SBI Life Smart Platina Plus Telugu – Rs 48,080 వచ్చే సంవత్సరాల వరకు , అర్హతలు ,బెనిఫిట్స్ ,ప్రీమియం వివరాలు ఇవే !

         SBI Life Smart Platina Plus Details In  Telugu

 

SBI Life Smart Platina Plus

స్మార్ట్ ప్లాటిన ప్లస్  ప్లాన్ ఒక నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటెడ్ అండ్ గ్యారెంటెడ్ ఇన్కమ్ ప్లాన్    ( Non Linked non Participated & Regular Income Plan )  , ఈ మధ్యనే   పాలసీని లాంచ్ చెయ్యడం జరిగింది .ఇది ప్రతి వార్షికంలో ఖచ్చితమైన బెనిఫిట్ ను అందివ్వడంతో పాటుగా లిమిటెడ్ ప్రీమియం పాలసీ , వ్యక్తికి మెట్యూరిటీ & డెత్ బెనిఫిట్ తో అదనంగా గ్యారెంటెడ్ అడిషన్ అందిస్తుంది .

 

SBI Life Smart Platina Plus Telugu - Rs 48,080 వచ్చే సంవత్సరాల వరకు , అర్హతలు ,బెనిఫిట్స్ ,ప్రీమియం వివరాలు ఇవే !

స్మార్ట్ ప్లాటిన ప్లస్ ప్లాన్ ఏ విధంగా పనిచేస్తుంది? ( How does it’s Work?)

మొత్తం పాలసీ సమయంలో కొంత కాలం మాత్రమే ప్రీమియం చెల్లిస్తాం , తర్వాత ఒక సంవత్సరం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అప్పటి నుంచి మనం కోరుకొన్న విధంగా రెగ్యులర్ వార్షిక ఆదాయం లభించడం జరుగుతుంది, పాలసీ యొక్క చివరి సంవత్సరం మళ్ళీ మెట్యూరిటీ యధావిధిగా లభిస్తుంది.

 

 పాలసీ యొక్క ప్రయోజనాలు – Smart Platina Plus

 

SBI life Smart Platina Plus రెండు రకాల ఆప్షన్స్ ను కలిగి ఉంది.

. లైఫ్ ఇన్కమ్ ( Life Income )  :- పాలసీ సమయం మధ్యలో ఎప్పుడు ఏ విధంగా రిస్క్ జరిగినా ( ప్రీమియం చెల్లించ్చేటప్పుడు లేదా రెగ్యులర్ అమౌంట్ పొందేటప్పుడు ) మొత్తం భీమా నామినికి లభిస్తుంది.

 

. గ్యారెంటెడ్ ఇన్కమ్ ( Guaranteed  Income )  :- ప్రీమియం చెల్లించే సమయంలో పాలసీదారునికి రిస్క్ జరిగితే ప్రాధమిక భీమా మొత్తం నామినికి రావడం జరుగుతుంది, ఒకవేళ రెగ్యులర్ పెఔట్ తీసుకొనే సమయంలో రిస్క్ జరిగితే ఇమ్మీడియేట్ గా ప్రాధమిక భీమా లభిస్తుంది మరియు భవిష్యత్ పెఔట్ నామినికి ప్రతి సం|| రావడం జరుగుతుంది.

 

1.  పాలసీ సమయం మొత్తం కుటుంబానికి ఇన్సూరెన్స్ రూపంలో సెక్యూరిటీ లభిస్తుంది, వ్యక్తి కి  రిస్క్ జరిగితే భీమా అతని కుటుంబానికి రావడం జరుగుతుంది.

2. లైఫ్ ఇన్కమ్ ( Life )మరియు గ్యారెంటెడ్ ఇన్కమ్ ( Guaranteed Income )ఆప్షన్స్ ను కలిగి ఉంది.

3. పాలసీ మధ్యలో ఒక ఖచ్చితమైన సమయం నుంచి గ్యారెంటెడ్ రెగ్యులర్ ఆదాయం  ప్రతీ సంవత్సరం  లభిస్తుంది, లభించే గ్యారెంటెడ్ అడిషనల్ లో ఎటువంటి మార్పు ఉండదు.

4. ప్లాన్ లో చెల్లించిన మొత్తం ప్రీమియం పై 110% గా చివర్లో మెట్యూరిటీ రావడం జరుగుతుంది.

5. పెఔట్ పీరియడ్ ను అంటే ఎన్ని సంవత్సరాలు రెగ్యులర్ ఇన్కమ్ కావాలో పాలసీదారుడు స్వయంగా నిర్ణయం చేసుకోవచ్చు.

6. ఇది ఒక లిమిటెడ్ ప్రీమియం ప్లాన్ అందువల్ల కొంత కాలం మాత్రమే ప్రీమియం చెల్లించాలి.

7. లోన్, సరెండర్, పాలసీ రివైవల్ మరియు టాక్స్ ప్రయోజనాలు లభిస్తాయి.

 

అర్హతలు –  SBI Life Smart Platina Plus  Eligibility

 

• వయసు – Age

పాలసీని తీసుకోవడానికి కనీస  ప్రవేశ వయసు 30 రోజులు, అత్యధిక వయసు వచ్చి 60 సంవత్సరాలు.

 

• ప్రీమియం చెల్లింపులు – Premium Payment Term

1. 7 సంవత్సరాలు
2. 8 సంవత్సరాలు
3. 10 సంవత్సరాలు

 

• రెగ్యులర్ పెఔట్ పీరియడ్ – Payout Period

కనీసం 15 నుంచి అత్యధికముగా 36 సంవత్సరాల వరకూ నిర్ణయించుకోవచ్చు.

 

• భీమా వివరాలు – Sum Assured

SBI life Smart Platina Plus యొక్క వార్షిక ప్రీమియం కనీసం Rs 50,000/-  మరియు వార్షిక ప్రీమియం పై 11 రెట్లు లైఫ్ కవర్ అందివ్వడం జరుగుతుంది.

కాబట్టి Rs 5,50,000/- భీమా అవుతుంది, అత్యధికముగా చెల్లించే ప్రీమియం పై ఆధారపడి ఉంటుంది.

 

•   పాలసీ సమయం – Policy Period

 

http://

Premium Payment Term ( In Years ) 

  Payout Period                 ( In Years )

      Policy Term                 ( In Years )

7  Years 

15/20/25//30

23/28/33/38

8  Years 

15/20/25/30

24/29/34/39

10  Years 

15/20/25

26/31/36

 

ఉదాహరణ :- 7 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే, 15,20,25, మరియు 30 సంవత్సరాల పెఔట్ పీరియడ్ లభిస్తుంది, 15 సంవత్సరాల పెఔట్ పీరియడ్ సెలెక్ట్ చేసుకొంటే పాలసీ సమయం 23 సంవత్సరాలు అవుతుంది.

 

 

  1. Smart Samriddhi Policy Telugu &#సామాన్యులకి బంగారం లాంటి పధకం,100% గ్యారంటీ రిటర్న్స్!

 

2. SBI Life Saral Retirement Saver Telugu &ప్రతి నెల Rs 8,600/- పెన్షన్ జీవితాంతం, Benefits and Eligibility

3. SBI Life Smart Wealth Builder Plan Telugu – “అతి తక్కువ ప్రీమియంతో స్టాక్ మార్కెట్ లాభాలు &#పూర్తి వివరాలు తెలుగులో !

 

ఉదాహరణ – SBI life Smart Platina Plus

 

A) లైఫ్ ఇన్కమ్ – Life Income

35 సంవత్సరాల  వయసు కలిగిన Mr. రాజు సంవత్సరానికి Rs 50 వేల చొప్పున 10 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలని నిర్ణయించుకొన్నాడు. కాబట్టి 10 సంవత్సరాల ప్రీమియం కి 3 రకాల పెఔట్ ఆప్షన్స్ 15,20,మరియు 25,  వీటిలో 15 సంవత్సరాల పెఔట్ ని కోరుకొంటే పాలసీ సమయం వచ్చి 26 సంవత్సరాలు అవుతుంది.

Mr. రాజు 10 సంవత్సరాలలో చెల్లించిన మొత్తం ప్రీమియం = Rs 5,00,000/- ( GST కాకుండా )

11 డవ సంవత్సరం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, ఈ సమయంలో రాజు కంపెనీ కి గాను, కంపెనీ రాజు కి గాను ఎటువంటి అమౌంట్ పేమెంట్ చెయ్యరు.

ప్లాన్ యొక్క 12 వ సంవత్సరం నుంచి రెగ్యులర్ గ్యారెంటెడ్ అడిషన్ రూపంలో Rs 48,080/- పాలసీ చివరి వరకూప్రతి సం || రావడం జరుగుతుంది,

ఈ విధంగా లభించే మొత్తం పెఔట్ 15 ×48,080 = Rs 7,21,000/-

దీనితో పాటుగా చివర్లో 110% అఫ్ చెల్లించిన ప్రీమియం = Rs 5,50,000/- లభిస్తాయి.

మరణ ప్రయోజనం :- మొత్తం పాలసీ సమయంలో ఎప్పుడు ఏ విధంగా రిస్క్ జరిగినా అంటే, ప్రీమియం చెల్లెస్తూనే సమయంలో లేక పెఔట్ పొందే సమయంలో మొత్తం భీమా Rs 5,50,000/- నామినికి అందిస్తారు భవిష్యత్ పెఔట్ నామినికి అందివ్వడం జరగదు.

 

B) గ్యారెంటెడ్ అడిషన్ – Guaranteed Income

పై నిబంధనలకి లోబడి  35 సంవత్సరాల  వయసు కలిగిన Mr. రాజు సంవత్సరానికి Rs 50 వేల చొప్పున 10 సంవత్సరాలు ప్రీమియం చెల్లించాలని నిర్ణయించుకొంటే 15 సంవత్సరాల పెఔట్ ని కోరుకొంటే పాలసీ సమయం వచ్చి 26 సంవత్సరాలు అవుతుంది.

Mr. రాజు 10 సంవత్సరాలలో చెల్లించిన మొత్తం ప్రీమియం = Rs 5,00,000/- ( GST కాకుండా )

11 డవ సంవత్సరం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, ఈ సమయంలో రాజు కంపెనీ కి గాను, కంపెనీ రాజు కి గాను ఎటువంటి అమౌంట్ పేమెంట్ చెయ్యరు.

ప్లాన్ యొక్క 12 వ సంవత్సరం నుంచి రెగ్యులర్ గ్యారెంటెడ్ అడిషన్ రూపంలో Rs 46,650/- పాలసీ చివరి వరకూప్రతి సం || రావడం జరుగుతుంది,

ఈ విధంగా లభించే మొత్తం పెఔట్ 15 ×46,650 =Rs 6,99,750/-

దీనితో పాటుగా చివర్లో 110% అఫ్ చెల్లించిన ప్రీమియం = Rs 5,50,000/- లభిస్తాయి.

 

డెత్ బెనిఫిట్ – Death Benefit

1. Mr. రాజు ప్లాన్ లో ప్రీమియం చెల్లించే సమయంలో రిస్క్ కి గురైతే ప్రాథమిక భీమా Rs 5,50,000/– డెత్ బెనిఫిట్ గా అందించి పాలసీ క్లోజ్ చేస్తారు.

2. అదే ఒకవేళ Mr. రాజు ప్లాన్ లో వార్షిక పెఔట్ పొందే సమయంలో రిస్క్ కి గురైతే ఇమ్మీడియేట్ గా Rs 5,50,000/- డెత్ బెనిఫిట్ మరియు మిగిలిన పెఔట్ పీరియడ్ అంతా రెగ్యులర్ అమౌంట్ నామినికి అందివ్వడం జరుగుతుంది.

 

 

 

ఇతర ముఖ్య ప్రయోజనాలు – Other Benefits

 

 ఫ్రీ లుక్ పీరియడ్  –  Free Look Period

SBI life Smart Platina Plus పాలసీకి సంబందించిన నియమనిబంధనలుపై పాలసీదారుడు అసంతృప్తి చెందినట్లైతే  వెంటనే పాలసీని మూసివేసి చెల్లించిన  మీ ప్రీమియంని  వెనక్కి పొందవచ్చు. ఆన్లైన్ ద్వారా కనుగోలు చేసిన పాలసీకి 30 రోజులు, ఏజెంట్ లేదా బ్రాంచ్ ద్వారా కనుగోలు చేస్తే 15 రోజులు ఫ్రీ లుక్ పీరియడ్ లభిస్తుంది.

 

గ్రేస్ పీరియడ్ ? – Grace Period

పాలసీలో ప్రీమియం చెల్లించడానికి లభించే అదనపు సమయం గ్రేస్ పీరియడ్ అంటారు. ఈ ప్లాన్ లో సంవత్సరానికి,  మరియు 6 నెలలకు ప్రీమియం జమా చేస్తే వారికీ అధనంగా  30 రోజులు సమయం ఉంటుంది. ప్రతినెలా ప్రీమియం చెల్లించేవారికి 15 రోజులు ఈ గ్రేస్ పీరియడ్ ఉంటుంది.

 

లోన్ & సరెండర్ సౌకర్యం – Loan

పూర్తి రెండేళ్ల ప్రీమియం చెల్లించిన తర్వాత రుణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది మరియు  పాలసీని వద్దనుకొంటే సరెండర్ చెయ్యవచ్చు.

 

ఆదాయపు పన్ను ప్రయోజనం – Tax Benefits

పాలసీలో చెల్లించే ప్రీమియం పై ఇన్కమ్ టాక్స్ రూల్ 80 C ప్రకారం డెడక్షన్ మరియు లభించే మెట్యూరిటీ & డెత్ క్లెయిమ్ టాక్స్ ఫ్రీ గా రావడం జరుగుతుంది.

 

రివైవల్  పీరియడ్ ఫెసిలిటీ – Revival Facility

పాలసీలో  వరుసగా 5 సంవత్సరాలు   ప్రీమియంచెల్లించకపొతేఈపాలసీముగియవేయబడుతుంది.అందువల్ల 5 సంవత్సరాల  లోపు మొత్తం  ప్రీమియంని పెనాల్టీతో కలిపి చెల్లిస్తే  ఈ పాలసీలో తిరిగి కొనసాగవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *