HDFC Click 2 Protect 3D Plus plan
HDFC Click 2 Protect 3D Plus plan in Telugu
హెచ్ డి ఎఫ్ సి(HDFC) కంపనీ విడుదల చేసిన వివిధ రకాల ప్లాన్ లలో ఈ HDFC click 2 protect 3D plus plan లో తక్కువ ప్రీమియం తో ఎక్కువ ప్రయోజనం(మంత్లీ ప్రీమియం సుమారుగా 510 Rs తో కోటి బీమా) పొందవచ్చును. ఈ బీమా వ్యక్తి ఆరోగ్య భద్రతను మరియు కుటుంబ ఆర్థిక భద్రతలో ను ప్రముఖ పాత్ర వహిస్తుంది. 34 రకాల వ్యాధులను ఈ ప్లాన్ లో గుర్తించడం జరిగింది.
ఇది టర్మ్ ప్లాన్, నాన్ లింక్డ్ ప్లాన్ అంటే పెట్టుబడి పెట్టే కంపెనీలలో, స్టాక్ మార్కెట్ తో ఏ సంబంధము వుండదు. ఈ ప్లాన్ లో హోల్ లైఫ్ ప్రొటెక్షన్ (Whole life Protection), మంత్లీ ఇన్కమ్, క్రిటికల్ ఇల్నేస్స్ కి గురైతే ప్రీమియం మాఫీ, చెల్లించిన మొత్తం ప్రీమియం ను ప్లాన్ చివరిలో పొందడం మొదలైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్రయోజనాలను, ఈ ప్లాన్ అందించే 9 రకాల ఆప్షన్ లలో, మనం సంపాదించే జీతం ఆధారంగా ఈ ఆప్షన్ లలో ఏదో ఒక ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చును.
3D – అంటే డెత్(Death), డిసభిలిటి (Disability), డిసీజ్(Disease).
ఇప్పుడు ప్లాన్ లో వున్న 9 రకాల ఆప్షన్ లను వివరంగా తెలుసుకుందాము.
1) లైఫ్ కవర్ ఇన్సూరెన్స్ (Life Cover Insurance):
ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకోవడం ద్వారా, బీమా సమయం లోపు వ్యక్తికి డెత్, టెర్మినల్ ఇల్నేస్ సంభవిస్తే బీమా అమౌంట్ కోటి రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. తరువాత ప్లాన్ ముగించబడుతుంది.ఒకవేళ యాక్సిడెంట్ జరిగి డిసభిలిటీ(Disability) కి గురైతే భవిష్యత్తు ప్రీమియం కంపనీ చెల్లిస్తుంది. నిర్ధారించుకున్న పాలసీ సమయం వరకు ప్లాన్ అమలులో వుంటుంది.
Ex:1 పాలసీ దారుడు ప్రమాదానికి గురైతే నామినీ కి కోటి రూపాయలు లభిస్తాయి ప్లాన్ క్లోజ్ చేస్తారు.
Ex:2 యాక్సిడెంట్ జరిగి టోటల్ పర్మినెంట్ డిసభిలిటీ కి గురైతే ప్రీమియం మాఫీ జరుగుతుంది.
టెర్మినల్ ఇల్నేస్ (Terminal Illness):
పాలసీ తీసుకున్న వ్యక్తికి యాక్సిడెంట్ జరిగి కొన్ని రోజులలో మరణిస్తాడు అన్న సందర్భంలో టెర్మినల్ ఇల్నేస్ పదాన్ని వాడతారు.
డిసభిలిటీ(Disability):
పాలసీ దారుడుకి యాక్సిడెంట్ జరిగినప్పుడు అవయవాలను కోల్పోయి జీవితాంతం ఏ పని చేయలేని స్థితిలో వుంటే డిసభిలిటీ కి గురైయ్యాడు అంటారు.
2) 3D లైఫ్ ఇన్సూరెన్స్ (3D Life Insurance):
ఆప్షన్ 1 లో లభించే అన్ని ప్రయోజనాలు మరియు డెత్,డిసభిలిటీ,డిసీజ్ లను కవర్ చేస్తుంది. క్రిటికల్ ఇల్నేస్ కి కూడా ఈ ఆప్షన్ లో ప్రొటెక్ట్ చేయబడుతుంది.
క్యాన్సర్(Cancer), హార్ట్ ఎటాక్ (Heart attack)… వంటి 34 పెద్ద అనారోగ్య సమస్యలకు గురైతే మొత్తం ప్రీమియం కంపనీ చెల్లిస్తుంది.
3)అదనపు జీవిత బీమా(Extra Life Insurance):
ఆప్షన్ 1 తోపాటు యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ కూడా ఈ ఆప్షన్ లో కలిపి వుంటుంది. ఈ రైడర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి.
Ex: ఈ HDFC click 2 protect 3D plus తీసుకున్న వ్యక్తి యాక్సిడెంట్ జరిగి మరణిస్తే బీమా అమౌంట్ కోటి రూపాయలు మరియు యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ ను ఎంత అమౌంట్ కి తీసుకుంటామో ఆ అమౌంట్ కూడా వస్తుంది.
50 లక్షల యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ సెలెక్ట్ చేసుకుంటే: ప్రాథమిక బీమా – కోటి రూపాయల+50 లక్షలు మొత్తం Rs -15,000,000 నామినీకి లభిస్తాయి.
4) లైఫ్ ఇన్సూరెన్స్+ మంత్లీ ఇన్కమ్(Life Insurance+ Monthly Income):
ఆప్షన్ 1 బెనిఫిట్స్ మరియు ప్రతీ నెల మంత్లీ ఇన్కమ్ రూపంలో రెగ్యులర్ అమౌంట్ అనేది వచ్చే 10 సంవత్సరాలు లభిస్తాయి. అంతే కాకుండా ఈ మంత్లీ ఇన్కమ్ ప్రతీ సంవత్సరం 10% చొప్పున పెరుగుతుంది.
Ex: 20 సంవత్సరాల పాలసీ సమయంలో 10 సంవత్సరంలో పాలసీ దారుడు మరణిస్తే వెంటనే ప్రాథమిక బీమా కోటి రూపాయలు మరియు మంత్లీ ఇన్కమ్ రూపంలో Rs – 1,00,000 నామినీకి లభిస్తాయి. ఈ మంత్లీ ఇన్కమ్ ప్రతీ సంవత్సరం 10% ఇంక్రీజ్ అవుతుంది.
5)అదనపు జీవిత ఆదాయ బీమా(Extra Life Income Insurance):
ఆప్షన్ 4 మరియు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ కలిపి పాలసీ తీసుకున్న వ్యక్తికి ఈ ఆప్షన్ ద్వారా వర్తిస్తాయి.
యాక్సిడెంట్ సంభవించి డెత్ అయినా లేదా పర్మినెంట్ డిసభిలిటీ కి గురైనా ప్రీమియం మాఫీ చేస్తారు. నామినీకి బీమా అమౌంట్ + డెత్ బెనిఫిట్ లభిస్తాయి.
Ex: Mr. రాము బీమా – 50 లక్షలు, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ – 50 లక్షలు గా పాలసీ పీరియడ్ ను 30 సంవత్సరాలు గా నిర్ణయించుకున్నాడు. ఇన్కమ్ పీరియడ్ 10 సంవత్సరాలు.
అతని సంవత్సర ఆదాయం –5 లక్షలు.
యాక్సిడెంట్ లో అతను మరణిస్తే ప్రాథమిక బీమా 50 లక్షలు + యాక్సిడెంటల్ రైడర్ 50 లక్షలు మొత్తం కోటి రూపాయలు మరియు మంత్లీ ఇన్కమ్ రూపంలో 41,667 అదనంగా 41,667 రూపాయలు గా ప్రతీ నెల Rs 83,334 రూపాయలు స్థిరంగా లభిస్తాయి. ఇక్కడ యాక్సిడెంటల్ డెత్ జరిగింది కాబట్టి రెట్టింపు అమౌంట్ రావడం జరిగింది. ఇది 50 లక్షల పాలసీ తీసుకున్నవారికి.
