SBI Annuity Deposit Scheme In Telugu – ప్రతి నెలా Rs.9,677/- రూ ||లు 3 సంవత్సరాల వరకు పొందండి

                               SBI Annuity Deposit Scheme In Telugu

SBI Annuity Deposit Scheme

 

.స్టేట్ బ్యాంక్ యాన్యూటీ  డిపాజిట్ స్కీం అంటే ఏమిటి?( What Is The State Bank Annuity Deposit Scheme?)

స్టేట్ బ్యాంక్ యాన్యూటీ స్కీం ఒక సింగిల్ డిపాజిట్ రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ పెన్షన్ స్కీం. ( Single Deposit Regular Monthly Income Pension Scheme)

ఈ స్కీం లో మీరు ఒక్కసారే కొద్దిగ అమౌంట్ ని డిపాజిట్ చేస్తారు, డిపాజిట్ అమౌంట్ ని ఆధారంగా చేసుకొని, నిర్ణయించుకొన్న పీరియడ్ అంతా ప్రతీ నెలా రెగ్యులర్ ఆదాయం లభిస్తుంది.ఈ విధంగా లభించే అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ లో డైరెక్టుగా జమా చేయబడుతుంది.

డిపాజిట్ అమౌంట్ కి ఒకసారే ఇంటరెస్ట్ ని జోడించి స్కీం సమయం మొత్తం అసలు + వడ్డీని కలిపి మీకు అందివ్వడం జరుగుతుంది.

 

SBI  యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ క్రమం తప్పకుండా నెలవారీ ఆదాయాన్ని పొందడానికి ప్రతి వ్యక్తిని పొదుపు దారిలో నడిపిస్తుంది. ఈ యాన్యుటీ డిపాజిట్ స్కీం లో  ఆసక్తితో పెట్టుబడి పెట్టేవారు  తమ పొదుపు మొత్తాన్ని ఒక నిర్దిష్ట మొత్తంలో డిపాజిట్ చేయవచ్చు.

SBI Saral Jeevan Bhima In Telugu - 5 లక్షల భీమా నెలకు 1,68/- రూ||లకే కానీ వీరికి మాత్రమే, పూర్తి వివరాలు

SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అనేది  వినియోగదారులు  తాము పొదుపు చేసుకునే కొద్ది మొత్తాల నుండి  రెగ్యులర్ ఆదాయం పొందడానికి ఉపయోగించుకునే స్కీమ్ పేరే SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో, ఒక కస్టమర్  ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టి,  ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌ల రూపంలో  (EMI) తీసుకోవచ్చు. EMI తో పాటు ప్రధానం గా  వడ్డీ కూడా కలిపి ఇస్తారు. ఈ వడ్డీని ప్రతి మూడు నెలలకు కలుపుతారు. అయితే, వడ్డీ రేటు నిర్ణయం  SBI నియమ  నిబంధనల ప్రకారం ఉంటుంది.

SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో  మైనర్ కూడా చేరవచ్చు. మరియు  సింగిల్ లేదా జాయింట్ ఖాతాల ద్వారా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. కనీస డిపాజిట్ ₹1000 లతో మీ పెట్టుబడి పెట్టవచ్చు.  SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడుల గరిష్ట మొత్తానికి పరిమితి లేదు. ముఖ్యంగా  పెట్టుబడిదారులు 36, 60, 84 లేదా 120 నెలలుగా అందుబాటులో ఉన్న కాలపరిమితి ని  మీరు ఎంపిక చేసుకోవచ్చు.   ఈ  SBI యాన్యుటీ డిపాజిట్ పథకానికి సంబంధించి మీకు  అత్యవసరమైతే  రుణం  తీసుకోవచ్చు. అయితే, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వ్యాసంలో తెలియజేయడం జరిగింది.

 

• స్టేట్ బ్యాంక్ యాన్యూటీ స్కీమ్ ప్రయోజనాలు? ( Benefits Of SBI Annuity Scheme?)

1. స్కీం మొత్తంలో ఒక్కసారే అమౌంట్ డిపాజిట్ చెయ్యాలి. ( Single Deposit Only )

2. ప్రతీ నెలా రెగ్యులర్ ఆదాయం స్కీం మొత్తం లభిస్తుంది.

3. ఈ స్కీం లో అమౌంట్ డిపాజిట్ చెయ్యడానికి ఎటువంటి వయసు అర్హతలు లేవు, కాబట్టే అన్ని వయసుల వారు  అర్హులు.

4. నెలకి కనీసం Rs. 1000/- రూ ||లు పెన్షన్ పొందే విధంగా అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు.

5.  4 రకాలుగా పాలసీ పీరియడ్  నిర్ణయించుకొనేలా ఫ్లెక్స్ బిలిటీ ఉంటుంది.

5. వేరు వేరు కేటగిరి వ్యక్తులకు వడ్డీరేట్ వేరుగా ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఉద్యోగులకి అదనపు వడ్డీ లభిస్తుంది.

6. లోన్ సదుపాయం, నామినీ ఫెసిలిటీ అందుబాటులో ఉంటాయి.

 

 స్టేట్ బ్యాంక్ యాన్యూటీ  స్కీం కి అర్హులు ఎవరు? ( Who can To be  Eligible SBI Annuity Scheme ?)
  1.  భారతదేశ నాగరికత కలిగిన వ్యక్తులందరు ఈ స్కీం లో అకౌంట్ ఓపెన్ చెయ్యవచ్చు .

2.  పిల్లలు పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు.

3.  ఇద్దరు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి స్కీం లో అమౌంట్ డిపాజిట్ చెయ్యవచ్చు.

 

.  స్టేట్ బ్యాంక్ ఆన్యూటీ స్కీం యొక్క కనీస మరియు అత్యధిక డిపాజిట్ అమౌంట్ ఎంత? ( Deposit Limits Of SBI Annuity Scheme?)

కనీస వన్ టైమ్ డిపాజిట్  ( Minimum  One Time Deposit )                           – Rs. 36,000/-
అత్యధిక  one Time డిపాజిట్ అమౌంట్  (  Maximum One Time Deposit ) – No Limit

కాబట్టి SBI యాన్యూటీ పథకంలో కనీసం Rs.36,000/- రూపాయలు దగ్గర నుంచి  అత్యధికముగా ఎంతైనా డిపాజిట్ చెయ్యవచ్చు.

 

SBI life Smart future Choices In Telugu – “అవసరం వచ్చినప్పుడల్లా అడిగి తీసుకోండి “

PPF Scheme in Telugu -” పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్” అర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!

• స్టేట్ బ్యాంక్ యాన్యూటీ స్కీం యొక్క సమయం? (  Period Of SBI Annuity Deposit Scheme?)

ఈ స్కీం యొక్క సమయం 4 రకాలుగా ఉంటుంది.

  1. 3 సంవత్సరాలకి    (  3 Years  )
    2. 5 సంవత్సరాలకి     (  5 Years )
    3. 7 సంవత్సరాలకి      ( 7 Years )   మరియు
    4. 10 సంవత్సరాలకి    ( 10 Years )

 

• ఈ స్కీం లో మనం కనీస మరియు అత్యధికముగా ప్రతీ నెలా ఎంత యాన్యూటీ ని నిర్ణయించుకోవచ్చు?
(Minimum and Maximum Annuity?)

కనీస నెలవారి యాన్యూటీ వచ్చి( Minimum monthly Annuity ) = Rs.1,000/-
అత్యధిక నెలవారి యాన్యూటీ  ( Maximum monthly Annuity )   = Rs. No Limit

కాబట్టి ఎంతైనా అమౌంట్ ని ఈ స్కీం లో డిపాజిట్ చేసి రెగ్యులర్ ఆదాయాన్ని పొందవచ్చు.

 

• ఈ స్కీం లో అమౌంట్ ఏ విధంగా డిపాజిట్ చెయ్యాలి? ( Mode Of Amount Deposit)

సింగల్ ప్రీమియం( Single premium ), అంటే ఒక్కసారే చెల్లించాలి.

 

• యాన్యూటీ స్కీం లో ప్రస్తుతం ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తే వడ్డీ ఎంత లభిస్తుంది, ప్రతీ నెలా ఎంత ఆదాయం పొందవచ్చు, ఉదాహరణ ద్వారా చూద్దాం? ( Present Rate Of Interest?)

 

1. సామాన్య వ్యక్తులు ఈ స్కీం లో 3 లేదా 5 సంవత్సరాలకి  అమౌంట్ డిపాజిట్ చేస్తే 5.30% వడ్డీ రేట్ లభిస్తుంది.

2.  7 లేదా 10 సంవత్సరాలకి అమౌంట్ డిపాజిట్ చేస్తే 5.40% వడ్డీ లభిస్తుంది.

3.  సీనియర్ సిటిజన్స్ కి  ( 60 సంవత్సరాలు నిండిన వారికి ) 0.5% అదనంగా 5.90% లభిస్తుంది.

4.  ఒకవేళ మీరు స్టేట్ బ్యాంక్ ఉద్యోగి అయినట్లయితే అత్యధికముగా 6.40% వడ్డీ అందివ్వడం జరుగుతుంది.

 

డిపాజిటర్ పేరు ( Name )             – Mr. రమేష్
వయసు         ( Age )                        – 25 సంవత్సరాలు
అమౌంట్ డిపాజిట్ ( Deposit )     – లక్ష రూపాయలు

 

స్కీం  యొక్క సమయం ( Period )      – 3 సంవత్సరాలు

              డిపాజిట్ అమౌంట్                   ప్రతీ నెలా యాన్యూటీ
             Rs.1,00,000/-                     = Rs. 3,225/-
             Rs.2,00,000/-                     = Rs. 6,451/-
             Rs. 3,00,000/-                    = Rs. 9,677/-
             Rs. 5,00,000/-                    = Rs. 16,128/-

(These Rates are Approximately Only… But Just no long variation )

 

 

• SBI యాన్యూటీ స్కీం మాట్యూరిటీ ప్రయోజనం? ( Maturity Benefit Of SBI Annuity Scheme?)

ఈ స్కీమ్ లో మీకు ఎటువంటి మేట్యూరిటీ లభించదు. ఎందుకంటే డిపాజిట్ చేసిన అసలు + వడ్డీని కలిపే ప్రతినెలా మీకు యాన్యూటీ రూపంలో అందివ్వడం జరుగుతుంది.

 

• ప్రీ – మెట్యూర్ క్లోజర్ ఫెసిలిటీ? ( Pre – Mature Closer Is Available In SBI Annuity?)

అంటే స్కీం యొక్క సమయం కంటే ముందే,  స్కీం క్లోజ్ చేసి అమౌంట్ రిటర్న్ పొందడం. దీనికోసం కింద షరతులు వర్తిస్తాయి.

1. 5 లక్షలు కంటే తక్కువ అమౌంట్ ఈ స్కీం లో డిపాజిట్ చేసినట్లయితే  0.5% పెనాల్టీ కట్ చేసి అప్పటివరకు లభించ వలసిన అమౌంట్ రిటర్న్ చేస్తారు.

అంటే లక్ష కి Rs.500/- రూ ||లు చొప్పున Rs.2,500/-
రూ ||లు కట్ చేసి బాలన్స్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది.

2.  10 లక్షలు కంటే తక్కువ అమౌంట్ ఈ స్కీం లో డిపాజిట్ చేసినట్లయితే  1.0% పెనాల్టీ కట్ చేసి అప్పటివరకు లభించ వలసిన అమౌంట్ రిటర్న్ చేస్తారు.

అంటే లక్ష కి Rs.1,000/– రూ ||లు చొప్పున Rs.5,000/-
రూ ||లు కట్ చేసి  బాలన్స్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది.

 

• లోన్ లేదా ఓవరడ్రాఫ్ట్ ఫెసిలిటీ? ( loan or Over Draft Facility?)

అత్యవసర సమయంలో డిపాజిట్ అమౌంట్ పై  75% వరకూ లోన్ పొందవచ్చు లేదా ఓవర్ డ్రాఫ్ట్ ని పొందవచ్చు.

 

• యాన్యూటీ స్కీం టాక్స్ ప్రయోజనాలు? ( Tax Benefits Of SBI Annuity Scheme?)

1. ప్రతీ నెలా లభించే యాన్యూటీ అమౌంట్ పై  10% టాక్స్ డెడక్షన్ విధించబడుతుంది.

ఒకవేళ  ఇన్కమ్ టాక్స్ పరిధిలోపల ఉన్నవారు

ఫారం ( Form ) – 15 G ని జమా చేసి టాక్స్ మినహ ఇంచుకోవచ్చు.
ఫారం ( Form )  – 15 H ని జమా చేసి  సీనియర్ సిటిజన్స్ టాక్స్ సేవ్ చేసుకోవచ్చు.

 

• యాన్యూటీ అకౌంట్ ట్రాన్సఫర్ సదుపాయం? ( Annuity Account Transfer Facility?)

అత్యవసర పరిస్థితుల్లో ఒక స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్ కి అకౌంట్ ట్రాన్స్ఫర్ సులభంగా చేసుకొనే సదుపాయం ఉంటుంది.

 

https://www.sbi.co.in/

 

. యాన్యూటీ ఖాతాను ఓపెన్ చెయ్యడానికి ఏయే డాకుమెంట్స్ కి అవసరం ఉంటుంది? ( SBI Annuity Scheme Documents Required?)

1.అప్లికేషన్ ఫారం  ( Account Opening Form )
2. రెండు పాసుపోర్టు ఫొటోలు  ( 2 Photos )
3.  ఆధార్ కార్డు          ( Adar Card )
4.  పాన్ కార్డు             ( PAN  Card )
5. బ్యాంక్ అకౌంట్ వివరాలు ( A/c Details )

 

SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు:-

 

ప్ర. SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ద్వారా లభించే  వడ్డీపై TDS వర్తిస్తుందా?

జ. అవును, ఈ పథకం నుండి వచ్చే వడ్డీ కి TDS  వర్తిస్తుంది.

ప్ర. నేను ఆన్‌లైన్‌లో కొత్త గా నామినీని చేర్చ వచ్చా?

జ. లేదు, మీరు ఆన్‌లైన్‌లో కొత్త నామినీని చేర్చలేరు. నామినీ వివరాలను చేర్చడానికి లేదా మార్చడానికి మీరు SBI  బ్రాంచ్‌ని సంప్రదించాలి.  SBI యాన్యుటీ డిపాజిట్ ఖాతాను తెరిచేటప్పుడే, మీరు  నామినీ కి సంబంధించిన అన్ని వివరాలను పేర్కొనవలసి ఉంటుంది.

ప్ర. నేను ఆన్‌లైన్‌లో అకాల ఉపసంహరణ (Premature withdrawal) చేయవచ్చా?

జ. లేదు, పెట్టుబడిదారుడు మరణించిన తర్వాత మరియు యాన్యుటీ స్కీం అకౌంట్ తెరిచిన శాఖలో మాత్రమే అకాల ఉపసంహరణ అనుమతించబడుతుంది.  అలాగే, SBI అకాల ఉపసంహరణ కు పెనాల్టీని వసూలు చేస్తుంది. ఈ పెనాల్టీ SBI టర్మ్ డిపాజిట్‌ల మాదిరిగానే ఉంటుంది.

ప్ర.  SBI యాన్యుటీ డిపాజిట్ మరియు రికరింగ్ డిపాజిట్ ఖాతా మధ్య తేడా ఏమిటి?

జ. రికరింగ్ డిపాజిట్ ఖాతాను ప్రారంభించిన కస్టమర్‌లు తప్పనిసరిగా ప్రతి నెల  వాయిదాల పద్ధతిలో  చెల్లింపులు చేయాలి చివరి గా మెచ్యూరిటీ మొత్తాన్ని మెచ్యూరిటీ తేదీన కస్టమర్‌ తీసుకుంటాడు. మరి యాన్యుటీ డిపాజిట్ విషయం లో కస్టమర్‌లు వన్-టైమ్ డిపాజిట్‌ చేయాలి.  ఈ విధంగా తగ్గింపు సూత్రం ఆధారంగా వడ్డీతో పాటు మొత్తాన్ని,  ముందుగా నిర్ణయించిన కాలపరిమితిలో నెలసరి వాయిదాలలో కస్టమర్‌కు అందచేయబడుతుంది.

ప్ర. యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా నేను ఎంత మెచ్యూరిటీని పొందుతాను?

జ. ఈ స్కీమ్ వ్యవధిలో పెట్టుబడిదారునికి ప్రిన్సిపల్ మరియు తగ్గించబడే ప్రిన్సిపల్‌ మీద వడ్డీ చెల్లించబడుతుంది. అందువల్ల ఎలాంటి మెచ్యూరిటీ మొత్తం అనేది ఉండదు.

ప్ర. SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ కోసం కనీస పెట్టుబడి ఎంత? 

జ. SBI యాన్యుటీ డిపాజిట్ కనీస మొత్తం  నెలకు  ₹1,000 గా ఉంది.  ఉదాహరణకు, మూడు సంవత్సరాల కాలపరిమితితో ఖాతా తెరిస్తే, కనీస డిపాజిట్ మొత్తం రూ .36,000 అవుతుంది. ఇందులో  గరిష్ట పరిమితి లేదు. ఈ పథకంలో  కస్టమర్‌లు వీలైనంత ఎక్కువ డబ్బును డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది.

 

ప్ర. SBI యాన్యుటీ డిపాజిట్ ఖాతాను తెరవడానికి నేను  ఇతర ఖాతా నుండి డబ్బును డెబిట్ చేయవచ్చా?

జ. అవును, యాన్యుటీ డిపాజిట్ ఖాతాను తెరవడానికి కస్టమర్‌లు తమ  కరెంట్ లేదా  సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుండి డెబిట్ చేయడానికి అనుమతించబడతారు. కానీ,  డెబిట్ చేయడానికి ఎంచుకున్న ఖాతా తప్పనిసరిగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాధ్యమం ద్వారా చెల్లుబాటు అయ్యే లావాదేవీల ఖాతా అయి ఉండాలి. ముఖ్యంగా మీ అకౌంట్ లాక్ చేయబడి ఉండకూడదు. మీ అకౌంట్ ఆక్టివ్ స్ధితి లో ఉండాలి.

 

• ముగింపు  ( Conclusion )

స్టేట్ బ్యాంక్ యాన్యూటీ స్కీం కి సంబందించిన పూర్తి సమాచారాన్ని మీకు అందించానని భావిస్తున్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ మరచినట్లైతే  మన్నించి క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి.

ఈ వెబ్సైటు ద్వారా అన్ని   ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు  మరియు  చిన్న తరహా వ్యాపారాల యొక్క  వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *