SBI Life Retire Smart Plan Details In Telugu
SBI Life Retire Smart Plan
ప్రస్తుతం వున్న పరిస్తితులలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు కానీ పదవీ విరమణ(Retirement) అయిన తరువాత సరైన ప్రణాళిక లేక చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. అమెరికా లో వున్న సైకియాట్రిక్ అసోసియేషన్ వెల్లడించింది ఏమిటంటే పెద్దవారిలో 70% మంది పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఏవిధంగా స్థిరపడలో తెలియక ఇబ్బందిపడుతున్నట్టు అంతే కాకుండా పెద్ద వయసు లో ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడకుండా జీవితాన్ని ఆనందంగా జీవించడానికి సరైన ఆర్థిక ప్రణాళిక అవసరం అవుతుంది. వీటికి అనుగుణంగా SBI సంస్థ ఈ ఎస్. బి.ఐ లైఫ్ రిటైర్ స్మార్ట్ ప్లాన్ ను మన ముందుకు తీసుకువచ్చింది.
పదవీ విరమణ తరువాత సంతోష జీవితాన్ని జీవించడానికి ఎస్.బి. ఐ (SBI) సంస్థ ఒక అద్భుతమైన ప్లాన్ ను తీసుకువచ్చింది అదే ఎస్.బి. ఐ లైఫ్ రిటైర్ స్మార్ట్ ప్లాన్(SBI Life Retire Smart Plan). ఈ ప్లాన్ ద్వారా లైఫ్ టైం మంత్లీ ఇన్కమ్ (Life Time Monthly Income) ను పొందవచ్చు. టాక్స్ బెనిఫిట్(Tax Benefit), డెత్ బెనిఫిట్ (Death Benefit) కూడా ఈ ప్లాన్ లో జత చేశారు.
ఎస్.బి. ఐ రిటైర్ స్మార్ట్ ప్లాన్ బెనిఫిట్స్(SBI Retire Smart Plan Benefit)
ఈ ఎస్.బి. ఐ లైఫ్ రిటైర్ స్మార్ట్ ప్లాన్ లో లిమిటెడ్ ప్రీమియం(Limited premium) చెల్లించడం ద్వారా లైఫ్ టైం ప్రతీ నెలకు రెగ్యులర్ ఇన్కమ్ ను పొందవచ్చు. స్టాక్ మార్కెట్ లో లభించే కాంపౌండ్ వడ్డీ ( Compound Interest) ను ఈ ప్లాన్ లో మనకు అందిస్తారు.
ఇది ఒక యూనిట్ లింక్డ్ ప్లాన్ అనగా మనం ప్రీమియం రూపం లో చెల్లించే అమౌంట్ ను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ ఈ ఎస్. బి.ఐ లైఫ్ రిటైర్ స్మార్ట్ ప్లాన్(SBI Life Retire Smart Plan) లో స్టాక్ మార్కెట్ లో హెచ్చు తగ్గులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా పాలసీ తీసుకున్న వ్యక్తి ప్లాన్ తీసుకునే సమయంలో నిర్ణయించుకున్న విధంగా పదవీ విరమణ తరువాత పొందే అమౌంట్ కి 101% గ్యారెంటీ బరోసా ను ఇస్తుంది.
పాలసీ పీరియడ్ పై 10% గారెంటీడ్ అడిషనల్ (Guaranteed Additional)+1.5% టెర్మినల్ బోనస్(Terminal Bonus) ప్రతీ సంవత్సరం యాడ్ (Add) చేస్తూవుంటారు.
గ్యారెంటీడ్ అడిషనల్ (Guaranteed Additional):
ఈ ప్లాన్ లో మనం తీసుకున్న ప్రీమియం(Premium) ను చెల్లించడానికి నిర్ణయించుకున్న పాలసీ పీరియడ్ (Period) లోపు ప్రీమియం ను చెల్లిస్తే, ఈ ప్లాన్ లో మనం తీసుకున్న పాలసీ పీరియడ్ పై ఆధారపడి ఈ గ్యారెంటీడ్ అడిషనల్ ఇవ్వడం జరుగుతుంది.
టెర్మినల్ బోనస్ (Terminal Bonus):
ఈ బోనస్ ను కంపెనీ తనకు వచ్చిన లాభాలను ప్లాన్ తీసుకున్న పాలసీ దారుడికి టెర్మినల్ బోనస్ (Terminal Bonus) రూపంలో అందిస్తాయి కానీ అది కంపెనీ యొక్క విచక్షణ పై ఆధారపడి వుంటుంది.
ప్రీమియం పేయింగ్ మోడ్(Premium Paying Mode):
పాలసీ దారుడికి తనకున్న వీలును బట్టి ప్రీమియం ను ఈ ప్లాన్ లో ప్లాన్ లో చెల్లించడానికి 3 రకాలుగా నిర్ణయించింది.
1) రెగ్యులర్ ప్రీమియం (Regular Premium):
వ్యక్తి ఎంచుకున్న పాలసీ పీరియడ్ చివరి వరకు ప్రీమియం చెల్లించాలి.
ఈ ప్రీమియం మనం 4 రకాలుగా చెల్లించవచ్చు.
A) సంవత్సరానికి (Yearly) – Rs 24000
B) అర్ధ సంవత్సరానికి (Half) –Rs 15000
C)క్వార్టర్లీ (Quarterly) –Rs 7500
D) నెలకు(Monthly)- Rs 2500
2) లిమిటెడ్ ప్రీమియం(Limited premium):
ఈ లిమిటెడ్ ప్రీమియం సెలెక్ట్ చేసుకున్న వారు పాలసీ పీరియడ్(సమయం)10 నుండి 14 సంవత్సరాల మధ్య ఎంచుకుంటే ప్రీమియం ను 5 లేదా 8 సంవత్సరాల వరకు మాత్రమే చెల్లించాలి.
పాలసీ పీరియడ్ ను 15 నుండి 35 సంవత్సరాల మధ్య ఎంచుకుంటే ప్రీమియం ను 5 (లేదా), 8(లేదా), 10(లేదా),15 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి.
ఈ ప్రీమియం మనం 4 రకాలుగా చెల్లించవచ్చు.
A) సంవత్సరానికి (Yearly)- Rs 40000
B) అర్ధ సంవత్సరానికి (Half)-Rs 20000
C)క్వార్టర్లీ (Quarterly) –Rs 10000
D) నెలకు(Monthly)-Rs 5000
3) సింగిల్ ప్రీమియం (Single Premium):
ప్రీమియం ను ఒక్కసారే చెల్లిస్తారు.
సంవత్సరానికి 1 లాక్ (Lak) చెల్లించాలి.
పై 3 రకాల ప్రీమియం లో అత్యధికంగా ఎంత అమౌంట్ అయిన కట్టవచ్చు.
అర్హతలు ( SBI Life Retire Smart Plan Eligibility)
కనీస వయసు -30 సంవత్సరాలు
అత్యధిక వయసు – 70 or 80 సంవత్సరాలు
మెచ్యూరిటీ వయసు – 80 సంవత్సరాలు
కనీస పాలసీ టర్మ్ – 10 సంవత్సరాలు
గరిష్ట పాలసీ టర్మ్ – 35 సంవత్సరాలు
ఈ ఎస్.బి. ఐ లైఫ్ రిటైర్ స్మార్ట్ ప్లాన్ ను ఉదాహరణ ద్వారా గమనిద్దాం.
రాము వయసు –30 సంవత్సరాలు, పాలసీ పీరియడ్-20 సంవత్సరాల రెగ్యులర్ ప్రీమియం (Regular Premium) ను ఎంచుకుని , మంత్లీ ప్రీమియం- Rs2500 చెల్లిస్తున్నాడు. పాలసీ ప్రీమియం ను 15 సంవత్సరాలు గా నిర్ణయించుకుంటే అతనికి 16 వ సంవత్సరం నుంచి ప్రతీ సంవత్సరం 10% చొప్పున గ్యారెంటీ అడిషనల్ మరియు 1.5% టెర్మినల్ బోనస్ అదనంగా లభిస్తాయి.
20 సంవత్సరాలుగా కట్టిన మొత్తం ప్రీమియం(Total Premium Paid) 6 లక్షలు రూపాయలు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సుమారుగా (Compound Interest) 15% వస్తుంది.
రాము కి మెచ్యూరిటీ 50 వ సంవత్సరానికి 16 లక్షలు అవుతుంది. దీన్ని ఆధారం చేసుకుని లైఫ్ టైమ్ మంత్లీ ఇన్కమ్ ను ఇస్తారు ఒకవేళ మెచ్యూరిటీ సమయంలో అమౌంట్ తీసుకోవాలి అనుకుంటే 60% అమౌంట్ ను తీసుకోవచ్చు.మిగిలిన 40% లైఫ్ టైమ్ మంత్లీ ఇన్కమ్ గా ఇస్తారు. రాము కి మంత్లీ పెన్షన్ లైఫ్ టైమ్- 11153 రూపాయలు లభిస్తాయి.
Also Read
SBI Life Smart Samriddhi Policy Telugu & సామాన్యులకి బంగారం లాంటి పధకం,100% గ్యారంటీ రిటర్న్స్!
ఇతర బెనిఫిట్స్ (Other Important Benefits)
డెత్ బెనిఫిట్ (Death Benefit):
మెచ్యూరిటీ(Maturity) కి ముందు రాము మరణిస్తే ఫండ్ వాల్యూ(Fund Value)+5% బోనస్ ను కలిపి ఇస్తారు.
మెచ్యూరిటీ తరువాత మరణిస్తే ఫండ్ వాల్యూ మొత్తం నామినీ(Nominee) కి అందజేస్తారు.
టాక్స్ బెనిఫిట్(Tax Benefit):
ఈ ప్లాన్ లో అండర్ సెక్షన్( Under Section) 80c వర్థించడం ద్వారా సంవత్సరానికి 2 లక్షల వరకు టాక్స్ డిడాక్షన్ (Tax Deduction) పొందవచ్చు.
అండర్ సెక్షన్( Under Section) 10d దీని వల్ల ప్లాన్ చివరిలో పొందే మెచ్యూరిటీ కి ఎటువంటి టాక్స్ కట్టనవసరం లేదు.
సరెండర్ (Surrender):
5 సంవత్సరాల తరువాత మీకు ప్లాన్ లో సూచించిన షరతులు ఇబ్బంది గా వుంటే ప్లాన్ ను సరెండర్ చేసి అప్పటి వరకు కట్టిన ప్రీమియం ను పొందవచ్చును.
ఫ్రీ లుక్ పీరియడ్ ( Free Look Period):
మీరు ఈ ప్లాన్ తీసుకున్న తరువాత ఏదైనా కారణం చేత ప్రీమియం ను వాపసు పొంది ప్లాన్ ను ముగించవచ్చును ఇందుకోసం మనం ఈ ప్లాన్ తీసుకున్న 15 రోజుల్లోపు ప్రక్రియ పూర్తిచేయాలి.
గ్రేస్ పీరియడ్ (Grace period):
మీరు ప్రీమియం ను సకాలంలో చెల్లించడం ఒక్కో సందర్భం లో వీలుకాకపోతే ఎటువంటి పెనాల్టీ పడకుండా ఈ గ్రేస్ పీరియడ్ కొంత సమయాన్ని ప్రకటించింది. నెలకు చెల్లించే వాళ్లకు 15 రోజులు,త్రైమాసిక,అర్ధ వార్షిక మరియు వార్షికంగా చెల్లించేవారికి 30 రోజులు.