Atal Pension Yojana ( APY ) Scheme Details In Telugu
Atal Pension Yojana ( APY ) Telugu
. అటల్ పెన్షన్ యోజన అంటే ఏమిటి?- ( What is APY )
అటల్ పెన్షన్ యోజన అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక సామాజిక భద్రతా పథకం. భారతదేశంలోని పౌరులందరికీ 60 సంవత్సరాల వయస్సు తర్వాత స్థిరమైన ఆదాయాన్ని అందించడమే అటల్ పెన్షన్ యోజన లక్ష్యంగా ఉంటుంది. ఇది ప్రధానంగా అసంఘటిత రంగంలో పని చేసేవారు, డెలివరీ బాయ్స్, తోటమాలి మొదలైన వ్యక్తులపై దృష్టి పెట్టిన ఒకవిధమైన పెన్షన్ స్కీమ్.
ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే, ఏ భారతీయ పౌరుడూ తమ వృద్ధాప్యంలో ఆకస్మిక అనారోగ్యం, ప్రమాదాలు లేదా దీర్ఘకాలిక వ్యాధుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. అసంఘటిత రంగం, ప్రైవేట్ రంగ ఉద్యోగులు మరియు పెన్షన్ ప్రయోజనాన్ని అందించని సంస్థతో పనిచేస్తున్న వారికి మాత్రమే ఈ పథకం లబ్ధి కలిగిస్తుంది.
• అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలు – ( APY Scheme Benefits )
1. వృద్ధాప్యంలో ఆదాయ వనరుగా సౌకర్యం ( Old Age Support )
వ్యక్తులు 60 ఏళ్లకు చేరుకున్న తర్వాత వారికి స్థిరమైన ఆదాయం అందించబడుతుంది. అంటే వృద్ధాప్యంలో సర్వసాధారణంగా వాడే మందులు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ఆర్థికంగా సహాయపడుతుంది.
2. ప్రభుత్వ- హామీ పెన్షన్ పథకం ( Government Guarantee )
ఈ పెన్షన్ స్కీమ్‌కు భారత ప్రభుత్వం మద్దతు ఇస్తుంది మరియు పెన్షన్ ఫండ్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (PFRDA) చే నియంత్రించబడుతుంది. కాబట్టి, ప్రభుత్వం వారి పెన్షన్‌కు భరోసా ఇస్తున్నందుకు వ్యక్తులు నష్టపోయే ప్రమాదం లేదు.
3. అసంఘటిత రంగానికి చేయూత ( Middle Class Benefit )
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వ్యక్తుల ఆర్థిక సమస్యలను తగ్గించే ఉద్దేశ్యంతో ఈ పథకం ప్రధానంగా ప్రారంభించబడింది. ఈ పధకం వారి తర్వాతి సంవత్సరాల్లో ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేలా చేస్తుంది.
• అటల్ పెన్షన్ ఆటోమేటిక్ డెబిట్? – ( APY Auto Debit )
అటల్ పెన్షన్ యోజన యొక్క ప్రాథమిక సౌకర్యాలలో ఈ ఆటోమేటిక్ డెబిట్ సౌకర్యం ముఖ్యమైనది. లబ్ధిదారుని బ్యాంక్ ఖాతా, అతని పెన్షన్ ఖాతాతో అనుసంధానం చేయబడి ఉంటుంది. కాబట్టి నెలవారీ చెల్లింపులు నేరుగా డెబిట్ చేయబడతాయి. ఐతే వారి ఖాతాలో తగినంత బ్యాలెన్స్ అమౌంటు ఉండేవిధంగా చూసుకోవాలి. ఒకవేళ అమౌంటు లేకపోతే పెనాల్టీ విధించబడుతుంది.
APY Scheme Important Benefits
• APY కాంట్రిబ్యూషన్ పెంచుకునే సౌకర్యం? – ( APY Contribution )
ఒక వ్యక్తి 60 ఏళ్లు నిండిన తర్వాత అందుకునే పెన్షన్ మొత్తం వారి యొక్క కాంట్రిబ్యూషన్ ద్వారా నిర్ణయించబడుతుంది. వివిధరకాల పెన్షన్ పొందడానికి సమానమైన వివిధరకాల డిపాజిట్ లు అందుబాటులో ఉంటాయి.
అధికంగా పెన్షన్ మొత్తాన్ని పొందడానికి, ఆయావ్యక్తులు , వారి ఆర్థిక సామర్థ్యం ద్వారా తమ పెన్షన్ ఖాతాకు పెద్ద మొత్తంలో కాంట్రిబ్యూషన్ అందించవచ్చు. ఈ పనిని సులభతరం చేయడానికి, కార్పస్ మొత్తాన్ని మార్చడానికి ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి ప్రీమియం అమౌంట్ పెంచడానికి మరియు తగ్గించుకోవడానికి అవకాశం కలిపిస్తుంది.
• అటల్ పెన్షన్ రకాలు ? – ( Atal Pension Yojana ( APY )
పథకం యొక్క లబ్ధిదారులు రూ. 1000, రూ. 2000, రూ. 3000, రూ. 4000, లేదా రూ. 5000, వారి నెలవారీగా ప్రీమియం చెల్లింపు ఆధారంగా పెన్షన్ కు హామీ ఉంటుంది.
LIC Saral Pension Yojana in Telugu ఒక్కసారి జమా చేస్తే చాలు జీవితాంతం Rs 51,150/పూర్తి వివరాలు!
LIC Arogya Rakshak Plan In Telugu కుటుంబం మొత్తానికి ఒక్కటే ఆరోగ్య పాలసీ పూర్తి వివరాలు ఉదాహరణ ద్వారా !
PPF Scheme in Telugu -& పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్ అర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!
• APY స్కీం కి అర్హులు ఎవరు? (Atal Pension Yojana ( APY ) )
18 ఏళ్లు నిండిన మరియు 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు. కాబట్టి యువతీయువకులు తమ వృద్ధాప్యం కోసం ఒక కార్పస్‌ను రూపొందించడానికి ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పధకం లోకి ప్రవేశించడానికి 40 సంవత్సరాలు గరిష్ట వయస్సు గా ఉంటుంది. ఎందుకంటే ఈ స్కీమ్‌కు కనీసం 20 సంవత్సరాలు కాంట్రిబ్యూషన్ అందించబడుతుంది.
• అటల్ పెన్షన్ ఉపసంహరణ విధానాలు?-(Withdrawal Process )
1. ఒకవేళ లబ్ధిదారుడు 60 ఏళ్లు నిండినట్లయితే, అతడు/ఆమె మొత్తం కార్పస్ మొత్తాన్ని యాన్యుటైజ్ చేయడానికి అర్హులు, అనగా సంబంధిత బ్యాంక్‌లో ఈ పథకాన్ని క్లోజ్ చేసుకున్న తర్వాత నెలవారీ పెన్షన్‌లు అందుకుంటాడు.
2.ప్రాణాంతక అనారోగ్యం లేదా మరణం వంటి పరిస్థితులలో మాత్రమే 60 సంవత్సరాల వయస్సులోపు ఈ స్కీమ్ నుండి వైదోలిగే అవకాశం ఉంటుంది.
3.ఒకవేళ లబ్ధిదారుడు 60 ఏళ్లు నిండకముందే మరణించిన సందర్భంలో, అతని/ఆమె జీవిత భాగస్వామికి పెన్షన్ పొందే అర్హత ఉంటుంది.
4.ఎలా అంటే జీవిత భాగస్వామికి కార్పస్ మొత్తం తీసుకుని పథకం నుండి తొలగిపోవడానికి లేదా జీవితాంతం పెన్షన్ ప్రయోజనాలను పొందడానికి అవకాశం ఉంటుంది.
5.ఏదైనా కారణం చేత, వ్యక్తులు 60 ఏళ్లు నిండకముందే స్కీమ్ నుండి తొలగిపోతే, అప్పటివరకు వారు చెల్లించిన, ప్రీమియం మొత్తాలు (Cumulative contributions) మరియు వడ్డీ మాత్రమే తిరిగి ఇవ్వబడుతుంది.
Atal Pension Scheme Example – ఉదాహరణ
Mr. రాజేష్ అతని యొక్క వయసు 18 సంవత్సరాలు. అతనికి 60 సంవత్సరాలు వచ్చే వరకూ అంటే 42 సంవత్సరాలు ప్లాన్ లో ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.
Mr.. రాజేష్ 61 వ సంవత్సరం నుంచి ప్రతి నెలా Rs 1,000/- రూపాయల పెన్షన్ జీవితాంతం పొందాలనుకొంటే నెలకి Rs 42/- రూపాయల చొప్పున చెల్లించాలి.
2.Rs 2,000/- రూపాయల పెన్షన్ జీవితాంతం పొందాలనుకొంటే నెలకి Rs 84/- రూపాయల చొప్పున చెల్లించాలి.
3.Rs 3,000/- రూపాయల పెన్షన్ జీవితాంతం పొందాలనుకొంటే నెలకి Rs 126 /- రూపాయల చొప్పున చెల్లించాలి.
4.Rs 4,000/- రూపాయల పెన్షన్ జీవితాంతం పొందాలనుకొంటే నెలకి Rs 168/- రూపాయల చొప్పున చెల్లించాలి.
అదేవిధంగా Mr. రాజేష్ Rs 5,000/- రూపాయల పెన్షన్ జీవితాంతం పొందాలనుకొంటే నెలకి Rs 210/- రూపాయల చొప్పున చెల్లించాలి.
• మరణ ప్రయోజనం -( Death Benefit )
స్కీం తీసుకొన్న వ్యక్తి ఏ కారణంచేత నైనా 60 సంవత్సరాలకి ముందు మరణిస్తే కట్టిన డబ్బులు వడ్డీతో సహా నామినీ కి అందిస్తారు.
ఒకవేళ 60 సంవత్సరాల తర్వాత రిస్క్ జరిగితే నామినీకి లైఫ్ టైమ్ పెన్షన్ అందిస్తారు.
• అటల్ పెన్షన్ పెనాల్టీ నిబంధనలు? – ( APY Penalty )
ప్రీమియం చెల్లింపులో లబ్ధిదారుడు ఆలస్యం చేస్తే, కింది పెనాల్టీ ఛార్జీలు వర్తిస్తాయి –
1. నెలవారీ ప్రీమియం రూ. 100 వరకు = రూ 1,
2. నెలవారీ ప్రీమియం రూ. 101 నుండి రూ. 500 వరకు = రూ. 2,
3. నెలవారీ ప్రీమియం 501 నుండి రూ. 1000 వరకు = రూ 5,
4. నెలవారీ ప్రీమియం రూ. 1001 నుండి అంతకంటే ఎక్కువ = రూ.10 జరిమానా విధించబడును.
వరుసగా 6 నెలలు చెల్లింపులో డిఫాల్ట్‌గా కొనసాగితే, అటువంటి ఖాతా ఆపివేయబడుతుంది. ఒకవేళ అలాంటి డిఫాల్ట్ వరుసగా 12 నెలలు కొనసాగితే, ఆ ఖాతా డీయాక్టివేట్ చేయబడుతుంది మరియు వడ్డీతో కలిపి సేకరించిన మొత్తం సంబంధిత వ్యక్తికి తిరిగి ఇవ్వబడుతుంది.
• పన్ను మినహాయింపులు – ( Tax Benefits )
ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 80CCD కింద వ్యక్తులు అటల్ పెన్షన్ యోజనకు చెల్లించే ప్రీమియం లపై పన్ను మినహాయింపు రూ 1,50,000 లభిస్తుంది. అటల్ పెన్షన్ యోజన పథకానికి చెల్లించి న ప్రీమియం కోసం సెక్షన్ 80CCD (1B) కింద అదనంగా మినహాయింపు రూ 50,000 అనుమతించబడుతుంది.
Atal Pension Yojana (APY ) Eligibility :-
• అటల్ పెన్షన్ స్కీమ్ కు అర్హులు ఎవరు? – ( Eligibility )
అటల్ పెన్షన్ యోజన పథకంలో పెట్టుబడి పెట్టడానికి మరియు అక్కడ నుండి పెన్షన్ పొందడానికి, ఈ వ్యక్తులు అర్హులు.
1.భారతీయ పౌరుడిగా ఉండాలి మరియు యాక్టివ్ మొబైల్ నెంబర్ తో పాటు కనీసం 20 సంవత్సరాల పాటు పథకానికి ప్రీమియం చెల్లింపులు జరపాలి.
2 . అతని/ఆమె ఆధార్‌తో అనుసంధానించబడిన బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి ,
ముఖ్యంగా మరే ఇతర సాంఘిక సంక్షేమ పథకానికి లబ్ధిదారుడుగా ఉండకూడదు.
చవచ్చు. లబ్ధిదారుడు మరియు అతని/ఆమె జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించినట్లయితే, నామినీకి కార్పస్ మొత్తాన్ని స్వీకరించడానికి అర్హత ఉంటుంది.
• నామినీ సౌకర్యం? – ( Nominee Facility )
పాలసీదారుడు మరణిస్తే, నామినీ ఈ పథకం ప్రయోజనాలకు అర్హులు. నామినీ తమ ఖాతాను రద్దు చేసుకోవచ్చు మరియు మొత్తం కార్పస్‌ను ఒకే మొత్తంలో పొందవచ్చు లేదా అసలు లబ్ధిదారుడి వలె అదే పెన్షన్ మొత్తాన్ని స్వీకరించవచ్చు .
• అటల్ పెన్షన్ యోజన కోసం దరఖాస్తు చేయడం ఎలా? ( How to Apply )
APY ప్రయోజనాలను పొందడానికి ఈ కింద సూచనలను అనుసరించండి.
అన్ని జాతీయం చేయబడిన బ్యాంకులు ఈ పథకాన్ని అందిస్తాయి. మీ APY ఖాతాను ప్రారంభించడానికి మీరు ఏ బ్యాంకు నైనా సందర్శించవచ్చు.
అటల్ పెన్షన్ యోజన ఫారమ్‌లు ఆన్‌లైన్‌లో మరియు బ్యాంక్‌లో అందుబాటులో ఉన్నాయి. మీరు అధికారిక వెబ్‌సైట్ నుండి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫారమ్‌లు ఇంగ్లీష్, హిందీ, బంగ్లా, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళం మరియు తెలుగులో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు ఫారమ్ నింపి, మీ అకౌంట్ ఉన్న బ్యాంకు లో అందచేయండి. అప్లికేషన్ ఫారం తో పాటు ఆధార్ కార్డు ఫోటో కాపీ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ను అందజేయాలి.
మీ అప్లికేషన్ ఆమోదించబడిన తర్వాత మీ మొబైల్ కు మెసేజ్ వస్తుంది.
1. ఆధార్ కార్డు ( Adar Card)
2. రేషన్ కార్డు ( Ration Card )
3. ఓటర్ ఐడి ( Voter ID )
4. డేట్ అఫ్ బర్త్ ( Date Of Birth )
• Atal Pension Yojana ( APY ) తరచుగా అడిగే ప్రశ్నలు – Question & Answers )
1). పొదుపు ఖాతా లేకుండా APY కింద పెన్షన్ ఖాతా తెరవడం సాధ్యమేనా?
లేదు, APY కింద పెన్షన్ ఖాతాను తెరవడానికి (యాక్టివ్ గా ఉన్న సేవింగ్ బ్యాంక్ అకౌంట్) క్రియాశీల సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండటం అవసరం.
2). అటల్ పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసేటప్పుడు నామినీని తప్పనిసరి గా ప్రకటించాలా?
అవును, అటల్ పెన్షన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు నామినీని నామినేట్ చేయాలి మరియు వారి KYC వివరాలను అందించాలి.
3). ఈ పథకం కింద ఒకటి కంటే ఎక్కువ పెన్షన్ ఖాతాలను కలిగి ఉండటం సాధ్యమేనా?
లేదు, ఈ పథకం కింద ఒక వ్యక్తికి ఒకే పెన్షన్ ఖాతా మాత్రమే ఉంటుంది.
4). APY ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మార్గం ఉందా?
లేదు, ప్రస్తుతం APY ఆన్‌లైన్ అప్లికేషన్ అందించబడలేదు. దీని కోసం తమకు అకౌంట్ ఉన్న బ్యాంకు శాఖకు వెళ్లి అప్లై చేసుకోవాలి.
• ముగింపు ( Conclusion )
ఈ వెబ్సైటు ద్వారా అన్ని ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు మరియు చిన్న తరహా వ్యాపారాల యొక్క వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.