LIC Jeevan Azad 868 – “రెట్టింపు మెచ్యూరిటీ స్కీం ” Benefits and Eligibilities Complete details..

LIC Jeevan Azad 868

దేశంలోనే అతిపెద్ద భీమా సంస్థ LIC. Life Insurance Corporation of India జనవరి 19 2023 న సరికొత్త సేవింగ్ ప్లాన్ ను ప్రారంభించింది. ఈ స్కీమ్ పేరు LIC New Jeevan Azad, Table No 868 . LIC Jeevan Azad ఒక Non Linked, Non Participate, Individual savings life insurance Plan. అంటే ప్లాన్ లో మీ పెట్టుబడిపై లభించే వడ్డీ లేదా బోనస్ అనేది స్టాక్ మార్కెట్ తో ఏటువంటి సంభందాన్ని కలిగి ఉండదు. 100% Guaranteed మెచ్యూరిటీ లభిస్తుంది. అలాగే Individual, వ్యక్తి గతంగా ఒక వ్యక్తి కి ఒక పాలసీ లభిస్తుంది+ ఇన్సూరెన్స్ దీని వల్ల స్కీమ్ సమయం మొత్తం వ్యక్తి కుటుంభానికి భీమా ప్రొటెక్షన్ (protection) అందుబాటులో ఉంటుంది.

 

 

LIC Jeevan Azad 868 - "రెట్టింపు మెచ్యూరిటీ స్కీం " Benefits and Eligibilities Complete details..

 

Next LIC Jeevan Azad Limited Premium Endowment Plan అంటే స్కీమ్ సమయం మొత్తం వ్యక్తి ప్రీమియం చెల్లించవలసిన అవసరం ఏమాత్రం ఉండదు. చివరి 8 సంత్సరాలు ప్రీమియం మాఫీ చెయ్యబడుతుంది. అయినప్పటికీ స్కీమ్ సమయం మొత్తం అన్నీ ప్రయోజనాలు పాలసిదారునికి సంస్థ అందిస్తోంది. అయితే
LIC Jeevan Azad ప్లాన్ ఎవరికి వర్తిస్తుoది? Age limits? కనీస భీమా, మెచ్యూరిటీ ఏ విధంగా లభిస్తుంది, లోన్, సరెండర్ ఇలా మొత్తం వివరాలను క్లియర్ గా ఉదాహరణ ద్వారా తెలుసుకొందాం.

 

 

 

 

LIC Jeevan Azad Plan Eligibilities

 

 

పాలసీని తీసుకోవడానికి కనీస ప్రవేశ వయసు 90 రోజులు కాబట్టి 3 నెలల పిల్లలకు కూడా ఈ ప్లాన్ వర్తిస్తుంది. అలాగే అత్యధిక వయసు వచ్చి 50 సంవత్సరాలు.

 

అదేవిధంగా ఎవరికైనా సరే కనీసం 2 లక్షల రూపాయల నుంచి అత్యధికముగా 5 లక్షల రూపాయల వరకూ భిమనూ మీరు తీసుకోవచ్చు. 5 లక్షలకు మించి భీమా లభించడం జరగదు. అయితే 3 లక్షల లోపు భీమా తీసుకొనే వారికి ఎటువంటి వైద్య పరీక్షలు (Medical Test) నిర్వహించకుండానే భీమా లభిస్తుంది, 3 లక్షల పైబడిన భీమాపై సాదారణ వైద్య పరీక్షలు (Medical Test) నిర్వహించడం జరుగుతుంది.

 

Next  Lic Jeevan Azad ప్లాన్ యొక్క Minimum Policy Term – 15 సంత్సరాలు, Maximum Policy Term 20 సంవత్సరాలుగా ఉంటుంది. అందువల్ల 15 నుంచి 20 సంవత్సరాల మధ్య మీరు పాలసీయొక్క సమయం నిర్ణయించుకోవచ్చు . ఇక PPT అంటే ప్లాన్ లో ప్రీమియం ఎంత కాలం చెల్లించాలి?

 

పాలసీ సమయం – 8 Years గా ప్రీమియం చెల్లించాలి. కాబట్టి మీరు 15 సం||రాలకి పాలసీని తీసుకొంటే 15 – 8 =7 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి, అలాగే  16 సం||రాలకి పాలసీని తీసుకొంటే 16 – 8 = 8 సంవత్సరాలు ,
17 సం||రాలకి పాలసీని తీసుకొంటే 17 – 8 = 9 సంవత్సరాలు , 18 సం||రాలకి పాలసీని తీసుకొంటే 18- 8 = 10 సంవత్సరాలు మరియు  19 సం||రాలకి పాలసీని తీసుకొంటే 19 – 8 = 11 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి. ఒకవేళ  మీరు 20 సం||రాలకి  ఈ పాలసీని తీసుకొంటే 20 – 8 = 12 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి. ఈ విధంగా అనుకొన్న సమయానికి కంటే తక్కువ సమయం మాత్రమే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

 

 

 

రుణ సదుపాయం (Loan Facility):

 

• పాలసీ మధ్యలో అప్పటివరకు మనం చెల్లించిన  ప్రీమియంపై  లోన్ పొందవచ్చు , పాలసీదారుడు  కనీసం 2 సంవత్సరాలు  ఎటువంటి అంతరాయం లేకుండా  పూర్తి ప్రీమియం చెల్లిస్తే ,  అత్యవసర పరిస్థితుల్లో  జమా  చేసిన  ప్రీమియం పై  లోన్ కూడా పొందవచ్చు.
అది ఎంత అంటే మీయొక్క సరెండర్ వేల్యూకి సుమారుగా 90% గా లోన్ లభిస్తుంది. లోన్ పై  వడ్డీరేటును  Lic సంస్థ నిర్ణయిస్తుంది .

34 సంవత్సరాల వయసు కలిగిన Mr. రామ్ అనే వ్యక్తి lic Jeevan Azad Plan లో 5 లక్షల భీమా ను 20 సంవత్సరాల సమయానికి కనుగోలు చెస్తే , జీవన్ అజాద్ లిమిటెడ్ ప్రీమియం ప్లాన్ కనుక 12 సంత్సరాలు మాత్రమే ప్లాన్ లో ప్రీమియం చెల్లించాలి.

5 లక్షల భీమా కి గాను Mr రామ్ సంత్సరానికి ఒకసారి 23,867 రూపాయల వార్షిక ప్రీమియం without tax రూపంలో చెల్లిస్తాడు. అదే ప్రతి నెల అయితే సుమారు 2200 రూపాయల ప్రీమియం చెల్లించాలి. ఈ విధంగా Mr. రామ్ మొదటి 12 సంత్సరాలు రెగ్యులర్ గా ప్లాన్ లో అమౌంట్ చెల్లిచేస్తాడు. 20 సం||రాల పాలసీ సమయంలొ చివరి 8 ప్రీమియం కట్టవలసిన అవసరం ఏమాత్రం ఉండదు.

 

 

 

 

మెచ్యూరిటీ బెనిఫిట్ (Maturity Benefit)

 

  20 సం|రల ప్లాన్ పీరియడ్ లో Mr రామ్ కి ఏటువంటి రిస్క్ జరగకపోతే Basic Sum Assured 5 లక్షలు మెచ్యూరిటీ గా lic సంస్థ అందిస్తోంది. కానీ Mr రామ్ 12 సంవత్సరాల్లో చెల్లించిన మొత్తం ప్రీమియం కేవలం 2 లక్షల 86 వేలు మాత్రమే. కాబట్టి డిపాజిట్ అమౌంట్ కి డబుల్ అమౌంట్ సేవింగ్ రుపంలో ఇన్సూరెన్స్ సహాయంతో అదికూడా స్ధిరంగా గా లభిస్తుంది.

 

 

Death Benefit:-

అదే విధంగా 20 సం||రల కాల వ్యవధిలో Mr రామ్ కి ఏమైనా రిస్క్ జరిగితే అప్పుడుకూడా 5 లక్షలు తక్షణమే వ్యక్తి కుటుంభానికి Lic అందివ్వడం జరుగుతుంది. ఎలా అంటే   ప్లాన్ తీసుకొన్న 2 సం||ల కాల వ్యవధిలో 48000 ప్రీమియం చెల్లిస్తే  ఒకవేళ వ్యక్తి కి  రిస్క్  జరిగితే అప్పుడుకూడా కట్టిన ప్రీమియం తో ఏటువంటి సంబందం లేకుండా తక్షణమే (immediate) 5 లక్షల భీమా వ్యక్తి కుటుంభానికి సంస్థ అందిస్తోంది.

ఈ పాలసీలో   చెల్లించే ప్రీమియంపై  ఇన్కమ్ టాక్స్ రూల్ అండర్  సెక్షన్ 80C రూపంలో సంవత్సరానికి 30% టాక్స్ రిటర్న్ ధాకలు చేసుకోవచ్చు మరియు మెచ్యూరిటీ , డెత్ బెనిఫిట్ 100% టాక్స్ రహితంగా తీసుకోవచ్చు.

 

• LIC సంస్థ కొత్తగా అందించిన   మెచ్యూరిటీ సెటిల్మెంట్ విధానం ఈ పాలసీకి వర్తిస్తుందా?
(What Is Maturity Settlement In  LIC )

1.  వర్తిస్తుంది! ఈ విధానం ద్వారా Mr. హరిప్రసాద్ మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ ని పాలసీ చివర్లో ఒక్కసారే పొందవచ్చు.
                                    లేదా

2. వాయిదాల పద్దతిలో  5, 10, మరియు  15 సంవత్సరాల సమయం నిర్ణయించుకొని, ప్రతినెలా, ప్రతీ 3 నెలలకు, 6 నెలలకి ఒక్కసారి మరియు సంవత్సరానికి ఒకసారి  లభించేలా నిర్ణయించుకొనే  సదుపాయం ఉంటుంది. ఆ విధంగానే  మీకు రెగ్యులర్ గా ఈ మెచ్యూరిటీ అమౌంట్ లభిస్తుంది.

 

 

 

సరెండర్ (Surrender):

• సరెండర్ వేల్యూ ఫెసిలిటి? (Surrender value facility)
పాలసీదారుడు రెగ్యులర్ గా 2 సంవత్సరాలు  ప్రీమియం చెల్లించిన తర్వాత కావాలంటే ఈ  పాలసీని సరెండర్ చేసి , అప్పటివరకు మీరు జమా చేసిన డబ్బును రిటర్న్ గా వెనక్కి పొందవచ్చు అయితే చార్జెస్ వర్తిస్తాయి.

కానీ  పాలసీని మధ్యలో సరెండర్ చేసినట్లయితే  ఎక్కువ డబ్బులను నష్టపోవాల్సిఉంటుంది. కాబట్టి పాలసీ తీసుకొనే సమయంలో లోనే మీ వ్యక్తిగత ఆర్థిక స్తోమతకి  అనుగుణంగా భీమాని నిర్ణయించుకోవడం మంచిదని నా అభిప్రాయం.

• LIC జీవన్ ఆజాద్ పాలసీలో  ఇతర అదనపు ప్రయోజనాలను  కొరకు   రైడర్స్ అందుబాటులో ఉన్నాయి. రైడర్స్ కేవలం మినహాయింపు మాత్రమే. అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు లేదా వదిలి పెట్టవచ్చు.

 

 

http://

Eligilities

Terms & Conditions

Minimum Entry Age

90 Days or 3 Months 

Maximum Entry Age

50 Years

Premium Mode

1 Month, 3 Months, 6 Months,  Yearly.

Policy Term

15- 20 Years.

Premium Paying Term

Policy Term - 8=__ Years.                                       EX: 15-8=7 Years, 16-8=8 Years,...20-8=12 Years.

Minimum Basic Sum Assured

Rs 200000

Maximum Basic Sum Assured

Rs 500000

Minimum Maturity Age

18 Years

Maximum Maturity Age

70 Years

 

 

1. ఆక్సిడెంట్  డెత్ మరియు  డిజాబిలిటీ బెనిఫిట్ రైడర్

 

పాలసీదారుడు  మొత్తం పాలసీసమయంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు.  పాలసీదారునికి 70 సంవత్సరాల  వయసు వచ్చే వరకూ ఈ రైడర్ తన ప్రయోజనాన్ని అందిస్తుంది.
ఈ రైడర్ తీసుకొన్న పాలసీదారుడు ఆక్సిడెంట్ కారణంగా మరణిస్తే  ప్రాథమిక భీమాకి లభించే మరణ ప్రయోజనం తోపాటు అందనంగా , మరికొంత అత్యధిక ప్రయోజనం నామినికి లభించడం జరుగుతుంది.
అదేవిధంగా వ్యక్తి  డిజాబిలిటీ కి గురైతే అంటే ఆక్సిడెంట్ లో ప్రాథమిక అవయవాలు కోల్పోన్నట్లయితే వెంటనే పాలసీకి సంబందించిన భవిష్యత్తు ప్రీమియంస్ అన్ని మాఫీ చెయ్యడం జరుగుతుంది..ఈ రైడర్ ద్వారా లభించే మొత్తం ప్రయోజనాన్ని   పాలసీదారునికి  ప్రతినెలా రెగ్యులర్ సహాయం రూపంలో 10 సంవత్సరాలపాటు  అందివ్వడం జరుగుతుంది.

 

 

 

 

2. టర్మ్ రైడర్  ( Term Rider – UIN 512B210V01)


ఈ రైడర్  పాలసీ తీసుకొనే సమయంలో మాత్రమే తీసుకొనే సదుపాయం ఉంటుంది, మధ్యలో లభించదు.
పాలసీదారుడు పాలసీ సమయంలో ఏ కారణంగా మరణించినా అంటే  సాధారణంగా గాని లేదా ఆక్సిడెంట్ కారణంగా కానీ మరణిస్తే  తీసుకొన్న భీమాకి  సమానమైన అమౌంట్ నామినీకి  అదనంగా లభిస్తుంది.

 

 

3. ప్రీమియం వెయివర్ బెనిఫిట్ రైడర్ (Premium waiver benefit)


18 సంవత్సరాల వయసు లోపు పిల్లలకు ఈ స్కీమ్ తీసుకున్నపుడు ప్లాన్ లో ప్రీమియం చెల్లించే వ్యక్తి కి రిస్క్ జరిగితే భవిష్యత్ ప్రీమియం మాఫీ చెయ్యబడుతుంది. మరియు స్కీమ్ యొక్క అన్ని ప్రయోజనాలు యధావిధిగా వ్యక్తి కుటుంభానికి అందివ్వడం జరుగుతుంది.

 

 

Also Read

LIC New Pension Plus Plan 867- 35 సంవత్సరాల నుండే పెన్షన్ ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే !

 

LIC Bima Ratna Plan 864 – ఎల్ .ఐ. సి కొత్త మనీ బ్యాక్ పాలసీ , మెట్యూరిటీ , 100 % గ్యారెంటీ బోనస్ ,పూర్తి వివరాలివే !

 

 

 

• జీవన్ ఆనంద్ పాలసీలో ప్రీమియంకి  గ్రేస్ పీరియడ్ ఉంటుందా ? ( Grace Period jeevan Anand )

గ్రేస్ పీరియడ్ అంటే ఈ పాలసీలో మీరు ప్రీమియంని చెల్లించవలసిన తేదీలోపు చెల్లించలేనప్పటికీ అధనంగా కొద్దిగా సమయం ఉంటుంది.

ఎవరైతే ఈ పాలసీలో  సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి మరియు 3 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లిస్తారో వారికీ అధనంగా  30 రోజులు సమయం ఉంటుంది.
ప్రతినెలా ప్రీమియం చెల్లించేవారికి 15 రోజులు ఈ గ్రేస్ పీరియడ్ ఉంటుంది.

 

 

భీమా పునరుద్ధరణ ( Revival of Policy):

 

పాలసీదారుడు ఏదైనా కారణంగా ఈ పాలసీలో 5 సంవత్సరాలు రెగ్యులర్ గా  ప్రీమియం చెల్లించలేనట్లైతే ఈ పాలసీ ముగియవేయబడుతుంది.
కాబట్టి  5 సంవత్సరాల లోపు మొత్తం బాకీ ప్రీమియంని పెనాల్టీతో కలిపి   చెల్లిస్తే  ఈ పాలసీలో తిరిగి కొనసాగే సదుపాయం ఉంటుంది.

 

 

 

https://licindia.in/

 

 

 

ఫ్రీ లుక్ పీరియడ్  అంటే ఏమిటి? ( Free Look Period? )

పాలసీ తీసుకొన్న 15 రోజులు లోపు, పాలసీకి సంబందించిన నియమాలు మరియు షరతులు పై  మీరు అసంతృప్తి చెందినట్లైతే  వెంటనే పాలసీని మూసివేసి చెల్లించిన  మీ ప్రీమియంని  వెనక్కి పొందవచ్చు. ఈ సమయంలో ఎటువంటి సర్వీస్ చార్జీలు  విధించబడవు.

ముఖ్య గమనిక  : 15 రోజుల తర్వాత కనుక ఈ పాలసీని మూసివేస్తే  ప్రీమియం పై  కనీస సర్వీస్ చార్జీలు  వసూలుచేయబడతాయి.

 

 

 

• LIC సంస్థ కొత్తగా అందించిన మెట్యూరిటీ సెటిల్మెంట్ విధానం ఈ పాలసీకి వర్తిస్తుందా?

1.  వర్తిస్తుంది. ఈ విధానం ద్వారా  మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ ని పాలసీ చివర్లో ఒక్కసారే పొందవచ్చు.
 లేదా వాయిదాల పద్దతిలో  5  సంవత్సరాల సమయం నిర్ణయించుకొని, ప్రతినెలా,  3 నెలలకు ఒకసారి, 6 నెలలకి మరియు సంవత్సరానికి ఒకసారి  లభించేలా నిర్ణయించుకొనే  సదుపాయం ఉంటుంది.  రెగ్యులర్ ఇన్కం (Regular Income) గా ఈ మెచ్యూరిటీ అమౌంట్ లభిస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *