Saral Pension Yojana In Telugu – ప్రతి నెలా 12,000/- జీవితాంతం మరియు డిపాజిట్ అమౌంట్ మొత్తం రిటర్న్ లభిస్తుంది

     Saral Pension Yojana Details In Telugu

 

Saral Pension Yojana In Telugu

కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసరంగా సామాన్యులకి కూడా  ప్రతీ నెలా రెగ్యులర్ పెన్షన్ జీవితాంతం లభించే  విధంగా ఐ. ర్. డి. ఏ. ఐ ( IRDAI – Insurance Regulatory And Development Authority Of India ) ఏప్రిల్ 1 నుంచి సరళ పెన్షన్ యోజన ను ప్రారంభం చేసింది.

ఇండియా లో అన్ని కంపెనీలు ఈ స్కీం ని అందుబాటులో కి తెస్తున్నాయి.

 

.సరళ పెన్షన్ స్కీం ఏ విధంగా పనిచేస్తుంది? ( How does it’s Work?)

ఇది ఒక సింగిల్ డిపాజిట్ ఇమ్మీడియేట్ యాన్యూటీ స్కీం ( Single Deposit Immediate Annuity Scheme). ఇక్కడ యాన్యూటీ అంటే పెన్షన్ అని అర్ధం. ఈ స్కీం లో మీరు ఒక్కసారే కొద్దిగా అమౌంట్ ని సింగిల్ ప్రీమియం రూపంలో డిపాజిట్ చేస్తే, నిర్ణయించుకొన్న పెన్షన్ మోడ్ ( Pension Mode ) ఆధారంగా తర్వాత నెల నుంచే పెన్షన్ రావడం ప్రారంభం అవుతుంది.

సరళ పెన్షన్ యోజనలో రెండు ముఖ్య ఆప్షన్స్ ఉంటాయి. అవసరానికి అనుగుణంగా మీరు ఒక దాన్ని నిర్ణయించుకోవచ్చు.

Saral Pension Yojana In Telugu - ప్రతి నెలా 12,000/- జీవితాంతం మరియు డిపాజిట్ అమౌంట్ మొత్తం రిటర్న్ లభిస్తుంది

 

ఆప్షన్  ( Option ) :- 1

“లైఫ్ యాన్యూటీ విత్ 100% రిటర్న్ అఫ్ పర్చేజింగ్ ప్రైస్ “(Life Annuity With 100% Return Of Purchasing Price )

దీన్నే సింగిల్ పెన్షన్ అని అంటారు. ఈ ఆప్షన్ ద్వారా అమౌంట్ డిపాజిట్ చేసిన వ్యక్తికి, నిర్ణయించుకొన్న పెన్షన్ మోడ్ ఆధారంగా జీవితాంతం ఒక ఖచ్చితమైన పెన్షన్ వస్తూ ఉంటుంది.

పెన్షన్ తీసుకొనే వ్యక్తి జీవిత పర్యాంతంలో ఎప్పుడు మరణించినా  డిపాజిట్ అమౌంట్ ని 100% నామినీ కి అందజేయడం జరుగుతుంది.

 

ఆప్షన్ ( Option ) :- 2

 

“జాయింట్ లైఫ్ యాన్యూటీ విత్ ఏ ప్రోవిషన్ అఫ్,100% యాన్యూటీ టూ ద సెకండరీ అన్నుటియంట్ ఆన్ డెత్ అఫ్ ద ప్రైమరీ అన్నుటియంట్ అండ్ రిటర్న్ 100% పర్చేజింగ్ప్రైస్ ఆన్ డెత్ అఫ్ లాస్ట్ సర్వీవోరు”

 

Joint Life Annuity With a Provision Of 100% Annuity to the Secondary Annuitant on Death Of The Primary Annuitant And Return 100% Purchasing Price On Death Of Last Survivor.

 

అంటే ఈ ఆప్షన్ లో అమౌంట్ డిపాజిట్ చేసే వ్యక్తికి నిర్ణయించుకొన్న పెన్షన్ మోడ్ ఆధారంగా రెగ్యులర్ పెన్షన్ జీవితాంతం లభిస్తుంది. స్కీం లో అమౌంట్ డిపాజిట్ చేసిన వ్యక్తి ఏ కారణంగా మరణించినా, అతనికి ఎంత ఐతే ప్రతినెలా పెన్షన్ లభిస్తుందో 100% అతని భార్య కి కూడా జీవితాంతం లభిస్తుంది.
అంటే ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాలం జీవించి ఉంటే వారికి పెన్షన్ లభిస్తుందన్న మాట.

అదేవిధంగా రెండవ వ్యక్తి కూడా ఏ కారణంగా మరణించినా, స్కీం ప్రారంభంలో డిపాజిట్ చేసిన మొత్తం అమౌంట్ ని వారి పిల్లలకు లేదా నామినీ కి అందివ్వడం జరుగుతుంది.

 

• సరళ పెన్షన్ స్కీం యొక్క సమయం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ? (  Period Of Saral Pension Scheme?)

హోల్ లైఫ్ ( Whole Life ) ఈ పాలసీ ని ఒక్కసారి ఖరీదు చేస్తే జీవితాంతం రెగ్యులర్ పెన్షన్ వస్తుంటుంది.

 

•ఈ స్కీం తీసుకోవడానికి అర్హులు ఎవరు? ( Who can take This Policy? )

ఈ పాలసీ తీసుకొనే వ్యక్తి యొక్క కనీస వయస్సు( Minimum Age ) = 40 సంవత్సరాలు
అత్యధిక వయస్సు  (maximum Age ) = 80 సంవత్సరాలు.

కనుక 40 సంవత్సరాల వయసు   నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యకలిగిన వారు  ఈ పాలసీని  తీసుకోవచ్చు.

 

PPF Scheme in Telugu -” పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్” అర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!

LIC Arogya Rakshak Plan In Telugu -” కుటుంబం మొత్తానికి ఒక్కటే ఆరోగ్య పాలసీ ” పూర్తి వివరాలు ఉదాహరణ ద్వారా !

• లోన్ సదుపాయం? ( Loan Facility?)

అత్యవసర సమయంలో డిపాజిట్ అమౌంట్ పై లోన్ కూడా పొందవచ్చు. ఎంత అన్నది డిపాజిట్ అమౌంట్ పై ఆధారపడి ఉంటుంది.

 

• సరళ పెన్షన్ యోజన స్కీం యొక్క కనీస మరియు అత్యధిక పెన్షన్? ( Minimum & Maximum Pension??)

ప్రతీ నెల  ( Monthly )        =  Rs. 1,000/-
.  3 నెలలకి   ( Quarterly )    =  Rs. 3,000/-
.  6 నెలలకి   ( H/ Yearly )    =  Rs. 6,000/-
. సంవత్సరానికి ( Yearly )    = Rs. 12,000/-

 

• పెన్షన్ పొందే విధానం? ( Pension Mode )

అవసరాన్ని బట్టి 4 రకాలుగా నిర్ణయించుకోవచ్చు.
.  ప్రతీ నెల             ( Monthly )
.  3 నెలలకి             ( Quarterly )
.  6 నెలలకి            ( H/ Yearly )
. సంవత్సరానికి     ( Yearly )

 

• ఈ స్కీం లో అమౌంట్ ఏ విధంగా చెల్లించాలి? ( Amount Deposit mode )

సింగల్ ప్రీమియం. ( Single Premium )  ప్రారంభంలో ఒక్కసారే చెల్లించాలి.

 

• సరెండర్ ఫెసిలిటీ? ( Surrender Facility  Of Saral Pension Yojana?)

అంటే పాలసీదారుడు ఏదైనా పెద్ద అనారోగ్యానికి గురిఅయినట్లైతే  ( కాన్సర్, హార్ట్ అట్టాక్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ సంబంధిత మొదలైనవి ) ట్రీట్మెంట్ కి కావాల్సిన మొత్తం ఖర్చు కోసం స్కీం ని సరెండర్ చేసి 95%  డిపాజిట్ ని రిటర్న్ గా పొందవచ్చు.

దీనికోసం అన్నీ కాంపెనీలు కొన్ని గంభీరమైన  వ్యాధులకు సంబందించిన  ఒక లిస్ట్ తయారుచేసింది. లిస్ట్ లో ఉన్న ఏ అనారోగ్యానికి పాలసీదారుడు గురియైన  ఈ ప్రయోజనం  వర్తిస్తుంది.

 

.  ఈఖాతాను ఓపెన్ చెయ్యడానికి ఏయే డాకుమెంట్స్ కి అవసరం ఉంటుంది? ( Saral pension yojana Documents Required?)

1. అప్లికేషన్ ఫారం                     ( Account Opening Form )
2. రెండు పాసుపోర్టు ఫొటోలు    ( 2 Photos )
3. ఆధార్ కార్డు                             ( Adar Card )
4. పాన్ కార్డు                                  ( PAN  Card )
5. బ్యాంక్ అకౌంట్ వివరాలు    ( A/c Details )

 

https://licindia.in/

 

• ముగింపు  ( Conclusion )

ఈ వెబ్సైటు ద్వారా అన్ని   ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు  మరియు  చిన్న తరహా వ్యాపారాల యొక్క  వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *