Tata aia Life Fortune Guarantee Plus Plan details in Telugu
Tata aia Life Fortune Guarantee Plus
టాటా ఎ ఐ ఎ లైఫ్ ఫార్చ్యూన్ గ్యారెంటీ ప్లాన్ ఒక అద్భుతమైన నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్. ప్లాన్ లో మనం చెల్లించే ప్రీమియం ఎటువంటి స్టాక్ మార్కెట్ తో సంబంధం లేకుండా సురక్షితంగా ఉంటుంది. అందువల్ల ఎటువంటి సందేహం లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు.
టాటా ఎ ఐ ఎ లైఫ్ ఫార్చ్యూన్ గ్యారెంటీ ప్లాన్ లో వ్యక్తికి ఇన్సూరెన్స్ కవరేజ్ , మెట్యురిటీ బెనిఫిట్,డెత్ బెనిఫిట్ తో పాటుగా స్కీం మధ్యలో దీర్ఘకాలం పాటు 100 శాతం కచ్చితమైన రెగ్యులర్ గ్యారెంటెడ్ ఇన్కం ను అంధిస్తుంది. కాబట్టి కుటుంబం యొక్క భవిష్యత్ ఆర్ధిక సంరక్షణకు గ్యారెంటెడ్ ఇన్కమ్ ఈ పాలసీ ద్వారా వ్యక్తి కుటుంబానికి లభిస్తుంది.
ముఖ్య ప్రయోజనాలు:- Tata aia key features
1) పాలసీ ద్వారా వ్యక్తి చెల్లించే ప్రీమియం మరియు వ్యక్తికి లభించే ప్రయోజనాలపై టాక్స్ బెనిఫిట్స్ క్లైమ్ చేసుకోవచ్చు.
2) టాటా ఎ ఐ ఎ లైఫ్ ఫార్చ్యూన్ గ్యారెంటీ ప్లాన్ 2 రకాల ప్లాన్ ఆప్షన్స్ నీ అందిస్తుంది.
• రెగ్యులర్ ఇన్కమ్ ( Regular Income )
• రెగ్యులర్ ఇన్కమ్ విత్ ఇన్బిల్ట్ క్రిటికల్ ఇల్నేస్ బెనిఫిట్. ( Regular Income With Inbuilt Critical Illness Benefit )
3 ) వ్యక్తి తన అవసరానికి అనుగుణంగా కనీసం 20 సంవత్సరాల నుంచి అత్యధికంగా 45 సంవత్సరాల వరకు రెగ్యులర్ ఆదాయ సమయాన్ని ( Choose Income Period ) నిర్ణయించుకోవచ్చు. ఈ అమౌంట్ నీ పాలసీ దారుడు వార్షిక, నెలవారీ పద్ధతులలో పొందవచ్చు.
4) ప్రీమియం చెల్లింపులకు విభిన్న పద్ధతులు కలవు, సింగిల్ ప్రీమియం చెల్లించే వారికి జాయింట్ లైఫ్ కవరేజ్ ( Joint Life Coverage ) అంతర్గతంగా లభిస్తుంది.
5) ఇది ఒక అద్భతమైన పాలసీ ఎందుకంటే ప్లాన్ లో చెల్లించిన మొత్తం ప్రీమియం డబ్బులను ( Return Of Total Paid Premiums ) చివరిలో యధావిధిగా సంస్థ పాలసీ దారుడికి అందజేస్తుంది మరియు అదనపు కవరేజ్ కోసం 2 రకాల రైడర్స్ ( Riders ) ను టాటా ఎ ఐ ఎ లైఫ్ ఫార్చ్యూన్ గ్యారెంటీ ప్లాన్ ప్రొవైడ్ చేస్తుంది.
ప్లాన్ ఆప్షన్స్ – Tata aia Life Fortune Guarantee Plus Options
1. రెగ్యులర్ ఇన్కమ్ ( Regular Income )
ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి కొంతకాలం ప్రీమియం చెల్లిస్తారు అనంతరం పాలసీదారుడు నిర్ణయించుకున్న విధంగా రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది చివరిలో మెట్యురుటీ యధావిధిగా రావడం జరుగుతుంది .
2.రెగ్యులర్ ఇన్కమ్ విత్ ఇన్బిల్ట్ క్రిటికల్ ఇల్నేస్ బెనిఫిట్ ( Regular Income With Inbuilt Critical Illness Benefit )
ఆప్షన్ 1 లో లభించే ప్రయోజనాలు అన్ని ఆప్షన్ 2 కి కూడా వర్తిస్తాయి కానీ ఇన్బిల్ట్ క్రిటికల్ ఇల్నేస్ బెనిఫిట్ రైడర్ అంతర్గతంగా ఉండడటం వల్ల వ్యక్తి పెద్ద అనారోగ్యానికి గురైతే ( హార్ట్ ఎటాక్, కిడ్నీ ఫైలుర్, క్యాన్సర్ మొదలైనవి ) పాలసీలో భవిష్యత్ ప్రీమియం మాఫీ చేయడంతోపాటుగా రెగ్యులర్ ఆదాయం మరియు మెట్యురిటీ ( Premium Waive , Regular Income Provided & Maturity ) పాలసీదారునికి క్రమం తప్పకుండా లభిస్తాయి.
Tata aia పాలసీ ప్రయోజనాలు – Fortune Guarantee Benefits
1. గ్యారెంట్డ్ ఇన్కమ్ ( Guaranteed Income )
ప్రీమియం నిలిపివేసిన తర్వాత సంవత్సరం నుంచి వ్యక్తి నిర్ణయం చేసుకొన్న విధంగా రెగ్యులర్ ఆదాయం ప్రతి సంత్సరం క్రమం తప్పకుండా రావడం జరుగుతుంది తద్వారా వ్యక్తి కి ఆర్థికంగా బరోసా లభిస్తుంది, లభించే రెగ్యులర్ అమౌంట్ ను వార్షిక, నెలవారీ పద్ధతులలో వ్యక్తి అవసరానికి అనుగుణంగా తీసుకోవచ్చు.
2.మెచ్యూరిటీ బెనిఫిట్ ( Maturity Benefit )
పాలసీ సమయంలో వ్యక్తి చెల్లించిన మొత్తం ప్రీమియంను ( Total Paid Premiums ) యధావిధిగా రెగ్యులర్ ఇన్కమ్ పీరియడ్ తరువాత మెచ్యురిటీ గా అందిస్తారు.
3. డెత్ బెనిఫిట్ ( Death Benefit )
A ) ప్రీమియం చెల్లిస్తున్న సమయం లో వ్యక్తికి ప్రమాదం జరిగితే ప్రాథమిక భీమా మొత్తం నామినీ కి లభిస్తుంది.ఒకవేళ రెగ్యులర్ ఇన్కమ్ పొందుతున్న సమయం లో పాలసీ దారుడుకి ప్రమాదం జరిగితే భవిష్యత్ రెగ్యులర్ ఆధాయం క్రమం తప్పకుండా నామినీ కి వస్తుందిమరియు మెట్యురిటి కూడా లభిస్తుంది.
ఆప్షన్ 2 లో ప్రీమియం చెల్లిస్తున్న సమయం లో వ్యక్తి క్రిటికల్ ఇల్నేస్ కి గురైతే భవిష్యత్ ప్రీమియం మాఫీ, రెగ్యులర్ ఆదాయం యధావిధి దీనితో పాటుగా మెట్యురిటి కూడా (Total Premium Waive + Regular Income & Guaranteed Maturity ) రావడం జరుగుతుంది.
• రెగ్యులర్ ఇన్కమ్ విత్ ఇన్బుల్ట్ క్రిటికల్ ఇల్లనెస్ బెనిఫిట్ రైడర్ ( Regular income with inbuilt C I B Rider )
Mr. రాజు వయసు ( Age ) – 25 సంవత్సరాలు
ఆప్షన్ -1 ( Option ) – రెగ్యులర్ ఇన్కమ్
పాలసీ టర్మ్ ( Policy Term ) –12 సంవత్సరాలు,
ప్రీమియం ( Premium Paying ) –10 సంవత్సరాలు
ప్రాధమిక భీమా ( Basic Sum Assured ) – Rs 13 లక్షలు రూపాయలు,
ఇన్కమ్ పీరియడ్ ( Income Period ) – 30 సంవత్సరాలు
టోటల్ ప్రీమియం ( Total Paid Premium ) = 10 లక్షలు
మెచ్యూరిటీ బెనిఫిట్ ( Maturity Benefit )
పాలసీ దారుడు పాలసీ టర్మ్ 12 సంవత్సరాలుగా తీసుకుని పాలసీ ప్రీమియం ను చెల్లించడానికి 10 సంవత్సరాలు తీసుకున్నాడు కాబట్టి 2 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ( Waiting Period ) వుంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ సమయం లో ఈ tata AIA లైఫ్ ఫార్చ్యూన్ గ్యారెంటీ ఇన్కమ్ ప్లస్ ప్లాన్ కు మరియు పాలసీ దారునికి ఏటువంటి లావాదేవీలు జరగవు , కానీ పాలసీ టర్మ్ 12 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత 13 వ సంవత్సరం నుండి పాలసీ ధారునికి రెగ్యులర్ ఇన్కమ్ రావడం జరుగుతుంది.
రెగ్యులర్ ఇన్కమ్ గా సంవత్సరానికి Mr. రాజుకి Rs 108720 రూపాయలు రావడం జరుగుతుంది , కాబట్టి Mr. రాజుకి 30 సంవత్సరాలలో =108720×30= Rs 32,61,600 రూపాయలు లభిస్తాయి వీటితో పాటు ప్లాన్ చివర మెట్యురిటీ గా మొత్తం ప్లాన్ లో డిపాజిట్ చేసిన
10 లక్షలు రావడం జరుగుతుంది
డెత్ బెనిఫిట్ ( Death Benefit )
B ) ఒకవేళ Mr. రాజు ఆప్షన్ 2 రెగ్యులర్ ఇన్కమ్ విత్ ఇన్బిల్ట్ క్రిటికల్ ఎల్నెస్ ఆప్షన్ ను తీసుకుంటే ప్రీమియం చెల్లిస్తున్న సమయం లో ప్రమాదం జరిగితే 1300000 రూపాయలు డెత్ బెనిఫిట్ గా నామినీ కి అందిస్తారు. అలాకాకుండా రాజు రెగ్యులర్ ఇన్కమ్ పొందుతున్నప్పుడు ప్రమాదానికి గురైతే భవిష్యత్ రెగ్యులర్ ఆదాయం సంవత్సరానికి Rs 108720 రూపాయలు మరియు మెచ్యూరిటీ రావడం జరుగుతుంది.
వయసు అర్హతలు ( Fortune Plus Eligibility )
ఆప్షన్ 1
కనీస వయసు : 1 సంవత్సరం
గరిష్ట వయసు : 60 సంవత్సరాలు
ఆప్షన్ -2
కనీస వయసు :18 సంవత్సరాలు
గరిష్ట వయసు : 60 సంవత్సరాలు
పాలసీ కాల పరిమితులు ( Policy Term )
ఆప్షన్ 1
సింగిల్ ప్రీమియం(Term): 5 సంవత్సరాలు
రెగ్యులర్ ప్రీమియం : 5-12 సంవత్సరాలు
ఆప్షన్ 2
రెగ్యులర్ ప్రీమియం –5 లేదా 10 సంవత్సరాలు
మెట్యురిటి అర్హతలు ( Maturity Limits )
ఆప్షన్ :1
కనీస మెట్యురిటి వయసు –18 సంవత్సరాలు
ఆప్షన్:2
గరిష్ట మెట్యురిటి వయసు –23 సంవత్సరాలు.
వీటిని కూడా చదవండి – Also Read
SBI Life Smart Humsafar Plan & భార్య భర్త లీద్దరికీ ఒక్కటే పాలసీ & Review Benefits &; Key Features
Tata aia Maha raksha Supreme Plan Telugu వయసు తోపాటు భీమా పెరుగుతుంది &అర్హతలు, బెనిఫిట్స్, వివరాలు!
ఇతర ముఖ్య ప్రయోజనాలు – Important Benefits
• లోన్ సదుపాయం – Loan Facility
ఈ స్కీం లో పాలసీదారుడు ఎప్పుడైనా చెల్లించిన ప్రీమియంపై లోన్ అప్లై చేసుకోవచ్చు దీని కొరకు కనీసం 2 సంవత్సరాల అర్హత ప్రీమియం చెల్లించివుండాలి.
• టాక్స్ ప్రయోజనాలు? – Tax Benefits
పాలసీలో వ్యక్తి కి లభించే రెగ్యులర్ ఇన్కమ్, మెట్యూరిటీ మరియు మరణ ప్రయోజనాల పై గవర్నమెంట్ టాక్స్ రూల్ 10D ద్వారా టాక్స్ మినహాయింపులు వర్తిస్తాయి, ప్లాన్ లో చెల్లించే ప్రీమియం పై టాక్స్ 80C ద్వారా క్లెయిమ్ నిర్వహించుకోవచ్చు.
• గ్రేస్ పీరియడ్ ఉంటుందా?- Grace Period
పాలసీలో ప్రీమియం చెల్లించడానికి లభించే అదనపుసమయాన్ని గ్రేస్ పీరియడ్అంటారు. వార్షిక ,అర్ద వార్షిక మరియు 3 నెలలకు ఒకసారి ప్రీమియంపై అధనంగా 30 రోజులు సమయం ప్రతినెలా ప్రీమియం పై 15 రోజులు ఈ గ్రేస్ పీరియడ్ ఉంటుంది.
• రివైవల్ పీరియడ్ ఫెసిలిటీ – Policy Revival
పాలసీదారుడు ఏదైనా కారణంగా ఈ పాలసీలో కొంతకాలం రెగ్యులర్ గా ప్రీమియం చెల్లించలేనట్లైతే ఈ పాలసీ ముగియవేయబడుతుంది.
ఈ సమయంలో 5 సంవత్సరాల లోపు మొత్తం బాకీ ప్రీమియంని చెల్లిస్తే తిరిగి కొనసాగవచ్చు.
• ఫ్రీ లుక్ పీరియడ్ – ( Free Look Period? )
పాలసీకి సంబందించిన నియమాలు మరియు షరతులు పై పాలసీదారుడు అసంతృప్తి చెందితే పాలసీని మూసివేసి, చెల్లించిన మీ ప్రీమియంని వెనక్కి పొందవచ్చు.
1. ఆన్లైన్ పాలసీకి 30 రోజులు
2. ఏజెంట్ ద్వారా ఆఫ్ లైన్ 15 రోజులు.
ఈ సమయం తర్వాత కనుక ఈ పాలసీని మూసివేస్తే ప్రీమియం పై సర్వీస్ చార్జీలు వసూలుచేయబడతాయి.
• సరెండర్ వేల్యూ ఫెసిలిటీ – Surrender Value
పాలసీదారుడు రెగ్యులర్ గా 2 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తర్వాత ఈ పాలసీని సరెండర్ చేసి , అప్పటివరకు తను జమా చేసిన డబ్బును రిటర్న్ గా వెనక్కి పొందవచ్చు.
కావాల్సిన డాక్యుమెంట్స్- how to apply and required documents
2) ఆధార కార్డ్ (Aadhar card)
3) పాన్ కార్డ్ (Pan card)
4) అడ్రస్ ప్రూఫ్ ( Address proof) Tata aia fortune Guaranteed plus ను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ( Online & Offline ) లో సులభంగా పొందవచ్చు.