LIC IPO Telugu – షేర్ కనుగోలు చెయ్యాలంటే వెంటనే ఈ పని పూర్తి చెయ్యండి, అతి త్వరలో రానుంది దేశంలోనే అతి పెద్ద IPO.

                      LIC IPO Details In Telugu

LIC IPO Telugu 
ఇంటివద్ద నుంచే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి అతి తక్కువ సమయంలో ఎక్కువ ప్రాఫిట్ ను పొందాలంటే ఐ. పి. ఓ  లో (IPO) అమౌంట్ ఇన్వెస్ట్ చేసి పొందవచ్చు.  ఐ. పి. ఓ ( IPO ) అంటే ఇనిసియల్ పబ్లిక్ ఆఫరింగ్ ( Initial Public Offering ), ఏదైనా కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వడానికంటే ముందే కంపనీ IPO ఆఫర్ చేస్తుంది అందువల్ల సాధారణ వ్యక్తులు కూడా IPO ద్వారా మంచి ప్రాఫిట్ పొందవచ్చు.
LIC IPO - షేర్ కనుగోలు చెయ్యాలంటే వెంటనే ఈ పని పూర్తి చెయ్యండి, అతి త్వరలో రానుంది దేశంలోనే అతి పెద్ద IPO.

భారతదేశంలోనే LIC అతి పెద్ద అసెట్ మేనేజర్, 65 సంవత్సరాలకి పైగా ప్రజలకు జీవిత భీమా అందిస్తూ వస్తుంది. 2020 – 21 వార్షికంలో LIC ఆస్తుల  విలువ అక్షరాల $ 463 బిలియన్లు అంటే సుమారు 38 లక్షల కోట్లు ( గవర్నమెంట్ మొత్తం దేశానికీ ఒక ఆర్థిక సంవత్సరంలో అందించే బడ్జెట్ కంటే ఎంతో ఎక్కువ ). LIC జీవిత భీమా ప్రపంచ వ్యాప్తంగా 5 వ స్థానంలో ఉంది.

స్టాక్ మార్కెట్ లో భారతదేశం యొక్క మొత్తం ఈక్వయిటీ పెట్టుబడి,  దేశ పెట్టుబడిలో 7.62% ఉంది అంతేకాకుండా ఇప్పటివరకు 21 మిలియన్ పాలసీలను LIC కస్టమర్ల కి అందించింది అంతే కాకుండా ఇప్పటికే పాలసీలు కనుగోలు చేసిన కస్టమర్లకి స్పెషల్ బెనిఫిట్ రూపంలో 10% వాటాను ప్రకటించడం జరిగింది.

 

• LIC  కంపెనీ IPO తేవడానికి కారణాలు – ( Reasons Of IPO )

కంపెనీలు తమ ఆర్థిక అభివృద్ధిని మెరుగు పరచడం కొరకు, కొత్త ప్రోడక్ట్ నిర్మాణం కొరకు, బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించేందుకు లేదా మరేఇతర  చిన్న కంపెనీని కనుగోలు చేయడం కొరకు కంపెనీలు IPO తీసుకొస్తాయి.

• IPO ద్వారా కలిగే ప్రయోజనం – Benefits Of IPO

కంపెనీలో కొంత భాగాన్ని, దీన్నే షేర్ ( Small Part Of Company ) అంటారు. దీన్ని సేల్ చేసి కంపెనీ తనకు కావాల్సిన డబ్బును సమకూర్చుకొంటుంది.

ఉదాహరణ కు Mr. శ్యామ్ కంపెనీ విలువ వచ్చి సుమారు 100 కోట్లు, కంపెనీ అభివృద్ధి కొరకు మరొక 10 కోట్లు అవసరం. ఈ అమౌంట్ ని Mr. శ్యామ్ బ్యాంకు లో లోన్ ద్వారా పొందవచ్చు, గవర్నమెంట్ బాండ్స్ ద్వారా అమౌంట్ సంపాదించవచ్చు. కానీ Mr. శ్యామ్ పై రెండు విధానాలు కాకుండా కంపెనీ లో 10% వాటాను అంటే 10 కోట్ల రూపాయల విలువైన బాగాన్ని షేర్స్ రూపంలో విభజించడం జరిగింది. ఈ విధంగా విభజించబడిన షేర్స్ ను IPO ద్వారా మనం కనుగోలు చేస్తాం.

దీని ద్వారా రెండు ప్రయోజనాలు

1. Mr. శ్యామ్ కి వారం రోజుల వ్యవధిలోనే 10 కోట్లు లభించాయి.
2.మనం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్  చెయ్యడం కొరకు IPO లభించింది.

 

వీటిని కూడా చదవండి !

LIC SIIP 852 Plan Details In Telugu &   అద్భుతమైన రిటర్న్స్ అందించే LIC స్టాక్ మార్కెట్ ప్లాన్, పూర్తి వివరాలు!!

• కంపెనీ IPO ని ఎలా అప్లై చేస్తుంది? ( How to Apply LIC  IPO Telugu )

 

ఏదైనా కంపెనీ IPO అప్రూవల్ పొందడం అనేది అంత సులభం  అయిన పని కాదు చాలా కంప్లీకేటెడ్ ప్రాసెస్. IPO ను SEBI మేనేజ్ చేస్తుంది, SEBIఅంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు అఫ్ ఇండియా ( Securities And Exchange Board Of India ).

దేశంలో బ్యాంకు లను రిజర్వు బ్యాంకు ( RBI ) , ఇన్సూరెన్స్ ను IRDAI ( Insurance Regulatory and Development Authority Of India )ఏ విధంగా నిర్వహిస్తున్నాయో అలాగే SEBI స్టాక్ మార్కెట్, ముట్యుయల్ ఫండ్స్ మరియు IPO లను మేనేజ్ చెయ్యడం జరుగుతుంది.

కంపెనీ IPO అప్రూవల్ పొందడం కొరకు డాకుమెంట్స్ ని SEBI కి సబ్మిట్ చేస్తుంది, వాటిలో కంపెనీ యొక్క ఆర్థిక లావాదేవీలు, భవిష్యత్ లక్ష్యాలు, IPO ఉద్దేశ్యం స్పష్టంగా తెలియచేయబడతాయి. ఈ మొత్తం ప్రాసెస్ ను షేర్ మార్కెట్ పరి భాషలో డి. ఛ్. ర్. పి.( DHRP Draft and Hearing Prospects ) అంటారు.

IPO అప్లై చేసిన తర్వాత అప్రూవల్ కొరకు కంపెనీ కి 3 నెలల నుంచి అత్యధికముగా 2 సం||లు సమయం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.

 

 

• IPO ఇష్యూ పీరియడ్ – IPO Issue Period

కంపెనీ కి IPO లభించిన 3 నుంచి 10 రోజుల లోపు మాత్రమే మీరు షేర్స్ ను ఖరీదు చెయ్యగలరు,ఈ సమయం దాటితే వీలుపడదు.దీన్నే IPO ఇష్యూ పీరియడ్ అంటారు.

ఉదాహరణ :-

జియో కంపెనీ అధికారిక విలువ Rs 1,000/- కోట్ల రూపాయలు అనుకొందాం! 10% వాటాను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చెయ్యడానికి నిర్ణయం చేసుకొని, ఒక కోటి షేర్లను, ఒక్కో షేర్ విలువ Rs 1,000/- రూపాయలుగా డిక్లేర్ చేసిందనుకొందాం.

IPO లో షేర్స్ బండల్ లేదా లాట్ గా లభిస్తాయి వీటి విలువ సుమారు Rs 15,000/-. అయితే ఇక్కడ ఒక లాట్ లేదా బండల్ లో ఎన్ని షేర్లు లభిస్తాయన్నది షేర్ వాల్యూ పై ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణ కి ఒక షేర్ విలువ

1. Rs 500/-       = 30 షేర్స్,
2. Rs 1,000/-    = 15 షేర్స్,
3. Rs 2,000/-    =  07 షేర్స్ ఈ విధంగా లభించడం జరుగుతుంది.

https://eterm.licindia.in/

• IPO ఎలా అప్లై చెయ్యాలి? ( How to Apply IPO )

IPO అప్లై చెయ్యడానికి మీ దగ్గర ఏదో ఒక Angle Broking, D Mart అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి, IPO నేరుగా ఆన్లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో  అప్లై చెయ్యచ్చు.అంతే త్వరలో LIC IPO తారీకు ను ప్రకటించనుంది ఈ లోగ అన్ని సిద్ధం చేసుకొని రెడీగా ఉండండి.

Conclusion – ముగింపు

ఇన్సూరెన్స్ మార్కెట్ తెలుగు. కామ్ ని సందర్శించి నందుకు ధన్యవాదములు! ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ మరియు గవర్నమెంట్ పధకాల వివరాల కొరకు విచ్చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *