LIC New Endowment Plan in Telugu – రోజుకి 53/- రూపాయలతో 12 లక్షలు పొందండి, పూర్తి వివరాలు.

                             LIC New Endowment Plan Details In Telugu –  914

LIC New Endowment Plan  ఎల్ఐసి న్యూఎండోమెంట్ ప్లాన్ అనేది ఎల్ఐసి సంస్థ  యొక్క ఉత్తమ పాలసీ గా పేరు తెచ్చుకుంది.  ఈ ప్లాన్ యొక్క టేబుల్ నెంబర్ -914. వినియోగదారునికి అందించే అనేక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ  ప్లాను రూపొందించారు.   ఇది ఒక నాన్-లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ( Non Linked Life Insurance )పాలసీ మరియు మంచి రాబడికి హామీ ఇస్తూ బోనస్‌ను కూడా అందిస్తుంది. పాలసీ  ఎంపిక పరంగా చూస్తే పాలసీ గొప్ప బ్యాండ్‌విడ్త్‌ను కలిగి ఉంటుంది.

బీమా చేసిన వ్యక్తి పాలసీ పీరియడ్ ను పూర్తి చేసుకుంటే,  అతడు / ఆమెకు మెచ్యూరిటీ బెనిఫిట్ లభిస్తుంది.  అంటే మొత్తం భీమా తో పాటు వెస్టెడ్ సింపుల్ రివర్షనరీ బోనస్ ( vested simple revisionary ) + ఫైనల్ అడిషనల్ బోనస్ ( Final Additional ) లభిస్తుంది.

 

.పాలసీ యొక్క ప్రయోజనాలు (Benefits of LIC new endowment plan ):-

1. LIC New Endowment Plan ఒక రెగ్యులర్ ప్రీమియం ప్లాన్, పెద్దలతో పాటు పిల్లలకి కూడా వర్తిస్తుంది.

2.పాలసీ పదవీకాలం ముగిసిన తరువాత,  ప్రాణాలతో ఉన్నవారికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది, అలాగే పాలసీతీసుకున్న  వ్యక్తి మరణం విషయంలో, నామినీకి డెత్ బెనిఫిట్స్ ఉంటాయి.

3. అన్ని కేటగిరిల వారికి అందుబాటులో ఉండేలా తక్కువ ప్రారంభ భీమాను నిర్దేశించడం జరిగింది.

4. పాలసీదారుడు అదనపు ప్రయోజనం పొందేలా 4 బెనిఫిట్ ఆప్షనల్ రైడర్స్ కలవు. వీటి గురించి ముందు తెలుసుకొందాం!

5. పాలసీలో తీసుకొనే భీమా మరియు చెల్లించే ప్రీమియం పై డిస్కౌంట్ ( Discount ) లభిస్తుంది.

6. అత్యవసర సమయంలో లోన్ పొందవచ్చు మరియు పాలసీని సరెండర్ చేసే విధంగా సరెండర్ ఫెసిలిటీ ఉంటుంది.

 

•  ఈ పాలసీలో  ప్రస్తుతం మనకి ఎంత  బోనస్ లభిస్తుంది? ( Bonus Rates  ?)

LIC బోనస్ రేట్స్ ని సంవత్సరానికి ఒకసారి  ప్రతీ ఆర్థిక సంవత్సరంలో  పాలసీదారులకు  అందిస్తుంది.
బోనస్ రేట్స్ వేరు వేరు పాలసీలకు వేరే వేరు గా లభిస్తాయి మరియు లభించే బోనస్  పాలసీ సమయం పై  ఆధారపడి ఉంటాయి.

పాలసీ సమయం                                 బోనస్ ( 2020 – 2021)
12 నుంచి 15 సం||ల మధ్య               –    35/1000
16 నుంచి  20 సం||ల మధ్య             –   38 లేదా  39/1000
20 సంవత్సరాలు పైబడి                   –   44 లేదా  45/1000

ఇక్కడ బోనస్ ప్రతీ 1000 రూపాయలు కి  లభిస్తుంది,  అంటే లక్ష రూపాయల పాలసీని 20 సంవత్సరాలకు తీసుకొంటే  1,00,000 ÷ 1000 × 44 = 4400/-.
ఈ సంవత్సర బోనస్ గా మీకు లభిస్తుంది.

 

• పాలసీని తీసుకోవడానికి అర్హులు ఎవరు? ( Eligibility ? )

ఈ పాలసీ తీసుకొనే వ్యక్తి యొక్క కనీస వయస్సు( Minimum Age )   =8 సంవత్సరాలు
అత్యధిక వయస్సు  (maximum Age )                                                     = 55 సంవత్సరాలు

కనుక 8 నుంచి 55 సంవత్సరాల వయసు మధ్యకలిగిన వారు  ఈ పాలసీని  తీసుకోవచ్చు.

 

• ఈ పాలసీని ఎన్ని సంవత్సరాలకు తీసుకొనే వీలుంటుంది? (  Policy Term ? )

కనీస పాలసీ సమయం వచ్చి  (Minimum Policy Period )  =12 సంవత్సరాలు.
అత్యధిక పాలసీ సమయం  ( Maximum Policy Period )     = 35 సంవత్సరాలు.
కాబట్టి మీరు  ఈ పాలసీ యొక్క సమయాన్ని   12 నుంచి  35 సంవత్సరాల మధ్య  నిర్ణయించుకోవచ్చు.

 

• LIC  న్యూ ఎండోమెంట్ పాలసీ యొక్క  కనీస మరియు అత్యధిక భీమా పరిమితి ఎంత? ( Sum Assured?)

ఈ పాలసీ యొక్క కనీస భీమా పరిమితి                        = Rs 1, 00, 000/– రూపాయలు.
అత్యధిక  భీమా పరిమితి కి ఎటువంటి  అవధి లేదు   =Rs NO limit

కనీసం లక్ష రూపాయలు నుంచి  అత్యధికముగా ఎంతైనా భీమాని తీసుకోవచ్చు, కానీ ఇది మీయొక్క  వార్షిక  ఆదాయంపై ఆధారపడి ఉంటుంది.

 

• ఈ  పాలసీ యొక్క  గరిష్ట మెట్యూరిటీ  సమయం ఎంత? ( Maximum Maturity Age )

ఈ పాలసీయొక్క  అత్యధిక మెట్యూరిటీ కాల పరిమితి = 75 సంవత్సరాలు గా  ఉంటుంది,

అంటే 75 సంవత్సరాలలోపు పాలసీ ముగిసేవిధంగా చూసుకోవాలి.

 

• పాలసీ మధ్యలో లోన్ లభిస్తుందా?  లేదా? ( Loan Facility )

పాలసీదారుడు  కనీసం 2 సంవత్సరాలు  ఎటువంటి అంతరాయం లేకుండా  పూర్తి ప్రీమియం చెల్లిస్తే ,  అత్యవసర పరిస్థితుల్లో  జమా  చేసిన  ప్రీమియం పై  లోన్ కూడా పొందవచ్చు.

అది ఎంత అంటే మీయొక్క సరెండర్ వేల్యూ పై ఆధారపడి ఉంటుంది. లోన్ పై  వడ్డీరేటును కూడా  సంస్థ నిర్ణయిస్తుంది.

 

• ఈ పాలసీలో  ప్రీమియంని ఏ విధంగా చెల్లించాలి?  ( Premium  Paying ?)

ఈ పాలసీలో  4 రకాలుగా  ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది.
1. సంవత్సరానికి ఒకసారి    – Yearly
2. 6 నెలలకు ఒకసారి          – Half Yearly
3. 3 నెలలకు  ఒకసారి         – Quarterly
4. ప్రతినెలా                           – Monthly

ఈ విధంగా పాలసీదారుడు ఏదో ఒక పద్దతిలో  నిర్ణయించుకొన్న  మోడ్ ఆధారంగా  ప్రీమియం చెల్లించవచ్చు.

ముఖ్య గమనిక : ఈ ప్రీమియంని చెల్లించడానికి  పాలసీదారుడు ప్రతినెలా సంస్థకు వెళ్లి చెల్లించవచ్చు.
లేదా  ఆన్ లైన్లో  గూగుల్ పే ( Google Pay ) ఫోన్ పే ( Phone Pay ) మరియు  ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ( Internet Banking ) తదితర రూపాల్లో సులువుగా చెల్లించే సదుపాయం LIC సంస్థ కల్పించింది.

 

• ఈ పాలసీలో చెల్లించే ప్రీమియంపై  డిస్కౌంట్ ఎంత లభిస్తుంది?  ( Premium  Rebate Of ? )

1.  సంవత్సరానికి ఒకసారి  – Yearly            = 2%
2. 6 నెలలకు ఒకసారి         – Half Yearly   = 1%
3. 3 నెలలకు  ఒకసారి        – Quarterly      =Nil
4. ప్రతినెలా                          – Monthly        =Nil
ఇక్కడ రిబేట్ అంటే మీరు చెల్లించే ప్రీమియం అమౌంట్ పై   కొద్దిగ డిస్కౌంట్ రూపంలో   తగ్గించడం జరుగుతుంది. ఈ పాలసీలో సంవత్సరానికి మరియు 6 నెలలకు ఒకసారి  ప్రీమియం చెల్లించేవారికి ఈ రిబేట్ లభిస్తుంది.

 

LIC Saral Jeevan Bhima in Telugu – 25 లక్షలు భీమా రోజుకి 26/- రూ ||లకే పూర్తి వివరాలు తెలుగులో..

LIC Bhima Jyothi In Telugu -” బోనస్ 100 శాతం గ్యారెంటీ, 5 సంవత్సరాలు ప్రీమియం మాఫీ “

•  తీసుకొనే భీమాపై  ఎంత  డిస్కౌంట్ లభిస్తుంది? ( Rebate On high Sum Assured? )

భీమా ( Basic Sum Assured )                     రిబేట్
1. 1, 00, 000 నుంచి  1, 95, 000                 = Nil
2. 2, 00, 000 నుంచి  4, 95, 000               = 2.0%
3. 5, 00, 000 నుంచి  9, 95, 000                = 3.0%
4. 10, 00, 000 నుంచి  అత్యధికముగా       = 3.0%

ఈ విధంగా అత్యధిక బీమాపై కూడా ఈ పాలసీలో  మీకు  రిబేట్ లభిస్తుంది.

 

 

• Example ( ఉదాహరణ )

 

(  Maturity Of LIC New Endowment plan  ?)

 

పాలసీదారుని పేరు  ( Name )          – Mr. రాకేష్
వయసు      ( Age )             – 30 సంవత్సరాలు
పాలసీ సమయం  ( Period )      – 25  సంవత్సరాలు
భీమా    ( Bhima )          – 5 లక్షలు
ప్రీమియం చెల్లించే విధానం             –  ప్రతినెలా
నెలసరి ప్రీమియం ( Monthly Premium )   – Rs 1,651/- ( ఈ  ప్రీమియం GST చార్జీలతో కలిపి )

చెల్లించే ప్రీమియంపై సంవత్సరానికి ఒకసారి ఇన్కమ్ టాక్స్ రూపంలో 30% టాక్స్ రిటర్న్ లభిస్తుంది. కాబట్టి రాకేష్ కి ప్రతి సంవత్సరం లభించే టాక్స్ డేడిక్షన్   = Rs 5,946/-

Mr. రాకేష్ ప్రతినెలా ఈ పాలసీలో  1,651/- రూపాయలు చొప్పున 25 సంవత్సరాలలో  చెల్లించిన మొత్తం ప్రీమియం వచ్చి  =Rs 4,85,302/- అవుతుంది..

 

• మెట్యూరిటీ ప్రయోజనం (Maturity  Benefit )

ఎల్ఐసి న్యూ ఎండోమెంట్ ప్లాన్ తీసుకున్న  వ్యక్తి పాలసీ యొక్క పదవీకాలం ముగిసిన తరువాత, అతనికి / ఆమెకు మెచ్యూరిటీ బెనిఫిట్స్ లభిస్తాయి మరియు పాలసీ అక్కడి తో ముగుస్తుంది.

మెట్యూరిటీ = ప్రాథమిక భీమా + వెస్టెడ్ బోనస్ + ఫైనల్ బోనస్
“Maturity = Basic Sum Assured  + Vested Simple Rivesionary  Bonus + Final Additional Bonus “

కాబట్టి  పాలసీ యొక్క  25వ  సంవత్సరం మెట్యూరిటీగా

తీసుకొన్న భీమా ( Sum Assured )              =Rs 5, 00, 000

వెస్టెడ్ సింపుల్ రెవేసినరీ  బోనస్               =Rs  5, 62, 000
(Vested Simple Bonus )

ఫైనల్ అడిషనల్ బోనస్                             = Rs 2, 25, 000
( Final Additional Bonus )

మొత్తం కలిపి   =  Rs 12, 87, 500     Mr. రాకేష్ కి ఈ పాలసీలో  మెట్యూరిటీగా లభిస్తాయి.

 

• LIC సంస్థ కొత్తగా అందించిన మెట్యూరిటీ సెటిల్మెంట్ విధానం ఈ పాలసీకి వర్తిస్తుందా?
( Maturity Settlement In  LIC )

1.  వర్తిస్తుంది! ఈ విధానం ద్వారా Mr. రాకేష్ మొత్తం మెట్యూరిటీ అమౌంట్ ని పాలసీ చివర్లో ఒక్కసారే పొందవచ్చు.
లేదా

2. వాయిదాల పద్దతిలో  5, 10, మరియు  15 సంవత్సరాల సమయం నిర్ణయించుకొని, ప్రతినెలా, ప్రతీ 3 నెలలకు, 6 నెలలకి ఒక్కసారి మరియు సంవత్సరానికి ఒకసారి  లభించేలా నిర్ణయించుకొనే  సదుపాయం ఉంటుంది. ఆ విధంగానే  మీకు రెగ్యులర్ గా ఈ మెట్యూరిటీ అమౌంట్ లభిస్తుంది.

ముఖ్య గమనిక : ఈ ఎంపికను పాలసీదారుడు  కనీసం 3 నెలలు ఇంకా పాలసీ సమయం మిగిలి ఉండగానే సంస్థకి  తెలియచేయాల్సి ఉంటుంది.

 

• మరణ ప్రయోజనం ( Death Benefit ):-

ఈ  ప్లాన్ తీసుకున్న  వ్యక్తి మెచ్యూరిటీ తేదీ లోపు  మరణిస్తే, బీమా తీసుకున్న వ్యక్తి యొక్క నామినీకి “డెత్ బెనిఫిట్‌గా“ మరణంపై గ్యారెంటీ  ఇవ్వబడిన మొత్తం భీమా ”+ వెస్టెడ్ బోనస్‌లు చెల్లించబడతాయి. ఇక పాలసీ అక్కడితో  ముగుస్తుంది.

తీసుకొన్న భీమా ( Sum Assured )   =  Rs 5, 00, 000

వెస్టెడ్ సింపుల్ రెవేసినరీ  బోనస్ +   ఫైనల్ అడిషనల్ బోనస్  కలిపి నామినీ కి అందచేస్తారు

గమనిక:-

“మరణంపై ప్రయోజనం అనేది ” తీసుకొన్న భీమా కంటే ఎక్కువ లేదా వార్షిక ప్రీమియం కి 10 రెట్లులలో ఏది ఎక్కువ ఐతే అది లభిస్తుంది.అయితే ఇది చెల్లించిన మొత్తం ప్రీమియంలలో కనీసం 105% లోపు ఉంటుంది.

ఈ సందర్భంలో బోనస్ అనేది పాలసీ కొనసాగిన సమయం పై ఆధారపడి ఉంటుంది.

 

• LIC New Endowment Plan లో లభించే టాక్స్ ప్రయోజనాలు ఏమిటి? (  Tax Benefits ?)

ఈ ప్రయోజనం కింద, బీమాచేసిన వ్యక్తి కి రూ. 1,50,000 వరకు ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80 (సి) ప్రకారం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి మినహాయింపు పొందటానికి అర్హులు.

మెచ్యూరిటీ బెనిఫిట్ రూపంలో అతనికి అందే మొత్తానికి అన్ని నిబంధనలు మరియు షరతులకు లోబడి ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 10 (డి) ప్రకారం టాక్స్ పడకుండా ఉంటుంది.

 

• LIC New Endowment Plan లో  ఇతర అదనపు ప్రయోజనాలను  కొరకుఏయే  రైడర్స్అందుబాటులో ఉన్నాయి?  (   Benefit Riders)

ఈ పాలసీ 4 ముఖ్య  రైడర్ ప్రయోజనాలను కలిగి ఉంది. రైడర్స్ కేవలం మినహాయింపు మాత్రమే. అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు లేదా వదిలి పెట్టవచ్చు.

 

1. ప్రీమియం వైవర్ బెనిఫిట్ రైడర్ ( Premium Waiver Benefit Rider ) – UIN 512B204V03

LIC New Endowment పాలసీని 18 సంవత్సరాల లోపు పిల్లలకి తీసుకొన్నప్పుడు ఈ ప్రయోజనం లభిస్తుంది.పాలసీ తీసుకొనే సమయంలోనే ఈ రైడర్ ను తీసుకోవాల్సి ఉంటుంది,  మధ్యలో లభించదు.

పాలసీ లో ప్రీమియం చెల్లించే వ్యక్తి ప్రపోసర్ గా ఉంటాడు, పిల్లలు పాలసీదారులు అవుతారు.

పాలసీ లో ప్రీమియం చెల్లించే వ్యక్తి ఏదైనా కారణం చేత మరణించినా లేక క్రిటికల్ ఇల్నెస్ కి గురిఅయిన భవిష్యత్ ప్రీమియం అంతా కంపెనీ మాఫీ చేస్తుంది, అయినప్పటికీ పాలసీ యొక్క అన్ని ప్రయోజనాలు లభిస్తాయి.

దీనితోపాటుగా తీసుకొన్న భీమాలో 10% శాతం అమౌంట్ చొప్పున ప్రతీ సంవత్సరం అందివ్వడం జరుగుతుంది వచ్చే 10 సంవత్సరాల వరకూ!

అయితే ఈ రైడర్ ప్రయోజనం పొందడానికి ప్రపోసర్ వయసు 55 సంవత్సరాల లోపు ఉండేలా చూసుకోవాలి.

 

2. ఆక్సిడెంట్ డెత్ మరియు డిజాబిలిటీ బెనిఫిట్ రైడర్ ( Accidental Death  And Disability Benefit Rider – UIN  512B209V02)

ఈ రైడర్ ను పాలసీదారుడు పాలసీసమయంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. చివరి 5 సంవత్సరాలు ఇంకా పాలసీసమయం మిగిలిఉన్నా  అప్పుడు కూడా తీసుకొనే సదుపాయం ఉంటుంది.

పాలసీదారునికి 70 సంవత్సరాల  వయసు వచ్చే వరకూ ఈ రైడర్ తన ప్రయోజనాన్ని అందిస్తుంది.
ఈ రైడర్ తీసుకొన్న పాలసీదారుడు ఆక్సిడెంట్ కారణంగా మరణిస్తే  ప్రాథమిక భీమాకి లభించే మరణ ప్రయోజనం తోపాటు అందనంగా , మరికొంత అత్యధిక ప్రయోజనం నామినికి లభించడం జరుగుతుంది.ఇది మొదటి ప్రయోజనం.

పాలసీదారునికి ఆక్సిడెంట్ జరిగింది కానీ ఆక్సిడెంట్ లో మరణించలేదు, డిజాబిలిటీ కి గురయ్యాడు అంటే ఆక్సిడెంట్ లో ప్రాథమిక అవయవాలు కోల్పోయి ఏ పనిచేయలేని స్థితిలో ఉన్నట్లయితే వెంటనే పాలసీకి సంబందించిన భవిష్యత్తు ప్రీమియంస్ అన్ని మాఫీ చెయ్యడం జరుగుతుంది,అప్పట్నుంచి మొత్తం ప్రీమియంని LIC సంస్థే చెల్లిస్తుంది.

దీనితోపాటుగా  ఈ రైడర్ ద్వారా లభించే మొత్తం ప్రయోజనాన్ని   పాలసీదారునికి  ప్రతినెలా రెగ్యులర్ సహాయం రూపంలో 10 సంవత్సరాలపాటు  అందివ్వడం జరుగుతుంది.

ముఖ్య గమనిక :  ఈ  ప్రయోజనం కొరకు ఆక్సిడెంట్ జరిగిన 180 రోజులు లోపు మీరు సంస్థకి సమాచారాన్ని అందివ్వాల్సివుంటుంది.

Mr. రాకేష్ పాలసీ మధ్యలో ఆక్సిడెంట్ కారణంగా మరణిస్తే  ప్రాథమిక  మరణ ప్రయోజనం గా  =Rs 5,00,000/- లభిస్తాయి.
ఈ రైడర్ ని కనుక తీసుకొంటే మరొక  =Rs  5, 00, 000 లక్షల రూపాయలు

మొత్తం  =Rs  10, 00, 000/- నోమినికి  రావడం

జరుగుతుంది.ఈ రైడర్ కోసం ప్రతినెలా ప్రీమియంతోపాటుగా  = 36/- రూపాయలు అదనంగా చెల్లిచాలి.

 

3. టర్మ్ రైడర్  ( Term Rider – UIN 512B210V01)

ఈ రైడర్   పాలసీ తీసుకొనే సమయంలో మాత్రమే తీసుకొనే సదుపాయం ఉంటుంది, మధ్యలో లభించదు.

టర్మ్ రైడర్  ముఖ్య ప్రయోజనం ఏమిటి ?

పాలసీదారుడు పాలసీ సమయంలో ఏ కారణంగా మరణించినా అంటే  సాధారణంగా గాని లేదా ఆక్సిడెంట్ కారణంగా కానీ మరణిస్తే  తీసుకొన్న భీమాకి  సమానమైన అమౌంట్ నామినీకి  అదనంగా లభిస్తుంది.

అంటే = 5,00,000 + 5,00,000 = Rs 10,00,000/- నామినికి మరణ ప్రయోజనంగా లభిస్తుంది.

టర్మ్ రైడర్ కోసం Mr.రాకేష్ ప్రతినెలా  అదనంగా  = 39/- రూపాయలు ప్రీమియంతో కలిపి  చెల్లించాల్సివుంటుంది.

 

4. కొత్త  క్రిటికల్ ఇల్లన్స్ బెనిఫిట్ రైడర్ ( Critical Illness Benefit Rider – UIN 512A212V01)

ఈ రైడర్ మీకు పాలసీ సమయంలో  ఆరోగ్య భీమా  ప్రయోజనం కలిగిస్తుంది.
అంటే పాలసీదారుడు ఏదైనా పెద్ద అనారోగ్యానికి గురిఅయినట్లైతే  ( కాన్సర్, హార్ట్ అట్టాక్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ సంబంధిత మొదలైనవి ) ట్రీట్మెంట్ కి కావాల్సిన మొత్తం ఖర్చును LIC సంస్థ అందిస్తుంది.

దీనికోసం LIC సంస్థ గంభీరమైన  వ్యాధులకు సంబందించిన  ఒక లిస్ట్ తయారుచేసింది. లిస్ట్ లో ఉన్న ఏ అనారోగ్యానికి పాలసీదారుడు గురియైన  ఈ ప్రయోజనం  వర్తిస్తుంది.
ఈ రైడర్ నిమిత్తము కొద్దిగా ప్రీమియంని  అదనంగా  చెల్లించాలి.

 

•   గ్రేస్ పీరియడ్ ఉంటుందా ? ( Grace Period )

గ్రేస్ పీరియడ్ అంటే  పాలసీలో మీరు ప్రీమియంని చెల్లించవలసిన తేదీలోపు చెల్లించలేనప్పటికీ అధనంగా కొద్దిగా సమయం ఉంటుంది.

ఎవరైతే ఈ పాలసీలో  సంవత్సరానికి ఒకసారి,6 నెలలకు ఒకసారి మరియు 3 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లిస్తారో వారికీ అధనంగా  30 రోజులు సమయం ఉంటుంది.
ప్రతినెలా ప్రీమియం చెల్లించేవారికి 15 రోజులు ఈ గ్రేస్ పీరియడ్ ఉంటుంది.

ముఖ్య గమనిక : ఈ  సమయంలో మీరు అదనపు పెనాల్టీని సంస్థకి చెల్లించవలసిన అవసరం ఉండదు.
ఈ గ్రేస్ పీరియడ్ సమయంలో కూడా మీకు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది.

 

• LIC New Endowment Plan పాలసీకి పైడ్ అప్ వేల్యూ వర్తిస్తుందా? లేదా? ( Paid అప్ Value )

వర్తిస్తుంది,

పైడ్ అప్ వేల్యూ అంటే ఈ పాలసీలో మీరు రెగ్యులర్ గా  2 సంవత్సరాలు  లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు  ప్రీమియం చెల్లించి, తర్వాత ఏదైనా అనివార్య కారణాల కారణంగా  పాలసీలో ప్రీమియం  చెల్లించడం మానివేసినప్పటికీ  ఇన్సూరెన్స్ వర్తించడం ఆగిపోదు. అప్పటివరకు చెల్లించిన  ప్రీమియంని ఆధారంగా చేసుకొని  పాలసీ బెనిఫిట్స్ పాలసీదారునికి  లభించడం జరుగుతుంది.

ముఖ్య గమనిక :-
ఈ ప్రయోజనాన్ని పొందడానికి ఖచ్చితంగా 2 సంవత్సరాలు  ప్రీమియం చెల్లించి ఉండాలి.

 

• రివైవల్  పీరియడ్ ఫెసిలిటీ ఎంత సమయం ఉంటుంది? (  Revival Period ?)

ఈ పాలసీకి  5 సంవత్సరాలు  రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది.
పాలసీదారుడు ఏదైనా కారణంగా ఈ పాలసీలో 5 సంవత్సరాలు రెగ్యులర్ గా  ప్రీమియం చెల్లించలేనట్లైతే ఈ పాలసీ ముగియవేయబడుతుంది.
కాబట్టి అటువంటి సమయంలో 5 సంవత్సరాల లోపు మొత్తం బాకీ ప్రీమియంని పెనాల్టీతో కలిపి   చెల్లిస్తే  ఈ పాలసీలో తిరిగి కొనసాగే సదుపాయం ఉంటుంది.

 

• ఫ్రీ లుక్ పీరియడ్  ? ( Free Look Period? )

పాలసీ తీసుకొన్న 15 రోజులు లోపు, పాలసీకి సంబందించిన నియమాలు మరియు షరతులు పై  మీరు అసంతృప్తి చెందినట్లైతే  వెంటనే పాలసీని మూసివేసి చెల్లించిన  మీ ప్రీమియంని  వెనక్కి పొందవచ్చు. ఈ సమయంలో ఎటువంటి సర్వీస్ చార్జీలు  విధించబడవు.

ముఖ్య గమనిక  : 15 రోజుల తర్వాత కనుక ఈ పాలసీని మూసివేస్తే  ప్రీమియం పై  కనీస సర్వీస్ చార్జీలు  వసూలుచేయబడతాయి.

 

• LIC New Endowment Plan  సరెండర్ వేల్యూ ఫెసిలిటీ ( Surrender Value ?)

పాలసీదారుడు రెగ్యులర్ గా 2 సంవత్సరాలు  ప్రీమియం చెల్లించిన తర్వాత కావాలంటే ఈ  పాలసీని సరెండర్ చేసి , అప్పటివరకు మీరు జమా చేసిన డబ్బును రిటర్న్ గా వెనక్కి పొందవచ్చు.

కానీ మీరు ఏ కంపెనీలో పాలసీ తీసుకొన్నా సరే పాలసీని మధ్యలో సరెండర్ చేసినట్లయితే  ఎక్కువ డబ్బులను నష్టపోవాల్సిఉంటుంది.

 

https://licindia.in/

 

• LIC New Endowment Plan పాలసీని  ఎలా  తీసుకోవాలి? ఏ ఏ  డాకుమెంట్స్ కి అవసరం ?
( Apply and  Documents Required?)

ఈ పాలసీని మీరు LIC  ఆఫీసియల్ వెబ్సైటు ద్వారా ఆన్లైన్లో తీసుకోవచ్చు.

లేదా
ఆఫ్ లైన్ ఏజెంట్ మాధ్యమంగా తీసుకొనే సదుపాయం ఉంటుంది.

1. మీయొక్క పూర్తి వివరాలు నింపిన ప్రపోసల్ ఫారం.
ఈ  ఫారం నెంబర్ – 300 & 340.
2. ఆధార్ కార్డు               –   (  Age Proof )
3. ఓటుగుర్తింపు కార్డు     –   ( Address Proof )
4. పాన్ కార్డు                   –  (   KYC – Verification )
5.  మెడికల్ రిపోర్ట్          –   ( Health Condition )

 

• ముగింపు  ( Conclusion )

LIC New Endowment Plan కి సంబందించిన పూర్తి సమాచారాన్ని మీకు అందించానని భావిస్తున్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ మరచినట్లైతే  మన్నించి క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.

ఈ వెబ్సైటు ద్వారా అన్ని   ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు  మరియు  చిన్న తరహా వ్యాపారాల యొక్క  వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *