LIC Aam Aadmi Bima Yojana in Telugu -” 100 లకే 75,000/- భీమా ” Eligibility, features & Benefits

                                  LIC Aam Aadmi Bima Yojana Telugu

LIC Aam Aadmi Bima Yojana

 Aam  Aadmi Bima Yojana   ఆమ్ ఆద్మీ భీమా యోజన   2017 అక్టోబర్ 2 న దేశంలో దిగువ తరగతి కుటుంబాలకు తక్కువ ప్రీమియం తో ఎక్కువ భీమా అందించే ఉద్దేశంతో ఈ స్కీం ని ప్రారంభం చెయ్యడం జరిగింది. ఆమ్ ఆద్మీ భీమా యోజన ఒక సోషల్ సెక్యూరిటీ స్కీం ( Social Security Scheme ).
ఈ స్కీం ద్వారా స్కీం తీసుకొన్న వ్యక్తి కి ఏమైనా రిస్క్ జరిగితే వెంటనే ఆర్థిక భరోసా లభిస్తుంది.

ఈ స్కీం ప్రత్యేకంగా BPL ( Below Poverty Level )కేటగిరికి చెందిన వారికి వర్తిస్తుంది. ఒక కుటుంబం లో ఒక వ్యక్తికి మాత్రమే ఈ స్కీం ఇవ్వడం జరుగుతుంది, ఎవరైతే కుటుంబం పోషణ నిర్వహిస్తారో వారికి ఈ స్కీం లభిస్తుంది.

 

ఆమ్ ఆద్మీ భీమా యోజన ద్వారా సంవత్సరానికి కేవలం 100/- రూపాయలు చెల్లిస్తే, భీమా తీసుకొన్న వ్యక్తికి 4 ముఖ్య ప్రయోజనాలతో పాటుగా వ్యక్తి పిల్లలకి చదువుకొనేందుకు స్కాలర్ షిప్ అందివ్వడం జరుగుతుంది.

ఈ స్కీం ఒక సోషల్ సెక్యూరిటీ స్కీం కాబట్టి మీరు సంవత్సరానికి 100/- చెల్లిస్తే, అదనంగా మరొక 100/- ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి.

 

2014 -15 లో సర్వే నిర్వహించగా భీమా తీసుకొన్న 42,000 వ్యక్తులకి క్లెయిమ్ రూపంలో అక్షరాలా సుమారు 15,00,000/- రూపాయలు క్లెయిమ్ నిర్వహించడం జరిగింది.

అలాగే 6,20,000 మంది పిల్లలు కి స్కాలర్ షిప్ రూపంలో 41.81 కోట్ల రూపాయలను ఈ స్కీం ద్వారా అందివ్వడం జరిగింది. డెవోలోప్మెంట్ ని దృష్టిలో ఉంచుకొని ఈ మధ్యనే జనాశ్రీ యోజనలో విలీనం చెయ్యడం జరిగింది.

 

Importance  OF AABY

 

LIC Aam Aadmi Bhima Yojana in Telugu -" 100 లకే 75,000/- భీమా " Eligibility, features & Benefits

 

భారతదేశంలో అసంఘటిత రంగంలో కార్మికులు  మొత్తం  93% ఉన్నారు.  ప్రభుత్వం కొన్ని వృత్తిపరమైన వర్గాల కోసం కొన్ని సామాజిక భద్రతా చర్యలను అమలు లోకి తీసుకొచ్చింది. అయితే వీరికి లైఫ్ కవరేజ్ చాలా తక్కువ. దీనివల్ల  మెజారిటీ కార్మికులు ఇప్పటికీ ఎలాంటి సామాజిక భద్రతా కవరేజ్ లేకుండా ఉన్నారు. ఇలాంటి కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టింది.

అసంఘటిత రంగంలోని కార్మికులకు ప్రధాన అభద్రతాభావాలలో  తరచుగా అనారోగ్యం కారణంగా వెనుకబడి ఉండడం. మరి ఇలాంటి  కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య సంరక్షణ మరియు ఆసుపత్రిలో చేరడం ఖర్చుతో కూడిన పని.   ఆరోగ్య సౌకర్యాల కల్పన  ఉన్నప్పటికీ, భారతదేశంలో కార్మిక లోకానికి అనారోగ్యం అత్యంత తీవ్రంగా ఉంది.

ఇందుకోసమే పేదరికానికి దారితీసే ఆరోగ్య వ్యయానికి వ్యతిరేకంగా పేద కుటుంబాలకు రక్షణ కల్పించడానికి ఆరోగ్య బీమా ఒక మార్గం అని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.  గతంలో ఆరోగ్య బీమాను అందించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ వాటి  అమలు లోనూ ఇబ్బందులను ఎదుర్కొన్నాయి.  పేదలు ఆరోగ్య భీమా తీసుకోవడానికి ఇష్టపడరు! ఎందుకంటే దాని కయ్యే  ఖర్చు, మరియు సరైన ప్రయోజనాలు పొందలేకపోవడం.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య బీమాను నిర్వహించడం చాలా కష్టం.

దీనిని దృష్టిలో ఉంచుకుని  ఆమ్ ఆద్మీ బీమా యోజన రూపంలో భారత ప్రభుత్వం ఒక సామాజిక భద్రతా పథకాన్ని ప్రారంభించింది.  ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్  అక్టోబర్ 2 వతేదీన 2007 లో ప్రవేశపెట్టబడింది. ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నిర్వహిస్తోంది. ఈ ఆమ్ ఆద్మీ భీమా యోజన కుటుంబంలోని ఒక ఆదాయ సభ్యుడికి లేదా కుటుంబ పెద్దకు భీమా సౌకర్యాన్ని అందిస్తుంది.

భారతదేశ ప్రభుత్వ పర్యవేక్షణలో, ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక భద్రత పథకాలు, “ఆమ్ ఆద్మీ భీమా యోజన (AABY)” మరియు “జనశ్రీ బీమా యోజన (JBY)” రెండింటినీ విలీనం చేసింది.  విలీనం తర్వాత, జనవరి 1, 2013 నుండి, ఈ పథకానికి కొత్తగా ‘ఆమ్ ఆద్మీ బీమా యోజన’ అని కేంద్ర ప్రభుత్వం  పేరు మార్చింది.

 

  LIC Aam Aadmi Bima Yojana   Eligibility :-

 

• ఆమ్ ఆద్మీ ( LIC  Aam Aadmi Bima Yojana )పాలసీని తీసుకోవడానికి అర్హులు ఎవరు? ( Who can take the Policy? )

ఈ పాలసీ తీసుకొనే వ్యక్తి యొక్క కనీస వయస్సు( Minimum Age ) =18 సంవత్సరాలు.
అత్యధిక వయస్సు (maximum Age ) = 59 సంవత్సరాలు.

కనుక 18 నుంచి 59 సంవత్సరాల వయసు మధ్యకలిగిన వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.

 

• ఆమ్ ఆద్మీ భీమా ప్రయోజనాలు! ( Benefits Of LIC Aam Aadmi Bima  Yojana)

1. సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా సంవత్సరానికి 100/- మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

2. రిస్క్ ఏ సమయంలో జరిగినా మొత్తం భీమా ప్రయోజనాలు వర్తిస్తాయి.

3. పాలసీదారుని పిల్లలకు స్కాలర్ షిప్ అందివ్వబడుతుంది.

4. సాధారణ వివరాలు జమా చేసి పాలసీ తీసుకోవచ్చు.

5.నాలుగు రకాల ఇన్సూరెన్స్ కవరేజ్ ఈ ఒక్క పాలసీ ద్వారానే లభిస్తుంది.

 

PPF Scheme in Telugu -&#పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్ అర్హతలు, నియమాలు, ప్రస్తుత వడ్డీరేట్ పూర్తి వివరాలు!

LIC Saral Pension Yojana in Telugu &;ఒక్కసారి జమా చేస్తే చాలు జీవితాంతం Rs 51,150/-” పూర్తి వివరాలు!

• ఏ కేటగిరి వారికి ఈ భీమా వర్తిస్తుంది? ( Eligibility Criteria )

1. బీడీ వర్కర్స్  ( Beedi Workers )
2. ఇటుక పని వర్కర్స్  ( Brick Workers )
3. కార్పెంటర్  ( Carpenters )
4. కొబ్బరికాయల పనివారు  ( Cobblers )
5. చేపలు పట్టే వారు       ( Fisher mans )
6. పేపర్ ప్రింటింగ్            ( Hamels)
7. లేడీ టైలర్స్                ( Lady Tailors )
8. దివ్యంగులు                 ( physically Handicaps)
9. రిక్షా, ఆటో డ్రైవర్స్…….        ఇలా 48 కేటగిరి లకు సంబందించిన లిస్ట్ వారికి ఈ స్కీం వర్తిస్తుంది.

 

 

 

• ఆమ్ ఆద్మీ భీమా ఎలా పనిచేస్తుంది? ( How does it’s Work?)

 

పాలసీదారుని పేరు ( Name )              = Mr. కుమార్
వయసు ( Age )                                       = 26 సంవత్సరాలు
వృత్తి ( Occupation )                              = కార్పెంటర్
సంవత్సర ప్రీమియం ( Premium )     = Rs 100/-

 

1. సహజ మరణం (Natural Death Coverage) :-

Mr. కుమార్ స్కీం మధ్యలో ఏ కారణం లేకుండా సహజంగా మరణించినట్లయితే వెంటనే కుమార్ కుటుంబానికి Rs 30,000/- రూపాయలు ఈ స్కీం ద్వారా లభిస్తాయి.

 

2. ప్రమాద మరణం ( Accidental Death Coverage ):-

పాలసీ తీసుకొన్న ప్రమాదవశాత్తు వ్యక్తి ఆక్సిడెంట్ కారణంగా మరణించినట్లయితే వ్యక్తి కుటుంబానికి Rs.75,000/- వెంటనే అందివ్వడం జరుగుతుంది.

 

3. ఆక్సిడెంట్ టోటల్ పేర్మినెంట్ డిసబిలిటీ ( Accidental Total Permanent Disability ):-

ఈ సందర్భంలో కూడా వ్యక్తి కుటుంబానికి Rs 75,000/- లభిస్తాయి. టోటల్ డిసబిలిటీ అంటే ఆక్సిడెంట్ లో రెండు కాళ్ళు( Two Legs ), రెండు చేతులు ( Two Hands )మరియు రెండు కళ్ళు ( Two Eyes ) కోల్పోవడం. కాబట్టి పాలసీ దారునికి పూర్తి భీమాని అందిస్తారు.

 

4.ఆక్సిడెంట్ పార్సియల్ పేర్మినెంట్ డిసబిలిటీ ( Accidental Total Partial Disability ):-

పైన చెప్పిన విధంగా అయినప్పటికీ, ప్రాథమిక అవయవాలు పూర్తిగా కాకుండా ఒక కన్ను ( One Eye ), ఒక కాలు ( One Leg ) , ఒక చెయ్యి ( One Hand )ఇలా అన్నమాట. ఈ సందర్భంలో కూడా Rs. 37,500/- ఈ స్కీo ద్వారా లభిస్తాయి.

 

 .స్కాలర్ షిప్ ఫెసిలిటీ ( Scholarship Facility ):-

పాలసీ దారుడు పై 4 సందర్భాలలో దేనికి గురి అయినా అతనికి 9 నుంచి 12 మధ్య చదువుకొనే పిల్లలు ఉన్నట్లయితే నెలకుRs  100/- రూపాయలు చొప్పున అందివ్వడం జరుగుతుంది.

 

.ఆమ్ ఆద్మీ భీమా యోజన గురించి తరచుగా అడిగే ప్రశ్నలు ( Q & A )

 

ప్ర. ఆమ్ ఆద్మీ భీమా యోజన ఎందుకు ప్రారంభించబడింది?

జ. ఆరోగ్య సంరక్షణ మరియు సరైన చికిత్స అందుబాటులో లేని భారతదేశ గ్రామీణ జనాభాకు ఆరోగ్యం మరియు ఆర్థిక సహాయంతో పాటు సామాజిక భద్రతను అందించడం కోసం ఆమ్ ఆద్మీ బీమా యోజన భారతదేశంలో LIC ద్వారా ప్రారంభించబడింది.

ప్ర. ఆమ్ ఆద్మీ భీమా యోజన ఎప్పుడు ప్రారంభమైంది?

జ. ఆమ్ ఆద్మీ భీమా యోజన (AABY) మరియు జనశ్రీ బీమా యోజన (JBY) ల  విలీనం తర్వాత 2013 లో ఆమ్ ఆద్మీ భీమా యోజన ప్రారంభించబడింది.

 

 ప్ర. ఆమ్ ఆద్మీ భీమా యోజన పథకం కోసం నేను ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?

మీరు ఆమ్ ఆద్మీ బీమా యోజన స్కీమ్ కోసం ఏదైనా నమోదిత నోడల్ ఏజెన్సీలలో లేదా LIC ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్ర. ఆమ్ ఆద్మీ భీమా యోజన కింద కవరేజ్ కోసం, భీమా తీసుకునే వ్యక్తి  ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందా?

జ. భీమా తీసుకున్న సభ్యుడు ప్రీమియంలో 50% చెల్లించాలి, అంటే  అతను/ఆమె దారిద్ర రేఖకు దిగువన (BPL) ఉన్న కుటుంబాలకు చెందిన వారు మాత్రమే చెల్లించాలి.   భీమా తీసుకునే  వారు గ్రామీణ,  భూమిలేని కుటుంబాలకు లేదా గుర్తింపు పొందిన వృత్తి సమూహాలకు చెందినవారైతే, అతను/ఆమె ఈ  పథకం కోసం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.

ప్ర. ఆమ్ ఆద్మీ భీమా యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?

భారతదేశంలోని గ్రామీణ జనాభా మరియు  సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులకు ఉచిత లేదా సబ్సిడీ భీమా సౌకర్యాన్ని అందించడానికి భారత ప్రభుత్వం ఆమ్ ఆద్మీ భీమా యోజనను ప్రారంభించింది.  ఆమ్ ఆద్మీ భీమా యోజన అనేది ముఖ్యంగా వెనుకబడిన తరగతుల సామాజిక సంక్షేమం కోసం ఉద్దేశించిన సామాజిక భద్రత పథకం.

ప్ర. నేను ఆమ్ ఆద్మీ భీమా యోజన కోసం ఎక్కడ అప్లై చేయాలి?

జ. ఈ పథకాన్ని ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మాత్రమే అందిస్తోంది.  అందువలన, ఆసక్తి గల వ్యక్తులు   LIC నుండి దాని అధీకృత నోడల్ ఏజెన్సీల ద్వారా మాత్రమే అప్లై చేసుకోవచ్చు.

 

కావలసిన డాకుమెంట్స్ :- Required Documents 

 

ప్ర. నామినేషన్ తప్పనిసరి తెలియజేయాలా?

జ. అవును, ఆమ్ ఆద్మీ భీమా యోజన పథకం కింద బీమా కోసం ఒక వ్యక్తి దరఖాస్తు చేసినప్పుడు నామినేషన్ తప్పనిసరి తెలియజేయాలి.  దరఖాస్తు ఫారంలో  నామినీ వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. దీని వల్ల  డెత్ క్లెయిమ్ విషయంలో నామినీ క్లెయిమ్ మొత్తాన్ని సులభంగా తీసుకోవచ్చు.

ప్ర. ఆమ్ ఆద్మీ భీమా యోజన కింద నేను కవరేజ్ పొందవచ్చా?

జ. ఆమ్ ఆద్మీ భీమా యోజన పథకం కింద కవరేజ్ అనేది BPL కుటుంబాలు, గ్రామీణ భూమిలేని కుటుంబాలు లేదా ప్రభుత్వం  పేర్కొన్న 48 ఒకేషనల్ గ్రూపుల్లో ఒకరికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.  మీరు ఈ వర్గాలలో దేనికీ చెందకుండా ఉంటే, ఆమ్ ఆద్మీ భీమా యోజన కింద కవరేజ్ మీరు పొందలేరు.

•ఆమ్ ఆద్మీ భీమా యోజన ఎక్కడ ఎలా అప్లై చెయ్యాలి? కావలసిన డాకుమెంట్స్ ఏమిటి?
( Aam admi Bima Yojana Required Documents?)

 

ఈ స్కీమ్ మీకు ఎల్.ఐ. సి ( LIC ) సంస్థలో లభిస్తుంది.

 

1. ఆధార్ కార్డు ( Adar Card)
2. రేషన్ కార్డు ( Ration Card )
3. ఓటర్ ఐడి ( Voter ID )
4. డేట్ అఫ్ బర్త్ ( Date Of Birth )

 

.https://licindia.in/

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *