Top 4 Government Schemes 2022 – 15% వరకూ వడ్డీ అందించే గవర్నమెంట్ పధకాలు ఇవే , వివరాలు చెక్ చెయ్యండి !

        Top 4 Government Schemes 2022 Details In  Telugu

Top 4 Government Schemes 2022 

గవర్నమెంట్ పథకాలలో పెట్టుబడులు అధిక రాబడులు అందించవని కొందరు విశ్వసిస్తుంటారు ఇది సరికాదు. ఇతర పెట్టుబడులతో సమాన మరియు అత్యధికంగా రాబడులు అందించే 4  గవర్నమెంట్ పథకాలు గురించి ఇప్పుడు తెలుసుకొందాం.ఈ స్కీమ్స్ లో మంచి వడ్డీ తో పాటుగా 100% గవర్నమెంట్ సెక్యూరిటీ లభిస్తుంది, మీరు నిర్ణయం చేసుకొన్న విధంగా ప్రయోజనాలు అందివ్వడం జరుగుతుంది.

 

Top 4 Government Schemes 2022 Telugu

 

1. నేషనల్ పెన్షన్ స్కీమ్ – National Pension Scheme

 

పూర్తి విశ్వాసం మరియు 100% గ్యారంటీతో NPS స్కీమ్ లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చెయ్యవచ్చు. స్కీమ్ లో మనం చేసే అతి చిన్న పొదుపు ద్వారా మంచి వడ్డీ తో మెట్యూరిటీ లభించడం తోపాటు వృద్ధాప్య జీవితం లో రెగ్యులర్ పెన్షన్ జీవితాంతం అందిస్తుంది.  2004 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను కేవలం గవర్నమెంట్ ఉద్యోగుల కొరకు మాత్రమే ప్రారంభం చేసింది. కానీ 2009 నుంచి భారత దేశ నాగరికత కలిగిన ప్రతీ ఒక్కరికి అందుబాటులో కి తెచ్చింది.

PFRDA ( పెన్షన్ ఫండ్ రెగ్యులటరీ అండ్ డెవోలోప్మెంట్ అథారిటీ ) ఈ స్కీమ్ ను పర్యవేక్షణ చేస్తుంది.  NPS స్కీమ్ రిటర్న్స్ మార్కెట్ లింక్ చేయబడతాయి. స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ ను గవర్నమెంట్  1. ఈక్వయిటీ  2. గవర్నమెంట్ బాండ్స్ 3. కార్పొరేట్ బాండ్స్ రూపంలో వేరువేరు రంగాలలో పెట్టుబడులు పెడుతుంది ఈ కారణం చేత సుమారుగా 10% నుంచి 15% వరకు రిటర్న్స్ మీకు ప్రొవైడ్ చేయబడతాయి.

అందువల్ల చిన్న పొదుపు ద్వారా ఇన్వెస్ట్మెంట్ + లైఫ్ పెన్షన్ NPS స్కీమ్ ద్వారా పొందవచ్చు. అంతే కాకుండా కనీసం నెలకు Rs 5,00/- రూపాయలు చెల్లెస్తూ ఈ స్కీం లో మీరు కొనసాగవచ్చు. అలాగే అత్యధికముగా Rs  2,60,000/- వార్షికం లో టాక్స్ డెడక్షన్ క్లెయిమ్ నిర్వహించుకోవచ్చు.

 

ఈ స్కీమ్ యొక్క పూర్తి వివరాలు ఉదాహరణ తో సహా తెలుసుకోవడం కొరకు ఈ లింక్ పై నొక్కండి!

NPS Scheme Details In Telugu సామాన్యులను కోటీశ్వరులు చేసే గవర్నమెంట్ స్కీం ”  పూర్తి వివరాలు!

https://youtu.be/NDpIlTsa518

2. పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ – Post Office MIS Scheme

 

దీన్నే మంత్లీ ఇన్కమ్ స్కీం అని పిలుస్తారు, ఎవరైతే కొద్దిగా ఎక్కువ మొత్తాన్ని సేఫ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రతీ నెలా ఆదాయం పొందాలనుకొంటుంన్నారో వారికి MIS ఒక మంచి స్కీం.

సింగల్ డిపాజిట్ ద్వారా నే ఈ స్కీం లో కొనసాగవచ్చు, అన్ని కేటగిరి వ్యక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రతీ నెలా వడ్డీ అమౌంట్ నేరుగా ఖాతాలో జమా చెయ్యడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ లో 6.60% వడ్డీ ని గవర్నమెంట్ అందిస్తుంది.

గవర్నమెంట్ వడ్డీ రేట్ ను ప్రతీ ట్రైమాసికంలో నిర్ణయం చేస్తుంది అలాగే స్కీం లో లభించే వడ్డీ పై ఎటువంటి TDS చార్జెస్ విధించడం జరగదు.

 

ఈ స్కీమ్ యొక్క పూర్తి వివరాలు ఉదాహరణ తో సహా తెలుసుకోవడం కొరకు ఈ లింక్ పై నొక్కండి!

Post Office Monthly Income Scheme In Telugu ప్రతీ నెలా రెగ్యులర్ ఆదాయం కొరకు ఒక్కసారే ఎంత డిపాజిట్ చెయ్యాలి

 

3. పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్ – Public Provident Fund

 

దీన్నే PPF స్కీం అంటారు. ఈ స్కీం లో ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఫ్రీ తోపాటుగా టాక్స్ రహితం కూడా. ఈ స్కీం యొక్క ముఖ్య ఉద్దేశ్యం గవర్నమెంట్ ఉద్యోగం లేనివారు, ప్రైవేట్ సంస్థలలో పనిచేసేవారు మరియు స్వయంగా వ్యాపారం నిర్వహించెకొనేవారు అర్హులు.

బ్యాంకు ఫిక్సడ్ డిపాజిట్ మరియు ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ కంటే అధికముగా 7.10% వడ్డీ ని అందిస్తుంది. PPF స్కీం లో అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి ఎటువంటి వయో అవధులు లేవు మరియు 1.5 లక్షల వరకూ టాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.

 

ఈ స్కీమ్ యొక్క పూర్తి వివరాలు ఉదాహరణ తో సహా తెలుసుకోవడం కొరకు ఈ లింక్ పై నొక్కండి!

PPF Scheme in Telugu – పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్& అర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!

4. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ –  National Saving Certificate

 

NSC అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్. పెద్దలతో పాటుగా పిల్లలు కూడా ఈ స్కీం కి అర్హులు. ఈ స్కీం యొక్క సమయం 5 సంవత్సరాలు. ప్రస్తుతం ఈ స్కీం లో 6.80% వడ్డీ లభించడం జరుగుతుంది.

ఉదాహరణ కి ఈ స్కీమ్ లో……

1.  Rs 1,00,000/- డిపాజిట్ చేస్తే = Rs 1,38,949/-

2. Rs 2,00,000/- డిపాజిట్ చేస్తే = Rs 2,77,898/-

3. Rs 3,00,000/- డిపాజిట్ చేస్తే = Rs 4,16,847/-

Rs 5,00,000/- డిపాజిట్ చేస్తే = Rs 6,94,746/- లభించడం జరుగుతుంది.

ఎవరైతే షార్ట్ టర్మ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కొరకు చూస్తున్నారో వారికి మంచి పథకం. ఈ స్కీం లో కూడా ఎటువంటి TDS చా ర్జలు కట్ చెయ్యడం జరగదు మరియు టాక్స్ డెడక్షన్ లభిస్తుంది.

 

ఈ స్కీమ్ యొక్క పూర్తి వివరాలు ఉదాహరణ తో సహా తెలుసుకోవడం కొరకు ఈ లింక్ పై నొక్కండ!

Post Office NSC Scheme In Telugu & తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్ అందించే పథకం

 

ముగింపు – Conclusion

మా వెబ్సైటు ను సందర్శించినందులకు ధన్యవాదములు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *