What is the FD interest rate in SBI today?
What is the FD interest rate in SBI today?
ఎవరైతే SBI లో కొత్తగా డబ్బును ఫిక్సెడ్ డిపాజిట్ FD చెయ్యాలనుకొంటున్నారో వారికి ఇది సరియైన సమయం గా చెప్పవచ్చు, ఎందుకంటే 15 మే 2024 నుంచి ఫిక్సెడ్ డిపాజిట్స్ యొక్క్ వడ్డీ రేట్లను పెంచడం జరిగింది.
SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మనం కనీసం 7 రోజుల నుంచి అత్యధికముగా 10 సంవత్సరాల వరకూ డబ్బును ఫిక్సెడ్ డిపాజిట్ చెయ్యవచ్చు , సామాన్య వ్యక్తులతో పాటు సీనియర్ సిటిజన్స్ కూడా ఈ స్కీమ్ లో అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు అయితే సామాన్య వ్యక్తులతో పోలిస్తే సీనియర్ సిటిజన్స్ కు అదనంగా 0.25% వడ్డీ రేటు ఎక్కువగా ఎస్బిఐ అందిస్తుంది.
గతంతో పోలిస్తే వడ్డీ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
7 నుంచి 45 రోజుల ఫిక్సెడ్ డిపాజిట్ పై పెద్దగా మార్పేమీ లేదు యధావిధిగా 3.50% ఉంది… కాని 46 నుంచి 179 రోజుల ఫిక్సెడ్ డిపాజిట్ పై ఇది వరకు 4.75% ఉండగా 15 మే 2024 నుంచి 5.50% గా పెరగడం జరిగింది. అలాగే 180 నుంచి 210 రోజుల ఫిక్సెడ్ డిపాజిట్ పై మొదట 5.75% ఉండగా ప్రస్తుతం 6.00% అయ్యింది.
అదేవిధంగా 1 సంవత్సరం లోపు ఫిక్సెడ్ డిపాజిట్ పై మొదట 6.00% ఉండగా ప్రస్తుతం 6.25% అయ్యింది మరియు 2 సంవత్సరాల FD పై 6.80% ,3 సంవత్సరాల FD పై 7.00% ,5 సంవత్సరాల FD పై 6.75% అలాగే ఒకవేళ మీరు కనుక 10 సంవత్సరాలు FD చెయ్యాలనుకుంటే 6.50% గా SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు అందిస్తుంది.
ఉదాహరణకు ఇప్పుడు ఒక లక్ష రూపాయలను కొంత కాలానికి FD చెస్తే ఎంత వస్తుందంటే!!!!
ఒక లక్ష రూపాయలను 1 సంవత్సరానికి ఫిక్సెడ్ డిపాజిట్ చెస్తే Rs 1,06,398 రూపాయలు లభిస్తాయి. 2 సంవత్సరాలకి ఫిక్సెడ్ డిపాజిట్ చేసినట్లయితే 6.80% వడ్డీ రేటు తో Rs 1,14,437 రూపాయలు, 3 సంవత్సరాల FD పై Rs 1,23,144 రూపాయలు, అదేవిధంగా 5 2 సంవత్సరాలకి ఫిక్సెడ్ డిపాజిట్ చేసినట్లయితే 6.75% ద్వారా Rs 1,39,570 రావడం జరుగుతుంది.. ఒకవేళ ఈ లక్ష రూపాయలను వచ్చే10 సంవత్సరాలకి ఫిక్సెడ్ డిపాజిట్ చేసినట్లయితే 6.50% ద్వారా Rs 1,90,556 రూపాయలు లభిస్తాయి..