SBI Life Poorna Suraksha Plan Details In Telugu
SBI Life Poorna Suraksha Plan
ఎస్.బి. ఐ లైఫ్ పూర్ణ సురక్ష ఒక నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేట్ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసి , ఒక అద్భుతమైన మరియు తక్కువ ప్రీమియం తో ఎక్కువ లైఫ్ కవర్ మరియు హెల్త్ నీ ప్రొటెక్ట్ చేస్తూ (Low premium with Term & Health insurance) ఎస్.బి. ఐ లైఫ్ పూర్ణ సురక్ష భీమా ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ముఖ్యమైనది ఆరోగ్యం , ఈ ఆరోగ్యానికి ప్రాముఖ్యాన్ని ఇస్తూ దీనితో పాటుగా ఇన్సూరెన్స్ నీ కూడా ఈ ప్లాన్ అందిస్తుంది.
ఈ టర్మ్ ప్లాన్ లో ,హెల్త్ ఇన్సూరెన్స్ మరియు బెనిఫిట్ రైడర్స్ నీ కూడా ఒకే ప్లాన్ లో అందివ్వడం జరిగింది. ఇది ఒక నాన్ లింక్డ్ (స్టాక్ మార్కెట్ లో గాని ఏ కంపెనీ లో గాని పెట్టుబడి పెట్టడం జరగదు)ప్లాన్. ఈ ఎస్.బి. ఐ యొక్క పూర్ణ సురక్ష భీమా యొక్క అర్హతలు,వయసు పరిమితులు,పాలసీ సమయం,పేమెంట్ వివరాలను ఉదాహరణ ద్వారా తెలుసుకుందాము.
![SBI Life Poorna Suraksha Plan - Rs 314 /- రూపాయలకే రెండు పాలసీలు,Benefits,Eligiblity,Features](https://i0.wp.com/insurancemarkettelugu.com/wp-content/uploads/2022/05/jpg_20220525_185722_0000.jpg?resize=640%2C360)
Key features & Benefits of Poorna Suraksha
పూర్ణ సురక్ష భీమా అంటే: ఒక కుటుంబ ఆర్థిక వ్యవస్థలో మూలమైన వ్యక్తి ఈ ప్లాన్ ను తీసుకున్నట్లయితే అతనికి ఆరోగ్య భద్రత మరియు అతని కుటుంబానికి ఆర్థిక భద్రతను ఈ భీమా కల్పిస్తుంది దీనితో పాటు 2 రైడర్స్ నీ ఇదే ప్లాన్ లో అందిస్తుంది అదనంగా ఎటువంటి అమౌంట్ చెల్లించకుండా.
వ్యక్తికి ప్లాన్ సమయం లోపు రిస్క్ జరిగితే ప్లాన్ లో ఎంచుకున్న భీమా అమౌంట్ మొత్తం నామినీ కి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ పూర్ణ సురక్ష భీమా తీసుకున్న వ్యక్తి ఏదైనా పెద్ద అనారోగ్యానికి గురైతే ఆ వ్యాధికి అవసరమైన అమౌంట్ నీ ఈ ప్లాన్ ద్వారా చెల్లించడం జరుగుతుంది.
ఈ ప్లాన్ లో దాదాపుగా 36 పెద్ద అనారోగ్య సమస్యలను గుర్తించి వాటికి మాత్రమే ఈ క్రిటికల్ ఇల్నెస్ పద్ధతిని అందివ్వడం జరిగింది.
మనం ఒకవేళ ఈ ప్లాన్ ద్వారా ఏదైనా అనారోగ్య సమస్య కు గురైతే అమౌంట్ నీ క్రిటికల్ ఇల్నెస్ ద్వారా పొందినట్లైతే ఆ తరువాత నుండి మీరు ప్లాన్ చివరి వరకు ఏటువంటి ప్రీమియం ను చెల్లించవలసిన అవసరం వుండదు ప్రీమియం మొత్తం ఎస్.బి. ఐ సంస్థే చెల్లిస్తుంది.
కాంప్రహెన్సివ్ ప్రొటెక్షన్ (comprehensive protection)-
ప్లాన్ తీసుకున్న వ్యక్తి మరణించినా లేదా ఏదైనా వ్యాధికి గురైనా ఇన్సూరెన్స్ లభిస్తుంది.
రైడర్ బెనిఫిట్స్(Rider Benefits):
ఈ భీమా లో 2 రకాల రైడర్స్ నీ అందివ్వడం జరిగింది. కానీ ఈ రైడర్స్ కోసం మనం ఈ ప్లాన్ లో అదనంగా ఎటువంటి అమౌంట్ నీ చెల్లించాల్సిన అవసరం లేదు మనం కట్టే ప్రీమియం తోటే వీటిని పొందవచ్చు.
1)ప్రీమియం వేవియర్ బెనిఫిట్ రైడర్ (Premium Wavier Benefit Rider):
కొన్ని ఇబ్బంది పరిస్తితులలో అనగా పూర్ణ సురక్ష ప్లాన్ తీసుకున్న వ్యక్తి మరణించినా లేదా అనారోగ్యానికి గురైనా ఆ తరువాత ప్రీమియం నుండి ప్లాన్ చివరివరకు ఏటువంటి అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు.
2)క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్(Critical Illness Benefit Rider):
ఈ పూర్ణ సురక్ష ప్లాన్ లో సూచించిన 36 వ్యాధులలో ఏ వ్యాధికి అయిన గురైతే ఈ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్ కింద వ్యాధికి సరిపడే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తరువాత ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టనవసరం లేదు. ఎస్. బి. ఐ సంస్థే కడుతుంది.ఈ 2 బెనిఫిట్ రైడర్స్ కూడా ఈ ప్లాన్ ప్రీమియం తోపాటు మనకు లభిస్తాయి.
ఉదాహరణ కి మనం 50 లక్షల రూపాయల ప్లాన్ తీసుకుంటే వ్యాధి నిమిత్తం 20 లక్షల రూపాయలు పోందినట్లైతే మిగిలిన 30లక్షల రూపాయలకు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం వుండదు.
స్టేజ్ రీబాలేన్స్ (stage Rebalance):
ఈ పూర్ణ సురక్ష భీమా లో ఈ సదుపాయం ఎంతో ముఖ్యమైనది వయసు పెరిగేకొద్దీ మనకు ఆరోగ్యానికి ఎక్కువ భద్రతను కల్పిస్తుంది, అంటే మనం తీసుకున్న భీమా అమౌంట్ లో 80% లైఫ్ కవర్ ఇన్సూరెన్స్ గాను మిగతా 20% అమౌంట్ క్రిటికల్ ఇల్నెస్ (ఆరోగ్య భద్రత) కోసం నిర్ణయించబడుతుంది. అదేవిధంగా కొంత కాలం తరవాత లైఫ్ కవర్ ఇన్సూరెన్స్ లో అమౌంట్ తగ్గుతూ మరియు క్రిటికల్ ఇల్నెస్ లో కొంత పర్సంటేజ్ చొప్పున పెరుగుతూ వుంటుంది.
వీటిని కూడా చదవండి- Also
Eligibility Conditions SBI Life Poorna Suraksha Plan – అర్హతలు
వయసు పరిమితులు
కనీస వయసు –18 సంవత్సరాలు
గరిష్ట వయసు –65 సంవత్సరాలు
పాలసీ సమయం
కనీస పాలసీ సమయం –10 సంవత్సరాలు
గరిష్ట పాలసీ సమయం –30 సంవత్సరాలు
భీమా పరిమితులు
మినిమం బేసిక్ సమ్ అస్సురెడ్ (Bhima) – 2 0 లక్షలు రూ,,
మాక్సిమం బేసిక్ సుం అస్సురెడ్ (Bhima)- 2.5 కోట్లు రూ,,
ప్రీమియం పేమెంట్ మోడ్(Premium Payment Mode):
మనం ఈ పూర్ణ సురక్ష ప్లాన్ లో ప్రీమియం ను ఏ విధంగా మరియు ఎంత చెల్లించాలి అనే విధానాన్ని ఈ సంస్థ ముందుగానే నిర్ధారించడం జరిగింది.
సంవత్సరానికి – 3000 , అర్థసంవత్సరానికి –1500 , నెలకు – 250 రూపాయలు.
మెచ్యూరిటీ పరిమితులు
మినిమం మెచ్యూరిటీ వయసు – 28 సం,,
మాక్సిమం మెచ్యూరిటీ వయసు –75 సంవత్సరాలు.
ఉదాహరణ (Example) – Poorna Suraksha
రాజు వయసు (Age) –25 సంవత్సరాలు
పాలసీ పీరియడ్ ( Policy Period) -20 సంవత్సరాలు,
ఇన్సూరెన్స్ (Insurance) – 20 లక్షలు రూపాయలు, ఇందులో లైఫ్ కవర్ ఇన్సూరెన్స్ రూపం లో 16 లక్షలు (80%) రూపాయలు మరియు క్రిటికల్ ఇల్నెస్ రూపం లో 4 లక్షలు (20%) రూపాయలు గా నిర్ణయించబడతాయి.
ఈ పూర్ణ సురక్ష భీమా అమౌంట్ లో ప్రతి సంవత్సరం 5% లైఫ్ కవర్ పై తగ్గుతూ క్రిటికల్ ఇల్నెస్ పై 5% అమౌంట్ పెరుగుతూ వస్తుంది.
ఈ పర్సంటేజ్ అమౌంట్ పెరగడం మరియు తగ్గడం అనేది మనం తీసుకునే పాలసీ సమయం(period) పై ఆధారపడి వుంటుంది క్రింద తెలుసుకుందాము.
10 సంవత్సరాల పాలసీ పీరియడ్ కి 15%, 15 సంవత్సరాల పాలసీ పీరియడ్ కి 10%, 20 సంవత్సరాల పాలసీ పీరియడ్ కి 7.5%, మరియు 25 సంవత్సరాల పాలసీ పీరియడ్ కి 6% , 30 సంవత్సరాల పాలసీ పీరియడ్ కి 5%.
రాజు వయసు -25 సంవత్సరాలు రాము తీసుకున్న ప్లాన్ అమౌంట్ -2000000 రూపాయలు, పాలసీ పీరియడ్ -20 సంవత్సరాలు,ఇతను మంత్లీ ప్రీమియం ను ఏంచుకున్నట్లైతే Rs 314/- (జి.ఎస్. టి తో కలిపి) రూపాయలు చెల్లిస్తాడు.
రాము తీసుకున్న పాలసీ పీరియడ్ లో చెల్లించే మొత్తం అమౌంట్ Rs 75,360 రూపాయలు. రాము వయసు 25 సంవత్సరాలు మరియు తీసుకున్న పాలసీ పీరియడ్ 30 సంవత్సరాలు కనుక 25+20= 45 సంవత్సరాలు వరకు రాము కి లైఫ్ కవర్ ఇన్సూరెన్స్ మరియు క్రిటికల్ ఇల్నెస్ భద్రత కల్పించబడుతుంది. రాము గనుక ఈ పాలసీ పీరియడ్ లో క్రిటికల్ ఇల్నెస్ కి గురైతే అనారోగ్య నిమిత్తం(క్రిటికల్ ఇల్నెస్) 7 లక్షలు రూపాయలు అందచేయబడతాయి, 13 లక్షలు రూపాయలు రాజు కి మొత్తం పాలసీ సమయంలో ఎప్పుడు రిస్క్ జరిగినా అతని కుటుంబసభ్యులకు రావడం జరుగుతుంది .
రిబేట్(Discount) ;-
ఈ పూర్ణ సురక్ష ప్లాన్ లో మనం తీసుకునే పాలసీ అమౌంట్ పై రిబేట్ ఇవ్వడం జరిగింది. అది ప్రతి 1000 రూపాయల మీద 10% రిబేట్(డిస్కౌంట్) ప్రకటించారు క్రింద తెలుసుకుందాము.
2000000 – 5000000 = 0%,
5000000 -10000000 =10%,
10000000 -2.5000000 =15%.
ముఖ్య గమనిక:(note)
1)ఈ పూర్ణ సురక్ష భీమా లో 30 రోజుల తరువాత నుండి డెత్ బెనిఫిట్ అమలు అవుతుంది.అంటే ఈ ప్లాన్ తీసుకున్న 30 రోజుల తరువాత నుండి ప్లాన్ చివరి వరకు డెత్ బెనిఫిట్ కొనసాగుతుంది.
2) హెల్త్ ఇన్సూరెన్స్ ఈ ప్లాన్ తీసుకున్న 90 రోజుల తరువాత నుండి అమలు చేయబడుతుంది.
3) సూసైడ్ జరిగినా కూడా ఈడెత్ బెనిఫిట్ వస్తుంది(తెలియజేయాలి కాబట్టి చెప్పడం జరిగింది).
ఫ్రీ లుక్ పీరియడ్ (Free Look Period):
ఈ పూర్ణ సురక్ష ప్లాన్ తీసుకున్న తరువాత మీకు అసౌకర్యం అనిపించి ప్లాన్ ను వద్దనుకుంటే, ప్లాన్ తీసుకున్న 15 రోజుల లోపు సరెండర్ చేస్తే ఎటువంటి పెనాల్టీ పడదు మనం కట్టిన ప్రీమియం మొత్తం ఇచ్చేస్తారు.
టాక్స్ బెనిఫిట్స్(Tax Benefits):
ఈ ప్లాన్ లో అండర్ సెక్షన్(under section) 80c వర్తిస్తుంది. గనుక సంవత్సరానికి Rs 150000 రూపాయలు టాక్స్ డిడక్షన్ పొందవచ్చు.మరియు
అండర్ సెక్షన్(under section) 10d వర్తిస్తుంది గనుక మనం ఈ పూర్ణ సురక్ష ప్లాన్ లో పొందే అమౌంట్ పై ఏటువంటి టాక్స్ పే(pay) చేయవల్సిన అవసరం లేదు.
కావాల్సిన పత్రాలు (documents) : SBI Life Poorna Suraksha Plan
1)వయసు నిర్ధారణ పత్రం(age proof)
2)చిరునామా పత్రం(address proof)
3) ఇన్కమ్ (income proof)
4) మెడికల్ రిపోర్ట్ (medical report) required.
my age is 63 years.can i take Sbi poorna policy
first of all thanks to visit our website. Depending on your age, very high premium because leave it.
no sir
My age is 59 years can I take this policy
no sir