6) ఇన్కమ్ రీప్లేస్మెంట్ (Income Replacement):
ఇన్కమ్ రీప్లేస్మెంట్ అంటే మనం సంపాదించే జీతానికి సమానంగా ఇన్కమ్ లభిస్తుంది.
Ex: రాజు సంవత్సర ఆదాయం 6 లాక్, పాలసీ పీరియడ్ –20 సం// లు, ప్రీమియం పేమెంట్ –15 సం//,
ఇంక్రిజ్ ఇన్కమ్ ను సెలెక్ట్ చేసుకున్నాడు అనుకుంటే:
ప్లాన్ యొక్క 5 వ సం// డెత్ సంభవిస్తే
సంవత్సర ఆదాయం 6 లక్షలు లభిస్తాయి దీనితో పాటుగా రెగ్యులర్ ఇన్కమ్ 10 సం// లు, 10% ఇంక్రీజ అవుతూ లభిస్తాయి.
Ex: మొదటి సంవత్సరం = Rs – 50000,
2 వ సంత్సరం =. Rs -55000.
7) రిటర్న్ ఆఫ్ టోటల్ ప్రీమియం (Return of Total Premium):
పాలసీ సమయం పూర్తి అయిన తరువాత వ్యక్తి జీవించి వుంటే తను చెల్లించిన ప్రీమియం మొత్తం ను వాపసు చేస్తారు. ఒకవేళ పాలసీ సమయం లోపు పాలసీ దారుడు మరణిస్తే ప్రాథమిక బీమా నామినీ కి అందిస్తారు.
8)లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్(Life Long Protection):
HDFC Click 2 Protect 3D Plus plan లో ఈ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే 100 సంవత్సరాల వరకు భద్రతను అంధిస్తుంది. ఇందులో ప్రీమియం ను 65-పాలసీ తీసుకున్న వ్యక్తి వయసు గా చెల్లించాలి.
Ex: రాము వయసు 30 సంవత్సరాలు
65-30= 35. అంటే 35 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలి అప్పుడు లైఫ్ టైం ప్రొటెక్షన్ లభిస్తుంది.
Ex: రాజు వయసు 35 సంవత్సరాలు, కోటి రూపాయల బీమా తీసుకుని, ఆప్షన్ 8 సెలెక్ట్ చేసుకున్నాడు అనుకుంటే :- 65-35=30
30 సంవత్సరాల లోపు పర్మినెంట్ డిసభిలిటీ కి గురైతే ప్రీమియం మాఫీ లేదా డెత్ అయితే నామినీకి కోటి రూపాయలు లభిస్తాయి. పాలసీ తీసుకునే వ్యక్తికి ఈ ఆప్షన్ 8 లో వయసు పరిమితి నిర్ధారించలేదు.
9) 3D లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ (3D Life Long Protection):
ఆప్షన్ 8 వర్తిస్తుంది. ప్లాన్ తీసుకున్న వ్యక్తికి ప్రీమియం వేవైర్ బెనిఫిట్ కేవలం ఆప్షన్ 8 లో యాక్సిడెంటల్ డిసభిలిటీ కి మాత్రమే వర్తిస్తుంది కానీ ఇందులో యాక్సిడెంటల్ డిసభిలిటీ కి మరియు క్రిటికల్ ఇల్నెస్ కి గురైనా ప్రీమియం మాఫీ చేస్తారు. పాలసీ దారుడు ఎప్పుడు మరణించినా నామినీకి కోటి రూపాయలు ఇస్తారు.
పాలసీ తీసుకుంటున్నప్పుడు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ను ప్లాన్ చివరి వరకు మార్పు చేయడం కుదరదు అందువల్ల ప్లాన్ మొదటిలోనే ఆలోచించి తీసుకోవాలి.
HDFC Click 2 అర్హతలు(Eligibility):
కనీస వయసు – 18 సం//
గరిష్ట వయసు – 65 సం//
అత్యల్ప పాలసీ టర్మ్ –5 సం//
అధిక పాలసీ టర్మ్ – 50 సం//
ఆప్షన్ 8 & 9 లకు పాలసీ టర్మ్ లైఫ్ టైం(పరిమితి లేదు) వుంటుంది.
ALSO READ
Max life Smart Secure Plus Plan in Telugu ;అద్భుతమైన పాలసీ 100% ప్రీమియం రిటర్న్ ;
LIC Jeevan Mangal Plan Telugu ; సామాన్యులకి అద్భుతమైన పధకం వివరాలు ఇవే!
ABSLI Life Shield Plan ; 8 రకాలుగా కుటుంబానికి రక్షణ అందివ్వండి,Benefits,Features ; Premium Check
ప్రీమియం పేయింగ్ (Premium Paying Term):
ప్రీమియం పేయింగ్స్ 3 రకాలు:
రెగ్యులర్(Regular),
సింగిల్ (Single),
లిమిటెడ్ (Limited).
ప్రీమియం పేయింగ్ మోడ్ (Premium Paying Mode):
పాలసీ దారుణికి తన వీలును బట్టి ప్రీమియం ను చెల్లించవచ్చు. అవి
సంవత్సరానికి, అర్ధ సంవత్సరానికి, క్వార్టర్లీ మరియు నెలకు ఒకసారి.
కనీస ప్రాథమిక బీమా – 10 లక్షలు,
గరిష్ట ప్రాథమిక బీమా – పరిమితి లేదు(No limit).
కనీస మెచ్యురిటీ – 23 సం//
గరిష్ట మెచ్యురిటీ – 75 సం//
8,9 ఆప్షన్ నిర్ణయించుకున్న వారికి లైఫ్ టైమ్ బీమా వర్తిసుంది.
గ్రేస్ పీరియడ్ (Grace Period):
ఈ ప్లాన్ లో ప్రీమియం ను చెల్లించవలసిన తేదీ నుండి కొన్ని రోజులు అదనంగా ఎటువంటి పెనాల్టీ లేకుండా కేవలం ప్రీమియం ను మాత్రమే చెల్లించడానికి గడువు వుంటుంది దీన్నే గ్రేస్ పీరియడ్ అంటారు. ఇది
సంవత్సరానికి, అర్ధ సంవత్సరానికి, క్వార్టర్లీ ప్రీమియం చెల్లించే వారికి 30(Days) రోజులు మరియు నెలకు చెల్లించే వారికి 15(Days) రోజులు.
ఫ్రీ లుక్ పీరియడ్ (Free look period):
పాలసీ తీసుకున్న తరువాత పాలసీ లోని నిబంధనలు మీకు సానుకూలంగా లేకపోతే 30 రోజుల లోపు ప్లాన్ క్లోజ్ చేసి ప్రీమియం ను పొందవచ్చు. ఎటువంటి చార్జెస్ వుండవు.
టాక్స్ బెనిఫిట్(Tax Benefit):
ప్లాన్ లో అండర్ సెక్షన్ 80C ద్వారా ప్రతి సంవత్సరం 1,50,000 రూపాయలు వరకు టాక్స్ డిడక్షన్ (Tax Didaction) మరియు 10D ప్రకారం పొందే మెచ్యూరిటీ పై పన్నుంచెల్లించవలసిన అవసరం లేదు.
సరెండర్ (Surrender):
సింగిల్ & లిమిటెడ్ ప్రీమియం చెల్లించేవారు కొద్ది కాలం తరువాత ప్లాన్ సరెండర్ చేసి చెల్లించిన ప్రీమియం ను పొందవచ్చు కానీ చార్జెస్ రూపంలో ఎక్కువ అమౌంట్ పోతుంది.
రివైవల్ (Revival):
పాలసీ తీసుకున్న తరువాత 2 సంవత్సరాలు ప్రీమియం చెల్లించకపోతే ప్లాన్ క్లోజ్ అవుతుంది. మీరు కొనసాగించాలి అనుకుంటే 2 సంవత్సరాల ప్రీమియం ను పెనాల్టీ తో చెల్లించి ప్లాన్ ను తిరిగి కొనసాగించవచ్చు.