SBI Life Smart Humsafar Plan – ” భార్య భర్త లీద్దరికీ ఒక్కటే పాలసీ ” Review Benefits & Key Features

   SBI Life Smart Humsafar Plan Details In Telugu

 

SBI Life Smart Humsafar

ఎస్. బి. ఐ లైఫ్ సంస్థ విడుదల చేసే ప్లాన్ లలో ఈ ఎస్. బి. ఐ లైఫ్ స్మార్ట్    హమ్ సాఫర్ (Sbi life humsafar) ప్లాన్  చాలా ఉత్తమమైనది  ఒకే పాలసీ ద్వారా భార్య భర్త లీద్దరికీ తక్కువ ప్రీమియం తోనే ఇన్సూరెన్స్ కవరేజ్ ను అందిస్తుంది ఎందుకంటే భార్య, భర్త లు ఇద్దరిలోనూ ఎవరో ఒకరు ఈ ప్లాన్ ను తీసుకుంటే బోనస్ తోకూడిన మెట్యూరిటీ  మరియు ఎవరైతే ఈ ప్లాన్ తీసుకుంటారో వారు మరణిస్తే  భార్య లేదా భర్త కు  వారి పిల్లలకు కూడా ఆర్థికంగా ప్రొటెక్షన్ ను కల్గిస్తుంది ,ఈ పాలసీ కి సంబందించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం .

 

 

 

 

SBI Life Smart   Humsafar Features – ముఖ్యంశాలు

 

1. ప్లాన్ తీసుకున్న మొదటి 3 సంవత్సరాలలో ఈ ప్లాన్ అమౌంట్ పై 2.5 % గ్యారెంటెడ్ బోనస్ మరియు మెట్యురిటీ(బేసిక్ సమ్ అస్సురెడ్+ వెస్తెడ్ రివైవల్ బోనస్+టెర్మినల్ రివైవల్ బోనస్) సాధారణం గా  లభిస్తుంది.

2. ఇది ఒక నాన్ లింక్డ్ ప్లాన్ కాబట్టి  ప్లాన్ లో ప్రీమియం రూపం లో చెల్లించే డబ్బును స్టాక్ మార్కెట్, ముట్యూవల్ ఫండ్స్ మరియు ఏ ఇతర ఇన్వెస్ట్మెంట్ సంస్థలలో  పెట్టుబడి పెట్టడం జరగదు అందువల్ల ఖచ్చితమైన లాభాలు రావడం జరుగుతుంది.

3. జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ (Joint Life insurance) : ఈ పాలసీని భార్య భర్తలిద్దరిలో  ఏ ఒక్కరు తీసుకోవడం జరిగినా మిగతావారికి మరియ వాళ్ళ పిల్లలకు కూడా మెట్యురిటీ లభించే అవకాశం వుంటుంది.

4. Death Benefit – మరణ ప్రయోజనం

పాలసీదారుడు పాలసీ సమయం మధ్యలో ఏ కారణం చేతనైనా మరణిస్తే ప్లాన్ ప్రాధమిక భీమా అమౌంట్ ను వెంటనే నామినీ కి ఇవ్వడం జరుగుతుంది తర్వాత నుండి భవిష్యత్ పాలసీ ప్రీమియం ను కట్టవలసిన అవసరం లేదు స్వయంగా ఎస్.బి. ఐ సంస్థే ప్రీమియం పే చేస్తుంది. పాలసీ సమయం పూర్తి అయిన తరువాత మెట్యురిటి యధావిధిగా  నామినికి లభిస్తుంది.

ఒకవేళ మరికొంత కాలం అనగా  నామినీ కూడా ప్లాన్ యొక్క పాలసీ సమయం లో మరనించినట్లైతే వారి పిల్లలకు ఈ మెట్యురిటి అమౌంట్ (బేసిక్ సమ్ అసురిడ్+వెస్టెడ్ రివైవల్ బోనస్+టెర్మినల్ రివైవనల్ బోనస్) లభిస్తుంది.

 

 

ఈ ఎస్. బి. ఐ లైఫ్ హమ్ సాఫర్ ప్లాన్ ఉదాహరణ – Example

 

రామ్ వయసు( Age )  = 30 సంవత్సరాలు
భార్య వయసు ( Age ) = 25 సంవత్సరాలు
ప్రాధమిక భీమా ( Sum Assured ) =  Rs 200000 రూపాయలు
పాలసీ సమయం ( Policy Period ) = 30 సంవత్సరాలు
మంత్లీ ప్రీమియం   ( Premium )= Rs 691 రూపాయలు(with GST)

 

A)పాలసీ సమయంలో  వ్యక్తి కి ఏమిజరగకపోతే మెట్యూరిటీ ఈ క్రింద విధంగా లభిస్తుంది.

మెట్యూరిటీ ( Maturity Benefit )

ప్రాధమిక భీమా  ( Basic Sum Assured )  = Rs 200000
VSR బోనస్   ( Bonus )    = ఆధారిత
టెర్మినాల్ బోనస్  ( Terminal Bonus )     = ఆధారిత

 

B) ఒకవేళ  ఈ ఎస్. బి. ఐ లైఫ్ హమ్ సాఫర్ ప్లాన్ సమయం లో పాలసీదారుడు మరణిస్తే భార్యకి వెంటనే పాలసీ అమౌంట్ ఇస్తారు. ఇక  భవిష్యత్ ప్రీమియం కట్టవలసిన అవసరం వుండదు.

వ్యక్తి కి రిస్క్ జరిగిన వెంటనే వెంటనే  = 200000+ నో ప్రీమియం ( Premium Waived )

ప్రాధమిక భీమా ( Basic Sum Assured ) = Rs 200000
VSR బోనస్   ( Bonus )     = ఆధారిత
టెర్మినాల్ బోనస్ ( Terminal Bonus )   = ఆధారిత

 

C) ఒకవేళ  రెండవ వ్యక్తి భార్య కూడా పాలసీ సమయంలో మరణించినట్లు అయితే ఈ సందర్భం లో పిల్లలు నామినీ గా వుంటారు.

ప్రాధమిక భీమా( Basic Sum Assured )    = Rs 200000
VSR బోనస్  ( Bonus )      = ఆధారిత
టెర్మినాల్ బోనస్ ( Terminal Bonus )   = ఆధారిత తర్వాత ఈ ప్లాన్ ముగుస్తుంది.

 

ఈ ప్లాన్ లో అదనంగా యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్  ను కూడా అందివ్వడం జరిగింది. ఈ రైడర్ ద్వారా కనీసం Rs  25000 రూపాయల భీమా నుండి  Rs 5000000 రూపాయల వరకు భీమా పొందవచ్చు రైడర్ ప్రయోజనం కొరకు ప్లాన్ ప్రీమియం తో అదనంగా కొంత అమౌంట్ కట్టవల్సి వుంటుంది.

 

ఇవి కూడా చదవండి – Also Read 

 

  1. SBI Life Smart Shield Telugu &#అతి తక్కువ ప్రీమియంతో కుటుంబానికి సంరక్షణ &; Review ,Details & Benefits

2. SBI Life Shubh Nivesh Plan Telugu &బెస్ట్ ఎండోమెంట్ పాలసీ & అర్హతలు ,ప్రీమియం , బెనిఫిట్స్ ఇవే !

3. SBI Life Saral Retirement Saver Telugu & ప్రతి నెల Rs 8,600/- పెన్షన్ జీవితాంతం, Benefits and Eligibility

 

SBI Life Smart Humsafar Other Benefits –  ముఖ్య ప్రయోజనాలు 

 

లోన్ ఫెసిలిటీ(Loan Facility):-

SBI Life  Smart Humsafar Plan లో లోన్ తీసుకునే సదుపాయం కల్పించబడింది. మనం కొంత కాలం ప్రీమియం చెల్లించిన తర్వాత మీయొక్క సరెండర్ వేల్యూ పై 90% వరకు లోన్ పొందవచ్చు.

 

గ్రేస్ పీరియడ్(grace period): –

ప్రీమియం చెల్లించే సమయం దాటిపోయిన తర్వాత కూడా పెనాల్టీ పడకుండా కొంత సమయం గ్రేస్ పీరియడ్ గా ఇవ్వబడుతుంది.సంవత్సరానికి,అర్థసంవత్సరాని,మరియు క్వార్టర్లీ ప్రీమియం నీ చెల్లించేవరికి 30 రోజులు,
ప్రతి నెల ప్రీమియం చెల్లించేవారికి 15 రోజులు గ్రేస్ పీరియడ్ వర్తిస్తుంది.

 

టాక్స్ బెనిఫిట్(Tax benefit):-

పాలసీ ద్వారా వ్యక్తి కి లభించే మెట్యూరిటీ మరియు మరణ ప్రయోజనాలపై ఎటువంటి టాక్స్ విధించడం జరగదు, అదేవిధంగా చెల్లించే ప్రీమియం పై కూడా టాక్స్ డెడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు.

 

రివైవల్ పీరియడ్(Revival Period):-

ఈ ప్లాన్ తీసుకున్న తరువాత మధ్యలో వరుసగా 5 సంవత్సరాలు ప్రీమియం చేల్లించకపోతే  ప్లాన్ ముగిసిపోయే అవకాశం వుంది.కానీ మనం ప్లన్ ను కొనసాగించాలనుకుంటే 5 సంవత్సరాల ప్రీమియం ఒక్కసారే చెల్లించి ప్లాన్ ను కొనసాగించవచ్చు.

 

సరెండర్ విలువ(surrender value):-

ప్లాన్ లో 3 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తర్వాత ప్లాన్ ను సరెండర్ చేసి మనం అప్పటి వరకు కట్టిన ప్రీమియం ను పొందవచ్చును కాని పాలసీని సరెండర్ చేస్తే ఎక్కువ చార్జెస్(charges) వుంటాయి అందువల్ల ప్రీమియం లాస్ అవ్వాల్సివుంటుంది.

 

ఫ్రీ లుక్ పీరియడ్ (look period): –

ఇది ఒక గొప్ప అవకాశం పాలసీ నియమ నిబంధనలపై మీరు పూర్తి అసంతృప్తి చెందితే 15 రోజుల్లోపు పాలసీని మూసివేసి ప్రీమియం రిటర్న్ పొందవచ్చు.

 

 పాలసీ తీసుకోవడానికి  అర్హతలు – Eligibility Conditions 

 

http://

Eligibility 

Minimum 

Maximum

Entry Age 

18 Years 

46 Years 

Policy Term 

10 Years 

30 Years 

Premium 

Rs 500

No Limit 

Sum Assured 

Rs 2 Lakh 

No LImit 

 

Entry Age
కనీస వయసు : 18 సంవత్సరాలు
గరిష్ట వయసు : 46 సంవత్సరాలు
గమనిక: భార్య మరియు భర్త యొక్క వయసుల వ్యత్యాసం(age difference between 20 years) 20 సంవత్సరాలు మించకుండా వుండాలి.

 

పాలసీ కాల పరిమితులు ( Term )

కనీస పాలసీ సమయం : 10 సంవత్సరాలు
గరిష్ట పాలసీ సమయం : 30 సంవత్సరాలు

 

భీమా పరిమితులు ( Sum Assured )

కనీస భీమా : Rs100000 రూపాయలు
గరిష్ట భీమా : Rs50000000 రూపాయలు

 

మెట్యూరిటీ అవధి ( Maturity Period )

కనీస మెట్యురిటి వయసు -28 సంవత్సరాలు
గరిష్ట మెట్యురిటి వయసు -65 సంవత్సరాలు

 

ఈ ఎస్. బి. ఐ లైఫ్ స్మార్ట్  హమ్ సాఫర్ ప్లాన్ లో ప్రీమియం ను ఈ క్రింది విధంగా మన సౌకర్యానికి అనుగుణంగా చెల్లించవచ్చు.

వార్షిక          – Rs 6000 రూపాయలు
అర్ధ వార్షిక  – Rs 3000 రూపాయలు
ట్రైమాసిక  – Rs 1500 రూపాయలు
ప్రతి నెల    – Rs 500 రూపాయలు.

 

SBI Life Smart Humsafar Required Documents – డాకుమెంట్స్ 

A. నింపిన ప్రపోసల్ ఫారం

B. ఆధార్ కార్డు               –   (  Age Proof )
C. ఓటుగుర్తింపు కార్డు     –   ( Address Proof )
D. పాన్ కార్డు                   –  (   KYC  Verification )
E.  మెడికల్ రిపోర్ట్          –   ( Health Condition )

 

 

 

2 thoughts on “SBI Life Smart Humsafar Plan – ” భార్య భర్త లీద్దరికీ ఒక్కటే పాలసీ ” Review Benefits & Key Features

  1. Dear Sir/Madam,

    I took the yearly (SBI Humsafar plan) 1,60,000 Rs, I Started and paid this year April-22, Now I would like to pay yearly 1,00,000 Lak only, is this possible to change from yearly plan 1,60,000 Rs To 1,00,000 Lak Kindly advise

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *