SBI Life Saral Retirement Saver Telugu
SBI Life Saral Retirement Saver Telugu
వృద్ధాప్యంలో స్వాతంత్రంగా జీవించడం అంటే మీ యొక్క ఆత్మగౌరవం నిలుపుకొన్నట్లే, వృద్ధాప్యంలో హాయిగా జీవించడం కొరకు మంచి పెన్షన్ ప్లాన్ గురించి వెతుకుతున్నారా? ఏ స్కీం కూడా మీకు సంతృప్తికరంగా అనిపించలేదా? అయితే ఎస్. బి. ఐ. లైఫ్ శరల్ రిటైర్ సేవర్ పాలసీ మీకు సహాయపడవచ్చు.
ఎస్. బి. ఐ. లైఫ్ శరల్ రిటైర్ సేవర్ మార్కెట్ రిస్క్ తో సంబంధం లేని ఇండివిడ్యుఅల్ రిటైర్మెంట్ స్కీం.18 సంవత్సరాల వయసు నుంచే వృద్ధాప్య జీవితం సుఖమయం చేసుకోవడానికి అద్భుతమైన పాలసీ మరియు నియమిత సమయo వరకూ మాత్రమే ప్రీమియం చెల్లింపులు.ఎస్. బి. ఐ. లైఫ్ శరల్ రిటైర్ సేవర్ ప్లాన్ ద్వారా సరెండర్, పూర్తి విత్ డ్రాల్, వేస్టింగ్ బెనిఫిట్ మొదలైన సౌకర్యాలు పొందవచ్చు.
•ఎస్. బి. ఐ. లైఫ్ శరల్ రిటైర్ సేవర్ ఫీచర్స్ – Features
1. గ్యారెంటెడ్ అడిషన్ బెనిఫిట్ – Guaranteed Addition.
భీమాదారునికి మొదటి 5 సంవత్సరాలు అదనపు ప్రయోజనం గా గ్యారెంటెడ్ అడిషన్ అందివ్వడం జరుగుతుంది.
మొదటి 3 సంవత్సరాలు ప్రాథమిక భీమపై 2.50%, తర్వాత 2 సంవత్సరాలు ప్రాథమిక భీమపై 2.75% గ్యారెంటెడ్ అడిషన్ లభిస్తుంది. పెన్షన్ ప్లాన్స్ లో ఇది అదనపు ప్రయోజనం.
Guaranteed Addition :-
1st 3 Years = 2.50% of Basic Sum Assured
Next 2 Years = 2.50% of Basic Sum Assured
2. వెస్టింగ్ బెనిఫిట్ – Vesting Benefit
ప్రాథమిక భీమా పై 0.25% రూపంలో ప్రతీ సంవత్సరం రెగ్యులర్ గా పాలసీదారునికి అందివ్వడం జరుగుతుంది. ఈ బోనస్ కాంపౌండ్ ఇంటరెస్ట్ గా ( చక్ర వడ్డీ ) పాలసీదారునికి లభిస్తుంది, వ్యక్తి కి 40 సంవత్సరాల వయసు నుంచి ఈ వెస్టింగ్ బోనస్ లభించడం జరుగుతుంది.
3. మరణ ప్రయోజనం – Death Benefit
పాలసీ సమయం మధ్యలో ఎప్పుడు రిస్క్ జరిగినా అప్పటివరకు చెల్లించిన ప్రీమియం + లభించే బోనస్ నామినికి డెత్ బెనిఫిట్ గా లభిస్తుంది.
Death Benefit = Paid Premium + Bonus
4. లైఫ్ కవర్ ఫెసిలిటీ – Life Cover Facility
సాధారణంగా యాన్యూటీ లేదా పెన్షన్ ప్లాన్స్ లో జీవిత భీమా లభించడం జరగదు. కానీ SBI Life Saral Retire Saver ప్లాన్ లో టర్మ్ రైడర్ ని అందివ్వడం జరిగింది. రైడర్ ద్వారా నిర్ణయం చేసిన అమౌంట్ నామినీకి అదనపు ప్రయోజనం అందిస్తుంది.
5. మెట్యూరిటీ ప్రయోజనం – Maturity Benefit
ఎస్. బి. ఐ. లైఫ్ శరల్ రిటైర్ సేవర్ ప్లాన్ లో మేట్యూరిటీ ఈ క్రింద విధంగా లభిస్తుంది.
1. వేస్టింగ్ మేట్యూరిటీ ( Vesting Maturity )
2 .వేస్టెడ్ సింపుల్ రెవిషనరీ బోనస్ ( Vested Simple Reversionary Bonus )
3 . టర్మనల్ బోనస్ ( Terminal Bonus )
ముఖ్య గమనిక :-
ఇందులో 60% అమౌంట్ ని విత్ డ్రాల్ చేసే సదుపాయం ఉంటుంది మిగిలిన 40% తో యాన్యూటీ ని కనుగోలు చెయ్యవచ్చు. పూర్తి వివరాలు ఇదే బ్లాగ్ లో ముందు ఉదాహరణ లో తెలుసుకొందాం.
అర్హతలు – Saral Retirement Saver Eligibility
• పాలసీని తీసుకోవడానికి కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
అత్యధిక వయసు రెగ్యులర్ ప్రీమియం = 60 సం ||లు
సింగల్ ప్రీమియం = 65 సం ||లు
• కనీస వెస్టింగ్ వయసు = 40 సంవత్సరాలు
అత్యధిక వెస్టింగ్ వయసు = 70 సంవత్సరాలుగా ఉంటుంది.
• ప్లాన్ ఆప్షన్స్ – Plan Options
1. రెగ్యులర్ ప్రీమియం – పాలసీ సమయం మొత్తం ప్రీమియం చెల్లించడం.
2. సింగల్ ప్రీమియం – పాలసీకి సంబందించిన మొత్తం అమౌంట్ ని ఒక్కసారే చెల్లించడం.
• పాలసీ సమయం – Policy Period
ఎస్. బి. ఐ. లైఫ్ శరల్ రిటైర్ సేవర్ ప్లాన్ యొక్క సమయం కనీసం 13 సంవత్సరాల నుంచి అత్యధికముగా 40 మధ్యలో నిర్ణయం చేసుకోవచ్చు.
ముఖ్య గమనిక :-
రెగ్యులర్ ప్రీమియం చెల్లించేవారికి కనీసం 10 సంవత్సరాలు, సింగల్ ప్రీమియం చెల్లించేవారికి కనీసం 5 సంవత్సరాల పాలసీ సమయం తప్పనిసరి.
• భీమా అవధి – Bhima Limits
కనీస భీమా = లక్ష రూపాయలు
అత్యధిక భీమా = ఎటువంటి పరిధి లేదు
• ప్రీమియం చెల్లింపులు -Premium Payment Mode
4 రకాలు గా ఈ ప్లాన్ లో ప్రీమియం చెల్లించవచ్చు.
వార్షిక – ( Yearly )
అర్ద వార్షిక – ( Half Yearly )
ప్రతి నెలా – ( Monthly ) మరియు
సింగల్ – ( Single Premium ) ఒక్కసారే.
అయితే ఈ ప్లాన్ యొక్క వార్షిక కనీస ప్రీమియం వచ్చి = Rs 7,000/-.
• లభించే టాక్స్ ప్రయోజనాలు – (SBI Life Saral Retirement Saver Tax Benefits)
పాలసీలో చెల్లించే ప్రీమియంపై ఇన్కమ్ టాక్స్ రూల్ అండర్ సెక్షన్ 80c వర్తిస్తుంది, ప్రతీ సంవత్సరo Rs.1,50,000/- వరకూ టాక్స్ డేడిక్షన్ క్లెయిమ్ లభిస్తుంది..
ప్లాన్ లో లభించే మెట్యూరిటీ మరియు మరణ ప్రయోజనాల పై ఇన్కమ్ టాక్స్ రూల్ అండర్ సెక్షన్ 10D వర్తిస్తుంది.
కాబట్టి ఎటువంటి టాక్స్ విధించబడదు.
• గ్రేస్ పీరియడ్ ( Grace Period )
గ్రేస్ పీరియడ్ అంటే ఈ పాలసీలో మీరు ప్రీమియంని చెల్లించవలసిన తేదీలోపు చెల్లించలేనప్పటికీ అధనంగా కొద్దిగా సమయం ఉంటుంది.
సంవత్సరానికి ఒకసారి,6 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లిస్తారో వారికీ అధనంగా 30 రోజులు సమయం ఉంటుంది.
