SBI Amrit Kalash Scheme
SBI ఒక పరిమిత కాల డిపాజిట్ స్కీం తో ఎక్కువ వడ్డీ ని అందిస్తూ సరికొత్త స్థిర డిపాజిట్ (fd) ప్లాన్ ను అంధిస్తుంది. ఫిబ్రవరి 15, 2023 నుండి 31
మార్చ్ 2023 వరకు మాత్రమే ఈ స్కీం అందుబాటులో ఉంటుంది. మార్చ్ 31 తరువాత ఒక వేళ మీరు డిపాజిట్ చేద్దామనుకున్నా ఈ అమృత కలస్
ప్లాన్ అందుబాటులో వుండదు. ఎఫ్ డి అంటే ఫిక్సిడ్ డిపాజిట్ (fixed deposit) . ఈ స్కీం లో కొంత అమౌంట్ ను స్థిరంగా 500 లేదా 1000
రూపాయల నుంచి ఒక్కసారే డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ అమౌంట్ ను ఆధారంగా చేసుకుని వడ్డీ రావడం జరుగుతుంది. స్కీం సమయం పూర్తి
అయిన తర్వాత ఒక్కసారే మెచ్యూరిటీ లభిస్తుంది. లేదు అంటే స్కీం వడ్డీ చివరిలో కాకుండా ఎప్పటికప్పుడు కావాలనుకుంటే నెలకు, 3 నెలలకి
లేదా 6 నెలలకు ఒకసారి చొప్పున మీరు పొందవచ్చును. అలాగే ప్రారంభంలో మీరు డిపాజిట్ చేసిన మొత్తం అమౌంట్ ను కూడా ప్లాన్ చివరిలో
యధావిధిగా తిరిగి పొందవచ్చును.
ఈ స్కీం ఎవరికి వర్తిస్తుంది, కనీస డిపాజిట్ , స్కీం యొక్క సమయం, ప్రస్తుతం స్కీం లో స్టేట్ బ్యాంక్ అందించే వడ్డీ ఎంత? అలాగే మనం
ఒక్కసారే ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తే వడ్డీ ఎంత లభిస్తుంది. ఈ స్కీం లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి మరియు కావాల్సిన డాక్యుమెంట్స్
మొత్తం వివరాలు ఉదాహరణ ద్వారా తెలుసుకుందాము.
ఎస్.బి.ఐ అమృత్ కలాస్ ప్లాన్ (SBI Amrit Kalash Scheme) యొక్క వివరాలు
ఈ స్కీం పేరే ఎస్.బి.ఐ అమృత్ కలాస్. ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్ చేయడానికి ఎటువంటి వయసు పరిమితి లేదు. ఏ వయసు వారైనా
అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే కేవలం భారత్ దేశ నాగరికత కల్గిన వారే కాకుండా N.R.I వ్యక్తులు కూడా ఈ అకౌంట్ తీసుకోవచ్చు.
దీనితో పాటుగా ఇప్పటికే ఏదైనా బ్యాంక్ లో ఫిక్సిడ్ డిపాజిట్ (fd) లు కొనసాగుతున్న వారుకూడా ఈ అకౌంట్ ను కొనసాగించవచ్చు. ఇక స్కీం
సమయం విషయానికి వస్తే సాధారణంగా ఫిక్సిడ్ డిపాజిట్ ప్లాన్ యొక్క సమయం కనీసం 7 రోజులు నుంచి 5 సంవత్సరాల వరకు అంటే 1
సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి … మరియు 5 సంవత్సరాలకి వుంటుంది. కానీ ఈ స్కీం యొక్క సమయం 400 రోజులు.
ఇంతకంటే ఎక్కువ సమయానికి లేదా ఇంతకంటే తక్కువ సమయానికి మీకు లభించడం కుదరదు. ఎలా అంటే మార్చ్ 31 లోపు ఎంతమంది ఈ
స్కీం ను తీసుకుంటారో అప్పటి నుండి 1 సంవత్సరం 35 రోజులలోనే మీ స్కీం మెచ్యూర్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి
ప్రాధాన్యత ఇస్తారో వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.ఈ ఎస్.బి.ఐ అమృత్ కలాస్ ప్లాన్ యెక్క మినిమమ్ సింగిల్ డిపాజిట్ Rs 500 లేదా Rs 1000 వుంటుంది. మాక్సిమమ్ సింగిల్ డిపాజిట్ Rs 2 Cror.
ఇక స్కీం లో వడ్డీ రేటు ప్రతీ 3 నెలలకు మారుతూ (commutative) ఉంటుంది. ఒకవేళ మీరు స్పెషల్ ఫిక్సిడ్ డిపాజిట్ అకౌంట్ ను ఓపెన్ చేస్తే
మొత్తం వడ్డీ +డిపాజిట్ ను ఆన్ మెచ్యూరిటీ కూడా పొందవచ్చును. అదేవిధంగా మీరు ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత ఎఫ్.డి పై
రుణం కొరకు దరఖాస్తు చేయవచ్చు. ఇంకా అత్యవసరం అయితే ప్లాన్ క్లోజ్ చేసి అమౌంట్ కూడా రిటర్న్ పొందేలా ప్రీ మెచ్యూర్ క్లోజర్ ఫెసిలిటీ
(Pre Mature closer facility) కూడా అందుబాటులో వుంటుంది.
Also Read
SBI Magnum Children’s Benefit Fund Investment Plan -పిల్లల భవిష్యత్ కి మంచి స్కీమ్
SBI Mitra SIP Telugu – డబల్ బెనిఫిట్ స్కీం ప్రతీ నెల Rs 6000/- జీవితాంతం
SBI Life Poorna Suraksha Plan – Rs 314 /- రూపాయలకే రెండు పాలసీలు,Benefits,Eligiblity,Features
ఈ ఎస్.బి.ఐ అమృత్ కలాస్ ప్లాన్ వడ్డీ రేట్లను గమనిస్తే 4 కేటగిరీ వ్యక్తులకు వేర్వేరుగా వడ్డీ నీ అంధిస్తుంది.
Rate of Interest of SBI |
1. Senior Citizens or Pensioners - 8.60% |
2.SBI Employee or Pensioner - 8.10% |
3.General Senior Citizen -7.60% |
4.Genaral Public Rate -7.10% |
1) సీనియర్ సిటిజెన్ ఆర్ పెన్షనర్ – 60 సంవత్సరాలు వయసు పైబడిన లేదా ఇప్పటికే ఉద్యోగ విరమణ (Retired) అయ్యి పెన్షన్ తీసుకుంటున్న
వ్యక్తులకు కనీసం 8.60% వడ్డిను ఈ స్కీం అంధిస్తుంది. ఒకవేళ యవ్వన వయసు వారు ఈ స్కీం వల్ల తమకు ఉపయోగం లేదు అనుకుంటే దానికి
ఒక పరిష్కారం వుంది. ముందు వివరిస్తాను.
2) ఎస్.బి.ఐ ఉద్యోగి లేదా ఎస్.బి.ఐ పెన్షనర్ – మీరు SBI లో పని చేస్తూ వున్నట్లయితే లేదా పని చేస్తూ పెన్షన్ తీసుకున్నట్లయితే 8.10% వడ్డీ మీకు
లభిస్తుంది.
3) ఎటువంటి ప్రభుత్వ సంస్థతో సంబంధం లేకుండా 60 సంవత్సరాలు పైబడిన సాధారణ వ్యక్తులకు 7.60% వడ్డీ లభిస్తుంది.
4) మీరు సాధారణ వ్యక్తి అంటే 60 సంవత్సరాల లోపు వ్యక్తి అయితే 7.10% వడ్డీ ను ఈ స్కీం లో పొందవచ్చు.
ఇప్పుడు ఈ స్కీం లో ఎంత అమౌంట్ ఒక్కసారే డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ ఎంత లభిస్తుందో కాలిక్యులేట్ చేసి చూద్దాం.
Deposit | General | Senior Citizens |
Rs=10 Lakh | Rs=10,80,058 | Rs10,85,875 |
Rs=8 Lakh | Rs=8,64,046 | Rs8,68,701 |
Rs=6 Lakh | Rs=6,48,035 | Rs6,51,156 |
Rs=4 Lakh | Rs=4,32,023 | Rs4,34,350 |
Rs=1 Lakh | Rs=1,08,005 | Rs1,08,587 |
ఈ విధంగా మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో తక్కువ సమయానికి ఎక్కువ అమౌంట్ ను డిపాజిట్ చేసి ప్రయోజనం పొందవచ్చు. అలాగే
ఒకవేళ మీరు సీనియర్ సిటిజెన్ కాకపోతే మీ ఇంట్లో వుండే గ్రాండ్ మదర్ , గ్రాండ్ ఫాదర్ ద్వారా ఈ అకౌంట్ ఓపెన్ చేసి ఆ వడ్డీ మీ అకౌంట్ లో
పొందవచ్చు.
సాధారణ ఫిక్సెడ్ డిపాజిట్ స్కీం లో ఏవిధంగా అయితే ఒక లిమిట్ దాటిన తరువాత టాక్స్ డిడక్షన్ ఛార్జెస్ వర్తిస్తాయో ఆ విధంగానే ఈ స్కీంలో
కూడా వర్తిస్తుంది.
కావాల్సిన డాక్యుమెంట్స్
ఆధార్ కార్డు,
పాన్ కార్డ్,
డేట్ అఫ్ బర్త్