LIC Jeevan Umang Policy Telugu – సం||రానికి Rs 40,000/- జీవితాంతం మరియు మెట్యూరిటీ కూడా, పూర్తి వివరాలు ఇవే!

   LIC Jeevan Umang  Policy  Details In  Telugu

 

 

LIC Jeevan Umang Policy Telugu

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని భీమా రంగంలో ప్రసిద్ధి చెందినది అని అందరికీ తెలిసిందే. వినియోగదారుల ఆర్థిక మరియు భీమా అవసరాలను తీర్చడానికి,  LIC వివిధరకాల భీమా పథకాలను సులభతరమైన విధానం లో  అందిస్తుంది. అలాంటి వాటిలో జీవన్ ఉమంగ్ ప్లాన్ .

 ఉమంగ్ ప్లాన్ అనేది  అత్యంత ప్రత్యేకమైన మరియు ఏకైక ‘హోల్ లైఫ్ ప్లాన్’  ( Whole life Insurance +  Regular Income Plan )  ప్రతీ సంవత్సరం ప్రాధమిక భీమా పై 8% చొప్పున జీవితాంతం అందివ్వడంతో పాటుగా మెట్యూరిటీ మరియు డెత్ బెనిఫిట్స్ ను అందించే విధంగా జీవన్ ఉమంగ్ రూపొందించబడింది  . ఇంకా  జీవన్ ఉమంగ్ ప్లాన్ అనేది సాంప్రదాయ  ( స్టాక్ మార్కెట్ కాదు ) కాబట్టి, ఇది లాభాలను బోనస్ రూపంలో తమ కస్టమర్లకు  కూడా అందిస్తుంది.

LIC జీవన్ ఉమంగ్ పాలసీ యొక్క అర్హతలు , ప్రీమియం , రైడర్స్ , ప్లాన్ పని చేసే విధానం మరియు ఇతర ముఖ్య సమాచారాన్ని ఉదాహరణ రూపంలో తెలుసుకొందాం !

 

 

 

LIC Jeevan Umang (945) Telugu - సం||రానికి Rs 40,000/- జీవితాంతం మరియు మెట్యూరిటీ కూడా, పూర్తి వివరాలు ఇవే!

 

 

LIC  జీవన్ ఉమంగ్  ముఖ్యమైన ఫీచర్స్ – Features

 

• ప్రీమియం చెల్లింపు సమయం – Premium Period

LIC తమ పాలసీదారులకు వివిధరకాల  ప్రీమియం చెల్లింపు ఆప్షన్లను అందిస్తుంది.

క్రింద తెలిపిన విధంగా ప్రీమియం చెల్లించే కాలాన్ని పాలసీదారులు వారి అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు.

A.    15 సంవత్సరాలు
B.    20 సంవత్సరాల
C.    25 సంవత్సరాలు
D.    30 సంవత్సరాలు

 

• పాలసీ సమయం – Policy Period

LIC యొక్క జీవన్ ఉమంగ్ ప్లాన్ యొక్క మెచ్యూరిటీ వయస్సు 100 సంవత్సరాలు కాబట్టి, పాలసీదారుడి ప్రస్తుత వయస్సును 100 లో నుండి తీసివేసి పాలసీ యొక్క  వ్యవధిని లెక్కిస్తారు.

ఉదాహరణకు, పాలసీదారుడు 25 సంవత్సరాల వయస్సులో ప్లాన్‌ను కొనుగోలు చేస్తుంటే, పాలసీ వ్యవధి 75 సంవత్సరాలు అవుతుంది.

 

• ప్రీమియం మోడ్ – Premium Mode

జీవన్ ఉమంగ్ పాలసీదారులకు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన పాలసీ ప్రీమియంలను చెల్లించడానికి అనుమతిస్తుంది.

నెలవారీ ప్రీమియం చెల్లింపులు జరపడానికి, పాలసీదారులు నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH ) ద్వారా  చెల్లింపులు చేయగల సౌకర్యం కల్పించడం జరిగింది.

 

• లోన్ సదుపాయం – Loan Facility

LIC జీవన్ ఉమంగ్ అత్యవసర సమయంలో పాలసీదారునికి లోన్ ను అందిస్తుంది. దీని కొరకు కనీసం 2సంవత్సరాలు కంటిన్యూగా ప్లాన్ లో ప్రీమియం చెల్లించి ఉండాలి. లోన్ యొక్క రిపేమెంట్ ( Re – Payment ) ను తక్కువ వడ్డీ సహాయంతో కంపెనీ కి చెల్లించాలి.

 

• సరెండర్ ( నిలిపివేయడం ) – Surrender Facility

పాలసీదారులు కనీసం 2 సంవత్సరాల పాటు పాలసీలో ప్రీమియంలను చెల్లించి ఉంటే, వారు  వారి యొక్క పాలసీని సరెండర్ చేయవచ్చు తద్వారా చెల్లించిన ప్రీమియం వెనక్కి లభిస్తుంది కానీ పాలసీని సరెండర్ చేస్తే చార్జలు ఎక్కువ విధించడం జరుగుతుంది.

 

• ఫ్రీ లుక్ పీరియడ్ – Free Look Period

LIC యొక్క జీవన్ ఉమంగ్ పాలసీ తీసుకున్న 15 రోజుల వరకు ఫ్రీ లుక్ పీరియడ్ వ్యవధిని కలిగి ఉంటుంది. ఆ వ్యవధిలో, పాలసీదారులు పాలసీ నిబంధనలు మరియు షరతులను పరిశీలించి, పాలసీ తమకి అనుగుణంగా లేదని భావిస్తే తుది నిర్ణయం తీసుకోవచ్చు ఈ సమయంలో మొత్తం ప్రీమియం రిటర్న్ లభిస్తుంది.

 

•    ప్రస్తుతం మనకి ఎంత  బోనస్ ప్లాన్ లో లభిస్తుంది? ( LIC Jeevan Umang Policy  Bonus Rates )

LIC బోనస్ రేట్స్ ని ప్రతీ ఆర్థిక సంవత్సరంలో  పాలసీదారులకు  అందిస్తుంది లభించే బోనస్ ,పాలసీ యొక్క సమయం పై  ఆధారపడి ఉంటాయి.

http://

       Policy Period 

          Bonus Rates

        15 Years

  Rs 48 to 55 

        20 Years

  Rs 56 to 70

        25 Years

  Rs 71 to 85 

       30 Years

  Rs 86 & Above  

ముఖ్య గమనిక : బోనస్ రేట్లలో మార్పులు సహజం .

 

• రైడర్స్ ( Riders )

రైడర్స్ బేస్ భీమా పై అదనపు ప్రయోజనం కల్పిస్తాయి చాలా తక్కువ ప్రీమియం చెల్లెస్తూ వీటిని మీరు తీసుకోవచ్చు. LIC జీవన్ ఉమాంగ్ 3 రకాల రైడర్స్ ను అందిస్తుంది.

1. ఆక్సిడెంట్ల్ డెత్ బెనిఫిట్ రైడర్
2. టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్
3. న్యూ క్రిటికల్ ఇళ్లన్స్ రైడర్ మరియు
4. ఆక్సిడంటల్ డెత్ & డిసబిలిటీ రైడర్.

వీటి గురించి విస్తారముగా ముందు చూద్దాం .

 

•  పాలసీ రివైవల్ – Policy Revival 

ఏదైనా కారణంగా ఎక్కువ కాలం ప్రీమియం చెల్లించకపొతే పాలసీముగియువేయబడుతుంది.అటువంటి సమయంలో మొత్తం ప్రీమియంని కలిపి చెల్లించేలా 5 సంవత్సరాలు  పాలసీ రివైవల్ ఫెసిలిటీ ఉంటుంది.

 

• టాక్స్ బెనిఫిట్స్ – Tax Benefits

1961 ఆదాయపు పన్ను చట్టం కింద సెక్షన్ 80C కింద ఈ పాలసీకి చెల్లించిన ప్రీమియం మొత్తానికి పన్ను మినహాయింపులకు అర్హత కలదు. ఈ పాలసీ ద్వారా వచ్చే ఆదాయంపై కూడా పాలసీదారులు పన్ను ప్రయోజనాలను (tax benefits) క్లెయిమ్ చేయవచ్చు.

 

• కామెన్స్ మెంట్  అఫ్ రిస్క్ – Commencement Of risk

LIC జీవన్ ఉమంగ్ పాలసీని 8 సంవత్సరాల లోపు పిల్లలకి కనుక తీసుకొంటే, పాలసీ తీసుకొన్న 2 సంవత్సరాల తర్వాత నుంచి రిస్క్ కవరేజ్ ప్రారంభం అవుతుంది.

8 సంవత్సరాల పైబడిన పిల్లలకి కనుక తీసుకొంటే, పాలసీ తీసుకొన్న వెంటనే రిస్క్ కవరేజ్ ప్రారంభం అవుతుంది.

 

• ఈ పాలసీలో చెల్లించే ప్రీమియంపై  డిస్కౌంట్ ?  ( Premium  Rebate? )

http://

         Premium Mode 

         Rebate 

            Monthly 

          Nil 

           Quarterly 

          Nil 

           Half Yearly 

           1%

            Yearly 

           2%

 

రిబేట్ అంటే మీరు చెల్లించే ప్రీమియం అమౌంట్ పై   కొద్దిగా  తగ్గించడం జరుగుతుంది ,సంవత్సరానికి మరియు 6 నెలలకు ఒకసారి  ప్రీమియం చెల్లించేవారికి ఈ రిబేట్ లభిస్తుంది.

 

• పాలసీలో తీసుకొనే భీమాపై  ఎంత  డిస్కౌంట్ లభిస్తుంది? ( Rebate On high basic Sum Assured? )

 

భీమా ( Basic Sum Assured )                        రిబేట్

1. 1, 00, 000 నుంచి  1, 95, 000                         = Nil
2. 2, 00, 000 నుంచి  4, 95, 000                       = 1.50%
3. 5, 00, 000 నుంచి  9, 95, 000                       = 2.50%
4. 10, 00, 000 నుంచి  అత్యధికముగా             = 3.50%

ఈ విధంగా అత్యధిక బీమాపై కూడా ఈ పాలసీలో    రిబేట్ లభిస్తుంది.

 

 

LIC జీవన్ ఉమంగ్ పాలసీ  బెనిఫిట్స్ – Benefits

 

సర్వైవల్ బెనిఫిట్ – ( Survival Benefit )

LIC యొక్క జీవన్ ఉమంగ్ ప్లాన్ లో ఒక ఆకర్షణీయమైన  ప్రయోజనం(సర్వైవల్ బెనిఫిట్)  పాలసీ దారులకు అందించబడుతుంది. పాలసీ  టర్మ్ ముగిసే వరకు, అతడు/ఆమె జీవించి ఉంటే, వారికి సర్వైవల్ బెనిఫిట్  చెల్లించబడుతుంది.

సర్వైవల్ బెనిఫిట్ కింద భీమా  మొత్తంలో 8% చొప్పున ప్రతి సంవత్సరంవ్యక్తి కి 99 సంవత్సరాల వరకు జీవితాంతం చెల్లించబడుతుంది. ఉదాహరణ కి ఒక వ్యక్తి   5 లక్షల భీమా   తీసుకొంటే 8% చొప్పున Rs 40,000/- ప్రతీ సంవత్సరం 99 సంవత్సరాల వరకూ .

 

LIC  జీవన్ ఉమంగ్ డెత్ బెనిఫిట్ – ( Death Benefit )

LIC  జీవన్ ఉమంగ్ ప్లాన్ లో డెత్ బెనిఫిట్ చెల్లింపు క్రింది విధంగా ఉంటుంది:

Before the Commencement of Risk

చిన్న పిల్లల కి పాలసీ తీసుకొనే సందర్భంలో ఈ నియమం వర్తిస్తుంది. పాలసీ యొక్క రిస్క్ ప్రారంభ తేదీ కంటే ముందు పాలసీ దారుడు ( బాలిక/ బాలుడు )మరణిస్తే, LIC సంస్థ నామినీకి అప్పటి వరకు చెల్లించిన అన్ని ప్రీమియంలను తిరిగి చెల్లిస్తుంది.
ఈ విషయంలో డెత్ బెనిఫిట్స్ నామినీకి ఎలాంటి వడ్డీ లేదా బోనస్ చెల్లించ బడదు.

 

After the Commencement of Risk

అంటే, రిస్క్ ప్రారంభమైన తేదీ తర్వాత పాలసీ దారుడు మరణించిన సందర్భంలో,

ప్రాథమిక భీమా + వేస్టెడ్ సింపుల్ రెవిసనరీ బోనస్ మరియు ఫైనల్ బోనస్ ను నామినికి అందివ్వడం జరుగుతుంది.

 

“Basic Sum Assured + Vested Simple Reversionary Bonus + Final Additional Bonus “

1. ప్రాథమిక భీమా
2. వార్షిక  చెల్లింపు ప్రీమియం పై 7 రేట్లు మరియు
3. మొత్తం ప్రీమియం చెల్లింపుల పై 10 రెట్లు, ఈ 3 ఇంటిలో ఏది ఎక్కువ లభిస్తే దాన్ని డెత్ బెనిఫిట్ గా అందిస్తారు.

 

• మెచ్యూరిటీ బెనిఫిట్ – Maturity Benefit

LIC Jeevan Umang Policy  ప్రీమియం చెల్లించడం ముగియగానే 8% చొప్పున ప్రతి సంవత్సరం సర్వేవల్ బెనిఫిట్ రావడం జరుగుతుంది, చివర్లో మెట్యూరిటీ గా

ప్రాథమిక భీమా + వేస్టెడ్ సింపుల్ రెవిసనరీ బోనస్ మరియు ఫైనల్ బోనస్ ను నామినికి అందివ్వడం జరుగుతుంది.

“Basic Sum Assured + Vested Simple Reversionary Bonus + Final Additional Bonus ”

 

LIC జీవన్ ఉమాంగ్ పాలసీని తీసుకోవడానికి అర్హులు – Eligibility

 

http://

     Eigibility 

         Minimum 

      Maximum 

 Age 

  90 Days 

 55 Years for PPT 15 Years 

 50 Years for PPT 20 Years     45 Years for PPT 25 Years 

 40 Years for PPT 30 Years 

Sum Assured 

  2 Lakh 

No limit 

Premium Paying 

 15 Years 

30 Years 

 

పాలసీ తీసుకొవడానికి కనీస వయస్సు   ( Minimum Age ) = 90 Days ( రోజులు )

అత్యధిక వయస్సు  (maximum Age ) వచ్చి = 55 Years

 

• పాలసీ సమయం –  Policy Term

ఒకే పాలసీ సమయాన్ని కలిగి ఉంటుంది అది100 సంవత్సరాలు – ప్రస్తుత వ్యక్తి వయసు ( 100 Years – Present age = Policy Term )

ఉదాహరణ కి 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి పాలసీని తీసుకోవాలంటే 100 సం||లు – 30 సం ||లు = 70 సం||లు పాలసీ సమయం అవుతుంది.

 

• భీమా పరిమితులు? –  Sum Assured

కనీస భీమా పరిమితి        = Rs 2,00,000/- రూపాయలు.
అత్యధిక  భీమా పరిమితి = Rs పరిమితి లేదు /-

 

•   గరిష్ట మెట్యూరిటీ  సమయం ? –  Maximum Maturity Age

ఈ పాలసీయొక్క  అత్యధిక మెట్యూరిటీ కాల పరిమితి 100 సం||లుగా ఉంటుంది.

 

• ప్రీమియం ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి? – Premium Paying Term

మీ యొక్క అవసరానికి అనుగుణంగా 15 ,20, 25 మరియు 30 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించవచ్చు.

 

• ప్రీమియం చెల్లింపులు –  Premium Paying Mode

వార్షిక ( Yearly )  ప్రతినెలా ( Monthly ) ట్రైమాసిక  ( Quarterly ) మరియు అర్ద వార్షిక  (  Half Yearly ) రూపంలో ప్రీమియం చెల్లించవచ్చు.

 

 

వీటిని కూడా చదవండి

 

LIC Jeevan Labh Policy 936 & ఎల్. ఐ. సి ఈ స్కీం లో రోజుకి Rs 66/- రూ||లు పొదుపు చేస్తే, మెట్యూరిటీ సమయంలో 13 లక్షలు పొందవచ్చు, వివరాలు చెక్ చెయ్యండి

 

Jeevan Lakshya Plan In Telugu 933 &విద్యా,వివాహం ,వ్యాపారానికి అద్భుతమైన పాలసీ &#అర్హతలు ఇవే !

 

 Jeevan Akshay 7 ( 857 ) Telugu &#30 ఏళ్ళ వయసు నుంచే పెన్షన్ పొందండి & Eligibility ,Deposit, వివరాలు ఇవే

 

 

LIC జీవన్ ఉమాంగ్  పాలసి ఉదాహరణ – Example

 

Scenario – 1

 

ఇది ఒక హోల్ లైఫ్ స్కీం.  పాలసి కొనసాగుతున్న సమయంలోనే మధ్యలో సర్వేవల్ రూపంలో ప్రతీ సం|| అమౌంట్ లభించును  మరియు చివర్లో మేట్యూరిటీ కూడా రావడం జరుగుతుంది.

 

తండ్రి పేరు ( Father Name )                             – Mr. రఘు
అతని వయసు    ( Age )                                      – 30 సంవత్సరాలు
కుమారుడు పేరు    ( Children Name )              – Mr. రవి
కుమారుని వయసు    ( Agee )                              – 2 సం ||లు
ప్రీమియం సమయం   ( Premium Paying )      – 30 సంవత్స రాలు

భీమా      ( Bhima )                                                  = 5 లక్షలు
నెలసరి ప్రీమియం   ( Monthly Premium )       = Rs 1,315/-
ప్రీమియం వైవర్ బెనిఫిట్  ( PWB )                     = ఉంది
పాలసీ సమయం ( Policy Period )                       = ( 99-2 ) = 97 సం ||లు

Mr. రఘు 30 సంవత్సరాలకి పాలసీని తీసుకోవడం జరిగింది కాబట్టి 30 సంవత్సరాలు రెగ్యులర్ ప్రీమియం చెల్లిస్తాడు.

ఈ విధంగా ప్లాన్ లో చెల్లించిన మొత్తం = Rs 4,63,690/-

ఒక ఆర్థిక సంవత్సరంలో టాక్స్ సేవింగ్ సుమారు 30% = Rs 4,735/-

ప్లాన్ యొక్క 32 వ సం|| నుంచి 8% చొప్పున లభించే వార్షిక రెగ్యులర్ సర్వేవల్ బెనిఫిట్ = Rs 40,000/- ఇది 99 ఏళ్ళు వచ్చే వరకూ కంటిన్యూగా  రావడం జరుగుతుంది.

 

మెట్యూరిటీ బెనిఫిట్ – Maturity Benefit

Mr. రవి కి 99 సంవత్సరాల వరకు Rs 40,000/- లభిస్తుంది, 100 వ సం|| మెట్యూరిటీ..

ప్రాథమిక భీమా ( Basic Sum Assured )= Rs 5,00,000/-

ప్లాన్ లో లభించే మొత్తం బోనస్           = Rs 54,77,500/-

రెండు కలిపి Rs 59,77,500/- మెట్యూరిటీ గా అందివ్వబడుతుంది.

 

చిల్డ్రన్ కి రిస్క్ జరిగితే డెత్ బెనిఫిట్ – Death Benefit

Before the Commencement of Risk

Mr రఘు ప్రీమియం వైవర్ బెనిఫిట్ ను తీసుకోవడం జరిగింది, ఈ సందర్భంలో నియమం వర్తిస్తుంది. పాలసీ యొక్క రిస్క్ ప్రారంభ తేదీ కంటే ముందు పాలసీ దారుడు ( బాలిక/ బాలుడు )మరణిస్తే, LIC సంస్థ నామినీకి అప్పటి వరకు చెల్లించిన అన్ని ప్రీమియంలను తిరిగి చెల్లెస్తుంది నామినీకి ఎలాంటి వడ్డీ లేదా బోనస్ చెల్లించ బడదు.

After the Commencement of Risk 

అంటే, రిస్క్ ప్రారంభమైన తేదీ తర్వాత పాలసీ దారుడు మరణించిన సందర్భంలో,

ప్రాథమిక భీమా + వేస్టెడ్ సింపుల్ రెవిసనరీ బోనస్ మరియు ఫైనల్ బోనస్ ను నామినికి అందివ్వడం జరుగుతుంది.

“Basic Sum Assured + Vested Simple Reversionary Bonus + Final Additional Bonus ”

1. ప్రాథమిక భీమా
2. వార్షిక  చెల్లింపు ప్రీమియం పై 7 రేట్లు మరియు
3. మొత్తం ప్రీమియం చెల్లింపుల పై 10 రెట్లు, ( LIC Jeevan Umang Policy )  ఈ 3 ఇంటిలో ఏది ఎక్కువ లభిస్తే దాన్ని డెత్ బెనిఫిట్ గా అందిస్తారు.

ముఖ్య గమనిక:-

ఒకవేళ ప్రీమియం చెల్లించే వ్యక్తి ( తల్లి లేదా తండ్రి ) ప్లాన్ మధ్యలో మరణిస్తే ప్రీమియం వైవర్ రైడర్ కారణం చేత ప్లాన్ లో చెల్లించవలసిన భవిష్యత్ ప్రీమియం మాఫీ చేయబడుతుంది మరియు పాలసీ సమయం పూర్తికాగానే రెగ్యులర్ సర్వేవల్ అమౌంట్, అంతే కాకుండా మెట్యూరిటీ సమయంలో పూర్తి అమౌంట్ అందివ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్లాన్ ను పిల్లలకి తీసుకొనే సందర్భంలో రైడర్ తీసుకోవడం తప్పనిసరి.

 

Scenario – 2

 

పాలసీదారుని పేరు  ( Father Name )         – Mr.అజయ్
అతని వయసు  ( Age )                                  – 25 సంవత్సరాలు
పాలసి సమయం ( Premium Period )        – 30 సంవత్సరాలు
భీమా ( Bhima )                                              = 5  లక్షలు
నెలసరి ప్రీమియం ( Monthly Premium ) = Rs 1,335/-
పాలసీ సమయం ( Policy Period )              = ( 99-25) = 74 సం ||లు

అందువల్ల Mr. అజయ్ 30 సంవత్సరాలకి పాలసీని తీసుకోవడం జరిగింది కాబట్టి 30 సంవత్సరాలు రెగ్యులర్ ప్రీమియం చెల్లిస్తాడు.

ఈ విధంగా ప్లాన్ లో చెల్లించిన మొత్తం = Rs 4,71,555/-

ఒక ఆర్థిక సంవత్సరంలో టాక్స్ సేవింగ్ సుమారు 30% = Rs 4,815/-

ప్లాన్ యొక్క 55 వ సం|| నుంచి 8% చొప్పున లభించే వార్షిక రెగ్యులర్ సర్వేవల్ బెనిఫిట్ = Rs 40,000/- ఇది 99 ఏళ్ళు వచ్చే వరకూ కంటిన్యూగా  రావడం జరుగుతుంది.

 

మెట్యూరిటీ బెనిఫిట్ – Maturity Benefit

Mr. అజయ్ కి 99 సంవత్సరాల వరకు Rs 40,000/- లభిస్తుంది, 100 వ సం|| మెట్యూరిటీ..

ప్రాథమిక భీమా ( Basic Sum Assured )= Rs 5,00,000/-

ప్లాన్ లో లభించే మొత్తం బోనస్            = Rs 43,50,000/-

రెండు కలిపి Rs 48,50,000/-మెట్యూరిటీ గా అందివ్వబడుతుంది.

 

డెత్ బెనిఫిట్ ( Death Benefit )

పాలసీదారుడు రిస్క్ జరిగి మరణించిన సందర్భంలో,

ప్రాథమిక భీమా, వేస్టెడ్ సింపుల్ రెవిసనరీ బోనస్ మరియు ఫైనల్ బోనస్ ను నామినికి అందివ్వడం జరుగుతుంది.

“Basic Sum Assured + Vested Simple Reversionary Bonus + Final Additional Bonus “

1. ప్రాథమిక భీమా
2. వార్షిక  చెల్లింపు ప్రీమియం పై 7 రేట్లు మరియు
3. మొత్తం  చెల్లింపుల పై 10 రెట్లు, ఏది ఎక్కువ లభిస్తే దాన్ని డెత్ బెనిఫిట్ గా నామినికి అందిస్తారు.

 

 

LIC Jeevan Umang 945  రైడర్స్ ( Riders ):-

 

1.  క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ – Critical illness Rider

పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొన్న విధంగా   2 క్లిష్ట అనారోగ్యాలలో,  దేనినైనా నిర్ధారించిన తర్వాత  ఈ ప్లాన్ బీమా మొత్తానికి సమానమైన మొత్తాన్ని అందిస్తుంది.క్యాన్సర్ మరియు గుండెపోటు నుండి అదనపు రక్షణను అందిస్తుంది.  పాలసీకి  అదనపు కవర్‌తో రక్షణను అందిస్తుంది మరియు విభిన్న అవసరాలను తీర్చడానికి భీమా మొత్తాన్ని ఎంపిక చేసుకోవడానికి సౌకర్యం కలదు.

.

2. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ – Accidental Death Benefit Rider

పాలసీదారుడు ప్రమాదం కారణంగా మరణిస్తే నామినీకి అదనపు మొత్తం చెల్లించబడుతుందిమరియు బేస్ పాలసీ కింద కవరేజీకి అదనపు రక్షణను అందిస్తుంది.వివిధ అవసరాలకు అనుగుణంగా ఈ రైడర్ ద్వారా భీమా మొత్తాన్ని అందిస్తుంది.

 

3.  డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్ – Accidental Disability Benefit Rider

బేస్ ప్లాన్ ప్రకారం పాలసీ తీసుకునే సమయంలో లేదా పాలసీ వార్షికోత్సవం సందర్భంగా ఈ రైడర్‌ను ఎంచుకోవచ్చు.
జీవిత బీమా చేసిన వ్యక్తి ప్రమాదానికి గురైతే  ప్రమాదంలో ప్రాధమిక అవయవాలని  కోల్పోయి  , ప్రమాదం జరిగిన తేదీ నుండి 180 రోజులలోపు వైకల్యాలు ఏర్పడితే,ఈ రైడర్  వ్యక్తి కి ప్రయోజనాన్ని అందిస్తుంది.

 

4. ప్రీమియం వైవర్ రైడర్ ( Premium Waiver Benefit Rider) 

పాలసీ మధ్యలో భీమదారునికి రిస్క్ జరిగితే,ప్రీమియం వైవర్ రైడర్ కారణంగా పాలసీ క్లోజ్ చెయ్యడం జరగదు. భవిష్యత్ ప్రీమియం LIC  సంస్థ చెల్లిస్తుంది.ప్రీమియం వైవర్ రైడర్ కారణం చేత ప్లాన్ లో చెల్లించవలసిన భవిష్యత్ ప్రీమియం మాఫీ చేయబడుతుంది మరియు పాలసీ సమయం పూర్తికాగానే రెగ్యులర్ సర్వేవల్ అమౌంట్, అంతే కాకుండా మెట్యూరిటీ సమయంలో పూర్తి అమౌంట్ అందివ్వడం జరుగుతుంది.

 

 

LIC jeevan Umang Policy  945   తరచుగా అడిగే ప్రశ్నలు – Q & A

 

1. LIC జీవన్ ఉమంగ్ మంచి పాలసీయేనా?

జ.అవును ఇది మంచి పాలసీ నే!  ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

a.ప్రీమియం చెల్లింపు టర్మ్ (PPT) పూర్తయిన తర్వాత సమ్ అష్యూర్డ్‌పై హామీ ఇవ్వబడిన 8% రాబడి లభిస్తుంది.  పాలసీదారుడి వయస్సు 100 సంవత్సరాలు వచ్చే వరకు ఈ రాబడిని పొందవచ్చు.

b. మీరు ప్లాన్ వ్యవధిలో ఎప్పుడైనా ఈ ప్లాన్‌ని మూసివేసి, మెచ్యూరిటీని తీసుకోవచ్చు. ఈ మెచ్యూరిటీ మీకు ఇప్పటికే లాభాన్ని అందించిన వార్షిక రాబడికి అదనంగా ఉంటుంది.

c. LIC యొక్క ఇతర ఎండోమెంట్ ప్లాన్‌లతో పోలిస్తే జీవన్ ఉమంగ్‌లో బోనస్ రేట్లు అత్యధికం.

 

 

2. జీవన్ ఉమంగ్‌లో కనీస మరియు గరిష్ట పెట్టుబడి మొత్తం ఎంత?

జ. జీవన్ ఉమంగ్‌లో గరిష్ట పరిమితి లేదు.  కనీస భీమా మొత్తం రూ.2,00,000/- గాను,  కనీస వార్షిక ప్రీమియం రూ 15739/- గా ఉంటుంది.

 

3.LIC సంస్థ కొత్తసెటిల్మెంట్ విధానం ఈ పాలసీకి వర్తిస్తుందా?

1.   విధానం ద్వారా  మొత్తం మెట్యూరిటీ అమౌంట్ ని పాలసీ చివర్లో ఒక్కసారే  పొందవచ్చు లేదా వాయిదాల పద్దతిలో  5, 10, మరియు  15 సంవత్సరాల సమయం  లభించేలా నిర్ణయించుకొనే  సదుపాయం ఉంటుంది. ఆ విధంగానే  మీకు రెగ్యులర్ గా ఈ మెట్యూరిటీ అమౌంట్ లభిస్తుంది.

 

4. ఒకే వ్యక్తి పేరు మీద  రెండు పాలసీలను తీసుకోవడం సాధ్యమేనా?

జ. అవును, ఈ జీవన్ ఉమాంగ్  ప్లాన్‌లో  ఒకే వ్యక్తి పేరు మీద ఒకటి కంటే ఎక్కువ పాలసీలను తీసుకోవచ్చు.

 

5. జీవన్ ఉమాంగ్ పాలసీలో నెలవారీ పెన్షన్ అవకాశం ఉందా?  అది ఉన్నట్లయితే, నెలవారీ  ఎంత శాతం?

జ. జీవన్ ఉమంగ్‌పాలసీలో, వార్షిక ప్రాతిపదికన డబ్బు తిరిగి వస్తుంది మరియు సమ్ అష్యూర్డ్‌ మొత్తంలో  8% రేటు తో లభిస్తుంది.

 

6.LIC జీవన్ ఉమంగ్ ప్లాన్‌లో NRIలు పెట్టుబడి పెట్టవచ్చా?

జ.అవును, NRIలు LIC ఉమంగ్ ప్లాన్‌ పాలసీ తీసుకోవచ్చు.  NRIలు  తమ పిల్లల కోసం కూడా ఈ ప్లాన్‌ని కొనుగోలు చేయవచ్చు.

 

7.LIC  ఉమంగ్ పాలసీ అర్హతలు?

కనీస ప్రవేశ వయస్సు 90 రోజులు.
గరిష్ట ప్రవేశ వయస్సు 55 సంవత్సరాలు.
ప్రీమియం చెల్లింపు గడువు ముగిసే సమయానికి పాలసీదారులకు కనీసం 30 ఏళ్ల వయస్సు ఉండాలి.
ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసే సమయానికి పాలసీదారుల వయస్సు 70 సంవత్సరాల వరకు ఉండవచ్చు.
8 ఏళ్లు పైబడిన పాలసీదారులకు రిస్క్ కవరేజ్  వెంటనే ప్రారంభమవుతుంది. 8 సంవత్సరాలలోపు వయసు గల పాలసీదారులకు, 2 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తే, ఆ తర్వాత రిస్క్ కవరేజ్ ప్రారంభమవుతుంది.

https://licindia.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *