LIC SIIP 852 Plan Details In Telugu –   అద్భుతమైన రిటర్న్స్ అందించే LIC స్టాక్ మార్కెట్ ప్లాన్, పూర్తి వివరాలు!!

           LIC SIIP 852  Plan  Details  In Telugu

LIC SIIP 852 Plan

పాలసీ వ్యవధిలో  ఇన్వెస్ట్‌మెంట్  మరియు ఇన్సూరెన్స్ కవరేజ్ ను అందిస్తుంది పాలసీదారు అందుబాటులో ఉన్న 4 రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లలో, ఒకదానిలో ప్రీమియంలను ఇన్వెస్ట్ చేసేందుకు ఆప్షన్స్ ను ఎంపిక చేసుకోవచ్చు.LIC యొక్క SIIP 852 అనేది యూనిట్-లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, రెగ్యులర్ ప్రీమియం మరియు వ్యక్తిగత జీవిత బీమా కవరేజ్ వంటి ప్రత్యేకతలతో అమలులో ఉన్నది.

చెల్లించే ప్రీమియం ఆధారంగా,  పాలసీదారుడు ఎంపిక చేసుకున్న  ఫండ్ రకం యూనిట్‌ను కొనుగోలు చేస్తుంది. ఇందులో యూనిట్ ఫండ్ వివిధ ఛార్జీలకు లోబడి ఉంటుంది. ముఖ్యంగా  నికర ఆస్తి విలువ (NAV) ఆధారంగా యూనిట్ల విలువ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

దీర్ఘకాలిక సంపద ను  సృష్టించాలనే లక్ష్యంతో పెట్టుబడిదారుల కు , LIC  SIIP రిస్క్ కవర్‌తో పాటు ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టగల  వ్యక్తులకు అనుకూలమైన పాలసీ.

తమ పెట్టుబడులను ట్రాక్ చేయ గలిగే సామర్థ్యం ఉన్న పాలసీదారులు,  మార్కెట్ మీద అవగాహన ఉన్న పెట్టుబడిదారులకు,  మార్కెట్ అస్థిరత మరియు పెట్టుబడిదారుల యొక్క రిస్క్ తీసుకునే వైఖరికి అనుగుణంగా ఫండ్స్ మధ్య మారే అవకాశం ఉన్నందువల్ల ఈ పాలసీ  రాబడిని పెంచుతుంది.

సాధారణంగా  65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పెట్టుబడిదారులు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉంటారు కాబట్టి,  జీవిత బీమా రక్షణతో పాటు,  అంకితమైన ఫండ్ మేనేజర్ యొక్క నైపుణ్యంతో ఒక క్రమపద్ధతిలో స్టాక్ మార్కెట్‌లో క్రమశిక్షణతో కూడిన పెట్టుబడిని ఈ పాలసీ ఆర్థికపరమైన అలవాటును పెంపొందిస్తుంది.

 

 

LIC SIIP 852 Plan Details In Telugu -   అద్భుతమైన రిటర్న్స్ అందించే LIC స్టాక్ మార్కెట్ ప్లాన్, పూర్తి వివరాలు!!

 

 

అసలు ULIP ప్లాన్ అంటే ఏమిటీ?

ULIP ( యూ లిప్ ) = Insurance + Investment  అంటే యూనిట్ లింకేడ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ప్రీమియం లో కొంత భాగం ఇన్వెస్ట్మెంట్ రూపంలో  స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయబడుతుంది, చాలా తక్కువ మొత్తం  పాలసీదారుని ప్రొటెక్షన్ కొరకు ఇన్సూరెన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యడం జరుగుతుంది. అంటే ఓకే సింగిల్ ప్రీమియం ద్వారా రెండు ప్రయోజనాలు.

 

ముఖ్య అంశాలు – Key Features & Benefits

 

• గ్యారెంటెడ్ అడిషన్ – Guaranteed Addition

ఒక ఖచ్చితమైన సమయం నుంచి చెల్లించే వార్షిక ప్రీమియం పై,  LIC పాలసీదారునికి అదనపు ప్రయోజనం కలిపిస్తుంది అదే గ్యారెంటెడ్ బోనస్.

 

End Of Policy Year 

Guaranteed Addition 

       6th Year 

          5%

       10th Year 

         10%

       15th Year 

         15%

       20th Year 

          20%

       25th Year 

          25%

 

•పాక్షిక విరమణ – Partial Withdrawal

మొదటి 5 సంవత్సరాలు రెగ్యులర్ గా ప్రీమియం చెల్లిస్తే 6 వ సంవత్సరం నుంచి పాక్షిక విత్ డ్రాల్ చేసుకోవచ్చు.

అర్హతలు :-

1. వ్యక్తి యొక్క వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
2. విత్ డ్రాల్ అమౌంట్ ఖచ్చితమైన రౌండ్ ఫిగర్ లేదా యూనిట్స్ రూపంలో చేసుకోవాలి.
3. నియమించిన పెర్సంటేజ్ కి అదనంగా కూడా పార్టియల్ విత్ డ్రాల్ అనుమతించబడును, ఈ సందర్బంగా కనీస బాలన్స్ 3 సంవత్సరాల ప్రీమియం తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోవాలి.

 

                  Policy Period 

                % Of Unit Fund 

           6th to 10th Year 

              20%

          1th to 15th Year 

              25%

          16th to 20th Year 

             30%

          21th to 25th Year 

             35%

 

• పాలసీ అడ్మినిస్ట్రేషన్ చార్జీలు – Policy Administration Charges

LIC SIIP – 852 పాలసీ,  పాలసీదారుని వద్ద నుంచి ఎటువంటి పాలసీ అడ్మినిస్ట్రేషన్ చార్జీలు  వసూలు చెయ్యడం జరగదు ఇతర ముట్యుయల్ ఫండ్ స్కీమ్ లో ఇవి తప్పనిసరి.

 

• మెట్యూరిటీ బెనిఫిట్ –  LIC యొక్క SIIP 852   Maturity Benefit

పాలసీ సమయం పూర్తి అయిన వెంటనే, వ్యక్తి ఇన్వెస్ట్ చేసిన ఫండ్  పెర్ఫార్మన్స్ వేల్యూ ఎంతైనా అది మెట్యూరిటీ గా పాలసీదారునికి లభిస్తుంది.

 

• డెత్ బెనిఫిట్ – Death Benefit

కామెంసెమెంట్ సమయం కంటే ముందు పాలసీదారునికి రిస్క్ జరిగితే ఫండ్ వేల్యూ,  డెత్ బెనిఫిట్ గా బెనిఫారీ కి లభిస్తుంది, ఒకవేళ కామెంసెమెంట్ సమయం తర్వాత రిస్క్ జరిగితే

1. ప్రాథమిక భీమా లేదా
2. ఫండ్ వేల్యూ
3. లేదా చెల్లించిన ప్రీమియం పై 105%
ఈ 3 రెండింటిలో ఏది ఎక్కువ అయితే అది డెత్ బెనిఫిట్ గా నామినికి అందివ్వడం జరుగుతుంది.

 

 

వీటిని కూడా చదవండి

LIC Dhan Rekha Plan Telugu 863 కొత్త స్కీం ప్రతీ  1000/- కి 60 రూపాయల బోనస్ &# ధన్ రేఖ పాలసీ పూర్తి వివరాలు ఇక్కడ చెక్ చెయ్యండి.

 

LIC Jeevan Labh Policy 936  ఎల్. ఐ. సి ఈ స్కీం లో రోజుకి Rs 66/- రూ||లు పొదుపు చేస్తే, మెట్యూరిటీ సమయంలో 13 లక్షలు పొందవచ్చు, వివరాలు చెక్ చెయ్యం..

• ఫండ్ స్విచ్చింగ్ – Switching

LIC SIIP – 852   4 రకాల ఫండ్ ఆప్షన్స్ ని కలిగివుంటుంది. మార్కెట్ కి అనుగుణంగా ఒక ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ ని వేరే ఫండ్ లోనికి స్విచ్ చేసుకోవచ్చు.

 

• రివైవల్ అఫ్ పాలసీ  – Revival

అనివార్యకారణాల వల్ల పాలసీ లాప్స్ ( Lapse ) అయితే ( ఎక్కువ కాలం పాటు ప్రీమియం చెల్లింపులు నిర్వహించకపోతే ) 3 సంవత్సరాల లోపు మొత్తం ప్రీమియం చెల్లించి ప్లాన్ లో కొనసాగవచ్చు.

 

• రిఫండ్ అఫ్ మోరటాలిటీ  – Refund Of Mortality Charges

ఇది ఒక గుడ్ బెనిఫిట్. ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కొరకు ఇన్వెస్ట్ చేయబడిన మొత్తం అమౌంట్ ను , పాలసీదారుడు రిస్క్ కి గురికాకపోతే చివర్లో మెట్యూరిటీ తోపాటు కలిపి అందివ్వడం జరుగుతుంది.

 

అర్హతలు, నిబంధనలు – LIC SIIP 852 Plan Eligibility

 

Eligibility 

Minimum 

Maximum 

Age at Entry 

90 Days 

65 Years 

Policy Term 

10 Years 

25 Years 

Maturity Age 

18 Years 

85 Years 

Sum Assured Age < 55

10 Times Of Annual Premium 

Same 

Sum Assured Age  > 55

7 Times Of Annual Premium 

Same 

Premium Limit 

Rs 4,000

Rs 40,000

 

టేబుల్ వివరాలు

1.పాలసీ తీసుకొవడానికి కనీస వయస్సు 90 రోజులు అత్యధిక వయస్సు వచ్చి 65 సంవత్సరాలు

2.కనీస పాలసీ సమయం 10 సం||లు, అత్యధిక కనీస పాలసీ సమయం 25 సం||లు.

 

  భీమా పరిమితులు? –  Sum Assured

55 సం ||ల లోపు వారికి వార్షిక ప్రీమియం కి 10 రెట్లుగా, 55 సం ||ల పైబడిన వారికి వార్షిక ప్రీమియం కి 7  రెట్లుగా భీమా కవరేజ్ అందివ్వడం జరుగుతుంది.

1. ఈ పాలసీయొక్క  అత్యధిక మెట్యూరిటీ కాల పరిమితి 65  సం||లుగా ఉంటుంది.

2. ప్రీమియం చెల్లింపులు – వార్షిక , అర్ధవార్షిక , త్రైమాసిక మరియు ప్రతినెలా .

 

• ప్రీమియం ఆలోకేషన్ చార్జెస్ – Premium Allocation Charges

   Premiums

On Line Sale 

Off Line Sale 

   1 st Year 

3%

8.00%

   2nd to 5th Year 

2%

5.50%

   6 th  Year & After 

1%

3.00%

 

పాలసీని ఆఫ్ లైన్ లో ఖరీదు చేస్తే

మొదటి సం|| – 8%, 2 నుంచి 5 వ సం || – 5.5% మరియు  పాలసీ యొక్క 6 వ సంవత్సరం నుంచి 3% రూపంలో చార్జెస్ వర్తించడం జరుగుతుంది.

 

పాలసీని ఆన్ లైన్ లో ఖరీదు చేస్తే

మొదటి సం|| – 3%, 2 నుంచి 5 వ సం || – 2.0% మరియు  పాలసీ యొక్క 6 వ సంవత్సరం నుంచి 1% రూపంలో చార్జెస్ వర్తించడం జరుగుతుంది.

 

• సరెండర్ ఫెసిలిటీ – Surrender Value

పాలసీకి 5 సంవత్సరాలు లాక్ ఇన్ పీరియడ్ ( Lock – In Period ) ఉంటుంది. లాక్ ఇన్ పీరియడ్ కంటే ముందు పాలసీ సరెండర్ చేస్తే డిస్కౌంటిన్యూ ( Discontinue ) చార్జెస్ కట్ చేసి బాలన్స్ ఫండ్ వేల్యూ అందివ్వడం జరుగుతుంది.

ఒకవేళ లాక్ ఇన్ పీరియడ్ తర్వాత పాలసీ సరెండర్ చేస్తే మొత్తం ఫండ్ వేల్యూ అందివ్వడం జరుగుతుంది.

 

     LIC SIIP 852 –  Fund Options

 

1. గ్రోత్ ఫండ్         – Growth Fund
2. బాలన్స్ ఫండ్  – Balanced Fund
3. సెక్యూర్ ఫండ్  – Secure Fund
4. బాండ్ ఫండ్     – Bond Fund

 

ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు    -LIC SIIP 852 Plan   Investment 

 

Type Of Fund

Govt . Securities 

Short Term Money Market 

Stock Market

Risk Portfolio

Bond Fund 

Not Less Than 60% 

Not more Than 40% 

Nil 

Low 

Secured Fund 

Not Less Than 45% & Not more Than 85% 

Not more Than 40% 

Not Less Than 15% & Not more Than 55% 

Low - Medium 

Balanced Fund 

Not Less Than 30% & Not more Than 70% 

Not more Than 40% 

Not Less Than 30% & Not more Than 70% 

Medium Risk 

Growth Fund 

Not Less Than 20% & Not more Than 60% 

Not more Than 40%

Not Less Than 40% & Not more Than 80%

High Risk 

 

•  గ్రేస్ పీరియడ్ ? – Grace Period

గ్రేస్ పీరియడ్ అంటే పాలసీలో ప్రీమియం చెల్లించడానికి అదనపు సమయం. ఈ ప్లాన్ లో  వార్షిక , అర్ధవార్షిక,  త్రైమాసిక  30 రోజులు మరియు ప్రతినెలా   సమయం ఉంటుంది.

 

• లోన్ సౌకర్యం – Loan Facility

LIC SIIP 852 ప్లాన్ లో  ఎటువంటి లోన్ సదుపాయం లభించడం జరగదు.

 

•  మెట్యూరిటీ సెటిల్మెంట్  – Maturity Settlement

మీరు మెట్యూరిటీ మొత్తాని 5 సంవత్సరాలలో ఇంస్టాల్మెంట్ లో తీసుకొనేలా నిర్ణయం చేసుకోవచ్చు. మొత్తం మెట్యూరిటీ 5 తో భాగించి ప్రతీ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన యూనిట్స్ ను ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఈ సమయంలో ఎటువంటి రిస్క్ కవరేజ్ అందివ్వడం జరగదు.

 

•  ఫ్రీ లుక్ పీరియడ్ – Free Look Period

పాలసీ నియమాలు పట్ల పాలసీదారుడు పూర్తిగా అసంతృప్తి చెందితే, ఏజెంట్ మద్యమంగా పాలసీని ఖరీదు చేస్తే 15 రోజులు, ఆన్లైన్ లో డైరెక్ట్ గా ఖరీదు చేస్తే 30 రోజులు ఫ్రీ లుక్ పీరియడ్ లభిస్తుంది. ఈ సమయం లో మొత్తం ప్రీమియం రిటర్న్ చేయబడుతుంది.

 

• కామెంసెమెంట్ అఫ్ రిస్క్ – Commencement Of Risk

8 సంవత్సరాల లోపు పిల్లలకి పాలసీని తీసుకొంటే, 8 సంవత్సరాలు నిండిన తర్వాత నుండి లేదా పాలసీ తీసుకొని 2 సంవత్సరాలు పూర్తి అయినప్పటి నుంచి రిస్క్ కవరేజ్ వర్తిస్తుంది.

8 సంవత్సరాలు పై బడిన పిల్లలకు ఇమ్మీడియేట్ గా ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది.

 

ఉదాహరణ – LIC SIIP 852 Plan  Example

 

35 సంవత్సరాల  వయసు కలిగిన Mr. హరిప్రసాద్, 20 సంవత్సరాలకి పాలసీ సమయాన్ని నిర్ణయించుకొని వార్షిక ప్రీమియం రూపంలో సంవత్సరానికి Rs 50,000/- ప్రీమియం చెల్లెస్తున్నాడునుకొందాం!

 

హరిప్రసాద్ మొత్తం ప్రీమియం అమౌంట్ ని గ్రోత్ ఫండ్ ( Growth Fund ) లో ఇన్వెస్ట్ చేసినట్లయితే..అతనికి 55 సం ||ల వయసు లో పాలసీ మెట్యూర్ అవుతుంది.

ప్లాన్ లో చెల్లించిన మొత్తం ప్రీమియం – 10 లక్షలు

 

మెట్యూరిటీ బెనిఫిట్ – Maturity Benefit

ఫండ్ వేల్యూ ( Fund Value ) = Rs 20,57,793/-
మోరటాలిటీ  ( Mortality )     = Rs ఎంతైతే అంత కలిపి మెట్యూరిటీ గా అందివ్వడం జరుగుతుంది.

ముఖ్య గమనిక :– మెట్యూరిటీ ఫండ్ పెర్ఫార్మన్స్ పై డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి పై ఉదాహరణ సుమారు మాత్రమే.

 

డెత్ బెనిఫిట్ – Death Benefit

మొత్తం పాలసీ సమయంలో హరిప్రసాద్ కి ఎప్పుడు రిస్క్ జరిగినా అంటే ఉదాహరణ కి ప్లాన్ యొక్క 8 వ సంవత్సరం హరిప్రసాద్ రిస్క్ కి గురైతే

1. ప్రాథమిక భీమా 5 లక్షలు,
2. చెల్లించిన ప్రీమియం పై 105%,
3. ఫండ్ వేల్యూ  ఏది ఎక్కువగా ఉంటే దాన్ని డెత్ బెనిఫిట్ రూపంలో నామినీకి అందిస్తారు.

 

• పాలసీ డిస్కంటిన్యూ చార్జలు – Policy Discontinue Charges

పాలసీలో కొనసాగడం మధ్యలో నిలిపి వేసినట్లయితే  డిస్కంటిన్యూ చార్జలు   వర్తించడం జరుగుతుంది.

 

https://licindia.in/

 

• లింకేడ్ ఆక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ – Linked Accidental Benefit Rider

హరిప్రసాద్ లింకేడ్ ఆక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ ను తీసుకొని అలాగే ఆక్సిడెంట్ పరంగా రిస్క్ జరిగితే మరొక 5 లక్షలు అదనంగా నామినికి డెత్ బెనిఫిట్ గా రావడం జరుగుతుంది.

 

• ఫండ్ మానేజ్మెంట్ చార్జస్ – Fund Management Charges

ముట్యుయల్ ఫండ్స్ లో వ్యక్తి నేరుగా అమౌంట్ ఇన్వెస్ట్ చెయ్యడు వ్యక్తుల సమూహం ఇన్వెస్ట్మెంట్ ను పర్యావేక్షిస్తుంది. దీని కొరకు ఫీజు వసూలు చేస్తారు దీనినే ఎక్సపెన్సె రేషియో  ( Expense Ratio ) అంటారు.

ఒక వార్షిక సంవత్సరంలో మొత్తం ఫండ్ వేల్యూ కి 1.35%  ఫండ్ మానేజ్మెంట్ చార్జస్ విధించడం జరుగుతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *