LIC Jeevan Mangal Plan Telugu 940 – సామాన్యులకి అద్భుతమైన పధకం వివరాలు ఇవే!

      LIC Jeevan Mangal Plan Details  940 in  Telugu

LIC Jeevan Mangal Plan 

జీవన్ మంగళ్ ఒక మైక్రో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రిటర్న్ ప్లాన్  అలాగే ఇది ఒక ప్రొటెక్షన్ ప్లాన్ మెట్యూరిటీ సమయంలో చెల్లించిన ప్రీమియంని రిటర్న్ గా అందిస్తుంది. సామాన్య మధ్య తరగతి వారు ఈ స్కీం యొక్క ప్రయోజనాలు పొందవచ్చు అత్యవసర సమయంలో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది. మెడికల్ పరిక్షలు నిర్వహించకుండానే ఈ పాలసీని మీకు అందివ్వడం జరుగుతుంది మరియు చెల్లించే ప్రీమియం పై జి స్ టీ ( GST ) ఉండదు. దీనితోపాటుగా ఎటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్ జమాచేయాల్సిన అవసరం ఉండదు. క్రింద అర్హతలు పూర్తి చేసి ఈ పాలసీని మీరు తీసుకోవచ్చు.

LIC న్యూ జీవన్ మంగళ్ ప్లాన్ సులభతరమైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది తక్కువ ఖర్చుతోనే అధిక కవరేజ్ అందిస్తుంది. ఈ ప్లాన్ ను గరిష్టంగా 15 సంవత్సరాల పాటు కొనుగోలు చేయవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి మీరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీను కొనుగోలు చేసినప్పుడు అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

LIC యొక్క న్యూ జీవన్ మంగళ్ అనే ఈ ప్లాన్‌లో ప్రమాదవశాత్తు మరణించినట్లయితే డబుల్ రిస్క్ కవర్ అందించే ఇన్‌బిల్ట్ యాక్సిడెంట్ బెనిఫిట్ ఉంది.
కాబట్టి మీరు LIC నుండి టర్మ్ ఇన్సూరెన్స్ రూపంలో లైఫ్ కవరేజ్ కోసం చూస్తున్నట్లయితే, LIC నుండి ఈ అద్భుతమైన ప్లాన్ పొందడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

 

LIC Jeevan Mangal Plan Telugu 940 - సామాన్యులకి అద్భుతమైన పధకం వివరాలు ఇవే!

• ఈ పాలసీని తీసుకోవడానికి అర్హులు ఎవరు? ( Jeevan Mangal Eligibility ? )

ఈ పాలసీ తీసుకొనే వ్యక్తి యొక్క కనీస వయస్సు( Minimum Age ) = 18 సంవత్సరాలు.
అత్యధిక వయస్సు (maximum Age ) = 55 సంవత్సరాలు.
కనుక 18 నుంచి 55 సంవత్సరాల వయసు మధ్యకలిగిన వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.

 

• అత్యధిక మెట్యూరిటీ వయసు? – ( Maximum Maturity Age )

LIC జీవన్ మంగళ అత్యధిక మెట్యూరిటీ వయసు = 65 సంవత్సరాలు. అందువల్ల 65 సంవత్సరాలలోపు పాలసీ ముగిసేలా నిర్ణయించుకోవాలి.

 

• LIC జీవన్ మంగల్ భీమా పాలసీలో ప్రీమియం ఏ విధంగా చెల్లించాలి? ( Premium Paying )

ఈ స్కీం లో ప్రీమియం ని 2 రకాలుగా చెల్లించవచ్చు.

1.సింగిల్ ప్రీమియం ( Single Premium Only One Time )

ఈ ఆప్షన్ ద్వారా పాలసీకి సంబందించిన మొత్తం ప్రీమియం ఒక్కసారే పాలసీదారుడు చెల్లించవచ్చు.

2. రెగ్యులర్ ప్రీమియం ( Regular Premium )

అంటే ఎన్ని సంవత్సరాలు పాలసీ యొక్క సమయాన్ని నిర్ణయించుకొంటే అన్ని సంవత్సరాలు ప్రీమియం చెల్లించడం.

 

• జీవన్ మంగళ్ పాలసీ పీరియడ్? – ( Policy Period )

సింగిల్ ప్రీమియం చెల్లించేవారి పీరియడ్ – 5 నుంచి 10 సంవత్సరాలు

రెగ్యులర్ ప్రీమియం చెల్లించేవారి పీరియడ్ – 10 నుంచి 15 సంవత్సరాలుగా నిర్ణయించుకోవచ్చు.

 

• LIC జీవన్ మంగళ్ భీమా పరిమితి ? ( LIC Jeevan Mangal Plan Sum Assured ? )

ఈ పాలసీ యొక్క కనీస భీమా పరిమితి =Rs 10, 000/- రూపాయలు.
అత్యధిక భీమా పరిమితి = Rs 50,000/-

ఈ పాలసీని 50 వేల కుమించి అందివ్వడం జరగదు.

 

LIC Arogya Rakshak Plan In Telugu – కుటుంబం మొత్తానికి ఒక్కటే ఆరోగ్య పాలసీ ” పూర్తి వివరాలు ఉదాహరణ ద్వారా !

LIC New Endowment Plan in Telugu – రోజుకి 53/- రూపాయలతో 12 లక్షలు పొందండి, పూర్తి వివరాలు.

 

• ఈ పాలసీలో ప్రీమియంని ఏ విధంగా చెల్లించాలి? ( Premium Payment Mode ?)

ఒక్క సింగిల్ ప్రీమియం తప్ప మిగిలిన రెగ్యులర్ మ రియు లిమిటెడ్ ప్రీమియం చెల్లించేవారు
ఈ పాలసీలో 3 రకాలుగా ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది.

1. సంవత్సరానికి ఒకసారి – Yearly
2. 6 నెలలకు ఒకసారి       – Half Yearly
3. ప్రతినెలా                        – Monthly

ముఖ్య గమనిక : ఈ ప్రీమియంని చెల్లించడానికి పాలసీదారుడు ప్రతినెలా సంస్థకు వెళ్లి చెల్లించవచ్చు.
లేదా ఆన్ లైన్లో గూగుల్ పే ( Google Pay ) ఫోన్ పే ( Phone Pay ) మరియు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ( Internet Banking ) తదితర రూపాల్లో సులువుగా చెల్లించే సదుపాయం LIC కల్పించింది.

 

• LIC జీవన్ మంగళ్ భీమా రివైవల్ ఫెసిలిటి ? (LIC Jeevan Mangal Plan  Revival ?)

ఈ పాలసీకి 5 సంవత్సరాలు రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది.
పాలసీదారుడు ఏదైనా కారణంగా ఈ పాలసీలో కొన్ని సంవత్సరాలు రెగ్యులర్ గా ప్రీమియం చెల్లించలేనట్లైతే ఈ పాలసీ ముగియవేయబడుతుంది.

కాబట్టి అటువంటి సమయంలో 5 సంవత్సరాల లోపు మొత్తం బాకీ ప్రీమియంని పెనాల్టీతో కలిపి చెల్లిస్తే ఈ పాలసీలో తిరిగి కొనసాగే సదుపాయం ఉంటుంది.

 

• ఈ పాలసీకి ప్రీమియంకి గ్రేస్ పీరియడ్ ఉంటుందా ? ( Grace Period )

గ్రేస్ పీరియడ్ అంటే పాలసీలో మీరు ప్రీమియంని చెల్లించవలసిన తేదీలోపు చెల్లించలేనప్పటికీ అధనంగా కొద్దిగా సమయం ఉంటుంది.

ఎవరైతే ఈ పాలసీలో సంవత్సరానికి ఒకసారి,6 నెలలకు ఒకసారి మరియు 3 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లిస్తారో వారికీ అధనంగా 30 రోజులు సమయం ఉంటుంది.

ప్రతినెలా ప్రీమియం చెల్లించేవారికి 15 రోజులు ఈ గ్రేస్ పీరియడ్ ఉంటుంది.

ముఖ్య గమనిక : ఈ సమయంలో మీరు అదనపు పెనాల్టీని సంస్థకి చెల్లించవలసిన అవసరం ఉండదు.
ఈ గ్రేస్ పీరియడ్ సమయంలో కూడా మీకు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది.

 

 

 LIC జీవన్ మంగళ్ ఉదాహరణ – ( Example )

 

• ఈ భీమా ఎలా పనిచేస్తుంది? ( How does it’s Work?)

పాలసీదారుని పేరు ( Name )           = Mr. కుమార్
వయసు ( Age )                                    = 40 సంవత్సరాలు
వృత్తి ( Occupation )                           = మేస్త్రి

భీమా ( Bhima )                                     = Rs 10,000/-
సంవత్సర ప్రీమియం ( Premium )   = Rs 436/-

 

లభించే ప్రయోజనాలు ( Benefits ) :-

 

డెత్ బెనిఫిట్ – Death Benefit

కాబట్టి Mr. కుమార్ సంవత్సరానికి 436/- రూపాయల చొప్పున 15 సంవత్సరాలు ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.

ఒకవేళ ప్లాన్ తీసుకొన్న 2 వ సంవత్సరం ఏ కారణంగానైనా కుమార్ (సహజంగా లేదా ఆక్సిడెంట్ ) మరణించినట్లయితే కట్టిన ప్రీమియం 872 రూపాయలే అయినా వెంటనే కుమార్ కుటుంబానికి Rs 10,000/- రూపాయలు ఈ స్కీం ద్వారా లభిస్తాయి.ఇది మరణప్రయోజనం.

 

ప్రీమియం రిటర్న్ బెనిఫిట్ – ( Premium Return )

అదృష్టవశాత్తు స్కీం సమయం మధ్యలో కుమార్ కి ఎటువంటి రిస్క్ జరగకపోతే ప్లాన్ లో చెల్లించిన మొత్తం ప్రీమియంని రిటర్న్ గా అందివ్వడం జరుగుతుంది.

436 × 15 = Rs 6,540/- రిటర్న్ లభిస్తాయి. అందువల్ల ఈ స్కీం టర్మ్ ఇన్సూరెన్స్ + రిటర్న్ అఫ్ ప్రీమియం ప్లాన్ గా డబల్ బెనిఫిట్ ని అందిస్తుంది.

 

• LIC జీవన్ మంగళ్ లభించే టాక్స్ ప్రయోజనాలు ఏమిటి? ( Jeevan Mangal Tax benefits ?)

ఈ పాలసీలో పాలసీదారుడు చెల్లించే ప్రీమియంపై ఇన్కమ్ టాక్స్ రూల్ అండర్ సెక్షన్ 80c వర్తిస్తుంది,

అదేవిధంగా పాలసీ లో లభించే మరణ ప్రయోజనం పై ఇన్కమ్ టాక్స్ రూల్ అండర్ సెక్షన్ 10D వర్తిస్తుంది.
కాబట్టి ఎటువంటి టాక్స్ విధించబడదు. మొత్తం క్లెయిమ్ అమౌంట్ టాక్స్ రహితంగా పాలసీదారునికి లభిస్తుంది.

 

• లోన్ సదుపాయం – ( LIC Jeevan Mangal Plan Loan )

ఈ స్కీం లో ఎటువంటి లోన్ సదుపాయం కల్పించబడదు.

 

• సరెండర్ ఫెసిలిటీ – (  Surrender )

LIC జీవన్ మంగల్ పాలసీని మధ్యలో సరెండర్ చేసేలా సరెండర్ ఫెసిలిటీ ఉండదు.

 

• ఆత్మహత్య కి క్లెయిమ్ వర్తిస్తుందా? ( Suicide Exclusion )

వర్తిస్తుంది. పాలసీ తీసుకొన్న ఒక సంవత్సరం లోపు పాలసీదారునుకి ఆత్మహత్య క్లెయిమ్ లభించదు.
ఒక సంవత్సరం తర్వాత కనుక ఆత్మహత్య కి గురైతే క్లెయిమ్ యాదవిధిగా వర్తిస్తుంది.

ముఖ్య గమనిక :- పాలసీకి సంబందించిన వివరాలు నిమిత్తం ఆత్మహత్య ప్రయోజనంను తెలియచేయడం జరిగింది. కాబట్టి ఎవ్వరూ దీనిని అనుసరించవద్దు.

 

• ఈ స్కీం ని ఎక్కడ ఎలా అప్లై చెయ్యాలి? కావలసిన డాకుమెంట్స్ ఏమిటి? – (LIC Jeevan Mangal Required Documents?)

ఈ స్కీమ్ మీకు కేవలం మైక్రో ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ద్వారా మాత్రమే లభిస్తుంది ఇతర మధ్యమాల ద్వారా లభించదు.

కావలసిన డాకుమెంట్స్ :-

1. ఆధార్ కార్డు ( Adar Card)
2. రేషన్ కార్డు ( Ration Card )
3. ఓటర్ ఐడి ( Voter ID )
4. డేట్ అఫ్ బర్త్ ( Date Of Birth )

• డెత్ ప్రయోజనం పొందడానికై ( Death Claim Required Documents )

1. అప్లికేషన్ ఫారం ( Application Form )
2. భీమా పుస్తకం ( Insurance Document)
3. డెత్ సర్టిఫికెట్ ( Death Certificate )
4. బ్యాంకు పాసుబుక్ ( Bank Passbook ) ని అందచేసి ఈ క్లెయిమ్ ను పొందవచ్చు.

https://licindia.in/

 

తరచుగా అడిగే ప్రశ్నలు – Q & A

 

Q. LIC జీవన్ మంగళ్ పాలసీకి అవసరమైన కనీస ప్రీమియం వాయిదాలు ఏమిటి?

A.ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం కనీస ప్రీమియం రూ.15, కనీస హామీ మొత్తం రూ. 10,000 వరకు ఉంటుంది.

 

Q. LIC జీవన్ మంగళ్ ప్లాన్ కోసం ఏదైనా గ్రేస్ పీరియడ్ అనుమతించబడిందా?

A. అవును, కస్టమర్‌లు తమ ప్రీమియంలను అవసరమైన వడ్డీతో కలిపి చెల్లించడానికి రెండు క్యాలెండర్ నెలలు (60 రోజులు) గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుంది.

 

Q. LIC జీవన్ మంగళ్ పాలసీని పునరుద్ధరించవచ్చా?

A) అవును, జీవన్ మంగళ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని పునరుద్ధరించవచ్చు. పాలసీ దారుడు అదనపు వడ్డీతో ( పెనాల్టీ) ప్రీమియంలు చెల్లించి పాలసీని పునరుద్ధరించవచ్చు . పాలసీ వ్యవధి పూర్తయ్యే ముందు చెల్లించని మొదటి ప్రీమియం తేదీ నుండి రెండు సంవత్సరాల వ్యవధిలో దీనిని నిర్వహించవచ్చు. అయితే పాలసీ హోల్డర్ పాలసీ కొనసాగుతుందని నిర్ధారించడానికి అవసరమైన ఆధారాలు మరియు పత్రాలను LIC కి సమర్పించాలి.

 

Q. LIC జీవన్ మంగళ్ ప్లాన్ కోసం హామీ ఇచ్చిన సరెండర్ విలువ ఎంత?

A. క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లింపులు చేసే పాలసీ దారులు మరియు ఒకేసారి ప్రీమియం చెల్లించే పాలసీ దారులకు హామీ మొత్తం సరెండర్ విలువ భిన్నంగా ఉంటుంది.

ఒకేసారి ప్రీమియం చెల్లింపు చేసే పాలసీదారులకు-

పాలసీ కాలపరిమితి ముగిసిన మూడు సంవత్సరాలలోపు కస్టమర్ సరెండర్ చేస్తే, GSV ప్రీమియంలో డెబ్బై శాతం ఉంటుంది.

మూడు సంవత్సరాల వ్యవధి ప్రారంభమైన తర్వాత కస్టమర్ ప్లాన్‌ను సరెండర్ చేస్తే, GSV ప్రీమియంలో తొంభై శాతం ఉంటుంది.

క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లింపులు చేసే పాలసీదారులకు –

చెల్లించిన ప్రీమియంల ద్వారా గుణించబడిన GSV కారకానికి హామీ ఇచ్చే సరెండర్ విలువ సమానంగా ఉంటుంది. GSV కారకం పాలసీ వ్యవధి మరియు పాలసీని సరెండర్ చేసినప్పుడు ఆధారపడి ఉంటుంది.

 

Q. పాలసీదారు ఎల్ఐసి జీవన్ మంగళ్ పాలసీ వ్యవధిని ఎంపిక చేసుకోవచ్చా?

A. అవును, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కస్టమర్లకు వారి పాలసీ వ్యవధిని వారికి అనుగుణంగా ఎంపిక చేసుకోవడానికి అనుమతిస్తుంది.

 

Other Important :

 

Q. LIC జీవన్ మంగళ్ ప్లాన్ కాల వ్యవధులు ఏమిటి?

A. ఈ పాలసీ యొక్క అందుబాటులో ఉన్న కాల వ్యవధులు పది నుండి పదిహేను సంవత్సరాల వరకు పాలసీదారులకు ప్రీమియంలు రెగ్యులర్‌గా చెల్లించడానికి అనుకూలంగా ఉంటాయి మరియు ప్రీమియం ఒకే చెల్లింపు చేయడానికి సిద్ధంగా ఉన్నవారికి పది సంవత్సరాలు ఉంటాయి.

 

పాలసీ కాలపరిమితి ముగిసిన మూడు సంవత్సరాలలోపు కస్టమర్ సరెండర్ చేస్తే, GSV ప్రీమియంలో డెబ్బై శాతం ఉంటుంది.

మూడు సంవత్సరాల వ్యవధి ప్రారంభమైన తర్వాత కస్టమర్ ప్లాన్‌ను సరెండర్ చేస్తే, GSV ప్రీమియంలో తొంభై శాతం ఉంటుంది.

క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లింపులు చేసే పాలసీదారులకు –

చెల్లించిన ప్రీమియంల ద్వారా గుణించబడిన GSV కారకానికి హామీ ఇచ్చే సరెండర్ విలువ సమానంగా ఉంటుంది.  GSV కారకం  పాలసీ వ్యవధి మరియు పాలసీని సరెండర్ చేసినప్పుడు ఆధారపడి ఉంటుంది.

Q.  పాలసీదారు ఎల్ఐసి జీవన్ మంగళ్ పాలసీ వ్యవధిని ఎంపిక చేసుకోవచ్చా?

A.   అవును, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కస్టమర్లకు వారి పాలసీ వ్యవధిని వారికి అనుగుణంగా  ఎంపిక చేసుకోవడానికి అనుమతిస్తుంది.

Q.  LIC జీవన్ మంగళ్ ప్లాన్ కాల వ్యవధులు ఏమిటి?

A.   ఈ పాలసీ యొక్క అందుబాటులో ఉన్న కాల వ్యవధులు పది నుండి పదిహేను సంవత్సరాల వరకు పాలసీదారులకు ప్రీమియంలు రెగ్యులర్‌గా చెల్లించడానికి అనుకూలంగా ఉంటాయి మరియు ప్రీమియం ఒకే చెల్లింపు చేయడానికి సిద్ధంగా ఉన్నవారికి పది సంవత్సరాలు ఉంటాయి.

• ముగింపు ( Conclusion )

ఈ వెబ్సైటు ద్వారా అన్ని ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు మరియు చిన్న తరహా వ్యాపారాల యొక్క వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య

One thought on “LIC Jeevan Mangal Plan Telugu 940 – సామాన్యులకి అద్భుతమైన పధకం వివరాలు ఇవే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *