Post office RD Scheme in Telugu – “చిన్న పెట్టుబడి ద్వారా పెద్ద మొత్తాన్ని పొందండి “

                                               Post office RD Scheme in Telugu

post office interest rate april 2023

పోస్ట్ ఆఫీస్ పథకాలు సాధారణంగా  సురక్షితమైన పెట్టుబడి పధకాలలో గొప్పవని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి గొప్ప రాబడిని అందిస్తాయి.  5 సంవత్సరాల మెచ్యూరిటీ కలిగిన పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ గురించి ఈ ఆర్టికల్ లో  చర్చిస్తాము. ఈ పథకం కింద, ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తే,  మెచ్యూరిటీపై వడ్డీతో కలిపి మొత్తం  అందుతుంది. ప్రస్తుతం, ఈ పథకానికి వడ్డీ రేటు సంవత్సరానికి 5.8 శాతం గా ఉంది.  అయితే ఇది త్రైమాసిక ప్రాతిపదికన కలిపి ఉంటుంది.

ఇది పోస్ట్ ఆఫీస్ యొక్క రికరింగ్ డిపాజిట్ పథకం.  ప్రతి నెలా కనీసం రూ .100 డిపాజిట్ చేయాలి మరియు 10 గుణకాలలో డిపాజిట్ చేయవచ్చు.
ఈ పథకం కేవలం  సురక్షితం మాత్రమే కాదు, నెలకు కేవలం రూ .100 పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో  సంపాదించవచ్చు. ఇక , పెట్టుబడి పెట్టే మొత్తానికి గరిష్ట పరిమితి లేదు. పోస్ట్ ఆఫీస్ RD డిపాజిట్ ఖాతా అనేది మెరుగైన వడ్డీ రేటుతో చిన్న వాయిదాలను జమ చేసే కేంద్ర ప్రభుత్వ హామీ పథకం.

ఈ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ వ్యక్తిగతంగానూ  తెరవవచ్చు లేదా ముగ్గురు వ్యక్తులు జాయింట్ గా తెరవవచ్చు. మరియు  10 సంవత్సరాలు నిండిన మైనర్ లేదా మైనర్ పేరుతో ఒక సంరక్షకుడు కూడా ఈ ఖాతాను తెరవవచ్చు.

మీరు RD అకౌంట్ ఓపెన్ చేసిన నెల 1 వ తేదీ నుండి 15 వ తేదీ మధ్యలో ఉంటే, ప్రతి నెలా 15 వ తేదీ లోపు RD అకౌంట్‌లో డబ్బు జమ చేయాలి. అయితే, నెల 15 వ తేదీ తర్వాత ఖాతా తెరిచినట్లయితే, నెల చివరి పని రోజు లోపల డబ్బు జమ చేయాలి.

 

Post office RD Scheme in Telugu - "చిన్న పెట్టుబడి ద్వారా పెద్ద మొత్తాన్ని పొందండి "

 

. పోస్ట్ ఆఫీస్ RD స్కీం అంటే ఏమిటి? ( What is Post Office RD Scheme?)

Post office RD scheme  అంటే రికరింగ్ డిపాజిట్ ( Recurring Deposit ). ఈ స్కీం లో ప్రతీ నెలా ఒక ఖచ్చితమైన అమౌంట్ ని డిపాజిట్ చేస్తే, డిపాజిట్ అమౌంట్ ని ఆధారంగా చేసుకొని 3 నెలలకి ఒకసారి వడ్డీ ని అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా లభించే వడ్డీ కాంపౌండ్ అవుతుంది. స్కీం సమయం ముగియగానే చెల్లించిన మొత్తం + వడ్డీని కలిపి స్కీం తీసుకొన్న వ్యక్తి కి అందిస్తారు.

ముఖ్యంగా ఈ స్కీం ఎవరికి ఉపయోగం అంటే తక్కువ ఆదాయం కల్గిన వ్యక్తులు చిన్న పొదుపు ద్వారా మంచి రాబడి పొందవచ్చు.

 

. ప్రయోజనాలు ( Benefits Of RD Scheme?)

• ఈ స్కీం ని పోస్ట్ ఆఫీస్ ద్వారా స్వయంగా గవర్నమెంట్ నిర్వహిస్తుంది కాబట్టి డిపాజిట్ డబ్బులకు 100% గవర్నమెంట్ సెక్యూరిటీ అందిస్తుంది.

• క్రమం తప్పకుండా ప్రతీ నెల రెగ్యులర్ అమౌంట్ లభిస్తుంది మరియు
స్కీం సమయం ముగియగానే డిపాజిట్ అమౌంట్ ని రిటర్న్ చేస్తారు.

 

. అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి అర్హులు ఎవరు? ( Who Can Open the Post office  RD scheme ?)

1.  కేవలం భారతదేశ నాగరికత కలిగిన వ్యక్తులకు మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది కాని NRI లకు ఈ స్కీం ఇవ్వబడదు.

2.  ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ RD అకౌంట్స్ ని ఓపెన్ చేసే అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు మరియు 18 సంవత్సరాలు వయసు నిండిన వారు ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్  చెయ్యవచ్చు.

3.  సింగిల్ అకౌంట్ ( Single ) మరియు  ఇద్దరు లేదా ముగ్గురు  వ్యక్తులు కలసి జాయింట్ ( joint )అకౌంట్ కూడా ఓపెన్ చెయ్యవచ్చు.

4.  10 సంవత్సరాలు వయసు పైబడిన పిల్లలు స్వయంగా ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు అదేవిధంగా చిన్నపిల్లల పేరు పై  అకౌంట్లో  అమౌంట్ డిపాజిట్ చేసి  తల్లితండ్రులు నిర్వహించవచ్చు.

 

• RD స్కీం యొక్క కనీస మరియు అత్యధిక డిపాజిట్ లిమిట్స్ ఎంత? ( Deposit Limits Of RD?)

ఈ స్కీం యొక్క కనీస డిపాజిట్  (Minimum Deposit  Amount ) = Rs. 100/-

అత్యధిక డిపాజిట్ అమౌంట్ ( Maximum Deposit Amount )   = హద్దు లేదు.

అయితే ఒక నియమం, ప్రతీ నెలా ఒకే విధమైన అమౌంట్ ని డిపాజిట్ చెయ్యాల్సివుంటుంది.

 

• RD రిబేట్ ఫెసిలిటీ? ( Rebate Facility )

కనీసం 6 నెలలు అమౌంట్ అడ్వాస్ గా స్కీములో డిపాజిట్ చేస్తే మీకు రిబేట్ లభిస్తుంది.

 

• RD స్కీం యొక్క సమయం? (Post office RD scheme  )

కనీసం 5 సంవత్సరాలు. అత్యధికముగా 10 సంవత్సరాల వరకూ ఎక్స్టెంషన్ చేసుకోవచ్చు.

 

• ప్రస్తుతం  Post office RD scheme   వడ్డీరేట్ ఎంత లభిస్తుంది? ( Rate Of Interest % )

పోస్ట్ ఆఫీస్ RD పథకంలో మీకు ప్రతీ 3 నెలలకు
ఒకసారి గవర్నమెంట్ వడ్డీ రేట్ ను ప్రకటిస్తుంది.

( జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలలలో..)

ముఖ్య గమనిక : ఈ వెబ్సైటు లో అన్ని పథకాల వడ్డీరేట్స్ గవర్నమెంట్ ప్రకటించిన విధంగా ప్రతి 3 నెలలకు మార్చడం జరుగుతుంది.
కాబట్టి  క్రమం తప్పకుండా అనుసరిస్తూ ఉండండి.

ప్రస్తుతం స్కీం లో 5.80% వడ్డీ రేట్ ని గవర్నమెంట్ ఈ పథకానికి అందిస్తుంది.

 

PPF Scheme in Telugu -” పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్” అర్హతలు, నియమాలు, ప్రస్తుత వడ్డీరేట్ పూర్తి వివరాలు!

LIC Jeevan Anand Policy In Telugu – 17 లక్షలు మెట్యూరిటీ తోపాటు జీవితాంతం 5 లక్షలు ఉచిత ఇన్సూరెన్స్

Example :-

•  Post office RD scheme  యొక్క బెనిఫిట్స్ ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం.

ఏదైనా పథకం యొక్క లాభం అనేది డిపాజిట్ చేసే అమౌంట్ పై ఆధారపడి ఉంటుంది.

పాలసీదారుని వయసు ( Age )           = 30 సంవత్సరాలు
డిపాజిట్  ( Deposit Amount )            = Rs 5,000/
ప్రస్తుత వడ్డీరేట్  ( Interest Now )     = 6.2%

ప్రతీ నెల డిపాజిట్ చేసిన మొత్తం అమౌంట్  ( Total Deposit )= 5000 × 5 × 12 = Rs 3,00,000/-

5 సంవత్సరాలకి లభించే మొత్తం వడ్డీ  ( total Interest ) =  Rs 52163/-

స్కీం యొక్క 5 వ సంవత్సరం మెట్యూరిటీ గా = Rs 3,52,163/- రూపాయలు లభిస్తాయి.

 

• RD అకౌంట్ ని అత్యవసర సమయంలో  మధ్యలో నిలిపివేసే సదుపాయం ఉంటుందా? ( RD  Pre – Mature Closer? )

ఉంటుంది! అకౌంట్ ఓపెన్ చేసిన 3 సంవత్సరాల తర్వాత కావాలంటే స్కీం బంద్ చేసి అమౌంట్ రిటర్న్ పొందవచ్చు.

ముఖ్య గమనిక :-

1. 3 సంవత్సరాలలోపు  కనుక అకౌంట్ ని బంద్ చేస్తే డిపాజిట్ అమౌంట్ కి అప్పటికి ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ పై ఎంత వడ్డీ లభిస్తుందో అంతే వడ్డీని అప్లై చేసి అమౌంట్ రిటర్న్ చేస్తారు.

2. ఒకవేళ మీరు కనుక అడ్వాన్స్ గా కొద్దికాలం అమౌంట్ చెల్లిస్తే ఆ సమయంలోపు అకౌంట్ బంద్ చేసే అవకాశం ఉండదు.

 

• నామినీ ఫెసిలిటీ? ( Nominee Facility ?)

ఈ పథకంలో  అమౌంట్ డిపాసిట్ చేసిన వ్యక్తి, పథకం మధ్యలో ఏదైనా కారణంగా అంటే  సాధారణంగా కానీ లేదా ఆక్సిడెంట్ కారణంగా గాని మరణిస్తే, డిపాజిట్ అమౌంట్  నామినీకి పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది. ఆ తర్వాత ఈ పథకం నిలిపివేయబడుతుంది.

 

• Post office RD స్కీం లో టాక్స్ బెనిఫిట్ లభిస్తుందా? ( RD Tax Benefits?)

ఈ స్కీం లో మీరు డిపాజిట్ చేసే అమౌంట్ పై గాని, లేదా మీకు లభించే  వడ్డీరేట్ పై గాని ఎటువంటి టాక్స్ ప్రయోజనం ఉండదు. గవర్నమెంట్ రూల్స్ కి అనుగుణంగా టాక్స్ వర్తిస్తుంది.

 

• RD ఖాతాను ఓపెన్ చెయ్యడానికి ఏయే డాకుమెంట్స్ కి అవసరం ఉంటుంది? ( RD Documents Required?)

1.అప్లికేషన్ ఫారం  ( Account Opening Form )
2.రెండు పాసుపోర్టు ఫొటోలు  ( 2 Photos )
3. ఆధార్ కార్డు          ( Adar Card )
4. పాన్ కార్డు             ( PAN  Card )    మరియు

 

పర్మినెంట్ అడ్రెస్స్ వివరాలకై   ( Address Proof )

1. కరెంటు బిల్      ( Electricity Bill )
2. టెలిఫోన్ బిల్     ( Telephone Bill )
3. బ్యాంక్ స్టేట్మెంట్  ( Bank Statement )
4. పాస్ పోర్ట్           ( Passport )
( ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది )

 

https://www.indiapost.gov.in/Financial/Pages/Content/Post-Office-Saving-Schemes.aspx

 

• ఖాతా బదిలీ సదుపాయం? ( Transfer Facility Of RD Scheme?)

ఈ RD  అకౌంట్ ని మీరు ఒక పోస్ట్ ఆఫీస్  బ్రాంచ్ నుంచి వేరొక బ్రాంచ్ కి  అతి సులభంగా బదిలీ చేసుకోవచ్చు.

 

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ – తరచుగా అడిగే ప్రశ్నలు ( Question & Answers )

ప్ర. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లపై అకాల ఉపసంహరణ సదుపాయం (Premature withdrawal facility)  అందుబాటులో ఉందా?

జ. అవును,అకాల ఉపసంహరణ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే, ఖాతా తెరిచిన తేదీ నుండి 3 సంవత్సరాల తర్వాత మాత్రమే  అకాల ఉపసంహరణ అనుమతించబడుతుంది.

ప్ర. పోస్టాఫీసులో మైనర్ పేరు మీద RD ఖాతా తెరవవచ్చా?

జ. అవును, మైనర్ పేరు మీద RD ఖాతా తెరవవచ్చు. అయితే  మైనర్ వయస్సు 10 సంవత్సరాలు నిండి ఉండాలి.

ప్ర. పోస్ట్ ఆఫీస్ RD స్కీం ఏదైనా రాయితీని అందిస్తుందా?

జ. పోస్ట్ ఆఫీస్ RD అకౌంట్ లో మీరు కనీసం 6 నెలల ముందస్తు డిపాజిట్ చేస్తే, పోస్ట్ ఆఫీస్ మీకు రాయితీని అందిస్తుంది.

ప్ర. పోస్టాఫీసు RD మెచ్యూరిటీకాలం ఎంత?

జ. పోస్ట్ ఆఫీస్ RD ఖాతాలకు 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది.

ప్ర. పోస్ట్ ఆఫీస్ RD నుండి సంపాదించిన వడ్డీ కి ఆదాయం పన్ను విధించబడుతుందా?

జ . పోస్ట్ ఆఫీస్ RD నుండి సంపాదించిన వడ్డీకి పన్ను విధించబడుతుంది. ఎందుకంటే టాక్స్ డిడక్షన్ -ఎట్-సోర్స్ (TDS) సర్టిఫికేట్ జారీ చేయబడలేదు.

ప్ర. RD అకౌంట్ కు వాయిదాలు సకాలంలో చెల్లించనందుకు జరిమానా  ఏమైనా ఉంటుందా?

జ.  నాలుగు కంటే ఎక్కువగా వాయిదాలు సకాలంలో చెల్లించకుండా ఉంటే ఖాతా నిలిపివేయబడుతుంది. అయితే, డిఫాల్ట్ ఫీజు చెల్లించడం ద్వారా రెండు నెలల్లోపు మీ RD  అకౌంట్ ను  క్రమబద్ధీకరించవచ్చు.

ప్ర.  పోస్ట్ ఆఫీస్ RD ఖాతా ద్వారా నామినేషన్ సౌకర్యం అందించబడుతుందా?

జ. అవును, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్‌లో నామినేషన్ సౌకర్యం అందించబడుతుంది.

ప్ర.  పోస్ట్ ఆఫీస్ RD (రికరింగ్ డిపాజిట్)  మంచిదేనా? మరియు ఇది సురక్షితమైన పెట్టుబడేనా?

జ . మీ నెలవారీ సంపాదనలో ఒక చిన్న పాటి పొదుపు తో మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి రికరింగ్ డిపాజిట్లు సహాయం చేస్తాయి.  పోస్ట్ ఆఫీస్ RD యొక్క చక్ర వడ్డీ విధానం  మీకు కనీస డిపాజిట్ మొత్తంతో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేయడానికి ఉపయోగపడతాయి.

 

• ముగింపు  ( Conclusion )

పోస్ట్ ఆఫీస్ RD స్కీం కి సంబందించిన పూర్తి సమాచారాన్ని మీకు అందించానని భావిస్తున్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ మరచినట్లైతే  మన్నించి క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *