Postal Life Santhosh Plan In Telugu
Postal Life Santhosh Plan In Telugu
• పోస్టల్ లైఫ్ సంతోష్ పాలసీ అంటే ఏమిటి? (What Is Postal life Santhosh Policy? )
పోస్ట్ ఆఫీస్ రెండు రకాల కేటగిరీల్లో ప్రజలకు ఇన్సూరెన్స్ ప్లాన్స్ ని అందిస్తుంది.
మొదటిది :- PLI – పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ( Postal Life Insurance )
గమనిక :- పట్టణాల్లో ఉండే వారికి మాత్రమే అందివ్వడం జరుగుతుంది.
రెండవది :- RPLI – రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ( Rural Postal Life Insurance )
గమనిక :- గ్రామాల్లో, పల్లెటూరు ల్లో ఉండే వారికి మాత్రమే అందివ్వడం జరుగుతుంది.
• పోస్టల్ లైఫ్ సంతోష్ పాలసీ ఎలా పనిచేస్తుంది? (How does PLI Santhosh Policy Work? )
పోస్టల్ లైఫ్ సంతోష్ పాలసీనే ఎండోమెంట్ అస్సూరెన్సు ( Endowment Assurance )పాలసీ అనికూడా పిలుస్తారు. ఇది ఒక నాన్ లింకేడ్ పాలసీ. గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ మాద్యమంగా, స్వయంగా ఈ పాలసీ ని నిర్వహిస్తుంది.
ఈ పాలసీలో, పాలసీదారుడు నిర్ణయించుకొన్న పాలసీ సమయం కి అనుగుణంగా ప్రీమియం చెల్లిస్తాడు. పాలసీ సమయం ముగిసిన తర్వాతతీసుకొన్న భీమా కి బోనస్ ని జోడించి మాట్యూరిటీ గా పాలసీదారునికి అందివ్వడం జరుగుతుంది.
ఒకవేళ పాలసీ తీసుకొన్న వ్యక్తికి, పాలసీ సమయం మధ్యలో రిస్క్ జరిగితే భీమా అమౌంట్ + అప్పటివరకు లభించే బోనస్ ని కలిపి నామినీ కి మరణప్రయోజనంగా అందివ్వడం జరుగుతుంది.
పోస్ట్ ఆఫీస్ పాలసీలకు 100% గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది.
• పాలసీ యొక్క ముఖ్య ప్రయోజనాలు? ( Benefits Of Endowment Assurance Santhosh?)
1. పోస్టల్ లైఫ్ ఎండోమెంట్ పాలసీలో బోనస్ ని ( Bonus )ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండ గవర్నమెంట్ అందిస్తుంది.
2. అత్యవసర సమయంలో లోన్ సదుపాయం( Loan )లభిస్తుంది.
3. చెల్లించే ప్రీమియం పై మరియు లభించే అమౌంట్ పై టాక్స్ ప్రయోజనాలు వర్తిస్తాయి( Tax Benefits ).
4. ఏ కారణంగా నైనా పాలసీలో ప్రీమియం నిలిపివేస్తే పునః ప్రారంభం చెయ్యడానికి రివైవల్ ( Revival Facility ) ఉంటుంది.
5. మధ్యలో పాలసీదారునికి ఏమైనా రిస్క్ జరిగితే నామినీ ఫెసిలిటీ ( Nominee Facility ) ఉంటుంది.
6.కొద్ది కాలం తర్వాత ఈ పాలసీ ని, వేరే హోల్ లైఫ్ పాలసీలోకి మార్చుకోవచ్చు ( Conversion Of Policy ). నియమ, నిబంధనలు వర్తిస్తాయి.
7. మెట్యూరుటి మరియు మరణ ప్రయోజనాలు లభిస్తాయి.
8. పాలసీదారునికి రెగ్యులర్ ప్రీమియం(Regular Premium Payment ) చెల్లించే అవకాశం ఉంటుంది.
9. పాలసీ ని కొద్ది కాలం తర్వాత కావాలంటే సరెండర్( Surrender )చేసి అమౌంట్ పొందవచ్చు.
10. పూర్తి వివరాలు, డిపాజిట్ అమౌంట్ ప్రీమియం స్టేటస్ తెలుసుకొనే విధంగా పాసుబుక్ సదుపాయం ఉంటుంది. ( passbook Available )
11. పాలసీ ని ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి సులువుగా మార్చుకోవచ్చు. ( Transfer Facility Available )
12. పైడ్ అప్ వేల్యూ వర్తిస్తుంది. ( Paid Up Value )
13. 6 నెలలు ప్రీమియం మోడ్ పై 1% , 12 నెలలు ప్రీమియం మోడ్ పై 2% ప్రీమియం డిస్కౌంట్ లభిస్తుంది.
• ఈ పాలసీ ఎవరికి వర్తిస్తుంది?( Eligibility Candidates? )
1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ( Central Government Employees )
2. డిఫెన్స్ సేవలు నిర్వహించేవారు ( Defence Services )
3. పారామిలిటరీ ఫోర్సస్ ( Para Military Forces )
4. లోకల్ బాడీస్ ( Local Bodies )
5. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ( State Government Employees )
6. రిజర్వ బ్యాంక్ అఫ్ ఇండియా ( Reserve Bank of India )
7. గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుపబడే విద్యాసంస్థలు ( Government – aided Educational Institutions )
8. పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ ( Public Sector Under Takings )
9. నేషనలైజడ్ బ్యాంక్స్ ( Nationalized Banks )
10. ఆటోనోమౌస్ బాడీస్ ( Autonomous Bodies )
11. ఇతర గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసే వారు ( Extra departmental Agents in Department Of Posts )
12. కాంట్రాక్టు ఉద్యోగులు ( Employees Engaged / Appointed on contract basis by central / State government where the contract is extendable )
13. బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు ( Employees of all commercial banks )
14. కో ఆపరేటివ్ సొసైటీ ల్లో పనిచేసే వారు ( Employees of Credit Co – operative societies )
15. గుర్తింపు పొందిన NSC ( National Stock Exchange ) BSE ( Bombay Stock Exchange ) సంస్థల్లో పనిచేసే వారు.
16. డాక్టర్స్, ఇంజినీర్స్, చార్టెడ్ అకౌంట్స్, లాయర్స్, మొదలైన వారు. ( Doctor, Engineer, Charted Accounts, Layers )
• పోస్టల్ లైఫ్ సంతోష్ పాలసీలో ప్రస్తుతం మనకి ఎంత బోనస్ లభిస్తుంది? (New Bonus Rates Of Santhosh ?)
పోస్టల్ లైఫ్ సంతోష్ బోనస్ రేట్స్ ని సంవత్సరానికి ఒకసారి గవర్నమెంట్ ప్రతీ ఆర్థిక సంవత్సరంలో పాలసీదారులకు అందిస్తుంది.
ముఖ్య గమనిక :-
ప్రస్తుతం ఈ పాలసీలో 1000 కి 52 రూపాయలు గా బోనస్ ని గవర్నమెంట్ అందిస్తుంది.
ఇక్కడ బోనస్ ప్రతీ 1000 రూపాయలు కి లభిస్తుంది, అంటే లక్ష రూపాయల పాలసీని 20 సంవత్సరాలకు తీసుకొంటే 1,00,000 ÷ 1000 × 52 = Rs 5200/-.
ఈ సంవత్సర బోనస్ గా మీకు లభిస్తుంది.
• పోస్టల్ లైఫ్ సంతోష్ పాలసీని తీసుకోవడానికి అర్హులు ఎవరు? ( Who can take the Policy? )
ఈ పాలసీ తీసుకొనే వ్యక్తి యొక్క కనీస వయస్సు( Minimum Age ) = 19 సంవత్సరాలు.
అత్యధిక వయస్సు (maximum Age ) = 55 సంవత్సరాలు.
కనుక 19 నుంచి 55 సంవత్సరాల వయసు మధ్యకలిగిన వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.
• సంతోష్ పాలసీ యొక్క కనీస మరియు అత్యధిక భీమా పరిమితి ఎంత? ( How Much Sum Assured Of Endowment Santhosh ? )
ఈ పాలసీ యొక్క కనీస భీమా పరిమితి =Rs 20, 000/- రూపాయలు.
అత్యధిక భీమా పరిమితి = Rs 50,00,000/-
ముఖ్య గమనిక :- ఈ పాలసీని 50 లక్షల కు మించి అందివ్వడం జరగదు.
.ఈ భీమా ని ఎన్ని సంవత్సరాలకు తీసుకొనే వీలుంటుంది? ( Policy Term Of LIC Santhosh ? )
కనీస పాలసీ సమయం వచ్చి (Minimum Policy Period ) =16 సంవత్సరాలు.
అత్యధిక పాలసీ సమయం ( Maximum Policy Period ) = 41 సంవత్సరాలు.
కాబట్టి మీరు ఈ పాలసీ యొక్క సమయాన్ని కనీసం 16 నుంచి 41 సంవత్సరాల మధ్య నిర్ణయించుకోవచ్చు.
ముఖ్య గమనిక :-
సంతోష్ పాలసీలో మాట్యూరిటీ అనేది 35,40,45,50,55,……..40 ఈ విధంగా నిర్ణయించుకోవచ్చు. కాబట్టి పాలసీ ఎప్పుడు మాట్యూరిటీ చెయ్యాలో మీరే స్వయంగా నిర్ణయించుకోవచ్చు.
LIC New Endowment Plan in Telugu – రోజుకి 53/- రూపాయలతో 12 లక్షలు పొందండి, పూర్తి వివరాలు.
.PPF Scheme in Telugu -” పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్” అర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!
• పోస్టల్ సంతోష్ పాలసీలో ప్రీమియం ఏ విధంగా చెల్లించాలి? ( Premium Paying of Postal Life Santhosh )
రెగ్యులర్ ప్రీమియం ( Regular Premium )
అంటే ఎన్ని సంవత్సరాలు పాలసీ యొక్క సమయాన్ని నిర్ణయించుకొంటే అన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించడం.
• సంతోష్ పాలసీలో ప్రీమియంని ఏ విధంగా చెల్లించాలి? ( Premium Payment Mode Of Postal Santhosh?)
ఈ పాలసీలో 4 రకాలుగా ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది.
1. సంవత్సరానికి ఒకసారి – Yearly
2. 6 నెలలకు ఒకసారి – Half Yearly
3. 3 నెలలకు ఒకసారి – Quarterly
4. ప్రతినెలా – Monthly
ఈ విధంగా పాలసీదారుడు ఏదో ఒక పద్దతిలో నిర్ణయించుకొన్న మోడ్ ఆధారంగా ప్రీమియం చెల్లించవచ్చు.
• పోస్టల్ లైఫ్ సంతోష్ పాలసీలో లభించే ప్రయోజనాలు ఉదాహరణ ద్వారా చూద్దాం!
Example :- Benefits of Endowment Assurance Santhosh !
పాలసీదారుని పేరు ( Name ) – Mr. రాజేష్
ఎండోమెంట్ సంతోష్ భీమా ( Bhima ) – 5 లక్షలు
వయసు ( Age ) – 25 సంవత్సరాలు
పాలసీ సమయం ( Period ) – 25 సంవత్సరాలు
మెట్యూరిటీ సమయం ( Maturity ) – 50 సంవత్సరాలు
ప్రీమియం చెల్లించే విధానం – ప్రతినెలా
నెలసరి ప్రీమియం ( Premium ) – Rs 1,646/- ( ఈ ప్రీమియం GST చార్జీలతో కలిపి )
హరిప్రసాద్ ప్రతినెలా ఈ పాలసీలో Rs 1,646/- రూపాయలు చొప్పున 25 సంవత్సరాలలో చెల్లించిన మొత్తం ప్రీమియం వచ్చి = Rs 4,93,800/– అవుతుంది..
• మెట్యూరిటీ ప్రయోజనం (Maturity Benefit ):-
Mr. రాజేష్ పాలసీ చివరివరకు జీవించి ఉన్నట్లైతే ఈ విధంగా మెట్యూరిటీ లభిస్తుంది.
మెట్యూరిటీ = ప్రాథమిక భీమా + మొత్తం బోనస్
“Maturity = Basic Sum Assured + Total Bonus
కాబట్టి పాలసీ యొక్క 50 వ సంవత్సరం మెట్యూరిటీగా
తీసుకొన్న భీమా ( Sum Assured ) = Rs 5, 00, 000
మొత్తం బోనస్ = Rs 6, 50, 000
(Total Bonus )
మొత్తం కలిపి = Rs 11, 50, 000
Mr. రాజేష్ కి ఈ పాలసీలో మెట్యూరిటీగా లభిస్తాయి.
• మరణ ప్రయోజనం ( Death Benefit ):-
పాలసీ సమయం మధ్యలో, పాలసీదారుడు ఏ కారణం గా మరణించిన నామినీ కి మరణ ప్రయోజనం అందివ్వడం జరుగుతుంది.
మరణ ప్రయోజనం ( Death Benefit ) = ప్రాథమిక భీమా ( Sum Assured )+ అప్పటివరకు లభించే బోనస్ లభిస్తుంది.
అంటే భీమా = 5 లక్షలు + ఇక్కడ బోనస్ అనేది పాలసీ కొనసాగిన సమయం పై ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణ కి ఏ సంవత్సరంలో మరణిస్తే ఎంత బోనస్ లభిస్తుంది…
సంవత్సరం ( Year ) బోనస్ ( Bonus ) మొత్తం ( Total )
5 వ సంవత్సరం Rs 1,30,000/- Rs 6,30,000/-
10 వ సంవత్సరం Rs 2,60,000/- Rs 7,60,000/-
25 వ సంవత్సరం Rs 6,50,000/- Rs 11,50,000/-
ఈ విధంగా బోనస్ లభిస్తుంది.
• పాలసీ మధ్యలో అప్పటివరకు మనం చెల్లించిన ప్రీమియంపై లోన్ లభిస్తుందా? లేదా? ( Loan Facility of Santhosh?)
సంతోష్ పాలసీలో పాలసీదారుడు కనీసం 3 సంవత్సరాలు ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తి ప్రీమియం చెల్లిస్తే , అత్యవసర పరిస్థితుల్లో జామ చేసిన ప్రీమియం పై లోన్ కూడా పొందవచ్చు.
• సరెండర్ వేల్యూ ఫెసిలిటీ ( Surrender Value Of Postal Life Santhosh ?)
ఈ పాలసీలో పాలసీదారుడు రెగ్యులర్ గా 3 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తర్వాత కావాలంటే ఈ పాలసీని సరెండర్ చేసి , అప్పటివరకు మీరు జమా చేసిన డబ్బును రిటర్న్ గా వెనక్కి పొందవచ్చు.
ముఖ్య గమనిక :-
కానీ మీరు ఏ కంపెనీలో పాలసీ తీసుకొన్నా సరే పాలసీని మధ్యలో సరెండర్ చేసినట్లయితే ఎక్కువ డబ్బులను నష్టపోవాల్సిఉంటుంది. కాబట్టి పాలసీ తీసుకొనే సమయంలో లోనే మీ వ్యక్తిగత ఆర్థిక స్తోమతకి అనుగుణంగా భీమాని నిర్ణయించుకోవడం మంచిదని నా అభిప్రాయం.
• పోస్టల్ లైఫ్ సంతోష్ పాలసీలో లభించే టాక్స్ ప్రయోజనాలు ఏమిటి? ( Tax Benefits Of Postal Santhosh ?)
ఈ పాలసీలో పాలసీదారుడు చెల్లించే ప్రీమియంపై ఇన్కమ్ టాక్స్ రూల్ అండర్ సెక్షన్ 80c వర్తిస్తుంది, కాబట్టి ప్రతీ సంవత్సరo Rs 1,50,000/- వరకూ టాక్స్ డేడిక్షన్ పొందవచ్చు.
అదేవిధంగా పాలసీలో లభించే మెట్యూరిటీ మరియు మరణ ప్రయోజనాల పై ఇన్కమ్ టాక్స్ రూల్ అండర్ సెక్షన్ 10D వర్తిస్తుంది.
కాబట్టి ఎటువంటి టాక్స్ విధించబడదు. మొత్తం అమౌంట్ టాక్స్ రహితంగా పాలసీదారునికి లభిస్తుంది.
• రివైవల్ పీరియడ్ ఫెసిలిటీ ఎంత సమయం ఉంటుంది? ( Revival Period of Santhosh?)
రివైవల్ అంటే ఏదైనా కారణం చేత వదలిపెట్టిన ప్రీమియం ని చెల్లించడానికి అదనపు సమయం. ఈ సమయం దాటితే పాలసీ కాలప్స్ అవుతుంది.
పాలసీ తీసుకొన్న 3 సంవత్సరాలలోపు 6 నెలలు రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది.
3 సంవత్సరాల తర్వాత 12 నెలలు ఈ రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ సమయంలో మొత్తం ప్రీమియం ను పెనాల్టీ తో కలిపి చెల్లించాల్సి ఉంటుంది.
• పోస్టల్ లైఫ్ ఎండోమెంట్ అస్సూరెన్సు సంతోష్ పాలసీకి పైడ్ అప్ వేల్యూ వర్తిస్తుందా? లేదా? ( Paid అప్ Value )
వర్తిస్తుంది,
పైడ్ అప్ వేల్యూ అంటే ఈ పాలసీలో మీరు రెగ్యులర్ గా కొన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించి, తర్వాత ఏదైనా అనివార్య కారణాల కారణంగా పాలసీలో ప్రీమియం చెల్లించడం మానివేసినప్పటికీ ఇన్సూరెన్స్ వర్తించడం ఆగిపోదు. అప్పటివరకు చెల్లించిన ప్రీమియంని ఆధారంగా చేసుకొని పాలసీ బెనిఫిట్స్ పాలసీదారునికి లభించడం జరుగుతుంది.
ముఖ్య గమనిక :-
ఈ ప్రయోజనాన్ని పొందడానికి ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించి ఉండాలి.
• ముగింపు ( Conclusion )
పోస్టల్ లైఫ్ ఎండోమెంట్ అస్సూరెన్సు సంతోష్ ( Endowment Assurance Santhosh )పాలసీకి సంబందించిన పూర్తి సమాచారాన్ని మీకు అందించానని భావిస్తున్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ మరచినట్లైతే మన్నించి క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఈ వెబ్సైటు ద్వారా అన్ని ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు మరియు చిన్న తరహా వ్యాపారాల యొక్క వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.
Good information
Pvt.employees eligible or not mention sir
eligible sir …
My wife death claim cheyyanedu sir went post Life insurance rpli
1st of all must claim immediatly sir ,where to take insurance like postal life insurance or rural postal life insurance ….