PPF Scheme Details In Telugu
PPF Scheme in Telugu
. పోస్ట్ ఆఫీస్ పి. పి. ఫ్. (PPF) స్కీం అంటే ఏమిటి? ( What Is Post Office PPF Scheme?)
PPF scheme పి పి ఫ్ అంటే పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్ ( Public Provident Fund ). భారత ప్రభుత్వం ద్వారా అత్యంత ఆదరణ పొందిన లాంగ్ టర్మ్ సేవింగ్ స్కీం ఇది. 1968 లో ఈ స్కీం ని గవర్నమెంట్ ప్రారంభం చేసింది. పి. పి. ఫ్. మోస్ట్ పాపులర్ గవర్నమెంట్ స్కీం.అలాగే ఇది ఒక లాంగ్ టర్మ్ ( Long Term ) బెస్ట్ సేవింగ్ స్కీం.
డబ్బును పొదుపు చేయడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. సాధారణంగా తక్కువ పెట్టుబడితో అధిక రాబడి వచ్చే పధకాలు, ఫండ్స్ వైపు అందరూ దృష్టి పెడుతున్నారు. తక్కువ పెట్టుబడి మార్గాల్లో పేరు పొందిన స్కీం గా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) పథకం పేరు తెచ్చుకుంది.
1968వ సంవత్సరంలో నేషనల్ సేవింగ్స్ ఆర్గనైజేషన్ ( National Savings Organization ) పీపీఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. చిన్న చిన్న పొదుపులను లాభదాయకమైన పెట్టుబడిగా మార్చడమే ఈ స్కీం ప్రత్యేకత. మీరు ఈ స్కీం మెచ్యూరిటీ కాలాన్ని సమయస్ఫూర్తి తో ఎంచుకుంటే, దీర్ఘకాలిక పీపీఎఫ్ చాలా మంచి రాబడిని ఇస్తుంది…
• పిపిఎఫ్ అకౌంట్ యొక్క సెక్యూరిటీ? ( PPF Deposits Security? )
పిపిఎఫ్ అకౌంట్ కు భారత ప్రభుత్వం మద్దతు ఉన్నందున రిస్క్-ఫ్రీ, రాబడికి హామీ మరియు మూలధనం కు (పెట్టుబడి కి) రక్షణను అందిస్తుంది. అందువల్ల, పిపిఎఫ్ అకౌంట్ కు చాలా ప్రాముఖ్యత ఉంది.
.పి. పి. ఫ్ ( PPF ) స్కీం ఎలా పనిచేస్తుంది? ( How Does PPF Scheme Work?)
ఈ స్కీం లో మీరు ప్రతీ నెల లేదా సంవత్సరానికి ఒకసారి కొద్దిగ అమౌంట్ ని డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ అమౌంట్ ని ఆధారంగా చేసుకొని ప్రతీ ఆర్థిక సంవత్సరంలో వడ్డీని కలిపి అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా లభించే మొత్తం అమౌంట్ ని స్కీం సమయం ముగియగానే మెట్యూరిటీ రూపంలోఅందివ్వడం జరుగుతుంది.కనీసం సంవత్సరానికి Rs.5,00/- రూపాయలు జామచేస్తూ కూడా సామాన్యులు ఈ స్కీం లో కొనసాగవచ్చు.
PPF account ప్రత్యేకతలు ఏమిటి?
PPF వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?ప్రస్తుత వడ్డీ రేట్ ఎంత?
PPF tax benefits ఏమిటి?
మరియు
PPF amount విత్ డ్రా విధానం వంటి ప్రశ్నలకు కు ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి.
దీనితో పాటుగా 100% టాక్స్ సేవింగ్ పి. పి. ఫ్ ( PPF )స్కీం లో మీకు లభిస్తుంది.
• పి. పి. ఫ్ ( PPF )స్కీం యొక్క ప్రయోజనాలు? ( Benefits Of Public Provident Fund Scheme )
1. గవర్నమెంట్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి 100% గవర్నమెంట్ సెక్యూరిటీ లభిస్తుంది.
2. సమయానుసరంగా వడ్డీ పి. పి. ఫ్. ఖాతాలో జామచేయబడుతుంది. మెట్యూరిటీ సమయంలో ఖచ్చితమైన రిటర్న్స్ లభిస్తాయి.
3. సామాన్యులు కూడా స్కీం లో కొనసాగేలా అతి తక్కువ కనీస డిపాజిట్ అమౌంట్ ని జామచేసుకోవచ్చు.
4. లాంగ్ టర్మ్ స్కీం కనుక పిల్లల యొక్క భవిష్యత్ కోసం చక్కగా ఈ స్కీం లో ప్లాన్ చేసుకోవచ్చు.
5. ఈ స్కీం లో మీరు డిపాజిట్ చేసే అమౌంట్ పై గాని, మెట్యూరిటీ అమౌంట్ పై గాని ఎటువంటి టాక్స్ విధించబడదు. బెస్ట్ టాక్స్ సేవింగ్ స్కీం.
• పి. పి. ఫ్ ( PPF ) స్కీం లో అమౌంట్ డిపాజిట్ చెయ్యడానికి అర్హులు ఎవరు? ( Who Can Eligible?)
కేవలం భారతదేశ నాగరికత కలిగిన వ్యక్తులకు మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది. NRI లకు ఈ స్కీం ఇవ్వబడదు.
చిన్నపిల్లల పేరు పై అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ చేసి తల్లితండ్రులు నిర్వహించవచ్చు , పిల్లలు మేజర్ అయిన తర్వాత స్వయంగా అకౌంట్ మేనేజ్ చేసుకోవచ్చు.
18 సంవత్సరాలు వయసు నిండిన వారు ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు మరియు సింగిల్ అకౌంట్ ( Single ) మరియు ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కలసి జాయింట్ ( joint )అకౌంట్ ఓపెన్ చేసే సదుపాయం పి. పి. ఫ్ స్కీం లో లభించదు.
ఇప్పటికే గవర్నమెంట్ ఈ. పి. ఫ్ ( Employee Provident Fund ) మరియు జి. పి. ఫ్ ( General Provident Fund ) స్కీంమ్స్ లో డిపాజిట్ చేస్తున్న వారు కూడా ఈ స్కీం లో అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు , క్రమం తప్పకుండా ప్రతీ 3 నెలలకు వడ్డీ డైరెక్టుగా ఖాతాలో జామచేయబడుతుంది అంతేకాకుండా మిగిలిన సేవింగ్ పథకాల కంటే ఎక్కువ వడ్డీ రేట్ లభిస్తుంది.
.పి. పి. ఫ్ (, PPF )స్కీం యొక్క కనీస మరియు అత్యధిక డిపాజిట్ లిమిట్స్ ఎంత? ( Deposit Limits Of PPF?)
ఈ స్కీం యొక్క కనీస సంవత్సర డిపాజిట్ (Minimum Yearly Deposit Amount ) = Rs. 500/-
అత్యధిక సంవత్సర డిపాజిట్ అమౌంట్ ( Maximum Yearly Deposit Amount ) = Rs. 1,50,000/-
ఇంత కంటే ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసే అవకాశం ఉండదు. డిపాజిట్ అమౌంట్ ని Rs.50/- గణిస్తూ అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు.
( అంటే Rs.550, Rs 600, Rs 650…………)
అమౌంట్ ని సంవత్సరం లో ఎన్నిసార్లు అయినా జామచేసుకోవచ్చు కానీ సంవత్సర మొత్తం కలిపి Rs.1,50,000 /- దాట కూడదు.
ముఖ్య గమనిక :-
1. ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్ చేసే వారు తప్పకుండా ప్రతీ నెల 5 వ తారీకు లోపు మాత్రమే డిపాజిట్ చేసే ప్రయత్నం చెయ్యండి. 6 నుంచి 31 లోపు ఎప్పుడూ అమౌంట్ డిపాజిట్ చెయ్యవద్దు.
ఒకవేళ ఏదైనా నెలఈ సమయంలో అమౌంట్ డిపాజిట్ చేసే అవకాశం లేకపోతే తర్వాత నెల జమా చెయ్యండి. ఎందుకంటే నెలలో 6 నుంచి 31 లోపు డిపాజిట్ చేసే అమౌంట్ పై ఆ నెల మీకు వడ్డీ లభించదు.
. ఈ స్కీం లో అమౌంట్ ఏ విధంగా డిపాజిట్ ఎలా చెయ్యాలి? ( How to Deposit Amount In PPF scheme )
పిపిఎఫ్ అకౌంట్ కు పేమెంట్ ఆన్లైన్ ట్రాన్స్ ఫర్ ( Online Transfer ), డిమాండ్ డ్రాఫ్ట్ ( Demand Draft ), చెక్ ( Check ) లేదా క్యాష్ ( Cash ) రూపంలో చెల్లించవచ్చు.
Postal Life Santhosh In Telugu తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్,’ పూర్తి వివరాలు తెలుగులో
.పి. పి. ఫ్ పథకం యొక్క సమయం ? ( PPF Scheme Period )
పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రొవిడంట్ స్కీం యొక్క సమయం = 15 సంవత్సరాలు ఉంటుంది. ఇంతకంటే తక్కువ గాని ఎక్కువ గాని నిర్ణయించుకొనే సదుపాయం ఉండదు.
కావాలనుకొంటే 15 తర్వాత PPF అకౌంట్ యొక్క సమయాన్ని పొడిగించుకోవచ్చు(Extension ).అది అమౌంట్ డిపాజిట్ చేస్తూ ఐనా లేక ఎటువంటి అమౌంట్ డిపాజిట్ చెయ్యకుండా కూడా PPF అకౌంట్ సమయాన్ని పెంచుకోవచ్చు.
ఒకవేళ మీరు 15 సంవత్సరాల తర్వాత కూడా అమౌంట్ డిపాజిట్ చేస్తూ అకౌంట్ కొనసాగిస్తే స్కీం లో లభించే బెనిఫిట్స్ యధావిధిగా వర్తిస్తాయి.
ముఖ్య గమనిక :-
15 సంవత్సరాల తర్వాత అకౌంట్ సమయాన్ని పొడిగిస్తున్న విషయాన్ని కనీసం మెట్యూరిటీ కంటే ఒక సంవత్సరం ముందుగా తెలియచేయాల్సి ఉంటుంది. లేకపోతే అకౌంట్ ఆటోమేటిక్ గా క్లోజ్ ( Close )అవ్వడం జరుగుతుంది.
. ప్రస్తుతం PPF పథకంలో వడ్డీరేట్ ఎంత లభిస్తుంది? ( Rate Of Interest % )
పోస్ట్ ఆఫీస్ PPF పథకంలో మీకు ప్రతీ 3 నెలలకు
ఒకసారి గవర్నమెంట్ వడ్డీ రేట్ ను ప్రకటిస్తుంది. నిర్ణయించిన వడ్డీరేట్ అనుగుణంగా మీకు అందించబడుతుంది.
( జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలలలో..)
ముఖ్య గమనిక :
ఈ వెబ్సైటు లో అన్ని పథకాల వడ్డీరేట్స్ గవర్నమెంట్ ప్రకటించిన విధంగా ప్రతి 3 నెలలకు మార్చడం జరుగుతుంది.
కాబట్టి క్రమం తప్పకుండా అనుసరిస్తూ ఉండండి.
ప్రస్తుతం స్కీం లో 7.10% వడ్డీ రేట్ ని గవర్నమెంట్ ఈ పథకానికి అందిస్తుంది.
Example :-
.PPF స్కీం యొక్క బెనిఫిట్స్ ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం!
ఏదైనా పథకం యొక్క లాభం అనేది డిపాజిట్ చేసే అమౌంట్ పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత వడ్డీ రేట్ ద్వారా ప్రతి నెలా ఈ స్కీం లో Rs.5,000/- డిపాజిట్ చేస్తే సంవత్సరానికి Rs.60,000/- డిపాజిట్ ని ఇప్పుడు గణిద్దాం.
పాలసీదారుని వయసు ( Age ) = 30 సంవత్సరాలు
సంవత్సర డిపాజిట్ ( Deposit Yearly ) = Rs. 60,000/-
ప్రస్తుత వడ్డీరేట్ ( Interest Now ) = 7.10%
1 5 సంవత్సరాలు డిపాజిట్ మొత్తం ( total Deposit ) = 15 × 60,000 =Rs.9,00,000/-
మొత్తం మెట్యూరిటీ = డిపాజిట్ + వడ్డీ
= 9,00,000 + 6,77,840
= Rs. 15,77,840/-
. ఈ స్కీం లో టాక్స్ ప్రయోజనాలు ఈ విధంగా ఉంటాయి? (PPF scheme tax benefits)
PPF account కింద చేసే పెట్టుబడులు ఇన్కమ్ టాక్స్ వర్గంలోకి వస్తాయి. అందువల్ల, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద, PPF అకౌంట్ కు చేసిన అన్ని డిపాజిట్లపై పన్ను (టాక్స్) మినహాయింపు ఉంటుంది. దీనితో పాటు ఒక వ్యక్తి PPF account నుండి మొత్తాన్ని (విత్ డ్రా) ఉపసంహరించుకున్నప్పుడు, ఇంతవరకూ పొదుపు చేసిన మొత్తంతో పాటు, వడ్డీని కూడా పన్ను నుండి మినహాయిస్తారు.
• ఆకస్మికంగా PPF అకౌంట్ క్లోజ్ చేయడం ( Premature closure of a PPF)
5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వ్యక్తులు PPF account ను ఆకస్మికంగా క్లోజ్ చేయవచ్చు. కానీ, PPF ఖాతాదారుడు , తల్లిదండ్రులు, పిల్లలు లేదా జీవిత భాగస్వామి జీవితాలకు హాని కలిగించే వ్యాధుల యొక్క చికిత్స విషయంలో మాత్రమే అనుమతించబడుతుంది. దీని కోసం, అనుభవజ్ఞులైన వైద్య అధికారి నుండి సరైన డాక్యుమెంట్స్ అందజేయాలి.
ఇంకా మైనర్ అకౌంట్ హోల్డర్ గా ఉన్నప్పుడు లేదా అకౌంట్ హోల్డర్ యొక్క ఉన్నత అధ్యయనాల (హయ్యర్ స్టడీస్) విషయంలో PPF అకౌంట్ ను ఆకస్మికంగా క్లోజ్ చేసుకోవడానికి అనుమతి కలదు.
అయితే, ఇందుకోసం కాలేజీ ఫీజు బిల్లులు మరియు భారతదేశంలో లేదా విదేశాలలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి అడ్మిషన్ డిక్లరేషన్ ఫార్మ్స్ వంటివి ఇవ్వవలసి ఉంటుంది.
.పిపిఎఫ్ అకౌంట్ ఆధారంగా (లోన్లు) రుణాలు? ( PPF Loan Facility?)
పిపిఎఫ్ అకౌంట్ తెరిచిన తేదీ నుండి 3వ మరియు 5వ ఆర్థిక సంవత్సరం మధ్య, పిపిఎఫ్ లోన్లు అకౌంట్ కు ఆధారంగా పొందవచ్చు.
ఐతే, రెండవ ఆర్థిక సంవత్సరం చివరిలో చేసిన పెట్టుబడులలో 25% మొత్తం ను రుణంగా పొందగలిగే అవకాశం కలదు. ఆరో ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా అవసరమైతే రుణం పొందవచ్చు. కానీ, రెండవ రుణం పొందటానికి ముందు మొదటి రుణాన్ని పూర్తిగా చెల్లించి ఉండాలి.
. స్కీం మధ్యలో అమౌంట్ విత్ డ్రా చెయ్యాలంటే? ( PPF Partial Withdrawal?)
PPF account కలిగిన వ్యక్తులు 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాతే PPF account ను రద్దు చేయగలరు, PPF కాలపరిమితి ప్రకారం 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, ఖాతాదారుడు అకౌంట్ లో సేవ్ చేసిన మొత్తాన్ని అలాగే వడ్డీని కూడా విత్ డ్రా చేసుకోవచ్చు.
ఒకవేళ PPF ఖాతాదారులకు అమౌంట్ అవసరమైతే, అకౌంట్ తెరిచిన 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత డిపాజిట్ మొత్తం నుండి (పాక్షిక ఉపసంహరణ) partial withdrawal అందుబాటులో కలదు.
PPF account నుండి కాలపరిమితి కంటే ముందే డబ్బు విత్ డ్రా చేయవలసి వస్తే 4 సంవత్సరం తరువాత లభించే 50% మొత్తాన్ని ఖాతాదారుడు విత్ డ్రా చేసుకోవచ్చు.
ఇది మునుపటి సంవత్సరం చివరిలో మిగిలిన మొత్తాన్ని లేదా విత్ డ్రా చేయదలచుకున్న సంవత్సరానికి ముందు, ఏది తక్కువగా ఉందో దానిని విత్ డ్రా చేయవచ్చు. ఏదేమైనా, ఖాతాదారులకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే విత్ డ్రా చేయడానికి అనుమతి ఉంటుంది.
. ఏ కారణం చేతనైన వ్యక్తి ఖాతాను జాప్తుచేయవచ్చా? ( Attachment Of PPF Scheme?)
కూడదు.
PPF account ను కోర్టు అటాచ్మెంట్ చేయలేనందున, ఎవరైనా రుణగ్రహీతలు తమ బకాయిల కోసం వ్యక్తుల యొక్క PPF అమౌంట్ ను క్లెయిమ్ చేయడానికి PPF account ను యాక్సెస్ చేయలేరు. అయితే, ఈ రూల్ ఆదాయపు పన్ను అధికారులకు వర్తించదు.
అంటే, ఖాతాదారునికి సంబంధించి ఏవైనా బకాయిలు పెండింగ్‌లో ఉంటే, వాటి చెల్లింపు కోసం PPF account ను ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్స్ అటాచ్మెంట్ చేయవచ్చు.
PPF account కు సంబంధించి గవర్నమెంట్ కొత్తగా 7 మార్పులు చేసింది వాటి రూల్స్ గురించి తెలుసుకుందాం.( PPF new Changes Telugu )
1. సంవత్సర డిపాజిట్ పరిమితి?( Yearly Deposit Limits Of PPF Scheme )
గతంలో ఈ స్కీం లో డిపాసిట్ విషయం లో ఎటువంటి పరిమితులు లేవు. నెలలో ఒకసారి, 2 సార్లు ఈ విధంగా సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా డిపాజిట్ చేసే అవకాశం ఉండేది కానీ 2022 జులై నుండి కొత్త మార్పులు ధ్వారా నెలలో ఒకసారి మాత్రమే డిపాజిట్ చేయాల్సివుంటుంది(అంటే సంవత్సరంలో 12 సార్లు మాత్రమే డిపాజిట్ అన్నమాట). ఈ విధంగా జమ చేసిన అమౌంట్ ఒక వార్షిక సంవత్సరంలో లక్ష 50 వేల రూపాయలు (1,50000) దాటకుండా చూసుకోవాలి.
అంటే మీరు సంవత్సరం పొడవునా డిపాజిట్ చేసిన అమౌంట్ ఒక లక్ష 50 వేల రూపాయలు దాటకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక ఆర్థిక సంవత్సరానికి ఒక లక్షా 50 వేల రూపాయలకు మాత్రమే వడ్డీ చెల్లిస్తుంది.
2) లోన్ పై చెల్లించే వడ్డీ రేట్ తగ్గింపు ( PPF Reduced Loan Interest Rate?)
PPF అనేది ఒక దీర్ఘకాల పెట్టుబడి పథకం. దీని యొక్క టైం పిరియడ్ 15 సంవత్సరాల వరకు ఉంటుంది, పెట్టుబడి పెడుతున్న వ్యక్తి కి ఆర్థిక అత్యవసర పరిస్థితి కలిగినప్పుడు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది.
PPF స్కీమ్ ప్రారంభించిన మూడవ సంవత్సరం నుండి ఆరవ సంవత్సరం లోపు లోన్ తీసుకోవచ్చు , లోన్ ఇంట్రెస్ట్ రేట్ అనేది PPF డిపాజిట్ మీద ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతానికి PPF స్కీమ్‌కు 7.10% వడ్డీని చెల్లిస్తున్నది.ఇంతకు మునుపు లోన్ మీద వడ్డీ రేటు 9.10% శాతంగా ఉండేది. ప్రస్తుతం ఈ లోన్ వడ్డీ రేటు తగ్గించి 8.10 పర్సెంట్ మాత్రమే వసూలు చేస్తారు. కాబట్టి దీన్ని బట్టి కేవలం 1% మాత్రమే లోన్ మీద వడ్డీ చెల్లించవలసి ఉంటుంది.
3). PPF అకౌంట్ సమయం పొడిగింపు?( PPF Account Extension Rule?)
పిపిఎఫ్ యొక్క కాలపరిమితి 15 సంవత్సరాలు ఉండేది. కానీ మీరు అవసరం అనుకుంటే మరో ఐదు సంవత్సరాల పాటు పీపీఎఫ్ కాలపరిమితిని పెంచుకోవచ్చు.
ఈ పెంచుకున్న ఐదేళ్లకు మీరు ఎలాంటి డబ్బు డిపాజిట్ చేయవలసిన అవసరం లేదు. పైగా రెగ్యులర్ ఇంట్రెస్ట్ ఈ ఐదు సంవత్సరాలపాటు లభిస్తుంది.
అయితే మీరు PPF స్కీమ్ మరో ఐదు సంవత్సరాల పాటు పెంచుకుంటూ ఉన్నట్లుగా ఒక సంవత్సరం ముందుగా ఇంటిమేషన్ తెలియజేయాల్సి ఉంటుంది.
దీనికి సంబంధించి గతంలో ఫామ్ H ను సమర్పించే వాళ్ళు ఇప్పుడు ఫామ్ 4 ను అందజేయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ పెంచుకున్న అయిదు సంవత్సరాల సమయంలో టాక్స్ మినహాయింపు కి ఉపయోగించుకోవచ్చు.
4). లోన్ అమౌంట్ సమయానికి చెల్లించనాట్లయితే ఏమవుతుంది? ( Delay loan Payouts?)
మీరు తీసుకున్న లోన్ అమౌంట్ ని 36 నెలలోపల చెల్లించవలసి ఉంటుంది. అంటే మొత్తంగా 3 సంవత్సరాల లోపు పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ 3 సంవత్సరాల లోపు మాత్రమే 1 శాతం వడ్డీతో మీరు చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఏ కారణం చేతనైనా మూడు సంవత్సరాల లోపు చెల్లించక పోయినట్లయితే, అదనంగా 6% ఇంట్రెస్ట్ రేటుతో చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి వీలు చేసుకుని మూడు సంవత్సరాల లోపే లోన్ అమౌంట్ పూర్తి చేయడం మంచిది.
5). ప్రీమెచ్యూర్ క్లోజర్ ఫెసిలిటీ? ( PPF Premature Closer?)
PPF కాలపరిమితి 15 సంవత్సరాలు అని తెలుసుకున్నాం కదా. కానీ కొన్ని కారణాల వల్ల మీకు కాలపరిమితి కంటే ముందే పీపీఎఫ్ పథకాన్ని క్లోజ్ చేయవలసి వస్తే,
• పీపీఎఫ్ పథకం పేరుమీద ఉన్న వ్యక్తి లేదా వారి కుటుంబ సభ్యుల అనారోగ్య కారణాలతో మాత్రమే ప్రీమెచ్యూర్ గా క్లోజ్ చేయవచ్చు.
• తర్వాత పీపీఎఫ్ పథకం పేరు మీద ఉన్న వ్యక్తి యొక్క లేదా వారి పిల్లల యొక్క హయ్యర్ స్టడీస్ కోసం కూడా పీపీఎఫ్ అకౌంట్‌ను ముందస్తుగా క్లోజ్ చేసుకోవచ్చు. దీని కోసం 1% పెనాల్టీ విధించడం జరుగుతుంది.
6). PPF Required Additional Documents ?
PPF అకౌంట్ ఓపెన్ చేయడానికి ఫార్మ్ 60 తో పాటు పాన్ కార్డు అవసరం. తర్వాత వీటితో పాటు ఆధార్ కార్డు కూడా అందజేయాలి.
7). జీరో అకౌంట్ ఓపెనింగ్? ( PPF Zero Account is Possible?)
గతంలో మాదిరి పీపీఎఫ్ పథకానికి జీరో అకౌంట్ ఓపెనింగ్ చేయడానికి వీలు లేదు. ఇంతకు మునుపు పిపిఎఫ్ పథకాన్ని జీరో అకౌంట్ తో ఓపెన్ చేసి తర్వాత అమౌంట్ చెల్లించే విధానం ఉండేది.
కానీ ప్రస్తుతం ఈ అవకాశాన్ని రద్దు చేయడం వల్ల పీపీఎఫ్ పథకం అకౌంట్ ఓపెన్ చేసిన ఆ సమయంలోనే మొదటి విడత డిపాజిట్లు చెల్లించవలసి ఉంటుంది.
8) PPF Nominee Changes ?
ముఖ్యంగా పిపిఎఫ్ పథకానికి సంబంధించి ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీగా ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
.PPF account తెరవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ( PPF Required Documents?)
1. అప్లికేషన్ ఫార్మ్ ( Application Form )
2. ఆధార్ కార్డు ( Aadar Card )
3. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) కార్డు ( Pan No )
4. ప్రస్తుత చిరునామాతో అడ్రస్ ప్రూఫ్ అందజేయాలి.
5. పాస్‌పోర్ట్ మొదలైన ఐడి ప్రూఫ్‌ను తప్పకుండా ఇవ్వవలసి ఉంటుంది.
6. సంతకం రుజువు చేయవలసి ఉంటుంది.
పై డాక్యుమెంట్స్ అందజేసిన తరువాత, PPF account తెరవడానికి అవసరమైన మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు.
.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF account ఎలా తెరవాలి?
ఆసక్తిగల వ్యక్తులు బ్యాంకులు లేదా పోస్టాఫీసులలో PPF account తెరవవచ్చు. ఇంతకుమునుపు, PPF account తెరవడం అనేది జాతీయం చేసిన బ్యాంకులలోమాత్రమే అనుమతించబడింది. అయితే, ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకులైన Axis, HDFC మరియు ICICI బ్యాంక్ కూడా PPF scheme ను అందిస్తున్నాయి.
• ముగింపు ( Conclusion )
PPF పథకానికి సంబందించిన పూర్తి సమాచారాన్ని మీకు అందించానని భావిస్తున్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ మరచినట్లైతే మన్నించి క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఈ వెబ్సైటు ద్వారా అన్ని ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు మరియు చిన్న తరహా వ్యాపారాల యొక్క వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.
PPF account member ku insurence untudha?
NO SIR ,
Last yr December account open chesanu 1lak 50 k tho , e year ae date na apply cheymnatru amount Interest extra vachedaniki
First of thanks to visit our blog… Before 5th of month sir
Ppf account holder madyalo maraniste benefits enti…?
Appativaraku manam save chesina amount manaki vastunda,???
first of thanks to visit our blog. appativaraku meeru diposit chesina amount ki interest add chesi amount istaru madam.