SBI Life eShield Next Telugu –  “అవసరాలకి అనుగుణంగా పెరుగుతుంది భీమా కవరేజ్, మరెన్నో ప్రయోజనాలు వివరాలు ఇవే !

       SBI Life eShield Next Plan Details In Telugu

 

SBI Life- eShield Next ప్లాన్ నాన్ పార్టిసిపేటింగ్ మరియు ప్యూర్ టర్మ్ ప్లాన్. ఇది SBI  వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.  ప్లాన్ తీసుకోవడానికి  ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా చాలా సులభం మరియు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రధానంగా ఇది నాన్-లింక్డ్ ( షేర్ మార్కెట్ తో సంబంధం కలిగి ఉండదు ), పార్టిసిపేట్ చేయని స్వచ్ఛమైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్.

ఇది అందరికీ  చాలా సరసమైన ప్రీమియం రేటుతో అధిక బీమా కవరేజీని అందిస్తుంది . ఇది ఒక సమగ్ర ప్రణాళిక కాబట్టి SBI Life- eShield Next ప్లాన్  పాలసీదారుడికి తగిన ప్రయోజనాన్ని అందిస్తుంది మరియు వారి కుటుంబాన్ని ఏ రకమైన సంఘటనలకు గురి కాకుండా  భద్రత కలిపిస్తుంది.  అంతేకాకుండా, ఈ ప్లాన్ పాలసీదారునికి పన్ను ప్రయోజనం తోపాటు అతని జీవిత భాగస్వామికి కూడా 25 లక్షల భీమాని అందిస్తుంది.

 

SBI Life eShield Next Telegu -  "అవసరాలకి అనుగుణంగా పెరుగుతుంది భీమా కవరేజ్, మరెన్నో ప్రయోజనాలు వివరాలు ఇవే !

 

• ప్లాన్ ఆప్షన్స్ –  ( SBI Life eShield Next  Telugu Options )

1. లెవెల్ కవర్ – Level Cover

పాలసీదారుడు ప్రారంభంలో  ఎంత భీమా ని నిర్ణయించుకోoటాడో అంతే భీమా ప్రయోజనం చివర వరకూ వర్తిస్తుంది.

2. ఇంక్రీజ్ కవర్  – ( Increase Cover )

ఈ ఆప్షన్ లో ఒకసారి భీమాని నిర్ణయించుకొన్నాక ప్రతీ 5 సంవత్సరాలకు 10% గా పెరుగుతూ వస్తుంది.
ఉదాహరణ కి ఒక వ్యక్తి 10 లక్షల భీమా తీసుకొంటే
మొదటి 5 వ సంవత్సరం 11 లక్షలు,10 వ సంవత్సరం 12 లక్షలు, 15 వ సంవత్సరం 13 లక్షలు ఈవిధంగా తీసుకొన్న భీమా కి డబల్ అయ్యేవరకు ఇంక్రీస్ అవుతుంది, తర్వాత స్థిరంగా ఉంటుంది.

3. లెవెల్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ – ( Level Cover With Future Proofing )

ఈ ఆప్షన్ లో మీరు దశలు వారీగా ప్రయోజనం పొందవచ్చు. దీన్నే లైఫ్ స్టేజ్ (  Life Stage ) ఆప్షన్ అని అంటారు.

సాధారణంగా బ్యాచిలర్ లైఫ్ లో ఏ పాలసీ తీసుకొన్నా తక్కువ భీమానే మనం నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వివాహం, పిల్లలు, సొంత ఇంటి నిర్మాణం ఇలా బాధ్యతలు పెరుగుతూ వస్తాయి. కానీ ఒకసారి పాలసీ తీసుకొన్న తర్వాత మధ్యలో భీమాని పెంచుకొనే వీలుండదు. ఒకవేళ ఒక్కో దశలో ఒక్కో భీమా తీసుకోవడం ఆర్థిక భారం కావచ్చు.

SBI life eShield Next Plan ఈ ఆప్షన్ ద్వారా

1. వివాహం అనంతరం – ( After Marriage )

కుటుంబ అవసరానికి అనుగుణంగా 50% అఫ్ ప్రాథమిక భీమా రూపంలో 50% భీమాని పెంచవచ్చు.
అత్యధికముగా 50 లక్షలు వరకూ.

2.పిల్లలు జన్మించిన సమయంలో – ( On Birth Of The Children )

మొదటి సంతానం కలిగినపుడు ప్రాథమిక భీమకి 25%, రెండవ సంతానానికి 25% భీమాను పెంచుకోవచ్చు. అత్యధికముగా ఒక్కో చిల్డ్రన్ కి 25 లక్షలు చొప్పున 50 లక్షల వరకూ.

3. సొంత ఇంటి నిర్మాణం – ( On Purchase Of House )

ఇంటిని నిర్మించే సందర్భంలో ఇన్సూరెన్స్ ఎగైనెస్ట్ లోన్ రూపంలో అదనంగా మరొక 50% భీమాను ఇంక్రిజ్ చేసుకునేవీలుంటుంది. అత్యధికముగా 50 లక్షల వరకూ.

ముఖ్య గమనిక :- పై 3 సందర్భాలలో భీమాను ఇంక్రీజ్ చేసినపుడు భీమాతోపాటు ప్రీమియం కూడా పెరుగుతుంది.

 

• బెటర్ హాఫ్ ప్రయోజనం – ( Better Half Benefit )

ఈ పాలసీ ద్వారానే మీ జీవిత భాగస్వామికి కూడా భీమా కల్పించవచ్చు. Sbi Life 25 లక్షల భీమా జీవితభాగస్వామికి కల్పించే సదుపాయం కల్పించింది.
3 రకాల ఆప్షన్స్ వారు ఈ ప్రయోజనం పొందవచ్చు.

 

బెటర్ హాఫ్ షరతులు – Terms & Conditions

1. భార్య మరియు భర్త ఇద్దరి మధ్య వయసు అంతరం 10 సంవత్సరాల లోపు ఉండేట్లు చూసుకోవాలి.

2. పాలసీ హోల్డర్ కి ప్లాన్ మధ్యలో రిస్క్ జరిగితే భీమా నామినీకి లభిస్తుంది అయినా పాలసీ కొనసాగుతుంది.

3. వ్యక్తి మరణించిన సమయం నుంచి నామినీ కొనసాగుతుంది ఈ సమయంలో ప్రీమియం మాఫీ చేస్తారు కాబట్టి నామినీ ఎటువంటి అమౌంట్ చెల్లించవలసిన అవసరం ఉండదు.

4.  పాలసీ మేట్యూరిటీ సమయం కంటే ముందు జీవితభాగస్వామికి రిస్క్ జరిగితే 25 లక్షలు వెంటనే కుటుంబ సభ్యులకు అందిస్తారు.

5. ఒకవేళ పాలసీ తీసుకొన్న వ్యక్తి జీవించి ఉండి భార్య కి ముందుగా రిస్క్ జరిగితే ఈ ప్రయోజనం వర్తించదు.

వీటిని గురించి క్షుప్తంగా ముందు ఉదాహరణ ద్వారా తెలుసుకొందాం!

 

SBI life Smart future Choices In Telugu ;అవసరం వచ్చినప్పుడల్లా అడిగి తీసుకోండి

PPF Scheme in Telugu – పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్ అర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!

SBI Life eShield Next  Telugu Eligibility :- అర్హతలు

 

SBI life eShield next పాలసీని లిమిటెడ్ గా కొంత కాలానికి లేదా హోల్ లైఫ్ గా పూర్తి జీవితానికి తీసుకొనే సదుపాయం ఉంటుంది.

• కనీస వయసు – ( Minimum Age )

లిమిటెడ్ పాలసీ టర్మ్ తీసుకొనే వారియొక్క కనీస వయసు = 18 సంవత్సరాలు నిండివుండాలి.

హోల్ లైఫ్ కి ఈ ప్లాన్ తీసుకొంటే కనీస వయసు                    = 45 సంవత్సరాలు.

 

• అత్యధిక వయసు – ( Maximum Age )

సింగిల్ ప్రీమియం మరియు లిమిటెడ్ ప్రీమియం చెల్లించే వారి అత్యధిక వయసు = 65 సంవత్సరాలు.

రెగ్యులర్ ప్రీమియం  ( Regular Premium )వారికి                                                           = 60 సంవత్సరాలు.

బెట్టర్ హాఫ్ బెనిఫిట్ ద్వారా జీవిత భాగస్వామికి భీమా కల్పిస్తే = 55 సంవత్సరాల లోపుఉండాలి.

 

• అత్యధిక మెట్యూరిటీ వయసు – ( Maximum Maturity Age )

సింగిల్ ప్రీమియం మరియు లిమిటెడ్ ప్రీమియం చెల్లించే  = 85 సంవత్సరాలు.

హోల్ లైఫ్ లిమిటెడ్ ప్రీమియం  ( Non Whole Life )          = 100 సంవత్సరాలు.

నాన్ హోల్ లైఫ్ లిమిటెడ్ ప్రీమియం వారికి                          = 85 సంవత్సరాలుగా అత్యధిక మెట్యూరిటీ వయసు ఉంటుంది. ఈ సమయంలో పాలసీ పూర్తి అయ్యేట్లు స్కీం సమయం నిర్ణయం చేసుకోవాలి.

 

• SBI life eShield next భీమా పరిమితి ? ( Sum Assured ? )

ఈ పాలసీ యొక్క కనీస భీమా పరిమితి             =Rs 50,00, 000/- రూపాయలు.

అత్యధిక  భీమా పరిమితి ( Maximum Bhima ) =  ఎటువంటి పరిది లేదు.( No limit )

ముఖ్య గమనిక :- నాన్ స్మోకర్స్ ( దుమపానం, మద్యపానం, గుట్కా ఇతర అలవాట్లు..)కి అత్యధికముగా 99 లక్షలు వరకూ మాత్రమే భీమా లభిస్తుంది.

 

• ఈ పాలసీలో  ప్రీమియంని ఏ విధంగా చెల్లించాలి?  ( Premium  Payment Mode ?)

ఒక్క సింగిల్ ప్రీమియం తప్ప మిగిలిన రెగ్యులర్ మ రియు లిమిటెడ్ ప్రీమియం చెల్లించేవారు
ఈ పాలసీలో  3 రకాలుగా  ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది.

1. సంవత్సరానికి ఒకసారి    – Yearly
2. 6 నెలలకు ఒకసారి         – Half Yearly
3. ప్రతినెలా                          – Monthly

 

• పాలసీ సమయం – ( Policy Term SBI Life eShield Next Telegu  )

 

 

కనీస పాలసీ సమయం  = 5 సంవత్సరాలు

అత్యధిక పాలసీ సమయం

సింగిల్ ప్రీమియం, రెగ్యులర్ ప్రీమియం                                     = 85 – ప్రస్తుతం పాలసీ దారుని వయసు.
హోల్ లైఫ్ లిమిటెడ్ ప్రీమియం వారికి                                      = 100 – ప్రస్తుతం వయసు.
నాన్ హోల్ లైఫ్ ఇతర లిమిటెడ్ ప్రీమియం చెల్లించే వారికి  = 85 – ప్రస్తుత వయసు,

అంటే 30 సంవత్సరాల వయసు కల్గిన వ్యక్తి ప్రీమియం రెగ్యులర్ గా చెల్లించే ఆప్షన్ నిర్ణయించుకొంటే (  85 సంవత్సరాలు – 30 = 55 సంవత్సరాలు పాలసీ సమయం అవుతుంది.

 

• ఆన్లైన్ ప్రీమియం డిస్కౌంట్ – ( Online Premium Discount )

పాలసీ యొక్క ప్రీమియం ఆన్లైన్ లో చెల్లిస్తే..

రెగ్యులర్ ప్రీమియం ( Regular ) పై    = Rs %2.5

లిమిటెడ్ ప్రీమియం ( Limited ) పై    = Rs 4.0%
సింగిల్ ప్రీమియం ( Single ) మీద      = Rs 3.0% వరకూ ప్రీమియం డిస్కౌంట్ పొందవచ్చు.

ఒకవేళ మీరు స్టేట్ బ్యాంకు లో ఉద్యోగం చేసే వ్యక్తి ఈ పాలసీని కనుక తీసుకొంటే అదనంగా మరొక 1.0% ఆన్లైన్ ప్రీమియం డిస్కౌంట్ లభిస్తుంది.

.

SBI Life eShield Next Telugu  Example – ఉదాహరణ

 

1. లైఫ్ కవర్  – ( Life Cover )

పాలసీ దారుని పేరు ( Name )              = Mr. కృష్ణ
కేటగిరీ ( Category )                                = చెడు అలవాట్లులేవు
వయసు ( Age )                                       = 25 సంవత్సరాలు
భీమా ( Bhima )                                       = 1 కోటి రూపాయలు
ప్రీమియం పేయింగ్ టర్మ్ ( PPT )       = రెగ్యులర్
ప్రీమియం చెల్లించే విధానం ( PPM ) = ప్రతినెలా
పాలసీ సమయం ( Policy Term )        = 35 సంవత్సరాలు
ప్రతినెల చెల్లించే ప్రీమియం ( MP )  = Rs 1,003/- ( GST తో కలిపి )

Mr. కృష్ణ కి 60 సంవత్సరాల వయసు వరకూ ఈ ప్లాన్ లో ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. పాలసీ సమయం మధ్యలో రిస్క్ జరిగితే సమ్ అస్సురెడ్  1 కోటి రూపాయలు నామినీ కి అందివ్వడం జరుగుతుంది. ఇక్కడ రిస్క్ సహజంగా జరిగినా లేకపోతే ఆక్సిడెంట్ వల్ల జరిగినా మొత్తం భీమా లభిస్తుంది.

 

Better Half – జీవిత భాగస్వామి ప్రీమియం

జీవిత భాగస్వామి పేరు ( Name )        = Mrs. రేవతి
కేటగిరీ ( Category )                               = చెడు అలవాట్లులేవు
వయసు ( Age )                                      = 22 సంవత్సరాలు
భీమా ( Bhima )                                      = 25  లక్షలు
ప్రీమియం పేయింగ్ టర్మ్ ( PPT )       = రెగ్యులర్
ప్రీమియం చెల్లించే విధానం ( PPM ) = ప్రతినెలా
పాలసీ సమయం ( Policy Term )        = 35 సంవత్సరాలు
ప్రతినెల చెల్లించే ప్రీమియం ( MP )  = Rs 36/-

 

2. ఇంక్రీజ్ లైఫ్ కవర్ – ( Increase Level Cover )

పాలసీ దారుని పేరు ( Name )                = Mr. అర్జున్
కేటగిరీ ( Category )                                  = చెడు అలవాట్లు లేవు
వయసు ( Age )                                         = 35 సంవత్సరాలు
భీమా ( Bhima )                                         = 1 కోటి రూపాయలు
ప్రీమియం పేయింగ్ టర్మ్ ( PPT )         = రెగ్యులర్
ప్రీమియం చెల్లించే విధానం ( PPM )   = ప్రతినెలా
పాలసీ సమయం ( Policy Term )         = 35 సంవత్సరాలు
ప్రతినెల చెల్లించే ప్రీమియం ( MP )    = Rs 2,345/- ( GST )

70 సంవత్సరాల వరకూ ఈ ప్లాన్ లో Mr. అర్జున్ కి కవరేజ్ లభిస్తుంది.ఈ ఆప్షన్ లో ప్రాథమిక భీమా ప్రతీ 5 సంవత్సరాలకి పెరుగుతూ ఉంటుంది.

అందువల్ల Mr. అర్జున్ కి ఏ దశలో రిస్క్ జరిగితే ఆ దశలో ప్రయోజనం లభిస్తుంది. ప్లాన్ యొక్క 20 వ సంవత్సరం రిస్క్ జరిగితే కోటి 40 లక్షలు,30 వ సంవత్సరం రిస్క్ జరిగితే కోటి 60 లక్షలు ఈ విధంగా సమయంతోపాటు ప్రయోజనం కూడా పెరుగుతుంది.

 

Better Half – జీవిత భాగస్వామి ప్రీమియం

పాలసీ దారుని పేరు ( Name )               = Mrs. ప్రభావతి
కేటగిరీ ( Category )                                 = చెడు అలవాట్లు లేవు
వయసు ( Age )                                        = 30 సంవత్సరాలు
భీమా ( Bhima )                                        = 25 లక్షలు
ప్రీమియం పేయింగ్ టర్మ్ ( PPT )         = రెగ్యులర్
ప్రీమియం చెల్లించే విధానం ( PPM )   = ప్రతినెలా
పాలసీ సమయం ( Policy Term )         = 35 సంవత్సరాలు
ప్రతినెల చెల్లించే ప్రీమియం ( MP )    = Rs.46/-

 

3. లైఫ్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ – ( Life Cover With Further Proofing )

పాలసీ దారుని పేరు ( Name )              = Mr. శాస్త్రి
కేటగిరీ ( Category )                                = చెడు అలవాట్లు లేవు
వయసు ( Age )                                       = 35 సంవత్సరాలు
భీమా ( Bhima )                                       = కోటి రూపాయలు
ప్రీమియం పేయింగ్ టర్మ్ ( PPT )       = రెగ్యులర్
ప్రీమియం చెల్లించే విధానం ( PPM ) = ప్రతినెలా
పాలసీ సమయం ( Policy Term )        = 35 సంవత్సరాలు
ప్రతినెల చెల్లించే ప్రీమియం ( MP )  = Rs 1,841/- ( GST తో కలిపి )

70 సంవత్సరాల వరకూ ఈ ప్లాన్ లో Mr. శాస్త్రి కి కవరేజ్ లభిస్తుంది కానీ పై ఆప్షన్ వలే భీమా, సమయం తోపాటు ఇంక్రీజ్ అవ్వదు. మీయొక్క అవసరాన్ని బట్టి వివాహం భీమాను పెంచుకోవచ్చు.

Mr. శాస్త్రి వివాహం తర్వాత 50% భీమాని తీసుకొంటే కోటి 50 లక్షలు, పిల్లలకి 25% చొప్పున తీసుకొంటే 2 కోట్ల రూపాయలు మరియు గృహ నిర్మాణ సమయంలో మరొక 50% భీమాగా 2 కోట్ల 50 లక్షలు గా తీసుకొన్నాడానుకొందాం!

కాబట్టి Mr. శాస్త్రి కి వివాహం తర్వాత రిస్క్ జరిగితే కోటి 50 లక్షలు, పిల్లలు జన్మించిన తర్వాత రిస్క్ జరిగితే 2 కోట్లు, గృహ నిర్మాణ సమయంలో రిస్క్ జరిగితే 2 కోట్ల 50 లక్షలు ఈ విధంగా రిస్క్ కవరేజ్ లభిస్తుంది.

 

Better Half – జీవిత భాగస్వామి ప్రీమియం

పాలసీ దారుని పేరు ( Name )             = Mrs. శ్యామల
కేటగిరీ ( Category )                               = చెడు అలవాట్లు లేవు
వయసు ( Age )                                      = 30 సంవత్సరాలు
భీమా ( Bhima )                                      = 25  లక్షలు
ప్రీమియం పేయింగ్ టర్మ్ ( PPT )       = రెగ్యులర్
ప్రీమియం చెల్లించే విధానం ( PPM ) = ప్రతినెలా
పాలసీ సమయం ( Policy Term )       = 35 సంవత్సరాలు
ప్రతినెల చెల్లించే ప్రీమియం ( MP ) = Rs45/-

 

• టాక్స్ ప్రయోజనం – ( Tax Benefits )

పాలసీలో చెల్లించే ప్రీమియం పై Sec 80c వర్తిస్తుంది కాబట్టి 1,50,000/- టాక్స్ డెడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్లాన్ లో క్లెయిమ్ అమౌంట్ పై 10D వర్తిస్తుంది టాక్స్ రహితంగా ప్రయోజనం లభిస్తుంది.

https://www.sbilife.co.in/

 

SBI life eShield Next Additional Riders :-

1. ఆక్సిడెంటల్ రైడర్ – ( Accidental Death Benefit Rider )

పాలసీదారునికి రిస్క్ ఆక్సిడెంట్ కారణం చేత జరిగితే ఈ రైడర్ ద్వారా అదనపు ప్రయోజనం లభిస్తుంది. 10 లక్షల రైడర్ నిమిత్తం నెలకి Rs 44/- రూపాయలు చెల్లించాలి.

2. డిసబిలిటీ రైడర్ – ( Accidental Total Permanent Disability Rider )

ఆక్సిడెంట్ లో ప్రాథమిక అవయవాలు కోల్పోయిన వ్యక్తి కి ఈ ప్రయోజనం వర్తిస్తుంది.10 లక్షల రైడర్ నిమిత్తం నెలకి Rs 44/- రూపాయలు చెల్లించాలి.

 

• గ్రేస్ పీరియడ్ – ( SBI Life eShield Next Telugu – Grace Period )

పాలసీ లో ప్రీమియం చెల్లించడానికి అదనపు సమయం. సంవత్సరానికి ఒకసారి మరియు 6 నెలలకి ఒకసారి ప్రీమియం చెల్లిస్తే 30 రోజులు అదేవిధంగా ప్రతీ నెల ప్రీమియం చెల్లిస్తే 15 రోజులు గ్రేస్ పెరియిడ్ లభిస్తుంది. ఈ సమయంలో పెనాల్టీ విధించబడదు అలాగే కవరేజ్ కూడా వర్తిస్తుంది.

 

• రివైవల్ ఫెసిలిటీ – ( Policy Revival )

5 సంవత్సరాలు. అనివార్య కారణం చేత ఎక్కువ కాలం పాలసీలో ప్రీమియం కట్టలేకపోతే 5 సంవత్సరాల లోపు మొత్తం ప్రీమియంని పెనాల్టీ తో కలిపి చెల్లించి మళ్ళీ ప్లాన్లో కొనసాగేలా రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది.

 

• ఫ్రీ లుక్ సమయం – ( SBI Life eShield Next Telugu )

 పాలసీ తీసుకొన్న తర్వాత పాలసీ యొక్క షరతులు మరియు నిబంధనలు వల్ల మీరు అసంతృప్తి చెందితే, SBI లైఫ్  ఆన్లైన్ లేదా సంస్థ ద్వారా ఖరీదు చేస్తే 30 రోజులు, ఇతర మాద్యమాల ద్వారా ఖరీదు చేస్తే 15 రోజులు ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో ప్రీమియం రిటర్న్ యాదవిధిగా లభిస్తుంది.

 

.లోన్ సదుపాయం – ( Loan Facility )

SBI Life eShield Next 100% ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్.

ఇతర ఎండోమెంట్ పాలసీల వలే పాలసీ సమయం మధ్యలో ఎటువంటి లోన్ అందివ్వడం జరగదు.

 

• సరెండర్ – ( Surrender )

పాలసీ సమయం మధ్యలో పాలసీని సరెండర్ చెయ్యడం కుదరదు,  అలాచేస్తే ప్రీమియం రిటర్న్ లభించదు.

 

• కావాల్సిన డాకుమెంట్స్ – ( Required Documents )

1. ప్రపోసల్ ఫారం    – Proposal Form
2. గుర్తింపు కార్డు        – Identity Proof
3. జన్మ ధ్రువీకరణ   – Date Of Birth
4. అడ్రస్ వివరాలు  – Address Proof
5. ఫోటోలు                  – Photos
6. మెడికల్                 – Medical Certificate
7. ఆదాయం              – Income Proof Certificate
8. ఉద్యోగులు            – Form 16
9. వ్యాపారస్తులు       – Income Tax Returns

ముగింపు ( Conclusion )

SBI life eShield Next Telugu ప్లాన్ కి సంబందించిన పూర్తి సమాచారం అందించానని భావిస్తున్నాము. మరిన్ని మంచి విషయాలకు ఇన్సూరెన్స్ మార్కెట్ తెలుగు. కామ్ ని సందర్శించండి. ధన్యవాదములు!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *