Tata aia Maha raksha Supreme Plan Details in Telugu
Tata aia Maha raksha Supreme
టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నుండి వచ్చిన మహా రక్ష సుప్రీం ప్లాన్ మీకు మరియు మీ ప్రియమైన వారికి సురక్షితంగా రక్షణ కల్పించే విధంగా రూపొందించబడింది. ముఖ్యంగా కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా మీరు లేనప్పుడు, మీ కుటుంబం లోని వారికి అవసరమైన ఆర్థిక భద్రత మరియు రక్షణను అందించడంలో మీకు సహాయం చేస్తుంది. టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క మహా రక్ష సుప్రీం ప్లాన్ నాన్-లింక్డ్ మరియు నాన్ పార్టిసిపేటింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా మీరు అదనపు రైడర్‌లు అవసరాన్ని బట్టి కొనుగోలు చేసి మీ ఆర్థిక పరమైన కవరేజీని మెరుగుపరచుకోవచ్చు. ఈ మహా రక్ష సుప్రీం ప్లాన్ మహిళా దరఖాస్తుదారుల కు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.
• టాటా AIA మహా రక్ష సుప్రీం ప్లాన్ యొక్క ముఖ్యమైన ఫీచర్స్ – Features
A. ఇది డెత్ బెనిఫిట్ మాత్రమే ఉన్న స్వచ్ఛమైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ ప్లాన్‌లో 2 వేరియంట్లు ఉన్నాయి.
1. ప్యూర్ ప్రొటెక్షన్ కవర్ – Pure Protection Cover
ఈ ఆప్షన్ ను జీవిత బీమా కవరేజ్ యొక్క సరళమైన రూపం గా చెప్పవచ్చు, ప్రారంభ భీమా మొత్తం స్కీం సమయం వర్తిస్తుంది.
2. అదనపు రక్షణ కవరేజ్ – Life Stage
b) బీమా కవరేజ్ లైఫ్ స్టేజ్ ప్లస్ ఆప్షన్ కింద, వివాహం లేదా బిడ్డ పుట్టిన సందర్భంలో భీమా మొత్తాన్ని పెంచేందుకు అవకాశం ఉంది.
C) ఈ ప్లాన్ లో ఉన్న పేఅవుట్ యాక్సిలరేటర్ బెనిఫిట్ ఆప్షన్ ద్వారా పాలసీదారునికి ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ నిర్ధారణ జరిగితే భీమా మొత్తంలో 50% చెల్లిస్తుంది.
D) ఈ ప్లాన్ లో భాగంగా అధిక భీమా మొత్తం తో పాటు, స్త్రీల కు మరియు ధూమపానం చేయనివారికి తగిన రాయితీలు అందుబాటులో ఉన్నాయి.
•మహా రక్ష సుప్రీం ప్లాన్ యొక్క ప్రయోజనాలు – Benefits
డెత్ బెనిఫిట్ ( Death Benefit ):- పాలసీ దారుడు మరణించినప్పుడు, సాధారణ భీమా తోపాటు లైఫ్ స్టేజ్ ప్లస్ ఆప్షన్ కింద ఎంపిక చేసుకున్న ఏదైనా అదనపు భీమాను కూడా నామినీకి మరణ సమయంలో అందిస్తారు. అలాగే అప్పటికే చెల్లించిన ఏవైనా ఆర్ధిక ప్రయోజనాల తర్వాత ఈ మొత్తం చెల్లించబడుతుంది.
1. భీమా రూపంలో ఇవ్వబడిన మొత్తం = ప్రాథమిక మొత్తం
2. చెల్లించిన వార్షిక ప్రీమియం కంటే 10 రెట్లు,
3. సింగిల్ ప్రీమియం అయితే 125% అఫ్ డిపాజిట్ గా డెత్ బెనిఫిట్ అందివ్వడం జరుగుతుంది.
• ఇన్‌బిల్ట్ పేఅవుట్ యాక్సిలరేటర్ బెనిఫిట్ ( Inbuilt Pay Out Accelerated Benefit ):-
కనీసం 2 సంవత్సరాలు ప్లాన్ లో ప్రీమియం చెల్లించిన తర్వాత పాలసీదారుడు టెర్మినాల్ ఇల్నెస్ కి గురి అయితే ( ఏదైనా పెద్ద అనారోగ్యం ) 6 నెలల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడని డాక్టర్ నిర్దారణ కి వస్తే, మొత్తం భీమాలో 50% అమౌంట్ ను ఇమ్మీడియేట్ గా అందివ్వడం జరుగుతుంది.
ఒకవేళ అదృష్టవశాత్తు పాలసీదారుడు జీవించి ఉంటే ప్రీమియం చెల్లించడం ద్వారా మిగిలిన 50% భీమా కొనసాగుతుంది.
లైఫ్ స్టేజ్ ప్లస్ ఎంపిక ( Life Stage Plus ):-
ఈ ఆప్షన్ లో భాగంగా మీరు ప్రాథమిక భీమా కంటే ఎక్కువ కవరేజీని పెంచుకోవచ్చు. అంటే ఈ అదనపు భీమా ను తప్పనిసరిగా వివాహం అయిన తేదీ నుండి మొదటి సంవత్సరంలోపు తీసుకోవాలి, లేదంటే మీ బిడ్డ పుట్టినప్పటి నుండి లేదా ఒకవేళ మీరు ఇతరుల పిల్లలను దత్తత తీసుకున్న సందర్భంలో కూడా ఇది వర్తిస్తుంది. అయితే ఇది కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే అనుమతించబడుతుంది.
ముఖ్యంగా ఈ విధంగా కవరేజీని పెంచుకునే ఈ సదుపాయం పాలసీ వ్యవధిలో కేవలం 3 సార్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఇతర టర్మ్ పాలసీ ల వివరాలు తెలుసుకోండి
Max life Smart Secure Plus Plan in Telugu &అద్భుతమైన పాలసీ 100% ప్రీమియం రిటర్న్ “
Tata aia Maha raksha Supreme Eligibility – అర్హతలు & నియమాలు
• ఈ పాలసీని తీసుకోవడానికి అర్హులు ఎవరు? ( Who can Take Policy? )
పాలసీని తీసుకొనే వ్యక్తి యొక్క కనీస వయస్సు( Minimum Age ) = 18 సంవత్సరాలు.
అత్యధిక వయస్సు (maximum Age )
సింగల్ ప్రీమియం, రెగ్యులర్ & లిమిటెడ్ 5 వారికి – 70 సంవత్సరాలు.
లిమిటెడ్ పే 10,12 – 65 సంవత్సరాలు.
పే టిల్ 60 ఇయర్స్ – 45 సంవత్సరాలు.
• ఈ పాలసీని ఎన్ని సంవత్సరాలకు తీసుకొనే వీలుంటుంది? ( Policy Term )
కనీస పాలసీ సమయం వచ్చి (Minimum Policy Period ) =10 సంవత్సరాలు.
అత్యధిక పాలసీ సమయం ( Maximum Policy Period ) = 50 సంవత్సరాలు.
హోల్ లైఫ్ ఆప్షన్ కి 100 సంవత్సరాలు – ప్రస్తుత వయసు = పాలసీ సమయం
• పాలసీ యొక్క కనీస మరియు అత్యధిక భీమా పరిమితి ఎంత? ( Sum Assured Limits )
ఈ పాలసీ యొక్క కనీస భీమా పరిమితి =Rs 50, 00, 000/- రూపాయలు.
అత్యధిక భీమా పరిమితి కి ఎటువంటి అవధి లేదు.
• ఈ పాలసీ లో ప్రీమియం ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి? ( Premium Paying Term )
7 రకాలుగా ఈ ప్లాన్ లో మీరు ప్రీమియం ఆప్షన్స్ ని నిర్ణయించుకోవచ్చు.
1. సింగల్ పే ( Single Pay ) – ( ఒక్కసారి మాత్రమే )
2. రెగ్యులర్ పే ( Regular Pay ) – ( మొత్తం పాలసీ సమయం )
3. లిమిటెడ్ పే 5 సంవత్సరాలు ( Limited Pay for 5 Years ) – కేవలం 5 సంవత్సరాలు మాత్రమే చెల్లించడం.
4. లిమిటెడ్ పే 10 సంవత్సరాలు ( Limited Pay for 10 Years ) – కేవలం 10 సంవత్సరాలు మాత్రమే చెల్లించడం.
5. లిమిటెడ్ పే 12 సంవత్సరాలు ( Limited Pay for 12 Years ) – కేవలం 12 సంవత్సరాలు మాత్రమే చెల్లించడం.
6. స్టిల్ పే 60 ఇయర్స్ ( still pay up to 60 Years ) – మీకు 60 సంవత్సరాలు వచ్చేవరకు…
• ప్రీమియంని ఏ విధంగా చెల్లించాలి? ( Premium Payment Mode )
4 రకాలుగా ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది.
1. సంవత్సరానికి ఒకసారి – Yearly
2. 6 నెలలకు ఒకసారి – Half Yearly
3. 3 నెలలకు ఒకసారి – Quarterly
4. ప్రతినెలా
ఇతర ముఖ్య ప్రయోజనాలు – Other Benefits
• రివైవల్ పీరియడ్ ఫెసిలిటీ ఎంత సమయం ఉంటుంది? ( Policy Revival )
పాలసీదారుడు ఈ పాలసీలో 5 సంవత్సరాలు రెగ్యులర్ గా ప్రీమియం చెల్లించలేనట్లైతే ఈ పాలసీ ముగియవేయబడుతుంది. అటువంటి సమయంలో 5 సంవత్సరాల లోపు మొత్తం బాకీ ప్రీమియంని పెనాల్టీతో కలిపి చెల్లింంచడం ద్వారా మళ్ళీ ప్లాన్ లో కొనసాగవచ్చు.
• ఫ్రీ లుక్ పీరియడ్ ? ( Free Look Period? )
పాలసీ తీసుకొన్న కొద్ది రోజులకే , పాలసీకి సంబందించిన నియమాలు మరియు షరతులు పై మీరు అసంతృప్తి చెందినట్లైతే వెంటనే పాలసీని మూసి వేయవచ్చు . పాలసీ ని ఏజెంట్ మద్యమం గా ఖరీదు చేస్తే 15 రోజులు, ఆన్లైన్ లో తీసుకొంటే 30 రోజుల సమయం ఉంటుంది.
ముఖ్య గమనిక : 15 మరియు 30 రోజుల సమయం దాటిన తర్వాత ఈ పాలసీని మూసివేస్తే ప్రీమియం పై కనీస సర్వీస్ చార్జీలు వసూలుచేయబడతాయి.
• సరెండర్ వేల్యూ ఫెసిలిటీ ( Surrender Value )
సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ కి సరెండర్ వర్తించదు.
Tata aia Maha raksha supreme Plan లో సింగల్ ప్రీమియం ఆప్షన్ పై మరియు లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ పై మినహాయింపులకు అనుగుణంగా సరెండర్ వేల్యూ లభించవచ్చు, కానీ రెగ్యులర్ ప్రీమియం చెల్లించే వారికి ఎటువంటి సరెండర్ వేల్యూ లభించడం జరగదు.
ఏ కంపెనీలో పాలసీ తీసుకొన్నా పాలసీని మధ్యలో సరెండర్ చేసినట్లయితే ఎక్కువ డబ్బులను నష్టపోవాల్సిఉంటుంది. కాబట్టి పాలసీ తీసుకొనే సమయంలో లోనే మీ వ్యక్తిగత ఆర్థిక స్తోమతకి అనుగుణంగా భీమాని నిర్ణయించుకోవడం మంచిది.
• ఈ పాలసీని ఎలా తీసుకోవాలి? ( How to take Policy )
ఈ పాలసీని మీరు Tata aia ఆఫీసియల్ వెబ్సైటు ద్వారా ఆన్లైన్లో తీసుకోవచ్చు లేకపోతే ఆఫ్ లైన్ ఏజెంట్ మాధ్యమంగా తీసుకొనే సదుపాయం ఉంది.
Tata aia Maha raksha Supreme Example –ఉదాహరణ
పాలసీ దారుని పేరు ( Name ) = Ms రాధ
కేటగిరీ ( Category ) = చెడు అలవాట్లులేవు
వయసు ( Age ) = 30 సంవత్సరాలు
భీమా ( Bhima ) = 1 కోటి రూపాయలు
ప్రీమియం పేయింగ్ టర్మ్ ( PPT ) = రెగ్యులర్
ప్రీమియం చెల్లించే విధానం ( PPM ) = వార్షికం
పాలసీ సమయం ( Policy Term ) = 15 సంవత్సరాలు మరియు లైఫ్ స్టేజ్ ఎంపిక చేసుకొంది.
ప్లాన్ లో చెల్లించే వార్షిక ప్రీమియం ( MP ) = Rs 8,100/- ( GST తో కలిపి )…
a. Ms రాధ యొక్క మొదటి సంవత్సర ప్రారంభ భీమా కోటి రూపాయలు అందువల్ల రాధ కు ఏమైనా రిస్క్ జరిగితే కోటి రూపాయల భీమా నామినికి అందివ్వడం జరుగుతుంది.
b. ప్లాన్ లో ప్రీమియం చెల్లెస్తూ కొనసాగుతుండగా Ms రాధ 3 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకొంది. అప్పటికి ఆమె వయసు 33, కుటుంబ బాధ్యతలకి అనుగుణంగా 25 లక్షల భీమా పెంచుకోవడం జరిగింది.
ప్రస్తుతం రాధ యొక్క భీమా కోటి నుంచి కోటి 25 లక్షలు గా మారింది.
c. 2 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ కు Ms. రాధ జన్మనిచ్చింది, అప్పుడు ఆమె వయసు 35. పిల్లల భద్రత ను దృష్టిలో ఉంచుకొని మరొక 25 లక్షల భీమా పెంచుకోసాగింది మొత్తం భీమా ఒక కోటి 50 లక్షలు గా అయ్యింది.
d. ప్లాన్ యొక్క 10 వ సంవత్సరం Ms. రాధ టెర్మినాల్ ఇల్నెస్ కి గురైనది, డాక్టర్ నిర్ధారణ ప్రకారం 6 నెలల కి మించి ఆమె జీవించలేదు ఈ సందర్భంలో ఇన్బుల్ట్ పేఅవుట్ యాక్సిలరేటర్ బెనిఫిట్ ద్వారా ఇమ్మీడియేట్ గా 50 లక్షలు కంపెనీ అందిస్తుంది.
e. దురదృష్టవశాత్తు Ms. రాధ మరికొంత కాలం తర్వాత మరణించింది… డెత్ బెనిఫిట్ రూపంలో రాధ ఫ్యామిలీ కి కోటి రూపాయలను కంపెనీ అందిస్తుంది, పాలసీ అక్కడితో ముగుస్తుంది.పెరిగిన భీమా ఏ దశలో రిస్క్ జరిగితే ఆ దశలో ఇమ్మీడియేట్ గా అందివ్వడం జరుగుతుంది.అదేవిధంగా భీమాను పెంచుకొనే కొద్ది ప్రీమియం స్వల్పంగా పెరుగుతుంది.
అంటే కేవలం సంవత్సరానికి Rs 8,100/- చెల్లించడం ద్వారా అన్ని దశల్లో ప్రయోజనం పొందగా మొత్తం ఒక కోటి 50 లక్షలు లభించడం జరిగింది.
టాక్స్ బెనిఫిట్స్ – Tax Benefits
పాలసీ లో చెల్లించే ప్రీమియం టాక్స్ డెడక్షన్ రూపంలో క్లెయిమ్ చేసుకోవచ్చు, లభించే డెత్ లేదా టెర్మినాల్ ఇల్నెస్ అమౌంట్ పై టాక్స్ విధించడం జరగదు.
విభిన్న ప్రయోజనాలను అందించే రైడర్స్ – Riders
1). టాటా AIA లైఫ్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ (ADB)
పాలసీ సమయంలో పాలసీదారునికి ఆక్సిడెంట్ కారణం చేత రిస్క్ జరిగి మరణిస్తే ప్రాథమిక భీమా ఎలాగో లభిస్తుంది, దీనితోపాటుగా సమాన భీమా అమౌంట్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ రూపంలో
నామినికి అందివ్వడం జరుగుతుంది.
2). టాటా AIA లైఫ్ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిస్మెంబర్‌మెంట్ రైడర్ (లాంగ్ స్కేల్) (ADDL)
వ్యక్తి ఆక్సిడెంట్ లో డసబిలిటీ కి గురైతే అంటే ప్రాథమిక అవయవాలను కోల్పోయి ఎటువంటి కష్టం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు రైడర్ అమౌంట్ వ్యక్తి కి ఒక్కసారే లేక ఇంస్టాల్మెంట్ లో అందివ్వబడును.
3). టాటా AIA లైఫ్ సర్జికల్ బెనిఫిట్ రైడర్ – surgical Benefit Rider
దీని కొరకు Tata aia ఒక లిస్ట్ తయారుచేసింది. పాలసీ సమయం మధ్యలో వ్యక్తి అనారోగ్యానికి గురై సర్జరీ తప్పనిసరి అయితే ఈ రైడర్ ద్వారా సర్జరీ నిర్వహించడం జరుగుతుంది, నియమాలు వర్తిస్తాయి.
4). టాటా AIA లైఫ్ క్రిటికల్ ఇల్‌నెస్ లంప్ సమ్ బెనిఫిట్ రైడర్
ఇది ఒక ఆరోగ్య పాలసీగా పనిచేస్తుంది. పాలసీదారుడు క్రిటికల్ ఇల్నెస్ కి ( హార్ట్ అటాక్, కాన్సర్, కిడ్నీ ఫెయిల్, ఇటువంటి..) గురైతే ఆ సందర్భంలో హాస్పిటల్ ట్రీట్మెంట్ కొరకు ఒక్కసారే రైడర్ యొక్క మొత్తం అమౌంట్ అందివ్వడం జరుగుతుంది.
Good information