LIC Saral Pension Yojana in Telugu – “ఒక్కసారి జమా చేస్తే చాలు జీవితాంతం Rs 51,150/-” పూర్తి వివరాలు!

                LIC Saral Pension Yojana Details  in Telugu

 LIC Saral Pension Yojana (LIC సరళ పెన్షన్ యోజన)
కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసరంగా సామాన్యులకి కూడా  ప్రతీ నెలా రెగ్యులర్ పెన్షన్ జీవితాంతం లభించే  విధంగా ఐ. ర్. డి. ఏ. ఐ ( IRDAI – Insurance Regulatory And Development Authority Of India )సరళ పెన్షన్ యోజన ను ప్రారంభం చేసింది.

మొదటగా LIC మాద్యమంగా 1 జులై 2021 న ఈ స్కీం ని ప్రారంభం చేయడం జరిగింది. ఈ స్కీం ద్వారా మీకు మొత్తం జీవిత కాలం పాటు రెగ్యులర్ పెన్షన్ లభించడం జరుగుతుంది.

సరళ్ పెన్షన్ యోజన అనేది ఒక రెగ్యులర్ ఆదాయ ప్లాన్. దీనికి సంబంధించి IRDAI అన్ని  బీమా కంపెనీలకు సూచనలు చేసింది.  కొత్త గా LIC  సరల్ పెన్షన్ యోజన 2021 ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఏదనగా, ప్రతి ఒక్కరికి పెన్షన్ పాలసీ ద్వారా ప్రయోజనాలు కల్పించడం. ఈ పథకం భారతదేశంలోని అన్ని భీమా కంపెనీలకు వర్తిస్తుంది. ఈ  LIC సరళ్ పెన్షన్ యోజనను ఇంటర్మీడియట్ యాన్యుటీ స్కీమ్ అని కూడా పిలుస్తారు. పేరుకు తగ్గట్టుగానే  ఇది తక్షణమే పథకం ప్రయోజనాలు అందిస్తుంది.

సరళ్ పెన్షన్ ప్లాన్ సరళమైనది మరియు విలువైనది. సరళ్ పెన్షన్ యోజన ముఖ్యంగా  ప్రజల నిర్దిష్ట ఆర్థిక అవసరాలను తీర్చడానికి చాలా వరకు నిర్దిష్టం గా పని చేస్తుంది.

ఎక్కువ మంది వినియోగదారులను ఇలాంటి పెన్షన్ పాలసీ ల  వైపు ఆకర్షించడానికి, ఇప్పుడు LIC (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) సంస్థ  కొత్త సరళ్ పెన్షన్ స్కీమ్ 2021 తో ముందుకు వచ్చింది. ఈ పథకం ప్రధానంగా  సూపర్‌ఆన్యుయేషన్ ఫండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టబడింది. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి కి  భవిష్యత్తులో పెన్షన్ అధికారం ద్వారా అందచేయబడుతుంది.

LIC సంస్థ  కొత్త సరళ్ పెన్షన్ పథకాన్ని జూలై 1 న ప్రారంభించింది.  మరియు దీనికి ఒకే ప్రీమియం ఉంది. ఇది పార్టిసిపేట్ చేయని,  లింక్ చేయబడని మరియు వ్యక్తిగత వార్షిక ప్లాన్ గా తీసుకురాబడింది.  ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI)  ఆదేశాలు ప్రకారం,  ప్రజల అభివృద్ధి కోసం బీమా కంపెనీలు ఈ పాలసీలను అమలు జరుపుతాయి.

పదవీ విరమణ తర్వాత ప్రజల  ఆర్థిక భవిష్యత్తును భద్రపరచడానికి సరళ్ పెన్షన్ ప్లాన్ తక్షణ వార్షిక ప్రణాళికగా,  ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడింది. యాన్యుటీని కొనుగోలు చేయాలనుకునే వారు మరియు రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఆదాయాన్ని కోరుకునే వారి కోసం,  భారతీయ జనాభా ను లక్ష్యంగా పెట్టుకొని LIC ఈ ప్లాన్ ను రూపొందించింది.  ఈ ప్లాన్ లోని నియమ నిబంధనలు  ప్రకారం, పదవీ విరమణ పొందిన ప్రతి  పురుషుడు, స్త్రీ మరియు లింగమార్పిడి తో ఉన్నవారి తో  సహా అందరి జీవితాలు కవర్ చేయబడతాయి

ఇండియా లో అన్ని కంపెనీలు  ఒక్కొక్కటిగా ఈ స్కీం ని అందుబాటులో కి తెస్తున్నాయి.

 

LIC Saral Pension Yojana in Telugu - "ఒక్కసారి జమా చేస్తే చాలు జీవితాంతం Rs 51,150/-" పూర్తి వివరాలు!

 

 

• ఎల్. ఐ సి  ( LIC ) సరళ పెన్షన్ స్కీం ఏ విధంగా పనిచేస్తుంది? ( How does it’s Work?)

ఇది ఒక సింగిల్ డిపాజిట్ ఇమ్మీడియేట్ యాన్యూటీ స్కీం ( Single Deposit Immediate Annuity Scheme).  ఈ స్కీం లో మీరు ఒక్కసారే కొద్దిగా అమౌంట్ ని సింగిల్ ప్రీమియం రూపంలో డిపాజిట్ చేస్తే, నిర్ణయించుకొన్న పెన్షన్ మోడ్ ( Pension Mode ) ఆధారంగా తర్వాత నెల నుంచే పెన్షన్ రావడం ప్రారంభం అవుతుంది.

సరళ పెన్షన్ యోజనలో రెండు ముఖ్య ఆప్షన్స్ ఉంటాయి. అవసరానికి అనుగుణంగా మీరు ఒక దాన్ని నిర్ణయించుకోవచ్చు.

 

ఆప్షన్  ( Option ) :- 1
“లైఫ్ యాన్యూటీ విత్ 100% రిటర్న్ అఫ్ పర్చేజింగ్ ప్రైస్ “(Life Annuity With 100% Return Of Purchasing Price )

దీన్నే సింగిల్ పెన్షన్ అని అంటారు. ఈ ఆప్షన్ ద్వారా అమౌంట్ డిపాజిట్ చేసిన వ్యక్తికి, నిర్ణయించుకొన్న పెన్షన్ మోడ్ ఆధారంగా జీవితాంతం ఒక ఖచ్చితమైన పెన్షన్ వస్తూ ఉంటుంది.

పెన్షన్ తీసుకొనే వ్యక్తి జీవిత పర్యాంతంలో ఎప్పుడు మరణించినా  డిపాజిట్ అమౌంట్ ని 100% నామినీ కి అందజేయడం జరుగుతుంది.

 

ఆప్షన్ ( Option ) :- 2
“జాయింట్ లైఫ్ యాన్యూటీ విత్ ఏ ప్రోవిషన్ అఫ్,100% యాన్యూటీ టూ ద సెకండరీ అన్నుటియంట్ ఆన్ డెత్ అఫ్ ద ప్రైమరీ అన్నుటియంట్ అండ్ రిటర్న్ 100% పర్చేజింగ్ప్రైస్ ఆన్ డెత్ అఫ్ లాస్ట్ సర్వీవోరు”

(Joint Life Annuity With a Provision Of 100% Annuity to the Secondary Annuitant on Death Of The Primary Annuitant And Return 100% Purchased Price On Death Of Last Survivor.)

 

అంటే ఈ ఆప్షన్ లో అమౌంట్ డిపాజిట్ చేసే వ్యక్తికి నిర్ణయించుకొన్న పెన్షన్ మోడ్ ఆధారంగా రెగ్యులర్ పెన్షన్ జీవితాంతం లభిస్తుంది. స్కీం లో అమౌంట్ డిపాజిట్ చేసిన వ్యక్తి ఏ కారణంగా మరణించినా, అతనికి ఎంత ఐతే ప్రతినెలా పెన్షన్ లభిస్తుందో 100% అతని భార్య కి కూడా జీవితాంతం లభిస్తుంది.
అంటే ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాలం జీవించి ఉంటే వారికి పెన్షన్ లభిస్తుందన్న మాట.

అదేవిధంగా రెండవ వ్యక్తి కూడా ఏ కారణంగా మరణించినా, స్కీం ప్రారంభంలో డిపాజిట్ చేసిన మొత్తం అమౌంట్ ని వారి పిల్లలకు లేదా నామినీ కి అందివ్వడం జరుగుతుంది.

 

• LIC సరళ పెన్షన్ స్కీం యొక్క సమయం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ? (  Period Of Saral Pension Scheme?)

హోల్ లైఫ్ ( Whole Life ) ఈ పాలసీ ని ఒక్కసారి ఖరీదు చేస్తే జీవితాంతం రెగ్యులర్ పెన్షన్ వస్తుంటుంది.

 

 

LIC Jeevan Anand Policy In Telugu – 17 లక్షలు మెట్యూరిటీ తోపాటు జీవితాంతం 5 లక్షలు ఉచిత ఇన్సూరెన్స్

SBI life Smart future Choices In Telugu – “అవసరం వచ్చినప్పుడల్లా అడిగి తీసుకోండి “

•ఈ స్కీం తీసుకోవడానికి అర్హులు ఎవరు? ( Who can take This Policy? )

ఈ పాలసీ తీసుకొనే వ్యక్తి యొక్క కనీస వయస్సు( Minimum Age ) = 40 సంవత్సరాలు
అత్యధిక వయస్సు                                     (maximum Age ) = 80 సంవత్సరాలు.

కనుక 40 సంవత్సరాల వయసు   నుంచి 80 సంవత్సరాల వయసు మధ్యకలిగిన వారు  ఈ పాలసీని  తీసుకోవచ్చు.

 

• లోన్ సదుపాయం? ( Loan Facility?)

అత్యవసర సమయంలో డిపాజిట్ అమౌంట్ పై లోన్ కూడా పొందవచ్చు. ఎంత అన్నది డిపాజిట్ అమౌంట్ పై ఆధారపడి ఉంటుంది.

 

• సరళ పెన్షన్ యోజన ఏ విధంగా పనిచేస్తుంది? ( How Does  LIC Saral pension  Yojana Work?)

 

ఉదాహరణ ( Example ) :- 1                   సింగిల్ లైఫ్ ( Single Life )

పాలసీదారుని పేరు                       – Mr. రాజేష్
సరళ పెన్షన్ భీమా                         – 10 లక్షలు
వయసు                                           – 60 సంవత్సరాలు
పాలసీ సమయం                           –  జీవితాంతం
పెన్షన్ ఆప్షన్                                   – సంవత్సరానికి ఒకసారి
ప్రీమియం చెల్లించే విధానం         –  ఒక్కసారే

సింగిల్ ప్రీమియం   – Rs 10,18,000/- ( ఈ  ప్రీమియం GST చార్జీలతో కలిపి )

ఈ ఆప్షన్ లో Mr. రాజేష్ కి తరువాత సంవత్సరం  నుండి Rs 51,650/- రూపాయలు చొప్పన ప్రతీ సంవత్సరం రెగ్యులర్ గా పెన్షన్ లభించడం జరుగుతుంది.

ఒకవేళ జీవిత పర్యంతంలో రాజేష్ ఎప్పుడు ఏ కారణం చేత మరణించినా  మొత్తం డిపాజిట్ అమౌంట్ Rs 10,00,000/- నామినీకి లభిస్తాయి.

 

ఉదాహరణ ( Example ) :- 2 జాయింట్ లైఫ్ ( joint Life )

 

పాలసీదారుని పేరు                     – Mr. రమణ
సరళ పెన్షన్ భీమా                      – 10 లక్షలు
వయసు                                         – 60 సంవత్సరాలు
పాలసీ సమయం                         –  జీవితాంతం
పెన్షన్ ఆప్షన్                                 – సంవత్సరానికి ఒకసారి
ప్రీమియం చెల్లించే విధానం       –  ఒక్కసారే
సింగిల్ ప్రీమియం   – Rs 10,18,000/- ( ఈ  ప్రీమియం GST చార్జీలతో కలిపి )

ఈ ఆప్షన్ లో Mr. రమణ కి తరువాత సంవత్సరం  నుండి Rs 51,150/- రూపాయలు చొప్పన ప్రతీ సంవత్సరం రెగ్యులర్ గా పెన్షన్ లభించడం జరుగుతుంది.

జీవిత పర్యంతంలో రాజేష్ ఎప్పుడు ఏ కారణం చేత మరణించినా , సెకండరీ అన్ను్టెంట్ గా Mr. రమణ భార్యకి కూడా Rs 51,150/– రూపాయల పెన్షన్ జీవితాంతం లభిస్తుంది.

ఒకవేళ Mr. రమణ భార్య కూడా కొంత కాలం తరువాత మరణిస్తే ప్రారంభంలో డిపాజిట్ చేసిన Rs 10,00,000/– నామినీ కి లభిస్తాయి.

 

•సరళ పెన్షన్ యోజన స్కీం యొక్క కనీస మరియు అత్యధిక పెన్షన్? ( Minimum & Maximum Pension??)

ప్రతీ నెల  ( Monthly )      =  Rs. 1,000/-
3 నెలలకి   ( Quarterly )  =  Rs. 3,000/-
6 నెలలకి   ( H/ Yearly )   =  Rs. 6,000/-
సంవత్సరానికి ( Yearly )    = Rs. 12,000/-

 

• పెన్షన్ పొందే విధానం? ( Pension Mode )

అవసరాన్ని బట్టి 4 రకాలుగా నిర్ణయించుకోవచ్చు.
ప్రతీ నెల              – ( Monthly )
3 నెలలకి              –  ( Quarterly )
6 నెలలకి              –  ( H/ Yearly )
సంవత్సరానికి     – ( Yearly )

 

• ఈ స్కీం లో అమౌంట్ ఏ విధంగా చెల్లించాలి? ( Amount Deposit mode )

సింగల్ ప్రీమియం. ( Single Premium )  ప్రారంభంలో ఒక్కసారే చెల్లించాలి.

 

• సరెండర్ ఫెసిలిటీ? ( Surrender Facility  Of LIC  Saral Pension Yojana?)

అంటే పాలసీదారుడు ఏదైనా పెద్ద అనారోగ్యానికి గురిఅయినట్లైతే  ( కాన్సర్, హార్ట్ అట్టాక్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ సంబంధిత మొదలైనవి ) ట్రీట్మెంట్ కి కావాల్సిన మొత్తం ఖర్చు కోసం స్కీం ని సరెండర్ చేసి 95%  డిపాజిట్ ని రిటర్న్ గా పొందవచ్చు.

దీనికోసం అన్నీ కాంపెనీలు కొన్ని గంభీరమైన  వ్యాధులకు సంబందించిన  ఒక లిస్ట్ తయారుచేసింది. లిస్ట్ లో ఉన్న ఏ అనారోగ్యానికి పాలసీదారుడు గురియైన  ఈ ప్రయోజనం  వర్తిస్తుంది.

 

•| LIC సరళ పెన్షన్ యోజన ఎక్కడ ఎలా అప్లై చెయ్యాలి? కావలసిన డాకుమెంట్స్ ఏమిటి?
(  Required Documents?)

ఈ స్కీమ్ మీకు ఎల్.ఐ. సి ( LIC ) సంస్థలో లభిస్తుంది.

కావలసిన డాకుమెంట్స్ :-

1.  ఆధార్ కార్డు   ( Adar Card)
2. రేషన్ కార్డు      ( Ration Card )
3. ఓటర్ ఐడి       ( Voter ID  )
4. డేట్ అఫ్ బర్త్   ( Date Of Birth )

 

 తరచుగా అడిగే ప్రశ్నలు ( Q & A ) LIC Saral Pension Yojana 

 

1. నేను saral pension plan ను ఎందుకు తీసుకోవాలి?

జ. మీరు సాధారణ ఆదాయంతో జీవితం గడుపుతూ, ఉత్తమమైన పదవీ విరమణ ప్లాన్   కోసం చూస్తున్నట్లయితే, ఈ సరళ్ పెన్షన్ ప్లాన్ మంచి పెట్టుబడి.  ఈ పాలసీ కోసం, మీరు రెగ్యులర్ ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది.  ఈ మొత్తం  మీకు యాన్యుటీ రూపంలో అందుతుంది.

2. నేను పెన్షన్ ప్లాన్ తీసుకునే ముందు  LIC సరళ్ పెన్షన్ ప్లాన్ వార్షిక రేట్లను పోల్చుకోవచ్చా?

జ. అవును, మీరు  సరల్ పెన్షన్ ప్లాన్ కోసం వెళ్లే ముందు హామీ ఇచ్చిన LIC సరళ్ పెన్షన్ ప్లాన్ యాన్యుటీ రేట్లను పోల్చుకోవచ్చు.

3. ఏ వయసుకి చెందిన వ్యక్తులు LIC సరళ్ పెన్షన్ ప్లాన్ 2021  కోసం అప్లై చేసుకోవచ్చు?

జ. 40 నుండి 80 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఈ పథకం కోసం   అప్లై చేసుకోవచ్చు.

4. LIC సరళ్ పెన్షన్ ప్లాన్ కోసం చెల్లించాల్సిన కనీస యాన్యుటీ ఎంత?

జ. సరళ్ పెన్షన్ ప్లాన్ కోసం చెల్లించాల్సిన కనీస  యాన్యుటీ రూ.  సంవత్సరానికి 12,000 వరకు ఉంటుంది.

5. సరళ్ పెన్షన్ ప్లాన్ రెండు రకాల ఆప్షన్స్ తో ప్రయోజనాలు కల్పిస్తుందా?

జ. అవును నిజమే. సరేలే పెన్షన్ ప్లాన్ రెండు రకాల ఆప్షన్స్ తో వ్యక్తులకు ప్రయోజనాలను కల్పిస్తుంది.

• మొదటి ఆప్షన్ ను ఎంపిక చేసుకుంటే, పాలసీ తీసుకున్న వ్యక్తికి అతను నిర్ణయించుకున్న పెన్షన్ విధానం ఆధారంగా జీవితాంతం గ్యారెంటీగా పెన్షన్ వస్తుంది.
• రెండవ ఆప్షన్ ను ఎంపిక చేసుకుంటే, పాలసీదారులకు పెన్షన్ జీవితాంతం లభిస్తుంది. ఒక వేళ పాలసీదారుడు మరణిస్తే నామినీకి పెన్షన్ జీవితాంతం  లభిస్తుంది.

6 . ఈ సరళ్ పెన్షన్ యోజన స్కీం లో అమౌంట్ డిపాజిట్ చేసే విధానం ఎలాంటిది?

జ. ఈ సరళ్ పెన్షన్ యోజన స్కీం లో అమౌంట్ సింగిల్ ప్రీమియం రూపంలో పాలసీ తీసుకునే సమయంలోనే ఒక్కసారే (Lumpsum)  డిపాజిట్ చేయవలసి ఉంటుంది.

7. పాలసీని కొనుగోలు చేసిన తర్వాత నేను నా యాన్యుటీ యొక్క ఆప్షన్ ను మార్చుకోవచ్చా?

జ. యాన్యుటీ ఆప్షన్ లను  పాలసీ తీసుకునే సమయంలోనే  తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే  ఆ తరువాత మీరు  యాన్యుటీ ఆప్షన్ లను మార్చుకోవడానికి అవకాశం లేదు.

8. సరళ్ పెన్షన్ యోజన పాలసీ ఆధారంగా లోన్ సౌకర్యం పొందవచ్చా?

అవును. సరళ్ పెన్షన్ యోజన పాలసీ ద్వారా లోన్ సౌకర్యం పొందవచ్చు. కానీ పాలసీ తీసుకున్న ఆరు నెలల తర్వాత మాత్రమే లోన్ పొందడానికి అవకాశం ఉంటుంది.

ముగింపు  ( Conclusion ):-

LIC సరళ పెన్షన్ యోజన కి సంబందించిన పూర్తి సమాచారాన్ని మీకు అందించానని భావిస్తున్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ మరచినట్లైతే  మన్నించి క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.

ఈ వెబ్సైటు ద్వారా అన్ని   ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు  మరియు  చిన్న తరహా వ్యాపారాల యొక్క   వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *