Unified Pension scheme in telugu – “అదిరిపోయే కొత్త పెన్షన్ స్కీమ్”

Unified Pension scheme in telugu – “యూనిఫైడ్ పెన్షన్ స్కీం”

“యూనిఫైడ్ పెన్షన్ స్కీం”యూనిఫైడ్ unified pension scheme

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు ఉన్న ‘NPS’ పధకంలో రిటైర్మెంట్ తరువాత ‘ఫిక్సడ్ పెన్షన్’ రాదు,  అనే ఆందోళన కు చెక్ పెడుతూ, 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు చివరి జీతంలో 50 శాతం ఖచ్చితంగా పెన్షన్‌గా  ఇచ్చే  ‘యూనిఫైడ్ పెన్షన్ స్కీం’ (ఏకీకృత పెన్షన్ స్కీమ్) (UPS) పథకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం శనివారం నాడు ఆమోదం తెలిపింది.

ఈ పథకం ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) లేదా ‘యూనిఫైడ్ పెన్షన్ స్కీం’  (UPS) లలో దేనినైనా ఎంచుకోవచ్చు. అంతేకాకుండా, ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ NPS చందాదారులు కూడా UPS కి మారే వెసులుబాటు కూడా ఉంటుంది.

 

UPS లో ముఖ్య అంశాలు: Features of Unified Pension scheme 

 

• హామీ ఇవ్వబడిన ఖచ్చితమైన 50% పూర్తి పెన్షన్ కోసం 25 సం.ల కనీస సర్వీస్ చేసి ఉండాలి.

 

• పెన్షన్ కోసం కనీసం 10 సం. ల సర్వీస్ చేసి ఉండాలి. 10 నుండి 25 సం. ల మధ్య సర్వీస్ చేసిన వారికి ప్రపోర్షనేట్ గా పెన్షన్ ఇస్తారు.

 

• సూపర్‌యాన్యుయేషన్‌కు ( రిటైర్మెంట్ ) ముందు 12 నెలలలో తీసుకున్న సగటు ప్రాథమిక వేతనంలో 50% ను పెన్షన్ గా ఇస్తారు.

 

• పెన్షనర్ మరణానికి ముందు చివరిగా తీసుకున్న పెన్షన్‌లో 60% పెన్షన్ ఖచ్చితంగా కుటుంబ పెన్షన్ గా ఇస్తారు.

 

• కనీసం 10 సంవత్సరాల సర్వీసు తర్వాత సూపర్‌యాన్యుయేషన్‌పై నెలకు కనీస పెన్షన్ Rs 10000 హామీ ఇవ్వబడుతుంది.

 

• ద్రవ్యోల్బణ సూచిక ( Inflation Rate) : హామీ ఇవ్వబడిన పెన్షన్‌పై,  కుటుంబ పెన్షన్ పై మరియు హామీ ఇవ్వబడిన కనీస పెన్షన్‌పై సర్వీస్ లో ఉన్న ఉద్యోగులు లాగే పారిశ్రామిక కార్మికులకు (AICPI-W) ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్ ఇస్తారు.

 

SBI Life Saral Swadhan Plus Plan -సామాన్యులకు అద్భుతమైన పధకాన్ని ప్రవేశపెట్టిన స్టేట్ బ్యాంకు, Benefits & key Features

 

• అలాగే  పూర్తయిన  ప్రతి ఆరు నెలల సర్వీస్‌ కు విరమణ తేదీ వరకు నెలవారీ వేతనం లో 1/10వ వంతు (పే + డీఏ) మొత్తాన్ని గ్రాట్యుటీకి అదనంగా సూపర్‌యాన్యుయేషన్‌ లో ఒకేసారి మొత్తం చెల్లింపు చేస్తారు.  ఈ చెల్లింపు హామీ ఇవ్వబడిన 50% పెన్షన్ పరిమాణాన్ని తగ్గించదు

 

• పిఎం మోడీ క్యాబినెట్ సెక్రటరీ టివి సోమనాథన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వివిధ సంస్థలు మరియు దాదాపు అన్ని రాష్ట్రాలతో 100కి పైగా సమావేశాలను నిర్వహించింది. ఆ కమిటీ సూచనలు మేరకు ఈ UPS పెన్షన్ పధకం తయారు చేశారు.

 

అసలు పాత పెన్షన్ స్కీం ఏంటి? What is Old Pension scheme

 

దీనిలో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తమ చివరి జీతంలో 50%ఖచ్చితంగా పెన్షన్ అలాగే సర్వీస్ లో ఉన్న ఉద్యోగస్తులు లాగే దాని మీద DA కూడా ఇచ్చేవారు/ఇస్తున్నారు. ఈ డబ్బులు పూర్తిగా కేంద్ర/రాష్ట్ర బడ్జెట్ లలో నుండి మాత్రమే చెల్లించేవారు. దీని కోసం ప్రత్యేక పెన్షన్ నిధి అంటూ లేదు. దీని వల్ల కేంద్ర/రాష్ట్ర బడ్జెట్లలో ప్రతీ సం. ఈ పెన్షన్ల ఖర్చు పెరిగిపోతూ ఉంది. ఉదా. చెప్పాలి అంటే 1991 లో కేంద్ర బడ్జెట్ లో పెన్షన్లు ఖర్చు సుమారు ₹3300కోట్లు అయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల పెన్షన్ ఖర్చు మరో ₹3100కోట్లు ఉండేది. అది 2021 వచ్చేసరికి కేంద్ర పెన్షన్ ఖర్చు ₹1,91,000కోట్లు అయితే రాష్ట్ర పెన్షన్లు ఖర్చు ₹3,86,000కోట్లు.

LIC Jeevan Akshay 7 ( 857 ) Telugu - "30 ఏళ్ళ వయసు నుంచే పెన్షన్ పొందండి " Eligibility ,Deposit, వివరాలు ఇవే

 

ఇది ముందుగానే  ఊహించిన వాజపేయి ప్రభుత్వం 2004లో ఈ పెన్షన్ స్కీం రద్దు చేసి కొత్తగా సర్వీస్ లో జాయిన్ అయ్యే  ఉద్యోగులు జీతంలో 10% అలాగే ప్రభుత్వం తన వాటాగా 10%కలిపి ( 2021నుండి దీనిని 14%చేశారు) పెన్షన్ ఫండ్ ఏర్పాటు చేసి. ఆ ఫండ్ డబ్బులు ఉద్యోగి కోరుకున్న అంటే ఎక్కువ రిస్క్ లేదా తక్కువ రిస్క్ ఫండ్స్ లో పెట్టి  వాటి మీద వచ్చే ఆదాయం పెన్షన్ గా చెల్లిస్తారు. దీనినే NPS లేదా ‘నేషనల్ పెన్షన్ స్కీం’ అంటారు.

 

అయితే, ఈ NPS స్కీం లో రిటైర్ ఆయిన తరువాత తమకు పాత ఉద్యోగుల లాగా 50%పెన్షన్ ఖచ్చితంగా రాదు అనే భయం ఉద్యోగస్తులలో ఉండి దానిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

 

2004 ఎన్నికలప్పుడు ఈ పెన్షన్ స్కీం పై ఉద్యోగులను రెచ్చగొట్టిన కాంగ్రెస్ తమ 2004-14సం. ల  మధ్య పాలనా  కాలంలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ గురించి అసలు మళ్ళీ మాట్లాడలేదు. ఎందుకంటే 50 సం. లు పాలించిన కాంగ్రెస్ కి ఈ OPS మళ్ళీ పెడితే వచ్చే ఆర్ధిక ఇబ్బందులు తెలుసు. కానీ, 2014 ఎన్నికల్లో ఒడినప్పటి నుండి మళ్ళీ పెన్షన్లు మీద ఉద్యోగస్తులను రెచ్చగొట్టడం మొదలు పెట్టి, అప్పటికే భారీ లోటు బడ్జెట్స్ ఉన్న తాను పాలిస్తున్న ఒకటి రెండు రాష్ట్రాల్లో యే ఆర్ధిక బాధ్యతా ప్రణాళికా లేకుండాఈ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిం….

https://enps.nsdl.com

 

 

అందుకే ఈ విషయంలో శాశ్వత పరిష్కారానికి మోడీ పాత పెన్షన్ విధానం+NPS కలబోతగా ఈ యూనిఫైడ్ పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చింది.

 

ఈ UPS వల్ల గత పాత పెన్షన్ విధానంలో ఉన్నట్లు గా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ లో మొత్తం ఖర్చు ఉండదు. ప్రత్యేక పెన్షన్ ఫండ్ నుండి దానిపై వచ్చే వడ్డీలు/ఆదాయాలు నుండి ఈ పెన్షన్లు చెల్లిస్తారు. ఎప్పుడైనా హామీ ఇచ్చిన 50%పెన్షన్లు చెల్లించడానికి ఫండ్స్ మీద వచ్చిన ఆదాయం చాలకపోతే అంతమేరా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేస్తే సరిపోతుంది.

 

అందువల్ల ఉద్యోగి స్వయంగా పెన్షన్ ఆప్షన్ ను నిర్ణయించుకోవచ్చు..”యూనిఫైడ్ పెన్షన్ స్కీం” కి సంభందించిన వివరాలను ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్ లో పొందుపరచడం జరుగును కనుక తరచు ఈ వెబ్సైట్ ను సందర్శించి వివరాలు తెలుసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *