LIC Jeevan Tarun Plan Details in Telugu
LIC Jeevan Tarun 834 “Best Children Plan”
ప్రస్తుత సమాజంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కు నాన్యమైన విద్యను అందించడం తో పాటు వివాహాన్ని జరిపించడం చాలా ముఖ్యం గా భావిస్తారు. పిల్లల యొక్క విద్యకు మరియు వివాహానికి తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా కేవలం పిల్లల యొక్క విద్య మరియు వివాహ సందర్భాలను ఆర్థికంగా సులభతరం చేయడానికి LIC బరోసా ఇస్తూ ఒక బీమా ను ప్రారంబించింది అదే ఎల్. ఐ. సి జీవన్ తరుణ్ (LIC Jeevan Tarun 834 “Best Children Plan”). ఈ ప్లాన్ లో పిల్లలకు 20 సంవత్సరాలు వచ్చేంత వరకు మాత్రమే ప్రీమియం చెల్లిస్తారు. ఆ తరువాత 24 వ సంవత్సరం వరకు ప్రతీ సంవత్సరం సర్వైవల్ బెనిఫిట్ (Survival Benefit) రూపంలో లక్ష రూపాయలు లభిస్తాయి మరియు 25 వ సంవత్సరం మెచ్యూరిటీ (అనగా ప్లాన్ యొక్క చివరి సంవత్సరం 16 లక్షల 85 వేల రూపాయలు) లభిస్తాయి.
ఈ ఎల్. ఐ. సి జీవన్ తరుణ్ బీమా లో సర్వైవల్ బెనిఫిట్ ఏ విధంగా లభిస్తుంది, వయసు పరిమితులు, ఇతర ప్రయోజనాలు, ప్రీమియం తీసుకున్న వ్యక్తి ప్రమాదానికి గురైతే ఏమి చేయాలి, వివరంగా తెలుసుకుందాము.
A)ఇది ఒక నాన్ లింక్డ్ మరియు నాన్ పార్టిసిపేట్ ప్లాన్,పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్ స్కీం,
B) లిమిటెడ్ ప్రీమియం(Limited premium) అంటే మీరు కొంత కాలం పరిమితి వరకే ప్రీమియం చెల్లిస్తారు.
C) లోన్ సదుపాయం(Loan facility),
D)సర్వైవల్ బెనిఫిట్ (Survival Benefit) మరియు మెచ్యూరిటీ బెనిఫిట్ ను ఏ ఆప్షన్ లను సెలెక్ట్ చేసుకుంటే పొందవచ్చు.
ఈ ప్లాన్ లో 4 ఆప్షన్ల ను అందుబాటులో వున్నాయి వాటిని క్రింద ఉదాహరణతో చూద్దాం.
అర్హతలు(Eligibility):
కనీస వయసు – 90 రోజులు(3 నెలలు)
గరిష్ట వయసు – 12 సంవత్సరాలు
పాలసీ టర్మ్ ( Policy Term): 25 సంవత్సరాలు – చిల్డ్రన్ వయసు గా వుంటుంది.
Ex: వయసు 5 సంవత్సరాలు అనుకుంటే 25-5= 20 సంవత్సరాలు,
వయసు 8 సం// అనుకుంటే 25-8=17 సం//.
గరిష్ట మెచ్యూరిటీ వయసు – 25 సం//.
ప్రీమియం పీరియడ్(Premium Period):
20 – చిల్డ్రన్ వయసు గా వుంటుంది.
Ex: వయసు 5 సం// అయితే 20-5=15 సం//
వయసు 10 సం// అయితే 20-10=10 సం//.
కనీస ప్రాథమిక బీమా: Rs 75000
అత్యధికంగా ఎంతైనా తీసుకోవచ్చు.
ఈ ప్లాన్ లో 4 ఆప్షన్స్ ను ఉదాహరణ ద్వారా తెలుసుకుందాము.
1)100% మెచ్యూరిటీ(100% Maturity):
వేణు వయసు :35 సం//లు,అతను చిల్డ్రన్ (Children) వయసు: 4 సం//లు,
పాలసీ టర్మ్ :25-4=21 సం//లు,
ప్రీమియం పీరియడ్:20-4= 16 సం//లు చెల్లిస్తాడు.
తీసుకున్న ప్లాన్ అమౌంట్ : 10 లక్షలు రూపాయలు,
నెలకు ప్రీమియం -Rs 4750
(విత్ G.S.T + Premium Waver Benefit),
ఆప్షన్ 1 ఎంచుకున్నాడు కాబట్టి ప్రతి సం// టాక్స్ డిడక్షన్(Tax Didaction) రూపంలో Rs 16,726 పొందవచ్చును.
ప్లాన్ చివరిలో అంటే 25 వ సం//…
ప్రాథమిక బీమా(BSA)=10 లక్షలు,
VSR బోనస్=10 లక్షల 8 వేల రూపాయలు,
ఫైనల్ ఎడిషన్ బోనస్= లక్ష రూపాయలు,
మొత్తం మెచ్యూరిటీ =Rs 21,08,000 లభిస్తాయి.
ఆప్షన్ 1: 100% మెచ్యూరిటీ నీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల 20 నుండి 24 వ సం// వరకు పొందే డబ్బు వాపసు (money back amount) రాదు.
2) ప్రాథమిక బీమా లో 5% (5% of Sum Assured):
ఈ ఆప్షన్ నీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ప్లాన్ యొక్క 20 వ. సం// నుండి 24 వ సం// వరకు తీసుకున్న బీమాలో 5% అమౌంట్ అనేది రిటర్న్(Return) రావడం జరుగుతుంది.
ప్రాథమిక బీమాలో 5% అంటే:
20 వ సం//=50,000 రూపాయలు
21 వ సం//=50,000 రూపాయలు
22 వ సం//=50,000 రూపాయలు
23 వ సం//=50,000 రూపాయలు
24 వ సం//=50,000 రూపాయలు.
మొత్తం =2,50,000 రూపాయలు( Total Survival Benefit రూపంలో) లభిస్తాయి.
ప్లాన్ యొక్క 25 వ సం// ప్రాథమిక బీమా లో 75% అంటే 7,50,000 రూపాయాలు
VSR బోనస్ –10,08,000 రూపాయాలు
ఫైనల్ ఎడిషన్ బోనస్ –1,00,000 రూపాయాలు
మొత్తం మెచ్యూరిటీ =18,58,000 రూపాయాలు లభిస్తాయి.
3)ప్రాథమిక బీమా లో 10% (10% of Sum Assured):
ఈ ఆప్షన్ లో 20 వ సం// నుండి 24 వ సం// వరకు తీసుకున్న బీమా లో 10% అమౌంట్ ప్రతీ సం// వాపసు వస్తాయి. అంటే..
20 వ సం// = లక్ష రూపాయలు
21 వ సం//= లక్ష రూపాయలు
22 వ సం//= లక్ష రూపాయలు
23 వ సం//= లక్ష రూపాయలు
24 వ సం//= లక్ష రూపాయలు
మొత్తం =5,00,000 రూపాయలు( Total Survival Benefit రూపంలో) లభిస్తాయి.
దీనితో పాటుగా ప్లాన్ చివరిలో ప్రాథమిక బీమాలో 50% అంటే 5,00,000 రూపాయాలు,
VSR బోనస్ = Rs 10,08,000,
ఫైనల్ ఎడిషన్ బోనస్ = Rs 1,00,000,
మొత్తం మెచ్యూరిటీ =16,08,000 రూపాయాలు లభిస్తాయి.
4)ప్రాథమిక బీమా లో 15%(15% of Sum Assured):
20 వ సం// నుండి 24 వ సం// వరకు బీమాలో 15% అంటే 20 వ సం// = లక్ష రూపాయలు
21 వ సం//= లక్ష 50 వేల రూపాయలు
22 వ సం//= లక్ష 50 వేల రూపాయలు
23 వ సం//= లక్ష 50 వేల రూపాయలు
24 వ సం//= లక్ష 50 వేల రూపాయలు
మొత్తం = Rs 7,50,000 దీనితో పాటు
25 వ సం// బీమాలో 25% అంటే – Rs 2,50,000
VSR బోనస్ = Rs 10,08,000
ఫైనల్ ఎడిషన్ బోనస్(FAB)= Rs 1,00,000
మొత్తం మెచ్యూరిటీ = Rs 13,58,000
పై 4 ఆప్షన్ లలో మనకు అనుగుణంగా ఉన్నదానిని సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఇతర ప్రయోజనాలు (Other Benefits):
డెత్ బెనిఫిట్ (Death Benefit) ఎలా లభిస్తుంది?
కామన్స్మెంట్ ఆఫ్ రిస్క్ (Commencement of Risk):
మీ చిల్డ్రన్ వయసు 8 సం// రాల కంటే తక్కువ వుంటే ప్లాన్ తీసుకున్న 2 సం// రాల తరువాత నుండి రిస్క్ కవరేజ్ వర్తిస్తుంది.
ఒకవేళ ప్లాన్ తీసుకున్న సమయంలో చిల్డ్రన్ వయసు 8 సం// రాల కంటే ఎక్కువ మంది వుంటే రిస్క్ కవరేజ్ అనేది వెంటనే వర్తిస్తుంది.
ఈ జీవన్ తరుణ్ ప్లాన్ తీసుకున్న 2 సం// రాల లోపు చిల్డ్రన్ డెత్ అయితే అప్పటివరకు చెల్లించిన ప్రీమియం ఇవ్వడం జరుగుతుంది ప్లాన్ ముగించబడుతుంది.
2 సం// రాల తరువాత చిల్డ్రన్ డెత్ అయితే అప్పటివరకు కట్టిన ప్రీమియం తోపాటు అదనంగా బోనస్(Bonus) కూడా కలిపి నామినీ కి ఇస్తారు.
ప్రీమియం వైవర్ బెనిఫిట్(Premium Waiver Benefit):
ప్లాన్ తీసుకున్న వ్యక్తి బీమా మధ్యలో మరణిస్తే డెత్ బెనిఫిట్ రూపంలో ప్రాథమిక బీమా పై 125% ,Vested Simple Rivaisinory Bonus(VSRB) మరియు ఫైనల్ ఎడిషన్ బోనస్ (FAB) వీటిని నామినీ కి అందించి ప్లాన్ ముగిస్తారు.
ఒకవేళ హరి ప్లాన్ లో ప్రీమియం వైవర్ రైడర్ ను సెలెక్ట్ చేసుకుంటే ప్లాన్ మధ్యలో ఏ కారణం చేతనైనా డెత్(Death) అయితే ప్లాన్ ప్రీమియం ను చివరి వరకు LIC సంస్థ చెల్లిస్తుంది. అలాగే 20 వ సం// నుండి 24 వ సం// వరకు ప్రీతి సం// లభించే సర్వైవల్ అమౌంట్(Survival Amount) మరియు చివరిలో మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది.
LIC Bima Jyoti 860 ; బోనస్ 100 శాతం గ్యారెంటీ, 5 సంవత్సరాలు ప్రీమియం మాఫ “
LIC Aadhaar Shila Plan ( 944) Telugu; కేవలం మహిళలకు మాత్రమే ; ప్రయోజనాలు, అర్హతలు ఇవే!
ప్రీమియం పేయింగ్ మోడ్ (Premium Paying Mode):
మనం ప్రీమియం ను 4 రకాలుగా చెల్లించవచ్చు. అవి:
సంవత్సరానికి(Yearly), అర్థసంవత్సరానికి(Half -Yearly, త్రైమాసిక(Quarterly) మరియు నెలకు(Monthly) ఒకసారి మనకు వీలునుబట్టి చెల్లించవచ్చు.
టాక్స్ బెనిఫిట్(Tax Benefit):
పాలసీ దారుడు చెల్లించే ప్రీమియం పై సెక్షన్ 80c వర్తించడం ద్వారా టాక్స్ డిడాక్షన్ పొందవచ్చును మరియు చివరిలో లభించే మెచ్యూరిటీ పై ఎటువంటి పన్ను కట్టవలసిన అవసరం లేకుండా సెక్షన్ 10d వర్తిస్తుంది.
గ్రేస్ పీరియడ్ (Grace Period):
సంవత్సరానికి, అర్థసంవత్సరానికి, త్రైమాసికం ప్రీమియం చెల్లించే వారికి ప్రీమియం చెల్లించాల్సిన చివరి తేదీ నుండి 30 రోజులు మరియు నెలకు చెల్లించే వారికి 15 రోజులు అదనంగా ఎటువంటి పెనాల్టీ లేకుండా కేవలం ప్రీమియం ను మాత్రమే చెల్లించే సదుపాయం కల్పించారు.
బీమా యొక్క పునరుద్ధరణ(Revival of Policy):
2 సంవత్సరాలు వరుసగా ప్రీమియం చెల్లించకపోతే ప్లాన్ క్లోజ్(Close) అవుతుంది. కానీ 2020 నుండి బీమా పునరుద్ధరణకు 5 సంవత్సరాలు కు పెంచారు. ఈ 5 సంవత్సరాల ప్రీమియం ఒకేసారి పెనాల్టీ(Penalty) తో చెల్లించి బీమా ను కొనసాగించవచ్చు.
రుణ సదుపాయం (Loan facility):
2 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తర్వాత చెల్లించిన అమౌంట్ పై లోన్ పొందవచ్చును(అత్యవసర పరిస్థితులలో).
సరెండర్ (Surrender):
వరుసగా 2 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తర్వత ప్లాన్ లో షరతులు అసౌకర్యంగా వుంటే ప్లాన్ ను సరెండర్ చేసి అప్పటి వరకు చెల్లించిన అమౌంట్ ను పొందవచ్చును కానీ పన్ను రూపంలో ఎక్కువ అమౌంట్ నష్టపోవాల్సి వస్తుంది.
ఫ్రీ లుక్ పీరియడ్(Free Look period):
జీవన్ తరుణ్ బీమా ను తీసుకున్న తరువాత అసంతృప్తి గా అనిపిస్తే 15 రోజుల లోపు బీమా ను ముగించి చెల్లించిన ప్రీమియం ను పొందవచ్చు. ఒకవేళ ఆన్లైన్(Online) లో ఈ ప్లాన్ ను తీసుకున్నట్లయితే 30 రోజులు ఫ్రీ లుక్ పీరియడ్ వుంటుంది.
మినహాయింపు (Exception):
బీమా తీసుకున్న వ్యక్తి 12 నెలల లోపు ఆత్మహత్య చేసుకుంటే నామినీ కి ప్రీమియం లో 80% అమౌంట్ ను ఇవ్వడం జరుగుతుంది.
మరణ ప్రయోజనం ( Death Benefit):
వ్యక్తి మరణించినప్పుడు ప్రాథమిక బీమా మొత్తం లో 125% లేదా వార్షిక ప్రీమియం లో 7 లేదా 10 రెట్లు ఇస్తారు.
ఈ మరణ ప్రయోజనాన్ని నామినీ ఒకేసారి గానీ సంవత్సరానికి , అర్ధ సంవత్సరానికి లేదా నెల కు వాయిదా రూపంలో పొందవచ్చును.
ఎల్. ఐ. సి జీవన్ తరుణ్ ప్లాన్ కి కావాల్సిన పత్రాలు (LIC Jeevan Tarun Required Documents):
1) వైద్య చరిత్ర(Medical history)
2) వైద్య పరీక్ష(మీ వయసు లేదా బీమా మొత్తం బట్టి)
3) చిరునామా ఋజువు(Address Proof)
4) మీ కస్టమర్ పత్రాలు తెలుసుకోండి.