Mutual funds Telugu – మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటీ , ఎన్ని రకాలు ,ప్రయోజనాలు మరియు ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి ?

                   Mutual funds Details in  Telugu

 

Mutual funds  Telugu

మ్యూచువల్ ఫండ్ అంటే ప్రస్తుత రోజుల్లో ఒక ఆసక్తికరమైన పెట్టుబడి మార్గంగా ఉంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో  అనేక సంఖ్యలో పెట్టుబడిదారులు  తమ యొక్క  మూలధనంపై  ఎక్కువ  రాబడిని, కొంత కాలానికే సంపాదించడానికి తమ పెట్టుబడులను కొనసాగిస్తారు. వ్యక్తులు వారి యొక్క జీవిత లక్ష్యాలను ( పిల్లల చదువు వివాహం ఉద్యోగం వ్యాపారంలో ఉన్నతి మరియు సొంత ఇంటి నిర్మాణం మొదలగు వాటిని ) సులభంగా నిర్వహించడం కొరకు  మ్యూచువల్ ఫండ్లలో  పెట్టుబడి పెడుతున్నారు.

 

ప్రధానంగా ఈ  మ్యూచువల్ ఫండ్స్ లో,  ఫండ్ మేనేజర్ ( Fund Manager )  లేదా పోర్ట్‌ఫోలియో మేనేజర్  ( Portfolio ) అనే పేరుతో  ఉన్న   ఆర్ధిక  నిపుణుడి ద్వారా  ఈ పెట్టుబడులు అన్నీ నిర్వహించబడుతాయి. విభిన్న మార్గాల్లో వ్యక్తుల నుంచి సేకరించిన డబ్బును  గవర్నమెంట్   బాండ్లు  ( Government Bonds ) , స్టాక్‌లు ( Stock Market ), బంగారం ( Gold ) మరియు ఇతర ఆస్తులు వంటి వివిధ రూపాలలో  పెట్టుబడి పెట్టడం మరియు  స్థిరమైన రాబడిని పెట్టుబడి దారులకు అందించడమే వీరి పని.

 

 

 

  1. What are Mutual Funds ?
  2. Good Mutual fund  Analytics ?
  3. Types of Mutual Funds In India ?
  4. How to Select Good Mutual Fund ?
  5. Benefits of Mutual fund Investment ?
  6. How to Apply  & Required Documents ?

 

మ్యూచువల్ ఫండ్లలో  పెట్టుబడి పెట్టవచ్చా? ( Can I Invest in Mutual Funds )

మ్యూచువల్ ఫండ్లలో  పెట్టుబడి పెట్టడానికి కనీస నైపుణ్యం అవసరం. ఎందుకంటే,  మీరు ఫైనాన్షియల్ మార్కెట్‌ను పరిశోధించి, అందులో  ఉన్న ఉత్తమమైన ఎంపికలను (ఆప్షన్స్) విశ్లేషించగలగాలి.ఈ ఆర్టికల్ మొత్తం చదవడం ద్వారా మీరు కనీసం శాతం పరిజ్ఞానాన్ని గ్రహించగలరు , ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయడం ద్వారా మా నిపుణులు జవాబులు అందివ్వగలరు.

ఒకవేళ షేర్ మార్కెట్‌ను లోతుగా పరిశీలించడానికి మీకు నైపుణ్యం లేకపోయినా  లేదా సమయం లేకపోతే, మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టడం ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ, ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మీ యొక్క పెట్టుబడులను జాగ్రత్తగా చూసుకుంటారు మరియు సహేతుకమైన రాబడిని అందించడానికి వీరు తీవ్రంగా కృషి చేస్తారు.  మనం కొన్ని రకాల  సేవల కోసం  (    బ్యాంకింగ్ సర్వీస్ లు , పోస్టల్ సర్వీస్ లు , మెసేజ్ అలెర్ట్ ,కస్టమర్ కేర్ సేవల కొరకు)  ఏ విధంగా  కొంత మొత్తం చెల్లించినట్లే,  మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల  నిర్వహణ కోసం  ఫండ్ మేనేజర్ ( Fund Manager )  లేదా పోర్ట్‌ఫోలియో మేనేజర్  ( Portfolio)కు   నిర్దిష్టమైన రుసుములను అధికారికంగానే   చెల్లించవలసి ఉంటుంది.

 

ఒక పెట్టుబడిదారునికి సేవల కొరకు విధించే రుసుమునే   స్టాక్ మార్కెట్ పరిభాషలో ఎక్సపెన్సే రేషియో  ( Expense Ratio )  అంటారు . ఇన్వెస్ట్ అమౌంట్ పై 0.5% – 0.75%  ఉంటే చాల మంచి ఎక్సపెన్సే రేషియో గాను అత్యధికముగా 1.50%  అంగీకారం .  1.50%  ఎక్సపెన్సే రేషియో   దాటిన మ్యూచువల్ ఫండ్స్ లో  అమౌంట్ ఇన్వెస్ట్ చెయ్యడం పై చాలా  కోణాల్లో పరిశీలన  చెయ్యాల్సి ఉంటుంది .

 

.

 

మ్యూచువల్ ఫండ్స్ లో  పెట్టుబడి పెట్టడం వలన లాభాలు పరిశీలిస్తే – Mutual Funds Benefits

 

మ్యూచువల్ ఫండ్స్ లో  అమౌంట్ ను ఇన్వెస్ట్ చెయ్యడానికి రెండు పద్ధతులు కలవు .

 

రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ( Regular Mutual Funds )  :- పెట్టుబడిదారుడు సంబంధిత బ్యాంకు లేదా బ్రోకరాయ్స్ కంపెనీ ద్వారా స్కీం లో అమౌంట్ డిపాజిట్ చెయ్యడం .

డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ( Direct  Mutual Funds )    :- ఈ విధానం లో పెట్టుబడిదారుడు ఎటువంటి బ్యాంకు లేదా ఇతర మాధ్యమాల ద్వారా కాకుండా నేరుగా కంపెనీ యొక్క వెబ్ సైట్ లేదా ఆప్ సహాయముతో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాడు .

రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ మరియు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ కి తేడా ఏమిటంటే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ లో సంబంధిత బ్యాంకు లేదా బ్రోకరాయ్స్ కంపెనీకి సర్వీస్ రుసుము చెల్లించాలి , కానీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎటువంటి సర్వీస్ రుసుము విధించడం జరగదు .

 

 

Mutual funds Telugu - మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటీ , ఎన్ని రకాలు ,ప్రయోజనాలు మరియు ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి ?

 

 

మ్యూచువల్ ఫండ్స్  ఎలా పనిచేస్తాయి? ( How does Mutual Funds Work?) 

ఫండ్స్‌ గురించి అర్ధం అయ్యేందుకు మీకు ఒక ఉదాహరణ వివరిస్తాను. ఎల్. ఐ. సి. (  LIC )మేనేజ్‌మెంట్ అనే పేరుతో ఉన్న కంపెనీ ,       ఎల్. ఐ. సి.   మ్యూచువల్ ఫండ్ ( Best Returns Mutual Fund ) అనే పధకాన్ని ప్రవేశపెట్టింది అనుకుందాం  Mutual funds In Telugu  . ఈ పధకం క్రింద బెస్ట్ రిటర్న్ మిడ్ క్యాప్  ( Mid Cap ) స్కీమ్ ఉంది. స్టాక్ మార్కెట్ ద్వారా ఈ స్కీమ్  వివిధ పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ. 100 కోట్లు సేకరించింది.

ఈ స్కీమ్ గనుక ఈక్విటీ స్కీమ్ ఐతే షేర్లలో ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. అదే డెట్ స్కీమ్ ఐతే ఈ డబ్బుని గవర్నమెంట్ సెక్యూరిటీస్, బాండ్లలలో పొదుపు చేస్తారు. ఈ ఫండ్ మొదట్లో ఒక యూనిట్‌ను రూ. 10కి ఇచ్చిందని అనుకుందాం. ఒక్కో యూనిట్‌కు గాను రూ. 10 కాబట్టి మొత్తంగా రూ. 10,000 చెల్లించి 1000 యూనిట్లను కొనుగోలు చేశారు.

ఒక్క సంవత్సరం తర్వాత బెస్ట్ రిటర్న్ మిడ్ క్యాప్ ఫండ్ విలువ రూ. 12కు చేరింది. అప్పుడు మీ యూనిట్స్‌ను తిరిగి మ్యూచవల్ ఫండ్స్‌ లో అమ్మినట్లైతే, మీరు కొనుగోలు చేసిన 1000 యూనిట్లకు  రూ. 12,000 పొందుతారు
ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్ లో లాభాలు మీకు వస్తాయి.

 

భద్రత – Security

మ్యూచువల్ ఫండ్స్ ని పెద్ద పెద్ద బ్యాంకులు, ట్రస్ట్ లు నిర్వహిస్తూ ఉంటాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా ప్రభుత్వానికి సంబంధించిన SEBI   (Securities and Exchange Board of India) వద్ద రిజిస్టర్ చేసుకొని  సెబీ నిబంధనల ప్రకారంగానే పనిచేస్తాయి. దేశంలో బ్యాంకు లను రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా  RBI , ఇన్సూరెన్సు ను , ఇన్సూరెన్సు రేగులటరీ అండ్ దేవోలోప్మెంట్ అథారిటీ అఫ్ ఇండియా  IRDAI  ఏవిధంగా నిర్వహిస్తున్నాయి.  అదేవిధంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డ్ అఫ్ ఇండియా SEBI  స్టాక్ మార్కెట్ మరియు  మ్యూచువల్ ఫండ్స్ ని       నిర్వహిస్తుంది అయితే   గవర్నమెంట్ ఆధీనం లోనే  మ్యూచువల్ ఫండ్స్  పనిచేస్తాయి కానీ  మ్యూచువల్ ఫండ్స్  లో పెట్టుబడిదారునికి లభించే లాభ నష్టాలకు సెబీ భాద్యత వహించదు,  కంపెనీకి మాత్రమే భాద్యత వహిస్తుంది .  ఈ మ్యూచువల్ ఫండ్స్ ని  సెబీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది   కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లో నిర్భయంగా పెట్టుబడి పెట్టవచ్చు.

 

నెవ్ యూనిట్లు కనుగోలు – NAV ( Net Asset Value ) 

మ్యూచువల్ ఫండ్స్  లో మనం ఇనెస్ట్ చేసే అమౌంట్ ద్వారా నెవ్ యూనిట్స్ ను   ( NAV Units )  కనుగోలు చెయ్యడం జరుగుతుంది.  మ్యూచువల్ ఫండ్స్  లో ప్రతి స్కీం కి ఒక  ఖచ్చితమైన  నవ్ వేల్యూ ఉంటుంది దీన్ని ప్రమాణం అని అనవచ్చు  మరింత సులువుగా ఆరోజు ధర . అసలు నవ్ యూనిట్ మన ఇన్వెస్ట్మెంట్ పై ఏ విధమైన ప్రభావం చూపుతుంది .

 

ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం !

స్టేట్ బ్యాంకు టెక్నాలజీ ఫండ్ స్కీం యొక్క ప్రస్తుత నవ్ వేల్యూ వచ్చి – Rs 100  అనుకుందాం .  Rs 5, 000 రూపాయలు ప్రతి నెల మీరు డిపాజిట్ చేస్తున్నట్లైతే   50 షేర్స్ మీకు లభించడం జరుగుతుంది . ఒక  6  నెలల తర్వాత నవ్ వేల్యూ    Rs 150  , యిప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ లాభం దిశలో వుంది , అదే నవ్ వేల్యూ   Rs 90 , ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ నష్టం లేదా సామాన్యంగా ఉందన్నమాట  .  ఈ పరిగణ నవ్ వేల్యూ ద్వారా సాద్య పడుతుంది అందువల్ల నవ్ వేల్యూ తక్కువగా వున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ జరిపితే ఎక్కవ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది .

 

పారదర్శకత – Transparency

ఒక పెట్టుబడిదారునిగా మీ డబ్బు ఎక్కడ పెట్టుబడిగా పెట్టబడిందో, ప్రస్తుతం దాని విలువ ఎంత ఉంది, రిటర్న్స్ వంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు మీకు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేయబడతాయి.అందువల్ల మీ యొక్క పెట్టుబడి మరియు రాబడికి సంబందించిన వివరాలు క్షుణ్ణముగా ఇంటి వద్ద నుంచే తెలుసుకోవచ్చు .

 

సులభతరం – Easy Process

మ్యూచువల్ ఫండ్స్ లో  డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకుకోవచ్చు. మీరు దరఖాస్తు చేసుకున్న రెండు లేదా మూడు రోజుల్లో మీ డబ్బు మీ బ్యాంకు అకౌంట్ లోకి  ట్రాన్స్ఫర్ అవుతుంది.ఈ సదుపాయం మీరు తీసుకొన్న స్కీం పై ఆధారపడి ఉంటుంది వీటి గురించి మరిన్ని విషయాలు ముందు చూద్దాం .

 

చిన్న – చిన్న మొత్తాల పొదుపు – Small Investment

మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఒకేసారి ఎక్కువగా పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ప్రతి నెల కొద్ది కొద్దిగా, మీ ఆర్థిక స్తోమత కు అనుగుణంగా,  మీరు ఎంత వరకు పొదుపు చేయగలరో అంత పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా చిన్న చిన్న పొదుపులన్నీ కలిపి చక్రవడ్డీ సూత్రం ప్రకారం భవిష్యత్తులో ఎక్కువ సంపదను సృష్టిస్తుంది.

 

PPF Scheme in Telugu -&# పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్&# అర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!

 

విస్తరణ – Expansion

మీరు పెట్టుబడిగా పెట్టిన మొత్తం డబ్బులను,  ఏదో ఒక కంపెనీలో కాకుండా వివిధ రంగాలలో పెట్టుబడిగా పెట్టడం వలన ఒక దానిలో నష్టం వచ్చినా, మరొక దానిలో వచ్చిన లాభం దానిని కవర్ చేస్తుంది. దీనివల్ల పెట్టుబడిదారునికి రిస్క్ అనేది తగ్గుతుంది.ఇలా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం వలన అనేక లాభాలు ఉన్నాయి.

రాబడులు – Returns 

మ్యూచువల్ ఫండ్ ప్రయోజనాలలో ఇది అతి ముఖ్యమైనది మీకు ఖచ్చితమైన రాబడిని అందించే సాంప్రదాయ  (గవర్నమెంట్ మరియు గవర్నమెంట్ ఆధారిత సంస్థలలో )  పెట్టుబడి   అంశాల కంటే కూడా అధిక రాబడిని పొందవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే,  మ్యూచువల్ ఫండ్స్‌పై వచ్చే రాబడులు మార్కెట్ పనితీరుతో ముడిపడి ఉంటాయి.  Mutual funds  Telugu  కాబట్టి, షేర్ మార్కెట్ బుల్ రన్‌లో ఉంటూ, మరియు అది  బాగా ఉంటే, దాని ప్రభావం మీ ఫండ్ విలువలో చూపిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమనగా,  సాంప్రదాయ పెట్టుబడుల మాదిరిగా కాకుండా, మ్యూచువల్ ఫండ్స్ మూలధన రక్షణకు హామీ ఇవ్వవు. కాబట్టి మీరు స్వయంగా పరిశోధన చేసి,  మరియు  సరైన సమయంలో మీ జీవితంలో ఏర్పాటు చేసుకున్న   ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో మీకు సహాయపడే ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టండి.

 

వైవిధ్యం (డైవర్సిటి)  – Diversity 

ఒక ప్రముఖ ఆర్థికవేత్త  సామెత ప్రకారం,  మీ గుడ్లన్నింటినీ ఒకే బుట్టలో పెట్టకూడదు. దీని ప్రకారం మీరు మీ డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఇది. ఒకవేళ మీరు ఒకే రకమైన ఆస్తిలో మాత్రమే పెట్టుబడి పెడితే, అపుడు మార్కెట్ క్రాష్ అయినట్లయితే,  మీరు తీవ్రమైన నష్టానికి గురి కావలసి ఉంటుంది.  అయితే, మీరు వివిధ రకాల అసెట్ లలో పెట్టుబడి పెట్టడం వలన మరియు మీ పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫికేషన్ చేయడం ద్వారా ఈ సమస్యనుంచి బయటపడవచ్చు.

 

పన్ను ప్రయోజనాలు – Tax Benefits 

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల మీద పెట్టుబడిదారులు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ముఖ్యంగా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ ( ELSS )లో పెట్టుబడి పెట్టడం ద్వారా దాదాపు 1.5 లక్షలు వరకూ పన్ను ప్రయోజనం ఉంటుంది.  ఈ పన్ను ప్రయోజనం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద అనుమతి ఇవ్వబడింది.  ఇక ఈ ELSS మ్యూచువల్ ఫండ్‌లు 3 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌ కలిగి ఉంటాయి. కాబట్టి, మీరు ఈ ELSS ఫండ్లలో పెట్టుబడి పెడితే , లాక్-ఇన్ పీరియడ్  ముగిసిన తర్వాత మాత్రమే మీరు మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

మరో పన్ను ప్రయోజనం ఏదనగా,  డెట్ ఫండ్స్‌పై లభించే ఇండెక్సేషన్ ప్రయోజనం. అంటే  సాంప్రదాయ పెట్టుబడి విషయంలో సంపాదించిన వడ్డీ మొత్తం పన్నుకు లోబడి ఉంటుంది. అయితే, డెట్ మ్యూచువల్ ఫండ్స్ విషయంలో, ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ సంపాదించిన రాబడి మాత్రమే పన్ను పరిధిలోకి వస్తుంది.

మరింత సులువుగా చెప్పాలంటే ఒక ఆర్థిక సంవత్సరం లో మీ పెట్టుబడిపై ఒక లక్ష ఆదాయం లభిస్తే అప్పుడే టాక్స్ వర్తిస్తుంది , లక్షలోపు లాభం పై టాక్స్ ఉండదు .

 

 

https://youtu.be/CFQsxPrxz0w

 

 

మంచి  మ్యూచువల్ ఫండ్ ను ఎలా సెలెక్ట్ చెయ్యాలి ? – How to select Good Mutual fund ?

 

మ్యూచువల్ ఫండ్స్‌లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసే సమయంలో ఫండ్ యొక్క లాస్ట్ పెర్ఫార్మన్స్, ఫండ్ పోర్షఫోలియో మరియు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్ లో రిటర్న్స్ ని గణించే కాల్క్యూలేటర్, ( Mutual funds Telugu )    వంటి ప్రాధమిక విషయాలను మాత్రమే వ్యక్తులు పరిగణలోకి తీసుకొని పెట్టుబడి పెడతారు.

ఒక కంపెనీ లేదా స్కీమ్ సరైనది అని చెప్పడానికి మరిన్ని విషయాలను పరిగణలోకి   తీసుకోవాల్సివుంటుంది.

 

 

Mutual funds Telugu - మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటీ , ఎన్ని రకాలు ,ప్రయోజనాలు మరియు ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి ?

 

 

 

  1. మ్యూచువల్ ఫండ్  తీసుకొనే ఏ కేటగిరీకి చెందినది ? ( Mutual fund category 

ఏ మ్యూచువల్ ఫండ్ అయినా ముఖ్యంగా రెండు రకాల కేటగిరీల్లో పెట్టుబడి పెడుతుంది మనం ఇన్వెస్ట్ చేసిన కేటగిరీ ఆధారంగానే రిటర్న్స్ మరియు రిస్క్ ఉంటాయి .

A ) ఈక్విటీ , ఈ పేరు కలిగిన ఏ స్కీం అయినా వాటి పెట్టుబడుల్లో అత్యధిక శాతం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ జరుపుతుంది కాబట్టి రాబడులు మార్కెట్ కి అనుగుణంగానే లభిస్తాయి .ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అధిక రిస్క్ ను కలిగి ఉంటాయి మరియు అధిక రిటర్న్స్ కూడా అందిస్తాయి , ఒకవేళ తక్కువ రిటర్న్స్ లభించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎంతమాత్రం ఉండదు ఎందుకంటె ఇవి మార్కెట్ పనితీరుపై ఆధార పది ఉంటాయి .

B) డేట్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ తప్ప మిగిలిన గోల్డ్ ,స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బాండ్స్ ఇలా ఇతర వాటిలో పెట్టుబడి నిర్వహిస్తాయి .డేట్ ఫండ్స్ లో రిస్క్ శాతం చాలా తక్కువ మరియు ఖచ్చితమైన రిటర్న్స్ రావడం జరుగుతుంది .ఎందుకంటె ఇవన్నీ సురక్షితమైన పెట్టుబడుల్లోకి వస్తాయి .ఈక్విటీ తో పోలిస్తే రిటర్న్స్ డేట్ ఫండ్స్ లో తక్కువ మరియు రిస్క్ ఫ్రీ కూడా .

C) బ్యాలెన్స్డ్ ఫండ్స్ దాదాపు 40- 60% ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన శాతం నిధులను డెట్ ఫండ్స్ లో పెట్టుబడి పెడతాయి. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ లో దీర్ఘకాలంపాటు ఇన్వెస్ట్ చేస్తే 15 – 17% రిటర్న్స్ లభిస్తాయి.

వీటిలో ముఖ్య ప్రయోజనం ఏమిటంటే ఈక్విటీ మరియు డెబిట్ ఫండ్స్ పరస్పర విరుద్ధమైనవి అందువల్ల ఈక్విటీ శాతం లాభాల్లో ఉంటే డెబిట్ ఫండ్స్ తక్కువ రిటర్న్స్ అందిస్తాయి , డెబిట్ శాతం లాభాల్లో ఉంటే ఈక్విటీ ఫండ్స్ తక్కువ రిటర్న్స్ అందిస్తాయి
అందువల్ల ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రిస్క్ కి గురవ్వకుండా స్థిరంగా వృద్ధిలో ఉంటుంది .

 

 

2. గ్రోత్ ఫండ్ లేదా డివిడెండ్ ( Fund Type  )

 

స్కీం సెలక్షన్లో రెండవది మీరు నిర్ణయం చేసిన ఫండ్ గ్రోత్ ఫండ్ లేక డివిడెండ్?

గ్రోత్ ఫండ్ కంపౌండింగ్ రిటర్న్స్ ను అందిస్తుంది అంటే చక్రవడ్డీ అన్నమాట .

మీ యొక్క వార్షిక పెట్టుబడి Rs 1,00,000  అనుకుంటే ఆ సంవత్సర రిటర్న్స్   20%   వచ్చినట్లైతే   రెండవసంవత్సర  Rs 1,20,000              పెట్టుబడి అవుతుంది,  రెండవ సంవత్సరం ఈ మొత్తం పై వడ్డీ రావడం జరుగుతుంది  ఈ విధంగా చైన్ ప్రాసెస్ లో స్కీం కొనసాగుతుంది            అందువల్ల చాల తొందరగా పెట్టుబడి పెరుగుతూ వస్తుంది అందువల్ల దీన్ని గ్రోత్ ఫండ్ అంటారు . .

డివిడెండ్ , ఫండ్ పై లభించే వార్షిక రిటర్న్స్ ను ప్రతి సంవత్సరం రెగ్యులర్ ఆదాయం రూపంలో అందిస్తుంది .కాబట్టి పెట్టుబడి పెరుగుదల ఉండదు కానీ ఒక సంవత్సరంలో మన ఫండ్ పై వచ్చిన లాభం యధావిధిగా పెట్టుబడిదారునికి ఇస్తుంది .

రాజు లక్షపెట్టుబడి డివిడెండ్ లో పెట్టాడనుకొందాం ! ఆ సంవత్సరం  20%  శాతం లాభం వస్తే  Rs 20,000  వేలు రాజుకి రావడం జరుగుతుంది తరవాత సంవత్సర  పెట్టుబడి లక్ష మాత్రమే అవుతుంది,( Mutual funds Telugu )  డివిడెండ్ లో ఎప్పుడు పెట్టుబడి స్థిరంగా ఉంటుంది . అలాగని  ఒక సంవత్సరం మీ ఫండ్ పై రిటర్న్స్ రాకపోయినా లేఖ ఫండ్ నెగిటివ్ కి చేరినా వార్షిక రిటర్న్స్ కూడా లభించవు .

 

 

3. ఎంట్రీ మరియు ఎగ్జిట్  లోడ్ ( Entry & Exit Loads )

స్కీం లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎంట్రీ, స్కీం నుంచి అమౌంట్ విత్ డ్రా చేస్తే ఎగ్జిట్ , ప్రతీ మ్యూచువల్ ఫండ్స్ లో ఈ రెండూ సాదారణం. ఎంట్రీ మరియు ఎగ్జిట్  లోడ్ చార్జల కి నియమం వుంటుంది.  అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎంట్రీ లోడ్ రూపంలో, కొంత సమయం తర్వాత వెంటనే విత్ డ్రా చేసే అమౌంట్ పై ఎగ్జిట్ లోడ్ చార్జలు విధించడం జరుగుతుంది అందువల్ల  లోడ్ చార్జెస్  తక్కువ ఉండే మ్యూచువల్ ఫండ్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి.

 

4. ఆల్ఫా రేషియో ( Alfa Ratio )

మ్యూచువల్ ఫండ్ నిర్ధారణ లో ఆల్ఫా రేషియో అత్యంత ముఖ్యమైనది. ప్రతీ మ్యూచువల్ ఫండ్ కి ఒక బెంచ్ మార్క్ తప్పనిసరిగా ఉంటుంది. ఆల్ఫా రేషియో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి స్కీం గా మనం నిర్ధారణ చెయ్యవచ్చు, సాధారణంగా ఆల్ఫా రేషియో 0% గా ఉంటుంది.. ఆపై ఆల్ఫా రేషియో పాజిటివ్ గా ఉంటే ఫండ్ మంచి పెర్ఫార్మన్స్ ను, నెగెటివ్ గా ఉంటే లాస్ పెర్ఫార్మన్స్ ను మనం సులువుగా తెలుసుకోవచ్చు.

5. బేటా రేషియో ( Beta Ratio )

బీటా రేషియో యొక్క మూమెంట్ నేరుగా మార్కెట్ వాలటిలిటీ తో సంబంధం కలిగి ఉంటుంది. ఒక మంచి లేదా ఆదర్శం అయిన బీటా వేల్యూ 1 గా నిర్ణయిస్తారు.

1 లేదా అంతకంటే తక్కువ బీటా వాల్యూ వున్నా ఫండ్ బెట్టర్ రిటర్న్స్ తోపాటు రిస్క్ శాతం కూడా తక్కువ ఉంటుంది. తక్కువ రిస్క్ కలిగిన మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలనుకొనే వారు తక్కువ బీటా రేషియో ఉన్న మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చెయ్యడం ఉత్తమం.

 

6. షార్ప్ రేషియో ( Sharp Ratio )

ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్ లను కంపేర్ చెయ్యడంలో ఈ షార్ప్ రేషియో సహాయపడుతుంది. కేవలం ఒక ఫండ్ యొక్క షార్ప్ రేషియో ద్వారా మీరు ఖచ్చితంగా ఊహించలేరు ఆ ఫండ్ యొక్క పెర్ఫార్మన్స్ ను.

షార్ప్ రేషియో మ్యూచువల్ ఫండ్ యొక్క రిస్క్ అడ్జస్టడ్ రిటర్న్ ను అంచనా వేయడంలో ఉపయోగ పడుతుంది. షార్ప్ రేషియో ఎక్కువ గా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ను గుడ్ మ్యూచువల్ ఫండ్స్ గా పరిగణిస్తారు.

 

7. స్టాండర్డ్ డివైయేషన్ రేషియో – SD Ratio

ఏదైనా మ్యూచువల్ ఫండ్ యొక్క పెర్ఫార్మన్స్ కి సంబందించిన ఒక రేంజ్ ను స్టాండర్డ్ డివైయేషన్ రేషియో తెలియచేస్తుంది. దీని అర్ధం కనీసం లో కనీసం, మరియు అత్యధికం లో అత్యధికముగా ఎంత రిటర్న్స్ ను అందివ్వగలదు.

స్టాండర్డ్ డివైయేషన్ రేషియో తక్కువగా ఉంటే వోలాటాలిటీ , మరియు రిస్క్ శాతం తక్కువగా ఉంటుంది. ఒకవేళ స్టాండర్డ్ డివైయేషన్ రేషియో ఎక్కువ గా ఉంటే వోలాటాలిటీ , మరియు రిస్క్ శాతం ఎక్కువ గా ఉంటుంది అంటే ఓవరాల్ గా SD రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచి మ్యూచువల్ ఫండ్ గా భావించవచ్చు.

 

8. డైరెక్ట్ ప్లాన్ లేదా రెగ్యులర్ ప్లాన్ ( Direct Or Regular )

బ్యాంకు ద్వారా ,బ్రోకరేజ్ కంపెనీ లేదా ఇతర పద్ధతుల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని రెగ్యులర్ ప్లాన్ అంటారు ,పైవేమి కాకుండా కంపెనీలో నేరుగా ఆప్ లేదా వెబ్సైటు ద్వారా పెట్టుబడి పెడితే దాన్ని డైరెక్ట్ ప్లాన్ అంటారు . ఈ రెండిటికి తేడా ఏమిటంటే రెగ్యులర్ ప్లాన్ ఫండ్ సర్వీస్ కొరకు బ్యాంకు లేదా బ్రొకెర్ కి ఎక్సపెన్సే గా ఛార్జ్ విధిస్తారు , డైరెక్ట్ ప్లాన్ లో ఇవేమి వుండవు .

 

Max life Smart Secure Plus Plan in Telugu &# &అద్భుతమైన పాలసీ 100% ప్రీమియం రిటర్న్ &

 

 

నిర్మాణాత్మక ఆధారంగా మ్యూచువల్ ఫండ్స్ రకాలు – Types Of  Mutual Funds Telugu 

 

1). ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స ( What are  Open Ended Mutual Funds   ) 

ఓపెన్-ఎండెడ్  మ్యూచువల్ ఫండ్స్, ఈ రోజు మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేసి రేపు అమౌంట్ విత్డ్రావాల్ చేసుకోవచ్చు   . ఈ ఓపెన్-ఎండెడ్ ఫండ్స్ చాలా లిక్విడ్‌గా   (  లావాదేవీల నిర్వహణ సులభతరం  ) ఉంటాయి, ఎందుకంటే మీరు మీ సౌకర్యానికి అనుగుణంగా ఏదైనా వ్యాపార రోజున ఫండ్ నుండి మీ యూనిట్‌లను రీడీమ్ చేసుకోవచ్చు.

 

 

Mutual funds Telugu - మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటీ , ఎన్ని రకాలు ,ప్రయోజనాలు మరియు ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి ?

 

 

2). క్లోజ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్( What are  Close  Ended Mutual Funds ) 

క్లోజ్-ఎండెడ్ ఫండ్స్  ఒక నిర్దిష్ట కాల పరిమితికి లోబడి ఉంటాయి , అందువల్ల ప్రారంభం లోనే ఒక నిర్దిష్టమైన సమయాన్ని నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది . ఆ సమయం లేదా పీరియడ్ పూర్తి అయిన తరవాత మాత్రమే విత్డ్రావాల్ వీలుపడుతుంది  ,  అయితే పెట్టుబడిదారులు ఈ ఫండ్ ప్రారంభమైనప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టగలరు మరియు మెచ్యూరిటీ సమయం ముగిసిన తర్వాత మాత్రమే తమ డబ్బును ఫండ్ నుండి విత్ డ్రా చేసుకోవచ్చు

 

 

మ్యూచువల్ ఫండ్ల రకాలు: ఇన్వెస్ట్మెంట్ యొక్క లక్ష్యం  ఆధారంగా చేసుకొని ఇవి అనేక రకాలుగా ఉన్నాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా  (సెబి) చేత మార్గనిర్దేశం చేయబడిన నిబంధనలు పాటిస్తూ మ్యూచువల్ ఫండ్లలో 5  విస్తృత వర్గాలు మరియు 36 ఉప వర్గాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ యొక్క  వర్గాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

 

కాప్ అంటే క్యాపిటలిజషన్ అని అర్ధం , ఒక వ్యక్తి నేరుగా అమౌంట్ ఇన్వెస్ట్ చెయ్యడం కొరకు వేల కంపెనీల్లో ఒక కంపెనీ స్కీం ను ఎంచుకోవడం చాల  అకష్టతరంయిన పని అందుకే ( Mutual funds Telugu )  సెబీ కేటగిరిలో విభజన చేసింది దీని ద్వారా స్కీం కి సంబందించిన అనాలసిస్ సులభతరం అయ్యింది .

1.ఇండియా లో Rs 30 వేల కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ మార్కెట్ క్యాపిటలిజషన్ కలిగిన మొదటి  100 కంపెనీలను లార్జ్ కాప్ ( Large Cap )  కంపెనీలని,

2. Rs 30 వేల కోట్ల నుంచి  R 13 వేల లోపు మార్కెట్ క్యాపిటలిజషన్ కలిగిన  మొదటి 101 TO 200   కంపెనీలను మిడ్ కాప్ ( Mid Cap )  )  కంపెనీలని అదేవిధంగా,

3. Rs  13 వేల కోట్ల లోపు  మార్కెట్ క్యాపిటలిజషన్ కలిగిన   250  కంపెనీలను స్మాల్ కాప్  ( Small Cap )  కంపెనీలాగా సెబీ విభజన చేసింది .

 

 

• ఈక్విటీ ముట్యుయల్ ఫండ్స్ – Equity Mutual Funds

 

ఈక్విటీ ఫండ్స్ అనేవి,    నేరుగా స్టాక్ మార్కెట్ లో  పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టుబడిదారులకు డబ్బు సంపాదించి పెడుతున్నాయి.

 

1).లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ( What are   Large Cap Mutual Funds )

లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లేదా లార్జ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్ అంటే , ఇవి  పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ సంస్థలతో పెద్ద మొత్తంలో నిధులు పెట్టుబడి పెడుతాయి. వీటిలో పెట్టుబడి పెట్టిన కంపెనీలు తప్పనిసరిగా పెద్ద వ్యాపారాలు మరియు పెద్ద పారిశ్రామిక  శక్తి కలిగిన పెద్ద కంపెనీలు మాత్రమే ఉంటాయి.

ఉదాహరణకు., యునిలివర్ ( Unilever ) , ఐటిసి ( ITC ) , ఎస్బిఐ ( SBI ) , ఐసిఐసిఐ ( ICICI )  బ్యాంక్ మొదలైనవి లార్జ్ క్యాప్ కంపెనీలు ఉంటాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ ఈ సంస్థలలో  లేదా కంపెనీలలో  పెట్టుబడి పెడతాయి. ఈవిధంగా  ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్  సంవత్సరానికి స్థిరమైన వృద్ధి మరియు లాభాలను చూపించే అవకాశం ఉంది. ఈ ఫండ్స్ పెట్టుబడిదారులకు కొంత కాలానికి స్థిరత్వాన్ని అందిస్తాయి.  ( Mutual funds Telugu )  ఈ ఫండ్స్ యొక్క స్టాక్స్  దీర్ఘకాలంలో  ( Long Term Returns ) స్థిరమైన రాబడిని ఇస్తాయి. ఈ ఈక్విటీ  పథకం మొత్తం ఆస్తులలో 80 శాతం లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టనుంది. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లలో రిస్క్ శాతం తక్కువగా ఉంటుంది లభించే రిటర్న్స్ కూడా సామాన్యంగా లభించడం జరుగుతుంది .

 

2). మిడ్-క్యాప్ ఫండ్స్ ( What are   Mid Cap Funds )

మిడ్-క్యాప్ ఫండ్స్ లేదా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి  మిడ్-సైజ్ కంపెనీలలో పెట్టుబడులు పెడతాయి. ఇవి పెద్ద మరియు చిన్న క్యాప్ స్టాక్స్ మధ్య ఉండే మిడ్-సైజ్ కార్పొరేట్ సంస్థలు. ఈక్విటీ మార్కెట్లో మిడ్-క్యాప్స్ గురించి వివిధ నిర్వచనాలు ఉన్నాయి.  దీనిని మరో రకంగా చెప్పాలంటే,  సెబీ ప్రకారం, పూర్తి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 101 నుండి 250 వ సంస్థ మిడ్ క్యాప్ కంపెనీలు ఉంటాయి. పెట్టుబడిదారుడి దృష్టి పరంగా చూస్తే , స్టాక్స్ ధరలలో అధిక హెచ్చుతగ్గులు లేదా అస్థిరత  కారణంగా మిడ్ క్యాప్స్ యొక్క పెట్టుబడి కాలం లార్జ్ క్యాప్‌ల కంటే చాలా ఎక్కువగా ఉండాలి. ఈ ఈక్విటీ  పథకం మొత్తం ఆస్తులలో 65 శాతం మిడ్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టనుంది.  మిడ్-క్యాప్ ఫండ్స్  లలో రిస్క్ శాతం నార్మల్ కంటే ఎక్కువగా ఉంటుంది లభించే రిటర్న్స్ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది

 

4). స్మాల్ క్యాప్ ఫండ్స్ ( What are   Small Cap Funds ) 

స్మాల్ క్యాప్ కంపెనీలలో చిన్న ఆదాయాలతో ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లు లేదా సంస్థలు ఉన్నాయి. స్మాల్ క్యాప్స్ విలువను కనుగొనటానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు మంచి రాబడిని అందించగలవు.  ఏదేమైనా, చిన్న పరిమాణాన్ని బట్టి, నష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.  అందువల్ల స్మాల్ క్యాప్స్ యొక్క పెట్టుబడి కాలం అత్యధికంగా ఉండాలని మార్కెట్ విశ్లేషకులు  భావిస్తుంటారు. సెబీ ప్రకారం, మొత్తం పోర్ట్‌ఫోలియో ప్రాపర్టీ లో  కనీసం 65 శాతం స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఉండాలి. స్మాల్ క్యాప్ కంపెనీ చాల తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ ను అందిస్తాయి రిస్క్ వచ్చి లార్జ్ ,మిడ్ కాప్ లతో పోలిస్తే చాల ఎక్కువగా ఉంటుంది .

 

 

5). డైవర్సిఫైడ్ ఫండ్స్ ( What are Diverse Funds )

 

డైవర్సిఫైడ్ ఫండ్స్ అనేవి, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంతటా పెట్టుబడి పెడతాయి. అనగా, ముఖ్యంగా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ అంతటా పెట్టుబడి పెడతాయి. ఈ  డైవర్సిఫైడ్ ఫండ్స్ సాధారణంగా లార్జ్  క్యాప్ స్టాక్లలో 40-60%, మిడ్-క్యాప్ స్టాక్స్లో 10-40% మరియు స్మాల్ క్యాప్ స్టాక్లలో 10% మధ్య ఎక్కడైనా పెట్టుబడి పెడతాయి. కొన్నిసార్లు, స్మాల్ క్యాప్‌లలో పెట్టుబడి తక్కువ లేదా మొత్తానికి ఉండకపోవచ్చు .

డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ లేదా మల్టీ-క్యాప్ ఫండ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్లలో పెట్టుబడి పెడుతున్నందు వల్ల, డైవర్సిఫైడ్  ఈక్విటీ ఫండ్స్ యొక్క నష్టాలు ఎప్పటికీ తక్కువ స్థాయిలో  ఉంటాయి. సెబీ నిబంధనల ప్రకారం, మొత్తం ఆస్తులలో కనీసం 65 శాతం ఈక్విటీలకు కేటాయించాలి.

 

 

6). సెక్టార్ ఫండ్స్ మరియు థెమాటిక్ ఈక్విటీ ఫండ్స్ (What are  Sector or Thematic Equity Funds )

సెక్టార్ఫండ్ అనేది ఈక్విటీ పథకం.  ఇది ఒక నిర్దిష్ట రంగంలో లేదా పరిశ్రమలో బిజినెస్  చేసే కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెడుతుంది.  ఉదాహరణకు, ఒక ఫార్మా ఫండ్  ఔషధ సంస్థలలో మాత్రమే పెట్టుబడి పెడుతుంది.  ఈ సెక్టార్ ఫండ్స్ చాలా వరకు దూరదృష్టితో ఉంటూ  విస్తృత రంగంలో పెట్టుబడులు నిర్వహిస్తుంది. ఉదాహరణకు, మీడియా మరియు వినోద రంగాలు. ఈ థీమ్‌లో, ఫండ్ ప్రచురణ, ఆన్‌లైన్, మీడియా లేదా ప్రసార మాధ్యమాలు లో మరియు వివిధ సంస్థలలో పెట్టుబడులు పెట్టవచ్చు. వాస్తవంగా చాలా తక్కువ వైవిధ్యీకరణ ఉన్నందున ఈ  థెమాటిక్ ఈక్విటీ ఫండ్సలో నష్టాలు అత్యధికం గా ఉండవచ్చు.  ( Mutual funds Telugu )  ఈ స్కీమ్స్ యొక్క మొత్తం ప్రాపర్టీ లో కనీసం 80 శాతం ఒక నిర్దిష్ట రంగం లేదా థీమ్‌లో పెట్టుబడి పెట్టబడుతుంది.

 

7). ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (  What are   Equity Linked Saving Schemes )

ఇవి కూడా  ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సే.  ఇవి మీ పన్నును సెక్షన్ 80 సి ఆదాయ పన్ను చట్టం ప్రకారం అర్హత కలిగి పన్ను మినహాయింపును ఆదా చేస్తాయి. ఈ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ మూలధన లాభాలు మరియు పన్ను ప్రయోజనాల యొక్క జంట ప్రయోజనాన్ని అందిస్తాయి. ELSS పథకాలు మూడు సంవత్సరాల లాక్-ఇన్ కాల పరిమితి తో ఉంటాయి. వీటి మొత్తం ఆస్తులలో కనీసం 80 శాతం ఈక్విటీలలో పెట్టుబడిగా పెడతాయి.

 

8) డివిడెండ్ ఈల్డ్ ఫండ్  ( What is  Dividend Yield Fund)

డివిడెండ్ ఈల్డ్ ఫండ్  వ్యూహం ప్రకారం ఫండ్ పోర్ట్‌ఫోలియోలను ఫండ్ మేనేజర్ నిర్వహిస్తారు. రెగ్యులర్ ఆదాయం మరియు మూలధన పెరుగుదలను ఇష్టపడే పెట్టుబడిదారులు ఈ పథకానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఫండ్ అధిక  లాభాలు అందించే సంస్థలలో పెట్టుబడులు పెడుతుంది. ఆకర్షణీయమైన విలువలతో సాధారణ డివిడెండ్ చెల్లించే మంచి అంతర్లీన వ్యాపారాలను కొనుగోలు చేయడం ఈ ఫండ్ యొక్క ముఖ్య లక్ష్యం. ఈ పథకం మొత్తం ఆస్తులలో కనీసం 65 శాతం డివిడెండ్ దిగుబడినిచ్చే  ఈక్విటీలలో పెట్టుబడి పెడుతుంది.

 

9)  వాల్యూ ఫండ్  ( What I s Value fund )

వాల్యూ ఫండ్ అనుకూలంగా లేనప్పటికీ మంచి సూత్రాలను కలిగి ఉన్న సంస్థలలో పెట్టుబడులు పెడుతుంది. దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, మార్కెట్ తక్కువ ధర వున్నప్పుడు  కనిపించే స్టాక్‌ను ఎంచుకోవడం.  వాల్యూ ఫండ్లో పెట్టుబడిదారుడు బేరసారాల కోసం చూస్తాడు మరియు ఆదాయాలు, నికరంగా  ప్రస్తుత ఆస్తులు మరియు అమ్మకాలు వంటి అంశాలపై తక్కువ ధర కలిగిన పెట్టుబడులను ఎంచుకుంటాడు.

 

10). కాంట్రా ఫండ్ (  What is   Contra Fund )

ఈ కాంట్రా ఫండ్స్ యొక్క ఫండ్ మేనేజర్ సరైన సమయంలో  స్టాక్‌లను ఎంచుకుంటాడు.  ఈ కాంట్రా ఫండ్ దీర్ఘకాలంలో, తక్కువ విలువలతో మంచి పనితీరును కనబరుస్తాయి. దీర్ఘకాలిక ఆలోచన ఏమిటంటే ఫండ్ యొక్క ప్రాథమిక విలువ కంటే తక్కువ ఖర్చుతో ఆస్తులను కొనడం ఇక్కడ గొప్ప ఆలోచన అని చెప్పవచ్చు.

ఆస్తులు స్థిరీకరించబడతాయి మరియు దీర్ఘకాలికంగా దాని నిజమైన విలువకు పెరుగుదల చూపుతాయి అనే నమ్మకంతో ఈ కాంట్రా ఫండ్ పనితీరు ఉంటుంది.

 

11). ఫోకస్డ్ ఫండ్స్ ( What IS  Focused Fund )

ఫోకస్డ్ ఫండ్స్  , ఈక్విటీ ఫండ్స్ యొక్క మిశ్రమాన్ని కలిగి ఉంటాయి.  అనగా, లార్జ్, మిడిల్, స్మాల్ లేదా మల్టీ-క్యాప్ స్టాక్‌లు వంటి వాటితో పాటు పరిమిత సంఖ్యలో స్టాక్‌లను కలిగి ఉంటాయి. సెబీ నిబంధనల ప్రకారం ప్రకారం, ఫోకస్డ్ ఫండ్ గరిష్టంగా 30 స్టాక్స్ కలిగి ఉంటుంది.  ఫోకస్డ్ ఫండ్స్ మొత్తం ఆస్తులలో కనీసం 65 శాతం ఈక్విటీలలో పెట్టుబడి పెట్టవచ్చు.

 

LIC Dhan Rekha Plan Telugu 863 &కొత్త స్కీం ప్రతీ  1000/- కి 60 రూపాయల బోనస్ & ధన్ రేఖ పాలసీ పూర్తి వివరాలు ఇక్కడ చెక్ చెయ్యండి.

 

 

మరిన్ని ముట్యుయల్ ఫండ్స్ ను సులువుగా తెలుసుకొందాం!-  Also Read 

 

బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌ –  What are  Balanced Fund

మీ రిస్క్‌ సామర్ధ్యం ఆధారంగా ఈక్విటీల్లో పె ట్టుబడులు చేయడానికి విభిన్న రకాల పథకాలు  ఇందులో అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఆరునెలలు లేదా సంవత్సరం పాటు చిన్న మొత్తంలో బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం మంచిదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
బ్యాలెన్స్డ్ ఫండ్స్ దాదాపు 40- 60% ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన శాతం నిధులను డెట్ ఫండ్స్ లో పెట్టుబడి పెడతాయి. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ లో దీర్ఘకాలంపాటు ఇన్వెస్ట్ చేస్తే 15 – 17% రిటర్న్స్ లభిస్తాయి.

వీటిలో ముఖ్య ప్రయోజనం ఏమిటంటే ఈక్విటీ మరియు డెబిట్ ఫండ్స్ పరస్పర విరుద్ధమైనవి అందువల్ల ఈక్విటీ శాతం లాభాల్లో ఉంటే డెబిట్ ఫండ్స్ తక్కువ రిటర్న్స్ అందిస్తాయి , డెబిట్ శాతం లాభాల్లో ఉంటే ఈక్విటీ ఫండ్స్ తక్కువ రిటర్న్స్ అందిస్తాయి
అందువల్ల ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రిస్క్ కి గురవ్వకుండా స్థిరంగా వృద్ధిలో ఉంటుంది .

Balanced fund’s కు ఉదాహరణ: ICICI prudential equity & debt fund, DSP equity & bond fund, Marine  asset equity fund.

 

గిల్ట్ ఫండ్స్ – What are Gilt Funds

గిల్ట్ ఫండ్స్ , మ్యూచువల్ ఫండ్స్‌లో ఇదో భిన్నమైన ఫండ్ గా పేరు తెచ్చుకుంది. గవర్నమెంట్ బాండ్స్‌లో మాత్రమే పెట్టుబడి పెట్టే ఈ ఫండ్స్‌లో  రిస్క్ కాస్త  తక్కువ ఉంటుంది. ఇలాంటి గిల్ట్ ఫండ్స్ ఈ మధ్యకాలంలో అనూహ్యమైన రిటర్న్స్ ఇస్తున్నాయి. ఈ కేటగిరీలోని ఫండ్స్ యావరేజ్‌న 13.24 శాతం రాబడిని ఇచ్చాయి.  ( Mutual funds Telugu )   ఇదే కేటగిరీలో ఉన్న ఓ ఫండ్ ఏకంగా ఏడాదికి 16 శాతం రాబడిని అందించింది. ఈ స్కీముల్లో ఉన్న వరస్ట్ పర్ఫార్మర్ కూడా కనీసం రెండంకెల లాభాలను అందించింది.

ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు చెబుతున్న లెక్కల ప్రకారం రాబోయే రోజుల్లో ఈ ఫండ్స్ మెరుగైన పనితీరునే కనబర్చవచ్చని సూచిస్తున్నారు. ఈ ఫండ్స్ 80% వరకు గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటి ప్రత్యేకత ఏమనగా ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడికి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటుంది.

గిల్ట్ ఫండ్స్ కు ఉదాహరణలు: SBI Contra fund, DSP flexi cap fund, Canara  flexi cap fund.

 

హైబ్రిడ్ ఫండ్స్ –  What are Hybrid Funds

హైబ్రిడ్ ఫండ్స్ అనేవి ఈక్విటీల్లో పెట్టుబడులు పెడతాయి. ఇవి ముఖ్యంగా పెట్టుబడుల వివిధీకరణకు ప్రాధాన్యం ఇస్తాయి. దీనివల్ల ఇన్వెస్టర్ల సొమ్ముకు రిస్క్ తక్కువగా ఉండి రిటర్న్ లు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. మనం తీసుకునే రిస్క్, పెట్టుబడుల లక్ష్యాలను బట్టి హైబ్రిడ్ ఫండ్స్ ఎంపిక అనేది ఆధారపడి ఉంటుంది.

బ్యాలన్సుడ్ పోర్ట్ ఫోలియో ద్వారా దీర్ఘకాలంలో సంపద పెంచడం మరియు  స్వల్పకాలంలో ఆదాయాన్ని వృద్ధి పరచడం ఈ హైబ్రిడ్ ఫండ్స్ లక్ష్యం. ఈ  ఫండ్ యొక్క పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా మీ సొమ్మును ఫండ్ మేనేజర్ ఈక్విటీ, డెట్ లో పెట్టుబడి పెడతాడు. మార్కెట్ కదలికలకు అనుగుణంగా మీ ఫండ్ మేనేజర్ సెక్యూరిటీల క్రయవిక్రయాలు సాగిస్తుంటాడు.

ఈక్విటీ మార్కెట్లోకి ప్రవేశించాలనుకునే ఇన్వెస్టర్లు ముందు ఈ ఫండ్స్ ను ఎంచుకోవడం బెటర్ అని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఫండ్స్ లో ఈక్విటీ, డెట్ రెండూ ఉంటాయి, కాబట్టి మార్కెట్ జోరుగా ముందుకు సాగితే  ఈక్విటీ ద్వారా ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్కెట్ పనితీరు సరిగా లేకపోతే డెట్ విభాగం ద్వారా ఊరట లభిస్తుంది, ఫలితంగా స్థిరమైన రిటర్న్ ఈ ఫండ్ లో రావడానికి అవకాశం ఉంటుంది.

 

 

హైబ్రిడ్ ఫండ్స్ రకాలు – Types Of Hybrid Funds

 

ఈక్విటీ ఓరియెంటెడ్ హైబ్రిడ్ ఫండ్స్ – Equity Oriented Hybrid Funds

ఇందులో ఫండ్ మేనేజర్  65 శాతం కంటే ఎక్కువగా ఈక్విటీలో , మిగతా మొత్తం డెట్ మరియు మనీ మార్కెట్ ఫండ్స్ లో పెట్టుబడిగా పెడతారు. అందుకే దీనిని ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్స్ అంటారు. ఈ ఈక్విటీ ఫండ్ లో విభిన్న రకాలకు చెందిన కంపెనీల ఈక్విటీ షేర్లు ఉంటాయి.

 

డెట్ ఓరియెంటెడ్ ఫండ్స్ – Debt Oriented Funds

ఇందులో భాగంగా ప్రభుత్వ సెక్యూరిటీలు, డిబెంచర్లు, బాండ్లు, ట్రెజరీ బిల్స్ వంటి స్థిర ఆదాయ వనరుల్లో పెట్టుబడి పెడతారు. ఇందులో డెట్ ఫండ్స్  60 శాతం అంతకన్నా ఎక్కువగా  ఇన్వెస్ట్ చేస్తారు. మిగతా మొత్తాన్ని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు.

 

బ్యాలెన్సుడ్ ఫండ్స్ – Balanced Fund

ఇందులో భాగంగా 65 శాతం సొమ్మును ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత మార్గంలో పెట్టుబడిగా పెడతారు మిగిలిన మొత్తం సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈక్విటీ లాస్ లో ఉంటే మిగిలిన వాటి మార్కెట్ బాగుంటుంది,ఈక్విటీ లాభాల్లో ఉంటే మిగిలినవి అవేరేజ్ గా ఉంటాయి, అందువల్ల ఫండ్ యొక్క రిటర్న్స్ బాలన్స్ చేయబడతాయి.

 

ఆర్బిట్రేజ్ ఫండ్స – Arbhitrage Fund

ఈ ఫండ్స్ కు సంబంధించిన ఆర్బిట్రేజ్ ఫండ్ మేనేజర్,   ఒక మార్కెట్లో తక్కువ ధరలో షేర్లను కొని మరో మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తాడు. అయితే ఇది అంత సులభమైన విషయమేమి కాదు కాబట్టి,  ఒకవేళ ఆర్బిట్రేజ్ కు అవకాశం లేకపోతే డెట్ సాధనాలు లేదా నగదుకు ప్రాధాన్యం ఇస్తుంటారు.

 

ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏమిటి ? ( What are Index Funds ) 

ఇవి    ఒక రకమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్  దీని పోర్ట్ఫోలియోలో ఇండెక్స్ లో ఉండే స్టాక్స్ మాత్రమే ఉంటాయి, ఇలా  లిలిటెడ్    స్టాక్స్ లో మాత్రమే పెట్టుబడి పెట్టడం వలన ఈ ఫండ్ ని పాసివ్లీ (Passively) మేనేజెడ్ ఫండ్ అంటారు.  ఈ ఫండ్స్ పనితీరు మరియు ఇండెక్స్ సూచిక మధ్య వ్యత్యాసం ఉంటుంది, దీనిని ట్రాకింగ్ లోపం అని అంటారు ట్రాకింగ్ లోపాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించే దిశగా  మేనేజ్మెంట్ కంపెనీ మరియు ఫండ్ మేనేజర్ పని చేస్తారు.

కంపెనీలో కూడా ప్రతిఒక్క కంపెనీ మార్కెట్ క్యాపిటలిజషన్ బట్టి ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇండెక్స్ ఫండ్స్ లో ఎక్సపెన్స్ రేషియో మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువగా ఉంటుంది  ఎక్సపెన్స్ రేషియో అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఫండ్ ని నిర్వహించినందుకు ఇచ్చే కొంచం శాతాన్ని ఎక్సపెన్స్ రేషియో అంటారు.

ఎక్సపెన్స్ రేషియో అనేది ప్రతి మ్యూచువల్ ఫండ్స్ కి ఉంటుంది ఈ ఎక్సపెన్స్ రేషియో అనేది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి  మరియు మీరు ఎంచుకునే మ్యూచువల్ ఫండ్ రకం పై ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం పెట్టుబడి పెట్టే ముందు ఎక్సపెన్స్ రేషియో తక్కువ ఉన్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఎంచుకోవడం మంచిది.

Index fund examples:- UTI Nifty index fund, HDFC index fund, SBI Nifty index fund, ICICI prudential Nifty index fund.

 

 

SBI Life eShield Next Telugu &#అవసరాలకి అనుగుణంగా పెరుగుతుంది భీమా కవరేజ్, మరెన్నో ప్రయోజనాలు వివరాలు ఇవే !

ఇండెక్స్ ఫండ్స్ లో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు? Who Can Invest ?

 

ఇండెక్స్ ఫండ్స్ లో  ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు  రాబడి కూడా చాల మంచిగా లభిస్తుంది. . ఇండెక్స్ ఫండ్స్ మరియు  మ్యూచువల్ ఫండ్స్ లో  రెండు రకాల పెట్టుబడి విధానాలు ఉన్నాయి.

1.లంప్సమ్ ఇన్వెస్ట్మెంట్ ( Lumpsum   Mutual funds Telugu   )

లంప్సమ్ ఇన్వెస్ట్మెంట్  అంటే మన దగ్గర ఉన్న మొత్తం డబ్బు ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం లేదా మన దగ్గర డబ్బు ఉన్నపుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయడాన్ని లంప్సమ్ ఇన్వెస్ట్మెంట్  అంటారు.

2.సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP – Systematic Investment Plan)

సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ని సిప్ అని కూడా అంటారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేయాలి అంటే వారానికి, నెలకి, త్రైమాసికం కి మరియు వార్షికాని కి తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేయడానికి ఒక్కసారి మన బ్యాంకు అకౌంట్ ను ఈ ప్లాన్ తో రిజిస్టర్ చేసుకుంటే మనం చెప్పిన రోజు ఆటోమేటిక్ గా  డెబిట్ అవుతాయి.

 

కార్పొరేట్ బాండ్ డెట్ ఫండ్‌లు – ( What are  Corporate Bond Funds )

ఏదైనా ఒక  కంపెనీ కార్పొరేట్ బాండ్లను జారీ చేస్తుంది. వీటిని నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (NCDలు) అని అంటారు. కార్పొరేట్ సంస్థలు లేదా కమర్షియల్ సంస్థలకు వారి రోజువారీ కార్యకలాపాలతో పాటు భవిష్యత్ వ్యాపార విస్తరణలు మరియు వృద్ధి అవకాశాల కోసం మూలధనం అవసరం. దీన్ని సాధించడానికి, కంపెనీలకు రెండు మార్గాలు ఉన్నాయి  అవి డెట్ మరియు ఈక్విటీ సాధనాలు.

కంపెనీ వాటాదారులను నేరుగా ప్రభావితం చేయనందున అప్పు తీసుకోవడం సురక్షితమైన ఎంపిక. అందువల్ల, చాలా కంపెనీలు తమ కార్యకలాపాల కోసం మూలధనాన్ని సేకరించడానికి డెట్ బాండ్ లను జారీ చేస్తాయి. వారి అవసరాలను బట్టి, కార్పొరేషన్లకు బ్యాంకు రుణాలు ఖరీదైనవి గా  ఉంటాయి ( Mutual funds Telugu )  ఇలా  బాండ్లు లేదా డిబెంచర్లు కంపెనీలకు నిధుల సమీకరణ ఆర్థిక ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి. . మీరు బాండ్‌ను కొనుగోలు చేసినప్పుడు, కంపెనీ మీ నుండి డబ్బును తీసుకుంటుంది. ఒప్పందంలో పేర్కొన్న విధంగా మెచ్యూరిటీ వ్యవధి తర్వాత ఆ సంస్థ ప్రిన్సిపల్‌ అమౌంట్ ను తిరిగి చెల్లిస్తుంది. ఈ సమయంలో, మీరు కూపన్ అని పిలువబడే వడ్డీ  స్థిర ఆదాయం రూపంలో  అందుకుంటారు. సాధారణంగా, భారతదేశంలో వడ్డీ చెల్లింపులు సంవత్సరానికి రెండుసార్లు చేయబడతాయి.

 

కార్పొరేట్ బాండ్లలో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?

సురక్షితమైన ఎంపిక తో,  స్థిరమైన  అధిక ఆదాయం కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు కార్పొరేట్ బాండ్‌లు అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు.  కార్పొరేట్ బాండ్‌లు మూలధన  పెట్టుబడి  రక్షణను కల్పిస్తున్నాయి. కాబట్టి డెట్ ఫండ్స్ తో    పోల్చినప్పుడు తక్కువ-రిస్క్ పెట్టుబడి సాధనంగా ఆదరణ పొందినవి.  మీరు అధిక-నాణ్యత తో  పెట్టుబడి పెట్టే కార్పొరేట్ బాండ్ ఫండ్‌లను ఎంచుకుంటే, అది మీ ఆర్థిక లక్ష్యాలను మరింత మెరుగ్గా అందించగలదు.

 

కూపన్ లేదా వడ్డీ ( Mutual Funds Coupon Or Interest )

మీరు కార్పొరేట్ బాండ్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీరు కార్పొరేట్ బాండ్ ను నగదుగా మార్చుకునే0తవరకు  లేదా బాండ్ మెచ్యూర్ అయ్యే వరకు కంపెనీ వడ్డీని క్రమం తప్పకుండా చెల్లిస్తుంది. ఈ వడ్డీని కూపన్ అని అంటారు.

 

కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రకాలు – Types Of Corporate Bonds

1.   టైప్ వన్ కార్పొరేట్ బాండ్‌లు:- ఇవి  హై – రేటెడ్ కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. ఉదా: పబ్లిక్ సెక్టార్ యూనిట్ (PSU) కంపెనీలు మరియు బ్యాంకులు.

2.  టైప్ టూ కార్పొరేట్ బాండ్‌లు:- ఇవి  AA  లేదా తక్కువ రేటింగ్ ఉన్న కంపెనీలలో మాత్రమే పెట్టుబడి పెడతాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సాధారణ ఉదాహరణ గురించి తెలుసుకుందాం.

 

ఒక సంవత్సరం  మెచ్యూరిటీ ఉన్న CRISIL “A” రేటింగ్ ఉన్న బాండ్‌కు డిఫాల్ట్ అయ్యే అవకాశం 0.56%,  మరియు 3 సంవత్సరాల రెసిడ్యూవల్ మెచ్యూరిటీ ఉన్న CRISIL “A” రేటెడ్ బాండ్‌లో 4.79% డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉందని అనుకుందాం. ( Mutual funds Telugu )  సాధారణంగా, కార్పొరేట్ బాండ్ ఫండ్‌లు కనీసం సగం పోర్ట్‌ఫోలియోలను AA ర్యాంక్ లేదా అంతకంటే తక్కువ ఉన్న బాండ్‌లకు కేటాయిస్తాయి. కాబట్టి, పోర్ట్‌ఫోలియోలోని కొన్ని లేదా ఇతర బాండ్‌లు డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది, ఫలితంగా పోర్ట్‌ఫోలియో రిటర్న్‌లు డ్రాగ్-డౌన్ అవుతాయి.

 

Corporate bond funds examples:-

SBI మాగ్నమ్ స్థిర మెచ్యూరిటీ ఫండ్ రిటర్న్స్                          = 10.63% 10.65%
ICICI ప్రుడెన్షియల్ స్థిరమైన మెచ్యూరిటీ గిల్ట్ గ్రోత్ రిటర్న్స్   =  10.36% 10.88%
L&T ట్రిపుల్ ఏస్ బాండ్ ఫండ్ రిటర్న్స్                                      =  9.55% 8.81%

 

 

మ్యూచువల్ ఫండ్స్  ను ఎలా అప్లై చెయ్యాలి మరియు కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటీ ? ( Mutual Funds  Apply & Required Documents )

 

మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేయడం చాలా సులభమే  కానీ ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా ఇది పూర్తి కాదు. సరైన పత్రాలను అందించడం ద్వారా  మోసపూరిత ఒప్పందాలను నిరోధించడంలో మీకు సహాయపడుతుంది. మీరు మ్యూచువల్ ఫండ్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లయితే మీకు అవసరమైన పత్రాలను కింద తెలియజేస్తున్నాం.

 

 

Mutual funds Telugu - మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటీ , ఎన్ని రకాలు ,ప్రయోజనాలు మరియు ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి ?

 

1) దరఖాస్తు ఫారమ్ ( Application ) : మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేయడానికి,  మీరు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు ఫారమ్‌లను పూరించాలి. ఒకటి మ్యూచువల్ ఫండ్ ఖాతాను తెరవడం, రెండు ఫండ్‌లో SIP ప్లాన్‌ని ఎంచుకుంటే మరొక ఫారమ్ అవసరం, మరియు మీరు మీ బ్యాంక్ ఖాతా నుండి ఎలక్ట్రానిక్ బదిలీ కోసం వెళుతున్నట్లయితే, ECS ఫారమ్ కూడా పూరించాలి. కొన్ని అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు రిస్క్ ప్రొఫైల్ ఫారమ్ వంటి ఇతర ఫారమ్‌లను అడిగే అవకాశం ఉంటుంది.

 

https://www.investor.gov/

 

2) KYC వర్తింపు  ( Kyc ) : మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి భారత ప్రభుత్వం యొక్క నో యువర్ కస్టమర్ (KYC) నిబంధనల ప్రకారం మొదట మీ పాన్ ధృవీకరించబడాలి. మీరు CDSL వెంచర్స్ లిమిటెడ్ (CVL) వెబ్‌సైట్ ద్వారా మీ KYC సమ్మతిని తనిఖీ చేసుకోవచ్చు లేదా KYC కోసం మిమ్మల్ని మీరు నమోదు చేసుకోవచ్చు.

 

3) గుర్తింపు రుజువు  ( Identity ) : కింది పత్రాలలో ఏదైనా గుర్తింపు రుజువుగా అనుమతించబడును.

  1. ఫోటోతో ఉన్న పాన్ కార్డు
    2. ఆధార్
    3. పాస్ పోర్ట్
    4 .ఓటరు గుర్తింపు కార్డు
    5. డ్రైవింగ్ లైసెన్

 

4) చిరునామా రుజువు ( Address ) : కింది పత్రాలలో ఏదైనా  చిరునామా గుర్తింపు రుజువుగా అంద చేయవచ్చు.

1.ఆధార్
2. డ్రైవింగ్ లైసెన్స్
3. పాస్ పోర్ట్
4. ఓటరు గుర్తింపు కార్డు
5. రేషన్ కార్డు
6. నివాసం యొక్క  లీజు డాక్యుమెంట్ లేదా  విక్రయ ఒప్పందం
7. ఫ్లాట్ మెయింటినెన్స్  బిల్లు
8. భీమా బాండు

మైనర్ అయితే  ( If Child Minor ) :-

మైనర్‌ల కోసం థర్డ్ పార్టీ డిక్లరేషన్: పెట్టుబడిదారుడు మైనర్ అయితే, వారి తరపున పెట్టుబడి పెట్టేందుకు తల్లిదండ్రులు అనుమతించబడతారు, కానీ దీని కోసం, మీరు థర్డ్ పార్టీ డిక్లరేషన్ ఫారమ్‌ను ఇవ్వవలసి ఉంటుంది. ( Mutual funds )   వ్యక్తులు కాకుండా కంపెనీలు, ట్రస్ట్‌లు, భాగస్వామ్య సంస్థలు, హిందూ యునైటెడ్ కుటుంబాలు (HUF) మొదలైన వాటికి పైన చెప్పినవి కాకుండా, క్రింది పత్రాలు అవసరం:

  1. రిజిస్ట్రేషన్/కార్పొరేషన్ సర్టిఫికేట్
    2. మెమోరాండం మరియు ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్
    3. చిరునామా రుజువులు
    4. మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌లలో పెట్టుబడి కోసం ఖాతా తెరవాలని డైరెక్టర్ల బోర్డు యొక్క తీర్మాన నోటీసు
    5. అధీకృత వ్యక్తుల లిస్ట్ మరియు వారి సంతకాలు
    6. HUF డిక్లరేషన్ డీడ్
    7. బ్యాంకు డిక్లరేషన్ ఫామ్.
    8. ట్రస్ట్ డీడ్‌లు (ట్రస్ట్‌ల కోసం)
    9. పవర్ ఆఫ్ అటార్నీ (ట్రస్ట్ కోసం)
    10. SEBIతో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *