LIC Jeevan Amar Plan Details In Telugu – 855
LIC Jeevan Amar – 855 Telugu
జీవన్ అమర్ అత్యధిక ఆదరణ పొందిన ఆఫ్ లైన్ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ, కుటుంబ భద్రత ని నిర్వహించడంలో పాలసీదారునికి భరోసా కల్పిస్తుంది. జీవన్ అమర్ షేర్ మార్కెట్ తో సంబంధం లేని నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేట్ ఇండివిడ్యుఅల్ ( Non linked non participated Pure Term Insurance ) మరియు విభిన్న ప్లాన్ ఆప్షన్స్ అందిస్తుంది. 10% చొప్పున ప్రతీ సంవత్సరం ప్రాథమిక భీమా రెట్టింపు అయ్యే వరకూ ఇంక్రీస్ అవుతూ ప్రొటెక్షన్ ని అందిస్తుంది.
Plan Options – ప్లాన్ ఆప్షన్స్
1. లెవెల్ సమ్ అస్సుర్డ్ – Level Sum Assured
ప్రారంభంలో ఎంతైతే భీమా నిర్ణయం చేసుకొన్నారో అంతే భీమా పాలసీదారునికి రిస్క్ జరిగితే నామినీకి అందివ్వడం జరుగుతుంది.
2. ఇంక్రీస్ లెవెల్ సమ్ అస్సుర్డ్ – Increased Level Sum Assured
మొదటి 5 సంవత్సరాలు ప్రారంభ భీమా వర్తిస్తుంది, 6 వ సంవత్సరం నుంచి ప్రాథమిక భీమా కి 10%చొప్పున ప్రతీ సంవత్సరం పాలసీ యొక్క 16 వ సంవత్సరం వరకూ లభించడం జరుగుతుంది. అంటే ప్రాథమిక భీమా కి రెట్టింపు అన్నమాట,ఆ తర్వాత నుంచి స్థిరంగా అదే భీమా పాలసీ చివరి వరకూ వర్తిస్తుంది, సమయానసరంగా రిస్క్ ప్రయోజనం వర్తిస్తుంది.
మరింత స్పష్టంగా ముందు ఉదాహరణ లో తెలుసుకొందాం!
LIC Jeevan Amar ప్రయోజనాలు – Features
1 . స్పెషల్ ప్రీమియం ధరలు మహిళలు కి, మద్యపానం, దూమ పానం లేనివారికి అందివ్వడం జరుగుతుంది.
2. అత్యధిక భీమా పై డిస్కౌంట్ మరియు ప్రాథమిక భీమా కంటే అదనపు ప్రయోజనం కొరకు ఆక్సిడంటల్ బెనిఫిట్ రైడర్ అందుబాటులో ఉంటుంది.
3. భిన్నమైన 3 రకాల ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ తోపాటు బెనిఫిట్ అమౌంట్ ని వాయిదాల పద్దతిలో పొందవచ్చు.
4. లెవెల్ సమ్ అస్సుర్డ్ మరియు ఇంక్రీస్ లెవెల్ సమ్ అస్సుర్డ్ ప్లాన్ ఆప్షన్స్ ఫ్లెక్సీబిలిటీ ఉంటుంది.
5. అందరికి అందుబాటులో ఉండే విధంగా ఆఫ్ లైన్ లో ఈ పాలసీని మీరు పొందవచ్చు.
3.డెత్ బెనిఫిట్ – Death Benefit
పాలసీ సమయం మధ్యలో ఎప్పుడు పాలసీదారునికి రిస్క్ జరిగినా మొత్తం భీమా నామినీ కి లభిస్తుంది.
రెగ్యులర్ & లిమిటెడ్ ఆప్షన్స్ ( Regular, Limited )
• వార్షిక ప్రీమియం చెల్లింపులకు 7 రేట్లు లేదా
• ప్రాధమిక భీమాకి 105% రూపంలో డెత్ బెనిఫిట్ వర్తిస్తుంది.
సింగల్ ప్రీమియం ఆప్షన్ ( Single Premium )
• ప్రాధమిక భీమాకి 105% రూపంలో డెత్ బెనిఫిట్ వర్తిస్తుంది.
అర్హతలు – LIC Jeevan Amar Eligibility
Eligibility | Minimum | Maximum |
Entry Age | 18 Years | 65 Years |
Policy Period | 10 Years | 40 Years |
Sum Assured | Rs 25,00,000 | No Limit |
Grace Period | 30 Days | 30 Days |
వయసు – Age
కనీసం ( Minimum ) = 18 సం||లు
అత్యధికం ( Maximum ) = 65 సం ||లు
భీమా – Sum Assured
కనీసం ( Minimum ) = 25 లక్షలు
అత్యధికం ( Maximum ) = ఎటువంటి పరిధి లేదు
పాలసీ సమయం – Policy Period
కనీసం ( Minimum ) = 10 సం||లు
అత్యధికం ( Maximum ) = 40 సం ||లు
ప్రీమియం చెల్లింపులు – Premium Paying Term
1. రెగ్యులర్ ప్రీమియం – మొత్తం పాలసీ చివరి వరకూ ప్రీమియం చెల్లించాలి.
2. లిమిటెడ్ ప్రీమియం – పాలసీ సమయం – 5 సం ||లు
పాలసీ సమయం కంటే 5 సంవత్సరాలు తక్కువ ప్రీమియం చెల్లించేలా! కనీసం 10 నుంచి 40 సంవత్సరాల మధ్య పాలసీ సమయం ఉండాలి.
3. లిమిటెడ్ ప్రీమియం – పాలసీ సమయం – 10 సం ||లు,
పాలసీ సమయం కంటే 10 సంవత్సరాలు తక్కువ ప్రీమియం చెల్లించేలా! కనీసం 15 నుంచి 40 సంవత్సరాల మధ్యలో పాలసీ సమయం ఉండాలి. మరియు
4. సింగల్ ప్రీమియం – మొత్తం ప్రీమియం కేవలం ఒక్కసారే చెల్లించేలా 4 రకాల ప్రీమియం ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.
Max life Smart Secure Plus Plan in Telugu అద్భుతమైన పాలసీ 100% ప్రీమియం రిటర్న్
ఉదాహరణ – Jeevan Amar Example
1. లెవెల్ సమ్ అస్సుర్డ్ – Level Sum Assured
పాలసి విధానం ( Option ) – ఆప్షన్ 1
పాలసీదారుని పేరు ( Name ) – Mr. రాకేష్
వయసు ( Age ) – 30 సంవత్సరాలు
మద్యపానం అలవాటు ( Category ) – లేదు
పాలసీ సమయం ( Policy Period ) – 40 సం||లు
భీమా ( Bhima ) – 25 లక్షలు
ప్రీమియం చెల్లించే విధానం – వార్షికం
ప్రీమియం విధానం – రెగ్యులర్
వార్షిక ప్రీమియం – Rs 6,608/-( ఈ ప్రీమియం GST చార్జీలతో కలిపి )
చెల్లించే ప్రీమియంపై సంవత్సరానికి ఒకసారి ఇన్కమ్ టాక్స్ రూపంలో 30% టాక్స్ రిటర్న్ లభిస్తుంది. కాబట్టి రాకేష్ కి ప్రతి లభించే టాక్స్ డేడిక్షన్ = Rs 1,982/-
Mr. రాకేష్ ఈ పాలసీలో 30 సంవత్సరాలలో చెల్లించిన మొత్తం ప్రీమియం వచ్చి = Rs 2,64,320/- అవుతుంది..
Death Benefit – మరణ ప్రయోజనం
Mr. రాకేష్ కి పాలసీ సమయం మధ్యలో ఎప్పుడు రిస్క్ జరిగినా 25 లక్షలు నామినీకి అందివ్వడం జరుగుతుంది తర్వాత పాలసీ టెర్మినాట్ అవుతుంది.
2. ఇంక్రీస్ లెవెల్ సమ్ అస్సుర్డ్ – Increased Level Sum Assured
పాలసి విధానం ( Option ) – ఆప్షన్ 2
పాలసీదారుని పేరు ( Name ) – Mr. రాకేష్
వయసు ( Age ) – 30 సంవత్సరాలు
మద్యపానం అలవాటు ( Category ) – లేదు
పాలసీ సమయం ( Policy Period ) – 40 సం||లు
భీమా – 25 లక్షలు
ప్రీమియం చెల్లించే విధానం – వార్షికం
ప్రీమియం విధానం – రెగ్యులర్
వార్షిక ప్రీమియం – Rs 11,122/-( ఈ ప్రీమియం GST చార్జీలతో కలిపి )
చెల్లించే ప్రీమియంపై సంవత్సరానికి ఒకసారి ఇన్కమ్ టాక్స్ రూపంలో 30% టాక్స్ రిటర్న్ లభిస్తుంది. కాబట్టి రాకేష్ కి ప్రతి లభించే టాక్స్ డేడిక్షన్ = Rs 3,336/-
Mr. రాకేష్ ఈ పాలసీలో 30 సంవత్సరాలలో చెల్లించిన మొత్తం ప్రీమియం వచ్చి = Rs 4,44,880/- అవుతుంది..
Death Benefit – మరణ ప్రయోజనం
ఈ ఆప్షన్ లో ప్రాథమిక భీమా మొదటి 5 సంవత్సరాలు స్థిరంగా ఉంటుంది,, ఈ సమయంలో రిస్క్ జరిగితే అదే భీమా లభిస్తుంది… కానీ ప్లాన్ యొక్క 6 వ సంవత్సరం నుంచి
Mr. రాకేష్ కి పాలసీ సమయం మధ్యలో ఎప్పుడు రిస్క్ జరిగినా నామినీకి కింది విధంగా అందివ్వడం జరుగుతుంది.
6 వ సంవత్సరం భీమా – Rs 2,75,0000/-
7వ సంవత్సరం భీమా – Rs 3,00,0000/-
8వ సంవత్సరం భీమా – Rs 3,25,0000/-
9వ సంవత్సరం భీమా – Rs 3,50,0000/-
10వ సంవత్సరం భీమా – Rs 3,75,0000/-
11వ సంవత్సరం భీమా – Rs 4,00,0000/-
12వ సంవత్సరం భీమా – Rs 4,25,0000/-
13వ సంవత్సరం భీమా – Rs 4,50,0000/-
14వ సంవత్సరం భీమా – Rs 4,75,0000/-
15వ సంవత్సరం భీమా – Rs 5,00,0000/- ఈ విధంగా లభించడం జరుగుతుంది.
ఉదాహరణ కు ప్లాన్ యొక్క 10 వ సంవత్సరం Mr. రాకేష్ కి రిస్క్ జరిగితే Rs 37,50,000/- మరియు 12 వ సంవత్సరం రిస్క్ జరిగితే Rs 42,50,000/- చొప్పున అందివ్వడం జరుగుతుంది.
• ఆక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ – Accidental Death Benefit Rider
పాలసీ దారుడు ఆక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ ని తీసుకొంటే అలాగే రిస్క్ ఆక్సిడెంట్ కారణం చేత జరిగితే లభించే భీమా తోపాటు అదనపు ప్రయోజనం ఈ రైడర్ ద్వారా నామినికి అందివ్వడం జరుగుతుంది.
ఈ రైడర్ ను పాలసీదారుడు పాలసీ ప్రారంభంలో తీసుకోవచ్చు లేదా పాలసీ కొనసాగుతున్న సమయంలో అయినా తీసుకోవచ్చు. ఒకవేళ పాలసీ మధ్యలో తీసుకోవాలంటే కచ్చితంగా అప్పటికే 5 సంవత్సరాలు పాలసీ సమయం మిగిలి ఉండాలి.
. టాక్స్ ప్రయోజనం – Tax Benefits
చెల్లించే ప్రీమియం పై 80c రూపంలో టాక్స్ డెడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అలాగే డెత్ క్లెయిమ్ అమౌంట్ టాక్స్ రహితంగా టాక్స్ ఫ్రీ రూపంలో అమౌంట్ లభించడం జరుగుతుంది.
.సరెండర్ ఫెసిలిటీ – Surrender Facility
LIC జీవన్ అమర్ పరిపూర్ణమైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి అందువల్ల పాలసీని మధ్యలో సరెండర్ చేసే అవకాశం లభించదు.అదేవిధంగా పాలసీ మధ్యలో ఎటువంటి లోన్ సదుపాయం లభించదు.
. ముగింపు – Conclusion
మరిన్ని గవర్నమెంట్ పథకాలు, ఇన్సూరెన్స్, ముట్యుయల్ ఫండ్స్ సంబంధిత వివరాలు కు ఇన్సూరెన్స్ మార్కెట్ తెలుగు. కామ్ ని క్రమం తప్పకుండా సందర్శించండి ధన్యవాదములు.
TABL , IMAGE