LIC Jeevan Akshay 7 ( 857 ) Policy Details In Telugu
LIC జీవన్ అక్షయ్ 7 అద్భుతమైన నాన్ లింకేడ్ నాన్ పార్టిసిపేట్ సింగిల్ ప్రీమియం ఇమ్మీడియేట్ పెన్షన్ ప్లాన్ ( Non Linked non Participated Single Premium deposit Immediate Pension Plan ). ఈ రోజు ప్లాన్ కొనుగోలు చేస్తే వచ్చే నెల నుంచే రెగ్యులర్ పెన్షన్ లైఫ్ టైమ్ రావడం జరుగుతుంది, వృద్ధాప్యంలో భరోసా కల్పించడంలో జీవన్ అక్షయ్ మీకు ఎంతగానో సహాయపడవచ్చు.
విభిన్నమైన ఆప్షన్స్ వేరు వేరు సదుపాయాల ద్వారా ఈ ప్లాన్ ను LIC ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. LIC జీవన్ అక్షయ్ 7 అర్హతలు, ప్రయోజనాలు, లోన్, సరెండర్, ప్లాన్ ఆప్షన్స్ తో పాటుగా ఒక్కసారే ఎంత అమౌంట్ డిపాజిట్ చేసి ఎంత రెగ్యులర్ పెన్షన్ పొందవచ్చునో తెలుసుకొందాం!

LIC జీవన్ అక్షయ్ 7 ప్రయోజనాలు – Key Features
1. విభిన్నమైన 10 రకాల ఆప్షన్స్ ను జీవన్ అక్షయ్ 7 అందిస్తుంది, మీ అవసరానికి అనుగుణంగా పెన్షన్ ను నిర్దారించుకోవచ్చు.
2. ఇమ్మీడియేట్ యాన్యూటీ పద్దతిలో ప్లాన్ తీసుకొన్న వెంటనే రెగ్యులర్ పెన్షన్ ప్రారంభం అవుతుంది.
3. 30 సంవత్సరాలు నిండిన భారతదేశ వ్యక్తులు పాలసీకి అర్హులు.
4. కొన్ని ఆప్షన్స్ లో కనీసం 3 నెలలు తర్వాత ప్లాన్ ను సరెండర్ చేసి మీ యొక్క డిపాజిట్ ను రిటర్న్ పొందవచ్చు.
5. అత్యవసర సమయంలో జీవన్ అక్షయ్ లోన్ సదుపాయం కూడా కల్పిస్తుంది.
6. ఈ పాలసీని పొందడానికి వ్యక్తి ఎటువంటి వైద్య పరీక్షలకి హాజరుకనక్కర్లేదు.
7. జీవన్ అక్షయ్ ప్లాన్ ను ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా కొనుగోలు చెయ్యవచ్చు, 2% డిస్కౌంట్ ఆన్లైన్ కొనుగోలు పై అందివ్వడం జరుగుతుంది.
8. ఆప్షన్ J మరియు ఆప్షన్ F లలో డెత్ బెనిఫిట్ ను లంప్ సమ్ గా ఒక్కసారే లేదా లభించే అమౌంట్ తో నామినీ మళ్ళీ పెన్షన్ ను కొనుగోలు చెయ్యవచ్చు.
LIC జీవన్ అక్షయ్ ఆప్షన్స్ – Available Annuity Options
A. ఇమ్మీడియేట్ యాన్యూటీ ఫర్ లైఫ్ ( Immediate Annuity for Life )
పాలసీదారుడు జీవించి ఉన్నంత వరకూ నిర్ణంచుకొన్న పెన్షన్ మోడ్ ఆధారంగా ( వార్షిక, అర్ధవార్షిక, ట్రైమాసిక మరియు మాసిక ) రెగ్యులర్ పెన్షన్ జీవితాంతం అందివ్వడం జరుగుతుంది. జీవిత పర్యంలో వ్యక్తి ఎప్పుడు మరణించినా నామినికి ఎటువంటి డెత్ బెనిఫిట్ లేదా ప్రారంభంలో వ్యక్తి డిపాజిట్ చేసిన అమౌంట్ గాని లభించడం జరగదు.
B. ఇమ్మీడియేట్ యాన్యూటీ విత్ గ్యారెంటెడ్ పీరియడ్ అఫ్ 5 ఇయర్స్ అండ్ లైఫ్ తెరెఫ్టర్ ( Immediate Annuity with guaranteed period of 5 Years and life thereafter)
C. ఇమ్మీడియేట్ యాన్యూటీ విత్ గ్యారెంటెడ్ పీరియడ్ అఫ్ 10 ఇయర్స్ అండ్ లైఫ్ తెరెఫ్టర్ ( Immediate Annuity with guaranteed period of 10 Years and life thereafter)
D. ఇమ్మీడియేట్ యాన్యూటీ విత్ గ్యారెంటెడ్ పీరియడ్ అఫ్ 15 ఇయర్స్ అండ్ లైఫ్ తెరెఫ్టర్ ( Immediate Annuity with guaranteed period of 15 Years and life thereafter)
E. ఇమ్మీడియేట్ యాన్యూటీ విత్ గ్యారెంటెడ్ పీరియడ్ అఫ్ 20 ఇయర్స్ అండ్ లైఫ్ తెరెఫ్టర్ ( Immediate Annuity with guaranteed period of 20 Years and life thereafter)
B,C, D మరియు E వ ఆప్షన్స్ లో వ్యక్తి రెగ్యులర్ పెన్షన్ లైఫ్ టైమ్ పొందడం జరుగుతుంది అయితే గ్యారెంటెడ్ పీరియడ్ ( 5, 10, 15, మరియు 20 సంవత్సరాల) సమయంలో పాలసీదారునికి రిస్క్ జరిగితే నామినీకి డెత్ బెనిఫిట్ రూపంలో వ్యక్తి పాలసీలో జమ చేసిన డిపాజిట్ అమౌంట్ లభిస్తుంది. ఒకవేళ గ్యారెంటెడ్ పీరియడ్ ( 5, 10, 15, మరియు 20 సంవత్సరాల) తర్వాత వ్యక్తి కి రిస్క్ జరిగితే ఎటువంటి ప్రయోజనం లభించడం జరగదు.
F. ఇమ్మీడియేట్ యాన్యూటీ ఫర్ లైఫ్ విత్ రిటర్న్ అఫ్ పర్చూస్ ప్రైస్ ( Immediate Annuity for life with return of Purchase Price )
ఒకసారి పాలసీని ఖరీదు చేస్తే వ్యక్తి కి జీవితాంతం రెగ్యులర్ పెన్షన్ లైఫ్ టైమ్ అందివ్వడం జరుగుతుంది, ఒకవేళ పాలసీదారుడికి రిస్క్ జరిగితే ఎటువంటి సమయంతో సంబంధం లేకుండా డిపాజిట్ అమౌంట్ నామినీకి లభిస్తుంది.
G. ఇమ్మీడియేట్ యాన్యూటీ ఫర్ లైఫ్ ఇంక్రీసింగ్ ఏట్ ఏ సింపుల్ రేట్ అఫ్(3% పర్ అనుమ్ ( Immediate Annuity for life increasing at a simple rate of 3% per Annam )
పాలసీదారుడు జీవించి ఉన్నంత వరకూ నిర్ణంచుకొన్న పెన్షన్ మోడ్ ఆధారంగా రెగ్యులర్ పెన్షన్ జీవితాంతం అందివ్వడం జరుగుతుంది.లభించే పెన్షన్ అనేది 3% చొప్పున ప్రతీ సంవత్సరం పెరుగుతుంది ( మొదటి సం|| Rs 30,000/- రెండవ సం || Rs 30,900/- మూడవ సంవత్సరం Rs 30,927/- ఇలా ) జీవిత పర్యంలో వ్యక్తి ఎప్పుడు మరణించినా నామినికి ఎటువంటి డెత్ బెనిఫిట్ లేదా ప్రారంభంలో వ్యక్తి డిపాజిట్ చేసిన అమౌంట్ గాని లభించడం జరగదు.
Also Read
H.జాయింట్ లైఫ్ ఇమ్మీడియేట్ యాన్యూటీ ఫర్ లైఫ్ విత్ ఏ ప్రోవిషన్ ఫర్ 50% అఫ్ ది యాన్యూటీ టూ ది సెకండరీ ఎన్యు్టెంట్ ఆన్ డెత్ అఫ్ ది ప్రైమరీ ఎన్యు్టెంట్. ( Joint life immediate Annuity for life with a provision for 50% of the annuity to the secondary annuitant on death of the Primary Annuitant )
ఈ ఆప్షన్ ద్వారా పాలసీదారుడు తనతోపాటుగా ఒక వ్యక్తి ని అదనంగా చేర్చుకోవచ్చు, పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం రెగ్యులర్ పెన్షన్ ను జీవితాంతం పొందుతాడు కానీ ఒకవేళ అతను కాలం చేస్తే జాయింట్ లైఫ్ గా రెండవ వ్యక్తి కి కూడా అతనికి లభించే పెన్షన్ అమౌంట్ లో 50% పెన్షన్ జీవితాంతం లభించడం జరుగుతుంది, కాలాంతరంలో ఆమె కూడా మరణిస్తే ఈ ప్లాన్ అక్కడితో ముగుస్తుంది.
I. జాయింట్ లైఫ్ ఇమ్మీడియేట్ యాన్యూటీ ఫర్ లైఫ్ విత్ ఏ ప్రోవిషన్ ఫర్ 100% అఫ్ ది యాన్యూటీ
టూ ది సెకండరీ ఎన్యు్టెంట్ ఆన్ డెత్ అఫ్ ది ప్రైమరీ ఎన్యు్టెంట్. ( Joint life immediate Annuity for life with a provision for 100% of the annuity to the secondary annuitant on death of the Primary Annuitant )
ఆప్షన్ H మాదిరిగానే పనిచేస్తుంది అందులో 50% పెన్షన్ రెండవ వ్యక్తి కి లభిస్తే ఇందులో 100% లభిస్తుంది.
పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం రెగ్యులర్ పెన్షన్ ను జీవితాంతం పొందుతాడు ఒకవేళ అతను కాలం చేస్తే జాయింట్ లైఫ్ గా రెండవ వ్యక్తి కి కూడా అతనికి లభించే పెన్షన్ అమౌంట్ లో 100% పెన్షన్ జీవితాంతం లభించడం జరుగుతుంది, కాలాంతరంలో ఆమె కూడా మరణిస్తే ఈ ప్లాన్ అక్కడితో ముగుస్తుంది.
J. జాయింట్ లైఫ్ ఇమ్మీడియేట్ యాన్యూటీ ఫర్ లైఫ్ విత్ ఏ ప్రోవిషన్ ఫర్ 100% అఫ్ ది యాన్యూటీ పే యబ్లె ఎస్ లాంగ్ ఎస్ వన్ అఫ్ ది ఎన్యు్టెంట్సర్వీవెస్ అండ్ రిటర్న్ అఫ్ పరిచస్ ప్రైస్ ఆన్ డెత్ అఫ్ లాస్ట్ సర్వవోర్ ( Joint life immediate Annuity for life with a provision for 100% of the annuity Payable as long as one of the annuitant survives and return of Purchase Price on death of last Survivors )
ఈ ఆప్షన్ లో కూడా ఇద్దరి వ్యక్తులకి ( ఎవరు ఎక్కువ కాలం జీవించి ఉంటే )100% రెగ్యులర్ పెన్షన్ రావడం జరుగుతుంది అలాగే ఇద్దరు వ్యక్తుల మరణం తర్వాత ప్రారంభంలో పాలసీదారుడు ప్లాన్ లో డిపాజిట్ చేసిన అమౌంట్ ను నామినికి లేదా వారి పిల్లలకి అందివ్వడం జరుగుతుంది.
పాలసీ తీసుకోవడానికి అర్హతలు – LIC Jeevan Akshay 7 Eligibility
• పాలసీ తీసుకొవడానికి కనీస వయస్సు( Minimum Age ) = 30 సం ||లు
కనీస వయస్సు( Maximum Age ) = 85 సం ||లు
• పాలసీని ఎన్ని సంవత్సరాలకు తీసుకొనే వీలుంటుంది?
ఒక్కసారి కొనుగోలు చెయ్యడం ద్వారా జీవితాంతం పెన్షన్ లభిస్తుంది.
• భీమా పరిమితులు? – Sum Assured
కనీస భీమా ఖరీదు = Rs 1, 00, 000/- రూపాయలు.
అత్యధిక భీమా ఖరీదుకికి ఎటువంటి అవధి లేదు.
లక్ష రూపాయలు నుంచి అత్యధికముగా ఎంతైనా భీమాని తీసుకోవచ్చు.
• ప్రీమియం ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి? ( PPT )
ఎల్. ఐ. సి కొత్త అక్షయ్ ప్లాన్ ( Table No – 857) సింగల్ ప్రీమియం డిపాజిట్ ప్లాన్ కాబట్టి మొత్తం ప్లాన్లో ఒక్కసారి అమౌంట్ డిపాజిట్ చేసి జీవితాంతం రెగ్యులర్ పెన్షన్ పొందవచ్చు.
ఉదాహరణ – LIC Jeevan Akshay 7 Example
పాలసీదారుని పేరు ( Name ) – Mr. సూర్యారావు
వయసు ( Age ) – 60 సంవత్సరాలు
భార్య రేవతి వయసు ( Wife ) – 55 సంవత్సరాలు
ప్రీమియం డిపాజిట్ ( Deposit ) – Rs 2,00 000/-
టాక్స్ ఛార్జ్ ( Tax ) – Rs 3,600/-
మొత్తం సింగల్ ప్రీమియం ( Total Premium ) – Rs 2,03,600/-
పెన్షన్ ( Pension Mode ) = వార్షిక పెన్షన్
సూర్యారావు కి ఏ ఆప్షన్ ద్వారా వార్షిక పెన్షన్ ఎంత లభిస్తుందో టేబుల్ సహాయంతో చూద్దాం !
ఇతర ముఖ్య ప్రయోజనాలు – Other Important Benefits
• పెన్షన్ చెల్లింపులు విధానం – Pension Mode
4 రకాలు….
1. సంవత్సరానికి ఒకసారి – Yearly
2. 6 నెలలకు ఒకసారి – Half Yearly
3. 3 నెలలకు ఒకసారి – Quarterly
4. ప్రతినెలా
• ఫ్రీ లుక్ పీరియడ్ ( Free Look Period )
పాలసీకి సంబందించిన నియమాలపై మీరు అసంతృప్తి చెందితే ఆన్లైన్ లో పాలసీని కొనుగోలు చేస్తే 30 రోజులు, ఆఫ్ లైన్ ఏజెంట్ మాద్యమం గా 15 రోజులు ఫ్రీ లుక్ పీరియడ్ లభిస్తుంది. ఈ సమయంలో పాలసీని క్లోజ్ చెయ్యడం ద్వారా మొత్తం డిపాజిట్ ను యధావిదిగ పొందవచ్చు, ఒకవేళ ఈ సమయం దాటితే కనీస సర్వీస్ చార్జలు విధించబడును.
• డెత్ బెనిఫిట్ – Death Benefit
LIC న్యూ జీవన్ అక్షయ్ 7 ఎటువంటి మెట్యూరిటీ అమౌంట్ ను అందివ్వడం జరగదు ఎందుకంటె వ్యక్తి కి లైఫ్ టైమ్ పెన్షన్ అందివ్వడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
• కనీస పెన్షన్ – Minimum Annuity
1. సంవత్సరానికి ఒకసారి – Rs 12,000
2. 6 నెలలకు ఒకసారి – Rs 6,000
3. 3 నెలలకు ఒకసారి – Rs 3,000
4. ప్రతినెలా
• టాక్స్ ప్రయోజనాలు ( Tax Benefits )
1. ప్లాన్ లో చెల్లించే డిపాజిట్ అమౌంట్ పై సెక్షన్ 80 C వర్తించడం ద్వారా టాక్స్ డెడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
2. ప్లాన్ లో లభించే పెన్షన్ టాక్స్ వర్తిస్తుంది.
3. డెత్ బెనిఫిట్ క్లెయిమ్ అమౌంట్ టాక్స్ రహితంగా 10 D లభించడం జరుగుతుంది.
• కావాల్సిన డాకుమెంట్స్ – Required Documents
1. వయసు అదారిత సర్టిఫికెట్
2. ఆదాయ సర్టిఫికెట్
3. అడ్రస్ ప్రూఫ్
4. ఐడెంటిటీ ప్రూఫ్ మరియు ఫోటోలు
•డెత్ క్లెయిమ్ ప్రాసెస్ – Claim Documents
1. పాలసీ డాకుమెంట్స్
2. డెత్ సర్టిఫికెట్, ప్రూఫ్
3. క్లెయిమ్ నిర్వహణ ఫారం
4. జన్మదిన సర్టిఫికెట్
5. NEFT
ముగింపు – Conclusion
LIC Jeevan Akshay 7 కి సంభందించిన వివరాలు మీకు అందివ్వడం జరిగింది మరిన్ని మంచి విషయాల కొరకు ఇన్సూరెన్స్ మార్కెట్ తెలుగు. కామ్ ని ఎప్పటికప్పుడు సందర్శించగలరు.