LIC Aadhaar Shila Plan ( 944)  Telugu -” కేవలం మహిళలకు మాత్రమే ” ప్రయోజనాలు, అర్హతలు ఇవే!

LIC Aadhaar Shila  ( 944) Details In  Telugu

 

LIC Aadhaar Shila

మహిళల కోసమే ఎల్. ఐ .సి ప్రత్యేకముగా రూపొందించిన పాలసీ ఎల్. ఐ. సి ఆధార్ శిల ( LIC Aadhaar Shila )  టేబుల్ నెంబర్ 944 . ఈ ప్లాన్ ద్వారా మహిళలు ఒక చిన్న మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా,  మంచి సేవింగ్ తోపాటుగా పాలసీ సమయం మొత్తం ఇన్సూరెన్సు కూడా లభించడం జరుగుతుంది , పాలసీ సమయం ముగియగానే ఒక పెద్ద మొత్తం  ఒక్కసారే అందివ్వబడుతుంది .సామాన్య మరియు మధ్య తరగతి మహిళలకి అందుబాటులో వుండే విధంగా 75 వేలు మాత్రమే కనీస భీమాగా నిర్ధారించబడింది .

వయో పరిమితి నుంచి పాలసీ కి సంబందించిన పూర్తి వివరాలు ఒక్కొక్కటి చొప్పున తెలుసుకొందాం .

 

 

 

 

 పాలసీని తీసుకోవడానికి అర్హులు ఎవరు? ( Eligibility ? )

 

http://

Eligibility 

Minimum 

Maximum 

Entry Age 

8 Years 

55 Years 

Policy Period 

10 Years 

20 Years 

Sum Assured 

Rs 75,000

Rs 3,00,000

Bonus Rate 

Rs 34  Per Y

Rs 39 Per Y

 

•   వయసు – Age 

ఈ పాలసీ తీసుకొనే  మహిళ  యొక్క కనీస వయస్సు ( Minimum Age ) = 8 సంవత్సరాలు.
అత్యధిక వయస్సు      (maximum Age ) = 55 సంవత్సరాలు.

 

• పాలసీ సమయం ? (  Policy Term  )

కనీస పాలసీ సమయం వచ్చి  (Minimum Policy Period )  = 10 సంవత్సరాలు
అత్యధిక పాలసీ సమయం  ( Maximum Policy Period ) =  20  సంవత్సరాలు

అందువల్ల ఈ పాలసీ యొక్క సమయాన్ని 10 నుంచి 20 సంవత్సరాల మధ్య  నిర్ణయించుకోవచ్చు.

 

•  పాలసీ యొక్క   భీమా పరిమితి ( Sum Assured)

ఈ పాలసీ యొక్క కనీస భీమా పరిమితి = Rs 75,000/- రూపాయలు.
అత్యధిక  భీమా పరిమితి   = Rs 3,00,000/-

కనీసం 75 వేలు నుంచి  అత్యధికముగా 3 లక్షల వరకూ భీమా లభిస్తుంది.

 

•  పాలసీ యొక్క  గరిష్ట మెట్యూరిటీ  ( Maximum Maturity Age )

ఈ పాలసీయొక్క  అత్యధిక మెట్యూరిటీ కాల పరిమితి = 70 సంవత్సరాలుగా  ఉంటుంది ,కాబట్టి సంవత్సరాలలోపు పాలసీ ముగిసేవిధంగా చూసుకోవాలి.

 

ఇతర ముఖ్య ప్రయోజనాలు   –   Other Benefits

 

• లోన్  సదుపాయం  ( Loan Facility )

పాలసీదారుడు  కనీసం 2 సంవత్సరాలు అంతరాయం లేకుండా  పూర్తి ప్రీమియం చెల్లిస్తే ,  అత్యవసర పరిస్థితుల్లో  జమా చేసిన  ప్రీమియం పై లోన్ కూడా పొందవచ్చు.

 

• ఫ్రీ లుక్ పీరియడ్ ( Free Look Period )

LIC  పాలసీ తీసుకున్న 15 రోజుల వరకు ఫ్రీ లుక్ పీరియడ్ వ్యవధిని కలిగి ఉంటుంది. ఆ వ్యవధిలో, పాలసీదారులు పాలసీ నిబంధనలు మరియు షరతులను పరిశీలించి పాలసీ విరమణ నిర్ణయం తీసుకోవచ్చు ,  ఈ సందర్బంగా మొత్తం ప్రీమియం రిటర్న్ లభిస్తుంది.

 

• పాలసీ విరమణ – Surrender Facility

LIC Aadhaar Sila   ప్లాన్ ను మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు సరెండర్ చెయ్యవచ్చు  దీని కొరకు కనీసం 2 సంవత్సరాలు ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది అప్పుడే పాలసీ సరెండర్ కి అనుమతి లభిస్తుంది.

 

• ఈ పాలసీలో  ప్రీమియంని ఏ విధంగా చెల్లించాలి?  ( Premium  Paying )

ఈ పాలసీలో  4 రకాలుగా  ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది.

1. సంవత్సరానికి     – Yearly
2. 6 నెలలకు           – Half Yearly
3. 3 నెలలకు           – Quarterly
4. ప్రతినెలా             – Monthly

 

•    ఇన్కమ్ టాక్స్ బెనిఫిట్స్  – Tax Benefits

ఈ ప్రయోజనం కింద, బీమా చేసిన వ్యక్తి కి రూ. Rs 1,50,000 పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుండి మినహాయింపు లభిస్తుంది. మెచ్యూరిటీ బెనిఫిట్ రూపంలో అతనికి అందే మొత్తం టాక్స్ పడకుండా ఉంటుంది.

 

LIC Dhan Rekha Plan Telugu 863 &#కొత్త స్కీం ప్రతీ  1000/- కి 60 రూపాయల బోనస్ &#ధన్ రేఖ పాలసీ పూర్తి వివరాలు ఇక్కడ చెక్ చెయ్యండి.

 

LIC Jeevan Umang Policy Telugu  సం||రానికి Rs 40,000/- జీవితాంతం మరియు మెట్యూరిటీ కూడా, పూర్తి వివరాలు ఇవే!

 

SBI Life Smart Samriddhi Policy Telugu & సామాన్యులకి బంగారం లాంటి పధకం,100% గ్యారంటీ రిటర్న్స్!

  ఉదాహరణ    –   LIC Aadhaar Shila Example 

 

పాలసీదారుని పేరు  ( Name )                                     – Ms .రాణి
వయసు    ( Age )                                                            – 25 సంవత్సరాలు
పాలసీ సమయం  ( Policy Period )                             – 20 సంవత్సరాలు
భీమా       ( Bhima )                                                           =  3  లక్షలు
ప్రీమియం సమయం    ( Premium Paying )                = 30  సంవత్సరాలు
నెలసరి ప్రీమియం           ( Monthly Premium )         = Rs 904/-
ప్లాన్ లో చెల్లించిన మొత్తం    ( Total Premium )         = Rs 2,12,593/-
టాక్స్ డెడక్షన్  ( Tax Deduction )  = Rs 3,255/-

 

• మెట్యూరిటీ ( Maturity Benefit )

Ms. రాణి కి 20 సంవత్సరాల పాలసీ సమయంలో ఎటువంటి రిస్క్ జరగకపోతే చివర్లో మెట్యూరిటీ ఈ కింద విధంగా వస్తుంది.

ప్రాథమిక భీమా ( Basic Sum Assured )  = Rs 3,00,000/-
లాయల్టీ బోనస్ ( Loyalty Bonus )           = Rs 9,75,000/-

మొత్తం ( Total Amount )  = Rs 3,97,500/- మెట్యూరిటీ గా రావడం జరుగుతుంది.

 

మరణ ప్రయోజనం (  Death Benefit )

20 సం||రాల పాలసీ సమయంలో Ms. రాణి కి ఎప్పుడు రిస్క్ జరిగినా సరే నామినికి ఈ క్రింద ప్రయోజనం అందిస్తారు.

1. ప్రాథమిక భీమా పై 110% ( Rs 3,33,000)
2. వార్షిక ప్రీమియం కి 7  రేట్లు ( Rs 10,851 × 7 = Rs  75,957 )
3. అప్పటివరకు చెల్లించిన మొత్తం ప్రీమియం పై 105% తో పాటుగా పాలసీదారిణి రైడర్ తీసుకొంటే ఆ అమౌంట్ ను కూడా కలిపి నామినికి అందివ్వడం జరుగుతుంది.

ముఖ్య గమనిక : పై 3 షరతులలో  ఎందులో ఎక్కువ డబ్బులు లభిస్తే దానిని మాత్రమే డెత్ బెనిఫిట్ గా ఇస్తారు.

 

1. ఆక్సిడెంట్  డెత్ & డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ ( Accidental Death and Disability Benefit Rider – UIN  512B209V02)

ఈ రైడర్ ను పాలసీసమయంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు మరియు చివరి 5 సంవత్సరాలు ఇంకా పాలసీసమయం మిగిలి ఉన్నా  తీసుకొనే సదుపాయం ఉంటుంది.  అత్యధికముగా పాలసీదారునికి  70 సంవత్సరాల  వయసు వచ్చే వరకూ ఈ  రైడర్ ప్రయోజనాన్ని                         అందిస్తుంది.
ఈ రైడర్ తీసుకొన్న పాలసీదారుని ఆక్సిడెంట్ వల్ల రిస్క్ జరిగితే   ప్రాథమిక భీమాకి లభించే మరణ ప్రయోజనం తోపాటు అందనంగా , మరికొంత అధిక ప్రయోజనం నామినికి లభించడం జరుగుతుంది.

 

Ms. రాణి ఆక్సిడెంట్ కారణంచేత మరణిస్తే

ప్రాథమిక భీమా 3 లక్షలు, పాలసీ కొనసాగిన సమయంలో   లభించే బోనస్ మరియు రైడర్ రూపంలో మరొక 3 లక్షలు అదనంగా నామినీకి రావడం జరుగుతుంది ఈ రైడర్ కొరకు తక్కువ మొత్తంలో ప్రీమియం వసూలు చేయబడుతుంది.

 

• LIC మెట్యూరిటీ సెటిల్మెంట్  – ( Maturity Settlement )

ఈ ఆప్షన్ ద్వారా మెట్యూరిటీ అమౌంట్ ని    ఎల్. ఐ. సి ఆధార్ శిల   పాలసీ చివర్లో ఒక్కసారే పొందవచ్చు లేదా వాయిదాల పద్దతిలో  5, 10,15 సంవత్సరాల సమయం నిర్ణయించుకొని, ప్రతినెలా, ప్రతీ 3 నెలలకు, 6 నెలలకి  మరియు సంవత్సరానికి ఒకసారి  లభించేలా నిర్ణయించుకొనే  సదుపాయం ఉంటుంది.
ముఖ్య గమనిక : ఈ ఎంపికను పాలసీదారుడు  కనీసం 3 నెలలు  పాలసీ సమయం  ఉండగానే LIC సంస్థకి  తెలియచేయాలి.

 

• ఫ్రీ లుక్ సమయం – ( Free Look Period )

పాలసీ తీసుకొన్న తర్వాత పాలసీ యొక్క షరతులు మరియు నిబంధనలు పట్ల అసంతృప్తి చెందితే, ఆన్లైన్ లేదా సంస్థ ద్వారా ఖరీదు చేస్తే 30 రోజులు, ఇతర మాద్యమాల ద్వారా ఖరీదు చేస్తే 15 రోజులు ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది.

 

https://licindia.in/

•  కావాల్సిన డాకుమెంట్స్ – Required Documents 

1.ఆధార్ కార్డు
2. అడ్రస్ ప్రూఫ్
3. పాన్ కార్డు
4. బ్యాంకు పాస్ బుక్

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *