LIC Jeevan Lakshya Plan In Telugu 933 – “విద్యా,వివాహం ,వ్యాపారానికి అద్భుతమైన పాలసీ ” అర్హతలు ఇవే !

    LIC Jeevan Lakshya Plan Details  In Telugu –  933

 

LIC Jeevan Lakshya Plan

జీవిత లక్ష్యనికి సంబందించిన పిల్లల చదువు, వివాహం,సొంత ఇల్లు నిర్మాణం, భవిష్యత్తులో వ్యాపార అభివృద్ధి ఇలా ఏదో ఒక లక్ష్యం నెరవేర్చడంలో మీకు సహాయపడుతుంది,అలాగే LIC జీవన్ లక్ష్య నాన్ లింకేడ్, పార్టిసిపేట్ ఇండివిడ్యుఅల్ ఎండోమెంట్ పాలసీ.
ఈ పాలసీ ద్వారా మెట్యూరిటీ మరియు మరణ ప్రయోజనాలు లభించడం తో పాటుగా ప్రీమియం వైవర్ బెనిఫిట్ అంతర్గంగా లభిస్తుంది,అదనంగా ఇతర రైడర్స్ ని LIC ఈ ప్లాన్ కి ప్రొవైడ్ చెయ్యడం జరగింది అందుకే LIC లోనే అత్యుత్తమ పాలసీగా జీవన్ లక్ష్య పేరూపొందింది.

LIC జీవన్ లక్ష్య టేబుల్ నెంబర్  – 933. ఇది ఒక లిమిటెడ్ ప్రీమియం ప్లాన్ కాబట్టి కొన్ని సంవత్సరాలు ప్లాన్ లో ప్రీమియం మాఫీ చేయబడుతుంది అలాగే ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా తక్కువ భీమా పొందవచ్చు.మెట్యూరిటీ ని ఒక్కసారే లేకపోతే ఇంస్టాల్మెంట్ రూపంలో పొందవచ్చు.LIC లోనే అత్యుత్తమ పాలసీగా జీవన్ లక్ష్య పేరూపొందింది.

 

 

 

• LIC జీవన్ లక్ష్య ఏ విధంగా పనిచేస్తుంది?( How Does its Work ?)

ఇది దాదాపు ఐదు రెట్లు రిస్క్ కవరేజ్ కలిగి  ఉన్న ఎండోమెంట్ పాలసీ.   ఈ పాలసీ యువతి యువకులకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది.        నిర్ణయించుకొన్న పాలసీ సమయం ఆధారంగా ప్రీమియం చెల్లించాలి, చివర్లో మెట్యూరిటీ బోనస్ తో కలిపి లభిస్తుంది. పాలసీ సమయం మధ్యలో పాలసీ తీసుకొన్న వ్యక్తి కి రిస్క్ జరిగితే 10% భీమా ప్రతీ సంవత్సరం కుటుంబానికి రెగ్యులర్ ఆదాయం రూపంలో అందివ్వడం జరుగుతుంది, చివర్లో మెట్యూరిటీ యదవిధిగా నామినికి లభిస్తుంది.

 

LIC Jeevan Lakshya Plan Bonus ,Features & Benefits

 

•  LIC జీవన్ లక్ష్య పాలసీలో  ప్రస్తుతం ఎంత  బోనస్ లభిస్తుంది? (New Bonus Rate )

ప్రతీ ఆర్థిక సంవత్సరంలో LIC పాలసీదారులకు బోనస్ ని ప్రకటిస్తుంది, లభించే బోనస్  పాలసీ సమయం పై  ఆధారపడి ఉంటాయి.

పాలసీ సమయం                        బోనస్ ( 2020- 2021)

13 నుంచి 15 సం||ల మధ్య           –   37 లేదా 38/1000
16 నుంచి  20 సం||ల మధ్య         –   41 లేదా  42/1000
20 సంవత్సరాలు పైబడి               – 45 లేదా  46/1000

ఇక్కడ బోనస్ ప్రతీ 1000 రూపాయలు కి  లభిస్తుంది,  అంటే లక్ష రూపాయల పాలసీని 20 సంవత్సరాలకు తీసుకొంటే  1,00,000 ÷ 1000 × 44 = 4400/-.
ఈ సంవత్సర బోనస్ గా మీకు లభిస్తుంది.

 

•  LIC జీవన్ లక్ష్య పాలసీ ఫీచర్స్ – Jeevan Lakshya Key Features

1. అందరికి అందుబాటులో ఉండే విధంగా లక్ష రూపాయల కనీస భీమా అవధి, అత్యధికముగా 10 వేలు గణిస్తూ భీమా పొందవచ్చు.

2. ప్రాథమిక భీమాలో 10% భీమాను రెగ్యులర్ ఇన్కమ్ రూపంలో మొత్తం పాలసీ సమయం అందివడం జరుగుతుంది, మెట్యూరిటీ యదవిధిగా లభిస్తుంది.

4. లిమిటడ్ ప్రీమియం రూపంలో చివర 3 సంవత్సరాలు ప్రీమియం మాఫీ మరియు డబల్ బెనిఫిట్స్.

2. ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్ అంతర్గతంగా అందివ్వడం వల్ల వేరుగా అదనపు ప్రీమియం విధించడం జరగదు.

3. 13 నుంచి 25 సంవత్సరాల మధ్య పాలసీ సమయం లభిస్తుంది మరియు ప్రీమియం 4 రకాలుగా పే చెయ్యవచ్చు.

4. ఎండోమెంట్ రాబడులు ఈ పాలసీలో గమనించగలరు, వేస్టెడ్ సింపుల్ రెవిసనరీ మరియు ఫైనల్ అడిషనల్ బోనస్ LIC గ్రాహకులకి అందిస్తుంది.

5. అదనపు ప్రయోజనం కొరకు 3 రకాల బెనిఫిట్ రైడర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.

 

•  LIC జీవన్ లక్ష్య బెనిఫిట్స్ – Jeevan Lakshya Benefits

మరణ ప్రయోజనం – Death Benefit

పాలసీ మధ్యలో భీమదారునికి రిస్క్ జరిగితే,ప్రీమియం వైవర్ రైడర్ కారణంగా పాలసీ క్లోజ్ చెయ్యడం జరగదు. భవిష్యత్ ప్రీమియం lic సంస్థ చెల్లిస్తుంది.
ప్రాథమిక భీమా నుంచి 10% గా రెగ్యులర్ ఇన్కమ్ రూపంలో పాలసీడారుని కుటుంబానికి మొత్తం పాలసీ సమయం అందిస్తుంది, చివర్లో 110%  ప్రాథమిక భీమా మరియు బోనస్ యదావిధిగా నామికి లభిస్తాయి.

మెట్యూరిటీ ప్రయోజనం – Maturity Benefit

ప్రాథమిక భీమా + వేస్టెడ్ బోనస్ + ఫైనల్ అడిషనల్ బోనస్ పాలసీదారుడు చివరి వరకు జీవించి ఉంటే మెట్యూరిటీ గా అందివ్వడం జరుగుతుంది. పైడ్ అప్ పాలసీకి ప్రీమియం మరియు బోనస్ మాత్రమే లభిస్తుంది.

 

 .అర్హతలు –  LIC Jeevan Lakshya Plan  Eligibility

 

              Particulars 

          Eligibility

Minimum Basic Sum Assured 

Rs 1,00,000

Miximum Basic Sum Assured 

No Maximum Limit

Policy Term

13 Years - 25 Years 

Premium Paying Term 

Policy Term - 3 Years 

Minimum Age At Entry

18 Years Completed

Miximum Age At Entry

50 Years Only

Maximium Maturity Age

65 Years

 

టేబుల్ వివరాలు :-

. పాలసీ తీసుకోవడానికి కనీస భీమా లక్ష రూపాయలు, అత్యధికముగా ఎంత భీమాని అయిన తీసుకోవచ్చు.
. అలాగే కనీస పాలసీ సమయం 13 సంవత్సరాలు, అత్యధికంగా 25 సంవత్సరాలకి తీసుకోవచ్చు.
. పాలసీ సమయం కంటే 3 సంవత్సరాలు తక్కువ, ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు వారికి ఈ పాలసీ       వర్తిస్తుంది.
. అత్యధికముగా 65 సంవత్సరాలు అత్యధిక మెట్యూరిటీ సమయం ఉంటుంది.

 

LIC Arogya Rakshak Plan In Telugu ; కుటుంబం మొత్తానికి ఒక్కటే ఆరోగ్య పాలసీ & పూర్తి వివరాలు ఉదాహరణ ద్వారా !

PPF Scheme in Telugu -& పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్& అర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!

 

• చెల్లించే ప్రీమియంపై  డిస్కౌంట్ ఎంత లభిస్తుంది?  ( Premium  Rebate ? )

1.  సంవత్సరానికి ఒకసారి  – Yearly            = 2%
2. 6 నెలలకు ఒకసారి         – Half Yearly   = 1%
3. 3 నెలలకు  ఒకసారి        – Quarterly      = Nil
4. ప్రతినెలా                          – Monthly        = Nil

ఇక్కడ రిబేట్ అంటే మీరు చెల్లించే ప్రీమియం అమౌంట్ పై   కొద్దిగా  తగ్గించడం జరుగుతుంది. ఈ పాలసీలో సంవత్సరానికి మరియు 6 నెలలకు ఒకసారి  ప్రీమియం చెల్లించేవారికి ఈ రిబేట్ లభిస్తుంది.

 

• భీమాపై  ఎంత  డిస్కౌంట్ లభిస్తుంది? ( Rebate On high basic Sum Assured? )

భీమా ( Basic Sum Assured )                      రిబేట్

1. 1, 00, 000 నుంచి  1, 90, 000                       = Nil
2. 2, 00, 000 నుంచి  4, 90, 000                      = 2.00%
3. 5, 00, 000 నుంచి  అత్యధికముగా               = 3.00%

 

 • ఈ పాలసీలో  లభించే టాక్స్ ప్రయోజనాలు?  ( Tax Benefits?)

చెల్లించే ప్రీమియంపై ఇన్కమ్ టాక్స్ రూల్ అండర్ సెక్షన్  80c  వర్తిస్తుంది, ప్రతీ సంవత్సరo  1,50,000/- వరకూ  టాక్స్ డేడిక్షన్ పొందవచ్చు.

పాలసీలో లభించే  మెట్యూరిటీ మరియు మరణ ప్రయోజనాల పై  ఇన్కమ్ టాక్స్ రూల్  అండర్ సెక్షన్ 10D  వర్తిస్తుంది.
కాబట్టి ఎటువంటి టాక్స్ విధించబడదు. మొత్తం అమౌంట్ టాక్స్ రహితంగా పాలసీదారునికి లభిస్తుంది.

 

 

ఉదాహరణ – LIC Jeevan Lakshya Plan  Example

 

పాలసీదారుని పేరు                – Mr. నరేష్
వయసు                                    – 30 సంవత్సరాలు
పాలసీ సమయం                    – 20 సంవత్సరాలు
భీమా                                         – 5 లక్షలు
ప్రీమియం చెల్లించే విధానం –  ప్రతినెలా
నెలసరి ప్రీమియం                 – Rs 1,817/-( ఈ  ప్రీమియం GST చార్జీలతో కలిపి )

పాలసీలో చెల్లించే ప్రీమియంపై సంవత్సరానికి ఒకసారి    30% టాక్స్ రిటర్న్ లభిస్తుంది. కాబట్టి  నరేష్ కి ప్రతి సంవత్సరం లభించే టాక్స్ డేడిక్షన్   = Rs 6,546/-

ప్రతినెలా ఈ పాలసీలో  1,817/- రూపాయలు చొప్పున 30 సంవత్సరాలలో  చెల్లించిన మొత్తం ప్రీమియం వచ్చి  =Rs 4,70,170/- అవుతుంది..

 

మెట్యూరిటీ ప్రయోజనం – Maturity Benefit

ప్రాథమిక భీమా + వేస్టెడ్ బోనస్ + ఫైనల్ అడిషనల్ బోనస్ పాలసీదారుడు చివరి వరకు జీవించి ఉంటే మెట్యూరిటీ గా అందివ్వడం జరుగుతుంది.

బేసిక్ సమ్ అస్సుర్డ్       ( Basic Sum Assured)                   = Rs 5,00,000/-
వేస్టెడ్ సింపుల్ బోనస్    ( Vested Simple Revisionary )   = Rs 5,75,000/-
ఫైనల్ అడిషనల్ బోనస్     ( Final Additional Bonus  )    = Rs 2,25,000/-

మొత్తం మెట్యూరిటీ – Rs 13,00,000/- Mr. నరేష్ కి మెట్యూరిటీ గా LIC అందిస్తుంది.

 

మరణ ప్రయోజనం – Death Benefit

25 సంవత్సరాల పాలసీ సమయంలో  Mr. నరేష్ కి ఎప్పుడు రిస్క్ జరిగినా పాలసీ తీసుకొన్న వెంటనే లేకపోతే కొద్దికాలం తర్వాత క్రింద విధంగా ప్రయోజనం నామినికి అందివ్వడం జరుగుతుంది.

ఉదాహరణ కి నరేష్ యొక్క రిస్క్ ప్లాన్ యొక్క 10 వ సంవత్సరం జరిగితే 10% అఫ్ బేసిక్ సమ్ అస్సుర్డ్ రూపంలో ప్రతి సంవత్సరం Rs 50,000/- చొప్పున రెగ్యులర్ ఆదాయం మొత్తం పాలసీ సమయం నామినీకి లభిస్తాయి మరియు ప్లాన్ లో చెల్లించవలసిన భవిష్యత్ ప్రీమియం మాఫీ చేయబడుతుంది.

ఈ విధంగా లభించే రెగ్యులర్ ఆదాయం = Rs 7,50,000/- అవుతుంది

దీనితోపాటుగా ప్లాన్ యొక్క 25 వ సంవత్సరం

బేసిక్ సమ్ అస్సుర్డ్             ( 110% Basic Sum Assured)                 = Rs 5,50,000/-
వేస్టెడ్ సింపుల్ బోనస్        ( Vested Simple Revisionary )             = Rs 5,75,000/-
ఫైనల్ అడిషనల్ బోనస్      ( Final Additional Bonus  )                  = Rs 2,25,000/-

మొత్తం మెట్యూరిటీ – Rs 13,50,000/– Mr. నరేష్  కుటుంబానికి మెట్యూరిటీ గా LIC అందిస్తుంది.

అందువల్ల LIC జీవన్ లక్ష్య భవిష్యత్ లక్ష్యలు సులభంగా నెరవేర్చడంలో మీకు ఉపయోగపడవచ్చు.

 

Most Important Benefits :-

• సెటిల్మెంట్ ఆప్షన్ – Settlement In LIC

1.  వర్తిస్తుంది! ఈ విధానం ద్వారా మొత్తం మెట్యూరిటీ అమౌంట్ ని పాలసీ చివర్లో ఒక్కసారే పొందవచ్చు, లేకపోతే వాయిదాల పద్దతిలో  5, 10, మరియు  15 సంవత్సరాల సమయం నిర్ణయించుకొని, ప్రతినెలా, ప్రతీ 3 నెలలకు, 6 నెలలకి ఒక్కసారి మరియు సంవత్సరానికి ఒకసారి  లభించేలా నిర్ణయించుకొనే  సదుపాయం ఉంటుంది. ఆ విధంగానే  మీకు రెగ్యులర్ గా ఈ మెట్యూరిటీ అమౌంట్ లభిస్తుంది.

ముఖ్య గమనిక :  పాలసీదారుడు  కనీసం 3 నెలలు పాలసీ సమయం మిగిలి ఉండగానే సంస్థకి సెటిల్మెంట్ గురించి తెలియచేయాల్సి ఉంటుంది.

 

• ఫ్రీ లుక్ పీరియడ్ – Free Look Period

పాలసీ యొక్క షరతులు, నియమాలపై అసంతృప్తి చెందితే బ్రాంచ్ ద్వారా పాలసీ కనుగోలు చేస్తే 15 రోజులు, ఇతర మధ్యమాల ద్వారా పాలసీని కనుగోలు చేస్తే 30 రోజులు ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది.

ఈ సమయంలో పాలసీ క్యాన్సిల్ చేసి ప్రీమియం రిటర్న్ గా పొందవచ్చు.

 

• గ్రేస్ పీరియడ్ – Grace Period

వార్షిక, అర్ధవార్షిక మరియు ట్రైమాసిక  ప్రీమియం చెల్లించే వారికి ఆధనంగా 30 రోజులు అధిక సమయం ఉంటుంది.ప్రతి నెలా ప్రీమియం చెల్లించే వారికీ 15 రోజులు పీరియడ్ ఉంటుంది.
ఈ పీరియడ్ లో ఎటువంటి అదనపు పెనాల్టీ విధించబడదు మరియు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ వర్తిస్తుంది. 30 రోజులు సమయం దాటితే పాలసీ లాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది.

             https://licindia.in/

• ప్రీమియం చెల్లింపు విధానం – ( Premium Mode )

1. సంవత్సరం           – Yearly
2. అర్ద సంవత్సరం  – Half Yearly
3. త్రైమాసిక              – Quarterly
4. నెలవారీ                 – Monthly చెల్లింపులు జరుగుతాయి.

 

• పాలసీ రివైవల్  – Revival Of Policy

ఈ పాలసీకి  5 సంవత్సరాలు  రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది.
పాలసీదారుడు ఏదైనా కారణంగా ఈ పాలసీలో 5 సంవత్సరాలు రెగ్యులర్ గా  ప్రీమియం చెల్లించలేనట్లైతే ఈ పాలసీ ముగియవేయబడుతుంది.
కాబట్టి అటువంటి సమయంలో 5 సంవత్సరాల లోపు మొత్తం బాకీ ప్రీమియంని పెనాల్టీతో కలిపి   చెల్లిస్తే  ఈ పాలసీలో తిరిగి కొనసాగే సదుపాయం ఉంటుంది.దీనినే రివైవల్ అఫ్ పాలసీ అని పిలుస్తారు.

 

•  లోన్ సదుపాయం – Loan Facility

జీవన్ ఆనంద్ పాలసీలో పాలసీదారుడు  కనీసం 2 సంవత్సరాలు   పూర్తి ప్రీమియం చెల్లిస్తే ,  అత్యవసర పరిస్థితుల్లో  జమ చేసిన  ప్రీమియం పై  లోన్ కూడా పొందవచ్చు.

అది ఎంత అంటే మీయొక్క సరెండర్ వేల్యూకి 90% గా మరియు పైడ్ అప్ పాలసీలకు 80% లోన్ లభిస్తుంది.

 

 Benefit Riders Availability :-

1. ఆక్సిడెంట్  డెత్ మరియు  డిజాబిలిటీ బెనిఫిట్ రైడర్ ( Accidental Death  And Disability Benefit Rider – UIN  512B209V02)

ఈ రైడర్ తీసుకొన్న పాలసీదారుడు ఆక్సిడెంట్ కారణంగా మరణిస్తే  ప్రాథమిక భీమాకి లభించే మరణ ప్రయోజనం తోపాటు అందనంగా , మరికొంత అత్యధిక ప్రయోజనం నామినికి లభించడం జరుగుతుంది.ఇది మొదటి ప్రయోజనం.అత్యధికముగా 70 సంవత్సరాల వరకు రైడర్ కవరేజ్ ని మీరు వినియోగించుకోవచ్చు.

ఈ రైడర్ ను పాలసీదారుడు పాలసీసమయంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. చివరి 5 సంవత్సరాలు ఇంకా పాలసీసమయం మిగిలిఉన్నా  అప్పుడు కూడా తీసుకొనే సదుపాయం ఉంటుంది.

ఒకవేళ పాలసీదారుడు డిసబిలిటీ కి గురైతే వెంటనే పాలసీకి సంబందించిన భవిష్యత్తు ప్రీమియంస్ అన్ని మాఫీ చెయ్యడయం జరుగుతుంది,అప్పట్నుంచి మొత్తం ప్రీమియంని LIC సంస్థే చెల్లిస్తుంది.
దీనితోపాటుగా  ఈ రైడర్ ద్వారా లభించే మొత్తం ప్రయోజనాన్ని   పాలసీదారునికి  ప్రతినెలా రెగ్యులర్ సహాయం రూపంలో 10 సంవత్సరాలపాటు  అందివ్వడం జరుగుతుంది.

 

2. కొత్త  క్రిటికల్ ఇల్లన్స్ బెనిఫిట్ రైడర్ ( Critical Illness Benefit Rider – UIN 512A212V01)

ఈ రైడర్ మీకు పాలసీ సమయంలో  ఆరోగ్య భీమా  ప్రయోజనం కలిగిస్తుంది.
అంటే పాలసీదారుడు ఏదైనా పెద్ద అనారోగ్యానికి గురిఅయినట్లైతే  ( కాన్సర్, హార్ట్ అట్టాక్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ సంబంధిత మొదలైనవి ) ట్రీట్మెంట్ కి కావాల్సిన మొత్తం ఖర్చును LIC సంస్థ అందిస్తుంది.

 

3. టర్మ్ రైడర్  ( Term Rider – UIN 512B210V01)

ఈ రైడర్ పాలసీ తీసుకొనే సమయంలో మాత్రమే తీసుకొనే సదుపాయం ఉంటుంది పాలసీ మధ్యలో లభించదు.

ఈ టర్మ్ రైడర్  యొక్క ముఖ్య ప్రయోజనం?

పాలసీదారుడు పాలసీ సమయంలో ఏ కారణంగా మరణించినా అంటే  సాధారణంగా గాని లేదా ఆక్సిడెంట్ కారణంగా కానీ మరణిస్తే  తీసుకొన్న భీమాకి  సమానమైన అమౌంట్ నామినీకి  అదనంగా లభిస్తుంది.

 

4. LIC ఆక్సిడెంట్ బెనిఫిట్ రైడర్  ( Accident Benefit Rider – UIN 512B203VO3 )

పాలసీదారుని రిస్క్ ఆక్సిడెంట్ కారణం చేత జరిగితే ఈ రైడర్ తన ప్రయోజనాన్ని నామినికి అందిస్తుంది.

 

• పైడ్ అప్ వేల్యూ – Paid Up Value

ఈ పాలసీలో మీరు రెగ్యులర్ గా  2 సంవత్సరాలు  లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు  ప్రీమియం చెల్లించి, ఏదైనా అనివార్య కారణాల కారణంగా  పాలసీలో ప్రీమియం  చెల్లించడం మానివేసినప్పటికీ  ఇన్సూరెన్స్ వర్తించడం ఆగిపోదు. అప్పటివరకు చెల్లించిన  ప్రీమియంని ఆధారంగా చేసుకొని  పాలసీ బెనిఫిట్స్ పాలసీదారునికి  లభించడం జరుగుతుంది.

 

తరచుగా అడిగే ప్రశ్నలు  -LIC Jeevan Lakshya Plan  ( Q & A)

 

1. LIC జీవన్ లక్ష్య పాలసీ గురించి విలువైన  సూచనలు తెలుపండి ?

జ. మీరు , మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు. జీవన్ లక్ష్య పాలసీ అంతిమ లక్ష్యం గా  మీ పిల్లల చదువు లేదా వివాహం సమయంలో మీరు ఏకమొత్తాన్ని పొందుతారు.
LIC జీవన్ లక్ష్య పాలసీ లాభదాయక ఎండోమెంట్ ప్లాన్ మరియు ప్రీమియం చెల్లింపు వ్యవధి పాలసీ కాలపరిమితి కంటే మూడు సంవత్సరాలు తక్కువ.

2. LIC జీవన్ లక్ష్య పాలసీ గురించి సంక్షిప్తంగా  సమీక్షలు తెలియజేయండి ?

జ. యువ తల్లిదండ్రులందరికీ,  కుటుంబ పోషణ బాధ్యత తీసుకున్న వారికి,  ముఖ్యంగా తమ పిల్లలను ప్రేమించే వారికి జీవన్ లక్ష్య పాలసీని గట్టిగా సిఫార్సు చేయవచ్చు.

ఇది అత్యుత్తమ వినూత్నమైన,  సృజనాత్మకమైన మరియు అద్భుతమైన భవిష్యత్తు అవసరాల పాలసీలలో ఒకటి గా ప్రజాదరణ పొందింది.  ప్రధానంగా ఈ పాలసీ 20 నుండి 35 ఏళ్ల వయస్సు గల యువ తల్లిదండ్రులకు ఉత్తమమైనది!
ఇతర పాలసీల మాదిరిగానే మెచ్యూరిటీ బెనిఫిట్స్‌తో పాటుగా చాలా మంచి ఫీచర్‌లు ఇందులో  అందజేయబడ్డాయి !
ఇందులో ప్రమాదం సంభవించినప్పుడు బీమా ఉద్దేశపూర్వకంగా ఉంటుంది.

 

వీటిని కూడా తెలుసుకోండి – Also Read

 

3. నేను  LIC జీవన్ లక్ష్య పాలసీని (ప్లాన్ 933) ఎందుకు తీసుకోవాలి ?

జ. LIC ఏజెంట్ గా ఉన్న మా  బంధువు ద్వారా ఈ పాలసీని  బలవంతంగా తీసుకోవడం జరిగింది.  మరియు ఫిబ్రవరి 2019 నుండి పాలసీ అమలు చేయబడుతోంది.
మీ బంధువు మీ పిల్లలను దృష్టిలో ఉంచుకొని  అందించిన ఈ పాలసీ  ద్వారా మీకు గొప్ప సహాయం చేసారు. మీ పిల్లల గురించి మీరు కనే  మీ కలలు ఈ  LIC  జీవన్ లక్ష్య ద్వారా నెరవేరుతాయి. మీ కుటుంబానికి భీమా చెల్లించ బడుతుంది.

మీరు లేనప్పుడు మీ కుటుంబానికి అందే  భీమా:-

ఉదాహరణకు Sum Assured  15,00,000
పీరియడ్ 21 సంవత్సరాలు.

1.  ప్రమాదవశాత్తు మరణిస్తే  31,50,000 అందజేయబడుతుంది. ఇంకా  టర్మ్ రైడర్‌ను ఎంచుకుంటే కుటుంబానికి ఆర్థిక ఉపశమనం లభిస్తుంది.
2. తదుపరి ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదు.
3. ప్రతి సంవత్సరం 1,50,000 నుండి 21 సంవత్సరాల వరకు పిల్లల విద్యను కొనసాగించడానికి సిద్ధమవుతుంది.
4. పరిపక్వత SA+ బోనస్ (సుమారు 30 లక్షలు వరకు)

ఏదైనా పాలసీదారుకు మాత్రమే ఏదైనా జరిగితే, పైన పేర్కొన్నవన్నీ చెల్లించబడతాయి. వాస్తవానికి మీరు SA +బోనస్ పొందుతారు, ఇది పిల్లల ఉన్నత విద్య మరియు వివాహానికి ఉపయోగపడుతుంది.

మీరు ఇప్పటికీ పాలసీని  తీసుకోవడం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లయితే, పాలసీ బాండ్ అందుకున్న 15 రోజులలోపు మీరు LIC  కార్యాలయాన్ని సంప్రదించడం ద్వారా దానిని రద్దు చేసుకోవచ్చు.

4. LIC జీవన్ లక్ష్య ప్లాన్‌లో డెత్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి?

జ. పాలసీ వ్యవధి ముగిసేలోపు పాలసీదారు మరణించిన సందర్భంలో, నామినీ కిందివాటిని అందుకుంటారు:
1.మెచ్యూరిటీ తేదీకి చెల్లించాల్సిన బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 110% చెల్లించబడుతుంది.
2.మెచ్యూరిటీ తేదీకి చెల్లించాల్సిన పాలసీ వ్యవధి మొత్తంలో ఉన్న సింపుల్ రివర్షనరీ బోనస్.
3.మెచ్యూరిటీ తేదీకి చెల్లిస్తున్నట్లు ప్రకటించినట్లయితే ఫైనల్ అడిషనల్  బోనస్.
4.పాలసీదారు మరణించిన తేదీ నాటికి చెల్లించిన అన్ని ప్రీమియంలలో డెత్ బెనిఫిట్ 105% కంటే తక్కువ కాకుండా నామినికి ఇవ్వబడును.

5. LIC జీవన్ లక్ష్య ప్రణాళికలో మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి?

జ. పాలసీ వ్యవధి ముగింపు సందర్భంగా, పాలసీదారు ఈ క్రింది వాటిని అందుకుంటారు:
1). ప్రాథమిక హామీ మొత్తం
2). సాధారణ రివర్షనరీ బోనస్
3). పాలసీ నిబంధనల ప్రకారం ఫైనల్ అడిషనల్  బోనస్.

How to Take Policy

•   ఈ పాలసీని  ఎలా  తీసుకోవాలి? ఏ ఏ  డాకుమెంట్స్ కి అవసరం ఉంటుంది?
( Documents Required?)

ఈ పాలసీని మీరు LIC  ఆఫీసియల్ వెబ్సైటు ద్వారా ఆన్లైన్లో తీసుకోవచ్చు  లేదా ఆఫ్ లైన్ ఏజెంట్ మాధ్యమంగా తీసుకొనే సదుపాయం ఉంటుంది.

• కావలసిన డాకుమెంట్స్

1. మీయొక్క పూర్తి వివరాలు నింపిన ప్రపోసల్ ఫారం.
ఈ  ఫారం నెంబర్ – 300 & 340.

2. ఆధార్ కార్డు                –   (  Age Proof )
3. ఓటుగుర్తింపు కార్డు     –   ( Address Proof )
4. పాన్ కార్డు                    –   (   KYC  Verification )
5.  మెడికల్ రిపోర్ట్          –   ( Health Condition )

 

• ముగింపు  ( Conclusion )

జీవన్ ఆనంద్ పాలసీకి సంబందించిన పూర్తి సమాచారాన్ని మీకు అందించానని భావిస్తున్నాను.

ఈ వెబ్సైటు ద్వారా అన్ని   ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు  మరియు  చిన్న తరహా వ్యాపారాల యొక్క   వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *