SBI Life Saral Swadhan Plus Plan Details in Telugu
SBI Life Saral Swadhan Plus Plan
ఎస్. బి. ఐ సంస్థ ఒక వినూత్నమైన ఒక కొత్త ఆలోచనతో పేదవారికి మరియు సామాన్యులకి ఆర్థికంగా,ఇన్సూరెన్స్ పరంగా భద్రతను అందివ్వడం కొరకు ఈ ప్లాన్ ను SBI LIFE ప్రారంభం చేసింది. ఈ ప్లాన్ తీసుకున్న వ్యక్తి పూర్తి 100% లాభం పొందుతారు.
టర్మ్ ప్లాన్ మరియు ఎండోమెంట్ ప్లాన్ రెండింటినీ కలిపి ఈ ఎస్.బి. ఐ సరల్ శ్వధాన్ ప్లస్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
ఇది వ్యక్తిగతమైన సేవింగ్స్ మరియు నాన్ లింక్డ్ ప్లాన్, ఈ ఎస్. బి. ఐ ప్లాన్ లో టర్మ్ ఇన్సూరెన్స్ మరియు గ్యారెంటెడ్ మెచ్యూరిటీ లభిస్తుంది, సంవత్సరానికి కేవలం Rs 1500 రూపాయలకే ఈ ప్లాన్ మనం తీసుకోవచ్చు. ప్రీమియం మాఫీ, డెత్ మరియు మెచ్యూరిటీ బెనిఫిట్ ఈ ప్లాన్ లో కలవు.
SBI Life Saral Swadhan Plus Plan Benefits
1) ఈ ప్లాన్ వ్యక్తిగతమైన, పొదుపు(savings) ప్లాన్.
2) ఇది ఒక నాన్ లింక్డ్ ప్లాన్ కనుక స్టాక్ మార్కెట్ లో లేదా ఏదైనా కంపెనీ లో గాని ఇన్వెస్ట్మెంట్ చేయరు.
3) ప్లాన్ తీసుకున్న వ్యక్తి 100% కచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ను లేదా ప్లాన్ చివరి లో గ్యారెన్టెడ్ మెచ్యూరిటీ నీ పొందుతాడు.
4) పాలసీ ధారుడికి వీలైన విధంగా ప్రీమియం ను చెల్లించుకునే సదుపాయం కల్పించారు.
5) లిమిటెడ్ ప్రీమియం – మనం కొంతకాలం పాటు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము.
6) మెచ్యూరిటీ పై టాక్స్ ఫ్రీ బెనిఫిట్(Tax free benefit)
ఈ ఎస్.బి. ఐ లైఫ్ సరల్ స్వాధాన్ ప్లస్ ప్లాన్ ను 2 విధాలుగా తీసుకోవచ్చు.
1) రెగ్యులర్ ప్రీమియం (Regular premium):
ఎన్ని సంవత్సరాల భీమా తీసుకోవటం జరుగుతుందో అన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ దారుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే చెల్లిస్తాడు.
2) లిమిటెడ్ ప్రీమియం (Limited premium):
దీన్ని కూడా పాలసీ దారుడు ప్రతీ సంవత్సరం చెల్లిస్తారు. కానీ ఈ లిమిటెడ్ ప్రీమియం (Limited Premium) లో చివరి 5 సంవత్సరాలు ప్రీమియం మాఫీ( premium fee) చేయబడుతుంది.
లిమిటెడ్ ప్రీమియం ద్వారా మాఫీ చేయబడిన 5 సంవత్సరాలు కూడా ఇన్సూరెన్స్ కవర్ లభిస్తుంది.
ఈ ఎస్.బి. ఐ లైఫ్ సరల్ శ్వదాన్ ప్లస్ ప్లాన్ చివరిలో భీమా అమౌంట్ నీ 2 విధాలుగా పొందవచ్చును.
1)డెత్ బెనిఫిట్ (Death benefit):
ఈ ప్లాన్ తీసుకున్న వ్యక్తి ప్లాన్ లో ప్రీమియం చెల్లించే సమయంలో మరణిస్తే (risk) పాలసీ దారుడు ఎంచుకున్న ప్రాథమిక భీమా మొత్తం ఇవ్వబడుతుంది. లేదా అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంనకు 9 రెట్లు అమౌంట్ ను కలిపి పాలసీ దారుడికి అందివ్వడం జరుగుతుంది.
2)మెచ్యూరిటీ అమౌంట్ (Maturity amount):
ఈ విధమైన అమౌంట్ నీ పొందాలంటే పాలసీ దారుడు ప్లాన్ చివరి వరకు జీవించిఉండాలి అప్పుడు చెల్లించిన ప్రీమియంనకు 115% అమౌంట్ నీ కలిపి ఇస్తారు.
ఇంతటితో ప్లాన్ ముగించబడుతుంది.
SBI life Smart future Choices In Telugu ;అవసరం వచ్చినప్పుడల్లా అడిగి తీసుకోండి
అర్హతలు (Eligibility):
వయసు పరిమితులు:
కనీస వయసు – 18 సంవత్సరాలు
గరిష్ట వయసు – 55 సంవత్సరాలు
మేచ్యురిటీ వయసు – 70 సంవత్సరాలు
భీమా పరిమితులు:
కనీస ప్రాథమిక భీమా (Bhima) – Rs 30000
అత్యధిక ప్రాథమిక బీమా (Bhima)- Rs 475000
సంవత్సరానికి అత్యల్ప ప్రీమియం (Minimum Premium)- Rs 1500
సంవత్సరానికి అత్యధిక ప్రీమియం ( Maximum Premium)- Rs 5000
Minimum | Maximum | |
Entry Age | 18 Years | 55 Years |
Policy Term | 10 Years | 15 Years |
Maturity Age | --- | 70 Years |
Premium Paying Term in Years | 10 Years | 10 Years |
Premium Paying Frequency | Annual | Annual |
Yearly Premium | Rs1500 | Rs 5000 |
Sum Assured | Rs 30,000 | Rs 475,000 |
SBI Life Saral Swadhan Plus ఉదాహరణ ద్వారా తెలుసుకుందాము.
రాము వయసు – 30 సంవత్సరాలు
ప్రాథమిక భీమా –475000 రూపాయలు
పాలసీ టర్మ్ – 15 సంవత్సరాలు
ప్రీమియం టర్మ్ – 10 సంవత్సరాలు
వార్షిక ప్రీమియం – 5000 రూపాయలు.
రాము వయసు 30 సంవత్సరాలు,తీసుకున్న భీమా 457000 రూపాయలు, పాలసీ సమయం 15 సంవత్సరాలుగా నిర్ణయించుకున్నాడు మరియు ప్రీమియం చెల్లించే సమయం 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రీమియం మాఫీ చేయబడింది. సంవత్సరానికి 5000 రూపాయలు ప్రీమియం చెల్లించే విధంగా తీసుకున్నాడు.
ఎస్.బి. ఐ. లైఫ్ సరల్ శ్వధాన ప్లస్ ప్లాన్ లో రాము చెల్లించిన మొత్తం ప్రీమియం (Total Paid Premium) 5000×10=50000 రూపాయలు అయితే …
1) ప్రమాదానికి గురైతే టర్మ్ పాలసీ వర్తించడం వల్ల ఇతనికి ప్రాథమిక భీమా అమౌంట్ Rs 475000 రూపాయలు లేదా అప్పటి వరకు కట్టిన ప్రీమియం నకు 9 రెట్లు అమౌంట్ వేసి ఇస్తారు.
2) ఒకవేళ రాము ప్లాన్ చివరి వరకు ప్రీమియంను చెల్లిస్తే మెచ్యూరిటీ రూపం లో చెల్లించిన ప్రీమియంనకు 115% కలిపి అమౌంట్ ను ఇవ్వడం జరుగుతుంది.
రాముకు ప్లాన్ చివరి లో 57500 రూపాయలు వస్తాయి.
మరికొన్ని బెనిఫిట్స్ (Other Benefits):
సరెండర్ (surrender):
మీరు ఈ ప్లాన్ లో 2 లేదా 3 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తరువాత ఈ ప్లాన్ ను సరెండర్ చేసి అప్పటి వరకు కట్టిన ప్రీమియం ను పొందవచ్చు కానీ టాక్స్ ( Tax) రూపంలో ఎక్కువ అమౌంట్ కోల్పోతాము.
గ్రేస్ పీరియడ్ ( Grace period):
ఈ ప్లాన్ లో ప్రీమియం సంవత్సరానికి చెల్లిస్తారు కాబట్టి ప్రీమియం సమయం పూర్తైన తరువాత 30 రోజుల వరకు ఎటువంటి పెనాల్టీ లేకుండా ప్రీమియం చెల్లించవచ్చు.
టాక్స్ ప్రయోజనాలు ( Tax Benefits ):
పాలసీలో వ్యక్తి చెల్లించే ప్రీమియం పై మరియు పాలసీ దారుడు పొందే మెచ్యూరిటీ లపై ప్రీమియం అండర్ సెక్షన్ 80c మరియు అండర్ సెక్షన్ 10d వర్తిస్తాయి. కాబట్టి ఈ ప్లాన్ లో పూర్తి టాక్స్ మినహాయింపు వర్తిస్తుంది.
ఫ్రీ లుక్ పీరియడ్ (Free look period):
మీరు తీసుకున్న ప్లాన్ లో మీరు అసంతృప్తి చెందిన లేదా ఇతర కారణాల చేత ప్లాన్ ను రద్దు చేసుకోవచ్చు.ఈ రద్దు చేసుకునే ప్రక్రియ ప్లాన్ తీసుకున్న 15 రోజులలోపు అయితే కట్టిన ప్రీమియం యధావిధిగా ఇచ్చేస్తారు.