పాలసీలో ప్రతినెలా ప్రీమియం చెల్లించేవారికి 15 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది.
ముఖ్య గమనిక : ఈ సమయంలో అదనపు పెనాల్టీని సంస్థకి చెల్లించవలసిన అవసరం ఉండదు.
అయినప్పటికీ ఈ గ్రేస్ పీరియడ్ సమయంలో కూడా మీకు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ యదవిధిగా లభిస్తుంది.
• పాలసీకి పైడ్ అప్ వేల్యూ వర్తిస్తుందా? లేదా? – Paid Up Value
వర్తిస్తుంది!
ఈ పాలసీలో రెగ్యులర్ గా 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ప్రీమియం చెల్లించి, తర్వాత ఏదైనా అనివార్య కారణాల కారణంగా పాలసీలో ప్రీమియం చెల్లించడం మానివేసినప్పటికీ ఇన్సూరెన్స్ వర్తించడం ఆగిపోదు. అప్పటివరకు చెల్లించిన ప్రీమియంని ఆధారంగా చేసుకొని పాలసీ బెనిఫిట్స్ పాలసీదారునికి లభించడం జరుగుతుంది.
ముఖ్య గమనిక :-
ఈ ప్రయోజనాన్ని పొందడానికి ఖచ్చితంగా 2 సంవత్సరాలు ప్రీమియం చెల్లించి ఉండాలి.
• రివైవల్ పీరియడ్ ఫెసిలిటీ ఎంత సమయం ఉంటుంది? ( Revival Period ?)
ఈ పాలసీకి 5 సంవత్సరాలు రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది.
ఏదైనా కారణంగా ఈ పాలసీలో 5 సంవత్సరాలు రెగ్యులర్ గా ప్రీమియం చెల్లించలేనట్లైతే ఈ పాలసీ ముగియవేయబడుతుంది.
కాబట్టి అటువంటి సమయంలో 5 సంవత్సరాల లోపు మొత్తం బాకీ ప్రీమియంని పెనాల్టీతో కలిపి చెల్లిస్తే ఈ పాలసీలో తిరిగి కొనసాగే సదుపాయం ఉంటుంది.
• రివైవల్ పీరియడ్ ఫెసిలిటీ – SBI Life Saral Retirement Saver Revival Period
ఈ పాలసీకి 5 సంవత్సరాలు రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది.
పాలసీదారుడు తప్పనిసరి పరిస్థితిలో పాలసీలో 5 సంవత్సరాలు రెగ్యులర్ గా ప్రీమియం చెల్లించలేనట్లైతే ఈ పాలసీ ముగియవేయబడుతుంది.
కాబట్టి అటువంటి సమయంలో 5 సంవత్సరాల లోపు మొత్తం బాకీ ప్రీమియంని పెనాల్టీతో కలిపి చెల్లిస్తే ఈ పాలసీలో తిరిగి కొనసాగే సదుపాయం ఉంటుంది.
• ఫ్రీ లుక్ పీరియడ్ అంటే ఏమిటి? ఈ పాలసీ కి వర్తిస్తుందా?( Free Look Period? )
పాలసీకి సంబందించిన నియమ నిబంధనలు పై మీరు అసంతృప్తి చెందినట్లైతే వెంటనే పాలసీని మూసివేసి, చెల్లించిన మీ ప్రీమియంని వెనక్కి పొందవచ్చు. ఈ సమయంలో ఎటువంటి సర్వీస్ చార్జీలు విధించబడవు.
ముఖ్య గమనిక : 15 రోజుల తర్వాత కనుక ఈ పాలసీని మూసివేస్తే ప్రీమియం పై కనీస సర్వీస్ చార్జీలు వసూలుచేయబడతాయి.
• సరెండర్ వేల్యూ ఫెసిలిటీ – Surrender Value
రెగ్యులర్ ప్రీమియం చెల్లించేవారు 2 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తర్వాత కావాలంటే ఈ పాలసీని సరెండర్ చేసి , అప్పటివరకు తను జమా చేసిన డబ్బును రిటర్న్ గా వెనక్కి పొందవచ్చు. మరియు సింగల్ ప్రీమియం చెల్లించే వారు ఎప్పుడైనా పాలసీని సరెండర్ చెయ్యవచ్చు.
ముఖ్య గమనిక :-
మీరు ఏ కంపెనీలో పాలసీ తీసుకొన్నా సరే పాలసీని మధ్యలో సరెండర్ చేసినట్లయితే ఎక్కువ డబ్బులను నష్టపోవాల్సిఉంటుంది. కాబట్టి పాలసీ తీసుకొనే సమయంలో లోనే మీ వ్యక్తిగత ఆర్థిక స్తోమతకి అనుగుణంగా భీమాని నిర్ణయించుకోవడం మంచిదని నా అభిప్రాయం.
ఉదాహరణ -SBI Life Saral Retirement Saver Example
Mr. రేవంత్ వయసు 30 సం||లు, భీమా 5 లక్షలు, స్కీం సమయం 30 సంవత్సరాలు, రెగ్యులర్ ప్రీమియం ఆప్షన్ ద్వారా ప్రతీ నెలా చెల్లించేలా నిర్ణయించుకొన్నాడానుకొందాం!
దీనితో పాటుగా 5 లక్షల టర్మ్ రైడర్ ని అదనంగా తీసుకోవడం జరిగింది.కాబట్టి Mr. రేవంత్ నెలసరి ప్రీమియం వచ్చి = Rs 1,258/- రూపాయలు అవుతుంది.
డెత్ బెనిఫిట్- Death Benefit
పాలసీ సమయం మధ్యలో రేవంత్ కి ఎప్పుడు రిస్క్ జరిగినా చెల్లించిన ప్రీమియం మరియు బోనస్ కలిపి
నామినీకి డెత్ బెనిఫిట్ లభిస్తుంది.
ఉదాహరణ కి ప్లాన్ యొక్క 15 వ సంవత్సరం Mr. రేవంత్ కి రిస్క్ జరిగితే సుమారు
చెల్లించిన ప్రీమియం ( Premium ) – Rs 2,00,000/-
బోనస్ ( Bonus ) – Rs ఎంతైతే అంత!
ఒకవేళ mr. రేవంత్ ఆక్సిడెంట్ కారణం చేత మరణిస్తే మరొక = Rs 5,00,000/- కలిపి నామినీకి రావడం జరుగుతుంది.
మెట్యూరిటీ బెనిఫిట్ – Maturity Benefit
ప్లాన్ యొక్క 30 వ సంవత్సరం Mr. రేవంత్ కి ఈ విధంగా మెట్యూరిటీ లభిస్తుంది.
SBI life Declared 4% = Rs 7,18,500/-
If 8% = Rs 12,59,000/-
ఈ అమౌంట్ లో 60% విత్ డ్రా తప్పనిసరి అయితే చేసుకోవచ్చు, 40% అమౌంట్ తో పెన్షన్ ఖరీదు చెయ్యవచ్చు.
పెన్షన్ ఖరీదు ఆప్షన్స్ -SBI Life Saral Retirement Saver Annuity Options
1. లైఫ్ టైమ్ ఇన్కమ్ – Life Time Income
ఒక ఖచ్చితమైన వడ్డీ రేట్ ద్వారా పాలసీదారునికి జీవితాంతం రెగ్యులర్ పెన్షన్ లభిస్తుంది, అతను మరణించిన తర్వాత ప్లాన్ టరమినేట్ చెయ్యడం జరుగుతుంది. నామినీకి ఎటువంటి అమౌంట్ లభించడం జరగదు.
2. లైఫ్ టైమ్ ఇన్కమ్ విత్ కాపిటల్ రిఫండ్ – Life Time Income With Capital Refund
పాలసీదారుడు కి జీవితాంతం రెగ్యులర్ పెన్షన్ లభిస్తుంది, అతని తర్వాత కాపిటల్ ప్రీమియం అమౌంట్ నామినీకి అందివ్వడం జరుగుతుంది.
3. లైఫ్ టైమ్ ఇన్కమ్ విత్ కాపిటల్ రిఫండ్ ఇన్ పార్ట్స్ – Life Time Income With Capital Refund in Parts
పాలసీదారుడు మొదటి 7 సంవత్సరాలు పెన్షన్ పొందిన తర్వాత డిపాజిట్ అమౌంట్ లో 30% రిటర్న్ గా లభిస్తుంది, 7 సంవత్సరాల తర్వాత ఎప్పుడు రిస్క్ జరిగినా 70% డిపాజిట్ నామినీకి అందివ్వడం జరుగుతుంది.
ఒకవేళ మొదటి 7 సంవత్సరాల లోపు పాలసీదారునుకి రిస్క్ జరిగితే 100% డిపాజిట్ నామినీకి చెందుతుంది.
4. లైఫ్ టైమ్ ఇన్కమ్ విత్ బాలన్స్ కాపిటల్ రిఫండ్ – Life Time Income విత్ Balance Capital Refund
.వ్యక్తి జీవించి వున్నంతవరకు రెగ్యులర్ పెన్షన్ లభిస్తుంది, అతని మరణానంతరం మిగిలిన బాలన్స్ ప్రీమియం నామినీకి లభిస్తుంది.
5. లైఫ్ టైమ్ ఇన్కమ్ విత్ యాన్యూటీ ఇంక్రీజ్ అఫ్ 3% టూ 5% – Life Time Income విత్ Balance Capital Refund.
ఈ ఆప్షన్ ద్వారా యాన్యూటీ ని ఖరీదు చేస్తే ప్రతి సంవత్సరం 3 నుంచి 5 శాతం వరకు పెన్షన్ పెరుగుతూ లభించడం జరుగుతుంది, ఒకవేళ పాలసీదారునికి రిస్క్ జరిగితే పాలసీ టరమినేట్ అవుతుంది. ఈ సందర్భంలో నామినీకి ఎటువంటి ప్రయోజనం లభించదు.
6. లైఫ్ టైమ్ ఇన్కమ్ విత్ సర్టైన్ పీరియడ్ అఫ్ 5,10,15,20 సంవత్సరాలు – Life Time Income With Certain Period of 5 to 20 Years.
పాలసీదారుడు నిర్ణయించుకొన్న విధంగా ఆ సమయంలో ఖచ్చితమైన పెన్షన్ రెగ్యులర్ గా లభిస్తుంది. భవిష్యత్ లో ప్లాన్ హోల్డర్ కి రిస్క్ జరిగితే పాలసీ టరమినేట్ చేయబడుతుంది. నామినీకి ఎటువంటి ప్రయోజనం లభించదు.
జాయింట్ లైఫ్ ఆప్షన్ – Joint Life Options
లైఫ్ అండ్ లాస్ట్ సర్వేఇవారు – Life and last Survivor
ఈ ఆప్షన్ ద్వారా అమౌంట్ డిపాజిట్ చేసిన వ్యక్తికి, నిర్ణయించుకొన్న పెన్షన్ మోడ్ ఆధారంగా జీవితాంతం ఒక ఖచ్చితమైన పెన్షన్ వస్తూ ఉంటుంది.
పెన్షన్ తీసుకొనే వ్యక్తి జీవిత పర్యాంతంలో ఎప్పుడు మరణించినా డిపాజిట్ అమౌంట్ ని 100% నామినీ కి అందజేయడం జరుగుతుంది.
ఆప్షన్ ( Option ) : 2
Life and last Survivor With Capital Refund
అంటే ఈ ఆప్షన్ లో అమౌంట్ డిపాజిట్ చేసే వ్యక్తికి నిర్ణయించుకొన్న పెన్షన్ మోడ్ ఆధారంగా రెగ్యులర్ పెన్షన్ జీవితాంతం లభిస్తుంది. స్కీం లో అమౌంట్ డిపాజిట్ చేసిన వ్యక్తి ఏ కారణంగా మరణించినా, అతనికి ఎంత ఐతే ప్రతినెలా పెన్షన్ లభిస్తుందో 100% అతని భార్య కి కూడా జీవితాంతం లభిస్తుంది.
అంటే ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాలం జీవించి ఉంటే వారికి పెన్షన్ లభిస్తుందన్న మాట.
అదేవిధంగా రెండవ వ్యక్తి కూడా ఏ కారణంగా మరణించినా, స్కీం ప్రారంభంలో డిపాజిట్ చేసిన మొత్తం అమౌంట్ ని వారి పిల్లలకు లేదా నామినీ కి అందివ్వడం జరుగుతుంది.
ముగింపు – Conclusion
ప్లాన్ కి సంబందించిన ఇన్ఫర్మేషన్ మీకు సహాయపడుతుందని భావిస్తూ ధన్యవాదములు.
ఈ వెబ్సైటు ద్వారా అన్ని ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు మరియు చిన్న తరహా వ్యాపారాల యొక్క వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.