PNB Met Life Mera Term Plan Details Telugu
ముందుగా మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటో చూద్దాం!
PNB MetLife Term Plan భారతదేశంలోనే అగ్రగామి జీవిత బీమా సంస్థ గా PNB MetLife పేరు పొందినది. MetLife ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ LLC , పంజాబ్ నేషనల్ బ్యాంక్ లిమిటెడ్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్, M.Pallonji మరియు కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఇతర ప్రైవేట్ పెట్టుబడిదారుల వంటి సహకారంతో నడుస్తున్న మంచి చరిత్ర కలిగిన సంస్థ. ప్రపంచంలోని మార్గదర్శకం గా పేరు తెచ్చుకున్న బీమా కంపెనీలలో ఒకటైన మెట్‌లైఫ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మధ్య ప్రధాన కూటమిగా ఉండటం వలన బీమా రంగం మరియు ఆర్థిక రంగం రెండింటిలోనూ నైపుణ్యం ఉంది.
PNB MetLife India Insurance Co.Ltd యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో మరియు దాని కార్పొరేట్ కార్యాలయం గుర్గావ్‌లో ఉంది. ఇది భారతదేశంలో 2001 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ PNB MetLife India Insurance Co.Ltd సంస్థ భద్రత మరియు పదవీ విరమణ కోసం అనేక రకాల పధకాలను అందిస్తుంది.
PNB మెట్‌లైఫ్ మేరా టర్మ్ ప్లాన్ ఒక నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ( Non Linked Non Participated ).
మానవ జీవితం చాలా అనూహ్యమైనది. మీరు లేనప్పుడు మీ కుటుంబం సౌకర్యం కోసం మరియు కన్న వారి కలలను నిజం చేసుకునేందుకు, PNB MetLife మేరా టర్మ్ ప్లాన్ బాగా సరిపోతుంది. ఇది టైలర్-మేడ్ ప్రొటెక్షన్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఇది నాలుగు రకాల హామీ చెల్లింపు ఎంపికల కలిగి ఉంటుంది. అందుకే వాటిని ఎంచుకోవడానికి మీకు సౌలభ్యాన్ని ఇస్తుంది. PNB MetLife మేరా టర్మ్ ప్లాన్ లో మీ జీవిత భాగస్వామికి కవరేజీని కూడా అందిస్తుంది. అందుకే ఇది ఆన్‌లైన్ పాకెట్-ఫ్రెండ్లీ ప్లాన్ గా ఆదరణ పొందినది.
PNB MetLife Term Plan ప్లాన్ ప్రయోజనాలు – (Benefits )
డెత్ బెనిఫిట్ ( Death Benefit )
బీమా చేసిన వ్యక్తి మరణించినప్పుడు, పాలసీ అమల్లో ఉంటూ మరియు యాక్టివ్‌గా ఉన్నట్లయితే, PNB మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మీ నామినీకి బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. PNB మెట్‌లైఫ్ మేరా టర్మ్ ప్లాన్ ప్రత్యేకంగా మీకు 4 రకాల మరణ ప్రయోజనాల ఎంపికలను (ఆప్షన్స్) అందిస్తుంది:
1. లంప్సమ్ ఎంపిక ( Lump Sum Payment On Death )
పాలసీ దారునికి అనుకోని దుర్ఘటన ఎదురైనప్పుడు, పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా ఏకమొత్తంలో ఒకేసారి నామినీకి ప్రాథమిక భీమా (Sum assured) మొత్తాన్ని అందిస్తుంది.
2. కుటుంబ ఆదాయ ఎంపిక ( Lump Sum + Monthly Income for 10 Years )
ఇందులో వ్యక్తి కి రిస్క్ జరిగిన వెంటనే నామినీకి ప్రాథమిక భీమాలో 50% మొత్తాన్ని ఏకమొత్తం రూపంలో చెల్లిస్తుంది మరియు మిగిలిన 50% అమౌంట్ ను 10 సంవత్సరాల పాటు నెలవారీ వాయిదాలలో బ్యాలెన్స్ మొత్తాన్ని అందిస్తుంది.
3. కుటుంబ ఆదాయాన్ని పెంచే ఎంపిక ( Lump Sum + Increasing Monthly Income For 10 Years )
ఈ ఆప్షన్ లో నామినీకి ప్రాథమిక మొత్తంలో 50% మొత్తాన్ని ఒకేసారి అందజేస్తుంది మరియు రాబోయే 10 సంవత్సరాల వరకు, నెలవారీ ఆదాయాన్ని ఏడాదికి 12% చొప్పున అందిస్తుంది.
4. చైల్డ్ బెనిఫిట్ ఎంపిక ( Lump Sum + Monthly Income Till Child ages 21)
పాలసీదారునికి మరణం సంభవించినప్పుడు భీమా క్లెయిమ్ మొత్తంలో 50%కి సమానమైన మొత్తంను అందిస్తుంది మరియు మీ బిడ్డకు 21 ఏళ్లు వచ్చే వరకు సాధారణ స్థాయి నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది.
1. జీవిత దశల ప్రయోజనాన్ని ఉపయోగించి, పాలసీదారుడు ఎటువంటి వైద్య పరీక్ష లేకుండానే ప్రస్తుత వయస్సు ప్రకారం అదనంగా కొనుగోలు చేయవచ్చు.
2. పాలసీదారుడు మరియు జీవిత భాగస్వామితో పాటు కవర్ చేయబడిన ఉమ్మడి లైఫ్ కవరేజ్ ను అందిస్తుంది.
• టాక్స్ ప్రయోజనాలు – Tax Benefits
పన్ను ప్రయోజనాలు: ఆదాయపు పన్ను చట్టం కింద సెక్షన్ 80C మరియు 10(10D) ప్రకారం, క్రమం తప్పకుండా చెల్లించిన ప్రీమియంలకు పన్ను ప్రయోజనాలను అందిస్తుంది.
ప్రీమియం చెల్లింపు: సాధారణ మరియు పరిమిత ప్రీమియం చెల్లింపు వ్యవధి కోసం నెలవారీ లేదా వార్షికంగా ఈ ప్లాన్ కోసం ప్రీమియంలను చెల్లించే సౌకర్యాన్ని అందిస్తుంది.
• రివైవల్ సదుపాయం – Policy Revival
ఏదైనా కారణంగా ఎక్కువ కాలం ప్రీమియo చెల్లించకపొతే పాలసి ముగిసిపోతుంది .అటువంటి సమయంలో మొత్తం ప్రీమియంని పెనాల్టీతో కలిపి చెల్లించేలా 5 సంవత్సరాలు పాలసీ రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది.
• ఫ్రీ లుక్ పీరియడ్ – Free Look Period
పాలసీకి సంబందించిన నియమనిబంధనలు పై పాలసీదారుడు అసంతృప్తి చెందినట్లైతే 30 రోజుల్లోపు పాలసీని మూసివేసి చెల్లించిన ప్రీమియంని యధావిదిగా వెనక్కి పొందవచ్చు.
• పాలసీని తీసుకోవడానికి అర్హులు – PNB MetLife Term Plan Eligibility
Eligibility | Minimum | Maximum |
Age At Entry | 18 Years | 65 Years |
Policy Term | 10 Years | 40 Years |
Sum Assured | 10 Lakh | No Limit |
Premium Paying Term | Limited , Single | Regular |
Premium Mode | Monthly | Yearly ( Depends On ) |
టేబుల్ వివరాలు క్లుప్తంగా !
.పాలసీ తీసుకొవడానికి కనీస వయస్సు( Minimum Age ) = 18 Years
అత్యధిక వయస్సు (maximum Age ) వచ్చి = 65 Years
• పాలసీ సమయం – Policy Term
కనీస పాలసీ సమయం 10 సం||రాలు, అత్యధిక పాలసీ సమయం 40.
99 – ప్రస్తుత వయసు.
అంటే 30 సం ||ల వ్యక్తి అత్యధికముగా ఈ పాలసీని 69 సంవత్సరాల వరకు తీసుకొనే వీలుంటుంది.
99 Years – 30 Years = 69 Years అన్నమాట.
• భీమా పరిమితులు? – Sum Assured
కనీస భీమా పరిమితి = Rs 10 లక్షలు
అత్యధిక భీమా పరిమితి = అవధి లేదు
• గరిష్ట మెట్యూరిటీ సమయం ? – Maximum Maturity Age
ఈ పాలసీయొక్క అత్యధిక మెట్యూరిటీ కాల పరిమితి 99 సం||లుగా ఉంటుంది.
• ప్రీమియం ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి? – Premium Paying Term
Premium Mode – ప్రీమియం మోడ్
1. సింగల్ ప్రీమియం – Single Premium
మొత్తం పాలసీ లో కేవలం ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లించవచ్చు.
2. లిమిటెడ్ ప్రీమియం – Limited Premium
a .లిమిటెడ్ పే 5 సంవత్సరాలు ( Limited Pay for 5 Years ) – కేవలం 5 సంవత్సరాలు మాత్రమే చెల్లించడం.
b. లిమిటెడ్ పే 10 సంవత్సరాలు ( Limited Pay for 10 Years ) – కేవలం 10 సంవత్సరాలు మాత్రమే చెల్లించడం.
c.లిమిటెడ్ పే 15 సంవత్సరాలు ( Limited Pay for 15 Years ) – కేవలం 15సంవత్సరాలు మాత్రమే చెల్లించడం.
d.. లిమిటెడ్ పే 20 సంవత్సరాలు ( Limited Pay for 20 Years ) – కేవలం 20 సంవత్సరాలు మాత్రమే చెల్లించడం.
e. స్టిల్ పే 60 ఇయర్స్ ( still pay up to 60 Years ) – అంటే పాలసీ దారునికి 60 సంవత్సరాలు వచ్చే వరకూ.
3. రెగ్యులర్ ప్రీమియం – Regular Premium
ఎంతకాలం పాలసీని తీసుకొంటే అంతకాలం ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.కాబట్టి మీ అవసరానికి కి అనుగుణంగా ప్రీమియం సమయం నిర్ణయించుకోవచ్చు.
• ప్రీమియం చెల్లింపులు – Premium Paying Mode
సంవత్సరానికి ఒకసారి ( Yearly)
ప్రతినెలా ( Monthly )
రైడర్స్ ( RPNB MetLife Term Plan Riders ):-
ఈ రైడర్‌లు మీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను, సరసమైన ధరలతో అభివృద్ధి పరుస్తాయి అందుబాటులో ఉన్న రైడర్‌లు పరిశీలించండి.
1. మెట్‌లైఫ్ క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ – Critical illness Rider
పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొన్న విధంగా ఫస్ట్ హార్ట్ ఎటాక్ – లేదా క్యాన్సర్ న వంటి 2 క్లిష్ట అనారోగ్యాలలో, దేనినైనా నిర్ధారించిన తర్వాత జీవిత బీమా తీసుకున్న వ్యక్తి 30 రోజుల పాటు జీవించి ఉన్నట్లయితే, ఈ ప్లాన్ బీమా మొత్తానికి సమానమైన మొత్తాన్ని అందిస్తుంది.క్యాన్సర్ మరియు గుండెపోటు నుండి అదనపు రక్షణను అందిస్తుంది.
రైడర్ భీమా మొత్తం చెల్లించిన తర్వాత లేదా రైడర్ యొక్క పాలసీ టర్మ్ పూర్తయిన తర్వాత, రైడర్ ఆటోమేటిక్ గా రద్దు చేయబడుతుంది.
బేస్ ఇన్సూరెన్స్ పాలసీ కింద అదనపు కవర్‌తో రక్షణను అందిస్తుంది మరియు విభిన్న అవసరాలను తీర్చడానికి భీమా మొత్తాన్ని ఎంపిక చేసుకోవడానికి సౌకర్యం కలదు.
2. మెట్ లైఫ్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ – Accidental Death Benefit Rider
కనీస ప్రవేశ వయస్సు 18 సంవత్సరాలు గరిష్ట ప్రవేశ వయస్సు 65 సంవత్సరాలు.
మెచ్యూరిటీ వయస్సు 70 సంవత్సరాలు.
పాలసీ వ్యవధి 5 – 30 సంవత్సరాలు.
పాలసీదారుడు ప్రమాదం కారణంగా మరణిస్తే నామినీకి అదనపు మొత్తం చెల్లించబడుతుంది.
చాలా తక్కువ నామమాత్రపు రేటుతో ప్రీమియంను అందిస్తుంది మరియు బేస్ పాలసీ కింద కవరేజీకి అదనపు రక్షణను అందిస్తుంది.
వివిధ అవసరాలకు అనుగుణంగా ఈ రైడర్ ద్వారా భీమా మొత్తాన్ని అందిస్తుంది.
3. మెట్‌లైఫ్ యాక్సిడెంటల్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్ – Accidental Disability Benefit Rider
కనీస ప్రవేశ వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట ప్రవేశ వయస్సు 65 సంవత్సరాలు.
మెచ్యూరిటీ వయస్సు 75 సంవత్సరాలు.
పాలసీ వ్యవధి 10 – 40 సంవత్సరాలు.
చాలా తక్కువ రేటుకు సరసమైన ప్రీమియంను అందిస్తుంది.
జీవితంలో వివిధ అవసరాలను తీర్చడానికి భీమా మొత్తాన్ని ఎంచుకోవడానికి సౌకర్యం అందిస్తుంది.
బేస్ ప్లాన్ ప్రకారం పాలసీ తీసుకునే సమయంలో లేదా పాలసీ వార్షికోత్సవం సందర్భంగా ఈ రైడర్‌ను ఎంచుకోవచ్చు.
జీవిత బీమా చేసిన వ్యక్తి ప్రమాదానికి గురైతే, ప్రమాదం జరిగిన తేదీ నుండి 180 రోజులలోపు వైకల్యాలు ఏర్పడితే,ఈ రైడర్ వ్యక్తి కి ప్రయోజనాన్ని అందిస్తుంది.
4. మెట్‌లైఫ్ సీరియస్ ఇల్‌నెస్ రైడర్ – ( Met Life Serious Illness Rider )
కనీస ప్రవేశ వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట ప్రవేశ వయస్సు 65 సంవత్సరాలు.
మెచ్యూరిటీ వయస్సు 70 సంవత్సరాలు.
పాలసీ వ్యవధి 5 – 30 సంవత్సరాలు.
కంపెనీ నిర్దారించిన 10 రకాల అనారోగ్యాల లిస్ట్ ప్రకారం, పాలసీదారుడు అనారోగ్యానికి గురైతే ఈ రైడర్ ద్వారా ట్రీట్మెంట్ లభించడం జరుగుతుంది.
వీటిని కూడా చదవండి
Max life Smart Secure Plus Plan in Telugu & అద్భుతమైన పాలసీ 100% ప్రీమియం రిటర్న్ &
LIC Tech Term Plan Telugu 854ఎల్ .ఐ . సి లోనే అతి చవకైన పాలసీ& , రోజుకి 40 రూ//లకే కోటి రూపాయల భీమా
ఉదాహరణ – Met Life Mera Term Plan Example
30 సంవత్సరాల వయసు గల Mr. సూరజ్ కోటి రూపాయల భీమాను 40 సంవత్సరాల పాలసీ సమయానికి నిర్ణయం చేసుకొంటే వార్షిక ప్రీమియం రూపంలో Rs 11,000/- సుమారు ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.
ఏ ఆప్షన్ లో ప్రయోజనం ఏ విధంగా లభిస్తుంది?
1. లంప్సమ్ ఎంపిక ( Lump Sum Payment On Death )
Mr. సూరజ్ కి అనుకోని కారణం చేత రిస్క్ జరిగితే , పాలసీకి సంబందించిన భీమా కోటిరూపాయలు ఒక్కసారే నామినీకి (Sum assured) అందిస్తుంది తర్వాత ప్లాన్ క్లోజ్ చేయబడుతుంది.
2. కుటుంబ ఆదాయ ఎంపిక ( Lump Sum + Monthly Income for 10 Years )
ఇందులో వ్యక్తి కి రిస్క్ జరిగిన వెంటనే నామినీకి ప్రాథమిక భీమాలో 50% మొత్తాన్ని అంటే 50 లక్షలు ఏకమొత్తంలో చెల్లిస్తుంది మరియు మిగిలిన 50% అమౌంట్ ను 10 సంవత్సరాల పాటు నెలవారీ వాయిదాలలో అందివ్వడం జరుగుతుంది సుమారుగా నెలకు Rs 50,000/-లభిస్తాయి.
3. కుటుంబ ఆదాయాన్ని పెంచే ఎంపిక ( Lump Sum + Increasing Monthly Income For 10 Years )
ఈ ఆప్షన్ లో నామినీకి ప్రాథమిక మొత్తంలో 50% మొత్తాన్ని 50 లక్షలు ఒకేసారి అందజేస్తుంది మరియు రాబోయే 10 సంవత్సరాల వరకు, నెలవారీ ఆదాయాన్ని ఏడాదికి 12% చొప్పున సుమారుగా Rs 60,000/- అందిస్తుంది.
4. చైల్డ్ బెనిఫిట్ ఎంపిక ( Lump Sum + Monthly Income Till Child ages 21)
పాలసీదారునికి మరణం సంభవించినప్పుడు 50 లక్షల భీమా వెంటనే అందిస్తుంది మరియు మీ బిడ్డకు 21 ఏళ్లు వచ్చే వరకు సాధారణ స్థాయి నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది.దీని కొరకు కింద పట్టిక గమనించగలరు.
లైఫ్ స్టేజ్ – Life Stage Benefits
అప్పటి వయసు, ప్రీమియం మరియు ఎటువంటి మెడికల్ టెస్టులు నిర్వహించకుండానే పాలసీదారుడు ఈ క్రింద ప్రయోజనాలు పొందవచ్చు.
1. స్టెప్ అప్ ( Step Up)
పాలసీ కొంత సమయం కొనసాగిన తర్వాత ప్రాథమిక భీమా ను, అదనపు ప్రీమియం చెల్లెస్తూ పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా మార్చుకోవచ్చు.
2. లైఫ్ స్టేజ్ ( Life Stage )
• పాలసీదారుని వివాహ అనంతరం ప్రాథమిక భీమా పై 50% లేదా అత్యధికముగా Rs 50,00,000/- భీమా ఇంక్రిస్ చేసుకోవచ్చు.
• మొదటి సంతానం జన్మించిన తర్వాత 25% ప్రాథమిక భీమా లేదా అత్యధికముగా Rs 25,00,000/- మరియు రెండవ సంతానం జన్మించిన తర్వాత మరొక Rs 25,00,000/- భీమా పెంచవచ్చు.
జాయింట్ లైఫ్ కవరేజ్ – Joint Life Coverage
పాలసీదారులు అతడు / ఆమె, జీవిత భాగస్వామికి అతడు / ఆమె కి అత్యధికముగా 50 లక్షలు వరకు భీమా సదుపాయం కల్పించవచ్చు దీని ద్వారా ఇద్దరూ కవర్ చేయబడతారు.
ఈ ఆప్షన్ లో మొదటి వ్యక్తి కి రిస్క్ జరిగితే అతనికి సంబందించిన మొత్తం భీమా రెండవ వ్యక్తి కి అందివ్వడం జరుగుతుంది మరియు ప్లాన్ లో భవిష్యత్ ప్రీమియం మాఫీ.దీనితోపాటుగా రెండవ వ్యక్తి కి రిస్క్ జరిగితే ఆ భీమా నామినీకి చెల్లించడం ద్వారా పాలసీ క్లోజ్ చేయబడుతుంది.
• కావాల్సిన డాకుమెంట్స్ గురించి తెలుసుకొందాం! (PNB MetLife Term Plan Documents?)
1. Proposal Form
పాలసీ తీసుకొనే వ్యక్తి ముందుగా పోరపోసల్ ఫారం నింపాలి.
2. Identity Proof
• ఆధార్ కార్డు
• పాస్ పోర్ట్ ( ఏదో ఒక్కటి మాత్రమే )
3. Age Proof & Address Proof
1.Date of Birth Certificate
2. Current Bill
3. Telephone Bill
4. Adar Card
( ఏదో ఒక్కటి మాత్రమే )
5. Recent Pass Port Size Photos
ఈ మధ్యనే తీసుకొన్న రెండు పాసుపోర్టు ఫోటోలు.
6. Medical Report Certificate : ఆరోగ్య సర్టిఫికెట్
టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొనేవారికి మెడికల్ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే పాలసీలో ప్రీమియం నిర్ణంచడం జరుగుతుంది. దీనికి యూరిన్ టెస్ట్ ( Urinary Test )తప్పనిసరిగా నిర్వహిస్తారు. పాలసీదారుడు కి సిగరెట్, మందు వ్యాసనాలు ఉన్నట్లయితే పాలసీలో చెల్లించవలసిన ప్రీమియం కొద్దిగా ఎక్కువ ఉంటుంది లేకపోతే సాధారణ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.
7. Income Proof : ఆదాయం రసీదు
ఇది కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొనే వారికి మాత్రమే. అయితే కొన్ని పాలసీల్లో తీసుకొనే భీమా ఆధారంగా ఆదాయం చూపించవలసి ఉండవచ్చు.
గవర్నమెంట్ ఉద్యోగులకి
• ఫారం 16 -Form 16
• చివరి 3 నెలల ఆదాయపు కాగితం (Latest 3 Months Salary Pay Slip )సబ్మిట్ చెయ్యాలి.
ఒకవేళ వ్యాపారస్తులు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలానుకొంటే ఇన్కమ్ టాక్స్ ఫైల్ రిటర్న్స్ ( ITR) ఖచ్చితంగా జమా చెయ్యాలి.
PNB MetLife Term Plan ప్రశ్నలు – Questions & Answers
1. నేను PNB MetLife టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
జ. PNB మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ నమ్మకమైన జీవిత బీమా ప్రదాత. ఇది FY 2019-20లో 97.18% అద్భుతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని కలిగి ఉంది. పాలసీదారులకు 85 ఏళ్ల వరకు అందుబాటులో ఉండేలా అధిక దీర్ఘకాలిక కవరేజీని అందించడం దీని మరో విశేషం.
2. నేను ధూమపానం లేదా పొగాకు వాడుతున్నట్లయితే నేను PNB MetLife టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కవరేజ్ పొందవచ్చా?
జ. అవును, అయితే, స్మోకర్ యొక్క ప్రీమియం రేట్లు నాన్-స్మోకర్ రేట్లతో పోలిస్తే ఎక్కువ.
3. PNB మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క టోల్-ఫ్రీ కస్టమర్ కేర్ నంబర్ ఏమిటి?
జ. PNB మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క 24×7 సౌకర్యం తో టోల్-ఫ్రీ నంబర్ 1800-425-6969.
4. నేను నా పాలసీ స్టేటస్ ను చెక్ చేయడం ఎలా?
జ: మీరు ఇ-పోర్టల్‌లో మీ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ కావడం ద్వారా మీ పాలసీ స్థితిని చెక్ చేయవచ్చు.
5. PNB మెట్‌లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల కోసం క్లెయిమ్‌ను సెటిల్ చేయడానికి ప్రాసెస్ ఏమిటి?
జ: కంపెనీకి పాలసీకి చెందిన క్లెయిమ్ పాలసీ గురించి లెటర్, ఫ్యాక్స్ లేదా ఇమెయిల్ ద్వారా కంపెనీకి తెలియజేయాలి.
1. నేరుగా PNB మెట్‌లైఫ్ బ్రాంచ్ ఆఫీసుల ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు.
2. ప్రధాన కార్యాలయంలో దావాల విభాగం మీ సమస్యలను పరిష్కరిస్తుంది.
3. ప్రాంతీయ సేవా బృందం ద్వారా కూడా క్లైయిమ్ చేయ వచ్చు.
4.ముఖ్యంగా, అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన తర్వాత మరియు వాటిని ధృవీకరించబడిన తర్వాత, క్లెయిమ్‌లు అందుకున్న 30 రోజులలోపు పరిష్కరించబడతాయి.