LIC YUVA TERM PLAN-875 in Telugu-యువత కోసం ప్రత్యేకంగా.. పూర్తి వివరాలు ఇవే

Lic Yuva Term Plan  in Telugu

 

 

Lic Yuva Term Plan-875  in Telugu

ఎల్.ఐ.సి కొత్త  యువ టర్మ్ ప్లాన్ , టేబుల్ నెంబర్ 875, ప్రస్తుతం టర్మ్ ప్లాన్ కి ఎంత ప్రాముఖ్యం  ఉందొ మనకు తెలుసు. దేని ప్రత్యేకత ఏమిటంటే  చాలా  తక్కువ  ప్రీమియం  ను చెల్లిస్తూ ఎక్కువ జీవిత భీమా  ను పొందవచ్చు. దాని  ధ్వారా  మన  కుటుంబానికి  భద్రతా  కల్పించవచ్చు.

 

 

 

LIC YUVA TERM PLAN-875 in Telugu-యువత కోసం ప్రత్యేకంగా.. పూర్తి వివరాలు ఇవే

 

 

 

ఈ ఎల్.ఐ.సి  యువ టర్మ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలు (Benefits) :

 

1) తక్కువ ప్రీమియం రేట్ (Low premium rate):

అంటే ప్లాన్ లో చెల్లించాల్సిన ప్రీమియం అనేది చాలా తక్కువ గా నిర్ణయించారు. కనుక చాలా వరకు ఎక్కువ మంది ప్రజలు ఈ ప్లాన్ ను కొనుగోలు చేయవచ్చు .

 

2) ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ మెథడ్ (Flexible premium payment method):

మనం సంపాదించే ఆదాయానికి అనుగుణంగా 3 పద్దతులలో ప్రీమియం చెల్లించవచ్చు.

 

A) రెగ్యులర్ ప్రీమియం ( Regular premium) అంటే ఎంత కాలం పాలసీ ని కనుగులు చేస్తే అంత కాలం ప్రీమియం చెల్లించడం.

 

B) లిమిటడ్ ప్రీమియం (Limitted premium) అంటే నిర్ణయించుకున్న పాలసీ సమయం కంటే తక్కువ సమయానికి ప్రీమియం చెల్లించడం. ఉదాహరణకి 40 సంవత్సరాలకి ఈ ప్లాన్ ను తీసుకుని 15 సంవత్సరాలు ప్రీమియం చెల్లించడం.

 

C) సింగల్ ప్రీమియం (Single premium) అంటే ఈ పద్దతి లో ప్రీమియం ను ఒక్కసారి మాత్రమే చెల్లిస్తారు.

ఈ విధంగా ప్రీమియం విషయం లో సులభ పద్దతిని ఎంచుకోవచ్చు.

 

ఎక్కువ భీమా పై డిస్కౌంట్   (Ribate on high Sum Assured)  :

ఎవరతే ఈ ప్లాన్ లో ఒక పరిమితి కి మించి భీమా ను కొనుగోలు చేస్తారో వారికీ ప్రీమియం పై డిస్కౌంట్ అదనం గా లభిస్తుంది.  దీని తో పాటుగా ఈ ప్లాన్ ను మహిళలు తీసుకుంటే ప్రీమియం రేట్స్ ఇంకొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది.

సాధారణంగా ఈ ప్లాన్ లో 2 రకాల ఒప్షన్స్ అందుబాటులో వున్నాయి. అవి

 

1)లెవెల్ సుమస్సురెడ్ (Level Sum Assured) :

మీరు ప్రారంభంలో ఎంత భీమా కొనుగోలు చేస్తారో చివరివరకు అదే భీమా స్థిరంగా ఉంటుంది. అంటే ఎప్పుడు పాలసీ

దారుడికి ప్రమాదం జరిగిన, కొనుగోలు చేసిన బీమాను ఎల్.ఐ.సి సంస్థ పాలసీ దారుడి కుటుంబానికి అందిస్తారు.

 

2)ఇంక్రెసింగ్ సుం అస్సురెద్ (Increasing Sum Assured) :

కానీ ఈ ఆప్షన్ లో ప్లాన్ యొక్క 6 వ సంవత్సరం నుండి 10 శాతం చొప్పున భీమా అనేది రెట్టింపు అయ్యేవరకు ప్రతి సంవత్సరం  ఈ అమౌంట్ పెరుగుతుంది.

ఉదాహరణకి మీరు ఈ ప్లాన్ లో కోటి రూపాయల భీమా తీసుకుంటే ఆప్షన్ 1 లో చివరివరకు 1 కోటి భీమా ఉంటుంది.

కానీ ఆప్షన్ 2 లో మాత్రం మొదటి 5 సంవత్సరాలు కోటి రూపాయలు స్థిరంగా ఉంటుంది. ప్లాన్ యెక్క 6 వ సంవత్సరం నుండి

10 శాతం పెరిగి 1 కోటి 10 లక్షలు రూపాయలు , 7 వ సంవత్సరం కోటి 20 లక్షలు రూపాయలు , 8 వ సంవత్సరం కోటి 30

లక్షలు రూపాయలు ఈవిధంగాపెరుగుతూ 2 కోట్లు అయ్యేవరకు భీమా పెరుగుతూ వస్తుంది. అందువల్ల ఎప్పుడు ఏ స్థితిలో

వ్యక్తికీ ప్రమాదం జరిగితే ఆ అమౌంట్ కాలం తో పాటు పెరుగుతూ కుటుంబానికి ఉపయోగపడుతుంది.

అయితే  ఇక్కడ  మీరు ఏదో ఒక్క ఆప్షన్ మాత్రమే నిర్ణయించుకోవాలి.

 

 

ఈ ప్లాన్ యొక్క అర్హతలు (Eligabilitys) :

ఈ ప్లాన్ అనేది ముఖ్యంగా యువత కోసం ప్రవేశపెట్టడం జరిగింది.

కనీస  ప్రవేశ వయస్సు : 18 సంవత్సరాలు

అత్యధిక   ప్రవేశ వయస్సు : 45 సంవత్సరాలు

 

పాలసీ సమయం (Policy Period) :

కనీస పాలసీ సమయం: 15  సంవత్సరాలు

అత్యధిక  పాలసీ సమయం: 40  సంవత్సరాలు

 

ఇక్కడ నా నుంచి  పాలసీ టర్మ్ విషయంలో ఒక సలహా ఏమిటంటే  ఇది టర్మ్ ప్లాన్ కనుక ఇన్సూరెన్స్    అనేది  ఎక్కువ

సమయానికి తీసుకుంటే చెల్లించే ప్రీమియం తక్కువగా వుంది.  ఒకవేళ ఇన్సూరెన్స్ తక్కువ సమయానికి తీసుకుంటే ఎక్కువ

ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల ఎక్కువ సమయానికే ప్లాన్ నిర్ణయించుకుంటే మంచిది.

 

కనీస భీమా : 50 లక్షలు రూపాయలు

అత్యధిక భీమా : 5 కోట్ల రూపాయలు

 

రెగ్యులర్  & లిమిటడ్ ప్రీమియం ఆప్షన్ లో

కనీస ప్రీమియం : 3000 రూపాయలు , సింగల్  ప్రీమియం : 30000 రూపాయలు

 

 

ఎల్.ఐ.సి  యువ టర్మ్ ప్లాన్ ను ఒక ఉదాహరణ    ధ్వారా  తెలుసుకుందాము .

 

mr రాజు తన వయస్సు 30 సంవత్సరాలు అనుకుంటే , ఈ ప్లాన్ లో  50 లక్షల రూపాయలు భీమా ను 20 సంవత్సరాలకు మరియు 2 ప్లాన్ ఆప్షన్ లలో ఆప్షన్ 1 లెవెల్ సుమస్సురెడ్,  మరియు ప్రీమియం మోడీ లో రెగ్యులర్ ప్రీమియం పేమెంట్  మెథడ్ ని  తీసుకున్నాడు.

ఇప్పుడు ప్రీమియం అనేది ప్లాన్ సమయం మొత్తం చెల్లించాలి. భీమా కూడా స్థిరంగా 50 లక్షల రూపాయలు ఉంటుంది.

సంవత్సరానికి చెల్లించాలిసిన ప్రీమియం : 7021 రూపాయలు అవుతుంది. (GST కలిపి) ఇందులో సాధారణ ప్రీమియం 5950 రూపాయలు కాగా మిగిలిన అమౌంట్ GST .

ఈ ప్రీమియం అనేది అందరికి ఒకేలా ఉండదు. మీ వయస్సు, భీమా, ఎంచుకున్న ప్లాన్ ఆప్షన్  మరియు ఎంచుకున్న పాలసీ సమయం, బట్టి మారుతుంది.

Mr. రాజు ప్రతి సంవత్సరం ప్రీమియం అమౌంట్ : 7021 రూపాయలు

20 సంవత్సరాల కాలంలో చెల్లించిన మొత్తం ప్రీమియం : 1,40,420 రూపాయలు

ఈ సందర్భంలో వ్యక్తికీ ఆక్సిడెంట్ జరిగితే వెంటనే 50 లక్షల రూపాయలను పాలసీ దారుడి కుటుంబానికి అందిస్తారు.

ఒక వేళ mr. రాజు ప్లాన్ లో 3 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన  తర్వాత అతనికి ప్రమాదం జరిగింది అనుకుందాం. ఈ

సందర్భం లో అతను చెల్లించిన ప్రీమియం వచ్చి 21000 రూపాయలు మాత్రమే   కాని ఇక్కడ చెల్లించిన ప్రీమియం తో

సంబంధం లేకుండా ఎంచుకున్న భీమా అమౌంట్ 50 లక్షల రూపాయలను  పాలసీ దారుడి కుటుంబానికి అందుతుంది.

ఇదే టర్మ్ ప్లాన్ లో వున్నా మంచి ప్రయోజనం.

 

 

 

 

 

 

ALSO READ

LIC New Endowment policy 714 Telugu – అద్భుతమైన పాలసీ, పూర్తి వివరాలు ఇవే

 

LIC New Pension Plus Plan 867- 35 సంవత్సరాల నుండే పెన్షన్ ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే !

 

NPS Vatsalya Scheme in Telugu-పిల్లల కోసం కొత్త పధకం పూర్తి వివరాలు ఇవే

 

 

కావాల్సిన డాకుమెంట్స్ : వైద్య పరీక్షలు (Required Documents):

 

1) Proposal Form with 2 photos
2)Identity Proof (Aadhar card, Pan card, Pass port)
3)Address Proof (Aadhar card)
4)Date of Birth Certificate (10th or Intermediate Certificate)
5)Basic Medical Report
6)ITR & 3 Months Salary Payslip

 

 

 

మెచ్యూరిటీ బెనిఫిట్ (Meturity Benefit) :

20 సంవత్సరాల కాలంలో ఎటువంటి ప్రమాదం జరగక పోతే 21 వ సంవత్సరం ఈ ప్లాన్ ముగించబడుతుంది. అప్పుడు ఎటువంటి  మెచ్యూరిటీ అమౌంట్ రాదు.

 

దీనికి ప్రధాన కారణం  అదే 50 లక్షల భీమా  ని ఎండోమెంట్ ప్లాన్ తీసుకున్నట్లైతే సంవత్సరం ప్రీమియం 2 లక్షల 50 వేల రూపాయలు పైన  చెల్లించాల్సి ఉంటుంది.

కానీ టర్మ్ ప్లాన్ లో 50 లక్షల భీమాకు    సంవత్సరం ప్రీమియం 7200  రూపాయలు మాత్రమే చెల్లిస్తారు.

అందువల్ల కుటుంబానికి ఆర్ధిక  భద్రత నిమిత్తము టర్మ్ ప్లాన్  తీసుకోవడం  మంచిది.

 

https://licindia.in/

 

 

టాక్స్ బెనిఫిట్(Tax Benefit):

పాలసీ దారుడు చెల్లించే ప్రీమియం పై  టాక్స్ డిడాక్షన్ అనేది  సెక్షన్ 80c వర్తించడం ద్వారా  పొందవచ్చును మరియు

పాలసీ యొక్క చివరి సమయం లో లభించే మెచ్యూరిటీ పై ఎటువంటి పన్నుచెల్లించే  అవసరం లేకుండా పూర్తి మెట్యూరిటీ

లభించేవిధంగా   సెక్షన్ 10d వర్తిస్తుంది.

 

 

గ్రేస్ పీరియడ్ (Grace Period):

సంవత్సరానికి, అర్థసంవత్సరానికి, త్రైమాసికం ప్రీమియం చెల్లించే వారికి ప్రీమియం చెల్లించాల్సిన చివరి తేదీ నుండి 30

రోజులు మరియు నెలకు చెల్లించే వారికి 15 రోజులు అదనంగా ఎటువంటి పెనాల్టీ లేకుండా కేవలం ప్రీమియం ను మాత్రమే

చెల్లించే సదుపాయం కల్పించారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *