LIC Bima Ratna Plan 864 – ఎల్ .ఐ. సి కొత్త మనీ బ్యాక్ పాలసీ , మెట్యూరిటీ , 100 % గ్యారెంటీ బోనస్ ,పూర్తి వివరాలివే !

LIC Bima Ratna 864 Plan Details in Telugu 

 

LIC Bima Ratna 

దేశంలోనే  అతి పెద్ద భీమా సంస్థ అయిన LIC  ఒక అద్భుతమైన మనీ బ్యాక్ పాలసీ , LIC భీమా రత్న –  864, 27 మే  2022 న ప్రారంభం చేసింది. LIC  భీమా రత్న  స్టాక్ మార్కెట్ తో   ( Non Linked non Participated , Money back & Savings Insurance Plan )  ఎటువంటి సంబందం  లేకుండా, మనీ బ్యాక్,  100% గ్యారెంటెడ్  అడిషన్, గారెంటెడ్  మెట్యూరిటీ   బాండ్ పై ముద్రించి అందిస్తుంది మరియు ప్రాథమిక భీమా పై అత్యధికంగా  125%  లైఫ్ కవర్ ను అందిస్తుంది.

LIC భీమా రత్న ఒక  లిమిటెడ్ ప్రీమియం పాలసీ అందువల్ల పాలసీ సమయం కంటే తక్కువ  సమయం  మాత్రమే వ్యక్తి  ప్రీమియం  చెల్లిస్తాడు. ఈ ప్లాన్ లో బోనస్ గారెంటెడ్ అడిషన్ రూపంలో  లభిస్తుంది LIC భీమా రత్న  పాలసీ  కి సంబందించిన పూర్తి వివరాలను  ఉదాహరణతో  సహా  తెలుసుకుందాము.

 

LIC Bhima Ratna Plan 864 - ఎల్ .ఐ. సి కొత్త మనీ బ్యాక్ పాలసీ , మెట్యూరిటీ , 100 % గ్యారెంటీ బోనస్ ,పూర్తి వివరాలివే !

 

 

భీమా రత్న  బెనిఫిట్స్ – LIC Bima Ratna Benefits 

  Money Back    –  మనీ బ్యాక్ ఎప్పుడు లభిస్తుంది?

పాలసీ  సమయం  ఆధారంగా  ఈ స్కీం లో మీకు  మనీ బ్యాక్ రావడం  జరుగుతుంది.

1. 15 సంవత్సరాల పాలసీ  సమయాన్ని మీరు నిర్ణయం చేసుకొంటే ప్రాధమిక భీమా పై  25%  ప్లాన్ యొక్క 13 వ మరియు 14 వ సంవత్సరం మనీ బ్యాక్ లభిస్తుంది.

2.20  సంవత్సరాల పాలసీ  సమయంలో ప్రాధమిక భీమా పై  25%  ప్లాన్ యొక్క 18వ మరియు 19 వ సంవత్సరం మనీ బ్యాక్ లభిస్తుంది.

3.  అదేవిధంగా 25 సంవత్సరాల పాలసీ  సమయాన్ని మీరు నిర్ణయం చేసుకొంటే ప్రాధమిక భీమా పై 25%  ప్లాన్ యొక్క 23 వ మరియు 24 వ సంవత్సరం 25% మనీ బ్యాక్ రావడం జరుగుతుంది.

 

గారెంటెడ్ అడిషన్ –  Guaranteed Addition 

http://

 Policy Year

Guaranted Additions per 1000

 1st to 5th Year

Rs 50

6st to 10th Year

Rs 55

11st to 25th Year

Rs 60

 

గారెంటెడ్ అడిషన్ ప్రాధమిక భీమా పై ప్రతి Rs 1000/- రూపాయలపై అందివ్వడం జరుగుతుంది.

1. పాలసీ మొదటి సంవత్సరం నుంచి 5 వ సంవత్సరం వరకూ Rs 50/- రూపాయలు,
2. 6 వ సంవత్సరం నుంచి 10 వ సంవత్సరం వరకూ Rs 55/- రూపాయలు,
3. అదేవిధంగా 11 వ సంవత్సరం నుంచి 25 వ సంవత్సరం వరకూ Rs 60/ రూపాయలు ఈ విధంగా ప్లాన్ లో గారెంటెడ్ అడిషన్ అందివ్వడం జరుగుతుంది.

 

మెట్యూరిటీ బెనిఫిట్ – Maturity Benefit 

మనీ బ్యాక్ పాలసీ ల  గురించి బహుశా  మీ అందరికి  తెలిసే ఉంటుంది. ప్రాధమిక భీమాలోనుండి  మనీ బ్యాక్ తీసివేయగా  మిగిలిన భీమా +  బోనస్ రావడం జరుగుతుంది అదేవిధంగా భీమా రత్న  పాలసీలో  50% ప్రాధమిక భీమా  మరియు గ్యారెంటెడ్ అడిషన్ బోనస్ మెట్యూరిటీ గా లభిస్తుంది.

 

డెత్ బెనిఫిట్ – Death Benefit 

1.LIC  భీమా రత్న  అత్యధికంగా  125%  లైఫ్ కవర్ ను అందిస్తుంది అంటే 10లక్షలు భీమా తీసుకున్న  వ్యక్తికీ రిస్క్ జరిగితే 12 లక్షల 50 వేలు మరియు అప్పటివరకు లభించే  బోనస్ రెండూ  కలిపి డెత్ బెనిఫిట్ గా నామినీ కి అందిస్తారు లేదా

2. పాలసీదారుడు చెల్లించే వార్షిక ప్రీమియం కీ  7 రేట్లు లేదా,

3. అప్పటివరకూ చెల్లించిన మొత్తం ప్రీమియం కి సుమారు 105% గా డెత్ బెనిఫిట్ నామినికి వస్తుంది.

 

ప్రీమియం డిస్కౌంట్ – Premium  Rebate

1.  సంవత్సరానికి ఒకసారి     =  2%
2. 6 నెలలకు ఒకసారి            =  1%
3. 3 నెలలకు  ఒకసారి           = Nil
4. ప్రతినెలా                             = Nil
ఇక్కడ రిబేట్ అంటే మీరు చెల్లించే ప్రీమియం అమౌంట్ పై   కొద్దిగా  తగ్గించడం జరుగుతుంది.  సంవత్సరానికి మరియు 6 నెలలకు ప్రీమియం చెల్లించేవారికి ఈ రిబేట్ లభిస్తుంది.

 

• కామెంసెమెంట్ అఫ్ రిస్క్ – Commencement Of Risk

పాలసీదారుని యొక్క వయసు 8 సంవత్సరాల లోపు అయితే పాలసీ తీసుకొన్న 2 సంవత్సరాల తర్వాత నుంచి లైఫ్ కవర్ ఆడ్ అవుతుంది, ఒకవేళ 8 సంవత్సరాలు పైబడిన వ్యక్తి అయితే ఇమ్మీడియేట్ గా లైఫ్ కవర్ అందివ్వడం జరుగుతుంది.

 

భీమాపై  డిస్కౌంట్ – Rebate On high basic Sum Assured? )

భీమా ( Basic Sum Assured )                     రిబేట్
1.  5 లక్ష నుంచి 9 లక్షల 75  వేలు             = Nil
2.  10  లక్ష నుంచి 14లక్షల 75  వేలు        = 0.50%
3. 15 లక్ష నుంచి 19 లక్షల 75  వేలు          = 1.00%
4. 20, 00, 000 నుంచి  అత్యధికముగా      = 1.25 %

ఈ విధంగా అత్యధిక బీమాపై కూడా ఈ పాలసీలో  మీకు  రిబేట్ లభిస్తుంది.

 

అర్హతలు  –  LIC Bima Ratna Eligibility 

 

http://

Eligibility

Terms & Conditions

Premium Mode

Yearly, Half Yearly, Quarterly & Monthly

Policy Term

15 Years, 20 Years, 25 Years

Premium paying Term

11 Years for Policy Term 15 Years

16 Years for Policy Term 20 Years

21 Years for Policy Term 25 Years

Minimum Entry Age

5 Years for Policy Term 15 Years

90 Days for Policy Term 20 Years

90 Days for Policy Term 25 Years

Maximum Entry Age

55Years for Policy Term 15 Years

50 Years for Policy Term 20 Years

45 Years for Policy Term 25 Years

Minimum Basic Sum Assured

Rs 500000

Maximum Basic Sum Assured

No Limit

Minimum Maturity Age

20 Years for policy Term 15 & 20 Years

25 Years for policy Term 25 Years

Maximum Maturity Age

70 Years

టేబుల్ వివరాలు

 

• పాలసీ  సమయం ( Policy Period ) 

3 రకాల  పాలసీ సమయాలు  ఈ స్కీం లో అందుబాటులో ఉంటాయి.
1- 15 సంవత్సరాలు
2-20 సంవత్సరాలు
3-25 సంవత్సరాలు

 

•పాలసీ లో ప్రీమియం ఎన్ని సంవత్సరాలు  చెల్లించాలి? ( Premium Paying ) 

వేరు వేరు పాలసీ టర్మ్ లకు  వేరు వేరుగా ప్రీమియం చెల్లించాలి.

A15 సంవత్సరాల  పాలసీ  సమయానికి కేవలం 11 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి.

B20  సంవత్సరాల  పాలసీ  సమయానికి కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి.

C– మరియు అదేవిధంగా  ఒకవేళ మీరు 25  సంవత్సరాల  పాలసీ  సమయానికి కేవలం 21 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి అయినప్పటికీ  3 ఆప్షన్స్ లోకూడా మొత్తం పాలసీ సమయం  బెనిఫిట్స్   యదావిధిగా లభిస్తాయి.

 

•  కనీస మరియు అత్యధిక భీమా  ( Bima Limits )

భీమా రత్న పాలసీ యొక్క కనీస భీమా 5 లక్షలు మరియు అత్యధిక  భీమా కు ఎటువంటి పరిమితులు  లేవు.

 

• వయసు  పరిమితులు ( Age Limits ) 
పాలసీ తీసుకోవడానికి  కనీస వయసు  90 రోజులు, కాబట్టి 3 నెలల  బేబీ కూడా LIC  భీమా రత్న  వర్తిస్తుంది,  అత్యధిక  వయసు 55 సంవత్సరాలు.

 

 

వీటిని కూడా చదవండి – Also Read 

 

LIC Dhan Rekha Plan Telugu 863 &#కొత్త స్కీం ప్రతీ  1000/- కి 60 రూపాయల బోనస్

 

PNB MetLife Mera Term Plan Telugu &# నెలాకు Rs 50 వేలు లభించేలా కుటుంబానికి భద్రత కల్పించండి,

 

LIC Jeevan Akshay 7 ( 857 ) Telugu &;30 ఏళ్ళ వయసు నుంచే పెన్షన్ పొందండి

 

 

ఉదాహరణ : LIC Bima Ratna 864 

 

30 సంవత్సరాలు కల్గిన Mr. రాజేష్ భీమా  రత్న  పాలసీ లో 5 లక్షల  భీమా తీసుకుని 25 సంవత్సరాల  పాలసీ సమయాన్ని  నిర్ణయించుకున్నాడు అనుకుందాము.

భీమా రత్న ఒక లిమిటెడ్ ప్రీమియం కాబట్టి 21 సంవత్సరాలు మాత్రమే వ్యక్తి ప్లాన్ లో ప్రీమియం చెల్లిస్తాడు, ప్రీమియం సుమారుగా నెలకి = Rs 2,400/- ( Approximately )

 

గారెంటెడ్ అడిషన్ – Guaranteed Addition

మొదటి 5 సంవత్సరాలు 25,000 × 5 = Rs 1,25,000/

పాలసీ యొక్క 6 వ సంవత్సరం నుంచి 10 వ సంవత్సరం వరకు 27,500 × 5 =Rs 1,37,500

అదేవిధంగా ప్లాన్ యొక్క 11 వ సంవత్సరం నుంచి 25 వ సంవత్సరం వరకూ 30,000 × 10 = Rs 3,00,000

మొత్తం గారెంటెడ్ అడిషన్ ( Total Guaranteed Addition= Rs 7,12,500/-

 

మనీ బ్యాక్ – Money Back 

ప్లాన్ యొక్క 23 వ సంవత్సరం  25% అఫ్ బేసిక్ సమ్ అస్సుర్డ్  ( 25 % Of Basic Sum Assured )  గా = Rs 1,25,000/-, మరియు ప్లాన్ యొక్క 24 వ సంవత్సరం  మరొక 25% అఫ్ బేసిక్ సమ్ అస్సుర్డ్ ( 25 % Of Basic Sum Assured ) గా  = Rs 1,25,000 లభించడం జరుగుతుంది.

ఈ విధంగా LIC భీమా రత్న పాలసీ మధ్యలోనే Rs 2,50,000  వేలు మనీ బ్యాక్ గా అందిస్తుంది.

 

మెట్యూరిటీ బెనిఫిట్ -Maturity Benefit 

ప్రాధమిక భీమా  ( Basic Sum Assured              ) = Rs 5,00,000
గారెంటెడ్ అడిషన్   ( Guaranteed Addition )  = Rs 7,12,500

టోటల్ మెట్యూరిటీ రిటర్న్( Maturity )             = Rs 12,12,500/- Mr. రాజేష్ కి లభిస్తాయి.

 

డెత్ బెనిఫిట్ – Death Benefit 

మొత్తం పాలసీ సమయంలో వ్యక్తి కి ఏవిధంగా రిస్క్ జరిగినా ప్రాధమిక భీమా పై 125%  అంటే 5 లక్షల భీమా కి 6 లక్షల 25 వేలు డెత్ బెనిఫిట్ గా నామినికి అందివ్వడం జరుగుతుంది.

 

 టాక్స్ ప్రయోజనాలు –  Tax Benefits?

LIC భీమా రత్న అద్భుతమైన టాక్స్ ప్రయోజనాలను అందిస్తుంది, ప్రీమియం పై టాక్స్ డెడక్షన్ 1.5 లక్షలు మరియు లభించే మనీ బ్యాక్ & మెట్యూరిటీ 100% టాక్స్ రహితంగా పాలసీదారుడు పొందుతాడు.

 

LIC సెటిల్మెంట్ ఆప్షన్ – Settlement

ఈ విధానం ద్వారా  పాలసీలో లభించే మొత్తం మెట్యూరిటీ అమౌంట్ పాలసీ చివర్లో ఒక్కసారే  లేకపోతే వాయిదాల పద్దతిలో  5, 10, మరియు  15 సంవత్సరాల సమయం నిర్ణయించుకొని, ప్రతినెలా, ప్రతీ 3 నెలలకు, 6 నెలలకి ఒక్కసారి మరియు సంవత్సరానికి ఒకసారి  లభించేలా నిర్ణయించుకొనే  సదుపాయం ఉంటుంది అందువల్ల రెగ్యులర్ గా ఇన్కమ్ కావాలనుకొనే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్.

ముఖ్య గమనిక :  పాలసీదారుడు  కనీసం 3 నెలలు పాలసీ సమయం మిగిలి ఉండగానే LIC సంస్థకి సెటిల్మెంట్ నిర్ణయం తెలియచేయాల్సి ఉంటుంది.

 

Riders Availability :-  రైడర్ ప్రయోజనాలు 

LIC భీమా రత్న 5 రకాల రైడర్ ప్రయోజనాలను పాలసీదారునికి అందిస్తుంది.

 

1. ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్ – Premium Waiver Benefit Rider

భీమా రత్న పాలసీ చిన్నపిల్లలకు తీసుకొనే సందర్భంలో అద్భుతమైన బెనిఫిట్, ప్లాన్ లో ప్రీమియం చెల్లించే వ్యక్తి రిస్క్ జరిగి మరణిస్తే భవిష్యత్ ప్రీమియం మాఫీ    ( Premium Waive & All Benefits Available ) మరియు పాలసీకి సంభందించిన పూర్తి బెనిఫిట్స్ వ్యక్తి జీవించి ఉంటే ఏవిధంగా వర్తిస్తాయో అదే విధంగా చిల్డ్రన్ కి రావడం జరుగుతుంది.

 

2. ఆక్సిడెంట్  డెత్ &   డిజాబిలిటీ బెనిఫిట్ రైడర్  – Accidental Death  And Disability Benefit Rider

పాలసీదారుడుకి ఆక్సిడెంట్ కారణంగా రిస్క్ జరిగితే ప్రాథమిక భీమాకి లభించే మరణ ప్రయోజనం తోపాటు అందనంగా , మరికొంత అత్యధిక ప్రయోజనం నామినికి లభించడం జరుగుతుంది. ఈ రైడర్ ను పాలసీదారుడు  ఎప్పుడైనా తీసుకోవచ్చు పాలసీ యొక్క చివరి 5 సంవత్సరాలు ఇంకా పాలసీ  సమయం మిగిలిఉన్నా  తీసుకొనే సదుపాయం ఉంటుంది  అత్యధికముగా 70 సంవత్సరాల వరకు రైడర్ కవరేజ్ ని మీరు వినియోగించుకోవచ్చు.

ఏదైనా సందర్భంలో పాలసీదారుడు డిసబిలిటీ కి గురైతే  పాలసీకి సంబందించిన భవిష్యత్తు ప్రీమియంస్ అన్ని మాఫీ చెయ్యడం జరుగుతుంది,అప్పట్నుంచి మొత్తం ప్రీమియంని LIC సంస్థే చెల్లిస్తుంది , దీనితోపాటుగా  ఈ రైడర్ ద్వారా లభించే మొత్తం ప్రయోజనాన్ని   పాలసీదారునికి  ప్రతినెలా రెగ్యులర్ సహాయం రూపంలో 10 సంవత్సరాలపాటు  అందివ్వడం జరుగుతుంది.

 

3. కొత్త  క్రిటికల్ ఇల్లన్స్ బెనిఫిట్ రైడర్ –  ( Critical Illness Benefit Rider )

పాలసీదారుడు కనుక ఈ రైడర్ ను  తీసుకొంటే పాలసీ సమయంలో  ఆరోగ్య భీమా  ప్రయోజనం కలిగిస్తుంది.
పాలసీదారుడు ఏదైనా  అనారోగ్యానికి గురిఅయినట్లైతే  ( కాన్సర్, హార్ట్ అట్టాక్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ సంబంధిత మొదలైనవి ) ట్రీట్మెంట్  ఖర్చును LIC సంస్థ అందిస్తుంది.

 

4. టర్మ్ రైడర్  –  Term Rider

పాలసీదారుడు మొత్తం పాలసీ సమయంలో ఏ కారణంగా రిస్క్ గురైన అంటే  సాధారణంగా గాని లేదా ఆక్సిడెంట్ కారణంగా కానీ మరణిస్తే  తీసుకొన్న భీమాకి  సమానమైన అమౌంట్ నామినీకి  అదనంగా రావడం జరుగుతుంది, టర్మ్ రైడర్  పాలసీ ప్రారంభంలో మాత్రమే తీసుకొనేవీలుంటుంది పాలసీ మధ్యలో లభించడం జరుగుతుంది.

 

4. LIC ఆక్సిడెంట్ బెనిఫిట్ రైడర్  –  Accident Benefit Rider  

పాలసీదారుని రిస్క్ ఆక్సిడెంట్ కారణం చేత జరిగితే ఈ రైడర  ప్రయోజనం నామినికి అందిస్తుంది.

 

LIC భీమా రత్న ముఖ్య ప్రయోజనాలు  – Important Benefits

 

• ఫ్రీ లుక్ పీరియడ్ – Free Look Period

పాలసీని కనుగోలు చేసిన తర్వాత పాలసీ యొక్క నియమ నిభందనలు  పట్ల వ్యక్తి అసంతృప్తి చెందితే బ్రాంచ్ ద్వారా పాలసీ కనుగోలు చేస్తే 15 రోజులు, ఇతర మధ్యమాల ద్వారా పాలసీని కనుగోలు చేస్తే 30 రోజులు ఫ్రీ లుక్ పీరియడ్ లభిస్తుంది ఈ సమయంలో మొత్తం ప్రీమియం యధావిధిగా రావడం జరుగుతుంది.

 

• గ్రేస్ పీరియడ్ – Grace Period

పాలసీలో ప్రీమియం కట్టెందుకు అదనపు సమయం, LIC భీమా రక్ష  ప్లాన్ లో ఎవరైతే వార్షిక, అర్ధవార్షిక మరియు ట్రైమాసిక  ప్రీమియం చెల్లిస్తారో వారికి 30 రోజులు అధిక సమయం మరియు ప్రతి నెలా ప్రీమియం చెల్లించే వారికీ 15 రోజులు పీరియడ్ ఉంటుంది.

 

• ప్రీమియం చెల్లింపు విధానం – ( Premium Mode )

1. వార్షిక         – Yearly
2. అర్ద వార్షిక  – Half Yearly
3. త్రైమాసిక  – Quarterly
4. నెలవారీ     – Monthly

 

• పాలసీ రివైవల్  – Revival Of Policy

ఏదైనా కారణంగా ఈ పాలసీలో 5 సంవత్సరాలు రెగ్యులర్ గా వ్యక్తి ప్రీమియం చెల్లించలేనట్లైతే ఈ పాలసీ ముగియవేయబడుతుంది. అటువంటి సమయంలో 5 సంవత్సరాల లోపు మొత్తం బాకీ ప్రీమియం  పెనాల్టీతో కలిపి  చెల్లిస్తే ప్లాన్ లో కొనసాగవచ్చు.

 

•  లోన్ సదుపాయం – Loan Facility

ఈ పాలసీలో వ్యక్తి  కనీసం 2 సంవత్సరాలు  ప్రీమియం చెల్లిస్తే ,  అత్యవసర పరిస్థితుల్లో  జమ చేసిన  ప్రీమియం పై  లోన్ కూడా లభిస్తుంది.

 

https://licindia.in/

 

• LIC భీమా రత్న  డాకుమెంట్స్ ( Documents Required?)

1. ప్రపోసల్  ఫారం నెంబర్ – 300 & 340

LIC  ఆఫీసియల్ వెబ్సైటు ద్వారా ఆన్లైన్లో  ( Online )   లేదా ఆఫ్ లైన్ ( Offline )  ఏజెంట్ మాధ్యమంగా తీసుకొనే సదుపాయం ఉంటుంది.

2. ఆధార్ కార్డు            (  Age Proof )
3. ఓటుగుర్తింపు కార్డు  ( Address Proof )
4. పాన్ కార్డు               (   KYC  Verification )
5.  మెడికల్ రిపోర్ట్       ( Health Condition )
6. బ్యాంక్ పాసుబుక్     ( Bank Account )

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *