IPPB Group Accident Insurance Policy

IPPB Group Accident Insurance Policy

18 నుంచి 65 సంవత్సరాల మధ్య గల వ్యక్తులు సంవత్సరానికి  Rs 755 చెల్లించడం ద్వారా 15 లక్షల బీమాను మరియు పది రకాల ఇతర ప్రయోజనాలను అందించే విధంగా పోస్ట్ ఆఫీస్ ఒక కొత్త  స్కీమ్ ను అందిస్తుంది. ఈ (IPPB Group Accident Insurance Policy)  స్కీంకు అప్లై చేయడానికి పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు. మీ దగ్గులో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఐపిపిబి (ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్) ఎకౌంటు ఓపెన్ చేయాలి. ఇప్పటికే  అకౌంట్ ఉంటే ఆన్లైన్లో నేరుగా ఓపెన్ చేయవచ్చు లేదా ఆఫ్లైన్లో ఏజెంట్ ద్వారా కూడా మీరు ఎకౌంటు ఓపెన్ చేయవచ్చు దీని కొరకు జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ,వాటర్ ఐడి ఉంటే చాలు దీంతోపాటుగా నామిని పేరు కూడా సబ్మిట్ చేస్తూ ఎకౌంటు ఓపెన్ చేయవచ్చు .

 

 

IPPB Group Accident Scheme Benefits:-

30 సంవత్సరాలు వయసు కలిగిన Mr.రాజేష్ అనే వ్యక్తి ఈ పాలసీని ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్ లో కనుగోలు చేసి Rs 755/- వార్షిక ప్రీమియం చెల్లిస్తే ఈ కింద పేర్కొన్న విధంగా 10 రకాల ప్రయోజనాలు కలుగుతాయి అవేంటో ఒక్కక్కటిగా చూద్దాం!

 

1. ఆక్సిడెంట్ ప్రయోజనం ( Accidental Death Benefit)

పాలసీ తీసుకొన్న ఒక సంవత్సరం లోపు పాలసీదారుడు ప్రమాదం కారణం చేత మృతి చెందితే వెంటనే అతని కుటుంబానికి Rs 15,00,000 లక్షల ఆర్థిక సాయం ఈ స్కీమ్ ద్వారా అందివ్వడం జరుతుంది.

 

2. పర్మినెంట్ డిసబిలిటీ ప్రయోజనం ( Permanent Disability)

లMr.రాజేష్ కి ఆక్సిడెంట్ జరిగింది కానీ అదృష్టవశాత్తు జీవించే ఉన్నాడు అయితే ఆక్సిడెంట్ కారణంగా ఏ పని చేయలేని స్థితిలో ఉన్నాడు ఇటువంటి సమయంలో కూడా పర్మినెంట్ డిజిబిలిటీ రూపంలో 15 క్షలు రూపాయలు ఇమ్మీడియట్ గా క్లైమ్ రావడం జరుగుతుంది .

3. పర్మినెంట్ డిసబిలిటీ ప్రయోజనం ( Permanent Partial Disability )

ప్లాన్ లో ప్రీమియం చెల్లించే దశలో వ్యక్తి కనుక పూర్తి మానసిక వికలాంగానికి గురైతే అప్పుడు కూడా వ్యక్తి కుటుంబానికి 15 లక్షలు ఈ స్కీం ద్వారా లభించడం జరుగుతుంది .

 

 

 

 

4.IPD – Inpatient Department 

పాలసీదారుడు సంక్లిష్ట పరిస్థితుల్లో అంటే ఏదైనా భయంకరమైన వ్యాధి లేదా అనారోగ్యం లేక మరేదైనా ఎమర్జెన్సీ శస్త్ర చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో అడ్మిట్ అయితే కనీసం లక్ష రూపాయలు లేదా చికిత్సకి అయిన బిల్లు ఏది ఎక్కువ అయితే ఆ అమౌంట్ను అందివ్వడం జరుగుతుంది .

 

5. Broke Bone Treatment 

అనుకోకుండా మిస్టర్ రాజేష్ కి ఏ కారణం చేతనైనా అది ఇంట్లోగానే లేక డ్రైవ్ చేసే సమయంలో లేదా పని చేసే చోట రిస్క్ జరిగి ఎముక విరిగిందని నిర్ధారణ జరిగితే బ్రేక్ బోనే ట్రీట్మెంట్ కొరకు వెంటనే ఒక 25 వేల రూపాయలు వెను వెంటనే ఇస్తారు.

 

6. Children Marriage Benefit 

మిస్టర్ రాజేష్ ప్లాన్ లో కొంతకాలం డబ్బు చెల్లించిన తర్వాత అనుకోకుండా కాలం చేస్తే ఈ దశలో పెళ్లి వయసుకు వచ్చిన కూతురు కనుక రాజేష్ కుంటే ఆ అమ్మాయి యొక్క వివాహం నిమిత్తం ఒక లక్ష రూపాయలు ఈ స్కీం ద్వారా లభిస్తాయి .

 

 

LIC Tech Term Plan Telugu 854 - ''ఎల్ .ఐ . సి లోనే అతి చవకైన పాలసీ'' , రోజుకి 40 రూ//లకే కోటి రూపాయల భీమా

 

6.   Children Education Benefit 

అంటే రాజేష్ ఎక్స్పైర్ అయ్యే సమయంలో అతను చదువుకున్న అమ్మాయి ఉంటే ఉన్నత చదువు కొరకు అత్యధికంగా 1 లక్ష రూపాయలు లేదా చదువు యొక్క ఫీజు ఎంత అయితే అంత ఆ అమౌంట్ ని చల్లని యొక్క ఎడ్యుకేషన్ కొరకు సంస్థ అందిస్తుంది.

 

ALSO READ

SBI Magnum Children&;s Benefit Fund Investment Plan -పిల్లల భవిష్యత్ కి మంచి స్కీమ్

 

SBI Life Saral Swadhan Plus Plan -సామాన్యులకు అద్భుతమైన పధకాన్ని ప్రవేశపెట్టిన స్టేట్ బ్యాంకు, Benefits : key Features

 

 

7. Hospital Cash  Benefit  (హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్) 

ఏదైన అనారోగ్య సమస్య కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయితే హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ రూపంలో రోజుకి 1500 రూపాయలు చొప్పున 15 రోజులు Rs 1,50,00 ఇస్తారు అదే ఒకవేళ వ్యక్తి ఐసీయులు అడ్మిట్ అయితే రోజుకి ₹2,000 వరకు ఈ లిమిట్ వర్తిస్తుంది .

 

8. Coma Benefit ( కోమా బెనిఫిట్ )

అంటే పాలసీదారుడు ఏ కారణం చేతనైనా సరే కోమాలోకి వెళితే కోమాలోకి వెళ్ళిన మూడు నెలల తర్వాత నుంచి ప్రతి వారం కూడా 15 వేల రూపాయల చొప్పున వరుసుగా 10 వారాలపాటు 150000 రూపాయల ఆర్థిక సహాయం లభిస్తుంది.

 

9. Pregnancy Expenses ( ప్రెగ్నెన్సీ బెనిఫిట్ )

ఒకవేళ ఈ ప్లాన్ ని ఒక మహిళకు కనుగోలు చేసినట్లయితే పై ప్రయోజనాలతో పాటు ప్రెగ్నెన్సీ సమయంలో అదనంగా ప్రతి రోజుకి ₹2,000 వరకు నగలు చెల్లించడం జరుగుతుంది.

 

https://www.ippbonline.com/

 

10. Funeral Expenses ( అంత్యక్రియల బెనిఫిట్ ) 

దీనితో పాటుగా  పాలసీదారుడు అంత్యక్రియల నిమిత్తం Rs 5000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *