog…New & existing also covered. but every year renewal sir.
Is it covered under 80D?
yes. sir
yes sir