IPPB Group Accident Gaurd Policy (GAG) in Telugu
పరిచయం (Introduction):-
Post Office Group Accident Guard Policy
యాక్సిడెంట్ సంభవించినప్పుడు హాస్పిటలైజేషన్‌కు అనుకూలంగా ఎక్కువ మంది వ్యక్తులను కవర్ చేయడానికి TATA AIG లాంటి పెద్ద సంస్థ తో కలిపి ఇండియా పోస్ట్ తాజాగా గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రారంభించింది. ఇది IPPB కి సంబంధించిన అన్ని మైక్రో ATMలలో జూన్ 16న, 2022 నుండి ప్రారంభించబడింది.
ఈ యాక్సిడెంట్ గార్డ్ ఇన్సూరెన్స్ పాలసీని, IPPB తమ కస్టమర్లందరికీ అందించే గొప్ప బీమా ప్లాన్ గా పేరు తెచ్చుకుంది. ఈ (Post Office Group Accident Policy) ప్లాన్ అన్ని రకాల టాక్స్ లు కలిపి, కేవలం రూ.399కే, చాలా తక్కువ ప్రీమియంతో 10 లక్షల కవరేజీని అందిస్తుంది.
పోస్ట్ ఆఫీస్ గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లేదా గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ అంటే ఏమిటి?
గ్రూప్ ప్రమాద భీమా అనేది పెద్ద సమూహంలోని వ్యక్తుల కోసం ప్రమాద సంబంధిత ఆసుపత్రి ఖర్చులను చెల్లిస్తుంది. ఊహించని ప్రమాదానికి సంబంధించిన సంఘటనల కోసం ముందుగానే సిద్ధం చేసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది. ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఉన్నత స్థాయి ఆసుపత్రులలో ప్రమాదానికి సంబంధించిన చికిత్సను పొందేందుకు ఇది మీకు ప్రయోజనాన్ని అందిస్తుంది.
మీకు ఈ పోస్ట్ ఆఫీస్ గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లేదా గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ ఎందుకు అవసరం?
ప్రమాదాలు అనేవి ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఎవరికైనా జరగవచ్చు. తీవ్రమైన ప్రమాదం జరిగిన సందర్భాల్లో, ఒక వ్యక్తి ప్రమాదం కారణంగా మరణించినప్పుడు, అతని కుటుంబం గ్రూప్ ప్రమాద బీమా పాలసీ ద్వారా పరిహారం మొత్తాన్ని అందుకుంటుంది. ఒకవేళ శాశ్వత వైకల్యం లేదా పక్షవాతం సంభవించినట్లయితే, ఆ వ్యక్తి కి చెందిన అర్హతగల పిల్లలలో ఒకరి (విద్య) ఎడ్యుకేషన్ ఖర్చులను నిర్వహించడానికి పరిహారం కూడా అందుకుంటారు. ప్రమాద సంబంధిత అత్యవసర పరిస్థితులను ముందుగానే చూసుకోవడానికి ఇది గొప్ప బీమా పథకం అని చెప్పవచ్చు.
IPPB TATA AIG గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీ యొక్క ముఖ్య లక్షణాలు:
- ప్రమాదం లో మరణిస్తే కవరేజీ ₹10,00,000.
- శాశ్వతంగా మొత్తం వైకల్యం కవరేజ్ ₹10,00,000.
- శాశ్వతమైన పాక్షిక వైకల్యం కవరేజ్ ₹10,00,000 .
- ప్రమాదవశాత్తు విచ్ఛేదనం(కాలు లేదా చెయ్యి)/ వైకల్యం మరియు పక్షవాతం కవరేజ్ ₹10,00,000.
- ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులు IPD ₹60,000 వరకు .
- ప్రమాద మరణ కవరేజీ ₹10,00,000.
- ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులు OPD(ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్) ₹30,000 వరకు అందిస్తారు.
విద్య ప్రయోజనం:
భీమా మొత్తం లో 10% లేదా ₹1,00,000 లేదా గరిష్టంగా అర్హత ఉన్న ఇద్దరు పిల్లలకు విద్య ప్రయోజనం.
ఆసుపత్రిలో రోజువారీ నగదు:
10 రోజుల వరకు రోజుకు ₹1,000 చొప్పున ₹10,000 వరకు.
కుటుంబ రవాణా:
కుటుంబ సభ్యుల రవాణా ప్రయోజనాలు కోసం ₹25,000.
- చివరి ఆచారాలు (అంత్యక్రియలు) నిర్వహణ ప్రయోజనం గా 5,000 లు అందిస్తారు.
- యాక్సిడెంటల్ మెడికల్ ఖర్చులు IP- ఇన్ పేషెంట్లకు ₹ 60,000 వరకు .
- ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులు (OP- ఔట్ పేషెంట్లకు) ₹30,000 వరకు స్థిరీకరించబడును లేదా వాస్తవ క్లెయిమ్ ప్రకారం ఏది తక్కువైతే అది వర్తిస్తుంది.
గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లేదా గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్‌లో ఏమేమి కవర్ చేయబడినవి?
1. యాక్సిడెంటల్ డెత్: ప్రమాదం జరిగిన ఒక సంవత్సరం లోపు, పాలసీ దారుడు యాక్సిడెంట్ కారణంగా చనిపోతే, వారు కవరేజ్ పొందుతారు. కవరేజ్ పరిమితి భీమా మొత్తంలో 100% వరకు ఉంటుంది.
2. ప్రమాదవశాత్తు పక్షవాతం: పాలసీదారుని శరీర భాగం లేదా శరీర భాగాలు పక్షవాతానికి గురైతే లేదా ప్రమాదం జరిగిన ఒక సంవత్సరంలోపు ప్రమాదం కారణంగా అతడు శరీర భాగాన్ని కోల్పోయినట్లయితే, దాని కోసం కవరేజ్ చేయబడతారు.
3. పిల్లల చదువు: ప్రమాదం కారణంగా పాలసీ దారుడు మరణించిన సందర్భంలో లేదా ప్రమాదం కారణంగా మరియు అంగవైకల్యం కారణంగా మీరు సంపాదించే సామర్థ్యాన్ని కోల్పోయినట్లయితే, మీ పిల్లలు చదువుతున్నవారైతే, మీకు అర్హతగల పిల్లలలో ఇద్దరికి భీమా మొత్తాన్ని అందిస్తారు.
4. శాశ్వత వైకల్యం: ప్రమాదం జరిగిన తేదీ నుండి ఒక సంవత్సరంలోపు మీరు ప్రమాదం కారణంగా శాశ్వతంగా అంగవైకల్యం పొందినట్లయితే, మీరు దాని కోసం కవరేజ్ చేయబడతారు. కవరేజ్ పరిమితి భీమా మొత్తంలో 100% వరకు ఉంటుంది.
5. యాక్సిడెంటల్ హాస్పిటల్ ఖర్చులు: మీరు ఒక రోజు కంటే ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉన్నట్లయితే, ఏదైనా ప్రమాద సంబంధిత ఆసుపత్రి ఖర్చులకు మీరు కవరేజ్ చేయబడతారు.
6. రోజువారీ హోస్పీ-క్యాష్: మీరు ఒక రోజు కంటే ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉన్నట్లయితే మీరు రోజువారీ ఖర్చులు కోసం స్థిరమైన నగదు మొత్తాన్ని పొందుతారు. ఈ మొత్తానికి మరియు మీకు అదే విధంగా చెల్లించబడే రోజుల సంఖ్యకు పరిమితి ఉంది.
7. రవాణా ప్రయోజనాలు: ఆసుపత్రిలో చేరిన భీమా పొందిన వ్యక్తిని కలవడానికి మీ కుటుంబంలోని సభ్యుడు 150 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే, భీమా కంపెనీ ఆ ఖర్చులను భరిస్తుంది.
8. పాక్షిక వైకల్యం: ప్రమాదం జరిగిన తేదీ నుండి ఒక సంవత్సరంలోపు మీరు యాక్సిడెంట్ కారణంగా పాక్షికంగా అంగవైకల్యం పొందినట్లయితే, మీరు దాని కోసం కవరేజ్ చేయబడతారు. పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొన్న శాతం ప్రకారం కవరేజ్ పరిమితి నిర్ణయించబడుతుంది.
9. OPD(ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ కవరేజ్): రోగి తన వైద్య నిపుణుల సలహా ఆధారంగా తదుపరి చికిత్స కోసం డయాగ్నస్టిక్ సెంటర్ లేదా మరేదైనా ఇతర ప్రదేశానికి వెళ్లవలసి వస్తే, అటువంటి రవాణా ఖర్చులు కూడా కవరేజ్ చేయబడతాయి.
10. అంత్యక్రియల ఖర్చులు: యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఫీచర్ కింద పాలసీదారుని యొక్క క్లెయిమ్‌ను బీమా కంపెనీ ఆమోదించినట్లయితే, మరణించిన వ్యక్తి యొక్క అంత్యక్రియల ఖర్చుల కోసం భీమా సంస్థ అదనపు నిర్ణీత మొత్తాన్ని అందజేస్తుంది.
Also Read
(Post Office Group Accident Guard Policy) క్లెయిమ్ చేయడం ఎలా?
గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీ క్లెమ్ ప్రక్రియ:-
బీమా తీసుకున్న వ్యక్తి/వ్యక్తులు 5616181 నెంబర్ కి SMS రూపంలో క్లెయిమ్‌లను పంపవచ్చు.
కంపెనీ యొక్క 24×7 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1800-266-7780 లేదా 1800 229966 నెంబర్ కి సీనియర్ సిటిజన్ పాలసీ హోల్డర్‌లు మాత్రమే కాల్ చేయడం ద్వారా క్లెయిమ్‌ను తెలియజేయవచ్చు.
అయితే క్లెయిమ్ యొక్క సమాచారం కోసం క్లెయిమ్ ఇంటిమేషన్ ఫారమ్‌ను ఉపయోగించాలి.
క్లెయిమ్ ప్రక్రియ సమయంలో అవసరమైన వివరాలు –
• పాలసీ షెడ్యూల్ లేదా ఇన్సూరెన్స్ సర్టిఫికేట్,గాయపడిన వ్యక్తి వివరాలు,
• ప్రమాదం జరిగిన తేదీ , సమయం మరియు ప్రమాదం జరిగిన ప్రదేశం, గాయం లేదా ప్రమాదం యొక్క స్వభావం, క్లెయిమ్‌కు ప్రాముఖ్యత తనిచ్చే పాలసీ కవరేజీ,
•వ్యక్తి చికిత్స తీసుకున్న హాస్పిటల్ మరియు డాక్టర్ పేరు,
• పోలీసు స్టేషన్ పేరు / లొకేషన్, పోలీసులతో కేసు నివేదించబడినట్లయితే దానికి చెందిన ఫారాలు,
• బీమా చేయబడిన వ్యక్తి లేదా సంప్రదింపులు జరిపే వ్యక్తి యొక్క ఇ-మెయిల్ ID , మొబైల్/ టెలిఫోన్ నెం.
గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లేదా గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్‌లో ఈ క్రిందివి కవర్ చేయబడవు?
*ప్రమాదకరమైన క్రీడలు/sports
*HIV/AIDS
*ముందుగానే ఉన్న వ్యాధులు
*సీజనల్ వ్యాధులు
*బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు
*చట్టవిరుద్ధమైన చర్యలు
*యుద్ధాలు
*సైనిక సేవలు
*సైనిక కార్యకలాపాలు
*ఆత్మహత్య
గమనిక:-
గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది పెద్ద సంఖ్యలో వ్యక్తులకు ప్రమాద కవరేజీని అందించే బీమా పథకం. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఊహించని సంఘటనల విషయంలో కవరేజీని అందిస్తుంది. గ్రూప్ పర్సనల్ ప్రమాద బీమాతో పాటు అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఊహించని ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ఇలాంటి ప్రమాద బీమాను కొనుగోలు చేయడం ఉత్తమ ఎంపిక. పాలసీ కోసం మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించండి.
తరచూ అడిగే ప్రశ్నలు:
ప్ర. గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ కింద ఎవరు కవర్ చేయబడతారు?
జ. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్‌లోని వ్యక్తిగత కస్టమర్‌లందరూ కవర్ చేయబడతారు.
ప్ర. పోస్ట్ ఆఫీస్ గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీ కాలవ్యవధి ఎంత?
జ. పాలసీ వ్యవధి కనీసం ఒక సంవత్సరం ఉంటుంది. మరియు ప్రతి మరుసటి సంవత్సరం రెన్యువల్ కు గడువు ఉంటుంది.
ప్ర. పోస్ట్ ఆఫీస్ గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీ కోసం కనీస మరియు గరిష్ట ప్రవేశ వయస్సు ఎంత?
జ. 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు TATA AIG / IPPB నుండి పాలసీ తీసుకోవచ్చు.
Post Views: 716