SBI Life Saral Swadhan Plus Plan -సామాన్యులకు అద్భుతమైన పధకాన్ని ప్రవేశపెట్టిన స్టేట్ బ్యాంకు, Benefits & key Features

 SBI Life Saral Swadhan Plus Plan  Details in Telugu         

 

SBI Life Saral Swadhan Plus Plan

 

ఎస్. బి. ఐ సంస్థ ఒక వినూత్నమైన ఒక కొత్త ఆలోచనతో పేదవారికి మరియు సామాన్యులకి ఆర్థికంగా,ఇన్సూరెన్స్ పరంగా భద్రతను అందివ్వడం కొరకు ఈ ప్లాన్ ను SBI LIFE ప్రారంభం చేసింది. ఈ ప్లాన్ తీసుకున్న వ్యక్తి పూర్తి 100% లాభం పొందుతారు.
టర్మ్ ప్లాన్ మరియు ఎండోమెంట్ ప్లాన్ రెండింటినీ కలిపి ఈ ఎస్.బి. ఐ సరల్ శ్వధాన్ ప్లస్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

ఇది వ్యక్తిగతమైన సేవింగ్స్ మరియు నాన్ లింక్డ్ ప్లాన్, ఈ ఎస్. బి. ఐ ప్లాన్ లో టర్మ్ ఇన్సూరెన్స్ మరియు గ్యారెంటెడ్ మెచ్యూరిటీ లభిస్తుంది, సంవత్సరానికి కేవలం Rs 1500 రూపాయలకే ఈ ప్లాన్ మనం తీసుకోవచ్చు. ప్రీమియం మాఫీ, డెత్ మరియు మెచ్యూరిటీ బెనిఫిట్ ఈ ప్లాన్ లో కలవు.

 

 

SBI Life Saral Swadhan Plus Plan -సామాన్యులకు అద్భుతమైన పధకాన్ని ప్రవేశపెట్టిన స్టేట్ బ్యాంకు, Benefits & key Features

 

 

SBI Life Saral Swadhan Plus Plan Benefits

1) ఈ ప్లాన్ వ్యక్తిగతమైన, పొదుపు(savings) ప్లాన్.

2) ఇది ఒక నాన్ లింక్డ్ ప్లాన్ కనుక స్టాక్ మార్కెట్ లో లేదా ఏదైనా కంపెనీ లో గాని ఇన్వెస్ట్మెంట్ చేయరు.

3) ప్లాన్ తీసుకున్న వ్యక్తి 100% కచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ను లేదా ప్లాన్ చివరి లో గ్యారెన్టెడ్ మెచ్యూరిటీ నీ పొందుతాడు.

4) పాలసీ ధారుడికి వీలైన విధంగా ప్రీమియం ను చెల్లించుకునే సదుపాయం కల్పించారు.

5) లిమిటెడ్ ప్రీమియం – మనం కొంతకాలం పాటు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము.

6) మెచ్యూరిటీ పై టాక్స్ ఫ్రీ బెనిఫిట్(Tax free benefit)

 

 ఈ ఎస్.బి. ఐ లైఫ్ సరల్ స్వాధాన్ ప్లస్ ప్లాన్ ను 2 విధాలుగా తీసుకోవచ్చు.

 

1) రెగ్యులర్ ప్రీమియం (Regular premium):

ఎన్ని సంవత్సరాల భీమా తీసుకోవటం జరుగుతుందో అన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ దారుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే చెల్లిస్తాడు.

 

2) లిమిటెడ్ ప్రీమియం (Limited premium):

దీన్ని కూడా పాలసీ దారుడు ప్రతీ సంవత్సరం చెల్లిస్తారు. కానీ ఈ లిమిటెడ్ ప్రీమియం (Limited Premium) లో  చివరి 5 సంవత్సరాలు ప్రీమియం మాఫీ( premium fee) చేయబడుతుంది.
లిమిటెడ్ ప్రీమియం ద్వారా మాఫీ చేయబడిన  5 సంవత్సరాలు కూడా ఇన్సూరెన్స్ కవర్ లభిస్తుంది.

ఈ ఎస్.బి. ఐ లైఫ్ సరల్ శ్వదాన్ ప్లస్ ప్లాన్  చివరిలో  భీమా అమౌంట్ నీ 2 విధాలుగా పొందవచ్చును.

 

1)డెత్ బెనిఫిట్ (Death benefit):

ఈ ప్లాన్ తీసుకున్న వ్యక్తి ప్లాన్ లో ప్రీమియం చెల్లించే సమయంలో మరణిస్తే (risk) పాలసీ దారుడు ఎంచుకున్న ప్రాథమిక భీమా మొత్తం ఇవ్వబడుతుంది. లేదా అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంనకు 9 రెట్లు అమౌంట్ ను కలిపి పాలసీ దారుడికి అందివ్వడం జరుగుతుంది.

 

2)మెచ్యూరిటీ  అమౌంట్  (Maturity amount):

ఈ విధమైన అమౌంట్ నీ పొందాలంటే పాలసీ దారుడు ప్లాన్ చివరి వరకు జీవించిఉండాలి అప్పుడు చెల్లించిన ప్రీమియంనకు  115% అమౌంట్ నీ కలిపి  ఇస్తారు.
ఇంతటితో ప్లాన్ ముగించబడుతుంది.

 

SBI Life Smart Shield Telugu &# &;అతి తక్కువ ప్రీమియంతో కుటుంబానికి సంరక్షణ &; Review ,Details &; Benefits

SBI life Smart future Choices In Telugu ;అవసరం వచ్చినప్పుడల్లా అడిగి తీసుకోండి

 

అర్హతలు (Eligibility):

 

వయసు పరిమితులు:

కనీస వయసు – 18 సంవత్సరాలు
గరిష్ట వయసు – 55 సంవత్సరాలు

మేచ్యురిటీ వయసు – 70 సంవత్సరాలు

భీమా పరిమితులు:

కనీస ప్రాథమిక భీమా (Bhima) – Rs 30000
అత్యధిక ప్రాథమిక బీమా (Bhima)- Rs 475000

సంవత్సరానికి అత్యల్ప ప్రీమియం  (Minimum Premium)- Rs 1500
సంవత్సరానికి అత్యధిక ప్రీమియం ( Maximum Premium)- Rs 5000

 

 

Minimum

Maximum

Entry Age

18 Years

55 Years

Policy Term

10 Years

15 Years

Maturity Age

---

70 Years

Premium Paying Term in Years

10 Years

10 Years

Premium Paying Frequency

Annual

Annual

Yearly Premium

 Rs1500

Rs 5000

Sum Assured

Rs 30,000

Rs 475,000

 

 

  SBI Life Saral Swadhan Plus     ఉదాహరణ ద్వారా తెలుసుకుందాము.

రాము వయసు – 30 సంవత్సరాలు
ప్రాథమిక భీమా –475000 రూపాయలు
పాలసీ టర్మ్      – 15 సంవత్సరాలు
ప్రీమియం టర్మ్ – 10 సంవత్సరాలు
వార్షిక ప్రీమియం – 5000 రూపాయలు.

 

రాము వయసు 30 సంవత్సరాలు,తీసుకున్న భీమా 457000 రూపాయలు, పాలసీ సమయం 15 సంవత్సరాలుగా నిర్ణయించుకున్నాడు మరియు ప్రీమియం చెల్లించే సమయం 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు  ప్రీమియం మాఫీ చేయబడింది. సంవత్సరానికి 5000 రూపాయలు ప్రీమియం చెల్లించే విధంగా తీసుకున్నాడు.

ఎస్.బి. ఐ. లైఫ్ సరల్ శ్వధాన ప్లస్ ప్లాన్ లో రాము చెల్లించిన మొత్తం ప్రీమియం (Total Paid Premium) 5000×10=50000 రూపాయలు అయితే …

1) ప్రమాదానికి గురైతే టర్మ్ పాలసీ వర్తించడం వల్ల ఇతనికి ప్రాథమిక భీమా అమౌంట్ Rs 475000 రూపాయలు లేదా అప్పటి వరకు కట్టిన ప్రీమియం నకు 9 రెట్లు అమౌంట్ వేసి ఇస్తారు.

2) ఒకవేళ రాము ప్లాన్ చివరి వరకు ప్రీమియంను చెల్లిస్తే మెచ్యూరిటీ రూపం లో చెల్లించిన ప్రీమియంనకు 115% కలిపి అమౌంట్ ను ఇవ్వడం జరుగుతుంది.

రాముకు ప్లాన్ చివరి లో 57500 రూపాయలు వస్తాయి.

 

https://www.sbilife.co.in/

 

మరికొన్ని బెనిఫిట్స్ (Other Benefits):

 

సరెండర్ (surrender):

మీరు ఈ ప్లాన్ లో 2 లేదా 3 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తరువాత ఈ ప్లాన్ ను సరెండర్ చేసి అప్పటి వరకు కట్టిన ప్రీమియం ను పొందవచ్చు కానీ టాక్స్ ( Tax) రూపంలో ఎక్కువ అమౌంట్  కోల్పోతాము.

 

గ్రేస్ పీరియడ్ ( Grace period):

ఈ ప్లాన్ లో ప్రీమియం సంవత్సరానికి చెల్లిస్తారు కాబట్టి  ప్రీమియం సమయం పూర్తైన తరువాత 30 రోజుల వరకు ఎటువంటి  పెనాల్టీ లేకుండా ప్రీమియం చెల్లించవచ్చు.

 

టాక్స్ ప్రయోజనాలు ( Tax Benefits ):

పాలసీలో  వ్యక్తి చెల్లించే ప్రీమియం పై మరియు పాలసీ దారుడు పొందే మెచ్యూరిటీ లపై ప్రీమియం అండర్ సెక్షన్ 80c మరియు అండర్ సెక్షన్ 10d వర్తిస్తాయి. కాబట్టి ఈ ప్లాన్ లో పూర్తి టాక్స్ మినహాయింపు వర్తిస్తుంది.

 

ఫ్రీ లుక్ పీరియడ్ (Free look period):

మీరు తీసుకున్న ప్లాన్ లో మీరు అసంతృప్తి చెందిన లేదా ఇతర కారణాల చేత ప్లాన్ ను రద్దు చేసుకోవచ్చు.ఈ రద్దు చేసుకునే ప్రక్రియ ప్లాన్ తీసుకున్న 15 రోజులలోపు అయితే కట్టిన ప్రీమియం యధావిధిగా ఇచ్చేస్తారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *