SBI Kavach Personal loan In Telugu -” స్టేట్ బ్యాంక్ స్పెషల్ స్కీమ్ 5 లక్షలు పర్సనల్ లోన్ ” కేవలం 5 నిమిషాల్లోనే

                            SBI Kavach Personal loan Telugu

మీకు స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ ఉందా? అలాగే మీరు లేదా మీ కుటుంబం లో ఎవరైనా కరోనా బారిన పడి చికత్స నిమిత్తం అధిక మొత్తంలో ఖర్చుచేశారా? ఇలాంటి వారి కోసమే 1  ఏప్రిల్ 2021 న స్టేట్ బ్యాంక్ ( SBI Kavach Personal Loan )కవచ్ పర్సనల్ లోన్ స్కీం ని ప్రవేశపెట్టింది.

ఈ స్కీం ద్వారా మీరు ఇప్పటికే కరోనా ట్రీట్మెంట్ చేయించుకొన్నా లేక భవిష్యత్ లో కరోనా కి గురైనా అత్యధికముగా 5 లక్షలు వరకూ పర్సనల్ లోన్ లభిస్తుంది. అదికూడా ఇండియా లో మరే ఇతర బ్యాంక్ లు ఇవ్వని విధంగా తక్కువ వడ్డీ రేట్ కే.

సాధారణంగా ఉద్యోగాలు చేసే వారికి, వ్యాపారం చేసే వారికి మాత్రమే బ్యాంకులు పర్సనల్ లోన్ అందిస్తాయి. కానీ ఈ స్కీం ద్వారా సామాన్యులు కూడా ఈ పర్సనల్ లోన్ పొందవచ్చు. అదికూడా ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా!

 

 SBI Kavach Personal Loan Eligibility?
• SBI Kavach Interest Rate?
• SBI Kavach  Loan Applying?
• SBI Kavach Repayment Tenure?

 

•అర్హులు  (SBI Kavach Personal Loan Eligibility?)

కనీస వయసు         ( Minimum age )  = 25 సంవత్సరాలు.
అత్యధిక వయసు  ( Maximum age )  = 65 సంవత్సరాలు.

 

1. ఉద్యోగం చేసే వారూ లేదా స్టేట్ బ్యాంక్ ఖాతా ద్వారా జీతం తీసుకొనేవారు. ( Salaried Persons or Government Employees )

1.వయసు  28 నుంచి 58 సంవత్సరాలు మధ్య ఉండాలి కనీసం Rs 25,000/- నుంచి Rs 5,00,000/- లక్షల వరకూ లోన్ లభిస్తుంది.

2.. నెలసరి జీతానికి 6 రేట్లు లోన్ రూపంలో పొందవచ్చు.అంటే నెల జీతం 25,000/- అయితే  లక్ష 50 వేలు లోన్ పొందవచ్చు.

3. .గత 6 నెలలుగా  మీ బ్యాంక్ అకౌంట్ అంతరాయం లేకుండా ఉండాలి.

4. మీ స్టేట్ బ్యాంక్ అకౌంట్ పై ప్రస్తుతం ఎటువంటి పర్సనల్ లోన్ వుండకూడదు.ఈ నియమాలు కి అనుగుణంగా SBI కవచ్ పర్సనల్ లోన్ పొందవచ్చు.

 

2. పెన్షన్ పొందే వ్యక్తులు ( Pensioners )

1. మీ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ప్రతీ నెలా స్టేట్ బ్యాంక్ ద్వారానే విత్ డ్రాల్ చేస్తూ ఉండాలి అలాగే పెన్షన్ తీసుకొనే వ్యక్తి వయసు 70 సంవత్సరాల లోపు ఉండాలి.

2. మీ యొక్క పెన్షన్ అకౌంట్ పై ప్రస్తుతం ఎటువంటి లోన్ కొనసాగకూడదు.

3.. కనీసం 25 వేలు నుంచి అత్యధికముగా 5 లక్షలు వరకూ లోన్ లభిస్తుంది.

4..మీకు లభించే పెన్షన్ కి 6 రేట్లుగా కవచ్ పర్సనల్ లోన్ లభిస్తుంది.అంటే నెలకి పెన్షన్ 30,000/- అయితే  1,80,000/- లోన్ పొందవచ్చు.

 

 

PPF Scheme in Telugu -” పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్” అర్హతలు, నియమాలు, ప్రస్తుత వడ్డీరేట్ పూర్తి వివరాలు!

Post Office KVP Scheme In తెలుగు – “కట్టిన దానికి రెట్టింపు పొందండి ” అర్హులు వీరే పూర్తి వివరాలు

3. సామాన్య వ్యక్తుల అర్హతలు? ( Loan Amount for Others )

1.  సామాన్య ఖతదారుల వయసు 25 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. సాధారణంగా సామాన్య వ్యక్తులకు ప్రతీ నెలా ఖచ్చితం అయిన ఆదాయం అంటూ ఏమీ ఉండదు.కాబట్టి వీరికి రిలేషన్ షిప్ వేల్యూ కి( Relationship Value ) 3 రేట్లు గా ఈ లోన్ sbi అందిస్తుంది.

3. రిలేషన్ షిప్ వాల్యూ అంటే బ్యాంక్ ద్వారా మీ అకౌంట్ పై జరిగే డిపాజిట్, విత్ డ్రా, ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ మొదలైన లావాదేవీలను ఆధారంగా చేసుకొని బ్యాంక్ ఆటోమేటిక్ గా రిలేషన్ షిప్ వాల్యూని డిక్లేర్ చేస్తుంది.

4. దీనికోసం గడచిన 6 నెలల్లో మీ ఖాతా యాక్టీవ్ గా ఉండాలి.

5. రిలేషన్ షిప్ వాల్యూ అనేది కనీసం 25,000/- రూపాయలు దాటి ఉండాలి.

6. చివరి 6 నెలలుగా కనీసం 15 వేలు క్రెడిట్ సబ్మిషన్ జరిగి ఉండాలి. ఈ నియమాల కి ఆధారంగా సామాన్యులు SBI కవచ్ లోన్ అప్లై చేసుకోవచ్చు.

 

• లోన్ వడ్డీ రేట్  ( SBI Kavach Interest Rate )

ఏ బ్యాంక్ లు అందివ్వని విధంగా స్టేట్ బ్యాంక్ ఈ పర్సనల్ లోన్ పై  8.50%  వడ్డీని అందిస్తుంది. మిగిలిన లోన్స్ తో పోలిస్తే చాలా తక్కువ.

 

• SBI కవచ్ రిపేమెంట్ మరియు సమయం? ( SBI Kavach Repayment & Term )

ఈ లోన్ యొక్క కాలపరిమితి  5 సంవత్సరాలు ఉంటుంది. 3 నెలలు మోరా్టోరిమ్ సమయం తో కలిపి.కాబట్టి తీసుకొన్న లోన్ 5 సంవత్సరాల లోపు చెల్లించవచ్చు. ఒకవేళ మధ్యలో  మీ దగ్గర అమౌంట్ ఉంటే ఒక్కసారే రిపేమెంట్ చెయ్యవచ్చు.

 

ఫ్రెండ్స్ SBI కవచ్ పర్సనల్ లోన్ ని మీ యొక్క ముఖ్య బ్రాంచ్ ద్వారా గాని లేదా యోనో మొబైల్ ఆప్ ద్వారా గాని అప్లై అప్లై చెయ్యవచ్చు. అలాగే లోన్ అప్లై చేసే వారియొక్క సిబిల్ స్కోర్ 700 మించి ఉండాలి. హాస్పిటల్ బిల్స్ ను బ్యాంక్ కు సబ్మిట్ చెయ్యాలి.

 

• అవసరమైన డాక్యుమెంట్స్ ( SBI Kavach Required Documents?)

అప్లికేషన్ ఫార్మ్  ( Application Form )
ఆధార్ కార్డు       ( Adar Card )
పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) కార్డు  ( Pan No )
ప్రస్తుత చిరునామాతో అడ్రస్ ప్రూఫ్ అందజేయాలి.

 

https://sbi.co.in

 

ముగింపు  ( Conclusion )

స్టేట్ బ్యాంక్ కవచ్ పర్సనల్ లోన్ స్కీం కి  సంబందించిన పూర్తి సమాచారాన్ని మీకు అందించానని భావిస్తున్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ మరచినట్లైతే  మన్నించి క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.

ఈ వెబ్సైటు ద్వారా అన్ని   ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు  మరియు  చిన్న తరహా వ్యాపారాల యొక్క   వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *