SBI Life Smart Wealth Builder Plan In Telugu
SBI Life Smart Wealth Builder Plan Telugu
ఎస్. బి. ఐ లైఫ్ వెల్త్ బిల్డర్ ఒక యూనిట్ లింకేడ్, నాన్ పార్టిసిపేట్ ఇన్సూరెన్స్ పాలసీ, పాలసీ మొత్తం ఇన్సూరెన్స్ కవరేజ్ లభించడంతోపాటుగా మంచి మార్కెట్ లాభాలు మెట్యూరిటీ సమయంలో పాలసీదా రునికి అందివ్వడం జరుగుతుంది.భవిష్యత్ లో లాభాలు పొందడానికి ఈ రోజే పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. తక్కువ ప్రీమియం కి ఎక్కువ రిటర్న్స్ ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు.వెల్త్ బిల్డర్ ప్లాన్ ద్వారా మీ పెట్టుబడులు వివిధ రకాలుగా వేరు వేరు మార్గల్లో పొదుపు చేసుకోవచ్చు.అత్యవసర పరిస్థితుల్లో పాక్షిక విత్ డ్రా చేసుకోవచ్చు.దీర్ఘ కాల పెట్టుబడికి అధిక లాభాలను ఈ పాలసీ ద్వారా పొందవచ్చు.
పాలసీని తీసుకొనేవిధానం :-
1. ముందుగా పాలసీ యొక్క సమయాన్ని నిర్ణయం చేసుకోవాలి.
2. ప్రీమియం పెయింగ్ పీరియడ్.
3. ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆప్షన్స్ సెలెక్ట్ చెయ్యాలి మరియు చెల్లించే ప్రీమియం కి లభించే యూనిట్స్ తెలుసుకొని ప్లాన్ లో అమౌంట్ చెల్లించవచ్చు.

ప్లాన్ ఆప్షన్స్ – Plan Options
1. సింగల్ ప్రీమియం – Single Premium
మొత్తం పాలసీ లో కేవలం ఒక్కసారే ప్రీమియం చెల్లించవచ్చు.
2. లిమిటెడ్ ప్రీమియం – Limited Premium
పాలసీ సమయం కంటే తక్కువ సమయం మాత్రమే ప్రీమియం చెల్లించేవిధంగా.
3. రెగ్యులర్ ప్రీమియం – Regular Premium
ఎంతకాలం పాలసీని తీసుకొంటే ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. మీ కన్వీనెంట్ కి అనుగుణంగా ప్లాన్ ని నిర్ణయించుకోవచ్చు.
• ఎస్. బి. ఐ లైఫ్ వెల్త్ బిల్డర్ ఫీచర్స్ – SBI Life Smart Wealth Builder Key Features
. వెల్త్ బిల్డర్ మార్కెట్ లింక్ పాలసీ, 3 రకాల ప్రీమియం ఆప్షన్స్ ని కలిగి ఉంటుంది.
. అధిక పాలసీ సమయానికి 125% గా గారెంటెడ్ అడిషనల్ బోనస్ లభించడం జరుగుతుంది.
. మొదటి 5 సంవత్సరాలు ఎటువంటి ప్రీమియం పాలసీ అడ్మినిస్ట్రేషన్ చార్జెస్ వర్తించవు.
. ఇన్వెస్ట్మెంట్ కొరకు 11 రకాల ఫండ్స్ ని కలిగి ఉంటుంది.
. పాలసీ మధ్య లో సరెండర్, పార్సియల్ విత్ డ్రాల్ వర్తిస్తాయి.
. పాలసీ యొక్క మొదటి 10 సంవత్సరాల ప్రీమియం పై ప్రీమియం ఆలోకేషన్ చార్జలు విధించడం జరగదు.
. మెట్యూరిటీ మరియు మరణ ప్రయోజనాలు అందిస్తుంది.
. ప్లాన్ యొక్క 6 వ సంవత్సరం తర్వాత భీమా ని పెంచుకోవడం లేదా తగ్గించడం చేసుకోవచ్చు.
SBI Life Wealth Builder Eligibility & Example
• ఎస్. బి. ఐ లైఫ్ వెల్త్ బిల్డర్ బెనిఫిట్స్ – Wealth Builder Benefits
మెట్యూరిటీ ప్రయోజనం – Maturity Benefit
పాలసి సమయం ముగియగానే మొత్తం ఫండ్ వేల్యూ పాలసీదారునికి మెట్యూరిటీ గా అందివ్వడం జరుగుతుంది, మధ్యలో లభించే గ్యారంటీ అడిషన్ తో కలిపి.
డెత్ బెనిఫిట్ – Death Benefit
స్కీం సమయం మధ్యలో పాలసీదారునికి రిస్క్ జరిగితే అప్పటివరకు లభించే ఫండ్ వేల్యూ లేదా చెల్లించిన ప్రీమియం కి 105% గా డెత్ బెనిఫిట్ నామినీ కి లభిస్తుంది.
భీమా – Life Cover
SBI Life Wealth Builder ప్లాన్ లో రెగ్యులర్ మరియు లిమిటెడ్ ప్లాన్ తీసుకొన్నవారికి వార్షిక ప్రీమియం కి 10 రేట్లుగా ఇన్సూరెన్స్ కవరేజ్ అందివ్వడం జరుగుతుంది, సింగిల్ ప్రీమియం చెల్లించే వారికి చెల్లించే ప్రీమియం కి 1.25 రెట్లు గా భీమా వర్తిస్తుంది.
ఉదాహరణ కి సంవత్సర ప్రీమియం లక్ష రూపాయలు అయితే 10 లక్షలు అతని యొక్క భీమా అవుతుంది.
ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆప్షన్స్ – Types Of Funds
Fund Nmae | Assets | Minimum | Maximum | Risk Profile |
Equity Fund | 1. Equity 2.Debt Funds 3. Money Mrket | 80% 00% 00% | 100% 20% 20% | High |
Top 300 Fund | 1. Equity 2. Cash & Money Market | 60% 00% | 100% 40% | High |
Equity Optimiser Fund | 1. Equity 2.Debt Funds 3. Money Mrket | 60% 00% 00% | 100% 40% 40% | High |
Growth Fund | 1. Equity 2.Debt Funds 3. Money Mrket | 40% 10% 00% | 90% 60% 40% | Medium to High |
Balanced Fund | 1. Equity 2.Debt Funds 3. Money Mrket | 40% 20% 00% | 60% 60% 40% | Medium |
Bond Fund | 1.Debt Funds 2. Money Mrket | 60% 00% | 100% 40% | Low To Medium |
Money Market Fund | 1.Debt Funds 2. Money Mrket | 00% 80% | 20% 100% | Low |
Bond Otimiser Fund | 1. Equity 2.Debt Funds 3. Money Mrket | 00% 75% 00% | 25% 100% 25% | Low To Medium |
Pure Fund | 1. Equity 2. Money Mrket | 80% 00% | 100% 20% | High |
Mid Cap Fund | 1. Equity 2.Debt Funds 3. Money Mrket | 80% 00% 00% | 100% 20% 20% | High |
Corporate Bond Fund | 1. Corporate Bonds 2. Govt Securities 3.Money Mrket | 70% 00% 00% | 100% 30% 30% | Low To Medium |
Discontinued Policy Fund | 1.Money Mrket 2. Govt Securities | 00% 60% | 40% 100% | Low |
1. ఈక్వయిటీ
2. టాప్ 300 ఫండ్
3. ఈక్వటీ ఆప్షమైసర్ ఫండ్
4. గ్రోత్ ఫండ్
5. ప్యూర్ ఫైండ్
6. మిడ్ కాప్ ఫండ్
7. బాలన్స్డ్ ఫండ్
8. బాండ్ ఆప్షమిసర్ ఫండ్
9.మనీ మార్కెట్ ఫండ్
10. కార్పొరేట్ బాండ్ ఫండ్
11. డిస్కౌంటునుడ్ పాలసీ ఫండ్
ఈ విధంగా వేరు వేరు గా ప్రీమియం ని ఇన్వెస్ట్మెంట్ చెయ్యవచ్చు.
• ఎస్. బి. ఐ వెల్త్ బిల్డర్ పాలసి అర్హతలు – Wealth Builder Eligibility
కనీస వయసు 2 సంవత్సరాల నుంచి అత్యధికముగా 55 సంవత్సరాల వయసు మధ్య కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు.
ఈ పాలసీ యొక్క సమయాన్ని కనీసం 5 సంవత్సరాలనుంచి అత్యధికముగా 30 సంవత్సరాల మధ్యలో నిర్ణయం చేసుకోవచ్చు.
కనీస మెట్యూరిటీ వయసు 18 సంవత్సరాలు, అత్యధిక మెట్యూరిటీ సమయం 70 సంవత్సరాలు.
పాలసీ విధానం – కనీస ప్రీమియం – అత్యధిక ప్రీమియం
రెగ్యులర్ – Rs 30,000/- – Rs 2,50,000/-
లిమిటెడ్ – Rs 40,000/- – Rs 2,50,000/-
సింగిల్ – Rs 65,000/- – Rs 2,50,000/-
ప్లాన్ లో ప్రీమియం చెల్లించే విధానం – PPT MODE
సింగిల్ మరియు సంవత్సరానికి ఒకసారి.
SBI life Smart future Choices In Telugu ;అవసరం వచ్చినప్పుడల్లా అడిగి తీసుకోండి
• టాక్స్ ప్రయోజనాలు – Tax Benefits
1. చెల్లించే ప్రీమియం పై 80C రూపంలో టాక్స్ డెడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
2. లభించే మెట్యూరిటీ లేదా డెత్ క్లెయిమ్ పై 10(10D) గా టాక్స్ ఫ్రీ రూపంలో అమౌంట్ పొందవచ్చు.
• గ్యారెంటెడ్ అడిషనల్ బోనస్ – Guaranteed Addition
రెగ్యులర్ ప్రీమియం విధానంలో 30 సంవత్సరాలకి పాలసీని తీసుకొంటే, 125% అఫ్ సంవత్సర ప్రీమియం రూపంలో గారెంటెడ్ అడిషన్ లభిస్తుంది. ఇది ప్లాన్ యొక్క 11 వ సంవత్సరం నుంచి ప్రారంభం అవుతుంది.
• పాక్షిక డిపాజిట్ విరమణ – ( Partial Withdrawal )
పాలసీ లో 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే 6 వ సంవత్సరం పాక్షిక విత్ డ్రాల్ చేసుకోవచ్చు.
పాక్షిక విత్ డ్రాల్ అర్హతలు :-
1. 18 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి.
2. సంవత్సరంలో ఒక పార్సియల్ విత్ డ్రాల్ ఉచితంగా నిర్వహించుకోవచ్చు, రెండవ విత్ డ్రాల్ పై Rs 100/- రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది.
3. సంవత్సరంలో అత్యధికముగా 2 సార్లు, మొత్తం పాలసీ సమయంలో అత్యధికముగా 10 సార్లు ఈ పార్సియల్ విత్ డ్రాల్ లభిస్తుంది.
4. కనీసం Rs 5,000/- లేదా అత్యధికముగా 15% ఫండ్ వేల్యూ మాత్రమే విత్ డ్రాల్ చేయవచ్చు.
ఉదాహరణ – SBI Life Smart Wealth Builder Example
పాలసీదారుని పేరు – Mr రఘు
వయసు – 35 సంవత్సరాలు
పాలసీ విధానం – రెగ్యులర్
పాలసీ సమయం – 30 సంవత్సరాలు
ప్రీమియం చెల్లింపులు – 30 సంవత్సరాలు
ప్రీమియం మోడ్ – వార్షిక చెల్లింపు
వార్షిక ప్రీమియం = Rs 50,000/-
భీమా ( 50,000 × 10) = Rs 5,00,000/-
ఇన్వెస్ట్మెంట్ ఫండ్ శాతం = 100% ఈక్వటి
ప్లాన్‌లో చెల్లించిన మొత్తం ప్రీమియం = Rs 15,00,000/-
మెట్యూరిటీ బెనిఫిట్ – Maturity Benefit
పాలసీ సమయం మధ్యలో Mr. రఘు కి ఎటువంటి రిస్క్ జరగనట్లయితే ప్లాన్ యొక్క 30 వ సంవత్సరం SBI life రిటర్న్స్ ని
4% గా డిక్లేర్ చేస్తే = Rs 21,74,877
8% గా డిక్లేర్ చేస్తే = Rs 42,95,463
రూపాయలు గా Mr. రఘు కి మెట్యూరిటీ లభిస్తుంది.ఈ అమౌంట్ ఫండ్ అభివృద్ధి పై ఆధారపడి ఉంటుంది, కాబట్టి రిటర్న్స్ అనేవి మార్కెట్ కి అనుగుణంగా లభించడం జరుగుతుంది.
మరణ ప్రయోజనం – Death Benefit
మొత్తం పాలసీ సమయంలో పాలసీదారునికి రిస్క్ జరిగినట్లయితే 10 లక్షల భీమా నగదు లేదా అప్పటివరకు ఉన్న ఫండ్ వేల్యూ రెండిటిలో ఏది ఎక్కువ ఉందో దానిని నామినీ కి లేదా రఘు కుటుంబానికి అందివ్వడం జరుగుతుంది.
• సెటిల్మెంట్ ఆప్షన్ – Settlement Option
మరణ ప్రయోజన నగదు ను నామినీ ఒక్కసారే లేదా ఇంస్టాల్మెంట్ పద్దతిలో స్వీకరించవచ్చు, కనీసం 2 నుంచి 5 సంవత్సరాల మధ్య సెటిల్మెంట్ సమయం నిర్ణయం చేసుకోవచ్చు.
వార్షిక, అర్ద వార్షిక, ట్రైమాసిక మరియు ప్రతి నెలా రూపంలో అమౌంట్ ని పొందవచ్చు.
ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చార్జీలు – Fund Management Charges
Fund Name | Fund Management Charges |
Equity Fund | 1.35% Per annum |
Top 300 Fund | 1.35% Per annum |
Equity Optimiser Fund | 1.35% Per annum |
Growth Fund | 1.35% Per annum |
Pure Fund | 1.35% Per annum |
MidCap Fund | 1.35% Per annum |
Balanced Fund | 1.25% Per annum |
Bond Fund | 1.00% Per annum |
Bond Optimiser Fund | 1.15% Per annum |
Money Market Fund | 0.25% Per annum |
Corporate Bond Fund | 1.15% Per annum |
Discountinued Policy Fund | 0.50% Per annum |
గ్రేస్ పీరియడ్ – Grace Period
ప్రీమియం చెల్లించడానికి ఆధానంగా 30 రోజులు అధిక సమయం ఉంటుంది. ఈ పీరియడ్ లో ఎటువంటి అదనపు పెనాల్టీ విధించబడదు మరియు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ వర్తిస్తుంది. 30 రోజులు సమయం దాటితే పాలసీ లాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది.
సరెండర్ ఫెసిలిటీ – Surrender Facility
SBI life Wealth Builder ప్లాన్ ని పాలసీదారుడు ఎప్పుడైనా సరే సరెండర్ చేసే సరెండర్ వేల్యూ పొందవచ్చు.
1. మొదటి 5 సంవత్సరాల లోపు పాలసీ సరెండర్ చేస్తే 4% రిటర్న్స్ మాత్రమే లభిస్తాయి మరియు మేనేజ్ చార్జెస్ వర్తిస్తాయి.
2. 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేసినట్లయితే ఫండ్ వేల్యూ ఎంతైతే అంత సరెండర్ వేల్యూ గా పాలసీదారునుకి లభిస్తుంది.
రివైవల్ ఫెసిలిటీ – Revival Of Policy
ఏదైనా కారణం చేత ఎక్కువ కాలం ప్రీమియం చెల్లించడం నిలిపివేస్తే 2 సంవత్సరాలలోపు మొత్తం ప్రీమియం పెనాల్టీతో కలిపి చెల్లించి మళ్ళీ ప్లాన్ లో కొనసాగవచ్చు.
ఫండ్ స్విచ్చింగ్ – Fund Switching
SBI life wealth Builder ప్లాన్ లో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ని మధ్యలో మార్చుకోవచ్చు.
ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధికముగా 2 సార్లు ఉచితంగా ఫండ్ స్విచ్ చేసుకోవచ్చు.
కనీస స్విచ్చింగ్ Rs 5,000/-. అదనంగా స్విచ్ చేస్తే Rs 100 రూపాయలు ఛార్జ్ వర్తిస్తుంది.
ఫ్రీ లుక్ పీరియడ్ – Free Look Period
పాలసీ యొక్క షరతులు, నియమాలపై అసంతృప్తి చెందితే బ్రాంచ్ ద్వారా పాలసీ కనుగోలు చేస్తే 15 రోజులు, ఇతర మధ్యమాల ద్వారా పాలసీని కనుగోలు చేస్తే 30 రోజులు ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది.
ఈ సమయంలో పాలసీ క్యాన్సిల్ చేసి ప్రీమియం రిటర్న్ గా పొందవచ్చు.
SBI life Smart Wealth Builder ప్రశ్నలు – జవాబులు
1. వెల్త్ బిల్డర్ ప్లాన్ లో ఈక్వయిటీ పెట్టుబడి మరియు లాభాలు ఏ విధంగా లభిస్తున్నాయి?
ఈక్వయిటీ ఫండ్ లాభాలు క్రింద విధంగా ఉన్నాయి.
చివరి 3 సంవత్సరాలు – 13.25%
చివరి 2 సంవత్సరాలు – 24.00%
క్రింద సంవత్సరం – 48.14%
6 నెలల క్రితం వరకూ – 17.83%
2. వెల్త్ బిల్డర్ ప్లాన్ లో బాండ్ ఫండ్ పెట్టుబడి మరియు లాభాలు ఏ విధంగా లభిస్తున్నాయి?
ఈక్వయిటీ ఫండ్ లాభాలు క్రింద విధంగా ఉన్నాయి.
చివరి 3 సంవత్సరాలు – 9.14%%
చివరి 2 సంవత్సరాలు – 7.07%
క్రింద సంవత్సరం – 5.22%%
6 నెలల క్రితం వరకూ – 3.71%
3. వెల్త్ బిల్డర్ ప్లాన్ లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చెయ్యడం ఎంత వరకూ మంచిది?
యులిప్ పాలసీల్లో ఒకే ప్రీమియం తో ఇన్సూరెన్స్ కవరేజ్ + గుడ్ ఇన్వెస్ట్మెంట్ ని పొందవచ్చు. స్కీం లో లభించే మెట్యూరిటీ అమౌంట్ 100% టాక్స్ రహితంగా లభిస్తుంది. మనం ఇన్వెస్ట్ చేసే ఫండ్ కి అనుగుణంగా చార్జెస్ విధించడం జరుగుతుంది. ఈ విషయంపై సరిగా ద్రుష్టి ఉంచితే మంచి లాభలూ పొందవచ్చు.
4. పాలసీని ఎంత సమయానికి తీసుకోవడం మంచిది?
ఇది మీయొక్క అవసరం పై ఆధారపడి ఉంటుంది, చాలా వరకూ ఇన్సూరెన్స్ కవరేజ్ లభించడం వల్ల అధిక సమయానికి తీసుకోవడం మంచిది.
5. SBI life smart wealth builder plan లైఫ్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం చెల్లింపు రసీదుని ఎలా జనరేట్ చేయాలి?
SBI జీవిత బీమా కోసం మొట్టమొదటి ప్రీమియం చెల్లించిన రసీదు, పాలసీ బాండ్ పంపినప్పుడు పాలసీ కిట్‌తోనే అందుతుంది.
తదుపరి ప్రీమియం చెల్లింపు రశీదులను మీరు SBI యొక్క ఆన్లైన్ పోర్టల్ నుండి పొందవచ్చు. SBI life యొక్క అఫీషియల్ వెబ్ సైట్ లో ని, లింక్‌పై క్లిక్ చేసి, మీరు మీ పాలసీ నంబర్ ను ఫీడ్ చేయగానే మరో వెబ్ పేజీ కి మళ్ళించబడతారు. ఈవిధంగా మీరు మీ పాలసీకి చెల్లించిన ప్రీమియంల వివరాలను పొందగలరు. ఇపుడు మీరు దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Also Read :-
6. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క “స్మార్ట్ వెల్త్ బిల్డర్” ఫండ్ అంటే ఏమిటి?
ఇది ఒక యూనిట్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని చెప్పవచ్చు.
మీ ఆర్థిక నిధులను సులభంగా నిర్వహించే మార్గం లో మీరు మీ డబ్బును పెట్టుబడి పెట్టారా?
రేపు ప్రయోజనాలను పొందడానికి ఈరోజు పెట్టుబడిని ప్రారంభించడానికి SBI లైఫ్ – స్మార్ట్ వెల్త్ బిల్డర్‌తో ఇదే మంచి సమయం. ఒకటి లేదా అనేక పెట్టుబడి మార్గాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మెరుగైన పెట్టుబడి అవకాశాల ప్రయోజనాన్ని పొందండి. ఒకవేళ దురదృష్టకర సంఘటన జరిగితే, మీ కుటుంబానికి జీవిత రక్షణ భద్రతను ఏర్పాటు చేయండి.
ఈ ప్లాన్ ఇలా ఉపయోగపడుతుంది.
సెక్యూరిటీ:- ఏదైనా ప్రమాదంలో మీ కుటుంబాన్ని ఆర్థికంగా రక్షించడానికి ఈ ప్లాన్ ప్రయోజనం కలిగిస్తుంది.ఈ ప్లాన్ విశ్వసనీయత తో పని చేస్తుంది.
ఫ్లెక్సిబిలిటీ:- మీకు నచ్చిన విధంగా పెట్టుబడి పెట్టిన డబ్బును నిర్వహించవచ్చు.
లిక్విడిటీ:- పాలసీ యొక్క 6 వ సంవత్సరం లేదా 18 సంవత్సరాల వయస్సు నుండి పాక్షికంగా ఉపసంహరణ(విత్ డ్రా) చేయడం.
7. మీలో ఎంత మంది SBI వెల్త్ బిల్డర్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టారు? ఈ ప్లాన్ పై మీ అభిప్రాయం ఏమిటి? మీరు దానిని సిఫార్సు చేస్తారా?
మీరు ఈ ప్లాన్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? ఇది రక్షణ కోసమా? లేక పెట్టుబడి కోసంనా?
మీరు కుటుంబ రక్షణ కోసం వెళ్తున్నట్లయితే టర్మ్ ప్లాన్ కోసం వెళ్ళండి.
మీరు పెట్టుబడి కోసం వెళ్తున్నట్లయితే మ్యూచువల్ ఫండ్ కోసం వెళ్ళండి.
యులిప్తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్ మీకు మంచి రాబడులను అందివ్వగలదు.
8. నేను 5 సంవత్సరాల క్రితం SBI లైఫ్ యొక్క వెల్త్ బిల్డర్ పథకంలో INR 5 లక్షలు పెట్టుబడి పెట్టాను. 6.5 సంవత్సరాల తర్వాత, నా తాజా ఫండ్ విలువ కేవలం INR 5.67 లక్షలు గా ఉంది. నష్టాలను నివారించడానికి నేను ఇప్పుడు కొనసాగించాలా లేదా ఉపసంహరించుకోవాలా?
మీరు ULIP లో పెట్టుబడి పెట్టారు, కావున ఇది బీమా మరియు పొదుపు కు సంబంధించిన ప్లాన్. ప్రామాణికమైన ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జీలు మాత్రమే కాకుండా పాలసీ అడ్మిన్, కేటాయింపు మరియు ఇన్‌బిల్ట్ ఇన్సూరెన్స్ కవర్ కోసం రిస్క్ ప్రీమియంల తో పాటు అధిక ఛార్జీల కారణంగా మీ రాబడులు తగ్గి ఉండవచ్చు.
9. SBI life smart wealth builder plan మంచిదేనా?
మీరు ఈ SBI life smart wealth builder ప్లాన్ 5 సంవత్సరాలు పూర్తి చేస్తే, మీరు ఈ ప్లాన్ కోసం 100% సరెండర్ విలువను పొందగలరు. ఇందులో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి.
మంచి ట్రాక్ రికార్డుతో ఉన్న మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి.
దీన్ని చురుకుగా నిర్వహిస్తూ ,కొనసాగించండి. పాలసీ ద్వారా అందుబాటులో ఉన్న ఉచిత సర్వీస్ లు మొదలైన వాటి ప్రయోజనాన్ని పొందండి. చాలా యులిప్ ప్లాన్ లు, వాటి ఛార్జీలు మొదటి 5 సంవత్సరాలకు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ఫండ్ పెరుగుదల సాధారణంగా మెరుగ్గా ఉంటుంది. అలాగే పాలసీలో చేర్చిన హామీలు మరియు పాలసీ ఫ్రీక్వెన్సీ ఉందో లేదో చెక్ చేయండి. చాలా యులిప్స్ చురుకుగా నిర్వహించబడితే మరియు 10 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం ఉంచినట్లయితే మాత్రమే ప్రయోజనకరంగా ఉంటున్నాయి.
ముగింపు – Conclusion
SBI Wealth Builder ప్లాన్ కి సంబందించిన ఇన్ఫర్మేషన్ మీకు సహాయపడుతుందని భావిస్తూ ధన్యవాదములు.
ఈ వెబ్సైటు ద్వారా అన్ని ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు మరియు చిన్న తరహా వ్యాపారాల యొక్క వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.