Care Health Insurance Plan in Telugu
Care Comprehensive Health Insurance Telugu
మన దేశంలో ఇన్సూరెన్స్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో(Insurance Claim Settlement Ratio) 95.2% తో ఆరోగ్య బీమా కంపనీ లతో పోలిస్తే మొదటి స్థానంలో ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ (Care Health Insurance) సంస్థ వుంది.(2021 ప్రకారం) అంతే కాకుండా పాలసీ తీసుకున్న వ్యక్తి కి మధ్య వర్టిత్వం లేకుండా కంపెనీ ప్రత్యక్షంగా ప్లాన్ లో హామీ ఇవ్వబడిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తుంది. ఈ కంపెనీ పరిధిలో 15000 పైగా హాస్పిటల్స్ వున్నాయి.ఈ ప్లాన్ ను 90 రోజులు దాటినా పిల్లల నుండి 60 సంవత్సరాలు దాటిన వారుకూడా తీసుకోవచ్చు.
ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో, ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైతే ఎన్ని విధాలు అమౌంట్ ఖర్చు చేయవలసిఉంటుందో అన్ని రకాలుగా ఆర్థిక పరమైన ప్రయోజనాన్ని అందివ్వడం జరుగుతుంది మరియు పిల్లల విద్యకు ఆటంకం లేకుండా సదుపాయం కల్పిస్తుంది. అన్ని రకాల అనారోగ్యాలకు మరియు మెడికల్ బిల్స్( Medical bills), స్కాన్(Scan), ఎక్స్ రే(X Rey) మొదలగు వాటితో పాటుగా అన్ని రకాల వ్యాధులకు, యాక్సిడెంట్స్ కు ట్రీట్మెంట్, రూం రెంట్(Room Rent),సంవత్సరానికి ఒకసారి అంబులెన్స్ (Ambulance) చార్జెస్, వేరు వేరు అనారోగ్యాలకు ట్రీట్మెంట్, ప్రీమియం పై రిబేటు (Discount), డే కేర్ ట్రీట్మెంట్ ( Day Care Treatment), మొదలైన సదుపాయాలు ఈ ప్లాన్ లో కల్పించారు.
ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ప్లాన్ ను 2 రకాలు గా తీసుకోవచ్చు.
1)ఫ్యామిలీ ఫ్లూటర్ ప్లాన్(Family Flouter Plan):
కనీస వయసు:18 సంవత్సరాలు
గరిష్ట వయసు:65 సంవత్సరాలు
చిల్డ్రన్ కనీస వయసు:91 రోజులు.
2) వ్యక్తిగతమైన(Individual):
ప్రవేశ వయసు:5 సంవత్సరాలు
కనీస ప్రాథమిక బీమా: 3 Lak,
అధిక బీమా:. 75 Lak.
ఈ కేర్ హెల్త్ ప్లాన్ లో పాలసీ పీరియడ్ ను 1 లేదా 2 లేదా 3 సంవత్సరాలుగా… రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి.
ఇతర బీమా కంపెనీలతో పోలిస్తే ఈ బీమా కంపెనీలో 18 – 35 సంవత్సరాల వారికి తక్కువ ప్రీమియం ఉంటుంది.
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ( Care Health Insurance Benefits):
హాస్పటల్ రూం రెంట్ (hospital room rent):
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ (Care Health Insurance) ప్లాన్ తీసుకున్న వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరితే 3Lak నుండి 4 Lak బీమా తీసుకున్న వారికి 1% ప్రాథమిక బీమా పై, 5 Lak నుండి 10 Lak తీసుకున్నవారికి సింగిల్ ప్రైవేట్ రూం రెంట్(Room Rent) మరియు 10 Lak పైనుండి నుండి బీమా తీసుకున్నవారికి ఎంతైనా కంపెనీ చెల్లిస్తుంది.
ప్రీ హాస్పిటలైజేషన్ ( pre Hospitalization):
పాలసీ దారుడు అనారోగ్య నిమిత్తం ముందు చేయించుకునే స్కాన్(స్కాన్), బ్లడ్ టెస్ట్(Blood Test), X Ray మొదలైన వాటికి కంపెనీ తో నేరుగా బిల్ క్లైమ్ చేయవచ్చు. ఈ సౌకర్యం వైద్యానికి 30(Days) రోజుల ముందు బిల్స్ మాత్రమే క్లైమ్ చేస్తుంది.
పోస్ట్ హాస్పిటలైజేషన్ (post Hospitalization):
పాలసీ దారుడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ (Discharge) అయిన 60 (Days)రోజులు వరకు అవసరమైన మెడికల్ బిల్స్ ను క్లైమ్ చేయవచ్చు.
డే కేర్ ట్రీట్మెంట్ క్లైమ్(Day Care Treatment Also Claimed):
ఒక రోజు మాత్రమే చేయించుకునే ట్రీట్మెంట్స్ కి హాస్పటల్ కి వెళ్లకుండా ఇంటిదగ్గర వుండి చేయించుకునే సదుపాయం ఉంది.
ఐ సి యూ చార్జెస్(ICU Charges):
3 Lak to 4 Lak పాలసీ తీసుకున్నవారికి ప్రాథమిక బీమా పై 2 % అమౌంట్ ను మరియు 5 Lak లేదా అంతకంటే ఎక్కువ బీమా తీసుకున్న వారికి ఐ సి యూ చార్జెస్ ఎంతైనా సరే కంపనీ భరిస్తుంది.
ఆర్గాన్ డోనార్ కవర్(Organ Donor Cover):
అవయవం దానం చేసే వ్యక్తి కి అయ్యే ఖర్చును కూడా కంపనీ చెల్లిస్తుంది. తీసుకున్న బీమా కు అనుగుణంగా అమౌంట్ ను చెల్లించడం జరుగుతుంది.
3 Lak to 4 Lak తీసుకున్న వారికి Rs –50000
5 Lak to 10 Lak తీసుకున్నవారికి Rs –100000
15Lak to 40 Lak తీసుకున్నవారికి Rs-200000
50 Lak to 75 Lak తీసుకున్నవారికి Rs-300000
ఈ విధంగా నిర్ధారించడం జరిగింది.
డాక్టర్ ఫీజ్ (Doctor Fees):
డాక్టర్ ఫీజ్ మొత్తం కంపనీ నుండి క్లైమ్ చేసుకోవచ్చు.
మెటర్నిటీ కవర్(Maternity Cover):
గర్భిణీ స్త్రీలకు 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ వుంటుంది. 2 సంవత్సరాల తరువాత 1 Lakh వరకు మెటర్నిటీ కవర్(Maternity Cover) లభిస్తుంది ఈ ప్రయోజనం కేవలం 50 Lak to 75 Lak మధ్య ప్రాథమిక బీమా తీసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది.
పిల్లల విద్యాభ్యాసం(Children Education):
తల్లీదండ్రులకు ఏదైనా రిస్క్ జరిగితే పిల్లలు విద్యాభ్యాసానికి ఆటంకం రాకుండా ఈ కేర్ హెల్త్ బీమా కంపనీ పిల్లల యొక్క విద్యకు బరోసా ను అందిస్తుంది.
పాలసీ దారుడు తీసుకున్న బీమా లో 10% చిల్డ్రన్ చదువుకి కేటాయించబడింది.
అంబులెన్స్ ఛార్జ్ (Ambulance Charges):
కొన్ని అత్యవసర సందర్భాలలో హాస్పిటల్ కి వెళ్ళడానికి అంబులెన్స్ అవసరం అవుతుంది. దీన్ని దృష్టిలో వుంచుకొని 4 Lak బీమా ను తీసుకున్నవారికి Rs- 1500, 5 Lac to 10 Lac- Rs 2000,
15 Lac to 40 Lac – Rs – 2500,
50 Lac to 75 Lac – Rs – 3000 ఇస్తారు.
డొమిసిలియరీ హాస్పిటలైజేషన్(Domiciliary Hospitalization):
హాస్పిటల్లో బెడ్స్ కాలి లేకపోయినా , ఇతర ఏ కారణాల వల్ల అయిన డాక్టర్ ఇంటి వద్దనే చికిత్స చేయడానికి సిద్ధపడిన కంపెనీ అమౌంట్ నీ ఇస్తుంది.
ALSO READ
రిబేట్ (Discount):
ఈ పాలసీ నీ ఒకేసారి 3 సంవత్సరాలకు తీసుకోవడం వల్ల వారు కట్టే ప్రీమియం పై 20% రిబేటు (Discount) ఇవ్వబడుతుంది.
నాన్ అల్లోపతి ట్రీట్మెంట్(Non Allopathy Treatment):
ఇంగ్లీష్ హాస్పటల్ మరియు ఇతర హాస్పిటల్స్ అనగా ఆయుర్వేదిక్(Ayurvedhic), హలోపతి(Allopathy), యునాని(Unani), సిద్ధ (Siddha) వంటి ప్రభుత్వం చే ఆమోదించబడిన వాటిలో కూడా ట్రీట్మెంట్ కొరకు ప్రయత్నించవచ్చు.
నో క్లైమ్ బోనస్ అప్ టు 150% ఆఫ్ భీమా( No Claim Bonus up to 150% of BSA):
ఈ ప్లాన్ తీసుకున్న పీరియడ్ లోపు మీరు ఏటువంటి అనారోగ్యానికి గురి కానట్లయితే మీరు మళ్ళీ పాలసీ నీ రెన్యువల్ చేయించుకునే సమయంలో 10% నో క్లైమ్ బోనస్ లభిస్తుంది అంటే మీరు చెల్లించే ప్రీమియం మారదు కానీ ప్రాథమిక బీమా అమౌంట్ పెరుగుతుంది.
వెయిటింగ్ పీరియడ్ (Waiting period):
ప్లాన్ తీసుకున్న మొదటి 30(Days) రోజుల లోపు పాలసీ దారుడికి ఏ అనారోగ్యానికి కంపనీ భాధ్యత వహించదు. 30 రోజుల తరువాత నుండి కంపెనీ ప్రత్యక్షంగా భాధ్యత వహిస్తుంది. ఒక వేళ పాలసీ తీసుకున్న వెంటనే యాక్సిడెంట్ జరిగితే పాలసీ యొక్క నియమాలు యధావిధిగా వర్తిస్తాయి.
కోవిడ్ కవరేజ్(Covid Coverage):
ప్రస్తుతం దేశం లో కరోనా(Covid) తీవ్రత అధికంగా ఉండడం వల్ల కరోనా బారిన పడ్డ వారికి కూడా ఈ ప్లాన్ లో ట్రీట్మెంట్ ను అందిస్తున్నారు అయితే ప్లాన్ తీసుకున్న 15 రోజుల తరువాత నుండి ఈ ప్రయోజనం మనం పొందవచ్చును.
ప్రీ ఎక్సిస్టింగ్ డీసిజ్స్ (Pre Existing Dieceses):
ఒక వ్యక్తి పాలసీ తీసుకోవడానికి ముందు ఏ రకమైన వ్యాధి తో వున్నప్పటికీ వాటి ట్రీట్మెంట్ కొరకు 48 నెలలు(Months) తరువాత మాత్రమే ట్రీట్మెంట్ (Treatment) ను ఈ ప్లాన్ ద్వారా చేయించుకోవచ్చు.
స్పెషల్ వెయిటింగ్ పీరియడ్ (Special waiting Period):
ఈ ఆప్షన్ ద్వారా, ఈ ప్లాన్ తీసుకోవడానికి ముందు వున్న వ్యాధి కి ట్రీట్మెంట్ 24 నెలల(Months) తర్వాత చేయించుకోవచ్చు.
ఉదాహరణ: Bp, Sugar, Cataract, Piles, Gastic, Kidney Stones, ENT, Joint Replacement…
రీస్టోరేషన్ ఆఫ్ ప్రాథమిక బీమా (Restoration of Sum Assured):
మీరు తీసుకున్న ప్రాథమిక బీమా అమౌంట్ కంటే తక్కువ అమౌంట్ తో ట్రీట్మెంట్ జరిగితే మీరు లేదా వేరే వ్యక్తి అదే ప్లాన్ పీరియడ్ లోపు మరలా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
ఉదాహరణ: మీరు 10 Lak పాలసీ తీసుకున్నట్లయితే మీకు అనారోగ్య నిమిత్తం 7 Lak అయింది అనుకుందాము. ఈ సందర్భంలో బీమా రీస్టోరేషన్ చేయబడుతుంది. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు గానీ మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు.
ఆటోమేటిక్ రీస్టోరేషన్ (Automatic Restoration):
పాలసీ తీసుకున్న పీరియడ్ లోపు ఒకరకమైన వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదే పాలసీ సమయం లో వేరే వ్యాధికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అదే ప్రీమియం తో పాలసీ నీ పునరుద్దరణ చేయవచ్చు.
సూపర్ రీస్టోరేషన్ (super Restoration):
కేవలం ఒకసారి మాత్రమే అనారోగ్యానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అయితే 2 వ సారి అదే అనారోగ్యానికి ట్రీట్మెంట్ కోసం ఈ సూపర్ రీస్టోరేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
అడిషనల్ ఆప్షనల్ కవరేజ్ (Additional Optional Coverage):
1) క్యాష్ ఫెసిలిటీ (Cash Facility):
హాస్పటల్ లో ట్రీట్మెంట్ కోసం జాయిన్ (Join) అయిన పాలసీ దారుడుకి రోజుకి 500 రూపాయలు పాలసీ తీసుకున్న వ్యక్తికి 5 రోజుల వరకు అందజేయబడుతుంది. అవసరమైన ఇతర ఖర్చులు చెల్లిస్తారు.
సెకండ్ ఆప్షన్ ఫెసిలిటీ(Second Option Facility):
ఒక డాక్టర్ మన వ్యాధికి సంబంధించిన రిపోర్ట్స్ (Reports) ను ఇచ్చినప్పుడు మనం వేరే డాక్టర్ దగ్గరకు కు వెళ్లి మళ్ళీ చూపించుకునే ఆప్షన్ అందుబాటులో వుంది.
ఉచిత ఆరోగ్య నిర్ధారణ పరీక్ష సదుపాయం (Free Health Check Up Facility):
బీమా తీసుకున్న వ్యక్తి ప్రతీ సంవత్సరం ఉచితంగా ఆరోగ్య నిర్ధారణ పరీక్ష ను నిర్వహిస్తారు.
ఈ ఫ్రీ హెల్త్ చెకప్ లో ..
లివర్ ఫంక్షన్ టెస్ట్(Liver Function Test),
కిడ్నీ ఫంక్షన్ టెస్ట్(Kidney Function Test),
లంగ్ ఫంక్షన్ మార్కర్ (Lung Function Markers),
కార్డియో మార్కర్ (cardio Markers),
(Imaging Test),
డయాబెటీస్ మార్కర్ (Diabetes Markers)…
https://www.careinsurance.com/
3 రకాల రకాల రైడర్స్(Riders) సదుపాయం అందివ్వడం జరిగింది.
A) నో క్లైమ్ బోనస్ సూపర్(No Claim Bonus Super):
సాధారణంగా నో క్లైమ్ బోనస్ 10% వస్తుంది కాని ఈ నో క్లైమ్ బోనస్ సూపర్ రైడర్ ను సెలెక్ట్ చేసుకుంటే తరువాత సంవత్సరం ప్లాన్ ను రెన్యువల్ చేయించుకున్నప్పుడు కంపనీ 60% నో క్లైమ్ బోనస్ ఇస్తుంది. 2 వ సంవత్సరం కూడా నో క్లైమ్ బోనస్ 60% ఇస్తుంది అలాగే 3 వ సంవత్సరం 10% , 4 వ సంవత్సరం 10% చొప్పున 150% నో క్లైమ్ బోనస్ కంపనీ అందిస్తుంది.
B)గ్లోబల్ కవరేజ్(Global Coverage):
పెద్ద పెద్ద అనారోగ్యాలు కు ట్రీట్మెంట్ ను ఒక్క అమెరికా తప్ప ఏ దేశం లోనైన తీసుకోవచ్చు. దీనికి 10% కో పేమెంట్ వుంటుంది అంటే మొత్తం బిల్ అమౌంట్ లో 10% అమౌంట్ ను పాలసీ దారుడు చెల్లించాలి. మిగతా 90% అమౌంట్ ను కంపనీ చెల్లిస్తుంది.
C)కో- పేమెంట్ ( Co-Payment):
ఈ సదుపాయం ద్వారా 60 లేదా అంతకన్నా ఎక్కువ వయసు కల్గిన వ్యక్తి కి ట్రీట్మెంట్ నిమిత్తం 20% అమౌంట్ మాత్రమే పాలసీ తీసుకున్న వ్యక్తి చెల్లిస్తారు మిగిలిన 80% అమౌంట్ ను కంపెనీ మనకు అంధిస్తుంది.
టాక్స్ బెనిఫిట్స్(Tax Benefit):
అండర్ సెక్షన్ (Under Section) 80d ఈ ప్లాన్ లో వర్తిస్తుంది.
ఫ్రీ లుక్ పీరియడ్ (Free Look Period):
ఈ ప్లాన్ తీసుకున్న వ్యక్తి ప్లాన్ లో షరతులు పై సంతృప్తి చెందకపోతే చార్జెస్ మరియు పెనాల్టీ చెల్లించకుండా తను కట్టిన ప్రీమియం ను కొన్ని రోజుల వ్యవధిలోనే పొంది ప్లాన్ ముగించవచ్చును. దీనికి ఫ్రీ లుక్ పీరియడ్ 15 రోజులుగా నిర్ధారించారు.