New Rules For SSYC & PPF from October 1-2024 In Telugu

New Rules For SSYC & PPF from October 1-2024

 

New Rules For SSYC & PPF from October 1-2024 In Telugu

అక్టోబర్ 1- 2024 న కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ పథకాలలో సుకన్య సమృద్ధి యోజన స్కీం మరియు పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ పథకాలలో కొన్ని మార్పులను తీసుకువచ్చారు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

 

Sukanya Samriddhi Yojana Scheme

 

10 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీం (SSYC) చాలా ఉపయోగపడుతుంది. ఓపెన్ చేయండి. మీ పిల్లల యొక్క పెళ్లి కోసం , ఉన్నత చదువుల కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుంది. అక్టోబర్ 1-2024 నుండి  ఈ SSYC ప్లాన్ లో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది అవేమిటో చూద్దాం.

New Rules For SSYC & PPF from October 1-2024 In Telugu

ఇప్పుడు అక్టోబర్ 1-2024 నుండి SSYC లో కొత్త నియమాలను తెలుసుకుందాము.

 

1) 10 సంవత్సరాల లోపు పిల్లల పేరు మీద తమ తల్లిదండ్రులు లేదా అమ్మ తాతయ్యలు ఎవరైనా ప్రేమతో SSYC అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి సంవత్సరం అమౌంట్ వేస్తూ వుంటారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో వచ్చిన మార్పు ఏమిటంటే పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉండగా అమ్మ తాతయ్యలు గాని వేరే ఎవ్వరు కూడా SSYC అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ వేయకూడదు. ఆ SSYC అకౌంట్ ను వెంటనే పాప తల్లిదండ్రులు పేరు మీద మార్చాలి. ఒకవేళ పాపకి తల్లిదండ్రులు లేకపోతే అప్పుడు ఆ పాప పేరు మీద   ఎవరైనా ఈ SSYC అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు.

 

 

2)ఇప్పటి వరకు ఒక పాప పేరు మీద చాలా SSYC అకౌంట్స్ ఓపెన్ చేసేవారు. అయితే అక్టోబర్ 1- 2024 నుండి ఒక పాప పేరు మీద ఒకే అకౌంట్ ఉండాలి.

 

 

Public Provident Fund

 

PPF scheme పి పి ఫ్ అంటే పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్ (Public Provident Fund). భారత ప్రభుత్వం ద్వారా అత్యంత ఆదరణ పొందిన లాంగ్ టర్మ్ సేవింగ్ స్కీం ఇది. 1968 లో ఈ స్కీం ని గవర్నమెంట్ ప్రారంభం చేసింది. పి. పి. ఫ్. మోస్ట్ పాపులర్ గవర్నమెంట్ స్కీం.అలాగే ఇది ఒక లాంగ్ టర్మ్ ( Long Term ) బెస్ట్ సేవింగ్ స్కీం.

New Rules For SSYC & PPF  from October 1-2024 In Telugu

 

 

ఇప్పుడు అక్టోబర్ 01 2024 నుండి  లో కొత్త నియమాలను తెలుసుకుందాము.

1)పిల్లల పేరుమీద అంటే 18 సంవత్సరాల లోపు పిల్లల పేరు మీద అకౌంట్ ఉంటే సాధారణ వడ్డీ 7.1 %. కానీ అక్టోబర్ 1-2024 నుండి మైనర్ ( 18 సంవత్సరాల లోపు పిల్లలు) పేరు మీద ppf అకౌంట్  వర్కింగ్ లో ఉంటే 7.1 % వడ్డీ రాదు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీం  అకౌంట్ కి ఎంత వడ్డీ వస్తుందో అంత వడ్డీ మాత్రమే మైనర్ కి ఇస్తారు. ప్రస్తుతం  పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీం లో 4%  వస్తుంది.  పిల్లల యొక్క వయస్సు 18 సంవత్సరాలు వచ్చేంతవరకు  4% వడ్డీ వస్తుంది.

మీరు ఒకవేళ PPF అకౌంట్ ఓపెన్ చేదాం అనుకుంటే మీ యొక్క పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఓపెన్ చేయండి.

 

2) 2 లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్స్  (Multiple accounts)

చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ PPF అకౌంట్స్ వున్నాయి. ఇకనుండి మొదట గా తీసుకున్న PPF అకౌంట్ ని ప్రైమరీ అకౌంట్ గా భావిస్తారు. తర్వాత తీసుకున్న అకౌంట్స్ ని సెకండరీ అకౌంట్ గా భావిస్తారు. ఈ సెకండరీ  అకౌంట్స్ కి  పోస్ట్వ ఆఫీస్డ్డీ సేవింగ్ స్కీం ( post office saving scheme) కి లభించే వడ్డీ 4% లభించేది, కానీ ఆ వడ్డీ అనేదే ఇప్పుడు  రాదు. అన్ని    ప్రైమరీ అకౌంట్స్  అంటే  మొదటగా తీసుకున్న అకౌంట్ కి మాత్రమే వడ్డీ వస్తుంది.    అన్ని PPF బెనిఫిట్స్ కూడా ప్రైమరీ అకౌంట్ కే వర్తిస్తాయి.

మీకు ఒకవేళ 2 PPF అకౌంట్స్  ఉంటే అందులో అమౌంట్ మొదటి అకౌంట్ లో డిపోసిట్ చేయండి. సంవత్సరానికి 1,50000 రూపాయలు మాత్రమే వేయాలి. అంతకన్నా ఎక్కువ అమౌంట్ ఉంటే మ్యూచ్యువల్ ఫండ్స్ లో ఇనెస్ట్ చేయండి.

 

https://www.indiapost.gov.in/

 

 

3) ప్రవాస భారతీయులు (NRI)

 

కొంత మంది భారత దేశం లో వున్నప్పుడు తమ పిల్లల పేరు మీద  పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్  అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ చెల్లిస్తారు. తర్వాత కొంతకాలానికి వేరే దేశానికి వెళ్లి స్థిరపడతారు అక్కడ నుండే ప్రతి సంవత్సరం PPF అకౌంట్ లో అమౌంట్ జమ చేస్తూ వుంటారు అప్పుడు కూడా 7.1% వడ్డీ వచ్చేది. కానీ అక్టోబర్ 1-2024 నుండి మీకు వడ్డీ చెల్లించబడదు. ఈ సందర్భం లో అకౌంట్ క్లోజ్ చేసి ఆ అమౌంట్ ని మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే 12% లేదా 13% వడ్డీ వస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *