Saral Pension Yojana Details In Telugu
Saral Pension Yojana
.సరళ పెన్షన్ యోజన ( Saral Pension Yojana )
కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసరంగా సామాన్యులకి కూడా ప్రతీ నెలా రెగ్యులర్ పెన్షన్ జీవితాంతం లభించే విధంగా ఐ. ర్. డి. ఏ. ఐ ( IRDAI – Insurance Regulatory And Development Authority Of India ) ఏప్రిల్ 1 నుంచి సరళ పెన్షన్ యోజన ను ప్రారంభం చేసింది.
ఇండియా లో అన్ని కంపెనీలు ఈ స్కీం ని అందుబాటులో కి తెస్తున్నాయి.
.సరళ పెన్షన్ స్కీం ఏ విధంగా పనిచేస్తుంది? ( How does it’s Work?)
ఇది ఒక సింగిల్ డిపాజిట్ ఇమ్మీడియేట్ యాన్యూటీ స్కీం ( Single Deposit Immediate Annuity Scheme). ఇక్కడ యాన్యూటీ అంటే పెన్షన్ అని అర్ధం. ఈ స్కీం లో మీరు ఒక్కసారే కొద్దిగా అమౌంట్ ని సింగిల్ ప్రీమియం రూపంలో డిపాజిట్ చేస్తే, నిర్ణయించుకొన్న పెన్షన్ మోడ్ ( Pension Mode ) ఆధారంగా తర్వాత నెల నుంచే పెన్షన్ రావడం ప్రారంభం అవుతుంది.
సరళ పెన్షన్ యోజనలో రెండు ముఖ్య ఆప్షన్స్ ఉంటాయి. అవసరానికి అనుగుణంగా మీరు ఒక దాన్ని నిర్ణయించుకోవచ్చు.
ఆప్షన్ ( Option ) :- 1
“లైఫ్ యాన్యూటీ విత్ 100% రిటర్న్ అఫ్ పర్చేజింగ్ ప్రైస్ “(Life Annuity With 100% Return Of Purchasing Price )
దీన్నే సింగిల్ పెన్షన్ అని అంటారు. ఈ ఆప్షన్ ద్వారా అమౌంట్ డిపాజిట్ చేసిన వ్యక్తికి, నిర్ణయించుకొన్న పెన్షన్ మోడ్ ఆధారంగా జీవితాంతం ఒక ఖచ్చితమైన పెన్షన్ వస్తూ ఉంటుంది.
పెన్షన్ తీసుకొనే వ్యక్తి జీవిత పర్యాంతంలో ఎప్పుడు మరణించినా డిపాజిట్ అమౌంట్ ని 100% నామినీ కి అందజేయడం జరుగుతుంది.
ఆప్షన్ ( Option ) :- 2
“జాయింట్ లైఫ్ యాన్యూటీ విత్ ఏ ప్రోవిషన్ అఫ్,100% యాన్యూటీ టూ ద సెకండరీ అన్నుటియంట్ ఆన్ డెత్ అఫ్ ద ప్రైమరీ అన్నుటియంట్ అండ్ రిటర్న్ 100% పర్చేజింగ్ప్రైస్ ఆన్ డెత్ అఫ్ లాస్ట్ సర్వీవోరు”
Joint Life Annuity With a Provision Of 100% Annuity to the Secondary Annuitant on Death Of The Primary Annuitant And Return 100% Purchasing Price On Death Of Last Survivor.
అంటే ఈ ఆప్షన్ లో అమౌంట్ డిపాజిట్ చేసే వ్యక్తికి నిర్ణయించుకొన్న పెన్షన్ మోడ్ ఆధారంగా రెగ్యులర్ పెన్షన్ జీవితాంతం లభిస్తుంది. స్కీం లో అమౌంట్ డిపాజిట్ చేసిన వ్యక్తి ఏ కారణంగా మరణించినా, అతనికి ఎంత ఐతే ప్రతినెలా పెన్షన్ లభిస్తుందో 100% అతని భార్య కి కూడా జీవితాంతం లభిస్తుంది.
అంటే ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాలం జీవించి ఉంటే వారికి పెన్షన్ లభిస్తుందన్న మాట.
అదేవిధంగా రెండవ వ్యక్తి కూడా ఏ కారణంగా మరణించినా, స్కీం ప్రారంభంలో డిపాజిట్ చేసిన మొత్తం అమౌంట్ ని వారి పిల్లలకు లేదా నామినీ కి అందివ్వడం జరుగుతుంది.
• సరళ పెన్షన్ స్కీం యొక్క సమయం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ? ( Period Of Saral Pension Scheme?)
హోల్ లైఫ్ ( Whole Life ) ఈ పాలసీ ని ఒక్కసారి ఖరీదు చేస్తే జీవితాంతం రెగ్యులర్ పెన్షన్ వస్తుంటుంది.
•ఈ స్కీం తీసుకోవడానికి అర్హులు ఎవరు? ( Who can take This Policy? )
ఈ పాలసీ తీసుకొనే వ్యక్తి యొక్క కనీస వయస్సు( Minimum Age ) = 40 సంవత్సరాలు
అత్యధిక వయస్సు (maximum Age ) = 80 సంవత్సరాలు.
కనుక 40 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యకలిగిన వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.
PPF Scheme in Telugu -” పబ్లిక్ ప్రొవిడంట్ ఫండ్” అర్హతలు, నియమాలు, పూర్తి వివరాలు!
• లోన్ సదుపాయం? ( Loan Facility?)
అత్యవసర సమయంలో డిపాజిట్ అమౌంట్ పై లోన్ కూడా పొందవచ్చు. ఎంత అన్నది డిపాజిట్ అమౌంట్ పై ఆధారపడి ఉంటుంది.
• సరళ పెన్షన్ యోజన స్కీం యొక్క కనీస మరియు అత్యధిక పెన్షన్? ( Minimum & Maximum Pension??)
ప్రతీ నెల ( Monthly ) = Rs. 1,000/-
. 3 నెలలకి ( Quarterly ) = Rs. 3,000/-
. 6 నెలలకి ( H/ Yearly ) = Rs. 6,000/-
. సంవత్సరానికి ( Yearly ) = Rs. 12,000/-
• పెన్షన్ పొందే విధానం? ( Pension Mode )
అవసరాన్ని బట్టి 4 రకాలుగా నిర్ణయించుకోవచ్చు.
. ప్రతీ నెల ( Monthly )
. 3 నెలలకి ( Quarterly )
. 6 నెలలకి ( H/ Yearly )
. సంవత్సరానికి ( Yearly )
• ఈ స్కీం లో అమౌంట్ ఏ విధంగా చెల్లించాలి? ( Amount Deposit mode )
సింగల్ ప్రీమియం. ( Single Premium ) ప్రారంభంలో ఒక్కసారే చెల్లించాలి.
• సరెండర్ ఫెసిలిటీ? ( Surrender Facility Of Saral Pension Yojana?)
అంటే పాలసీదారుడు ఏదైనా పెద్ద అనారోగ్యానికి గురిఅయినట్లైతే ( కాన్సర్, హార్ట్ అట్టాక్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ సంబంధిత మొదలైనవి ) ట్రీట్మెంట్ కి కావాల్సిన మొత్తం ఖర్చు కోసం స్కీం ని సరెండర్ చేసి 95% డిపాజిట్ ని రిటర్న్ గా పొందవచ్చు.
దీనికోసం అన్నీ కాంపెనీలు కొన్ని గంభీరమైన వ్యాధులకు సంబందించిన ఒక లిస్ట్ తయారుచేసింది. లిస్ట్ లో ఉన్న ఏ అనారోగ్యానికి పాలసీదారుడు గురియైన ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
. ఈఖాతాను ఓపెన్ చెయ్యడానికి ఏయే డాకుమెంట్స్ కి అవసరం ఉంటుంది? ( Saral pension yojana Documents Required?)
1. అప్లికేషన్ ఫారం ( Account Opening Form )
2. రెండు పాసుపోర్టు ఫొటోలు ( 2 Photos )
3. ఆధార్ కార్డు ( Adar Card )
4. పాన్ కార్డు ( PAN Card )
5. బ్యాంక్ అకౌంట్ వివరాలు ( A/c Details )
• ముగింపు ( Conclusion )
ఈ వెబ్సైటు ద్వారా అన్ని ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు, గవర్నమెంట్ పథకాలు, బ్యాంకు స్కీమ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు మరియు చిన్న తరహా వ్యాపారాల యొక్క వంద శాతం మంచి సమాచారాన్ని అందిచడం ముఖ్య ఉద్దేశం.